#National News #S Jaishankar – Vishwa Samvad Kendra Andhra Pradesh

యూనస్‌కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
బంగాళాఖాతంలో భారత్‌కు పొడవైన తీర రేఖ ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ అన్నారు. బిమ్‌స్టెక్‌  బాధ్యతలపై భారత్‌కు సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు. సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారత్‌ విశ్వసిస్తుందని వ్యాఖ్యానించారు. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఆరవ బిమ్‌స్టెక్ సదస్సులో ఆయన ఈమేరకు మాట్లాడారు. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ఇటీవల బంగాళాఖాతంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తాజా స్పందన వచ్చింది.

‘‘బంగాళాఖాతం చుట్టూ ఉన్న, దానికి సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు, ఆందోళనలు రెండూ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మన చరిత్ర దోహదం చేసింది. ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంతం శ్రేయస్సును పక్కనపెట్టాయి. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. భారతదేశం ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగిఉంది. అలాగే ఆసియన్ దేశాలతో అనుసంధానాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది నిజంగా గేమ్ ఛేంజర్‌.

ఈ విశాల భౌగోళిక ప్రాంతంలో వస్తువులు, సేవల సరఫరా, ప్రజల మధ్య సంబంధాలు సజావుగా సాగడానికి మన మధ్య సహకారం, సౌకర్యాలు అవసరమని మేం గ్రహించాం. ఈ భౌగోళిక, వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలోఉంచుకొని.. గత దశాబ్దకాలంగా బిమ్స్‌స్టెక్‌ బలోపేతం కోసం అత్యంత శ్రద్ధ వహిస్తున్నాం. ఈ సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారత్‌ విశ్వసిస్తుంది. నచ్చినవి ఎంచుకొని మిగిలినవి వదిలేయడం కుదరదు’’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన యూనస్.. భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి కారణమయ్యాయి. ‘‘భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమైవున్నందున బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం. ఇదొక పెద్ద ప్రయోజనానికి అవకాశం కల్పిస్తోంది. అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి’’ అని యూనస్ చైనాను ఆహ్వానించారు. యూనస్‌ తీరును మన దేశ నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.

The post యూనస్‌కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచంలోనే అతిగొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు – విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం
కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వీయరచన ”ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్‌సర్టైన్ వరల్డ్” పుస్తకావిష్కరణ కార్యక్రమం పుణేలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దౌత్యం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ…. మహాభారత, రామాయణ ఇతిహాసాలను ఉటంకించారు. ప్రపంచంలోనే అతిగొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు అని అన్నారు. హనుమంతుడు దౌత్యంతోపాటు దానిని కూడా దాటి సీతాన్వేషణలో భాగంగా సీతతో మాట్లాడటంతోపాటు, లంకాదహనం చేశాడని చెప్పారు.

వ్యూహాత్మక సహనానికి ఒక ఉదాహరణగా మహాభారతంలో శిశుపాలుడి తలను ఖండించిన కృష్ణుడి ఉందంతాన్ని గుర్తు చేశారు. 100 తప్పులు చేసేంత వరకూ క్షమిస్తానని కృష్ణుడు వాగ్దానం చేశాడని, వంద తప్పులు పూర్తయిన తర్వాతే శిశుపాలుని వధించాడని తెలిపారు. మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు ఉండాల్సిన ప్రధాన అర్హతను ఈ ఘట్టం ఉదహరిస్తుందన్నారు.

కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన కురక్షేత్రను బహుళ ధ్రువ భారతదేశంగా జైశంకర్ పోల్చారు. దేశ ప్రయోజనాల విషయంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ముఖ్యమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఇదే విధానాన్ని అనుసరిస్తోందని, బైపోలార్ కోల్డ్ వార్ (1947-1991), యూనిపోలార్ టైమ్స్ (1991-2008), మల్టీపోలార్ టైమ్స్ (2008 నుంచి ఇప్పటి వరకూ)లోనూ ఇదే విధానాన్ని దేశం అనుసరిస్తూ వస్తోందని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ఒంటిరిగా మిగిలిపోవడమో, పొత్తు పెట్టుకోవడమే కాదని అన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అనుసరించే వ్యూహమని చెప్పారు.

వ్యూహాత్మక సర్దుబాటుకు అశ్వద్ధామ మరణానికి ధర్మరాజు తొలిసారి అబద్ధం చెప్పడాన్ని జైశంకర్ ప్రస్తావించారు. కౌరవుల సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుడు అయిదు రోజుల పాటు పాండవులతో భీకర పోరు చేశాడని, పాండవులు ఆయనను నిలువరించలేకపోయారని అన్నారు. దీంతో ద్రోణాచార్యుడిపై పాండవులు వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. ద్రోణాచార్యుడికి తన కుమారుడు అశ్వద్ధామ అంటే పంచప్రాణాలని, అదే అతని బలహీనత అని, అశ్వద్ధామ మరణించాడని చెబితేనే ఆయన అస్త్రసన్యాసం చేస్తాడని, అయితే అది కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మజుడు చెబితేనే ఆ పని చేస్తాడని తెలుసుకుని ఆ ప్రకారం పాండవులు వ్యవహరించారని చెప్పారు.

వ్యూహాత్మక మోసం గురించి మహాభారతంలోని మరో ఘట్టాన్ని జైశంకర్ ప్రస్తావించారు. సూర్యాస్తమయం అయినట్టు శ్రీకృష్ణుడు భ్రమింపజేసిన ఘట్టాన్ని ఉదహరిస్తూ… ”కౌరవుల పక్షంలో పలువురు యోధులు అర్జునుడి కుమారుడైన అభిమన్యుని అత్యంత క్రూరంగా చంపేశారు. తన కుమారుడి చావుకు ప్రధాన కారకుడైన జయద్రధుని చంపుతానని ఆ మరుసటి రోజు అర్జునుడు భీకర ప్రతిజ్ఞ చేశాడు. జయద్రధుని చంపలేకపోతే తాను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తానని అంటాడు. కౌరవులు దీనిని అవకాశంగా తీసుకుని సాయంత్రం దాటేంత వరకూ జయద్రధుని దాచి పెట్టారు. సూర్యాస్తమయం అయినట్టు కృష్ణుడు భ్రమింపచేయడంతో జయద్రధుడు బయటకు వస్తాడు. వెంటనే బాణం సంధించమని కృష్ణుడు ఇచ్చిన ఆదేశంతో అర్జునుడి జయద్రధుని వధిస్తాడని జైశంకర్ వివరించారు.

పొరుగు దేశాలతో ఇండియా భౌగోళిక పరిమితులపై మంత్రి మాట్లాడుతూ.. పాండవులు తమ బంధువులను ఎంచుకోలేదని, అలాగే మనం కూడా మన పొరుగువారిని ఎంచుకోలేమని అన్నారు. పొరుగు వారు సద్భావనతో ఉండాలని మాత్రమే మనం ఆశించగలమని చెప్పారు. ‘రూల్స్ బేస్డ్ ఆర్డర్’ గురించి ప్రస్తావిస్తూ.. భారతంలో కర్ణుడు, దుర్యోధనుడు ఈ నిబంధనలను అతిక్రమించారని చెప్పారు. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం వల్ల వారితోపాటు, వారి కుటుంబాలకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదని అన్నారు. చివరకు ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతోపాటు, భారీ వినాశనం జరిగిందని, స్వజనులతో సహా సర్వాన్ని కోల్పోయారని అన్నారు. అలాగే అణ్వస్త్రదేశాలు పరస్పరం బెదరించుకుంటూ పోతే అది ఒకరినొకరు తుడిచిపెట్టేందుకు, భారీ విధ్వంసాన్ని మరింత వేగవంతం చేయడానికి దారితీస్తుందన్నారు.

The post ప్రపంచంలోనే అతిగొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు – విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.