MODI Vs JINPING – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత సరిహద్దుల వద్ద సైన్యం మోహరింపు చైనా చెత్త దౌత్య విధానానికి నిదర్శనం
మోడీ (డోనాల్డ్) ట్రంప్ కార్డు పనిచేస్తోంది.  యుఎస్-ఇండియా మధ్య సంబంధాలు పెద్ద ఎత్తున ఫలవంతమయ్యాయి. ఆ బంధం చైనాను అడ్డుకుంది.  చైనా సరిహద్దు ప్రతిష్టంభన భారత్ సూపర్ పవర్ గా మారడానికి ఒక అవకాశం కానుంది.

చైనా ప్రారంభించిన సరిహద్దు-ప్రతిష్టంభన చైనా యొక్క చెత్త దౌత్య విధానానికి నిదర్శనం అవుతుంది.  COVID19 అప్రతిష్ట నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి, చైనా హాంగ్-కాంగ్ – తైవాన్ అణచివేత, దక్షిణ సముద్రం వద్ద రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించింది. ఇప్పుడు తాజాగా భారత సరిహద్దుల్లో సైన్యం మోహరింపుతో భారత్ తో గిల్లికజ్జాలకు తెరలేపింది.

లండన్లోని గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగి గౌరవనీయ శ్రీ ప్రసూన్ శర్మ మాట్లాడుతూ “ఇది ప్రపంచంలో భారత్ యొక్క ప్రతిష్ఠను, స్థాయిని ఇనుమడింపజేసి ప్రపంచంలోని చైనా వ్యతిరేక శక్తులన్నీ భారతదేశం వెనుక నడిచేలా చేస్తుంది.”  అని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ దౌత్య విజయాలతో చైనా బలహీనపడి, నిరాశకు గురవుతోంది. మొదట, ప్రజాస్వామ్యం యొక్క శక్తిని పునఃస్థాపితం చేయడం ద్వారా, కరోనా సవాలును ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలతకు పిఎం మోడీ ఒక ఉదాహరణగా నిలిచారు.  ప్రధానమంత్రి మోడీ, తన సమాఖ్య సహచరులతో కలిసి, ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. పూర్తి ప్రజాదరణతో లాక్డౌన్, సామాజిక దూరం వంటి చర్యలను విజయవంతంగా అమలు చేశారు.  రెండవది, ప్రపంచానికి సహాయం చేయడం ద్వారా, 70 కి పైగా దేశాలకు మందులు (జెనెరిక్ మరియు హెచ్‌సిక్యూ) సరఫరా చేయడం ద్వారా పిఎం మోడీ భారతదేశం యొక్క మృదువైన, స్నేహపూర్వకమైన శక్తిని ప్రపంచానికి చాటారు. మూడవది, ట్రెండ్ సెట్ చేయడం ద్వారా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సార్క్ నాయకులతో జరిపిన  వీడియో కాన్ఫరెన్సింగ్ స్ఫూర్తితో  సౌదీ అరేబియా అసాధారణ రీతిలో  జి 20 లీడర్స్ సమ్మిట్‌ కు ఏర్పాట్లు చేసింది. నాల్గవది, భారత్ సూపర్ పవర్ గా అవతరిస్తూ ఉండడం. WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఛైర్మన్‌గా భారత్ నుంచి డాక్టర్ హర్షవర్ధన్ ఎంపిక ఇందుకు ఒక ఉదాహరణ. దీని కారణంగా COVID19 విషయంలో చైనా  వ్యవహరించిన తీరుపై  చైనాకు వ్యతిరేకంగా వివిధ దేశాలు ప్రతిపాదించిన దర్యాప్తును భారత్ సన్నిహితంగా పరిశీలించే అవకాశం లభించింది.”

అంతేకాకుండా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో మాట్లాడుతూ, “వాషింగ్టన్ భారతదేశంతో ప్రపంచ సరఫరా వ్యవస్థ పునర్నిర్మాణం (చైనా నుండి బయటపడటం) గురించి చర్చిస్తోంది.” అని పేర్కొన్నారు.  ఇండియా – ఆస్ట్రేలియా మ్యూచువల్ లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందంపై సంతకం చేయడం గురించి పెద్ద రక్షణ ప్రకటన త్వరలోనే జరగవచ్చు.  ఐదవది, స్వదేశీ మిషన్‌ను పెంచడం ద్వారా… అంటే చైనా సరిహద్దు ఘర్షణ స్వదేశీ మరియు “మేక్ ఇన్ ఇండియా” మిషన్‌ను పెంచుతుంది.  అమెరికాతో వాణిజ్యం పతనమైన తరువాత, భారతదేశంలో కూడా వ్యాపారం క్షీణించడం షియోమి, వివో వంటి చైనా కంపెనీలను నిరాశపరుస్తుంది.

దీనికి విరుద్ధంగా, ఈ సరిహద్దు ఘర్షణ విషయంలో జిన్ పింగ్ కనుక మోడీని చర్చలకు ఆహ్వానించినా, లేదు  డోక్లాం వివాదంలో వ్యవహరించిన శైలిలో వ్యవహరించినా భారత్ దౌత్య పరంగా చైనాకు తీవ్ర ఇబ్బందిని, నష్టాన్ని సృష్టించవచ్చు. కాదని చైనా సుదీర్ఘ కాలం తన సేనలను భారత సరిహద్దులలో మోహరించి ఉండినా దాని ద్వారా ప్రపంచంలోని చైనా వ్యతిరేక దేశాలను మరియు సంస్థలను ఏకీకృతం చేయడానికి భారతదేశానికి ఎక్కువ అవకాశం లభించినట్లవుతుంది. ఒకవేళ, చైనా తన సేనలను ఉపసంహరించుకుంటే అప్పుడు జిన్ పింగ్ ఒక బలహీన నేతగా నిలుస్తారు.

అలాగని చైనాని తక్కువ అంచనా వెయ్యలేం. సంఖ్యాపరంగా చైనా అతిపెద్ద మిలిటరీ ఫోర్స్ ని కలిగి ఉంది. సాంకేతికంగా కూడా చైనా అత్యున్నత స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు చైనా యొక్క వాస్తవిక శక్తి ప్రపంచానికి తెలియదు. కారణం 1962 భారత యుద్ధం తర్వాత చైనా నేరుగా ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. “ప్రమాణాల పరంగా చైనా సైన్యం కొంత బలహీనంగా ఉన్నది” అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చైనా సైన్యం లో ప్రాణభయం, అవినీతి, దురాశ, క్రమశిక్షణా రాహిత్యం ఉన్నాయని కొన్ని విశ్లేషణలు చెబుతున్నా చైనా శక్తిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అదే సమయంలో భారత ప్రభుత్వం చైనా కుటిల నీతికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందే.

REFERENCE :

https://www.organiser.org/Encyc/2020/5/28/China-s-Worst-diplomatic-faux-pas.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సరిహద్దుల వద్ద సైన్యం మోహరింపు  చైనా చెత్త దౌత్య విధానానికి నిదర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.