MEDICINE FOR CORONA VIRUS – Vishwa Samvad Kendra Andhra Pradesh

వైరస్‌ సోకిన కణాల్లోకి నేరుగా ప్రవేశించడమే 2DG ప్రత్యేకత
కొవిడ్‌పై పనిచేసే 2డీజీ ఔషధం కోసం చాలామంది రోగులు ఎదురు చూస్తున్నారు. వీరిలో రెండుమూడు వారాల తర్వాత కూడా కోలుకోలేనివారే ఎక్కువగా ఉన్నారు. లక్షణాలు బయటపడిన పదిరోజుల్లోపే దీన్ని వాడాలని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. డీసీజీఐ ఆమోదం ప్రకారం 2 డీజీ ఔషధాన్ని కొవిడ్‌ రోగులకు ఎలా వాడాలో మార్గదర్శకాలను మంగళవారం వెల్లడించింది.

* డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం కొవిడ్‌ చికిత్సలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నెలక్రితం అనుమతి ఇచ్చింది. నీళ్లలో కలుపుకొని తాగే ఈ ఔషధాన్ని వైద్యుల సూచన మేరకే వాడాలి. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి. ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందును ఉపయోగించాలి.

* ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్నవారు త్వరగా కోలుకునేందుకు 2 డీజీ తీసుకొచ్చారు. వీరికి కూడా వైద్యులు సాధ్యమైనంత తొందరగా వాడితే మేలు. గరిష్ఠంగా 10 రోజుల లోపే వాడాలి.

* మధుమేహం అదుపులో లేని, తీవ్రమైన గుండె సమస్యలున్నవారు, అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్‌ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌), కాలేయ, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారిపై 2డీజీ ఎలా పని చేస్తుందనేది అధ్యయనం చేయనందున జాగ్రత్తలు తీసుకోవాలి.

* కొవిడ్‌తో బాధపడుతున్న గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్లలోపువారికి ఈ ఔషధం ఇవ్వొద్దు.

* 2 డీజీ సాచెట్ల కోసం చికిత్స అందిస్తున్న ఆసుపత్రే హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ను మెయిల్‌లో 2DG@drreddys.com సంప్రదించవచ్చు. ఈ నెలలో 6లక్షలకు పైగా సాచెట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

త్వరగా కోలుకునేలా..

ఈ ఔషధం పొడి రూపంలో సాచెట్‌లలో లభిస్తుంది. నీళ్లలో కలుపుకొని తాగితే చాలు. వైరస్‌ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుంది. వైరస్‌ సోకిన కణాల్లో నేరుగా ప్రవేశించడం దీని ప్రత్యేకత. ఫలితంగా కొవిడ్‌ రోగులు చాలా వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో గుర్తించారు. వేర్వేరు స్థాయిల్లో స్టాండర్డ్‌ ఆఫ్‌ కేర్‌తో పోల్చి చూసినప్పుడు సగటు కోలుకుంటున్న రోజులకంటే 2డీజీ ఔషధంతో చికిత్స పొందిన రోగులు రెండున్నర రోజులు ముందే కోలుకున్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌పై ఆధారపడటం 42 శాతం తగ్గింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైరస్‌ సోకిన కణాల్లోకి నేరుగా ప్రవేశించడమే 2DG ప్రత్యేకత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గంగాజలంతో కరోనా చికిత్స?
ఆది నుంచి గంగానదిని పవిత్ర నదిగా భావిస్తారు భారతీయులు. పురాణాల్లోనూ దీని ప్రస్థావన ఉంది. భగీరథుడు తమ వంశస్తులకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని కైలాసం నుంచి గంగను భువి పైకి తీసుకొచ్చాడన్నది పురాణ గాథ. మరి అంత పవిత్ర గంగను కరోనా మహమ్మారికి చికిత్స చేయవచ్చా? ఇదే విషయాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు ప్రతిపాదించినట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అన్నారు.

తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ‘నమామి గంగా’ మిషన్‌ గురించి షెకావత్‌ మాట్లాడారు. గంగానది ప్రక్షాళకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో కలిసి ఎన్నో సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్స కోసం గంగా జలాన్ని వాడవచ్చా? అన్న దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిపారు. ”వందేళ్ల పాటు గంగా జలాన్ని నిల్వ ఉంచినా అది చెడిపోదు. ఇతర నదీ జలాలతో పోలిస్తే, గంగాజలం పూర్తి భిన్నం. దాని వెనుక ఉన్న నిజమేంటో శతాబ్దాలుగా అందరికీ తెలుసు. అందుకే కరోనా వైరస్‌ చికిత్సలో గంగాజలం వినియోగించవచ్చా? అన్న దానిపై పరిశోధించాలని ఐసీఎంఆర్‌కు ప్రతిపాదనలు పంపాం” అని షెకావత్‌ వెల్లడించారు.

అయితే, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలన్న కేంద్ర జలవనరులశాఖ ప్రతిపాదనలను ఐసీఎంఆర్‌ తోసిపుచ్చింది. కొవిడ్‌-19 చికిత్సకు పవిత్ర గంగాజలం ఉపయోగపడుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని తెలిపింది. ఇప్పటికే గంగానదిలో భారీగా బ్యాక్టీరియా ఉందని వెల్లడించింది. ఇది కొవిడ్‌-19వంటి వైరస్‌లపై వీటి ప్రభావం చూపదని పేర్కొంది.

మరోవైపు దేశంలో నీటి వనరుల గురించి షెకావత్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 132 డ్యామ్‌ల్లో 56శాతం నీటి నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ‘గతంతో పోలిస్తే, నీటి పరిస్థితి బాగుంది. ఈ ఏడాది విపరీతమైన మంచు కురిసింది. అదంతా ప్రయోజనం చేకూర్చేదే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా నదీ జలాలు చాలా వరకూ శుభ్రపడ్డాయి. అయితే, అవి తాగునీటికి అనుకూలంగా ఉన్నాయా? లేదా? అన్నది అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడే ఏమీ చెప్పలేం” అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గంగాజలంతో కరోనా చికిత్స? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.