#Medaram Mahajatara – Vishwa Samvad Kendra Andhra Pradesh

మేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ
మేడారంలో తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. జాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారం రోజున తిరుగువారం పండుగ అంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగినందుకు…..వనదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ….ఆలయాలను శుద్ధి చేసి, గద్దెల చెంత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపు కుంకుమలు సమర్పించి…బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందులో పూజారులు కుటుంబ సమేతంగా పాల్గొంటారు. దీనితో మహా జాతర వేడుకలు…పూర్తయినట్లే. తిరగువారం పండుగ రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ పూజారులు జాతర సమయంలో తలనీలాలు ఇవ్వకుండా తిరుగువారం నాడు పూజారులంతా పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. గిరిజన వాయిద్యాలతో సమ్మక్క సారలమ్మ పూజారులు గుడి వద్దకు వెళ్లి పూజలు చేసి మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. సంప్రదాయ పద్ధతిలో తిరుగువారం పండుగ ఘనంగా జరుపుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా ముగిసిన మేడారం మహా జాతర
భాగ్య‌న‌గ‌రం: సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేయడంతో తెలంగాణలో మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు దర్శనాలు నిర్విరామంగా కొనసాగాయి. ఆరు గంటల తర్వాత పూజారులు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు.

డప్పు, డోలు వాయిద్యాలతో వన ప్రవేశ ఘట్టం కోలాహలంగా సాగింది. విద్యుద్దీపాలు నిలిపేసిన అనంతరం.. వన దేవతలను గద్దెల నుంచి తరలించారు. అమ్మవార్లు వనానికి తరలుతున్న సమయంలో మేడారం పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మారుమోగాయి.

సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి పూజారులు తీసుకెళ్ళారు. పగిడిద్ద రాజును మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయికి తీసుకెళ్లడంతో వన ప్రవేశ ఘట్టం ముగిసింది. క్యూలైన్లలో బారులు తీరిన భక్తజనం.. వన ప్రవేశ ఘట్టాన్ని తిలకించి పరవశులయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా ముగిసిన మేడారం మహా జాతర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేటి నుండి మేడారం జాతర!
భాగ్య‌న‌గ‌రం: `తెలంగాణ కుంభమేళా’గా భావించే ములుగు జిల్లా మేడారం మహాజాతర నేడే ప్రారంభం కానున్నది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో కొన్ని రోజులుగా మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులకు చీర, సారె, ఇచ్చి పసుపు కుంకాలు పెట్టి భక్తులు అమ్మవార్లకు పెద్ద ఎత్తున బంగారం సమర్పించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ ఏది అంటే ముందుగా వినిపించే పేరు మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. దేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పూర్వపు వరంగల్ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తొలినాళ్లలో ఈ జాతరను ప్రధానంగా గిరిజనులు జరుపుకొనేవారు.. రాను రాను అమ్మవార్ల మహిమలు తెలిసి అందరూ కొలిచి, మొక్కుతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి నుండి మేడారం జాతర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మేడారం జాతరకు కోటి మంది భక్తులు
భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల‌ 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. కాగా, ఈ ఏడాది సుమారు కోటి మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉంద‌ని స్థానికులు చెబుతున్నారు. గతంలో అమ్మవారి గద్దెల వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉండేది. కానీ, ప్రభుత్వం దానిని తొలగించి వీఐపీ మార్గంగా మార్చింది.

ప్రత్యేక దర్శనం ఉన్నప్పుడు దాని నుంచి కొంత ఆదాయం వచ్చేది. అది ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేది. ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించాలని సమ్మక్క-సారలమ్మ ప్రధాన పూజారి జగ్గారావు కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థంతో పాటు ఆలయానికి ఆదాయం వస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను.. 17న సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మేడారం జాతరకు కోటి మంది భక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.