MAHATMA GANDHI – Vishwa Samvad Kendra Andhra Pradesh
గాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్​ విక్టర్ ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ఆందోళన
ఒంగోలు: మహాత్మాగాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కుల మతాలకు అతీతుడైన జాతిపితపై ఇలాంటి మాటలు తగదన్నారు. యావత్ ప్రజానీకానికీ విక్టర్ ప్రసాద్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయన పదవికి రాజీనామా చేయాలన్నారు. గిద్దలూరు పట్టణంలోని ఆర్యవైశ్యులు గాంధీబొమ్మ సెంటర్​లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహనికి క్షీరాభిషేకం చేశారు. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విక్టర్ ప్రసాద్​ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ప్లకార్డు​లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. మండల తహశీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్​కు వినతి పత్రం అందించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post గాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్​ విక్టర్ ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
నిస్వార్థ ప్రజాసేవకుడు, నిష్కళంక దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
ప్రస్తావన :
1908లో తిరునల్వేలి జిల్లాలో ‘ఆప్’ అను ఆంగ్లేయాధికారిని విప్లవకారులు చంపేశారు. ఘటనాస్థలిలో గుమిగూడిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా పోలీసులు తుపాకులు కాల్చారు. ఇద్దరు చనిపోయి, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సహజంగానే కొందరు దేశభక్తుల మనస్సునెంతో కలచివేసింది. ‘స్వరాజ్య’ పత్రికలో ఆంగ్లేయ పోలీసుల దమన నీతిని ఎండగడుతూ ‘విపరీత బుద్ధి’ అనే శీర్షిక క్రింద సంపాదకీయం ప్రచురించారు.
ఈ సంపాదకీయాన్ని పురస్కరించుకొని, 1908 జులై 18వ తేదీన ఆ పత్రిక సంపాదకునిపైన, ప్రచురణకర్తపైన రాజద్రోహ నేరం మోపారు.
వారిలో సంపాదకునికి 3 సంవత్సరాలు జైలుశిక్ష పడింది. ఆయన రాజకీయ ఖైదీ అయినప్పటికీ ఖూనీకోర్లు, దొంగలు, బందిపోట్లు వంటి ఇతర ఖైదీలకు చేసినట్లుగానే ఆ సంపాదకుని బట్టలుతీసేసి రెండు గోచీలు ఇచ్చారు. మూరెడు చదరంగల రెండు తువ్వాళ్లు ఇచ్చారు. పడుకునేందుకు చిన్న ఈత చాప ఇచ్చారు. అన్నం తినడానికి మట్టిచట్టి, నీళ్లు త్రాగటానికి ఓ మట్టిముంత, మలమూత్ర విసర్జనకు మరొక చట్టి మాత్రమే ఇచ్చారు. కాలికి లావుపాటి కడియం, మెడకు మరొక ఇనుపకడియం వేసి ఒక కొయ్యముక్కను దూర్చారు. మట్టితో పండ్లు తోముకోవాలి. అధికార్లు నిర్ణయించిన టైముకే మలవిసర్జన చేయాలి. స్నానానికి మూడునాలుగు ముంతల నీరు మాత్రమే ఇస్తారు. తినటానికి ఓ రాగిసంకటిముద్ద ఇచ్చేవారు. ఆ ముద్దలో పుల్లలు, రాళ్లు, మట్టి వుండేవి. ఆకులలములతో ఉడకబెట్టిన పులుసునీరు ఇచ్చేవారు. వాటిలోని పురుగులనైనా కడిగేవాళ్ళు కాదు. అలా తయారయిన ఆ పులుసునీళ్లలో ఉడికి చచ్చిన పురుగులు తేలుతుండేవి. మొలత్రాడు, జంధ్యము తీసేశారు. తల బోడిచేశారు. ఎన్ని విధాలుగా మనుషులను అగౌరవ పరచగలమో, అన్నివిధాల అగౌరవపరుస్తూ దేహబలాన్ని, మనోబలాన్ని అణగద్రొక్కి, సదరు ఖైదీలు దేశసేవకు, మానవసేవకు ప్రయత్నించకుండా వుండేలాగుండే జైలు పద్ధతిని ఆరోజుల్లో ఆంగ్లేయ సామ్రాజ్య వాదులు తయారు చేశారు. సుమారు 1200 రోజులు అహెరాత్రాలూ అలాంటి కఠిన శిక్షను అనుభవించిన ఆ ఆంధ్రవీరుడు మరెవరో కాదు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు.
తర్వాతి కాలంలో జతీన్ దాసుగుప్తా బోటి విప్లవకారుల ఆత్మార్పణల కారణంగా రాజకీయ ఖైదీలకు సౌకర్యాలు కావాలని బయట ఆందోళన జరిగింది. ఫలితంగా ఎ, బి, సి తరగతులేర్పడ్డాయి. తదనంతరం జరిగిన సత్యాగ్రహోద్యమాల్లో వందలు వేల కొలది వాలంటీర్లు జట్లు జట్లుగా జైళ్లకు వెళ్ళేవారు. జైల్లో కూడా అందరూ కలిసే వుండేవారు. జైల్లో వేదాలు, వేదాంతాలు అధ్యయనం చేసినవారున్నారు. ‘స్వీయ చరిత్రలు’ వ్రాసుకున్నవారున్నారు. జైలు జీవితం మనస్సుకు, శరీరానికి మంచి విశ్రాంతి నిచ్చిందనేవారు, ప్రశాంత ఆలోచనలకు తావిచ్చిందన్నవారు చాలామంది ఉన్నారు. ఇవి తర్వాత తర్వాత జైలు పరిస్థితులలో వచ్చినమార్పులు. రాజకీయ ఖైదీలకు ఏమాత్రం అసౌకర్యాలున్నా, వారి పట్ల అగౌరవం చూపినా, దేశంలో బ్రహ్మాండమైన ఆందోళన చెలరేగుతుందనే భయం వుండేది జైలు అధికార్లకు.
ఆంధ్రా తిలక్ :
హరిసర్వోత్తమరావుగారిని అరెస్టు చేసిన రోజే, పూనాలో లోకమాన్య బాల గంగాధర తిలక్ గారిని కూడా అరెస్టు చేశారు. ఆరేండ్లు కఠినశిక్ష విధించి బర్మాలోని మాండలే జైలులో నిర్బంధించారు. ఆ విధంగా ఆంధ్రదేశంలో ప్రప్రథమ రాజకీయఖైదీ హరిసర్వోత్తమరావుగారు. ఆంధ్రుల త్యాగమార్గానికే మార్గదర్శకులైనారు. వీరిని ‘ఆంధ్రతిలక్’ అని ఆరోజుల్లో వ్యవహరించే వారు. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి సర్వోత్తమ రావు గారే.
1883 సెప్టెంబర్ 14 న కర్నూలులో భాగీరథీ బాయి,వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించారు.వారి పూర్వీకులు కడప జిల్లా,సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు.వారిది పేద కుటుంబం.కర్నూలు, గుత్తి,నంద్యాలలలో ప్రాథమిక,ఉన్నత విద్యనభ్యసించారు.ఇంకా చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ,ప్రతిభా పారితోషికాల (స్కాలర్ షిప్స్) సహాయంతో 1906లో మద్రాసులో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేశారు.తరువాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా,1907లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించారు.రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు.వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక,ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వకూడదని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. ’స్వరాజ్య’ అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవారు. ఆ సమయంలోనే ఆయన వ్రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది.
నిస్వార్థ ప్రజాసేవకుడు
1914లో బాల గంగాధర తిలక్ యొక్క హోం రూల్ లీగ్ కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 1924లో కాకినాడలో కాంగ్రెసు సభలు జరిగిన సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించారు. 1927లో కాంగ్రెసు అభ్యర్థిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేశారు.
మద్రాసు కౌన్సిలు మెంబరుగా, హరిసర్వోత్తమరావుగారు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. స్థానిక ప్రజల కష్ట నిష్ఠూరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేవారు.
ఒకసారి కౌన్సిల్ లో ‘జేమ్స్’ అనే యూరోపియన్ సభ్యుడొకడు పొగరుబోతుతనంగా భారతీయులను పరిహసిస్తూ ప్రసంగించాడట. దానితో హరిసర్వోత్తమరావుగారు ఉగ్రుడై లేచి, ఆ ఆంగ్ల సభ్యుని జాత్యహంకారాన్ని గట్టిగా ఖండించారు. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న మునుస్వామి నాయుడుగారితో సహా, సోదర సభ్యులందరూ రావుగారి మాటలకు హర్షించి అభినందించారు.
నంద్యాలలోనూ, కర్నూలులోనూ హిందూ ముస్లిముల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు హరిసర్వోత్తమ రావు గారు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య వివాదం పెద్దది కాకుండా సఖ్యత కుదిర్చారు. ఆ విధంగా హిందూ-ముస్లింల సఖ్యతకు, ఖద్దరు వ్యాప్తికి, త్రాగుడు నిషేధానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు.
ఆంధ్రదేశంలో చైతన్యం కలిగించడానికి తోడ్పడిన సంస్థలలో వేసవి పాఠశాలలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటి స్థాపనకోసం హరిసర్వోత్తమరావుగారి కృషి గణనీయమైనది. అనంతర కాలంలో వయోజన విద్యా కేంద్రాల స్థాపనకు ఇది ఆధారమైంది. దానివల్ల రైతు కూలీలు, కార్మికులు, వ్యవసాయదారులు విద్యావంతులైనారు.
నిర్భయుడు
అది 1922 వ సంవత్సరం. దేశవ్యాప్తంగా కోర్టుల బహిష్కారం ఉధృతంగా సాగుతోంది. పెద్ద పెద్ద ఆదాయాలను మానుకొని ఎందరో మహనీయులు వకీలువృత్తిని త్యాగం చేస్తూ ఉండిన సమయమది. ఆ సంవత్సరం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గాంధీజీ ఒక విచిత్రమైన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ‘కోర్టుల బహిష్కారం నుంచి వాదులను మినహాయించాలి’ అన్నారు. దీనికి కారణం ఆశ్రితవాత్సల్యం. దేశపాండే, రాజేంద్రప్రసాద్ వంటి వారి కోసం కామోసు. వాదిగా కోర్టుకెక్కకపోతే లక్షలు నష్టపొయ్యే సందర్భమది. వారు అలా ఆర్థికంగా నష్టపోకూడదు, అలాగని స్వలాభం కోసం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారనే అపవాదు వారికి రాకూడదు, గౌరవానికి భంగం కలుగకూడదు. అందుకన్నమాట ఇప్పుడీ తీర్మానం. సభలో 250 మంది ఉన్నారు. ఆక్షేపించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు మన గాడిచెర్లవారు ధైర్యం చేసి నిలుచున్నారు. “గాంధీజీ! మీరు ఆలోచించే ఈ తీర్మానమును పెడుతున్నారా?” అని ప్రశ్నించారు. “వాది అనే ఆసామే లేకపోతే కోర్టే వుండదే? వకీళ్ళు వాదులవల్లనే గదా బ్రతికేది? వాది లేకుంటే సాక్షులెక్కడ వస్తారు? తొలగిస్తే బహిష్కారం పూర్తిగా తొలగించండి. లేకుంటే వున్నదున్నట్లే వుంచండి, సర్వకష్టాలు పడుతుండే యీ వకీళ్ళకు మాత్రం అన్యాయం చేయకండి’ అన్నారు.
గాంధీజీ చప్పున గ్రహించారు. ‘నేను పెద్ద పొరపాటుపడ్డాను. బేషరత్తుగా నా ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకొంటున్నాను’ అని ఉపసంహరించుకొంటూ, తాను అప్పుడు నడుపుతూ ఉండిన ‘యంగ్ ఇండియా’ పత్రికలో జరిగినదంతా ప్రకటిస్తూ “ధైర్యశాలి హరిసర్వోత్తమరావు (The brave Hari Sarvottama Rao). గబుక్కునలేచి ఆక్షేపించినాడు.” అని పేర్కొన్నారు.
ఈ విషయాలన్నీ ‘నా జీవితంలో విస్మరించరాని ఘట్టములు’ పుస్తకంలో హరిసర్వోత్తమ రావుగారే స్వయంగా వివరించారు. అలాగే గాంధీగారి సహాయ నిరాకరణోద్యమ నిర్ణయం కూడా హరిసర్వోత్తమ రావుగారికి పెద్దగా నచ్చలేదు.
అలాగే ఒకసారి నెహ్రూ గారి నిర్ణయాన్ని కూడా రావు గారు వ్యతిరేకించడం, అందుకు ప్రతిగా తన కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చెయ్యాల్సిందిగా నెహ్రూ రావుగారిని ఆదేశించడం, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా రావు గారు ఆ ఆదేశాన్ని అనుసరించడం మనకు వారి జీవితంలో కనిపిస్తుంది. పార్టీ, ప్రభుత్వ పదవులనైనా వదులుకోవడానికి సిద్ధపడ్డారే కానీ…. తాను నమ్మిన సిద్ధాంతానికి, విలువలకు జీవితాంతం కట్టుబడి జీవించిన నిస్వార్థ దేశాభక్తుడాయన.
అలసిన దేహం ఒరిగిపోయింది
అనంతరం 1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చారు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే అనేక పుస్తకాలు రచించారు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1952లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు మరణించారు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.
విజయవాడలోని సర్వోత్తమ భవనం, గ్రంథాలయం, సర్వోత్తముని స్మృతివనం
బాల్యంలో గడచిన ఏ కొద్ది సంవత్సరాలలో మినహాయిస్తే ఆయనది 77 సంవత్సరాల త్యాగమయ జీవితం. ఎట్టి కష్ట పరిస్థితులలోనూ దైన్యమెరుగని, ధైర్యముడుగని ధీరోదాత్త జీవితం. పేరుకు తగినట్టు ఆయన సర్వోత్తముడే.
ఆర్ధిక ఇబ్బందులు
ఆయన ఎన్ని ఉద్యమాలకు పితృపాదుడో, ఎన్ని సంస్థలను ఆయన నిర్వహించారో ఊహించలేము. ఇన్ని సంస్థలను నిర్వహించి, ఇన్ని ఉద్యమాలు నిర్మించి, ఇన్ని పదవులనలంకరించి కూడా ఆయన మరణించేనాటికి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నారంటే ఆయన ఎంత నిస్వార్థ ప్రజాసేవకుడో మనం అర్థం చేసుకోవచ్చు.
1959 డిసెంబరు 14వ తేదీ రాత్రి ఇంట్లో పడిపోయినారు. మరురోజు రాయపేట ఆస్పత్రిలో చేర్పించేసరికే, మాటపడిపోయింది. అనంతరం ఆయన కుమార్తె మద్రాసులోని తమ ఇంటికి తీసుకెళ్ళారు. కుమార్తె అయినప్పటికీ ఒకరిదగ్గరవుండి వారిఖర్చులతో జరుపుకోవటం బహుశా రావుగారికి కష్టంగా తోచేదేమో. అవసాన కాలంలో తనకు ఆర్ధిక వనరులు కొరవడ్డాయని, తన జరుగుబాటుకు తనకు కనీసం ఏడాదికో వెయ్యి రూపాయలు అవసరమవుతాయని, ఆ మేరకు సంపాదించుకోవలసిన అవసరమున్నదని పేర్కొంటూ 1959 డిసెంబర్ 21న నాగభూషణం గారికి ఒక ఉత్తరం వ్రాశారు.
రావు గారు స్వర్గస్తులవటానికి ముందు, కేంద్ర ప్రభుత్వ హెూంశాఖామంత్రి శ్రీ గోవిందవల్లభ పంత్, హరిసర్వోత్తమరావుగారి దేశసేవలను శ్లాఘిస్తూ 2 వేలరూపాయలచెక్కును పంపించారు. ‘గాంధీస్మారకనిధి’ సంస్థ వారు నెలకొక వందరూపాయలవంతున పంపేవారు.
వారి మరణ వార్తరాగానే ‘తెలుగుభాషాసమితి’ వారు రు 116/-లు కుటుంబానికి పంపి తమ కృతజ్ఞత చూపారు. ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు, రు 200, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘము రు 100, కుటుంబానికి అందజేశారు. వారి పుస్తకాల ద్వారా వచ్చిన కొంత పైకాన్ని నాగభూషణం గారందించారు. ఈ విధంగా ప్రభుత్వ ప్రజాసంస్థల ఆదరాభిమానాలతోనైతేనేమి రావుగారు స్వయంకృషితో తన ఖర్చులను తాను వెళ్ళబుచ్చుకొన్న ధన్యజీవి. చరితార్థుడైన ఆయన జీవితం చిరస్మరణీయం. ఒక నిస్స్వార్థ, నిరాడంబర దేశసేవకుడు. ఒక మహావ్యక్తి ఆయన. ఆ ఆదర్శమూర్తి త్యాగం మనకాదర్శం. నిస్స్వార్థం మనబాట. ఆయన అడుగు జాడల్లో పయనించడమే మనకర్తవ్యం.
రచనా వ్యాసంగం
గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యావహారిక భాషావాదాన్ని మొదట్లో వ్యతిరేకించినా రామ్మూర్తి గారితో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం సర్వోత్తమ రావు గారు తన అభిప్రాయాన్ని మార్చుకుని తన రచనలను కూడా గ్రాంథికంలో కాకుండా వ్యావహారికంలో వ్రాయడం మొదలు పెట్టారు.
పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయనకు వచ్చేవి. ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించారు.
ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు :
* ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు ఆయన తొలి సంపాదకులు. 1916 నుండి 1918 వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నారు.
* ది నేషనలిస్ట్, మాతృసేవ, ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు.
* మహిళల సమస్యల పరిష్కరం కోసం ” సౌందర్యవల్లి ” అనే పత్రిక నడిపారు.
* మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లీషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నారు.
* జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు వ్రాశారు.
* రావుగారు అప్పట్లో కౌమోదకి, ఇంద్రావతి పత్రికలలో తీవ్రమైన వ్యాఖ్యలు – విమర్శలు వ్రాసేవారు.
* “స్పిరిట్యువల్ స్వదేశీ (or) హ్యుమానిటేరియన్ నేషనలిజం” పేరుతో గాంధీజీ ప్రవచించిన జాతీయత, స్వదేశీ ఉద్యమాలను గూర్చి ప్రబోధించే గ్రంథాన్ని వ్రాశారు. అలాగే గాంధీజీ వ్రాసిన “హైందవ స్వరాజ్యము” అనే గ్రంథాన్ని కూడా రావు గారు తెలుగులోకి అనువదించారు. మహాత్మాగాంధీ రచించిన ‘నీతి ధర్మము’, ‘మూర్ఖరాజు’ (కథ) అనే రెండు పుస్తకాలను కూడా రావుగారు తెలుగులోకి అనువదించారు.
* ఆయన వ్రాసిన ’శ్రీరామ చరిత్ర’ అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది.
* ఆయన రచించిన ’పౌరవిద్య’ అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది.
* ఆయన వ్రాసిన అబ్రహాము లింకను చరిత్ర (1907) అనే పుస్తకాన్ని కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.
‘వయోజన విద్య’ అనే తెలుగు పుస్తకాన్ని రచించారు. దీని మొదటి, రెండవ పుస్తకాల్ని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, బెజవాడ వారు 1941, 1953 లలో ముద్రించారు.
విశిష్టతలు
తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించారు. మచ్చుకు కొన్ని:
* రాయలసీమకు ఆ పేరు పెట్టింది ఆయనే. 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టారు. అప్పటి వరకు దీనిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు.
* సంపాదకుడు, భావకవిత్వం అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే. ఎం.ఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో ఆయన రెండవవాడు.
పెద్దల పలుకులు
గాడిచర్ల గురించి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చెప్పిన చిరు కవిత:
వందేమాతరమనగనే వచ్చి తీరు ఎవని పేరు?
వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎవని పేరు?
గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయమెవనికి గుడి?
అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?
అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?
తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?
తరతరాలు ఎవని మేలు తలచుచు పొరలుచు నుండును?
అందరికెవనితొ పొత్తు – అఖిలాంధ్రంబెవని సొత్తు?
ఏస్థాన కవిని నేనో, ఆ స్థానాధీశుడెవడు?
వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది
హరిసర్వోత్తముడాతడు, ఆంధ్రులపాలిటి దేవుడు
* ఆంధ్రా తిలక్ హరిసర్వోత్తమరావు గారి జయంతి నేడు.
– శ్రీరాంసాగర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నిస్వార్థ ప్రజాసేవకుడు, నిష్కళంక దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
వెయ్యి కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలతో 20 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం
* క్విట్ ఇండియా ఉద్యమానికి 80 ఏళ్లయిన సందర్భంగా నోయిడాలో ఏర్పాటు
జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటం తో పాటు స్వచ్ఛతపైనా ఎలుగెత్తారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛభారత్‌ మిషన్ ‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తోంది ఉత్తర్ ‌ప్రదేశ్ ‌లోని నోయిడా నగరపాలక సంస్థ. క్విట్‌ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల మార్చింగ్‌ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి రూపొందించారు. హెచ్ ‌సీఎల్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో నోయిడా అడ్మినిస్ట్రేషన్‌ సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి ఈ విగ్రహాన్ని తయారు చేసింది. ఈ విగ్రహాన్ని 137వ సెక్టార్‌ లో ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు గుర్తు చేసేలా మహాత్ముడి విగ్రహాన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు .
ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ ‌పై జులై 1వ తేదీ నుంచి నిషేధం విధించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు, రాజస్థాన్‌లో ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొస్తే లీటర్‌ పెట్రోల్ ‌పై డిస్కౌంట్‌ ఇస్తున్నారు ఓ పెట్రోల్‌ పంపు యజమాని అశోక్‌ కుమార్‌ ముంద్ర. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇష్టారీతిలో ఎక్కడపడితే అక్కడ పడేయకుండా అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు ఆయన చెప్పారు .
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post వెయ్యి కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలతో 20 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సబర్మతి ఆశ్రమాన్ని తొలిసారి సందర్శించిన బ్రిటన్ ప్రధాని
గాంధీన‌గ‌ర్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయనకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ఆయన బసచేసే హోటల్‌ వరకూ మొత్తం నాలుగు కిలోమీటర్ల మేర ఆయన్ను ర్యాలీగా తోడుకొని వెళ్లారు. దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో శుక్రవారం దిల్లీలో సమావేశమవుతానని.. వాణిజ్యం, భద్రత సహా పలు ముఖ్యమైన విషయాలపై ఆయనతో చర్చిస్తానని జాన్సన్‌ చెప్పారు.
సబర్మతి ఆశ్రమం సందర్శన
జాన్సన్‌.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడున్న మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. బాపూజీ రచించిన ‘గైడ్‌ టు లండన్‌’, ఆయన శిష్యురాలు మీరాబెన్‌ ఆత్మకథ ‘ద స్పిరిట్స్‌ పిల్‌గ్రిమేజ్‌’ పుస్తకాలను ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు అందజేశారు.
అసాధారణమైన వ్యక్తికి చెందిన ఆశ్రమానికి రావడాన్నీ.. ప్రపంచాన్ని మార్చేందుకు అహింస, సత్యాలను ఆయన మూలసూత్రాలుగా మార్చుకున్న విషయాన్ని తెలుసుకోవడాన్ని తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు జాన్సన్‌ అక్కడ రాసిన తన సందేశంలో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post సబర్మతి ఆశ్రమాన్ని తొలిసారి సందర్శించిన బ్రిటన్ ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
దేశభక్త కొండా వెంకటప్పయ్య
“మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్య్రయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది. ప్రజలు కాంగ్రెస్ ‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్‌ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెస్‌ అవినీతికి ఆలవాలమైపోతున్నది. పైసా ఆదాయం లేనివారు ఇప్పుడు మహారాజులలాగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు. కాంగ్రెసు ఎమ్.ఎల్.ఏలూ, ఏమ్.ఎల్.సి లు తరచూ జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టరులూ, రెవిన్యూ అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ పైరవీకారుల ప్రభావంతో, భయంతో నిజాయితీగల వారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు.”
1947 డిసెంబర్‌లో, ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత చారిత్రక ఘట్టంగా చెప్పే స్వేచ్ఛాభారతి ఆవిర్భావం తరువాత మూడు మాసాలకే గాంధీజీకి అందిన ఒక లేఖలోని వ్యథాభరిత వాక్యాలివి. గాంధీజీకి ఇలాంటి లేఖ ఒకటి అందిందని ‘మార్చ్‌’ అనే పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో వార్తా కథనం కూడా ప్రచురించింది. ఆ వార్తకు శీర్షిక ‘కాంగ్రెస్‌ వర్స్‌ దేన్‌ ది బ్రిటిష్‌’. కాంగ్రెస్‌ పతానావస్థ గురించి అలా లేఖ రాసిన వారు శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు. అట్లని ఆయన ఏ హిందూ మహాసభ సభ్యుడో, కమ్యూనిస్టో అనుకుంటే పొరపాటే. ఆయన గాంధీ మార్గాన్ని తు.చ తప్పకుండా అనుసరించిన నికరమైన గాంధేయవాది. ఉత్తర భారతంలో బాబూ రాజేంద్రప్రసాద్‌ వలె, దక్షిణాదిన రాజాజీ వలె, తెలుగు ప్రాంతాల నుంచి గాంధీజీకి విశ్వాసపాత్రులుగా ఖ్యాతి గాంచినవారు శ్రీ కొండా వెంకటప్పయ్య.
సేవాతత్పరుడు
కొండా వెంకటప్పయ్య 1866, ఫిబ్రవరి 22న పాత గుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. వారి ప్రాథమిక విద్య గుంటూరులోనే సాగింది. తరువాత బీఏ, బీఎల్‌ మద్రాసులో చేశారు. చదువు పూర్తయ్యాక బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. బాల్యం నుంచే దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలను తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు.
డిగ్రీ చదువుకు కొంచెం ముందు వెంకటప్పయ్య  రాజమహేంద్రవరంలో కొద్దికాలం ఉన్నారు. అప్పుడే కందుకూరి వీరేశలింగంగారి ప్రభావంలో పడ్డారు. ఆ రోజులలో విధవా పునర్వివాహాల కోసం ఆ అభాగినులను రహస్యంగా కల్యాణవేదికల వద్దకు తీసుకురావడం ఎంత క్లిష్టంగా ఉండేదో వెంకటప్పయ్య తన స్వీయ చరిత్రలో వర్ణించారు. వీరేశలింగం ఉద్యమాన్ని ఆయన హృదయ పూర్వకంగా స్వాగతించారు. వెంకటప్పయ్యగారు మద్రాసు కైస్తవ కళాశాలలో బీఏ ‘జూనియర్‌’  చదువుతూ ఉండగానే, అంటే 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌ మూడో మహాసభలు ఆ నగరంలో జరిగాయి. అప్పుడే తాను జాతీయ కాంగ్రెస్‌ పట్ల అభిమానం ఏర్పరుచుకున్నట్టు వెంకటప్పయ్య తన స్వీయ చరిత్రలో స్పష్టంగా వ్రాశారు.
కృష్ణా పత్రిక ఆవిర్భావం
ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులవి. మచిలీపట్నంలో న్యాయవాద వృత్తిలో ఉన్న శ్రీ వెంకటప్పయ్య 1902లో శ్రీ దాసు నారాయణరావుతో కలిసి ’’కృష్ణా పత్రిక” ప్రచురణను ప్రారంభించారు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపారు. కృష్ణా మండలం నుంచి గుంటూరు జిల్లాను వేరు చేసిన తరువాత ఆ జిల్లాకు వేరే న్యాయస్థానం రావడంతో, వెంకటప్పయ్య తన స్వస్థలం గుంటూరుకు వచ్చేశారు. తాను గుంటూరులో స్థిరపడ్డ తర్వాత కృష్ణా పత్రిక సంపాదకత్వ బాధ్యతలను శ్రీ ముట్నూరు కృష్ణారావుకు అప్పగించారు.
దాత
ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన
1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనా ప్రక్రియలో ఇది తొలివిజయమని చెప్పాలి. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి శ్రీ వెంకటప్పయ్యే. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కలసి ఒకే నియోజక వర్గంగా ఉండేది. ఓటర్లు అంతా కలిపితే 500 మంది మాత్రమే. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిలుకు ఎన్నికయ్యారు. సహాయ నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే రెండవ ఆలోచన లేకుండా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నిస్వార్థ నాయకుడు శ్రీ కొండా వెంకటప్పయ్య. ఆ తరువాత ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యారు.
1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయలు విరాళాలుగా స్వీకరించి స్వరాజ్యనిధికి సమర్పించారు శ్రీ వెంకటప్పయ్య. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకుగానూ ఆయన మొదటిసారి జైలు శిక్ష అనుభవించారు.
అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా…
1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయనిరాకరణ, శాసనోల్లంఘనల అనంతరం శాసనసభా ప్రవేశ వాదులకు, బహిష్కరణ వాదులకు మధ్య తీవ్ర చర్చలు జురుగుతున్న రోజులవి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్ దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. మధ్యే మార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యారు. స్వల్పకాలమే అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించారు. ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణ ఘట్టం. ఆ రోజుల్లో గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికీ కొండా వెంకటప్పయ్యే నాయకత్వం వహించేవారు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది.
1933లో గాంధీజీ ఆంధ్రలో హరిజన యాత్ర సాగించారు. అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించారు. ఆంధ్రదేశంలో 65 వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. ఒక వంక భార్య పక్షవాతంతో బాధపడుతూ మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నుడై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీ అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడుగా…
1929లో సైమన్ కమిషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యారు. భాషా ప్రాతిపదికన మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఆరంభకుడిగా 1920 నుంచి 1949లో తాను కీర్తిశేషుడయ్యే వరకూ ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాజకీయాలలో ఆయన స్థానం దేశ రాజకీయలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. కాంగ్రెస్ అగ్రనాయకులందరూ దేశ భక్త కొండా వెంకటప్పయ్యను గౌరవించేవారు.
ఏమైనా “దేశభక్త ” కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయలలో తన ప్రతిభకు, త్యాగానికి తగిన స్థానం పొందలేకపోయారు. 1938లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాసన సభా కాంగ్రెస్ పక్షంలో ముగ్గురు కార్యదర్శులలో ఒకరుగా ఆయనను నియమించి ఆయన త్యాగాలకు ఆ విధంగా విలువకట్టారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షునిగా పనిచేశారు. అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాల సభ్యునిగా ఉన్నారు. గ్రంథాలయోద్యమానికె కూడా తోడ్పడ్డారు. ఆయన స్వరాజ్య పోరాటంలో ఉండగా ఆయన సతీమణి మరణించారు.
రచనలు
శ్రీ కొండా వెంకటప్పయ్య కడలూరు జైలులో ఉన్నప్పుడు “డచ్ రిపబ్లిక్” అనే గ్రంథాన్ని రచించారు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా వ్రాశారు. “శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి” అన్న భక్తి రసభరిత శతకాన్ని, ఆధునిక ‘రాజ్యాంగ సంస్థలు’ అనే పుస్తకాన్ని రచించాడు. ఆంగ్లంలోనూ, తెలుగులోనూ అనర్గళంగా ప్రసంగించగలిగిన అద్భుతమైన వక్త, కవి శ్రీ కొండా వెంకటప్పయ్య. ఆయనకు మొదటి నుంచీ నాటకాలంటే చాలా మక్కువ. అనేక నాటకాలలో స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.
మరణం
‘ఏ వ్యక్తి జీవితమూ పూర్తిగా ఆనందంతోనూ ఉండదు. అలా అని పూర్తిగా విషాదంతోనే సాగదు’ అంటూ వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర ఆరంభమవుతుంది. ఆయన కళ్లెదుటే ఆయన కుమారులు ఇద్దరు కన్నుమూశారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1949లో  దేశమంతా ఆగస్టు 15 వేడుకలలో మునిగి ఉండగా, అదే రోజు కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య ప్రాణం అనంత స్వేచ్ఛావాయువులలో కలసిపోయింది. తెలుగువారందరూ సదా స్మరించుకోవాల్సిన నిరాడంబర సేవామూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య. భారత్ మాతాకీ జయ్.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post దేశభక్త కొండా వెంకటప్పయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
‘హరిజన నాయకుడు’ కి 90 ఏళ్ళు
తెలుగునాట సమరసతా సాహిత్యంలో మరో కలికితురాయి ఆచార్య NG రంగా వ్రాసిన ‘హరిజన నాయకుడు’ నవల వెలువడి 89 సంవత్సరాలు పూర్తయింది. ‘హరిజన నాయకుడు’ నవల అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అమృతభాండమే. హిందూ సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అస్పృశ్యతను విద్యతో, జ్ఞానంతో, సంస్కారంతో అధిగమించవచ్చు, మిగతా సమాజం నుంచి మన్నన పొందవచ్చు అని చెబుతూనే, “స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః” అని బోధిస్తుంది.
“హరిజన నాయకుడు” నవల సంక్షిప్త ఇతివృత్తం ఒకసారి తెలుసుకుందాం…..
నవల మొత్తం విజయవాడ చుట్టు ప్రక్కల కమ్మ వారు ఎక్కువగా గల వేల్పూరు, ఈడ్పుగల్లు, గొల్లపూడి….గ్రామాల కేంద్రంగా ఉంటుంది. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ, వేమూరు రాంజీ పంతులు, కొంపెళ్ళ హనుమంతరావు వంటి చారిత్రిక పురుషులు,…..ఇతర కల్పిత వ్యక్తులు నవలలో దర్శనమిస్తారు.
గంగయ్య మాదిగ కులపెద్ద. పెద్ద కూలీ. రెండవ కొడుకు లింగడు తాను చేయని తప్పుకు రైతులచే దెబ్బలు తిని మరణిస్తాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కడుపున తిరిగి జన్మిస్తాడు. అతనిపేరు ముత్తయ్య. గంగయ్య పాత తరం వాడు. అతని మంచి ప్రవర్తన వల్ల రైతులు కూడా అతని పట్ల గౌరవంతో వ్యవహరిస్తారు. అందరినీ మంచి చూపులతో చూడడం,అందరిలో మంచినే చూడడం ఇతని ప్రత్యేక గుణం.”చేనులోకి దిగి వ్యవసాయ పనులు నాట్లు, కోతలు చేసేటప్పుడు కూలీలుగా అందరూ ఉంటారు. అప్పుడు అంటరానితనం ఎవరూ పాటించరుగా?” ఇదీ గంగయ్య మనోగతం.
కొత్తగా పుట్టిన ముత్తయ్యకు అన్నీ లింగయ్య లక్షణాలే! ముత్తయ్య నూతన తరం వాడు. సమాన హక్కులు, గౌరవం కోరుకునేవాడు. దాంతో రైతులలో అలజడి బయలు దేరుతుంది. ముత్తయ్య ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోతాడు. క్రైస్తవుల సహకారంతో ఉన్నత చదువులు చవుతాడు. తమ మతంలో చేరమని క్రైస్తవ మత పెద్దలు కోరతారు. ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి పెద్దల సలహాతో క్రైస్తవ మతం తీసుకోరాదని నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయం క్రైస్తవ మత పెద్దలకు చెబుతాడు. మచిలీ పట్నంలో ఎస్సీల కోసం నడపబడుతూ ఉన్న శ్రీ వేమూరు రాంజీ పంతులు గారి పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరతాడు. న్యాయవాది అవుతాడు. ముత్తయ్యలో అక్కడి పెద్దలకు సంత్ బసవేశ్వరుడు లాగా మంచి నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. కనుక బసవలింగయ్యగా పేరు మార్చారు.
1920 లో వచ్చిన ఎన్నికలు ఈ ఎస్సీ వర్గాల ప్రజలలో ఒక కొత్త చర్చను లేవదీసింది. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం సరి కాదు, ప్రజల కోసం పని చేసే వారికే వోటు వేయాలని కొందరు వాదించారు.
1923లో బసవలింగయ్య తమ గ్రామంలోని పెద్ద లతో చర్చించి, ఒప్పించి ఎస్సీ బాల బాలికలకు గ్రామ పాఠశాలలో ప్రవేశం కల్పించాడు. ఆ చుట్టుప్రక్కల గ్రామాలలోని దేవాలయాల్లో, చెరువుల్లో ఎస్సీలకు ప్రవేశం లభించింది. బసవయ్య ఒక మంచి నాయకునిగా గుర్తింపు పొందాడు. మరి కొన్ని గ్రామాలలో రైతులు ఎస్సీలపై దాడులు చేశారు. దాడి చేసిన రైతులకు శిక్ష పడేటట్లు కేసును చక్కగా వాదించాడు. దాంతో రైతులు రాజీకి వచ్చారు. ఈ రాజీ కుదర్చడంలో రైతుల భార్యల చతురత ఉంది. చివరకు రైతులకు, ఎస్సీ లకు రాజీ కుదిరి సయోధ్య ఏర్పడింది.
కొందరు చదువుకున్న ఎస్సీ యువత పట్టణాల వైపు,ఆకర్షణల వైపు వెళ్ళ సాగారు. అలాంటి తన చెల్లెలిని సుందరిని ఒప్పించి గ్రామంలోనే ఉంచి, గ్రామ ప్రజల్లో మార్పుకు కృషి చేసేటట్లు చేశాడు. క్రైస్తవ మతం తీసుకున్న అరుంధతిని తిరిగి హిందువుగా పునరాగమనం చేయించి, ఆమెను బసవయ్య వివాహం చేసుకున్నాడు. మతం తీసుకున్న అనేక మందిని ఒప్పించి తిరిగి హిందువులుగా చేశాడు. ఇది ఆంగ్లేయ అధికారులకు కన్నెర్ర అయింది. తనతోపాటే తన చెల్లెలు వివాహం అయింది. ఆ రెండు వివాహాలకు, అన్ని కులాల వారూ వచ్చారు. మేళ తాళాలతో గ్రామం మధ్య నుండి గ్రామస్థుల సహకారంతో ఊరేగింపు జరిగింది.
మద్రాసులో సైమన్ కమీషన్ రాకను వ్యతిరేకిస్తూ మదరాసులో జరిగిన సభకు అనేక మంచి మార్పులకు కృషి చేస్తున్న శ్రీ రామకృష్ణ మిషన్ స్వామీజీ స్వామి గోపికానంద అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా బసవయ్య ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం ఈ నవలా రచయిత మనస్సును వ్యక్తం చేస్తుంది. “ఆంగ్లేయులు మీరు రెండు వందల సంవత్సరాలు మమ్మల్ని పాలించారు.మీ పాలన వల్ల మా పట్ల అంటరానితనం పోలేదు. గాంధీగారి ఉద్యమం వల్లే అనేక మంచి మార్పులు వచ్చాయి. మాకు సంపూర్ణ స్వాతంత్య్రం కావాలి.
ఎస్సీలకు ప్రత్యేక నియోజక వర్గాలు వద్దు. మేము హిందువులం.మమ్మలని హిందువుల నుండి వేరు చేయ తగదు. “ఆంగ్లేయ పోలీసులు కుట్ర పన్ని రౌడీలతో బసవయ్య పై దాడి చేయించారు. ఆంగ్లేయ అధికారుల కుట్ర వల్ల బసవయ్యకు ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. అయితేనేమి బసవయ్యను ఒక మంచి నాయకునిగా ప్రజలు గుర్తించారు. బసవయ్య కధా నాయకుడు అయ్యాడు.
సామాజిక మార్పుకు సహకరించే అనేక పాత్రలు యల్లమంద, సుశీల, రమణయ్య,…. ఇలా ఎన్నో మనకు ‘హరిజన నాయకుడు’ కనిపిస్తాయి.
రచయిత గురించి….
ఆచార్య ఎన్. జి రంగా
‘హరిజన నాయకుడు’ నవలా రచయిత ఆచార్య ఎన్.జీ.రంగా. ఆచార్య రంగా గుంటూరు జిల్లాకు చెందినవారు. భారత దేశంలోనే రైతు ఉద్యమ అగ్రేసరుడు. రాజకీయ పాఠశాలను అనేక దశాబ్దాలు నడిపారు. యువకుడుగా ఎస్సీ వాడలకు వెళ్లారు, వారితో స్నేహం చేశారు, వారితో కలిసి భోజనం చేసిన సామాజిక స్పృహ మెండుగా ఉన్నవారు. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను పొందారు.
కమ్యూనిస్టులు రైతులకు వ్యతిరేకంగా రైతు కూలీ ఉద్యమాలను నడుపుతున్న సమయమది. రైతు కూలీలు అంటే ఎస్సీలే కదా! రైతు కూలీల సమస్యలు కూడా రైతులవేనని, రైతు ఉద్యమాలను, రైతు కూలీ ఉద్యమాలను సమన్వయం చేస్తూ, రైతులను భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగస్వామ్యులను చేసిన ఘనత రంగాదే!
1924లో ప్రచురితం అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘మాలపల్లి’ నవల ప్రభావం రంగాగారిపై ఎంతో ఉంది. ఆనాడు మాలపల్లి నవలపై శ్రీ రంగా ఆంధ్రపత్రికలో వ్రాసిన నాలుగు వ్యాసాలు ప్రజలపై ఎంతో ప్రభావం కలుగజేశాయి. 4 సంవత్సరాల తర్వాత 1933లో “హరిజన నాయకుడు” అనే నవలను ఆచార్యరంగా వ్రాశారు.
మాలపల్లి నవల మహాభారతం వలె పెద్ద గ్రంధం. అనేక వైవిధ్యభరిత పాత్రలతో గ్రాంథిక భాషలో ఉంటుంది. హరిజన నాయకుడు అనే నవల తక్కువ పాత్రలతో, చిన్నదిగా ఆ నాటి గ్రామ పరిస్థితులు, రైతు – కూలీ సంబంధాలు, అస్పృశ్యత, క్రైస్తవ మతమార్పిడులు, పునరాగమనం, గాంధీజీ హరిజనోద్ధరణ ప్రభావం, స్వాతంత్ర్య సమరం ఇవన్నీ నవలలో చిత్రీకరించారు.
అస్పృశ్యత నిర్మూలన గాంధేయ మార్గంలోనే సాధ్యమని ప్రతిపాదించారు. 1933లో గాంధీజీ హరిజనయాత్రలో ఆంధ్ర ప్రాంతంలో పర్యటించినప్పుడు వారి వెంట గుంటూరు జిల్లా పొన్నూరు వద్ద తాళ్ళపాళెంలు నడచి వెళ్లారు.
1987లో కిసాన్ పబ్లికేషన్స్, గుంటూరు వారు ‘హరిజన నాయకుడు’ నవలను 50 ఏళ్ల తర్వాత పునర్ముద్రించారు.
– K. శ్యాంప్రసాద్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ‘హరిజన నాయకుడు’ కి 90 ఏళ్ళు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
మహాత్మా గాంధీకి నిజమైన వారసత్వం ఆర్‌ఎస్‌ఎస్!
* నేడు మహాత్ముని 74వ వర్ధంతి
మహాత్మా గాంధీగా ప్రసిద్ధి చెందిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతిని మనం జరుపుకుంటున్న సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) గాంధీ వారసత్వానికి నిజమైన వారసునిగా స్పష్టంగా ఉద్భవించింది.
మహాత్మా గాంధీ దృఢమైన హిందువు అని పేర్కొంటూ హిందుత్వం, గోసంరక్షణ, స్వదేశీ, అంటరానితనం నిర్మూలనపై ఆయన ఆలోచనలను ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు తీసుకువెడుతున్నది.
నిజానికి మహాత్మా గాంధీ సంఘ్ గొప్ప ఆరాధకులలో ఒకరు. 1934లో, గాంధీ మహారాష్ట్రలోని వార్ధాలో ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరాన్ని సందర్శించారు.  అన్ని కులాలకు చెందిన యువకులు,  బాలురు తోటి స్వయంసేవకుల కులాల వారితో ఇబ్బంది పడకుండా ఒకే చోట ఉంటూ, కలసి  భోజనం చేయడం ఆయనను ఆకట్టుకుంది.
స్వాతంత్య్రం వచ్చిన ఒక నెల తర్వాత, సెప్టెంబర్ 16, 1947 న, ఢిల్లీలో తన ప్రసంగాలలో ఒక సమయంలోఆర్‌ఎస్‌ఎస్  కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, గాంధీజీ  “సంవత్సరాల క్రితం, వ్యవస్థాపకుడు శ్రీ (కెబి) హెడ్గేవార్ జీవించి ఉన్నప్పుడు నేను  ఆర్‌ఎస్‌ఎస్   శిబిరాన్ని సందర్శించాను. మీ క్రమశిక్షణ, అంటరానితనం పూర్తిగా లేకపోవడం, కఠినమైన సరళత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి” అని చెప్పారు.“అప్పటి నుండి, సంఘ్ పెరిగింది. సేవ,  స్వయం త్యాగం ఉన్నత ఆదర్శంతో ప్రేరణ పొందిన ఏ సంస్థ అయినా బలాన్ని పెంచుతుందని నేను నమ్ముతున్నాను” అంటూ తెలిపారు.యాదృచ్ఛికంగా, మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సూత్రాలను పొందుపరిచిన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కూడా 1939లో పూణేలోని సంఘ్ శిక్షా వర్గాన్ని (ఆర్‌ఎస్‌ఎస్   శిక్షణా శిబిరం) సందర్శించారు. డాక్టర్ అంబేద్కర్  ఆర్‌ఎస్‌ఎస్   వ్యవస్థాపకుడు డాక్టర్ .కె బి  హెడ్గేవార్ ను, శిబిరంలో ఎవరైనా అంటరానివారు ఉన్నారా? అని అడిగారు.
ఇక్కడ తాకదగినవారు లేదా అంటరానివారు ఎవరూ లేరని, హిందువులు మాత్రమే ఉన్నారని డాక్టర్జీ బదులిచ్చారు.  “ఇతరుల కులాన్ని కూడా పట్టించుకోకుండా సంపూర్ణ సమానత్వం, సోదరభావంతో స్వయంసేవకులు తిరుగుతున్నందుకు నేను ఆశ్చర్యపోయాను” అని అంబేద్కర్ పేర్కొన్నారు.
గాంధీ – ఉపాధ్యాయ
ప్రఖ్యాత రచయిత,  ప్రస్తుతం జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు అధిపతిగా ఉన్న డాక్టర్ వాల్టర్ ఆండర్సన్, ఆర్‌ఎస్‌ఎస్ పై అనేక ప్రశంసలు పొందిన రచనలను చేశారు. ‘ఇంటిగ్రల్ హ్యూమనిజం’ (దీనదయాళ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించినది) అనే సంకలనంలో ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశారు.
గాంధీజీని సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయతో పోల్చారు. భారతీయ జనతా పార్టీ  పూర్వ అవతారమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఉపాధ్యాయ ఒకరు. “ఏకాత్మతా మానవతా వాదం” అనేది అధికార బిజెపి అధికారిక భావజాలం.
1992లో ప్రచురితమైన గాంధీ అండ్ దీనదయాళ్: టూ సీర్స్ అనే వ్యాసంలో, అండర్సన్ గాంధీ,  ఉపాధ్యాయ మధ్య పోలికను చూపారు. వారిద్దరి మధ్య  చాలా సాధారణ విషయాలను కనుగొన్నారు.“గాంధీ,  ఉపాధ్యాయ ప్రాథమికంగా సంఘటనకర్తలు.   ద్వితీయంగా వారు  తాత్విక ఆలోచనలపై ఆసక్తి కలిగి ఉన్నారు… ఇద్దరూ ఆకర్షణీయమైన వ్యక్తులు,” అని అండర్సన్ రాశాడు. “గాంధీ భారత జాతీయ కాంగ్రెస్‌ను మార్చారు… ‘మహాత్మా’గా ఆయన ఆకర్షణీయమైన విజ్ఞప్తి కాంగ్రెస్‌ను స్వాతంత్య్ర ఉద్యమంలో  ప్రభావవంతమైన పాత్ర వహించేటట్లు చేసింది… ఉపాధ్యాయ కూడా సాధువు తరహా పాత్ర కలిగి ఉన్నాడు… జనసంఘ్ కేడర్‌పై కూడాఆయన  అదే ప్రభావాన్ని కలిగించారు. ”గాంధీ,  ఉపాధ్యాయ ఇద్దరూ అధికారంలో ప్రత్యక్ష భాగస్వామ్యానికి దూరంగా ఉన్నారు.  పదునైన ఆలోచనలు గలవారే కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన  మేధావులు. వారి సైద్ధాంతిక ఫ్రేమ్‌వర్క్‌లు వారి క్షేత్రస్థాయి  అనుభవాల నుండి ఉద్భవించాయి.”వాస్తవానికి (గాంధీ,  ఉపాధ్యాయ) ఈ పదం యొక్క సాంప్రదాయిక అర్థంలో మేధావులు కాదు.  అది విద్యాపరమైన అర్హతలు,  వారి వ్రాసిన  పుస్తకాల  సుదీర్ఘ జాబితాలతో కూడిన వివేకవంతులు.  అధునాతన పురుషులు” అని అండర్సన్ రాశాడు.
అంతులేని పోలికల జాబితా
పోలిక ఇక్కడితో ముగియదు. గాంధీ ‘స్వరాజ్‌’,  ‘స్వదేశీ’లకు అత్యంత మద్దతుదారుడు. ఉపాధ్యాయ ‘ఏకాత్మ మానవతావాదం’  గురించి మాట్లాడేటప్పుడు అటువంటి తత్వాలనే ప్రస్తావించారు.  నిజానికి, అభివృద్ధిలో   పాశ్చాత్య నమూనాల తిరస్కరణ గాంధీ,  ఉపాధ్యాయల ఇద్దరి  ఆలోచనా విధానంలకు  ఆధారంగా ఉంది.
“చివరిగా ఇద్దరూ రాజకీయ అధికారం ప్రజారంగంలోని  వ్యక్తులపై అవినీతి ప్రభావాన్ని చూపుతుందని అనుమానించారు. వారిద్దరూ ఏ రాజకీయ పదవిని నిర్వహించలేదు. అలా చేయాలని కోరుకోలేదు” అని అండర్సన్ రాశాడు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలలకే గాంధీ తన సన్నిహిత సహోద్యోగులతో మాట్లాడుతూ, “అధికారాన్ని వదులుకోవడం ద్వారా, ఓటర్ల స్వచ్ఛమైన, నిస్వార్థ సేవకు మనల్ని మనం అంకితం చేసుకోవడం  ద్వారా, మనం  వారికి మార్గనిర్దేశం చేయవచ్చు,  ప్రభావితం చేయవచ్చు” అని చెప్పారని అండర్సన్ తెలిపారు.
“ప్రభుత్వంలోకి వెళ్లడం ద్వారా మనకు లభించే దానికంటే ఇది చాలా ఎక్కువ నిజమైన శక్తిని ఇస్తుంది…నేడు రాజకీయాలు అవినీతిమయంగా మారాయి. అందులోకి వెళితే ఎవరైనా కలుషితమే. మనం దాని నుండి పూర్తిగా దూరంగా ఉందాం. తద్వారా మన ప్రభావం పెరుగుతుంది” (డి జి . టెండూల్కర్, మహాత్మా, సంపుటి 8, పేజీలు 278-280) అని గాంధీ పేర్కొన్నారు.
అండర్సన్ ఇంకా ఇలా అన్నాడు, “ఆయన  సలహాను ఆయన  కాంగ్రెస్ సహచరులు చాలా మంది తిరస్కరించారు. హాస్యాస్పదంగా ఓ రాజకీయ పార్టీ నాయకుడైన ఉపాధ్యాయ, బహుశా రాజకీయాల పట్ల గాంధీజీ  అభిప్రాయానికి మద్దతు పలిదారు”
ఉపాధ్యాయ ఇలా వ్రాశారు, “నేడు రాజకీయాలు ఒక సాధనంగా నిలిచిపోయాయి. అది అంతంతమాత్రంగానే మారింది. కొన్ని సామాజిక, జాతీయ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో రాజకీయ అధికారమే లక్ష్యంగా కాకుండా అధికార రాజకీయాలలో నిమగ్నమైన వ్యక్తులు నేడు మనకు ఉన్నారు (పొలిటికల్ డైరీ, పేజీ-115)…”
సమాజంలో స్త్రీ పురుషుల వ్యక్తిత్వమే  అంతిమంగా రాజ్య స్వభావాన్ని నిర్ణయిస్తుందని గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చారు.  అలాంటి స్త్రీ పురుషులను తయారు చేసే పనిని గత 93 సంవత్సరాలుగా దేశంలో ఒక సంస్థగా తాము  నిర్విరామంగా చేస్తున్నట్లు  ఆర్ఎస్ఎస్   భావిస్తోంది.
కాబట్టి మహాత్ముని వారసత్వానికి నిజమైన వారసులు ఆర్‌ఎస్‌ఎస్, దాని సిద్ధాంతాలు;  సిద్ధాంతకర్తలు,  నిర్వాహకులు, దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి నిస్వార్థ దేశభక్తులు అని స్పష్టమవుతుంది.
Courtesy : Nijam Today
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post మహాత్మా గాంధీకి నిజమైన వారసత్వం ఆర్‌ఎస్‌ఎస్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కాళీ చరణ్ మహారాజ్… ఎవరీయ‌న‌? ఈయ‌న సంగ‌తేంటి?
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో నిన్న‌(డిసెంబర్ 30న) జరిగిన ‘ధర్మ్ సన్సద్’ కార్యక్రమంలో మహాత్మా గాంధీని విమర్శించినందుకు కాళీచరణ్ మహారాజ్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ కాళీచరణ్ మహారాజ్ ఎవరు అనేది అందరి మెదళ్ల లోనూ మెదిలింది. కాళీచరణ్ మహారాజ్ ‘అభిజిత్ ధనంజయ్ సరాగ్’ గా జన్మించారు.
తలపై గుండ్రని తిలకంతో ఎర్రటి వస్త్రంతో తరచుగా కనిపించే కాళీచరణ్ మహారాజ్ కు శివుడు, కాళీ మాత అంటే ఎంతో అభిమానం. మహారాష్ట్రలోని అకోలా పాతబస్తీలోని శివాజీ నగర్‌కు చెందినవారు. కాళీచరణ్ తండ్రి ధనంజయ్ సరాగ్ మెడికల్ షాప్ నడుపుతున్నారు.
కాళీచరణ్ భావసాగర్ వర్గానికి చెందినవారు. ఆయన పుట్టిన తేదీ తెలియదు.. కానీ కొన్ని నివేదికలు ఆయన 1973లో జన్మించినట్లు సూచిస్తున్నాయి. కాళీచరణ్ ‘మహారాజ్’ ఎనిమిదో తరగతి పూర్తి చేసిన తర్వాత చదువును మానేశారు. చదువును విడిచిపెట్టిన తర్వాత ఇండోర్ లోని అతని అత్త ఇంటికి పంపబడ్డాడు. అక్కడ హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు. భయ్యూజీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లడం ప్రారంభించారు.
నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. భయ్యూజీ మహారాజ్ నుండి దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను ‘కాళీచరణ్‌ మహారాజ్‌’గా పిలవడం ప్రారంభించారు. కాళీచరణ్ మహారాజ్ చాలా ప్రజాదరణ పొందారు. హిందూ గ్రంధాలకు చెందిన మంత్రాలు, శ్లోకాలను పఠించే ఆయన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన 2017 లో పౌర ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ విజయవంతం కాలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.
కాళీచరణ్ మహారాజ్ శివ తాండవ స్తోత్ర వీడియో
2020లో, కాళీచరణ్ మహారాజ్ తాండవ స్త్రోత్రం పాడిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని భోజేశ్వర్ శివాలయంలో చిత్రీకరించారు. ఆయన పాడిన తాండవ్ స్త్రోత్ర వీడియో ఒకటి యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్ ను పొందింది. కాళీచరణ్ మహారాజ్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో గత మూడు సంవత్సరాలుగా చురుకుగా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయన వీడియోలలో చాలా వరకు ఆధ్యాత్మిక కంటెంట్, ఇంటర్వ్యూలు, కథా వాచన్ ఉన్నాయి.
తన యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఒక వీడియోలో, ఒక కార్యక్రమంలో తన ప్రసంగంలో హిందూ సమాజంలో కుల సమస్య గురించి మాట్లాడారు. హిందువులలో కులం అనే కుళ్లిపోయిన సమస్య ధర్మ వినాశనానికి దారితీసే విభజనను సృష్టిస్తుందని ఆయన అన్నారు.
హిందువులు శివాజీ మహారాజ్‌ను అనుసరించాలని, కుల సంకెళ్లను తెంచుకుని హిందుత్వ పతాకం కింద కలిసిపోవాలని ఆయన అన్నారు. హిందువులు విభజించబడినందున ఆక్రమణదారులు భారతదేశాన్ని జయించగలిగారు. శివాజీ మహారాజ్ హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు, మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పుకొచ్చారు.
రాయ్‌పూర్ ధర్మ సంసద్‌లో చేసిన వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో ఇటీవల కాళీచరణ్ మహారాజ్ వార్తల్లో నిలిచారు. ఆయన మహాత్మా గాంధీని విమర్శించారు. డిసెంబర్ 30న, రాయ్‌పూర్ పోలీసులు ఆయనను ఖజురహో నుంచి అరెస్టు చేశారు.
ధర్మ సంసద్‌లో గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేని అభినందిస్తూ కాళీచరణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ కారణంగా ప‌లుచోట్ల ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. కాళీచరణ్ మహారాజ్ గాంధీజీని దుర్భాషలాడడమే కాకుండా గాంధీజీని చంపినందుకు నాథూరామ్ గాడ్సేకి కృతజ్ఞతలు తెలిపారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కాళీ చరణ్ మహారాజ్… ఎవరీయ‌న‌? ఈయ‌న సంగ‌తేంటి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, గాంధీకి ప్రధాని ఘన నివాళులు
న్యూఢిల్లీ : పూర్వ ప్రధాని దివంగత లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో…
‘పూర్వ ప్రధాని లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారికి ఆయన జయంతి నాడు ఇవే వందనాలు. విలువల పైన, సిద్ధాంతాల పైన ఆధారపడ్డ ఆయన జీవనం దేశప్రజల కు ఎల్లప్పటికి ప్రేరణను అందిస్తూనే ఉంటుంది.’ అని పేర్కొన్నారు.
అలాగే, మహాత్మగాంధీకి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో-
‘జాతిపిత మహాత్మ గాంధీకి ఆయన జయంతి నాడు ఇదే వినమ్ర శ్రద్ధాంజలి. పూజ్య బాపు జీవనం, ఆదర్శాలు దేశంలో ప్రతి ఒక్క తరం కర్తవ్య పథంలో పయనించడం కోసం ప్రేరణను అందిస్తూ ఉంటాయి. మాననీయ బాపు గారికి గాంధీ జయంతి నాడు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. గొప్పవైన ఆయన సిద్ధాంతాలు యావత్తు ప్రపంచంలో ఉన్నాయి. మరి లక్షల కొద్దీ ప్రజలకు వాటి నుంచి బలం అందుతున్నది’ అని పేర్కొన్నారు.
Source: PIB
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, గాంధీకి ప్రధాని ఘన నివాళులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
చరిత్రకారుడు కాదు చరిత్ర హీనుడు
చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ( ‘మెజారిటీ వాదం అప్పుడూ ఇప్పుడూ’ – డిసెంబర్ 19, ఆంధ్రజ్యోతి) నిండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై విద్వేషం మినహా విషయం లేదు. గాంధీ చివరి కార్యదర్శి ప్యారేలాల్ వ్రాసుకున్న ఆత్మకథ ‘మహాత్మా గాంధీ ది లాస్ట్ ఫేజ్’ లో కొన్ని వాక్యాలను గుహ ఉదహరించారు. ‘ సంఘ్ ఒక మతతత్వ, ఫాసిస్టు సంస్థ. హిందూ రాజ్ ను ఏర్పాటు చేయడమే దాని ప్రకటిత లక్ష్యం. ముస్లిములందరినీ భారత్ నుంచి పంపించి వేయాలి అనేది దాని నినాదం’ అని ప్యారేలాల్ వ్రాసుకుంటే దాన్ని గాంధీ అభిప్రాయంగా వ్యాసకర్త ఆపాదిస్తూ సంఘ్ పై తన మనసులో ఉన్న విషాన్నంతా వెళ్లగక్కారు. అప్పుడూ – ఇప్పుడూ మెజారిటీ వాదం అంటూ తన పురోగామి ముసుగులోంచి గుసగుసలు వినిపించిన రామచంద్ర గుహ చరిత్రకారుడు కానేకాదు. చరిత్ర హీనుడు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు విద్రోహం తల పెట్టేందుకు గతం తవ్వాడు. దానిని ఒక మత సంస్థగా చిత్రీకరించేందుకు గుహ చేయని ప్రయత్నం లేదు. ముస్లిములను దేశంలో లేకుండా చేసేందుకు ఆర్ ఎస్ ఎస్ సంకల్పించిందని దీర్ఘాలు తీస్తూనే మధ్యయుగాల ఇస్లాం నుంచి ఆ ఎజెండాను సంఘ్ స్వీకరించిందంటూ వ్యాసకర్త వక్రభాష్యాలు చెప్పాడు. దీన్నిబట్టి ఈ చరిత్రకారుడు అయోమయంలో పడి తన ఎజెండాను అమలు చేయలేకపోయాడని అర్థమవుతోంది. ఆర్ ఎస్ ఎస్ సేవా కార్యక్రమాలను గాంధీ బృందం మెచ్చుకుందని వ్రాసిన గుహ వెనువెంటనే గాంధీ వ్యాఖ్య అంటూ ప్యారేలాల్ పుస్తకం నుంచి ఉటంకించడం పూర్తిగా సంఘ్ కు విద్రోహం తలపెట్టే పనిలా కనిపిస్తోంది.
ఆయన వ్యాఖ్యానించినట్టు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మత సంస్థ కాదు. దానిది మెజారిటీ వాదం అంతకన్నా కాదు. భారతదేశ విధానమైన ‘ భిన్నత్వంలో ఏకత్వం’ నే ఆర్ ఎస్ ఎస్ సమర్ధిస్తోంది. అన్ని మతాల వారితోనూ సుహృద్భావ పూర్వకంగా వ్యవహరిస్తూ సమత, మమత పెంచేలా మత సామరస్యానికి పాటుపడడం సంస్థ లక్ష్యం. అన్ని మతాలను కించపరచడాన్ని తప్పుగా భావిస్తుంది. అన్యమత ప్రచారం చేయకూడదనే లక్ష్యానికి సంఘ్ నాటికీ నేటికీ కట్టుబడి ఉంది. జిహాదీలను ప్రోత్సహించరాదనేది ఆర్ ఎస్ ఎస్ బలమైన వాదన. మేధావుల ముసుగు వేసుకొని హిందూ మతాన్ని కాలగర్భంలో కలిపేయాలనే కుట్రల్ని ఎదిరించి పోరాడేది మత సంస్థ అయితే సంఘ్ ముమ్మాటికీ మత సంస్థే. రాజకీయ సంస్థల ప్రోద్భలంతో చాప కింద నీరులాగా విస్తరించిన హిందూ వ్యతిరేక శక్తులపై అది నిత్యం సైద్ధాంతిక పోరాటం చేస్తూనే ఉంటుంది.
మహాత్మా గాంధీ తన నివాసానికి దగ్గరగా ఉన్నా ఆర్ ఎస్ ఎస్ శాఖను 1947లో సందర్శించారు. అక్కడున్న సంఘ్ కార్యకర్తలతో మమేకమై వారి క్రమశిక్షణ, సేవల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆర్ ఎస్ ఎస్ ఏకతా స్తోత్రాన్ని తన జీవితానికి అన్వయించుకున్నారు. అది చాలా గొప్పదైన, విలువలతో కూడిన స్తోత్రంగా మహాత్ముడు అభివర్ణించారు. సంఘ్ శాఖ సందర్శన, అక్కడ మహాత్ముడి సంభాషణల సారాంశాన్ని ‘ హరిజన్’ పత్రిక 1947 సెప్టెంబర్ 27 సంచికలో ప్రచురించారు. 1947లో సంఘ్ పై గాంధీ అభిప్రాయాలను స్పష్టంగా హరిజన్ పత్రిక ప్రకటిస్తే, అదే ఏడాది గాంధీ చేసిన వ్యాఖ్యలంటూ, వాటిని తాను విన్నానంటూ ఆయన చివరి కార్యదర్శి ప్యారేలాల్ ఆత్మకథలో వ్రాసుకున్న వాటిని ఉటంకించడం ముమ్మాటికి సందేహించదగ్గవి.
ఆర్ ఎస్ ఎస్ శాఖ సందర్శన సందర్భంగా మహాత్మా గాంధీ మాట్లాడుతూ క్రమశిక్షణతో, కులం, మతం వంటి భేదభావాలు చూడకుండా స్వయంసేవకులు నిర్భీతిగా సేవలు అందిస్తారని కొనియాడారు. 1936 లోనూ వార్ధా లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయానికి వెళ్లిన గాంధీజీ, ‘ స్వదేశీ అనేది ఓ మహత్తర ఆలోచన’ అని ప్రస్తుతించారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం, స్వదేశీ ఆలోచనలకు దగ్గరగా నేడు ఆర్ఎస్ఎస్ చేపడుతున్న స్వదేశీ మంచ్ ఉంది. సంఘ్ ప్రార్ధనలు భరతమాత గొప్పతనం, హిందూ సంస్కృతి సంప్రదాయాల పట్ల మరింత గౌరవం పెంచేలా ఉన్నాయని మహాత్ముడు మెచ్చుకున్నారు. సంఘ్ సేవాభావం, దేశం కోసం చేస్తున్న త్యాగాలను బాపూజీ కొనియాడారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఇటువంటి సంస్థలు మాత్రమే దేశ సంక్షేమానికి పాటుపడే బలమైన శక్తులుగా ఎదుగుతాయని అభిప్రాయపడ్డారు. మహాత్ముడి ఆత్మలా సంఘ్ కార్యకలాపాలు కొనసాగేవి. ఆయన చివరి వరకూ సంఘ్ తో సుహృద్భావ స్నేహాన్ని కొనసాగించారు. ఆర్ ఎస్ ఎస్ ఆరంభమైన నాటి నుంచి నిరాఘాటంగా సాగిన కార్యక్రమాలు 1948లో మహాత్మా గాంధీ మరణించిన తర్వాత వారం రోజులు నిలిపివేశారంటే ఆయనకు ఎంత విలువనిచ్చేవారో అర్థం అవుతోంది. మహాత్మా గాంధీ మరణించిన తరువాత సంఘ్ ను కొన్ని నెలలపాటు నిషేధించారు. ఆయన హత్య కేసు విచారణ సందర్భంగా గాడ్సేకి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాదోపవాదాలు విన్న తర్వాత గాంధీపై గాడ్సే పెంచుకున్న ద్వేషం పూర్తిగా ఆయన వ్యక్తిగతం అనే అభిప్రాయానికి వచ్చిన న్యాయస్థానం సంఘ్ పై నిషేధాన్ని ఎత్తివేసింది. మహాత్ముడి ఆశయాల మాదిరిగానే సంఘ్ భారతదేశ ఆత్మగా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంటుంది.
– వి. జయప్రకాశ్ నారాయణ
(చైర్మన్, సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డ్)
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో…..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post చరిత్రకారుడు కాదు చరిత్ర హీనుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.