Line of Control (LoC) – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్​పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు!
న్యూఢిల్లీ: భార‌త దేశంపై మ‌రో కుట్ర జ‌రిగింది. దీని ఫ‌లిత‌మే స‌రిహ‌ద్దుల్లో దాదాపు 135 ఉగ్ర‌వాదులు దేశంలోకి చొర‌బ‌డేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేర‌కు బీఎస్‌ఎఫ్​ కశ్మీర్​ ఇన్‌స్పెక్టర్​ జనరల్​ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి న‌క్కి ఉన్నార‌ని, ఈ నేపథ్యంలో భారత్​-పాక్​ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది గణతంత్ర వేడుకలే వీరి ల‌క్ష్యంగా ఉన్నాయ‌ని రాజాబాబు సింగ్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం నాడు ముష్కరులు దాడులకు తెగబడే అవకాశాలున్నట్టు వచ్చిన హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో బలగాలను మోహరించినట్టు వివ‌రించారు. అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ బీఎస్​ఎఫ్ విస్తృతమైన యాంటీ టన్నెలింగ్ డ్రైవ్​, ప్రత్యేక పెట్రోలింగ్, డెప్త్ ఏరియా డామినేషన్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితులు శాంతియుతంగానే ఉంద‌న్నారు.

“దేశంలో చొరబడేందుకు ఎల్​ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో 104 నుంచి 135 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమచారం అందింది. కొందరు గైడ్‌లు నియంత్రణ రేఖ దాటి ఆ వైపునకు వెళ్లారు. వారు తిరిగి వచ్చినప్పుడు పర్యవేక్షిస్తాం. వారి కుటుంబాల కదలికల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది” అని బీఎస్​ఎఫ్​ ఐజీ పేర్కొన్నారు.

చొరబాట్లకు వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచినట్లు రాజాబాబు తెలిపారు. తాలిబన్లు చొరబడే ప్రమాదమున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ఇప్పటివరకు దానిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అయినప్పటికీ గట్టి నిఘా ఉంచినట్టు పేర్కొన్నారు. డ్రోన్​ ముప్పు ఉన్నట్టు తెలిపారు. “గతేడాది కూడా డ్రోన్లను గుర్తించాం. కానీ ఎవరూ మన భూభాగంలోకి ప్రవేశించలేదు. ఈ ఏడాది తగిన చర్యలు తీసుకుంటున్నాం. యాంటీ డ్రోన్​​ విధానాలతో ద్వారా సమర్థంగా ఎదుర్కొంటాం” అని రాజాబాబు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్​పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎల్‌ఓసీ దరి కోవెలకు గణేష్‌ విగ్రహం తరలింపు
సైనికుల భద్రతే తనకు ముఖ్యం… మహిళా భక్తురాలు కిరణ్బాలా ఇషర్‌

ముంబై: వినాయక చవితి సమీపిస్తుండడంతో భారతదేశ వ్యాప్తంగా పూజా సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జమ్మూకశ్మీర్‌లోనూ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గణపతి పూజ నిమిత్తం తాజాగా పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి) సమీపంలో ఉన్న దేవాలయంలో పెట్టేందుకు ‘ఇండియా-పాకిస్తాన్‌ బోర్డర్‌ చ రాజా’ అని పిలువబడే వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తున్నాయి.

వినాయక చవితి ఉత్సవానికి సంబంధించిన విగ్రహాన్ని ముంబై నుండి పూంచ్‌కు రవాణా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆరేళ్ళుగా ప్రోగ్రెసివ్‌ నేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న కిరణ్బాలా ఇషర్‌(ఈమెను ‘ఈశ్వర్‌ దీదీ’ అని కూడా పిలుస్తారు) సైనికులు, వారి కుటుంబాల భద్రత కోసం పూచ్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు, నా కుటుంబానికి గణపతి బప్పపై ప్రత్యేక నమ్మకం ఉంది… నేను సైన్యం నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాను… ఇటువంటి గణపతి బప్ప విగ్రహాలను ఆరేళ్ళుగా ముంబై నుండి తీసుకువెళ్తున్నాను. ఇది నాకు ముఖ్యమైన పండుగలలో ఒకటి… సైనికులు, వారి కుటుంబాల భద్రత కోసం బప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది’ అని ఇషర్‌ చెప్పారు.

‘మన దేశ సైనికులకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను, అడ్డంకులను వినాయకుడు సంపూర్ణంగా తొలగించాలని నా కోరిక. గణపతి బప్ప కూడా భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతను తగ్గించాలని నా కోరిక. ఇరు దేశాలు సుభిక్షంగా, సురక్షితంగా జీవించగలవు’ అని ఆమె అన్నది.

కళాకారుడు విక్రాంత్‌ పాండ్రే ఆరేళ్ళుగా ముంబైలోని కుర్లాలోని తన వర్క్‌షాప్‌లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ ఏడాది గణేష్‌ విగ్రహానికి పాండ్రే ప్రత్యేక అలంకరణలు చేశారు. గణపతి బప్ప వెనుక, పాండ్రే ఇనుప తీగలతో ఫెన్సింగ్‌ను పెట్టారు. విగ్రహం వెనుక కాశ్మీర్‌లోయ అందాలను చూపించే పెద్ద బ్యానర్‌ కూడా ఉంది. సరిహద్దు నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ వర్ణన కూడా ఉంది.

అలంకరణ గురించి ఇషర్‌ మాట్లాడుతూ, ‘బప్పా ఇండియా పాకిస్తాన్‌ సరిహద్దుకు వెళుతున్నందున, ఈ దృశ్యం ద్వారా ముంబైలో నివసిస్తున్న ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము… ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కేవలం 600 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తాలిబాన్‌ స్వాధీనం చేసుకుంది. ఆ దేశం, అక్కడ నివసించే ప్రజల భయం గురించి మేము ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము’ అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎల్‌ఓసీ దరి కోవెలకు గణేష్‌ విగ్రహం తరలింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.