LEGAL RIGHTS PROTECTION FORUM – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏపీ సర్కార్‌కు ఎస్సీ కమిషన్‌ నోటీసు!
మత మార్పిడులపై వివరణ ఇవ్వడంలో జాప్యం

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజాగా నోటీసు జారీ చేసింది.

ఆంధ్రాలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత మార్పిడులపై గతంలో లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌, దాని అనుబంధ సంస్థ అయిన ఎస్సీ-ఎస్టీ రైట్స్‌ ఫోరమ్‌ జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిక సమర్పించారు. ఈ మతమార్పిడులను ఎస్సీలపై జరుగుతున్న సాంస్కృతికపరమైన దాడిగా అభివర్ణిస్తూ పంపిన నివేదిక అనేక కీలక అంశాలు పొందుపరిచారు. షెడ్యూల్డ్‌ కులాల సంస్కృతీసంప్రదాయాలు కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆ పనిచేయకపోగా మతమార్పిడుల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయని కమిషన్‌కు తెలిపారు. దీనికి స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్‌ ఈ అంశంలో చర్యలు తీసుకుని ఆ చర్యల తాలూకు నివేదిక తమకు పంపాల్సిందిగా గత జూన్‌ నెలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపిన నోటీసులో స్పష్టం చేసింది.

ఎస్సీ కమిషన్‌ నుండి నోటీస్‌ అందుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఎస్సీలలో జరుగుతున్న మతమార్పిడులపై ఒక సర్వే తలపెట్టినట్టు వార్తలు వచ్చాయి. ప్రతి మండలం/మున్సిపాలిటీ స్థాయిలో ఎస్సీ కాలనీలలో ఉన్న చర్చిల వివరాలు, ఎస్సీలుగా ఉంటూ క్రైస్తవ ఆచార వ్యవహారాలు పాటిస్తున్న వారి వివరాలు ఈ సర్వే ద్వారా సేకరించడానికి సన్నద్ధమైనట్టు సమాచారం.

అయితే, నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్‌కు తమ సమాధానం పంపకపోవడంతో కమిషన్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీ సర్కార్‌కు ఎస్సీ కమిషన్‌ నోటీసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో నిర్మితమైన చర్చి వివరాలు ఫీల్డ్ లెవెల్ సర్వే చేపట్టి తమకు 5 రోజుల్లోగా అందించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అన్ని జిల్లా విభాగాలను ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని క్రైస్తవ మతమార్పిడులు సాగుతున్నాయని, ఎస్సీ కులాలకు చెందిన సంస్కృతీ సాంప్రదాయాలపై దాడి జరుగుతోందన్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, ఎస్సీ-ఎస్టీ  రైట్స్ ఫోరమ్ సంస్థలు సంయుక్తంగా సమర్పించిన నివేదికపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మతమార్పిళ్ల వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని, వాటి వివరాలు 15 రోజుల్లో తమకు సమర్పించాల్సిందిగా కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి పంపిన నోటీసులో కోరింది. లేని పక్షంలో తమకున్న విశేషమైన సివిల్ కోర్ట్ అధికారాలు ఉపయోగించుకుని తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని కూడా నోటీసులో పేర్కొనడం విశేషం.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక ‘సర్వే’ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే మొత్తం 13 జిల్లాల అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. జిల్లాలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లకు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఓ మెమో జారీచేశారు. మునిపాలిటీలలో, మండలాల్లో ఎన్ని చర్చిలున్నాయో లెక్క తీయాలన్నారు. కొన్ని ఎస్సీ కాలనీలకు వెళ్లి వారు హిందూమతాన్ని ఆచరిస్తున్నారా… క్రైస్తవం స్వీకరించారా? తెలుసుకోవాలని… ఐదు రోజుల్లోపు ఈ నివేదికలను అందించాలని ఆదేశించారు.

అభ్యంతరం వ్యక్తం చేసిన కమ్యూనిస్టులు:

ఎస్సీలకు దక్కాల్సిన హక్కులు, రిజర్వేషన్లు మతం మారిన క్రైస్తవులకు దక్కుతుండటంపై జరుపుతున్న ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించింది. ఈ ప్రక్రియ అనవసర వివాదాలకు తావిస్తోందని, ఇది ఎస్సీల్లో చీలికలు తీసుకువస్తుందని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

సీపీఐ లేఖపై ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ ఆగ్రహం:

ప్రభుత్వం ప్రారంభించిన సర్వేపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)పై ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు మతమార్పడుల ద్వారా ఎస్సీల సంస్కృతీ సాంప్రదాయాలపై దాడి చేశారని, ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు ఇక కాలం చెల్లిందని, ఇలాంటి చర్యలు ఇకపై సాగనివ్వం అని ఫోరమ్ తమ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

మేము కూడా నివేదిక సమర్పిస్తాం: లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ప్రకటన

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వాగతించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల అక్రమ చర్చిల వివరాలు తాము అధికారికంగా సేకరించాము. వీటిలో ఎస్సీ కాలనీల్లో నిర్మించిన అనేక చర్చిలు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎస్సీ కమిషనుకు అందజేసే నివేదికతో పాటు మేము కూడా తమ నివేదిక  జాతీయ ఎస్సీ కమిషనుకు అందజేస్తాం అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పేర్కొంది.

Source : NIJAM TODAY

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు
సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు, దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేందుకు దేశంలోని ఓ క్రైస్తవ సంస్థ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ విశ్లేషణాత్మక పరిశోధనలో బయటపెట్టింది.

Lodged complaint with Ministry of Home Affairs against ‘Persecution Relief’ for sending false reports to international agencies resulting in India being declared as a country dangerous for Religious Minorities by @USCIRF.

Routine crimes like ..1/3 pic.twitter.com/GNYxRrbjv1

— Legal Rights Protection Forum (@lawinforce) December 1, 2020

దీనికి ముందు మనం అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో అన్ని దేశాలలో మతపరంగా మైనారిటీలుగా ఉన్న ప్రజల, మరీ ముఖ్యంగా క్రైస్తవుల సామజిక, ఆర్ధిక, సాంఘిక స్థితిగతులపై, వారి భద్రతపై అధ్యయనం చేసి, ఆయా దేశాలు ఆ మైనారిటీలకు ఎంత వరకూ సురక్షితమనే విషయమై నివేదికలు ప్రచురించడం, దేశాలకు ర్యాంకింగులు ఇవ్వడం పనిగా పెట్టుకున్న సంస్థ ఇది. ఈ అమెరికన్ ప్రభుత్వ సంస్థ ఇటీవల తమ నివేదికలో భారతదేశాన్ని “మతపరమైన మైనారిటీలకు ప్రమాదకరంగా ఉన్న దేశాల్లో 15వ స్థానం” అని ప్రకటించింది. దీన్నేCountries of Particular Concern (CPC) గా అది వ్యవహరిస్తుంది. ఈ దేశాల జాబితాలో భారత్ ముందు స్థానాల్లో బర్మా, చైనా, ఇరాక్, ఉత్తర కొరియా, పాకిస్థాన్ తదితర దేశాలున్నాయి. భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా క్రైస్తవులపై మెజారిటీ హిందువులు అకారణంగా దాడులకు పాల్పడటం, క్రెస్తవ ప్రచారానికి అడ్డుపడటం, క్రైస్తవుల ఆచారవ్యవహారాలు పాటిస్తున్నందుకు చంపేయడం, మారణహోమం సృష్టించడం, మానవహక్కులను కాలరాయడం వంటివి చేస్తున్నారనేది ఈ అమెరికన్ సంస్థ ఆరోపణ. తమ ఆరోపణలకు మద్దతుగా ఈ సంస్థ ప్రతియేటా వెలువరించే వార్షిక నివేదికలో, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగే కొట్లాటలు, హత్యలు, ఊరి తగాదాలు, కుటుంబ తగాదాల వంటి ఘటనలు ఉటంకిస్తూ, ఎక్కడైతే గాయపడ్డవారు మైనారిటీలు, నిందితులు మెజారిటీ మతస్థులుగా ఉంటారో కేవలం ఆ ఘటనలు ఉదాహరణలుగా చూపిస్తుంటుంది.

ఇప్పుడు భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న మరొక క్రైస్తవ సంస్థ గురించి తెలుసుకుందాం.. ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ (Persecution Relief) – ఈ పేరుకు అర్ధం ‘హింస నుండి స్వాంత్వన’ చేకూర్చటం. మెజారిటీ మతస్థుల మతపరమైన హింసలో బాధితులుగా మారుతున్న దేశంలోని క్రైస్తవులకు స్వాంత్వన చేకూర్చడం ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్టు చెప్పుకుంటుంది.

దేశంలోని మతపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత క్రైస్తవుల కోసం పోరాటం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ, దేశంలోని ఏ మూలన అయినా మెజారిటీ హిందువులు క్రైస్తవులపై అకారణంగా దాడులు జరిపితే వాటిని బహిర్గతం చేస్తాం, బాధితుల తరఫున పోర్టాటం చేస్తాం అని ప్రచారం చేసుకుంటుంది. దీని ప్రధానమైన పని ఏమిటంటే.. దేశంలో ఎక్కడైనా, ఏదైనా కారణం వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య, ఏదైనా సమస్య కారణంగా ఊరిలోని ప్రజల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య జరిగే కొట్లాటలు, హత్యలు వంటి సంఘటనల్లో క్రైస్తవులు ఎవరైనా బాధితులుగా ఉన్నారా? అనేది ముందుగా సరిచూసుకుంటుంది. ఒకవేళ దాడిలో గాయపడినవారిలో క్రైస్తవులు, నిందితుల్లో హిందువులు ఉన్నట్లైతే అటువంటి ఘటనలను ఒక క్రమపద్ధతిలో పొందుపరిచి రిపోర్ట్ రూపంలోకి తీసుకొస్తుంది. చివరిగా ఆ రిపోర్ట్ అమెరికాలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన USCIRFకు చేరవేస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా అమెరికన్ సంస్థ భారతదేశం మీద ఆంక్షలు విధించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.

తాజాగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ పెర్సిక్యూషన్ రిలీఫ్ అమెరికన్ క్రైస్తవ సంస్థలకు సమర్పిస్తున్న నివేదికలపై దృష్టి సారించింది. నివేదికలో పొందుపరుస్తున్న ‘క్రైస్తవులపై మతపరమైన దాడులలో నిజానిజాలు ఎంతమేరకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది.

పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న ఘటనల్లో నుండి బాధితులు మరణించిన 8 కేసుల మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యయనం చేసింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే తేలిన విషయం ఏమిటంటే.. ఆ ఎనిమిది కేసులలలో ఎలాంటి మతపరమైన అంశాలూ లేవు. కేవలం బాధితులు మాత్రం క్రైస్తవ మతానికి చెందిన వారు. దీన్ని అదనుగా చూపించి, దేశంలో క్రైస్తవుల మీద హిందువులు హింసాయుత సంఘటనలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ అమెరికాలోని పలు క్రైస్తవ మిషనరీ సంస్థలతో పాటు, లాబీయింగ్ గ్రూపులకు, USCIRFకు నివేదిక పంపడం, ఇటువంటి తప్పుడు నివేదికల ఆధారంగా భారతదేశాన్ని “మైనారిటీలకు ప్రమాదకరమైన దేశాల” జాబితాలో చేర్చడం వంటి విషయాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. తక్షణమే పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ పేర్కొంటున్న కేసుల్లోని నిజానిజాలపై దర్యాప్తు చేసి, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.

పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న అవాస్తవాలలోని కొన్ని ఘటనలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు వివరించింది.

1. ఒడిశాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో యువకుడి హత్య :

ఓడిశాలోని మల్కన్-గిరి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో ఓ 18 ఏళ్ల యువకుడిని స్థానికులు హత్యచేశారు. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక కధనం ప్రకారం..  ఘటన అనంతరం పోలీసులు యువకుడి శరీర అవయవాలు ఘటనా స్థలం నుండి వెలికితీశారు. ఘటనలో నిందితులంతా ఒకే గిరిజన గ్రామానికి చెందిన వారు. అంతే కాదు, వారిలో కొందరు మృతుడికి బంధువులు కూడా ఉన్నారు.

ఇదే ఘటనను “ఎవాంజెలికల్ ఫోకస్’ అనే క్రైస్తవ వెబ్సైట్ దీనికి మతం రంగు పులిమి  “16 ఏళ్ల క్రైస్తవ బాలుడిని కొట్టి చంపిన హిందువులు” అనే శీర్షికతో ప్రచురించింది.

దీన్ని పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో “14ఏళ్ల బాలుడు మత ఛాందసవాదుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు” అని వ్రాసింది. చేతబడి కారణంగా గ్రామంలో కొందరు చేసిన హత్యకు మతం రంగు పులిమింది.

2. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సహదేవ్ సామ్రాట్ అనే వ్యక్తి హత్య:

బీజాపూర్ జిల్లా తోతాపరా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహదేవ్ సామ్రాట్(30) ఓ పెళ్ళికి వెళ్లి వస్తుండగా భైరంగర్హ్ పట్టణంలోని కోస్టాపరా గ్రామంలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అని ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

నిజానికి నక్సలైట్లు ఎవరినైనా హత్యచేసినప్పుడు ఎందుకు హత్యచేస్తున్నామో వివరిస్తూ ఘటనా స్థలంలో ఒక లేఖ వదిలిపెట్టి వెళతారు. కానీ ఇక్కడ హత్య జరిగిన ప్రదేశంలో అలాంటి  లేఖ ఏదీ లేదు. కాబట్టి ఇది నక్సలైట్ల చర్య కాదు, మరే ఇతర కుటుంబ కారణాలు అయివుండొచ్చు అని పోలీసులు భావించారు.

అనంతరం న్యూస్ 18 వార్తా కథనం ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి భార్య బ్రతికుండగానే మరో వివాహం చేసుకున్నాడని, దీనిపై కుటుంబంలో చెలరేగిన తగాదాల వల్ల జరిగిన గొడవలో అతడు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని బయటపెట్టింది.

కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ మాత్రం తమ నివేదికలో.. “48 ఏళ్ల సహదేవ్ సామ్రాట్ అనే గిరిజనుడు క్రైస్తవం స్వీకరించినందుకు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో నక్సలైట్లు చంపేశారు” అని వ్రాసింది.

నిజానికి క్రైస్తవం తీసుకున్నందుకు నక్సలైట్లు చంపడం అనే ఘటన భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు.

3. ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ హత్య

ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ అనే వ్య‌క్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు హ‌త‌మార్చారు. అయితే స‌బ్రాంగ్ అనే వామ‌ప‌క్షమీడియా పోర్ట‌ల్ “రామ్ గోండ్ అనే వ్యక్తి క్రైస్త‌వ మతం స్వీకరించినందున అతనిని త‌ల న‌రికి చంపేశారు” అని ప్రచురించింది. పైగా హిందూ మతోన్మాదులే స్వయంగా నక్సలైట్లకు ఆయుధాలు అందించి ఈ హత్య చేయించారు” అని వ్రాసింది. అంతేకాకుండా నిందితులైన హిందువులను రక్షించడం కోసం పోలీసులు ఈ హత్యలో నక్సలైట్ల పాత్రను జోడించారనిచార‌ని కూడా ఆ కధనంలో పేర్కొంది.

పైన పేర్కొన్న కధనమనే నిజమైతే, నక్సలైట్ చరిత్రలో వారు తమ మాజీ సహచరులలో ఒకరిని చంపడానికి హిందువుల నుంచి  ఆయుధాలు తీసుకున్న మొదటి ఘటన ఇదే అవుతుంది.  దీనిపై ఆసియా న్యూస్‌ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన పెర్సిక్యూషన్ రిలీఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షిబు థామస్.. అనంత్ రామ్ గోండ్ 9నెలల క్రితం క్రైస్తవ మతంలోకి మారాడ‌ని, రెండు నెలల క్రితం బాప్టిజం పొందాడ‌ని, దీంతో ఆ గ్రామంలో హిందువులు అత‌నిపై కోపంతో చంపేశార‌ని, పైగా న‌క్స‌లైట్ల చంపేశార‌ని చెబుతున్నార‌ని” చెప్పాడు.

సబ్రాంగ్, పెర్సిక్యూషన్ రిలీఫ్ చెబుతున్న విష‌యాల్లో చాలా అవాస్త‌వాలున్నాయి. త‌మ రహస్యాలను పోలీసులకు చెబుతార‌నే భయంతో బాధితుడు అనంత్ రామ్ గోండ్‌ను నక్సలైట్‌లు చంపారని మరోపక్క ఇదే పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తన స్వంత ఫేస్‌బుక్ పోస్టులో స్పష్టంగా రాసింది.

4: చత్తీస్ గఢ్ లో ముంగ్లు రామ్ నురేటి హత్య

చత్తీస్ గఢ్ లోని కోహ్కమెట గ్రామానికి చెందిన ముంగ్లు రామ్ నురేటి అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు చంపేశారు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ హిందువులపై నింద‌లు వేయ‌డానికి సిద్ధమైంది.

“ముంగ్లు రామ్ నురేటి  క్రైస్తవ మ‌తాన్నిపాటించడాన్ని వ్యతిరేకించిన గ్రామస్తులు అతన్ని పోలీసు ఇన్ఫార్మర్ అంటూ మావోయిస్టులకు తప్పుడు సమాచారమిచ్చారు. మూడేండ్ల క్రితం జంతు భావ‌జాలం క‌లిగిన గిరిజ‌న తెగ నుంచి ఆయ‌న క్రైస్త‌వంలోకి వ‌చ్చాడు” అంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2019 వార్షిక నివేదికలో పేర్కొంది. గిరిజన మత విశ్వాసాలను “జంతు భావాజాలం క‌లిగిన ” అంటూ అవమానించడాన్ని మనం ఈ నివేదిక‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఈ కేసులో బాధితుడి కుమార్తె ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకమైనది. మృతుడి కుమార్తె దివ్య మాట్లాడుతూ  “నా తండ్రి ఇన్ఫార్మర్ కాదు. అతను ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న సాధారణ వ్యక్తి. పోలీసులు, నక్సలైట్టు  ఇద్దరూ మా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడతారు. అంత మాత్రాన గ్రామస్తులు వారిలో ఎవరికైనా సమాచారం ఇచ్చేవారని దీని అర్థం కాదు” అని తెలిపింది.

5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుబ్బరావమ్మ అనే వృద్ధురాలి హత్య:

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక వృద్ధురాలిని యువకుడు హతమార్చాడు. తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  కానీ ఈ వార్తలను పెర్సిక్యూషన్ రిలీఫ్ వక్రీకరించింది.  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2018 వార్ష‌క నివేదిక‌లో ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. “హిందూ దేవాలయ పూజారి, గ్రామ సర్పంచ్ యొక్క ప్రేరణతో వృద్ధురాలు చంప‌బ‌డింది” అని పేర్కొంది. ఇది పోలీసు నివేదిక‌ల‌కు పూర్తి విరుద్ధం.

ఇదే కేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల శిల్పిని అరెస్టు చేసినట్లు, నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు ఆ జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ఈ విషయమై ఎస్పీ మాట్లాడుతూ..  “అతను రోజూ ప్రాంతంలోని ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, నేరం జరిగిన రోజు అతను.. యువ‌తి అనుకుని వృద్ధురాలు ఉండే గ‌దిలోకి వెళ్లాడు.  అతను ఆమెను బ‌ల‌వంతం చేయబోగా ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆ వృద్దురాలి త‌ల‌పై క‌ర్ర‌తో  కొట్టాడు. తీవ్ర గాయాల‌తో ఆమె మ‌ర‌ణించింది. అనంత‌రం విశాఖపట్నంలోని ఒక ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకుంటున్న అత‌న్నిమార్చి 23 న మేము అదుపులోకి తీసుకున్నాము. ” అని ఎస్సీ వెల్ల‌డించారు. “ఎఫ్ఐఆర్లో నిందితుల పేరు ప్రస్తావించలేము. ఎందుకంటే, నేరం జరిగిన సమయంలో, అతను ఆమెను చంపాడని మేము నిర్ధారించలేదు. ఈ కేసులో మతపరమైన కోణం లేదు. నిందితుడు మానసిక  రోగి,  పైగా లైంగిక‌దాడికి పాల్ప‌డి ఆమె ప్ర‌తి ఘ‌టించ‌డంతో ఆమెను కొట్టాడు” అని ఎస్సీ స్పష్టం చేసారు.

6: తమిళనాడులో పాస్టర్ గిడియాన్ పెరియసామి హత్య

త‌మిళ‌నాడులోని గిడియాన్ అనే ఒక క్రైస్తవ పాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌నను పెర్సిక్యూషన్ రిలీఫ్,  ఇతర క్రైస్తవ సంస్థలు ‘క్రూరమైన హత్య’ అని వక్రీకరించాయి. తమిళ దినపత్రిక దినమలార్ దీనిని ఆత్మహత్య కేసుగా నివేదించింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇది ఆత్మహత్యే అని నివేదించింది. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ‘మెజారిటీ మతస్థులు దారుణంగా కొట్టి, హింసించి హ‌త్య చేశార‌ని’ త‌న నివేదిక‌లో పేర్కొంది.

అంతే కాకుండా సంఘటన జరిగిన 2 రోజుల్లోనే www.change.org సైట్‌లో హిందూ సంస్థలు,  వ్యక్తులపై బలమైన ఆరోపణలతో ఆన్‌లైన్ పిటిషన్ తయారు చేయబడింది. ఇందులో ‘క్రిస్టియన్ మైనారిటీ, దళిత పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామిని 2018 జ‌న‌వ‌రి 20న హత్య చేశార‌ని, అందులో నలుగురు నిందితులు హిందూ మున్నాని, ఉన్న‌త కులాల‌కు చెందిన హిందూ మతోన్మాదులని” పిటిష‌న్‌లో  పేర్కొంది. మరణించిన పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామి గురించి తమిళంలో 25 నిమిషాల నిడివి గల వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.  ఇందులో గ్రాహం స్టెయిన్స్ చిత్రం, అతని హత్య కథనం యొక్క దృశ్యాలతో వీడియో రూపొందించారు. అతని అంత్యక్రియల‌తో పాటు గ‌తంలో జ‌రిగిన ఘర్షణల దృశ్యాలను ఇందులో ఇమిడ్చి భావోద్వేగాలను రేకెత్తించడానికి, పాస్టర్ గిడియాన్‌ను నిజంగా హిందూవులే  హత్య చేశారని చెప్ప‌డానికి ఈ వీడియో ద్వారా పెద్ద కుట్ర చేశారు. అంతర్జాతీయ క్రైస్తవ వెబ్‌సైట్‌లు ఈ వార్తలను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాయి.

పోలీసులు నేరంపై దర్యాప్తు చేయక ముందే,  పెర్సిక్యూషన్ రిలీఫ్ హ‌త్య‌ను వక్రీక‌రించేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నించింది. చివ‌రికి ఇది ఆత్మహత్య కేసు అని స్ప‌ష్టంగా తేలింది. మృతుడు మెడ‌కు వేసుకున్న తాడు బిగుసుకుపోయి గొంతు, మెడ చుట్టూ రక్తం గడ్డకట్టడంతో ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్టు తెలింది. కానీ అతని శరీరంపై రక్తం యొక్క ఇతర ఆనవాళ్ళు లేవు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌న త‌ప్పుడు నివేదిక‌లతో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించింది.

7: ఒడిశాలో పాస్టర్ సాన్వి హత్య

ఒడిషాలో పాస్ట‌ర్ సాన్వి హ‌త్య ఘటనను పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ కేసుకు సంబంధించి త‌న నివేదికలో నేరం జరిగిన తేదీ, ప్రదేశం గురించి ప్రస్తావించలేదు. మరణించినవారి పేరు, ఇంటి పేరు లేకుండా నివేదిక రూపోందించారు. ఏ స్వతంత్ర వెబ్‌సైట్ లేదా న్యూస్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఘటన గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. సంఘటనను ధృవీకరించే ప్రాథమిక వివరాలైన ఘటనా స్థలం, నేరం చేసిన తేదీ, మరణించిన వారి పూర్తి  వివరాలు లేనప్పుడు ఇటువంటి నివేదిక‌ల ప్రామాణికతను అస్సలు ధృవీకరించలేము.

8: రాజస్థాన్‌లోని షరోన్ చర్చికి చెందిన పాస్టర్ మహేష్ హత్య

రాజ‌స్థాన్‌లోని ష‌రోన్ చ‌ర్చి పాస్ట‌ర్ మ‌హేష్ త‌న గ్రామంలో విద్యుత్ స‌మ‌స్య త‌లెత్త‌డంతో విద్యుత్ స్థంభం ఎక్కి ఫ్యూజ్ ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుదాఘాతంతో మ‌ర‌ణించాడు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ఈ ఘటనపై త‌న నివేదిక‌లో ప్రస్తావిస్తూ “పాస్టర్ మహేష్ ను క‌రెంట్ స‌మ‌స్య పరిష్కరించడానికి విద్యుత్ స్థంబం ఎక్క‌మ‌ని చెప్పి, అతను పైకి వెళ్ళినప్పుడు, కొంత మంది హిందువులు ఉద్దేశపూర్వకంగా విద్యుత్తును ఆన్ చేసి, అతడు కరెంట్ షాకుతో కింద ప‌డి చనిపోయేలా చేశారు. ఈ ఘ‌ట‌న‌పై గ్రామస్తులు సమావేశం నిర్వహించి  నిందితులకు రూ.2.50 లక్షల జ‌రిమానా విధించారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కూడ‌దని, సర్పంచ్, ఇతరులు నిర్ణయించుకున్నారు.” అని వ్రాసుకొచ్చింది.

ఇది విద్యుదాఘాతంతో మరణించిన సాధారణ కేసు తప్ప మరొకటి కాదని స్థానిక వార్తాపత్రికలు స్పష్టం చేశాయి.

హిందువుల‌పై నిరాధార అభియోగాలు మోపి, అంతర్జాతీయ సమాజం ఎదుట హిందువులను, భారతదేశాన్ని అగౌరవపరిచేందుకు పెర్సిక్యూషన్ రిలీఫ్ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆధారాలతో సహా హోంశాఖకు సమర్పించింది. సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

కొసమెరుపు:

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ సంస్థ, తమ అధికారిక వెబ్సైట్ ని మూసివేయడం గమనార్హం.

“When guilt is in its blush of infancy, it trembles in a tenderness of shame; and the first eye that pierces through the veil that hides the secret brings it to the face”

~ Thomas Southerne

Persecution Relief’s site is down!! https://t.co/FRkzQvXBFZ pic.twitter.com/sqBlG4IVAX

— Legal Rights Protection Forum (@lawinforce) December 2, 2020

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం
రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై చర్యలు తీసుకుని, ఆ చర్యల తాలూకు వివరాలు తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన ప్రధాన  కార్యదర్శికి కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కరోనా లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం స్వీకరించిన పాస్టర్లలో 70 శాతం మంది హిందూ ఎస్సీ, ఓబీసీ కులధ్రువీకరణ పత్రాలు కలిగివుండటంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) ఇచ్చిన నివేదికపై స్పందించిన కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే…. లాక్-డౌన్ సమయంలో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది. ఇదే క్రమంలో పాస్టర్లు, ఇమాంలు, అర్చకులకు కూడా కేంద్రం ఇచ్చిన కరోనా ఫండ్ నుండి రూ 5 వేలు చొప్పున ఇచ్చింది. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనాత్మక నివేదికను కేంద్ర సామజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖకు సమర్పించింది.

Union Ministry of Social Justice & Empowerment directed Principal Secretary, AP Social Welfare Dept to take action against Christian Pastors who received Rs.5K through 'Disaster Relief Fund' by holding Hindu SC/OBC Caste Certificates. Asked to submit Action Taken Report. https://t.co/RRKjV6R4CG pic.twitter.com/vVdBbSwCMi

— Legal Rights Protection Forum (@lawinforce) November 6, 2020

లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం నుండి రూ. 5వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందుకున్న 29,800 మంది పాస్టర్లలో దాదాపు 70 శాతం మంది పాస్టర్లు హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగివున్న విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ నివేదికలో వెల్లడించింది. గతంలో బాప్టిజం తీసుకుని, పాస్టర్ ట్రైనింగ్ పొందిన అనేక మంది పాస్టర్లు ఇప్పటికీ ఎస్సీ హోదా అనుభవిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.

1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం మతం స్వీకరిస్తే తన ఎస్సీ హోదా కోల్పోతాడు. కానీ ఇక్కడ  ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం పొందిన పాస్టర్లలో అనేకమంది ఎస్సీ సర్టిఫికెట్లు కలిగివుండటం గమనార్హం. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై తక్షణ చర్యలకు ఆదేశించింది.

Source : Nijam Today

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిని వారికి కూడా అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎస్సీలకు అందాల్సిన వెసులుబాట్లను ‘శాసనబద్ధమైనవి’గా, ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి ఇస్తున్న వెసులుబాట్లను  ‘శాసనేతరమైనవి’గా ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం పేర్కొంది.

ఈ జీవో ప్రకారం రాజ్యాంగం అందించే శాసనబద్ధమైన వెసులుబాటులజాబితాలో ఉండే విద్య, ఉపాధి/ఉద్యోగం మరియు ఎన్నికల్లో అవకాశంలో ప్రాధాన్యత.. ఈ మూడు మినహాయించి, ఎస్సీలకు అందే అన్ని రకాల ఇతర వెసులుబాట్లు ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తులకు అందుతాయి. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర సామాజిక న్యాయ మరియు  సాధికార మంత్రిత్వశాఖకు తమ ఫిర్యాదు పంపింది.

1950 భారత రాష్ట్రపతి ఉత్తరువు ప్రకారం ఎస్సీ హోదా కలిగిన వ్యక్తులు ఇస్లాం లేదా క్రైస్తవ మతం స్వీకరిస్తే తమకున్న ఎస్సీ హోదా కోల్పోతారనేది సుస్పష్టం. కాగా క్రైస్తవంలోకి మారి, ఎస్సీ హోదా కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా ‘శాసనేతర’ రాయితీలు కల్పించడం అనేది పరోక్షంగా మతమార్పిళ్లను ప్రోత్సహించడమేనని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అభిప్రాయపడింది. గత నాలుగు దశాబ్దాల కాలంగా ఈ జీవో ఆధారంగా ఎస్సీ ప్రజలకు దక్కాల్సిన ఉచిత భూమి/ఇళ్ళు, ఉచిత కరెంట్, వడ్డీ లేని రుణాలు వంటి రాయితీలు ఎస్సీ హోదా కోల్పోయిన క్రైస్తవులకు ప్రభుత్వాల ద్వారా చేరుతుండటంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది.

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు ప్రకారం.. జీవో నెంబర్ 341 ద్వారా ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తి  మూడు రకాల రాయితీలు పొందే అవకాశం కలుగుతోంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఎస్సీలకు అందాల్సిన(శాసనబద్ధమైనవి మినహా)  రాయితీలు/వెసులుబాట్లు

ఎస్సీ క్రైస్తవంలోకి మారితేబీసీ-సి జాబితాలో చేరుతారు కాబట్టి, వెనుకబడినవర్గాల వారికి ఇచ్చే రాయితీలు

ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్కార్పొరేషన్ అందించే సబ్సిడీలు

ఇదిలా ఉండగా.. క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు రాయితీలు కల్పించే జీవో నెంబర్ 341 అమలు విషయంలో కూడా ప్రభుత్వాలు పక్కాగా వ్యవహరిస్తున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో జారీ అయిన ఈ జీవో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో కూడా అమలు అవుతోంది. దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక జీవో అమలులో లేదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో స్పష్టం చేసింది.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, దాదాపు 80 శాతం మంది ఎస్సీలు మతం మారినట్టుగా అంచనా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అసలైన ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించే ఆర్ధిక వనరులలో సింహభాగం మతం మారిన క్రైస్తవులకు చేరుతోందని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అంచనా వేసింది. ఇది మతమార్పిళ్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న నజరానాగా కనిపిస్తోందని తమ ఫిర్యాదులో ఎల్.ఆర్.పి.ఎఫ్. పేర్కొంది.

ఈ విషయంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదు కాపీని రాష్ట్రపతి భవన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్లకు సమర్పించి, ఈ వివాదాస్పద జీవోపై తగు నాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.

Source: TheCommune & VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పోలీస్ చిత్ర హింసలు భరించలేక సాధువు ఆత్మహత్య: ఎస్సై ఆంటోనీ మైఖేల్ పై విచారణ
చనిపోయే ముందు సెల్ఫీ వీడియో

తన మరణానికి ఎస్ఐ కారణం: స్పష్టం చేసిన సాధువు

ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లు దాఖలు చేసిన హక్కుల సంఘాలు

ఒక ఎస్సై పెట్టిన చిత్ర హింసలను భరించలేక, అవమానంతో మనస్థాపానికి గురై శరవరణ్ అనే ఒక సాధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని సేలం జిల్లా సంగగిరి తాలూకా, కుండంగల్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కుడుంగల్ ప్రాంతానికి చెందిన సాధువు శరవరణ్ అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి తనకు తెలిసిన పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటాడు.

ఇలా చేయడం వల్ల అక్కడి స్థానిక క్రైస్తవులు కొందరు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఆంటోనీ మైఖెల్  ఆశ్రమానికి వెళ్ళి సాదువు శరవరణ్ పై దాడి చేశాడు. అతన్ని తిడుతూ అవమానించాడు. దీంతో మనస్థాపానికి గురైన సాధువు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 15 న అతని మృతదేహం ఒక ప్రాంతంలో లభ్యమైంది. పక్కనే అతని మొబైల్ కూడా ఉంది. అతను చనిపోయే ముందు ఒక సెల్ఫి  వీడియోను తీసుకున్నాడు. అందులో తన చావుకి ఎస్సై ఆంటోనీ మైఖెల్  కారణమని,  ఎస్సై పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ భరించలేక  ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఘటన ఆగస్టు 15న జరిగినప్పటికీ అక్కడి మీడియా సంస్థలు ఈ విషయం బయటకురాకుండా వ్యవహరించాయి. అయితే ‘న్యూస్ జె’ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. శనివారం శరవణన్ కుమారుడు శంకర్, కుమార్తె న్యూస్ జేతో మాట్లాడుతూ తమ తండ్రిపై ఎస్సై ఆంటోనీ మైకేల్ దాడి చేసినప్పుడు తాము అక్కడే ఉన్నామని, కుటుంబం ముందే దాడికి గురి కావడంతో మానసిక క్షోభకు  గురై తమ తండ్రి ఆరోజంతా ఎవరితోనూ మాట్లాడలేదని తెలిపారు.

ఆగస్టు 14 న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఆగస్టు 15న అతడి మృతదేశం సమీపంలోని అటవీప్రాంతంలో దొరికిందని తెలిపారు.  తమ తండ్రి చావుకి కారణమైన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ మరణానికి ఎస్ఐ ఆంటోనీ కారణమని సాధు శరవణన్ వీడియోలో స్పష్టం చేసినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా పోలీసు ఉన్నతాధికారులు సాధువు కుటుంబాన్ని పిలిపించి ఎస్సై ఆంటోని మంచివాడని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే కుటుంబానికి సహాయం చేస్తామని చెప్పారు.

ఎస్సై పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధిత కుటుంబాన్ని పరోక్షంగా బెదిరించడాన్ని ప్రశ్నిస్తూ హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ జాతీయ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఎస్సై మైఖేల్ ఆంటోనీపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఆ కుటుంబానికి రక్షణ కూడా కల్పించాలని తమ పిటిషన్ లో  కోరింది.

https://twitter.com/lawinforce/status/1297554079812472833/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1297554079812472833%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fvsktelangana.org%2Finquiry-against-si-anthony-michael-in-sadhu-suicide-case-in-tamil-nadu

అయితే ఇదే సమయంలో మరో కొత్తవిషయం వెలుగుచూసింది. ఎస్సై ఆంటోనీ మైఖేల్ సాధువుతో పాటు, అతడి పిల్లలను కూడా చిత్రహింసలకు గురిచేసిన విషయం బయటకు రావడంతో ముంబైకి చెందిన లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ సంస్థ జాతీయ బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. వెంటనే ఎస్సై మైఖేల్ ఆంటోనీపై జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా తమ ఫిర్యాదులో కోరింది.

https://twitter.com/LegalLro/status/1297561870149328896/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1297561870149328896%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fvsktelangana.org%2Finquiry-against-si-anthony-michael-in-sadhu-suicide-case-in-tamil-nadu

స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్:

ఎస్సై మైఖేల్ ఆంటోనీ, సాధు శరవణన్ తో పాటు అతడి పిల్లలను కూడా చిత్రహింసలకు గురిచేసాడంటూ లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ ఇచ్చిన ఫిర్యాదుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ వెంటనే స్పందించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యల వివరాలు వారం రోజుల్లో తమకు తెలియజేస్తూ నివేదిక సమర్పించాల్సిందిగా సాలెం జిల్లా ఎస్పీని బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ శ్రీ ప్రియాంక్ కానుంగో ఆదేశించారు.

https://twitter.com/KanoongoPriyank/status/1297898849181167627/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1297898849181167627%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fvsktelangana.org%2Finquiry-against-si-anthony-michael-in-sadhu-suicide-case-in-tamil-nadu

కేసులో మరో హైడ్రామా:

జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ కేసులో స్పదించిన మరుక్షణం మరో హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసులు మరణించిన సాధు శరవణన్ కుటుంబ సభ్యులను, పిల్లలను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్టు, తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాలని వేధించినట్టు తమిళనాడులో స్థానిక కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.

ట్విట్టర్ ఆరోపణలకు వెంటనే మరోసారి స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ శ్రీ ప్రియాంక్ కానుంగో వెంటనే సాధు కుటుంబాన్ని, పిల్లలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరచాలని, కమిటీ ఎదుట వాంగ్మూలం ఇప్పించాలని, కమిటీ ఆధ్వర్యంలోనే వారికి ఆశ్రయం ఏర్పాటు చేయాలని, ఈ వివరాలన్నీ వెంటనే తమకు ఇంగ్లీషు భాషలో సమర్పించాలని మరోసారి ఆదేశాలు జారీ చేశారు.

https://twitter.com/LegalLro/status/1298247259369418752/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1298247259369418752%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fvsktelangana.org%2Finquiry-against-si-anthony-michael-in-sadhu-suicide-case-in-tamil-nadu

ఎస్సైపై విచారణ మొదలు:

ఈ కేసు విషయంలో ఎస్సై పాత్ర ఏమీ లేదంటూ మొదటి నుండి బుకాయిస్తూ వస్తున్న సేలం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఒత్తిడితో ఎట్టకేలకు సాధు శరవణన్, అతని పిల్లలపై చిత్రహింసలు, అతడి ఆత్మహత్యకు కారణం అయిన ఎస్సై ఆంథోనీ మైఖేల్ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

https://t.co/2HLB3topUH?amp=1

మరో వైపు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పిటిషన్ మేరకు జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసునులో ఫిర్యాదుని రిజిస్టర్ చేసింది.

https://twitter.com/lawinforce/status/1297554079812472833/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1298486483892854784%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fvsktelangana.org%2Finquiry-against-si-anthony-michael-in-sadhu-suicide-case-in-tamil-nadu

Source : VSK TELANGANA.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోలీస్ చిత్ర హింసలు భరించలేక సాధువు ఆత్మహత్య: ఎస్సై ఆంటోనీ మైఖేల్ పై విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హోం మంత్రి సుచరిత ఎన్నికను రద్దు చేయండి : రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన LRPF
తాను క్రైస్తవురాలై ఉండీ ఎన్నికలలో SC రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎన్నికను రద్దు చెయ్యాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. తాను క్రైస్తవురాలినని, యేసు ప్రభువును ప్రార్థిస్తానని ఆమె స్వయంగా “ఐ డ్రీం మీడియా” యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. ఆ వీడియోను కూడా జత చేసి హోం మంత్రి సుచరిత రిజర్వేషన్లను దుర్వినియోగ పరచుకున్నట్లుగానూ, తాను రిజర్వు స్థానం నుంచి పోటీ చెయ్యడానికి అనర్హురాలైనప్పటికీ ఆమె తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి రిజర్వుడు స్థానం నుంచి ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు కనుక ఆమెపై అనర్హత వేటు వెయ్యవలసినదిగా రాష్ట్రపతిని కోరుతూ LRPF రాష్ట్రపతి భవన్ కు లేఖ వ్రాసింది. మేకతోటి సుచరిత తప్పుడు కుల ధృవీకరణతో పోటీ చేసినట్లుగా నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా ఆ లేఖ వెంట పొందుపరచినట్లుగా LRPF తెలుపుతోంది. ఆ మేరకు ఈ అంశాలను LRPF వర్గాలు ట్విట్టర్ ద్వారా తెలిపాయి.

Wrote to Rashtrapati Bhavan against Ms. Mekathoti Sucharita, Home Minister of Andhra Pradesh for misusing SC Status by contesting from SC Reserved Constituency (Prathipadu – Guntur District) even after converting her religion to Christianity.#Video: iDream Youtube Channel pic.twitter.com/TdYajUxQel

— Legal Rights Protection Forum (@lawinforce) August 17, 2020

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హోం మంత్రి సుచరిత ఎన్నికను రద్దు చేయండి : రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన LRPF appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెప్పేది బైబిల్ ప్రబోధం – చూపేది కామ ప్రకోపం
ప్రపంచంలో ఎక్కడ ఏ మూల చూసినా క్రైస్తవ మత ప్రచారకుల కామ పైత్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక దేశాల్లో అలాగే మన దేశంలోని అనేక రాష్ట్రాలలోని చర్చిలలో, క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో నడిచే వివిధ వసతి గృహాలు, హాస్పిటల్స్ తదితర ప్రాంతాలలో అమాయక మహిళలపైన, బాలికలపైన క్రైస్తవ పాస్టర్లు, ఫాదరీలు లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం బయటపడుతూ ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లోని డాన్ బాస్కో యూత్ సెంటర్లోని క్రిస్టియన్ ఫాదర్ మరియు చైల్డ్ లైన్ డైరెక్టర్ అయిన మిస్టర్ సిరియాక్ డాన్ బాస్కో యూత్ సెంటర్లోని చిన్నారులకు స్వచ్చందంగా సేవలు అందిస్తున్న ఓ గిరిజన వైద్య విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లోని డాన్ బాస్కో యూత్ సెంటర్ అనాథ బాల బాలికలకు వసతి, భోజన సౌకర్యాల తోపాటు విద్య, వైద్యాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. సహజంగా సేవా కార్యక్రమాలపై ఆసక్తి కలిగిన ఒక గిరిజన వైద్య విద్యార్థిని ఆ సంస్థ చేపడుతున్న సేవా కార్యకరమాలకు ఆకర్షితురాలై ఆ డాన్ బాస్కో యూత్ సెంటర్లోని చిన్నారులకు తన వంతు సేవలందించడానికి వెళుతూ ఉండేది. అయితే అందరికీ బైబిల్ సూక్తులు వినిపించే అక్కడి క్రిస్టియన్ ఫాదర్ మరియు చైల్డ్ లైన్ డైరెక్టర్ అయిన సిరియాక్ కు బుద్ధి వక్రించి ఆ యువతిపై కన్నేశాడు. అప్పటి నుంచి మెల్లగా ఆ యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. తన కోర్కె తీర్చమంటూ ఆమెను తరచూ వేధించసాగాడు.

ఎంతో గొప్ప సంకల్పంతో, ఆ సంస్థ గురించి ఎంతో గొప్పగా ఊహించుకుని ఆ సంస్థలో సేవలందిద్దామనే సదాశయంతో అక్కడికి వచ్చిన ఆ యువతి అందరినీ సన్మార్గంలో నడిపిస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే ఆ ఫాదరు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు హతాశురాలయ్యింది. తన పట్ల జరుగుతున్న ఘోరాన్ని జీర్ణించుకోలేకపోయింది. సదరు ఫాదరుపై పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మొర ఆలకించలేదు. ఆమె నుంచి ఫిర్యాదును స్వీకరించలేదు.

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ యువతి తన దీన గాధను వివరిస్తూ హైదరాబాదులోని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారికి మెయిల్ చేసింది. వెంటనే స్పందించిన లీగల రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు ఆ యువతికి జరిగిన ఘోర అవమానాన్ని జాతీయ మహిళా కమిషన్ కు నివేదించటం జరిగింది. మహిళాకమీషన్ వెంటనే స్పందించి నిందితుడిపై వెంటనే FIR ఫైలు చేసి జరిగిన ఘటనపై తమకు నివేదిక సమర్పించాల్సిందిగా కోరుతూ ఇటానగర్ జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. నిందితుడిపై SC, ST యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెప్పేది బైబిల్ ప్రబోధం – చూపేది కామ ప్రకోపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలపై చర్చిల అరాచకం
షెడ్యూల్ కులాలకు చెందిన కొన్ని కుటుంబాలు దాదాపు 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లి గ్రామ శివార్లలోనే ఉంటున్నాయి. ఈ కుటుంబాలు బుడగ జంగాల కమ్యూనిటీకి చెందినవి. మహిళలు, పిల్లలు, వృద్ధులతో పాటు చిన్న గుడిసెలలో నివసిస్తూ ఉంటారు. వారి గుడిసెలు నిరుపయోగమైన పోరంబోకు భూమిలో ఉన్నాయి. వారు చాపలు అల్లటం, సోది చెప్పటం, వివిధ వస్తువులను అమ్మడం మరియు భిక్షాటనల ద్వారా జీవనం సాగించే సెమీ సంచార సమాజం. వారు జీవనోపాధి కోసం వివిధ గ్రామాలలో  తిరుగుతారు. కొన్ని రోజుల తరువాత తిరిగి వారి గుడిసెలకు వస్తారు.

ఇలా ఉండగా, ఇటీవల కృపాకర్, అశోక్ అనే ఇద్దరు పాస్టర్లు వీరి గుడిసెలకు సమీపంలో చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత, ఈ షెడ్యూల్డ్ కుల కుటుంబాలు తమ జీవనోపాధి కోసం సమీప గ్రామాలకు వెళ్ళినప్పుడు చర్చి ప్రతినిధులు వీరి భూమిని ఆక్రమించడం ప్రారంభించారు. వారు తిరిగివచ్చిన  తర్వాత పాస్టర్లను ప్రశ్నించినప్పుడు, వారు చాలా మహిళలతో సహా అందరికీ దురుసుగా, అసభ్యమైన భాషలో సమాధానమివ్వడం ప్రారంభించారు. వారు ఆ స్థలాలను ఖాళీ చేయకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించడం ప్రారంభించారు.

స్థానిక పోలీసులు కూడా బాధితులకు సహాయం చేయడానికి బదులుగా, నిరసన వ్యక్తం చేస్తున్న వారిలో కొంతమందిని స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ కుటుంబాలను బలవంతంగా తొలగించిన చర్చి పాస్టర్లను పోలీసులు లేదా పరిపాలన అధికారులు ఎవరూ కనీసం ప్రశ్నించలేదు. చర్చి అధికారుల పలుకుబడికి పోలీసులు, ఇతర అధికారులు లొంగిపోయారు.

అక్కడ నివసిస్తున్న ఎస్సీ కుటుంబాల నిరసనల మధ్యనే చర్చి నిర్మాణాన్ని కొనసాగిస్తున్న చర్చి పాస్టర్లు

ఎల్‌ఆర్‌పిఎఫ్ జోక్యం

బాధితులు తమ అనుభవాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్‌ఆర్‌పిఎఫ్) కు వివరించారు.  అట్టడుగు వర్గాల కుటుంబాలపై చర్చి చేసిన దౌర్జన్యాలకై చర్చి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ LRPF జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) మరియు కడప జిల్లా కలెక్టర్‌ లను సంప్రదించింది.

ఎల్‌ఆర్‌పిఎఫ్ తన ఫిర్యాదు లేఖలో, చర్చి పాస్టర్లచే కుటుంబాలను తొలగించడం అనేది ‘జీవిత హక్కు’ను అణిచివేసే ఒక స్పష్టమైన కేసు అని పేర్కొంది. జీవించే కనీస హక్కుకు భారత రాజ్యాంగం తన ఆర్టికల్ 21 ప్రకారం హామీ ఇస్తుందని కూడా LRPF తన ఫిర్యాదులో పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల ప్రజలను చర్చి అధికారులు వేధింపులకు గురిచేశారంటూ ఎల్‌ఆర్‌పిఎఫ్ పేర్కొంది. జరిగిన దుర్ఘటన విషయంలో స్థానిక పరిపాలన మరియు పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండడిపోయిన విషయాన్ని కూడా LRPF అందులో ప్రస్తావించింది.

నిస్సహాయ ఎస్సీ కుటుంబాలు తమ భూమిని, ఇళ్లను కాపాడుకోవటానికి ప్రయత్నించినప్పుడు, నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్సీ ప్రజలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని ఎల్‌ఆర్‌పిఎఫ్ పేర్కొంది. “స్థానిక పరిపాలన చర్చి నిర్మాణాన్ని ఆపి, క్రైస్తవ పాస్టర్ల యొక్క అహంకారపూరిత ప్రవర్తనను అంతం చేయడం ద్వారా పేద ఎస్సీ కుటుంబాలను రక్షించడానికి అడుగులు వేయడం లేదు, పేద ఎస్సీ కుటుంబాలు వారి ఇళ్ళు, వారి జీవనోపాధి మరియు స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయాయి. భయం, ఉల్లంఘించబడింది “అని LRPF ఫిర్యాదు లేఖలో పేర్కొంది.

జాతీయ Sc కమీషన్ (ఎన్‌సిఎస్‌సి) ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఎస్‌సి కుటుంబాలు తమ గుడారాలు / గుడిసెలు వేసుకునేలా ప్రత్యామ్నాయ గృహనిర్మాణ స్థలాన్ని అందించాలని జిల్లా యంత్రాంగానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఎల్‌ఆర్‌పిఎఫ్ కోరింది. మహిళలు మరియు పిల్లలను కలిగి ఉన్న అట్టడుగు వర్గాల కుటుంబాలపై చేసిన నేరాలకు చర్చి పాస్టర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎల్‌ఆర్‌పిఎఫ్ ఎన్‌సిఎస్‌సి మరియు జిల్లా పరిపాలనను అభ్యర్ధించింది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలపై చర్చిల అరాచకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.