#Kashi – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘కాశీ తమిళ సంగమం’కు పెరుగుతున్న విద్యార్థులు
కాశీ: ‘కాశీ తమిళ సమాగం’ కార్యక్రమంలో భాగంగా, మూడో రోజుయిన సోమవారం, పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీలోని వివిధ ఘాట్‌ల వద్దకు తమిళనాడు ప్రతినిధి బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో ఘాట్‌లలో పవిత్ర స్నానం చేసిన తర్వాత, బృందాలుగా బయలుదేరి కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించుకున్నారు.

బనారసీ వంటకాలను ఆస్వాదించారు. వివిధ చేతివృత్తుల ఉత్పత్తులను పరిశీలిస్తూ, కొనుగోలు చేస్తూ గడిపారు. తమిళనాడు నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య వారణాసి రైల్వే స్టేషన్, విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో పెరుగుతోంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం వారణాసి నగరంలోని చాలా హోటళ్లు, ‘ధర్మశాలలను’ ముందుగానే బుక్ చేశారు.

తమిళనాడులోని రామేశ్వరం విద్యార్థులు మొదటిసారి వారణాసిని సందర్శించిన సందర్భంగా ‘కాశీ తమిళ సమాగం’ వేదిక వద్ద ఉత్సాహంగా కనిపించారు. కాశీ తమిళ సంగమం రూపంలో సంస్కృతి, వారసత్వ ఏకం చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చొరవను ప్రశంసించారు.

నెల రోజుల పాటు జరిగే ‘కాశీ తమిళ సంగమం’ ఉత్సవాలను ప్రధాని శనివారం ప్రారంభించారు. కాశీ-తమిళనాడు మధ్య పూర్వకాలం నుంచి ఉన్న సంబంధాన్ని తన ప్రారంభోపన్యాసంలో ప్రస్తావించిన ప్రధాన మంత్రి, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కల ఇప్పుడు వాస్తవ రూపు రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) యాంఫీ థియేటర్ మైదానంలో ప్రతిరోజూ నృత్యాలు, నాటకాలు, సంగీతం, పాటలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కాశీ స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని, తమిళనాడుకు చెందిన వివిధ వంటకాలను ఆస్వాదించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కాశీ తమిళ సంగమం’కు పెరుగుతున్న విద్యార్థులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ దర్శనీయ ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి..‌. ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్‌: హిందూ దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు.

మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్ళూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్ళే.

మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్ళే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్‌కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్‌ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్‌నాథ్, హేమ్‌కుండ్‌ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ దర్శనీయ ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి..‌. ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ
ప్రయాగరాజ్‌: దేశం మరోసారి అంతర్గత, బాహ్య సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది… స్వాతంత్ర్యానికి ముందు ఉన్న సవాళ్ళు వ‌ర్త‌మానంలోని స‌వాళ్ళు దాదాపుగా ఒక‌టే… భారతదేశాన్ని పునర్విభజన చేయాలని కలలు కంటున్న శక్తులను పెంచి పోషించే వారు ఈ దేశంలోనే దాగి ఉన్నారు… వారిని సకాలంలో గుర్తించాలి… కొన్ని రాజకీయ పార్టీలు వారికి బహిరంగ ఆశ్రయం ఇస్తున్నాయి. ఉగ్రవాదులు, రాళ్ళ‌దాడి చేసేవారి సవాళ్ళ‌ను కూడా దేశం ఎదుర్కొంటోంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ అన్నారు.

నైనిలోని మాధవ జ్ఞాన కేంద్రంలోని ఇంటర్ కళాశాలలో సంఘ‌ ప్ర‌థ‌మ శిక్షావర్గ‌ జ‌రిగింది. ముగింపు ఉత్స‌వం బుధ‌వారం నిర్వ‌హించారు. రామ్‌కుమార్ వ‌ర్మ హాజ‌రై, శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

జాతి ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ అల్లర్లకు కారణమయ్యే శక్తులను గుర్తించి, చెత్తబుట్టలో వేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అస్థిరపరిచే శక్తులు పెరిగిపోతున్నాయి. దేశం సైద్ధాంతిక సవాళ్ళ‌ను కూడా ఎదుర్కొంటోంది. అర్బన్ నక్సలైట్లు చాలా క్రమపద్ధతిలో ఇక్కడ జాతీయత, ప్రాచీన సంస్కృతి గురించి గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

భారతీయ సంస్కృతి లేదా హిందూ సంస్కృతి పేరుతో ప్రపంచం మొత్తానికి సుపరిచితమైన సంస్కృతి యొక్క తరగని ప్రవాహం ఇక్కడ ప్రవహిస్తోంది. ఈ సంస్కృతి బిలియన్ల సంవత్సరాల నాటిది. ఈ సంస్కృతి యావత్ దేశాన్ని ఐక్య‌ప‌రుస్తోంది. ఈ సంస్కృతి ప్రవాహంలో జీవిస్తున్న ప్రజలు దేశ తీర్థయాత్రల పట్ల, గొప్ప వ్యక్తుల పట్ల సమానమైన గౌరవాన్ని కలిగి ఉంటారు. భారతమాతను తమ తల్లిగా భావిస్తారు. దేశంలో వివిధ సమూహాలుగా జీవించే ప్రజల పూజా విధానం వేరుగా ఉండవచ్చు, కానీ అందరి పూర్వీకులు ఒక్కటే. అందరి పూర్వీకులు హిందువులే. హిందువు జాతీయవాదానికి ప్రతీక అని రామ్‌కుమార్ పేర్కొన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఈ దేశం నుంచి హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలను హిందుస్థానీ ముస్లింలు అని కూడా పిలుస్తారని అన్నారు. స్వామి వివేకానందను హిందూ సన్యాసి అని కూడా పిలుస్తారు. అన్ని రకాల అహంకారాలను మరచి, సామాజిక సామరస్యంతో దేశాన్ని ప‌టిష్ఠంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లార్డ్ మెకాలే విద్యను విడిచిపెట్టి, దేశభక్తిని కలిగించే విద్యను తీసుకోండి. మొత్తం మానవ సంక్షేమం కోసం హిందుత్వను ప్రచారం చేయండి. భారతదేశం ఐక్యంగా ఉంటుందని, మహర్షి అరవింద్ సంకల్పం నెరవేరుతుందని రామ్‌కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

శిక్షణ ప్రయోజనాలను సమాజానికి అందించాలి

ఇక్కడ పొందిన‌ శిక్షణ ప్రయోజనాలను సమాజానికి అందించాలని కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన రజ్జు భయ్యా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అఖిలేష్ సింగ్ స్వ‌యంసేవ‌కుల‌ను కోరారు. సమాజాన్ని కూడా వ్యవస్థీకరించండి, క్రమశిక్షణలో పెట్టండి. నిజమైన శక్తి నాయకత్వంలో కాదు, అతను నడిపించే వ్యక్తుల వద్ద ఉంద‌న్న సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్ద‌న్నారు. సంఘ్‌లో అద్భుతమైన సేవా భావం, క్రమశిక్షణ, అంకితభావం ఉన్నాయని, దీంతోనే దేశం ముందుకు సాగుతుందన్నారు. మెరుగైన వ్య‌క్తిగా మారడానికి మీ శిక్షణను ఉపయోగించుకోవాల‌ని సూచించారు.

ఆక‌ట్ట‌కున్న ప్ర‌ద‌ర్శ‌న‌లు

శిక్షణ పొందిన స్వ‌యంసేవ‌కులు పూర్ణ గ‌ణ‌వేష్ ధ‌రించి, ప్ర‌ద‌ర్శించిన వివిధ ర‌కాల విన్యాసాలు ఆహుతుల‌ను ఆక‌ట్ట‌కున్నాయి. ఈ సందర్భంగా వర్గ కార్యవాహ హరీశ్‌ మాట్లాడుతూ మూడు విభాగాల్లోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. విద్యార్థులు, రైతులు, వక్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, కార్మికులు వీరిలో ఉన్నార‌న్నారు.

Source: VSK KASHI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశం ఉగ్రవాదులు, రాళ్ళు రువ్వేవారి సవాళ్ళ‌ను ఎదుర్కొంటోంది: ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ క్షేత్ర సంఘచాలక్ రామ్‌కుమార్ వర్మ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి : కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న125 ఏళ్ల వృద్ధుడు
వారణాసికి చెందిన 125 ఏళ్ల స్వామి శివానంద ఈ వారంలో తన రెండవ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అతి పెద్ద వయస్కులు వీరే కావడం గమనార్హం.

1896లో జన్మించిన స్వామి శివానంద పశ్చిమ బెంగాల్ ‌కు చెందినవారు. ఆయన నాలుగు దశాబ్దాలుగా వారణాసిలోనే నివసిస్తున్నారు. దుర్గాకుండ్ ‌లోని సీఎంఓ కార్యాలయ ఆవరణలో ఉన్న అర్బన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఆయనకు వ్యాక్సిన్‌ వేశారు.

కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క టీకా డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్దది. డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు మొదలైన ఫ్రంట్ ‌లైన్ యోధులతో ప్రారంభించి, ఈ ఏడాది జనవరిలో దేశం కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ ‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో భారత్ ఈ మధ్యనే వ్యాక్సినేషన్ ప్రక్రియలో 100 కోట్ల మైలురాయిని సాధించిన విషయం పాఠకులకు విదతమే.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి : కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న125 ఏళ్ల వృద్ధుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు..
వారణాసి నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వారణాసి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు  రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే అందుకు సదుపాయాల్ని అందించనున్నారు. ఇక్కడ విశాలమైన పార్కింగ్ లో 120 కార్లను ఒకేసారి పార్కింగ్ చేయవచ్చు.

మూడు ఎకరాల విస్తీర్ణంలో వారణాసిలోని సిగ్రాలో దీన్ని నిర్మించారు. రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఆధునిక సాంకేతికతో 1,200 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన రెండు అంతస్తుల ఈ సెంటర్‌ను జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో దీన్ని నిర్మించారు. జపాన్ పీఎం షింజో అబే 2016లో రుద్రాక్ష్కు పునాది వేశారు. 1500 కోట్ల విలువైన పలు    అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి.
జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి వారణాసి జిల్లా కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని అనుమతించింది. నిజానికి కాశీ విశ్వనాథ్ ఆలయం మీద ఈ మశీదును నిర్మించారు.

1664 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 2000 సంవత్సరాల నాటి కాశి విశ్వనాథ్ ఆలయంలో కొంత భాగాన్ని తొలగించి జ్ఞానవాపి మశీదు నిర్మించటానప్పటి నుండి జ్ఞాన్వాపి మసీదు ఉన్న భూమి కోసం హిందువులు కోరుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ భూమిని తిరిగి హిందువులకు అప్పజెప్పాలని కోరుతూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి జిల్లా కోర్టులో దావా వేశారు.

ఈ దావాను జ్ఞాన్వాపి మసీదు కమిటీ సవాలు చేయగా, వారణాసి జిల్లా కోర్టు ఇప్పుడు మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు సర్వేను అనుమతించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, సర్వే యొక్క అన్ని ఖర్చులను ఉత్తర పెరదేశ్ ప్రభుత్వం చెల్లించాలి.

ముస్లిం సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన 5 మంది సభ్యుల కమిటీ ఈ సర్వే చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

Source : OPINDIA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీలో దేదీప్యమానంగా ‘దేవ దీపావళి’
పరమ పవిత్రమైన కాశీ మహాక్షేత్రం దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోయింది. గంగానది ఘాట్ల వద్ద వెలిగించిన 15 లక్షల దీపాలతో వారణాసి నగరం మిరుమిట్లు గొలిపింది. ప్రధాని నరేంద్రమోడీ మొదటి దీపాన్ని వెలిగించి ‘దేవ దీపావళి’ వేడుకను ఆరంభించారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. మోడీ తర్వాత ఘాట్లలో ఏర్పాటు చేసిన దీపాలను అనేక మంది భక్తులు వెలిగించారు. ఆ కాంతుల నడుమ కాశీని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు!

ఏటా కార్తీక పౌర్ణమి రోజున కాశీలో దేవ దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట కాశీ విశ్వేశ్వర లింగానికి ఆయన పూజలు చేశారు. వేద పండితులు ‘శ్రీ రుద్రం’ చదవగా గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్లరసాలతో మహాదేవుడిని అభిషేకించారు. ఆ తర్వాత రాజ్ ఘాట్ కు వెళ్లి మొదటి దీపాన్ని వెలిగించి దేవ దీపావళిని ఆరంభించారు. కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్‌ షోను వీక్షించారు. గంగా నదిలో బోటులో విహరిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అంతకుముందు ఆయన సంత్‌ రవిదాస్ కు నివాళి అర్పించారు.

కోవిడ్‌-19 వల్ల దేశంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ కాశీ ప్రభ, భక్తి, శక్తిలో ఎలాంటి మార్పులేదని ప్రధాని మోడీ అన్నారు. వందేళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణా మాత విగ్రహాలు తిరిగి భారత్ కు వస్తున్నాయని తెలిపారు. ఇదో గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. ఆ విగ్రహాలు మన అమూల్యమైన వారసత్వంలో భాగమని ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశీలో దేదీప్యమానంగా ‘దేవ దీపావళి’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశ్వేశ్వరునిలో లీనమైన జగదీశ్వరుడు “డోమ్ రాజా”
వారణాసి మహాప్రస్థాన రథసారధి హరిశ్చంద్ర ఘాట్ వంశపారంపర్య కాపరి ‘డోమ్ రాజా’ జగదీష్ చౌదరిజీ విశ్వనాధుని నిజపాదాల చెంతకు చేరారు. ఒక అద్భుతమైన వ్యక్తిని మహాదేవుడు తనదగ్గరకు పిలిపించుకున్నారు.

కాశీ “డోమ్ రాజా” గా ప్రసిద్ధి చెందిన శ్రీజగదీష్ చౌదరి గారు ఆగస్టు 25 వ తేదీన తన శరీరాన్ని వదిలి పెట్టి కాశీ విశ్వేశ్వరుని కైలాసానికి వెళ్లారు. వారి ఆత్మకు సద్గతులు కలగాలని విశ్వహిందూ పరిషత్ కోరుకుంటోంది.

కాశీలో సాధువులు, సంతు మహాత్ములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పూజనీయులైన వారంతా వచ్చారు. సభ జరుపుతున్నారు. సభా వేదికపైన అంతటి మహాత్ముల మధ్య ఒక సాధారణ గృహస్థు కూర్చొని ఉన్నాడు. అతన్ని అభినందిస్తూ, స్వాగతిస్తూ, సన్మానిస్తూ ఒక్కరొక్కరుగా స్వామీజీలు లేచి వెళ్తున్నారు పూలమాలలు మెడలో వేసి గౌరవంగా ఆ గృహస్థుకు ఆశీస్సులు అందజేస్తున్నారు. అంతటి సౌభాగ్యశాలి ఎవరు? అంతమంది స్వామీజీల యొక్క ఆశీస్సులు పొందిన వారు ఎవరు? అని సాధారణ వ్యక్తులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు.

1994వ సంవత్సరం కాశీలో జరిగిన “ధర్మ సంసద్” సందర్భంగా వేదికను అలంకరించినవారు శ్రీ జగదీష్ చౌదరి గారు.

బాల్యంలో బృందావనం, వార్ధక్యంలో వారణాసి అంటూ గానం చేసే వారణాసిలో మరణించాలని కోట్ల మంది ఆశ. ఇలా వృద్ధాప్యంలో వారణాసి చేరి అక్కడనే భౌతిక శరీరాన్ని వదిలే లక్షలాదిమంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనే నమ్మకంతో ఉంటారు. అటువంటి వారణాసిలో మరణించిన వారికి మోక్షప్రాప్తి కలగడం కోసం పనిచేసే వారుగా తరతరాలుగా అనేక యుగాలుగా వీరి కుటుంబం కాశీలో “కాటికాపరులు”గా ఉంటున్నారు.

కృతయుగంలో సాక్షాత్తు హరిశ్చంద్రుణ్ణి కొనుక్కొని పని చేయించుకున్న వీరి పూర్వీకుల చరిత్ర గొప్పది. అటువంటి గొప్ప వాళ్ళు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ముస్లింల పాలనా కాలం నుండి అంటరాని వారిగా పరిగణించబడుతుండడం బాధాకరంగా తోచిన సాధువులు, హిందూ ధర్మ పెద్దలు హిందుత్వంలో అంటరానితనమే లేదు. లేని అంటరానితనం పేరుతో మనలోవారే, మన వారే అయిన వారిని కాదనుకోవడం వేద సమ్మతం కానీ, శాస్త్ర సమ్మతం కానీ కాదని ‘అంటరానితనం పాటించడం పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపం కాదు’ అని, దాన్ని సమర్థించడం మూర్ఖత్వమని ప్రకటించారు.

అంతకు మునుపే 1968 వ సంవత్సరం ఉడిపిలో పరమ పూజనీయ మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ గారి నేతృత్వంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ ధర్మసభలో సాధుసంతులు ప్రకటించినట్లు

|| హిందవః సోదరా సర్వే నహిందుర్ పతితో భవేత్

మమదీక్షా హిందు రక్షా మమ మంత్రః సమానతా ||

(హిందువులందరూ సహోదరులు. ఏ హిందువు కూడా అంటరానివాడు కాడు. హిందూధర్మాన్ని రక్షించడమే మన దీక్ష. సమానత్వమే మన మంత్రం)

అని ప్రకటించిన క్రమంలోనే, కాశీని సందర్శించిన అనేకమంది సాధువులు, సాక్షాత్తు శంకరాచార్యులవారే ఈ కుటుంబాల ఆతిథ్యం స్వీకరించారు.

అంటరానివాళ్ళుగా ప్రచారం చేయబడిన ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సాక్షాత్తు పూజ్యులు మహంత్ అవైద్యనాథ్ గారు, పూజ్యులు అశోక్ సింఘాల్ గారు వెళ్లడమే కాక వారి ఇంట్లో పూజ నిర్వహించి భోజనం చేసి అనంతరం సాదరంగా ధర్మ సంసద్ కు కలిసి వచ్చారు.

ఇలా మనవాళ్లకు చరిత్రలో జరిగిన అవమానాన్ని ఈ తరంలో సరి చేసే ప్రయత్నం వీరి మాధ్యమంగా జరిగింది.

||స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః||

అని నమ్మిన జగదీష్ చౌదరి గారు, మతం మార్చుకొమ్మని దశాబ్దాల తరబడి అనేక ప్రలోభాలు, అనేక ఒత్తిడులు కలుగజేసినప్పటికీ, విదేశీ మతాలను దరిచేరనీయకుండా తన వాళ్లందర్నీ రక్షించుకున్నారు. అటువంటి మహనీయుడు సదా వందనీయుడు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశ్వేశ్వరునిలో లీనమైన జగదీశ్వరుడు “డోమ్ రాజా” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీలోని మసీదులో పురావస్తు సర్వేకు అనుమతి ఇచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చివేసిన తరువాత ఔరంగజేబ్ నిర్మించిన జ్ఞాన్ వాపి మసీదు యొక్క పురావస్తు సర్వేపై స్టే కొనసాగించాలన్న పిటిషన్ను వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం తిరస్కరించింది. లార్డ్ కాశీ విశ్వనాథ్ మరియు అంజుమాన్ ఇంటెజామియా బనారస్ & యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మధ్య కొనసాగుతున్న కేసును కోర్టు విచారించింది, ఈ కేసులో కోర్టు స్టేను సమర్థించాలని రెండవ పార్టీ కోరింది.

విచారణను వాయిదా వేయాలని, తదుపరి చర్యలు తీసుకోకూడదని అంజుమాన్ ఇంటెజామియా బనారస్ మరియు యుపి సున్నీ సెంట్రల్ డబ్ల్యుఎక్యూఎఫ్ బోర్డు (కేసులో ప్రతివాదులు) లు అభ్యర్థించాయి. ఈ అభ్యర్థనను ఇప్పుడు కోర్టు తిరస్కరించింది. పురావస్తు సర్వే ఆవశ్యకతపై విచారణ కోర్టు తదుపరి సెషన్స్ లో తీసుకోబడుతుంది. ఆరాధనా స్థలం ప్రత్యేక నిబంధనల చట్టం 1991 ఆధారంగా ఈ దావాను పరిష్కరించాలని పిటిషనర్లు పేర్కొన్నారు. లార్డ్ కాశీ విశ్వనాథ్‌కు సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రతాప్ పాండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

23 సెప్టెంబర్ 1998 న కోర్టు బెంచ్ తీసుకున్న నిర్ణయం కూడా లార్డ్ విశ్వనాథ్ కు అనుకూలంగా ఉంది. కానీ ముద్దాయిలు హైకోర్టుకు వెళ్లి ఆర్టికల్ 226 ఆధారంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత 23 సెప్టెంబర్ 1998 లో రివిజన్ కోర్టు రిట్‌పై హైకోర్టు స్టే తీసుకువచ్చింది. ఈ ఉత్తర్వు నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోబోమని 13 అక్టోబర్ 1998 న తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, కోర్టు విచారణను నిలిపివేయలేదు అలాగే ఆ తరువాత హైకోర్టు నిర్దిష్ట ఉత్తర్వులు కూడా లేవు.

న్యాయవాది రాజేంద్ర ప్రతాప్ పాండే మీడియాతో మాట్లాడుతూ 2018 లో సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించాలని ఆదేశాలు జారీ చేసిందని, వీటిలో చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్న ఉత్తర్వులు ఉన్నాయని, గత 6 నెలలుగా కొత్త ఉత్తర్వులు రాలేదని చెప్పారు. ఈ వాదన ఆధారంగానే 1998లో విధించిన స్టే ఈ రోజు ఎత్తివేయ బడింది. అయితే, 2019 లో మరో ఉత్తర్వులో, రెండవ విచారణలో స్టేకు సంబంధించి సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కొత్త ఉత్తర్వులు ఇచ్చిందని ప్రతివాదులు వాదించారు. న్యాయవాది రాజేంద్ర ప్రతాప్ పాండే మాట్లాడుతూ, అద్దెకు సంబంధించిన వివాదాలలో 2019 లో ఆర్డర్ ఇవ్వగా, 2018 యొక్క ఆర్డర్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అన్ని వివాదాల కోసమని చెప్పారు. రెండు కేసుల వాస్తవాలు భిన్నమైనవి కనుక ట్రయల్ కోర్టు స్టేను ఎత్తివేసిందని చెప్పారు.

అన్ని అంశాలపై న్యాయ విచారణ జరిపిన తరువాత ప్రతివాదుల పిటిషన్‌ను వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కొట్టివేసిందని న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ పాండే చెప్పారు. ఈ కేసు విచారణ కొనసాగించాలని చట్టం యొక్క ఉద్దేశ్యం అని కోర్టు అభిప్రాయపడింది. జ్ఞాన్ వాపి మసీదు యొక్క పురావస్తు సర్వే కోసం డిమాండ్ చేసిన అంశంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 17 న ఉంటుందని కోర్టు నిర్ణయించింది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశీలోని మసీదులో పురావస్తు సర్వేకు అనుమతి ఇచ్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.