Justice NV Ramana – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమల వెంకటేశ్వరునికి ఆగమోక్తంగా పూజలు జరగడం లేదు
సుప్రీంకోర్టులో కేసు

టీటీడీని వివరణ కోరిన చీఫ్‌ జస్టిస్‌

న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడని, అందరినీ శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ’ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా టీటీడీలో ఆచార, సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

‘బాలాజీ భక్తులకు సహనం ఉంటుంది. కానీ, మీకు లేదు. కేసును జాబితాలో చేర్చకపోతే చనిపోతాను… అదీ ఇదీ అంటూ రిజిస్ట్రీని రోజూ బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదు. ఏంటిది? మేము కూడా వేంకటేశ్వరస్వామి భక్తులమే’ అని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. స్పందించిన శ్రీవారి దాదా అత్యవసర విచారణ కోసం అలా చేశానని వివరణ ఇచ్చారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి, ‘ఇందులో అత్యవసరం ఏముంది? పూజలు ఎలా చేయాలి? ఏ సమయంలో నిర్వహించాలి, ఎంతమందిని అనుమతించాలి అనే విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాలా?’ అని ప్రశ్నించారు. ఈ అంశంపై టీటీడీకి వినతిపత్రాలు సమర్పించానని పిటిషనర్‌ పేర్కొన్నారు.

ఆ వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని టీటీటీ తరఫు న్యాయవాది సత్య సభర్వాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దానికి న్యాయవాది ఏదో చెప్పబోతుండగా అడ్డుకున్న జస్టిస్‌ రమణ.. ‘కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని పిటిషనర్‌ అంటున్నారు. ప్రతీ ఒక్కరికి స్వామివారిపై విశ్వాసం ఉంది. వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి’ అని అడిగారు.

వివరాలు తెలుసుకొని చెప్పడానికి కొంత సమయం ఇవ్వాలని టీటీడీ న్యాయవాది కోరారు. దీంతో శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, పూజల నిర్వహణ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని టీటీడీని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమల వెంకటేశ్వరునికి ఆగమోక్తంగా పూజలు జరగడం లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.