#JAYANTHI – Vishwa Samvad Kendra Andhra Pradesh

“సమాజ సేవే … భగవత్ సేవ” – సంత్ గాడ్గే బాబా
పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించిన.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్ గాడ్గే బాబా. సామాజిక న్యాయం కోసం ఆ మహనీయుడు అవిశ్రాంతంగా పోరాడారు. తన యావత్ జీవితాన్ని సమాజ సేవ కోసం అర్పించిన సర్వ సంగ పరిత్యాగి ఆయన. గాడ్గే బాబా పేరుతో మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందిన ఆయన అసలు పేరు డేబూ లేదా డేబూజి. 1876 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన మహారాష్ట్ర జిల్లాలోని దర్యాపూర్ జిల్లా షేన్ గ్రామంలో జింగారా, శకు అనే దంపతులకు గాడ్గేబాబా జన్మించారు. ఆయన ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి మరణించారు. దాంతో గాడ్గే బాబా కుటుంబం జీవనాధారం కోల్పోవడంతో మేనమామ ఆశ్రయం పొందవలసి వచ్చింది. మేనమామ అప్పగించిన పొలం పనులు చూస్తూ…. ఖాళీ సమయాల్లో గాడ్గే బాబా తన చుట్టూ గ్రామస్తులను చేర్చి భజన పాటలు పాడుతూ… పాడిస్తూ ఉండే వారు. గాడ్గే బాబాకు 15 ఏళ్ల ప్రాయంలోనే కుంతాబాయి అనే యువతితో వివాహమైంది. ఆయన ఎప్పుడూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించే వారు. ప్రజల వెనుకబాటుతనం, మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే వారు. ప్రజలకు అనేక విధాలుగా సంస్కరణ మార్గాన్ని చూపించారు. గాడ్గేబాబాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. గాడ్గే బాబా తన జీవితాన్ని భగవంతుని సేవలో గడపాలని నిర్ణయించుకున్నారు.

“సమాజ సేవే … భగవత్ సేవ” అన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. 1905వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ఇల్లు వదిలి వెళ్లి భక్తి మార్గంలో పయనమయ్యారు. అప్పటి నుండి గాడ్గే రూపం మారిపోయింది. ఒంటి మీద చివికి పోయిన దుస్తులతో ఉండేవారు. అలాంటి దుస్తులను మరాఠీ భాషలో గొధాడే అని అంటారు. దాంతో ఆయనకు గోధాడే బాబా అన్న పేరు వచ్చింది. ఒక వెదురు కర్ర, చిన్న పాత్ర కూడా ఆయనతో ఉండేవి. వాటిని మరాఠీ భాషలో గాడ్గే అని అంటారు. అప్పటి నుంచి ఆయనకు గాడ్గేబాబా పేరు స్థిరపడి పోయింది. ఆ రూపంలో మహారాష్ట్ర అంతటా కాలి నడకన తిరుగుతూ… ప్రజలను కలుస్తూ వారికి హితబోధలు చేసేవారు. మరాఠీ ప్రజానీకం ఆయనను సుమారు 50 ఏళ్లపాటు తమ గురువుగా భావించింది. ప్రజలకు గాడ్గేబాబా బోధనలు చాలా సరళంగా హృదయానికి హత్తుకునేలా ఉండేవి. ముఖ్యంగా భక్త తుకారాం కీర్తనలను ఆలపించి వివరించే తీరు అందరినీ అలరించేది. గాడ్గే బాబా పండరీపురం, నాసిక్, ఆలంది వంటి అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించారు. “భగవంతుడు అనే వాడు ఒక్కడే ఉంటాడు. మానవులు, జంతువులు అన్న తేడా లేకుండా సృష్టిలోని అన్ని ప్రాణులనూ సమానంగా ప్రేమించడమే ఆయనను చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం” అన్నది గాడ్గేబాబా బోధనల సారాంశం. అంతే కాదు కుల వివక్ష, అంటరానితనం, బాల్య వివాహాలు, జంతు బలులు, మద్యపానం వంటి దుర్గునాలను తీవ్రంగా నిరసించారు. నీతి, నిజాయితీగా జీవించడం, పరిశుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యమని బోధించే వారు. ఒకసారి గాడ్గే బాబా ప్రవచనం చెబుతుండగా ఆయన కుమారుడు మరణించినట్టు వార్త వచ్చింది. ఈ వార్త విన్న ఆయన ఎంత మాత్రం తొనక లేదు. ఆ ఆవేదన కూడా అసలు మనసులోకి రానివ్వలేదు. ” ఈ ప్రపంచంలో రోజూ కోటాను కోట్ల జీవులు చనిపోతూ ఉంటాయి. వాటిలో ఒకే ఒక జీవి కోసం నేనెందుకు విలపించాలి ? అని ఆయన అనుకున్నారు. గాడ్గే బాబా కేవలం మాటలు మాత్రమే కాదు తాను ప్రవచించే బోధనలను ఆచరించి చూపేవారు. తనకు వచ్చిన విరాళాల మొత్తాన్ని ఆయన పండరీ పురం, నాసిక్, దేహూ, పూణే, ముంబయి తదితర చోట్ల నిరుపేదల కోసం అన్నదాన కేంద్రాలు, సత్రాలు, చలివేంద్రాలు, వృద్ధాశ్రమాలు నిర్మించారు. గాడ్గే బాబా వ్యక్తిత్వం ఎంతో విశిష్టమైనది. అణగారిన వర్గాల పట్ల అంతులేని అభిమానం, నిరుపేదలకు చేయూత నందించాలన్న తపన ఆ మహనీయుడు ప్రవచించిన బోధనలు నేటి తరానికి అనుసరణీయం.

The post “సమాజ సేవే … భగవత్ సేవ” – సంత్ గాడ్గే బాబా   appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సత్‌ రవిదాస్‌జీ స్వచ్ఛమైన భగవత్ భక్తులు
స్వచ్ఛమైన భగవత్ భక్తుడు, కుల వివక్షకు పూర్తి విరోధి, సర్వ మానవ సమానత్వాన్ని పరి పూర్ణంగా సమర్థించి అందరికీ మంచి చేసిన ఉదారవాది…… సంత్ రవి దాస్. 1377వ సంవత్సరంలో ఒక చర్మకార కుటుంబంలో బాబా సంతోఖ్ దాస్, మాతా కలసా దేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆ మహనీయుని జీవితం ఎంతో ప్రేరణాత్మకం. సుకుమార స్వభావం, ఉన్నతమైన ఆలోచనా ధోరణి, ఆత్మానుభవం, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం వంటి లక్షణాలతో మేళవించిన ఆయన …. చేరువలోకి వచ్చే వారందరూ మంత్ర ముగ్ధులయ్యేవారు. నిజాయితీగా.., సదాచారాలతో ఆర్జించిన ధనంతోనే సాధు సంతువులకు సేవ చేసే వారు. బడుగు, బలహీనులను ప్రేమించి…. ఆదరించడం ఆయనకు స్వభావ రీత్యా అలవడ్డాయి. గృహస్థాశ్రమంలో ఉంటూనే నిర్లిప్తంగా, నిర్వికారంగా తామరాకు మీద నీటి బొట్టులా ఉండే వారు. వినయ విధేయతలు పుష్కలంగా వుండేవి. సంత్ రవి దాస్ వ్యక్తిత్వం ఎంత ప్రభావ శీలమైనదంటే….. అగ్రవర్ణాల వారు, బ్రాహ్మణులు సైతం ఆయనను గౌరవించి సత్కరించే వారు. ప్రజల వాడుక భాషలోనే ఆయన తన రచనలు చేసే వారు.

రవి దాస్ కేవలం కవి మాత్రమే కాదు.., విప్లవ కారుడు, విమర్శకులకు కూడా ఆయన వచనాలు సరళంగా.. సులువుగా అర్ధమయ్యే రీతిలో ఉండేవి. సిక్కు మత స్థాపకులు గురునానక్ తో సంత్ రవి దాస్ చర్చలు జరుపుతుండే వారు. వారిరువురూ ఒకసారి వారణాసిలో కలుసుకున్నారని ఆచార్య పృథ్వీ సింగ్ ఆజాద్ పేర్కొన్నారు. అయితే వారి సమావేశం అయోధ్యలో జరిగిందని మరి కొందరు పేర్కొన్నారు. సాధు సంతువుల్లో రవి దాస్ శ్రేష్ఠుడు అంటూ ఆయన పట్ల కబీర్ తన శ్రద్ధాసక్తులు ప్రకటించారు. సిక్కు గురు పరంపరకు చెందిన గురు రామ్ దాస్, గురు అర్జున్ లు …. రవి దాస్ ను ఎంతో గౌరవించే వారు. ఆయన గురించి సిక్కు పవిత్ర గ్రంథం “” గురు గ్రంధ్ సాహిబ్ “” లో ప్రస్తావించడం విశేషం. ఒక పక్క భక్తి భావంతో భక్తులకు పాటలు పాడి వినిపిస్తూనే ….అదే సమయంలో తన వృత్తి ధర్మంగా చెప్పులు కుట్టేవారు. ప్రతి రోజూ అదే ఆయన దిన చర్యగా ఉండేది “అందరికీ ప్రభువు ఒక్కరే అయినపుడు జన్మతో కుల భేదాలు ఎందుకు వస్తాయి. అవన్నీ మిథ్య మాత్రమే” అనే వారు సంత్ రవి దాస్. అదే ….ఆయన ఉన్నత తత్వం. జీవులకు ఏ కులమూ, వర్ణమూ, జాతి ఉండవు. ఋషులు మునులు వర్ణాన్ని కర్మాచరణ కోసం చెప్పారు.మన శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి. జాతి కుల భేదాల గురించి పట్టించుకునే వారు మూర్ఖులు మాత్రమే. నిజానికి…అందరిదీ ఒకటే జాతి అనే వారు సంత్ రవి దాస్. సంత్ రవి దాస్ ను ముస్లింగా మారిస్తే …. ఆయనకు వున్న లక్షలాది మంది భక్తులు కూడా ముస్లిమ్ లుగా మారిపోతారని ఆ నాటి ముస్లిం మత పెద్దలు భావించారు. ఆయన మతం మార్చడానికి పలువురు ముస్లిం మత పెద్దలు…, పలు విధాలుగా ప్రయత్నించారు కానీ….ఆ యత్నాలన్ని విఫలమయ్యాయి. సంత్ రవిదాస్ భక్తి పారవశ్యాన్ని చూసి… ఎందరో ప్రముఖులు ఆయన శిష్యులు అయ్యారు. ఇలా అయిన వారిలో కాశీ రాజు, చిత్తోడ్ రాజు మహారానా ఉదయ్ సింగ్ భార్య ఇలా ఎందరో ఉన్నారు.

The post సత్‌ రవిదాస్‌జీ స్వచ్ఛమైన భగవత్ భక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పరాధీనపు కాంతి మబ్బులు చీల్చివేసిన కాంతి పుంజం.. మన నేతాజీ!
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవారుగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం లేదు. చరిత్రలో ఆయనకు దక్కిన ఆ స్థానం ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినది మాత్రం కాదు.

‘జైహింద్‌’ అన్న గొప్ప నినాదాన్ని దేశానికి ఇచ్చిన మహనీయుడు సుభాష్‌ చంద్రబోస్‌. ‘నాకు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్య్రం ఇస్తాను’ అని నినదించిన వ్యక్తి.. బ్రిటిష్‌ జాతి నుంచి భారతాన్ని విముక్తం చేయడానికి ఆయన ఇచ్చిన మరో రణగర్జన ‘చలో ఢిల్లీ’.

ఇవన్నీ గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆధునిక చరిత్రలో జలియన్‌ వాలాబాగ్‌ దురంతం ఒక నెత్తుటి మరక, బ్రిటిష్‌ జాత్యహంకారానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి జాతి మీద సాగించే పోరాటం అహింసా పథంలో సాగదని నమ్మిన వారిలో బోస్‌ ఒకరు. ఏ కోణం నుంచి చూసినా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం లేదు.

చరిత్రలో ఆయనకు దక్కిన ఆ స్థానం ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినది మాత్రం కాదు. ఆయన దేశం కోసం పోరాడడం ఒక ఎత్తు, తను నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేయడానికి చేసిన పోరాటం మరొక ఎత్తు. ఎన్నో వ్యతిరేకతల మధ్య దాదాపు ఒంటరి పోరాటం చూసి, బోస్‌ చరిత్రలో చెరగని స్థానాన్ని కల్పించుకోగలిగారు.

సామర్థ్యం నిరూపించుకున్నారు…

సుభాస్‌ చంద్రబోస్‌ (జనవరి 23, 1897 – ఆగస్ట్‌ 18, 1945) కటక్‌లో జన్మించారు. తండ్రి జానకీనాథ్‌ బోస్‌ (తల్లి ప్రభావతి దేవి) ప్రముఖ న్యాయవాది. రాజబహదూర్‌ బిరుదాంకితులు. అంటే ఆయన బ్రిటిష్‌ అనుకూలుడే. కొడుకును సివిల్‌ సర్వీసెస్‌ చదివించాలని ఇంగ్లండ్‌ పంపించాడు. ఆ పరీక్షలో బోస్‌ ఉత్తీర్ణుడై తన సామర్థ్యం నిరూపించు కున్నారు. కాని తన జాతిని బానిసలను చేసి పాలిస్తున్న బ్రిటిష్‌ వారి సర్వెంట్‌గా పని చేయడం ఇష్టం లేక బోస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బోస్‌ చూసిన భారతదేశం, ప్రపంచం కూడా సంక్షోభాలతో కూడుకున్నది. ఆయనకు జ్ఞానమార్గం స్వామి వివేకానందుల ప్రవచనాల నుంచి లభించింది. రాజకీయ దష్టి చిత్తరంజన్‌ దాస్‌ నుంచి వచ్చింది. ఆయన పోరాట దక్పథం వాస్తవికమైనది. మొత్తంగా ఆయన ఆలోచనలనీ, అడుగులనీ నిర్దేశించినది మూత్రం అంతర్జాతీయ పరిస్థితులే.

కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు

దాదాపు 1920 దశకం నుంచి బోస్‌ స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నారు. చిత్తరంజన్‌ దాస్‌ కలకత్తా మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, బోస్‌ సిఇఒ గా పనిచేశారు. తరువాత జాతీయ స్థాయికి ఎదిగారు. కానీ బోస్‌ పేరు ఒక ప్రభంజనంలా దేశాన్ని తాకినది మాత్రం 1938 లోనే. త్రిపుర కాంగ్రెస్‌ మహాసభలలో ఆయన పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆయన ప్రత్యర్థి భోగరాజు పట్టాభిసీతారామయ్య ఓడిపోయారు. పట్టాభికి మద్దతిచ్చింది గాంధీగారే. అందుకే ‘పట్టాభి ఓటమి తన ఓటమే’ అని అప్పుడే గాంధీజీ ప్రకటించారు. అంతకు ముందు నెహ్రూతో సహా అందరూ బోస్‌ అభిప్రాయాలను సమర్థించిన వారు తరువాత సహాయ నిరాకరణ ఆరంభించారు. అనివార్య పరిస్థితులలో బోస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

యుద్ధమే మార్గం

మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో గాంధీజీ అనుసరించిన వైఖరిని దేశంలో చాలామంది వ్యతిరేకిం చారు. గాంధీజీ మాటను వేదవాక్కుగా భావించేవారు, వ్యతిరేకత ఉన్నా మౌనం దాల్చారు. బ్రిటిష్‌ ప్రభుత్వం యుద్ధంలో మునిగి తేలుతూండగానే దేశంలో పోరాటాన్ని ఉధతం చేయాలని, బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రయోజనాలు సాధించుకోవాలని చాలామంది అభి ప్రాయంగా ఉంది. భారత సైన్యాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం ఉపయోగించుకోదలిస్తే అందుకు ప్రతిగా దేశానికి స్వయం ప్రతిపత్తి ఇస్తారో లేదో తెలుసుకోవాలని మహమ్మదలీ జిన్నా వంటి వారు కూడా గట్టిగా గళం ఎత్తారు. కానీ అహింసా సిద్దాంత ప్రవక్త గాంధీజీ ఎలాంటి షరతులు లేకుండానే యుద్ధం చేస్తున్న బ్రిటన్‌ వెనకాల నిలబడాలని కోరుకున్నారు. అనిబిసెంట్‌, చిత్తరంజన్‌దాస్‌, జిన్నా, మోతీలాల్‌ వంటి వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తీవ్ర జాతీయవాదుల అభిప్రాయం కూడా అదే. అలాంటి వ్యతిరేకత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా వచ్చింది. ఇంగ్లండ్‌ యుద్ధంలో ఉండగానే దేశాన్ని విముక్తం చేయడం కోసం ఒత్తిడి పెంచాలని భావించిన వారు ఎందరో. అందులో ముఖ్యుడు బోస్‌. కానీ గాంధీ పంథా నుంచి బయటకు రావడానికి ఇష్టపడని రాజకీయ వాతావరణం నాటి భారతదేశంలో చాలా ఉండేది. ఫలితంగా బోస్‌ ఈ దేశాన్ని వదిలి, బయట నుంచి ఇంగ్లండ్‌ ప్రభుత్వం మీద దాడి చేయాలనీ, దేశాన్ని విముక్తం చేయాలని వాంఛించారు. అప్పటికే అంతర్జాతీయంగా పలు సంస్థలు, అందులోని భారతీయులు ఇదే బాటలో ఉన్నారు కూడా. అందుకే 1939లో బోస్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లండ్‌ను ఇరుకున పెట్టాలన్న యోజనను ప్రచారం చేసినందుకు బోస్‌ను జైలుకు పంపారు. అక్కడ బోస్‌ ఆమరణ నిరశనకు కూర్చోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనితో ఆయనను విడుదల చేసి, హౌస్‌ అరెస్టు చేశారు. ఇది 1940లో జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే ఆయన మాయమైన సంగతిని బ్రిటిష్‌ ప్రభుత్వం గమనించింది. కలకత్తాలో మాయమైన బోస్‌ 1941 నవంబర్‌లో జర్మనీ రేడియోలో ఆయన ప్రసంగించేంత వరకు ఆయన ఆచూకీ కూడా ఎవరూ పట్టుకోలేకపోయారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాయకత్వంలోని కూటమి, అమెరికా-బ్రిటన్‌ నాయకత్వంలోని మిత్ర రాజ్యాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అలాంటి సమయంలో పాశ్చాత్య దేశాలకు వెళితే, అక్కడ అరెస్టయ్యి బోస్‌ కచ్చితంగా ఇంగ్లిష్‌ వారి బందీగా ఉండిపోయేవాడే. కానీ ఆయన జర్మనీ నాయకత్వరలోని కూటమిని ఆశ్రయించారు. జర్మనీ, జపాన్‌ కూడా బోస్‌కు సాయం అందించడానికి ముందుకు వచ్చాయి. జపాన్‌ సాయంతోనే సింగపూర్‌, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు చెందిన 40 వేల మంది భారతీయులతో బోస్‌ సైన్యాన్ని నిర్మించుకున్నారు. అదే ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’. ఇందులో మహిళా విభాగం కూడా ఉండడం బహుశా ప్రపంచ రికార్డు. ఆ విభాగం పేరు ఝాన్సీ లక్ష్మీబాయి సేన. ఈ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సేనతో భారత భూభాగాలను ఆక్రమించడం బోస్‌ ఉద్దేశం. అక్టోబర్‌ 21, 1943న అండమాన్‌ నికోబార్‌ ద్వీపాలను బోస్‌ స్వాధీనం చేసుకున్నారు. వాటికి స్వరాజ్‌, షహీద్‌ అని పేర్లు పెట్టాడు. తరువాత 1945 మార్చి 18 నాటికి బర్మా దాకా వచ్చారు. కానీ అప్పటికి పరిస్థితులు మారిపోయాయి. జర్మనీ కూటమి ఓటమి పాలైంది. హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అణుబాంబు దాడితో జపాన్‌ లొంగిపోయింది. ఇది బోస్‌ పాలిట శరాఘాతమైంది. ఆయన ప్రయాణిస్తున్న యుద్ధ విమానం (జపాన్‌ది) ఆగస్ట్‌ 18, 1945న జపాన్‌ అధీనంలో ఉన్న ఫార్మోసా (నేటి తైవాన్‌)లో కూలిపోయిం దని, ఆయన ఈ లోకాన్ని వీడిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన బతికే ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ విషయంలో స్పష్టత లేకపోవటం, మిస్టరీగా మిగిలిపోవటం దురదృష్టకరం.

ఇప్పటికీ స్ఫూర్తే

దేశాన్ని త్వరితగతిన వలసపాలన నుంచి విముక్తం చేయాలని ఒక గొప్ప జాతీయవాది కన్న కల అలా భగ్నమైంది. వాస్తవ పరిస్థితులను గమనించ కుండా, గాంధీ మీద విపరీత భక్తితో జాతీయ కాంగ్రెస్‌ వాదులు బోస్‌ను దూరంగా పెట్టారు. కమ్యూనిస్టులు మరో అడుగు ముందుకు వేసి ఆయనకు దేశద్రోహం అంటగట్టారు. సోవియెట్‌ రష్యాను గడగడలాడించిన హిట్లర్‌తో ఆయన (భారతదేశ విముక్తి కోసమే అయినా) చెలిమి చేసినందుకు కొన్ని దశాబ్దాల పాటు నీచంగా చిత్రించారు. (1997లో బోస్‌ శతజయంతికి ఇందుకు కమ్యూనిస్టులు క్షమాపణలు చెప్పారు) అంటే స్వరాజ్య సమరంలో గాంధీని వ్యతిరేకించిన వారికి పుట్టగతులు లేవు. స్వతంత్ర భారతంలో కమ్యూనిస్టులకు నచ్చని వాళ్ల చిరునామా చరిత్రలో కనిపించదు. ఇలాంటి దారుణమైన కాలమాన పరిస్థితుల నుంచి ఎదిగిన వ్యక్తిత్వం బోస్‌ సొంతం. ఆయన స్ఫూర్తి ఏనాటికైనా భారతదేశానికి అవసరమే.

సోర్సు – లోపాముద్ర. సేకరణ జాగృతి వార పత్రిక 2018 జనవరి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పరాధీనపు కాంతి మబ్బులు చీల్చివేసిన కాంతి పుంజం.. మన నేతాజీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.