#Jainism – Vishwa Samvad Kendra Andhra Pradesh

108 దేశాల్లో ‘నవకార్‌ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ
నవకార్‌ మహామంత్రం పరమ పవిత్రమైనదని, దీనిని సామూహికంగా పఠించడం వలన ప్రపంచ శాంతి, సామరస్యాలు సమకూరుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘నవకార్‌ మహామంత్ర దివస్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

సందర్భంగా ప్రధాని మోదీ నవకార్ మహామంత్రానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది జైనమతంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణిస్తారని, ఇది ప్రపంచ శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా  మనమంతా శాంతి,  మానసిక శక్తి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

‘నవకార్‌ మహామంత్ర దివస్‌’ మహావీర జయంతికి ఒక రోజు ముందు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన పౌరులు నవకార్ మహామంత్రాన్ని సామూహికంగా జపించారు. ఇది  ప్రపంచ ఐక్యత, ఆధ్యాత్మిక జాగృతిని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక  కార్యక్రమంగా నిలిచింది. ఈ మంత్రం జైనమతం(Jainism)లోని ఐదు ప్రధాన ఆరాధనా విభాగాలైన అరిహంతులు (మోక్షం పొందిన ఆత్మలు), సిద్ధులు (పరిపూర్ణ జ్ఞానం పొందినవారు), ఆచార్యులు (ఆధ్యాత్మిక గురువులు), ఉపాధ్యాయులు (ఉపదేశకులు),సాధువులు (సన్యాసులు)కు మనమిచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలలో ఏకకాలంలో జరిగింది. భారతదేశంలో 6,000 ప్రదేశాలలో ఈ ఉత్సవం నిర్వహించారు. దీనిని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) ఆధ్వర్యంలో నిర్వహించారు.

The post 108 దేశాల్లో ‘నవకార్‌ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయాల్లో పెత్తనం కోసం సుప్రీం కోర్టుకు రెండు వర్గాలు
ప్రార్థనాలయాల చట్టాన్ని అమలు చేయాలని విన్నపం

న్యూఢిల్లీ: జైన్ మతాన్ని ఆచరించే రెండు ఉప వర్గాలు జైనాలయాలపై పెత్తనం కోసం పాకులాడుతున్నాయి. శ్వేతాంబరులకు చెందిన ‘జైన్ తపగచ్ఛా’ అనే ఒక ఉపవర్గం తమ ప్రాథమిక హక్కులు హాననమవుతున్నాయని సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.

తమ వర్గానికి చెందిన ఆలయాల్లోకి ప్రవేశించకుండా ఇతర వర్గాలువారు అడ్డుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లోని జైన్ ఆలయాల్లోకి తమ సన్యాసులను అనుమతించడం లేదని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ప్రార్థనా స్థలాల చట్టం(ప్లేసెస్ ఆఫ్ వొర్షిప్ యాక్ట్)ను వర్తింపజేసి ఉపశమనం కల్పించాలని పిటిషన్‌లో కోరింది. తమ వర్గానికి చెందిన ఆలయాలను ఇతర జైన వర్గాలు బలవంతంగా మార్చివేస్తున్నాయని, సంప్రదింపులు జరప‌కుండా ఈ చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది.

ఈ వ్యవహారంపై పిటిషనర్ల తరపును సీనియర్ అడ్వకేట్ అర్వింద్ దటార్ వాదనలు వినిపించారు. ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం.. దేవాలయం ఒక జైన సమూహానికి చెందినదైనా ఇతర వర్గాల వారి ప్రవేశంపై నిషేధం విధించడానికి వీల్లేదన్నారు. మరోవైపు దేవాలయాల రూపురేఖల్ని మార్చుకుండా రాష్ట్ర ప్రభుత్వాలే భద్రత కల్పించాలని ఆయన కోరారు.

పిటిషనర్ వాదనలు విన్న జడ్జిలు డీవై చంద్రచూడ్, జేబీ పార్ధివాలాల బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం ఒకే మతానికి చెందిన రెండు వర్గాలకు సంబంధించినదని పేర్కొంది. ఆలయంపై పెత్తనం ఎవరిదనేది ట్రయల్ కోర్టులో నిర్ణయించబడుతుందని, ఈ మేరకు వ్యాజ్యం దాఖలు చేయాలని సూచించింది.

పిటిషనర్లు పేర్కొన్న హక్కులపై సాక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని వర్తింపజేయాలని కోరుతున్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 32కు సంబంధించి కాదని గ్రహించాలని స్పష్టం చేసింది.

సాక్ష్యాధారాలు పరిశీలించాల్సిన ఈ కేసులో నేరుగా సుప్రీంకోర్టునే ఎందుకు ఆశ్రయిస్తున్నారని బెంచ్ ప్రశ్నించింది. ‘ ప్రతి క్రిమినల్ కేసు సివిల్ వ్యాజ్యంగా మారుతుంది. ప్రతి సివిల్ వ్యాజ్యం కోరుకుంటే రిట్ పిటిషన్ అవుతుంది. ఈ వివాదం వ్యాజ్యంలో పరిష్కారం అవుతుంది. ఆచార సాంప్రదాయ హక్కులు, వినియోగానికి సంబంధించిన ఆధాలు అందాల్సి ఉంది. ఇది రిట్ పిటిషన్‌కు సంబంధించిన అంశం కాదు’ అని బెంచ్ పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల్లో పెత్తనం కోసం సుప్రీం కోర్టుకు రెండు వర్గాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.