INDIRA GANDHI – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం: రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా
న్యూఢిల్లీ: అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులన్నీ కాలరాస్తూ 47 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ‘అంతర్గత కల్లోల’ స్థితిని ఉద్దేశించి రాజ్యాంగంలో నిర్దేశించిన అధికరణం 352(1)కింద అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర స్థితిని ప్రకటించారు. దేశ సార్వభౌమాధికార మొత్తం తన చేతుల్లోకి తీసుకున్న అత్యంత నియంతృత్వమైన నిర్ణయంగా, చీకటిరోజుగా ప్రజాస్వామ్యవాదులు ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతుంటారు.”1975లో ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశ పౌరుల హక్కులన్నింటినీ రాత్రికి రాత్రే హరించింది. అత్యవసర పరిస్థితి విధించింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, నియంతృత్వ పోకడలను చిత్తుచేసేందుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన దేశభక్తులందరికీ సెల్యూట్ చేస్తున్నాను” అని అమిత్‌షా శనివారంనాడు ఓ ట్వీట్‌లో అన్నారు.

దేశ చరిత్రలో చీకటి అధ్యాయం

దీనికి ముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులపై స్పందించారు. 47 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని ఆయన అన్నారు. దీన్ని ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని భారతీయులంతా ప్రజాస్వామ్య పరిరక్షణకు పునరంకింతం కావాలని, రాజ్యాంగం, చట్టబద్ధ సంస్థల ఔన్నత్యాన్ని పరిరక్షిస్తామని ప్రతినబూనాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం: రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం
భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలం 1975-77

సరిగ్గా 47 ఏళ్ళ క్రితం 1975లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత దేశంలో యాథావసర పరిస్థితిని ప్రకటించారు. 21 నెలల పాటు అమలులో ఉన్న ఈ పరిస్థితి కేవలం మన దేశంకే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రకే ఓ చీక‌టి అధ్యాయంగా మిగిలిపోయింది.

ఎందుకంటే, ప్రపంచంలో స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రజల సంఖ్య అకస్మాత్తుగా సగానికి పడిపోయింది. ప్రపంచంలోనే ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ప్రజలకు ప్రాథమిక హక్కులు అమలులో లేకుండా పోవడం, ప్రతిపక్ష నేతలే కాకుండా స్వేచ్ఛగా అభిప్రాయలు వ్యక్తం చేసే వారంతా జైళ్ళ‌లో గడపవలసి వచ్చింది.

ప్రాథమిక హక్కులు అమలులో లేకుండా పోవడంతో ప్రభుత్వం ఎవ్వరినైనా కాల్చివేసినా ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని ప్రఖ్యాత పాత్రికేయుడు కులదీప్ నాయర్ అరెస్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు లో ప్రభుత్వ అదనపు సొలిసిట్ జనరల్ వాదించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

భారతదేశంలో మొదటిసారిగా పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. చట్టసభలకు జరుగవలసిన ఎన్నికలను వాయిదా వేశారు. జైళ్ళ‌న్నీ నిరాయుధులైన, ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించే వారితో నింపివేసారు. చివరకు కేంద్రంలో సీనియర్ మంత్రులు సహితం ఏమీ మాట్లాడలేక తమ ఇళ్ళ‌కే పరిమితం కావలసి వచ్చింది.

దేశ చరిత్రలో మొదటిసారిగా `రాజ్యాంగాతీత శక్తులు’ ప్రభుత్వ వ్యవహారాలలో పెత్తనం చేయడం చూసాము. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ లోక్‌సభకు ఎన్నిక కావడాన్ని కొట్టివేయడంతో, కేవలం ఆమె పదవిని కాపాడుకోవడం కోసం అత్యవసర పరిస్థితి విధించడం అందరికి తెలిసిందే. అయితే, అందుకు ఏవేవి కారణాలు చెప్పి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

అయితే, అత్యవసర పరిస్థితి భారత పౌర సమాజంలో నెలకొన్న చైతన్యాన్ని, వారి సంఘటిత శక్తిని మొత్తం ప్రపంచానికి వెల్లడించింది. 1971లో బాంగ్లాదేశ్ యుద్ధంలో అనూహ్యమైన విజయం సాధించినప్పటి నుండి దేశంలో తిరుగులేని నాయకురాలిగా ఇందిరాగాంధీ వెలుగొందుతూ వచ్చారు. ఆమెను రాజకీయంగా ఎదిరించే సత్తా ప్రతిపక్షాలలో పెద్దగా కనిపించడం లేదు.

ప్రజలకు ఆశాదీపంగా విద్యార్థుల ఉద్యమం

అటువంటి సమయంలో మొదట గుజరాత్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ మెస్‌లో అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా బీహార్‌కు వ్యాపించడం, దశాబ్దాలుగా `రాజకీయ సన్యాసం’ చేపట్టిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడి, అవినీతికి మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థలో `సమగ్రమైన మార్పు’ కోసం `సంపూర్ణ విప్లవం’ కోసం విద్యార్థులు, యువకులు ఉద్యమించాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమాలలో ఏబీవీపీ నిర్ణయాత్మక పాత్ర వహించింది.

ఆయన పిలుపు విద్యుత్ తరంగం వలే దేశ వ్యాప్తంగా యువతను కదిలించడం ప్రారంభమైంది. రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలు ఉద్భవించడం ప్రారంభమైనది. ఇంతలో అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చినా పదవికి రాజీనామా చేయకుండా ఇందిరాగాంధీ తాత్సారం చేస్తుండడంతో ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె వెంటనే రాజీనామా చేయాలనీ జెపి డిమాండ్ చేశారు.

అందుకోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం కోసం మొరార్జీ దేశాయ్ అధ్యక్షునిగా, నానాజీ దేశముఖ్ కార్యదర్శిగా లోక్ సంఘర్ష సమితి ఏర్పాటును ప్రకటించారు. అంతలో ప్రజలలో ఉవ్వెత్తున నిరసనలు చెలరేగే ప్రమాదం పసిగట్టిన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అత్యవసర పరిస్థితి సమయంలో రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తే జైళ్ళ‌కు వెళ్ళ‌డం తప్పా, ప్రజలను సమీకరించి నిరసన ఉద్యమాలకు ప్రయత్నం చేసినవారు చాలా తక్కువ.

కేవలం జార్జ్ ఫెర్నాండెస్, నానాజీ దేశముఖ్ వంటి వారు మాత్రమే తమదైన పద్ధ‌తిలో ఉపక్రమించారు. ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థలను నిషేధించడంతో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమంలో చేరారు. మొత్తం మీద లక్ష మందికి పైగా జైళ్ళ‌కు వెళ్లారు. మొత్తం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఓ శాంతియుత ఉద్యమంలో ఇంత మంది జైళ్ళ‌కు వెళ్ళ లేదు.

విదేశాలలో సహితం సుబ్రమణియన్ స్వామి వంటి వారు అత్యవసర పరిస్థితి పేరుతో భారత్‌లో జరుగుతున్న అరాచక పరిస్థితుల గురించి విశేషంగా ప్రచారం చేస్తుండడంతో అంతర్జాతీయంగా వత్తిడి పెరిగి, ఆమె మార్చి 21, 1977న అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకో వలసి వచ్చింది.

ఎన్నికలంటే భయపడ్డ ప్రతిపక్షాలు

ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ, ఆమె పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. రాజకీయ పార్టీల బలాబలాలతో సంబంధం లేకుండా పౌర ఉద్యమాల ద్వారా సాధారణ ప్రజలు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా నిలబడడంతోనే ఈ అనూహ్య ఫలితాలు సాధ్యమైంది. అందుకనే, ఆ తర్వాత మరో వేయేళ్ళ వరకు భారత్ లో అత్యవసర పరిస్థితి విధించే సాహసం ఎవ్వరు చేయలేరని స్వయంగా ఇందిరాగాంధీ పేర్కొనడం గమనార్హం.

వాస్తవానికి ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు భయపడ్డారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి అంశాలు `నిరక్షరాస్యులైన’ ప్రజలకు ఏమి అర్థం అవుతాయి అనుకోని, ఎన్నికలను బహిష్కరిద్దామని సూచించారు.

కానీ, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మొరార్జీ దేశాయి, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకుల నైతిక స్థైర్యం, సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లిన వేలాదిమంది యువకుల త్యాగాల ఫలితంగా 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓటమి చెందింది. మొదటిసారిగా నిషేధంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మొరార్జీ దేశాయి నాయకత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం భవిష్యత్‌లో తేలికగా దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేకుండా 44వ రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చింది. అయితే ప్రజలు నిత్యం జాగురకతతో వ్యవహరింపని పక్షంలో మరోసారి ఎమర్జెన్సీ విధింపక పోయినా ప్రభుత్వాలు నిరంకుశ విధానాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అనేకసార్లు స్పష్టమైనది.

ప్రజలకు బాసటగా నిలిచిన నైతిక నాయకత్వం

నాడు ప్రధానంగా అధికార రాజకీయాల పట్ల మక్కువలేని నైతిక నాయకత్వం ప్రజలకు బాసటగా నిల్చి, మన ప్రజాస్వామ్య పరిరక్షణకు బాసటగా నిలబడింది. లోక్ సంఘర్షణ సమితి అధ్యక్షుడిగా 78 ఏళ్ళ వయస్సులో జైలులో ఉన్న మొరార్జీ దేశాయి వద్దకు మధ్యవర్తులను పంపి పెరోల్ పై విడుదల చేస్తామని, అత్యవసర పరిస్థితులు క్రమశిక్షణ పెరిగిందని అంటూ కొన్ని మంచి మాటలు చెబితే విడుదల చేస్తామని ఇందిరాగాంధీ రాయబారం పంపారు.

కానీ బయటకు వస్తే తిరిగి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తా గాని ప్రభుత్వానికి `లొంగిపోయే’ ప్రసక్తి లేదని మొరార్జీ స్పష్టం చేశారు. కానీ నేడు ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతామని అంటూ తిరుగుతున్నారు. సైద్ధాంతిక రాజకీయాలకు కాలం చెల్లి, అధికారం చేపట్టడమే పరమావధిగా మారింది. అటువంటి ధోరణులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు కాగలవు.

మరో వంక స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారు అత్యవసర పరిస్థితి విధించి పెద్ద తప్పు చేశావని, వెంటనే ఉపసంహరించుకోమని ప్రధాని ఇందిరా గాంధీకి హితవు చెప్పారు. ఇందిరాగాంధీ కంచికి వెళ్ళి 90 సంవత్సరాల వయస్సులో ఉన్న `నడిచే దేవుడు’ గా పేరొందిన స్వామి చంద్రశేఖర సరస్వతి కాళ్ళ‌పై పడి ఆశీర్వాదం కోరితే ఇందిరాగాంధీ ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టత చూపలేదు. ఆ విధంగా అత్యవసర పరిస్థితి పట్ల తన విముఖతను చాటారు.

ప్రాథమిక హక్కుల అంశంపై రాజీలేని ధోరణిని ప్రదర్శించడం ద్వారా జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని సైతం పొందలేక పోయారు. దానితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు గాని ఉన్నత పదవి కోసం ఆయన పాకులాడలేదు.

భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తప్ప మౌలిక అంశాలపై ఉద్యమించే పరిస్థితులలో లేవని సహితం ఈ సందర్భంగా స్పష్టమైనది. అప్పటి నుండి దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పౌర సమాజ ఉద్యమాలే విశేష ఫలితాలు ఇస్తున్నాయి.

దేశంలో ఉగ్రవాదం వాటిని పెను సవాళ్ళను ఎదుర్కోవడంలో సహితం సాధారణ ప్రజలే ముందున్నారని గమనించాలి. మొత్తం ప్రపంచ చరిత్రలో సైనికుల జోక్యం లేకుండా, సాధారణ ప్రజలు ఉగ్రవాదాన్ని అణచివేయడం పంజాబ్ లో 1990వ దశకంలో మాత్రమే సాధ్యమైంది. అందుకు ప్రధాన కారణం సాధారణ గ్రామీణ ప్రజలు ఉగ్రవాదాన్ని నిరసించారు. ఉగ్రవాదులు సహాయ నిరాకరణ చేశారు.

చివరకు క‌శ్మీర్ లోయలో సహితం దాదాపు అదే సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జొరబడుతూ ఉంటె, వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది స్థానిక తీవ్రవాదులు, యువత కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం అందరిని ఒకే గాటిన కట్టేసి, స్థానికులు చేదోడుగా ఉండకపోవడంతో ఉగ్రవాదం ఆ తర్వాతి కాలంలో దేశంలో విశృంఖలంగా వ్యాపించింది.

నిజం టుడే సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

1984 సిక్కుల ఊచకోతకు 37 ఏళ్ళు!… న్యాయం దక్కేనా?
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత దేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యా అనంతరం సిక్కులపై దేశ వ్యాప్తంగా జరిగిన హత్యాకాండను పేర్కొనవచ్చు. ఈ దుర్ఘటన జరిగి 37 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఆ అల్లర్లు ఏ విధంగా జరిగాయో, ఎవ్వరు బాధ్యులో, ఎంత మందిని చంపారో, ఏమేరకు నష్టాలు జరిగాయో ప్రభుత్వం నిర్ధిష్టంగా చెప్పలేకపోతున్నది. బాధితులకు న్యాయం ప్రశ్న తలెత్తడం లేదు.

1984 అక్టోబర్‌ 31న నాటి ప్రధాని ఇందిరా గాంధీని సిక్కులైన ఆమె ఇద్దరు బాడీ గార్డ్‌లు కాల్చిచంపారు. నవంబర్‌ 1 నుండి దేశ వ్యాప్తంగా శిక్కులపై సాయుధులైన అల్లరి మూకలు వెంటాడి ఊచకోతకు తెగబడ్డాయి. వివిధ అంచనాల ప్రకారం వాటిల్లో 10,000 మంది కంటే ఎక్కువగా చనిపోయారు. అయితే అధికారిక రికార్డుల ప్రకారం, ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది సిక్కులు చనిపోయారు. వివిధ మానవ హక్కుల సంస్థలు 4,000 మంది వరకు చనిపోయిన్నట్టు చెబుతున్నాయి. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని వివరాలు కూడా నిర్దిష్టంగా లేవు. హత్యలతో పాటు అనేక గురుద్వారాలు, సిక్కులు నిర్వహించే దుకాణాలు, ఇతర వ్యాపారాలు, వారి గృహాలు కూడా విధ్వంసంకు గురయ్యాయి. దోపిడీలు జరిగాయి. మహిళలపై అత్యాచారాలు జరిగాయి.

ఢిల్లీ వీధులలో అత్యంత పాశవికంగా హత్యాకాండ సాగించారు. మేడలో టైర్లు వేసి మరీ సజీవదహనం చేశారు. నెలల పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలివారి వరకు ఎవ్వరిని వదలలేదు. గర్భస్థ పిండాలను కడుపు చీల్చి, బయటకు లాగి మరీ చిదిమివేశారు. ఆ నాటి అరాచక కాండ గురించి పలువురు ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి.

కత్తులు, కటార్లు వంటి ఆయుధాలతో అత్యంత అమానుషంగా దాడులు జరిపి బాధితులను కొట్టి చంపి సజీవ దహనం చేశారు. చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడంతో హత్యాకాండ పలు రోజులు కొనసాగింది. తమ ప్రధానమంత్రిని హత్య చేయడంతో కలత చెందిన ప్రజల ఆకస్మిక ప్రతిస్పందనగా ఈ మారణహోమాన్ని సమర్ధించే ప్రయత్నాలు జరిగాయి.

అయితే, నిశితంగా పరిశీలన జరిపితే ‘సిక్కులకు గుణపాఠం నేర్పడానికి’ చాలా చక్కగా రూపొందించిన, సమన్వయంతో కూడిన ప్రణాళిక ప్రకారం జరిగిన్నట్టు అర్థమవుతోందంటున్నారు కొంతమంది. ఈ దాడులతో భయకంపితులైన సిక్కులు సుమారు 20,000 మంది ఢల్లీి వదిలి పారిపోయారు. మరో 1,000 మంది వరకు నిరాశ్రయులయ్యారు.

ఇతర రాష్ట్రాల్లో కూడా…

హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లలోని సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. ఢిల్లీ దాడులలో మాజీ కేంద్ర మంత్రి హెచ్‌కెఎల్‌ భగత్‌, కాంగ్రెస్‌ నేతలు జగదీష్‌ టైట్లర్‌, కాంగ్రెస్‌ ఎంపీలు సజ్జన్‌ కుమార్‌, లలిత్‌ మకాన్‌, ధరమ్‌ దాస్‌ శాస్త్రి, అల్లర్ల కేసుల్లో, ఆకతాయిలను ప్రేరేపించినందుకు కీలక నిందితులు. అయితే, వీరిలో కేవలం సజ్జన్‌ కుమార్‌ను మాత్రమే ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

సిక్కులపై దాడులు కేవలం ఢిల్లీలో మాత్రమే జరిగాయని భావిస్తుంటాము. కానీ కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి రామాదులరి సిన్హా పార్లమెంట్‌లో జనవరి, 1985లో ఇచ్చిన సమాధానం ప్రకారం 16 రాష్ట్రాలలో హింసాయుత సంఘటనలు జరిగాయి. వాటిల్లో 12 రాష్ట్రాలలో హత్యలు జరిగాయి.

ప్రముఖ జర్నలిస్ట్‌ కుష్వంత్‌ సింగ్‌ ‘మై బ్లీడిరగ్‌ పంజాబ్‌’ పేరుతో 1992లో ప్రచురించిన గ్రంథం ప్రకారం ఇందిరా గాంధీ హత్య జరిగిన రాత్రి అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకులు ‘సిక్కులకు ఎప్పటికీ మరచిపోలేని గుణపాఠం ఎలా చెప్పాలో’ నిర్ణయించడానికి సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. గుడిసెల పట్టణాలు, పొరుగు గ్రామాలలో నివసించే అసాంఘిక శక్తులను సమీకరించారు’.

‘సిక్కుల గృహాలు, దుకాణాలను గుర్తించారు. కమాండర్‌ ట్రక్కులలో ఇనుప రాడ్లు, కిరోసిన్‌ నూనె డబ్బాలు, పెట్రోల్‌లను సమకూర్చుకొని నవంబర్‌ 1వ తేదీ తెల్లవారుజామున, సిక్కు వ్యతిరేక హింసాకాండను ప్రారంభించారు. ఉక్కు కడ్డీలు, జెర్రీ క్యాన్ల నిండా కిరోసిన్‌ ఆయిల్‌, పెట్రోలింగ్‌తో ఆయుధాలతో కూడిన ట్రక్కుల లోడ్లు నగరం చుట్టూ తిరిగారు. గురుద్వారాలకు నిప్పు పెట్టారు’ అని అందులో ఆయన వివరించారు.

ఢిల్లీలో, అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు, పారా-మిలటరీ బలగాలు అసమర్ధులు కాకపోయినా అందుకు సుముఖంగా లేరని కుష్వంత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అసలేమీ జరుగుతుందో గ్రహించడానికి అధికారులకు 24 గంటల సమయం పట్టింది. కర్ఫ్యూను ప్రకటించినా, విధించలేదు. చూడగానే కాల్పులు జరిపే అధికారం ఇచ్చినా, ఎక్కడా ఎవ్వరు అమలుపరచలేదు.

వీధులలో పెట్రోలింగ్‌ పార్టీలు ఎక్కడ కనిపించకపోయినా ప్రభుత్వ ఆధీనంలోని ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఎక్కువగా వినిపించిందని అంటూ ఆయన ఆ నాటి భయానిక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. గడువుకన్నా ముందే రాజీవ్‌ గాంధీ ఎన్నికలకు వెళ్లారు. అన్ని ప్రచార సాధనాల ద్వారా భారీ ప్రచారం ప్రారంభించారు. అన్ని భాషల పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చారు.

పంజాబ్‌, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజిత్‌ సింగ్‌ నరులా, నవంబర్‌ 1 ఉదయం స్థానిక టెలివిజన్‌లో ఇందిరా మృతదేహం ఉన్న తీన్‌ మూర్తి వెలుపల ఉన్న జనం ‘‘ఖూన్‌ కా బద్లా ఖూన్‌’’ , ‘‘ఖూన్‌ కా బద్లా ఖూన్‌’’ అని నినాదాలు చేయడం చూసి ఆశ్చర్యపోయారు. సర్దార్‌ ఖౌమ్‌ కే గద్దర్‌, లేదా ‘సర్దార్లు దేశ ద్రోహులు’ అని పెద్ద సంఖ్యలో ఆవేశపూరితంగా నినాదాలు ఇస్తుంటే వారిని ఆపడానికి ప్రభుత్వ అధికారులు ఎవ్వరు ప్రయత్నించగాపోవడాన్ని చూసారు.

నూతనంగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్‌గాంధీ కూడా అటువంటి నినాదాలను ఆపే ప్రయత్నం చేయలేదు. తరచుగా వినిపించిన ఇతర నినాదాలు: ‘‘మార్‌ డియో సలోన్‌ కో,’’ (ఆ వెధవలను చంపండి), ‘‘సిఖోన్‌ కో మార్‌ దో ఔర్‌ లూట్‌ లో,’’(సిక్కులను చంపి వారిని దోచుకోండి), ‘‘సర్దార్‌ కోయి భీ నహిన్‌ బచ్నే పై’’ (ఏ సర్దార్‌ని తప్పించుకోనివ్వవద్దు).

అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమీషన్‌ 2005లో ప్రభుత్వంకు సమర్పించిన చివరి నివేదికలో హింసాత్మక దాడులు జరిగిన తీరును పరిశీలిస్తే, బహుశా సిక్కులపై దాడులు కాంగ్రెస్‌ లేదా వారి మద్దతుదారులు లేదా కొన్ని ఇతర సంస్థలు లేదా సంఘాలచే నిర్వహించబడి ఉండవచ్చని స్పష్టం చేసింది. రాకబ్‌ గంజ్‌ సాహిబ్‌ గురుద్వారా వద్ద విధ్వంసం సృష్టించిన గుంపులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కమల్‌ నాథ్‌, వసంత్‌ సాఠే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడం గమనార్హం.

ప్రధాని రాజీవ్‌ గాంధీ నవంబర్‌ 19, 1984న తన ప్రసంగంలో ‘ఇందిరాజీ హత్య తర్వాత దేశంలో కొన్ని అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా కోపంగా ఉన్నారని మాకు తెలుసు. కొన్ని రోజులు భారతదేశం అల్లాడిపోయినట్టు అనిపించింది. కానీ ఒక బలమైన వృక్షం కూలినప్పుడు, దాని చుట్టూ ఉన్న భూమి కొద్దిగా కంపించడం సహజం’’ అంటూ స్పష్టంగా ఈ అల్లర్లను సమర్ధించారు.

గురుచరణ్‌ సింగ్‌ బబ్బర్‌ సంపాదకీయంలో ఈ అల్లర్లపై ప్రచురించిన ఒక గ్రంధంలో ఒక సంఘటనను వివరించారు. మాజీ ప్రధాని, చరణ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజీవ్‌ గాంధీని కలుసుకుని, కాంగ్రెస్‌ ఎంపీలు తమ మద్దతుదారులను కస్టడీ నుండి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు.

మన్మోహన్‌ సింగ్‌ ప్రకటన

2005లో, భారత ప్రధానమంత్రి, స్వయంగా సిక్కువాడైన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌, ఈ సంఘటనలపై తాజా న్యాయ విచారణకు సంబంధించి లోక్‌సభలో ఈ విధంగా చెప్పారు.

1984లో ఏమి జరిగింది? భయంకరమైన జాతీయ విషాదం. అది మనందరినీ సిగ్గుపడేలా చేసింది. ఇందిరా గాంధీ హత్య, సిక్కు వ్యతిరేక అల్లర్లకు దారితీసిన తదుపరి సంఘటనలు. ఆ ఘోరమైన సంఘటనలు రెండూ ఎప్పుడూ జరగకూడదు. అవి మన జాతీయ మనస్సాక్షికి మచ్చ.

ఈ విషయంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలు ఉండవలసిన అవసరం లేదు. కానీ ఒక ప్రశ్న తలెత్తుతుంది: ‘‘మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము? 21 సంవత్సరాలు గడిచాయి… ఒకటి కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇప్పటికీ ఏదో నిజమో బయటపడలేదు. న్యాయం గెలవలేదు అనే భావన కొనసాగుతోంది.

అందువల్ల, ఈ సువిశాల భారతదేశంలో న్యాయాన్ని మన ప్రజలు అభినందిస్తున్నారనే భావనను కలిగించే ప్రక్రియలను మనం వేగవంతం చేసే మార్గాలను కనుగొనడం మన సమిష్టి బాధ్యత. చర్చ ఆ స్వరాన్ని తీసుకుంటే బాగుండేది. కానీ… చర్చ పక్షపాత ధోరణిలో ఉంది. దాని ప్రయోజనం నెరవేరదని నేను సభకు గౌరవంగా చెబుతున్నాను. మరోసారి చెప్పండి, ఇది జాతీయ అవమానం, గొప్ప జాతీయ, మానవ విషాదం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 1984 సిక్కుల ఊచకోతకు 37 ఏళ్ళు!… న్యాయం దక్కేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎమర్జెన్సీ – ఓ చీకటి అధ్యాయం
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975, జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా, 1977 మార్చ్ 21 అర్ధరాత్రి రద్దు చేయబడింది. సుమారు 21 నెలలపాటు కొనసాగిన ఆ కాలఖండంలో అనేక వేలమంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు. సుమారు లక్షా పాతికవేలమంది జైలుపాలు కాగా, అందులో 90 శాతం మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే.

ఎమెర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్ధులను జైలుపాలు చేయడంతోపాటు ప్రజాస్వామ్య హక్కులను హరించివేసింది. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు హరించివేయబడ్డాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్ షిప్ ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ఆర్ ఎస్ ఎస్ తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. నియంత ఇందిరాగాంధీ, ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్ట్ చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి.

అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్ ఎస్ ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు మౌనంగా ఊరుకోలేదు. ఇందిరా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చాయి. అనేక వేలమందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి, సమన్వయంతో విజయవంతమైన పోరాటం కొనసాగించిన ఘనత ఒక్క ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)కె దక్కుతుంది.

ఎమర్జెన్సీ ప్రకటించి నెలరోజులు పూర్తైనప్పుడు 1975 జులై 26న ఆర్ ఎస్ ఎస్ దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహాలు, గంటానాదాల కార్యక్రమాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గంటలు మ్రోగించడం ద్వారా ప్రజలు తమ నిరసన తెలియజేశారు. 1975 జులై 26 నుంచి పదిరోజులపాటు వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ప్రముఖులు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు.

ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమపు రెండవ అంకంలో 1975 నవంబర్ 14 నుంచి 1976 జనవరి 26 వరకు సత్యాగ్రహాలు జరిగాయి. ప్రతివారం పది, 15మందితో అన్ని జిల్లాలు, చిన్నచిన్న పట్టణాలలో సత్యాగ్రహాలు చేశారు. అనేకచోట్ల మహిళా సత్యగాహాలు కూడా చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ప్రజలను చైతన్యం చేసి అరెస్ట్ అయ్యారు. అంతకుముందు 1975 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అజ్ఞాత కార్యకర్తలు కరపత్రాలను పంచారు. ప్రజాస్వామ్యాన్ని ఇందిరా గాంధీ అపహాస్యంపాలు చేస్తున్న వైఖరిని ఆ కరపత్రాల్లో తీవ్రంగా ఎండగట్టారు. ఈ ఉద్యమంలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పటికి మొత్తం పోరాటం లోక సంఘర్ష సమితి (ఎల్ ఎస్ ఎస్) పేరుమీద లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో జరిగింది.

పత్రికలపై సెన్సార్ షిప్ ఉండడంతో అన్ని భాషలలోనూ అజ్ఞాత పత్రికలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వందేమాతరం, ఎక్స్ రే, గర్జన, అంతర్వాణి, ప్రజావాణి, జనవాణి పేర్లతో అజ్ఞాత పత్రికలు ప్రచురించారు. తొలిరోజుల్లో వివిధ పేర్లతో అజ్ఞాత పత్రిలౌ వెలువడినప్పటికి చివరివరకు వందేమాతరం, ఎక్స్ రే పత్రికలు కొనసాగాయి.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 1975 ఆగస్ట్ 15న ఆనాటి గవర్నర్ జస్టిస్ ఓబుల్ రెడ్డి భీమునిపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ జరిగింది. అదేవిధంగా తణుకులో జరిగిన గవర్నర్ కార్యక్రమంలో కూడా కరపత్రాలు పంచారు. 1976 జనవరిలో విశాఖపట్నంలో జరిగిన సంజయ్ గాంధీ సభలో వైద్య విద్యార్ధులు ధర్నా చేశారు. ఇలా రాష్ట్రం అంతటా అన్ని కీలకమైన సభల్లో అజ్ఞాత సాహిత్య వితరణ జరిగింది. దేశంలో జరుగుతున్నా అన్ని విషయాలు అజ్ఞాత పత్రికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండేవి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలకు చెందిన సుమారు 250 మందిని `మీసా’ చట్టం కింద అరెస్ట్ చేశారు. సుమారు రెండున్నర నెలలపాటు జరిగిన సత్యాగ్రహాల్లో 354 స్థలాల్లో 5వేలమంది సత్యాగ్రహం చేశారు. వీరిలో 1,655మందిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో డి ఐ ఆర్ చట్టం కింద 703మందిని అరెస్ట్ చేయగా వీరిలో 672మంది ఆర్ ఎస్ ఎస్ పరివార సంస్థలకు చెందినవారే. దేశవ్యాప్తంగా మొత్తం 23వేలమంది మీసా, డి ఐ ఆర్ కింద అరెస్ట్ చేశారు. ఒక లక్షా 54 వేలమంది సత్యాగ్రహం చేశారు. ఈ గణాంకాలన్నీ అందినంత సమాచారం మేరకే.

21 నెలలపాటు మహా ఉధృతంగా సాగిన అజ్ఞాత ఉద్యమ ఫలితంగా 1977 మార్చి మూడవ వారంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరా గాంధీతోసహా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం సంభవించింది. పాత కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్ట్ పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ అఖండ విజయం భారత పోరులది, ప్రజాస్వామ్యానిదే.

– వేదుల నరసింహం

(రచయిత సీనియర్ జర్నలిస్ట్)

VSK TELANGANA సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎమర్జెన్సీ – ఓ చీకటి అధ్యాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.