#Hundi collections – Vishwa Samvad Kendra Andhra Pradesh

శబరిమల అయ్యప్పకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!
కేరళ (శబరిమల) – శబరిమల అయ్యప్పకు భారీగా కానుకలు.. హుండీ ఆదాయం లభించింది. ఈ సీజన్​లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ.330 కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుండగా.. ఈ సీజన్​లో ఇప్పటివరకు రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇది అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు. 2018 సీజన్​లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని.. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ భారీగా ఆదాయం పెరిగిందని వివరించారు. రెండేళ్లు కరోనా విజృంభణ తర్వాత ఈ సీజన్​లోనే భక్తులను పూర్తిస్థాయిలో శబరిమలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చిన్నారులు సైతం స్వామి దర్శనానికి పోటెత్తారు. మొక్కులు, కానుకలను అయ్యప్పకు సమర్పించారు. కాగా, హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తైందని అధికారులు తెలిపారు. ఇంకా కాయిన్లను లెక్కించాల్సి ఉందని తెలిపారు. ఇవి మరో రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర కానుకలను కలుపుకుంటే.. మొత్తం ఆదాయం రూ.330 కోట్ల వరకు చేరొచ్చని చెప్పారు. మరోవైపు, ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. హుండీ ఆదాయాన్ని లెక్కించే విషయంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డొనేషన్లు, కరెన్సీ నోట్ల లెక్కింపు విషయంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అని పరిశీలించాలని బోర్డుకు చెందిన విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కొన్ని నోట్లు చిరిగిపోయి, నిరుపయోగంగా మారిపోతున్నాయన్న వార్తల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు స్పందించింది.

The post శబరిమల అయ్యప్పకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శబరిమలలో ఉద్యోగుల ఇష్టారాజ్యం!
యథేచ్ఛగా హుండీ సొమ్ము చోరీ

ఘటనలను పట్టించుకోని సర్కారు

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోని ఉద్యోగులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. హుండీ సొమ్ము యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఈ చర్యలను పలుమార్లు నిజాయితీగల హిందూ ఉద్యోగులు అడ్డుకుంటున్నా ఏదో రకంగా ఆలయ సొమ్ము దొంగలపాలవుతోంది. తాజాగా, ఓ టెల్లర్‌ హుండీ సొమ్ము దొంగిలిస్తూ దొరికిపోయాడు. ఈ సీజన్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రెండో వ్యక్తి ఇతను.

ఈ నెల ఎనిమిదో తేదీన హుండీ లెక్కింపులో నిమగ్నమైన గుమస్తా రూ.3,500 దొంగిలించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఇదిలావుండగా, గతంలో కూడా ఇటువంటి చోరీలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్‌ 16, 2021న, కరెన్సీ లెక్కింపులో నిమగ్నమై ఉన్న శంకరనారాయణ పనికర్‌ అనే ఉద్యోగి కూడా శబరిమల హుండీ నుండి డబ్బును దొంగిలించినట్టు అధికారులు గుర్తించారు. అతని గదిలో సోదాలు చేయగా ఒక సంచిలో రూ.42,470లు లభ్యమయ్యాయి. ఈ సొమ్ము రికవరీ చేసి, కేసు పెట్టారు.

మరో సంఘటన

ధనలక్ష్మి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడానికి సిద్ధం చేసిన నోట్లలో సైజు వ్యత్యాసాన్ని గమనించారు నిజాయితీ గల హిందూ ఉద్యోగులు. సైజు వ్యత్యాసానికి కారణం.. ట్రెజరీ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులే… అయితే, నెయ్యి వల్ల నోట్లు జిడ్డుగా మారాయని… దీంతో లెక్కింపు యంత్రం తప్పుగా చూపించిందని ఉన్నతాధికారులు ఈ అవినీతిని పట్టించుకోలేదు.

శబరిమల సన్నిధానంలో డబ్బు, ఇతర ప్రసాదాల చోరీ జరగకుండా ఉండేందుకు ‘నిరంతర నిఘా’ నిర్వహించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా… ఇలాంటి దొంగతనాల గురించి శబరిమల ప్రత్యేక కమిషనర్‌కు తెలియజేయాలని టీడీబీ(ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు)ని కోర్టు ఆదేశించింది.

కాగా, దొంగతనాలను నియంత్రించేందుకు బాడీ స్కానర్లు, ఎక్స్‌-రే యూనిట్లు వంటి అధునాతన చెకింగ్‌ గాడ్జెట్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలని ఉద్యోగులు పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే, సాంకేతికత, ఖర్చును ప్రస్తావిస్తూ సర్కారు ఆలస్యం చేస్తోందని హిందూ ఉద్యోగులు ఆరోపించారు.

ఇప్పుడు మనం చూస్తున్నది నామ మాత్రమేనని, ఆలయ స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచిన 40 కిలోల బంగారం, 100 కిలోల వెండి మాయమైనట్టు 2019లో గుర్తించారని స్థానిక భక్తులు తెలిపారు. అయితే, అవినీతి నిరోధక శాఖ అధికారులు, వారి కమ్యూనిస్ట్‌ మాస్టర్లచే ‘ఆడిట్‌’ నిర్వహించారని, ఈ ఆడిట్‌ అనంతరం ఎటువంటి వ్యత్యాసాలు లేవని తేల్చిపారేశారని భక్తులు ఆవేదన చేశారు. ఆలయంలో చోరీకి పాల్పడిన ఎక్కువ మంది కమ్యూనిస్టు పార్టీ యూనియన్‌ నాయకులతో అనుబంధం ఉన్నవారేనని భక్తులు ఆరోపిస్తున్నారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శబరిమలలో ఉద్యోగుల ఇష్టారాజ్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.