HINDU – Vishwa Samvad Kendra Andhra Pradesh

బీహార్‌లో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు
కతిహార్: లవ్​ జిహాద్​పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆ తరహా ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. హిందూ యువతిని పెళ్ళి చేసుకున్న ముస్లిం యువకుడు మతం మారాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.

పోలీసుల కథనం ప్రకారం.. బీహార్​ కతిహార్ జిల్లా​కు చెందిన తాకీర్​ ఆలాం దుబాయ్​లో ఉద్యోగం చేస్తున్నాడు. అర్చన అనే యువతికి 2015లో ఫేస్​బుక్​కు ద్వారా పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో తాను ఓ హిందువునని.. తన పేరు రాజ్​ రాజ్​పుత్​గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. ​దుబాయ్​ నుంచి వచ్చిన తాకీర్.. అర్చనను తన కుటుంబ సభ్యుల మధ్య హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు.

కొద్ది రోజుల తర్వాత అర్చనను తన తన సోదరి ఇంటికి తీసుకెళ్ళాడు తాకీర్​. అప్పుడే అతడొక ముస్లిం అని.. అంతకముందే అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని అర్చనకు తెలిసింది. అప్పటినుంచి తాకీర్,​ అతడి కుటుంబ సభ్యులు అర్చనను తీవ్రంగా కొడుతూ, మతం మారమని ఇబ్బందులకు గురిచేశారు. “నేను ఒక హిందువు. నన్ను మోసం చేసి తాకీర్​ వివాహం చేసుకున్నాడు. పెళ్ళి తర్వాత తన సోదరి ఇంట్లో ఉంచాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు. ఇప్పుడు మతం మారమని నన్ను తీవ్రంగా హింసిచాడు.” అని అర్చన పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం
భాగ్యనగరం: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్ హాస్టల్ లో జూనియర్లు – సీనియర్లు ఘర్షణ పడ్డారని మాత్రమే పోలీసులు పేర్కొంటున్నారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థుల దాడిగానే విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది. గొడవ జరిగిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించింది.

ఈ సందర్భంగా గత శనివారం వైరల్‌గా మారిన ఒక వీడియోలో ఒక హిందూ విద్యార్థిని ఇతర విద్యార్థులు `అల్లాహు అక్బర్’ అనమని వత్తిడి చేస్తూ భౌతికంగా కొట్టడం కనిపించడంతో ఈ విషయమై పెద్ద అలజడి రేగింది. లా చదువుతున్న హిమాంక్ బన్సల్ అనే విద్యార్థుని దారుణంగా హింసించడం స్పష్టం అవుతుంది.

https://vskandhra.org/wp-content/uploads/2022/11/attck.mp4

ఈ వీడియోలను సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ నగర కమిషనర్, మంత్రి కల్వకుంట్ల రామారావులకు బాధితులు ట్విట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కానీ, బాధితులకు న్యాయం జరగడం లేదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి పండరినాథ్ ఆరోపించారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని వారు విమర్శించారు.

సీనియర్లు, జూనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు సమాచారం ఇస్తూ.. అసలు విషయాన్ని దాటవేస్తున్నట్టు వారు మండిపడ్డారు. ఇది సీనియర్, జూనియర్ల గొడవ కాదని, మతపరమైన దాడి అని వారు స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన దుండగులను కమ్యూనల్ కేసు కింద అరెస్టు చేసి, యూనివర్సిటీ నుంచి వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చి బాధితులకు న్యాయం చేయాలని యూనివర్సిటీ అధికారులను, పోలీసులను వారు కోరారు. తాత్సారం ప్రదర్శించి అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తే, సమస్య ముదిరి వివాదం చెలరేగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై శంకరపల్లి పోలీసులను, అక్కడే విలేకరులను అడిగితే ఎవరికి వారు తలో దిక్కున సమాచారం ఇస్తూ వాస్తవం దాస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతుందని వారు విమర్శించారు.

ఈ విషయంలో యూనివర్సిటీ పెద్దలు వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కొరవడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా ఇక్ఫాయ్ యూనివర్సిటీలోని గొడవల వాస్తవ విషయాలు వెలుగులోకి రావాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ గదిలో ఒకే విద్యార్థిపై పదుల సంఖ్యలో దుండగులు దాడి చేసిన వీడియోలు, అల్లాహు అక్బర్ అంటూ బలవంతంగా అనిపించిన వీడియోలు తమ దగ్గర ఉన్నాయని వారు తెలిపారు. కావాలంటే వాటిని పోలీసులకు అప్పజెప్తామని పేర్కొన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

12 మందిపై పోలీసుల కేసు

మరోవంక, ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 12 మందిపై కేసు నమోదు చేసి, ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ మతాన్ని కించపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో వివాదం మొదలైందని సమాచారం. ఈ క్రమంలో జూనియర్‌పై పది మంది సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.

ఓ జూనియర్‌ను సీనియర్లు చితక బాదారు. రూమ్‌లో డోర్ పెట్టి అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం విద్యార్థులు కాలేజ్ గ్రూప్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తొలుత ఇరువురిని రాజీకుదుర్చీ పంపించారనే ఆరోపణలు వస్తున్నాయి. ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చనున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. మంత్రి ట్వీట్‌తో ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మందిపై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

`హిందూ’ పదంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
బెంగళూరు: `హిందూ’ పదంపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, పర్షియా భాషలో హిందూ పదానికి అత్యంత మురికి అనే అర్థం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

పర్షియన్ పదమైన హిందూతో భారత్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. బెళగావి జిల్లాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి మాట్లాడుతూ నిజానికి హిందూ అనే పదానికి భారతదేశానికి సంబంధమే లేదని చెప్పారు. హిందూ అని ఎలా ప్రకటించుకుంటారని ఆయన ప్రశ్నించడం దుమారం రేపింది.

ఆ పదానికి మూలాలు భారతదేశంలో లేవని చెప్పారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్ నుంచి వచ్చిందని తెలిపారు. ‘హిందూ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? అది మనదేనా?’ అని ప్రశ్నించారు. ‘ఇది పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతానికి చెందినది. హిందూ అనే పదానికి భారత్‌తో సంబంధం ఏమిటి? మీరు దానిని ఎలా అంగీకరిస్తారు? దీనిపై చర్చ జరగాలి’ అని స్పష్టం చేశారు.

అంతేగాక ‘హిందూ అనే పదానికి అర్థం తెలిస్తే మీరు సిగ్గుపడతారు. దీని అర్థం అసభ్యకరం’ అని జార్కిహోళి వ్యాఖ్యానించారు. హిందూ పదం ఎక్కడ నుంచి వచ్చిందో అన్నది వికీపీడియా ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు హిందూ పదంపై జార్కిహోళి మాట్లాడిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై మండిపడింది. ఇది హిందువులను అవమానించడం, రెచ్చగొట్టడం అని ఆ పార్టీ ఆరోపించింది.

ఓ పక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తుండగానే సతీశ్ జార్కిహోలి హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ సబబని భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ ప్రశ్నించారు. తొలుత శివరాజ్‌పాటిల్, నేడు సతీశ్ జార్కిహోలి హిందువులను అవమానిస్తున్నారంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు. హిందూ ధర్మాన్ని అవమానించడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post `హిందూ’ పదంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నందిగామలో ఘనంగా ఏకాదశ రుద్రాభిషేకం
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ సత్య సాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదా అధ్యయన విభాగం ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సత్యసాయి వేద విభాగం ఇంచార్జ్ హరి ప్రసాద్ శర్మ పరివేక్షణలో 40 మంది వేద పండితులు రుద్రాభిషేకాన్ని వేద మంత్రోత్సవంతో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి లోక కల్యాణాన్ని ఉద్దేశించి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. ఆధ్యాయంతో వేద మంత్రోత్సవాల మధ్య రుద్రాభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ వాసుదేవరావు, తదితరులు ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నందిగామలో ఘనంగా ఏకాదశ రుద్రాభిషేకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు!
బ్రహ్మపుత్రి: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

క్రైస్తవ మతంలోకి మారేందుకు తమకు ఎన్నో ఆశలు చూపించినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. మగంట్ పూరమ్‌లోని మలిన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హిందూ దేవీదేవతల విగ్రహాలకు దూరంగా ఉండాలంటూ తమను బలవంత పెట్టారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రాథమిక సమాచార నివేదిక ప్రకారం కరోనా సంక్షోభ సమయాన్ని నిందితులు ఆసరగా తీసుకున్నారు. మతమార్పిడి కోసం డబ్బు, ఆహారం ఆశ చూపించారని, ఇప్పుడు క్రైస్త్రవాన్ని అంగీకరిస్తూ హిందూ దేవీదేవతల విగ్రహాలను, పటాలను తొలగించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు స్థానిక బీజేపీ నేతతో కలిసి బ్రహ్మపుత్రి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.

తాము సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నట్టు వారు చెప్పారు. ”మతమార్పిడికి మాపై ఒత్తడి తెస్తున్నారు. ఆధార్ కార్డులలో పేర్లు మార్చుకోవాలని అడుగతున్నారు. దీపావళి రోజు పూజలు చేస్తుంటే ఇళ్ళల్లోకి చొరబడి విగ్రహాలు ధ్వంసం చేశారు” అని ఆరోపించారు.

“మీరు మతం మార్చుకుని కూడా ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు? మేము నిరసన తెలిపితే చంపుతామంటూ బెదరించారు” అని బాధితులు శివ, బిన్వ, అనిల్, సర్దార్, నిక్కు, బసంత్, ప్రేమ, టిట్లి, రాణి తదితరులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ పీయూష్ సింగ్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత”
కర్నూలు: మహానంది క్షేత్రంలో ఈ నెల 23న ఆదివారం ఉదయం ఏడు గంటలకు పలువురి సేవకులతో భారీ ఎత్తున గరుడ నంది నుండి నగర సంకీర్తన చేశారు. తదనంతరం “మన ఊరు – మన గుడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాలు, కోనేరులోని పాచిని శుభ్రం చేశారు. కార్యక్రమం అనంతరం భజన బృందం వారు మహానంది క్షేత్రంలో భజనలు నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రం వారు వెయ్యి మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం మన ఊరు – మన గుడి – మన బాధ్యత కార్యకర్తలకే సాధ్యమని సేవలోపాల్గొన్న నిర్వాహకులు శ్రీదేవి (న్యాయవాదులు), కర్నూల్ నుండి విచ్చేసిన యోగ సాధకురాలు అనురాధ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ శివ కుమార్ రెడ్డి, ధర్మ జాగరణ రాయలసీమ కన్వీనర్ రాంప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చోళులు హిందువులా? లేదా మతం లేని తమిళులా?
చోళులు హిందువులా? లేక పొన్నియన్ సెల్వన్ I సినిమా విజయం తర్వాత కొన్ని వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా మతం లేని తమిళులా? మొదటి నుండి డీఎంకే భావజాల ప్రభావంతో తమిళనాడులో ఏదో ఒక వంకతో హిందూ వ్యతిరేక వాదనలు వ్యాప్తి చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఆర్య – ద్రావిడ వివాదం నుండి, తదుపరి కాలంలో భాషా వివాదం వరకు, తాజాగా, తమిళులు అసలు హిందువులే కాదనే వాదనలను పలు వర్గాలు లేవనెత్తే ప్రయత్నాలు చేస్తున్నారు.

పొన్నియన్ సెల్వన్ I సినిమాలో చోళ రాజులను హిందూ రాజులుగా చూపించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ చోళ రాజులు హిందూ రాజులు కారని పేర్కొనడం, అసలు తమిళులు హిందువులే కారంటూ ఓ వివాదం లేవదీశారు. వారిదొక్క ప్రత్యేక మతం అంటూ రాజకీయాలలో విఫలమైన మరో తమిళ నటుడు కమల్ హాసన్ వాదనలు వినిపించడంతో ఈ వివాదం రాజుకోవడం ప్రారంభమైనది. కొందరు రాజకీయ నాయకులు సహితం ఈ వివాదంకు ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారు. దానితో చోళులు హిందువులేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇటువంటి వివాదాలు రేపుతున్న వారికి ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే చోళులు తమ గురించి ప్రతి విషయంపై దాదాపుగా వివరాలను తామే నమోదు చేసుకున్నారు. ఆలయ శాసనాలపై, రాగి పలకలపై, తాళపత్రాలపై ఎన్నో సాక్ష్యాధారాలను వదిలారు. తరతరాలుగా మనుగడలో ఉంటూ గుర్తింపు పొందుతున్న వారి సంస్కృతికి సంబంధించిన సత్యాన్ని ఇవి స్పష్టంగా తెలియ చేస్తున్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:

ది కాపర్ ప్లేట్ వంశవృక్షం చోళ రాగి పలకలు వారి వంశావళిని ట్రాక్ చేసే వివరణాత్మక వంశాన్ని అందిస్తాయి. అన్బిల్ రాగి ఫలకాలు సూర్యుడి నుండి బ్రహ్మ, తిరుమల (విష్ణు) వరకు వారి వంశాన్ని గుర్తించాయి. చోళులు తమను తాము సూర్యవంశీలుగా భావిస్తారు. ఆసక్తికరంగా, శివభక్తులైన చోళులు, విష్ణువును తమ రాజవంశానికి మొదటి రాజుగా పేర్కొంటారు.

తిరుగులేని సాక్ష్యాధారాలు

హరిశ్చంద్రుడు, దుష్యంతుడు, భరతుడు, భగీరథ వంటి పురాణ రాజుల పేర్లతో జాబితా కొనసాగుతుంది. రఘువంశానికి వెళుతున్నప్పుడు, రఘు వారి 36వ రాజుగా జాబితాలో ఉండగా, వెంటనే దశరథ్, రాముడు అనుసరించారు. కొచ్చెంగనన్ అనే పురాణ రాజు, సూర్యకాంతి నేరుగా శివునిపై పడకుండా లింగంపై వెబ్‌ను నిర్మించిన సాలీడుగా పురాణాలలో ప్రస్తావించారు.

సాలీడు మ‌ళ్ళీ చోళ రాజుగా జన్మించింది. వైష్ణవుడు తిరుమంగై ఆళ్వార్ చేత 70 శివాలయాలను నిర్మించిన ఘనత ఆయనది. మొత్తం ఆరు ప్రాథమిక హిందూ దేవుళ్లతో చోళ సంబంధం చోళుని కుటుంబ దైవం (కుల దైవం) దుర్గ/కాళి రూపమైన నిసుంభసూధని, వీరి కోసం విజయాలయ చోళుడు 846లో చోళ పాలనను పునరుద్ధరించిన వెంటనే ఆలయాన్ని నిర్మించాడు.

సాలువన్‌కుప్పంలోని మురుగన్ ఆలయంలో పరాంతక-1 (907), రాజరాజ-1 (985) కాలానికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి. శ్రీలంకలోని నల్లూరు కామదసామి ఆలయాన్ని నిర్మించడానికి చోళ రాజు కందరాదిత్యుని భార్య సెంబియన్ మాదేవి మంజూరు చేసిన దాఖలాలు ఉన్నాయి. చోళ చిత్రాలు వినాయకుడి చిత్రాలతో నిండి ఉన్నాయి.

కులోతుంగ శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి అత్యధిక నిధులు ఇచ్చాడు. పద్మభూషణ్ ఆర్ నాగస్వామి రాసినట్లుగా, “ఎపిగ్రాఫికల్ అధ్యయనం నుండి వెలువడుతున్న చిత్రాలు ఏమిటంటే, కులోత్తుంగ-1 కాలం చోళుల ఆధ్వర్యంలోని శ్రీరంగం ఆలయానికి అత్యంత సంపన్నమైన కాలం”.

చోళ రాగి పలకలు, శాసనాలు సంస్కృతం, తమిళంలో భాషలలో ఉన్నాయి. రాజారావు వేద, తమిళ స్తోత్రాల గాయకులకు రూ.1200 (1978 విలువలో) సమాన వేతనం ఇచ్చాడు. రాజాధి రాజ చోళుడు (1018) యజ్ఞాలు చేసిన, గ్రంథాలను అనుసరించే చాలా చోళ రాజులకు అనుగుణంగా అశ్వమేధ యజ్ఞాలు చేసిన ప్రస్తావన ఉంది.

సంక్షిప్తంగా, హిందూమతంలోని షణ్మఠాలు అందరూ చోళ రాజులచే పోషించబడ్డారు. అనుసరించబడ్డారు. విష్ణువు మొదటి రాజుగా ఉన్న వైష్ణవం నుండి, సూర్యుని సంతతి కారణంగా శౌరం వరకు, వారి వంశ దైవం కోసం నిశుంబసూధనితో శక్తం, కౌమారం స్కంద దేవాలయాలను నిర్మించడం, గణపత్యం వరకు శిల్పకళా గణేశుడు, శైవం శివారాధకుల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

దుష్ప్రచారాన్ని ఎప్పుడో కొట్టిపారవేసిన కన్నదాసన్

అయినప్పటికీ, చోళులు హిందువులు కాదని ఎవరైనా ఎలా చెప్పగలరు? అయితే ఇదంతా కొత్తేమీ కాదు. 1973లో కన్నదాసన్ అర్థముల్లా హిందూ మతం పార్ట్ -2 రాసినప్పటి నుండి “తమిళులు హిందువులు కాదు” వంటి చారిత్రక అజ్ఞానపు ప్రకటనలు గుప్పుమంటున్నాయి. ఆయన ఇటువంటి వంచనలను క్రమపద్ధతిలో కూల్చివేశారు.

సింధు లోయ నాగరికత నుండి తమిళులకు మతం ఉందని, తిరువల్లువర్ హిందూ సన్యాసి అని ప్రస్తావిస్తూ వ్యాసాలు రాశారు. అలాంటి అజ్ఞానపు ప్రకటనలు ఒకరి అభిమాన దర్శకుడు, నటులు లేదా రాజకీయ నాయకుడి నుండి వచ్చినప్పుడు, వాటి ప్రభావంతో ప్రభావితం కాకుండా, తగు జాగ్రత్తతో సత్యాన్ని తెలుసుకోవడం అంద‌రి కర్తవ్యం.

డబ్బు, భావజాలం, అధికారం కోసం మనుషులు ఎంత సులభంగా అబద్ధాలు ఆడతారో చోళులకు తెలుసు. అందుకే వారు తమ సత్యాలను డాక్యుమెంట్ చేయడానికి ప్రతి చర్య తీసుకున్నారు. అన్నింటికంటే, రాజా హరిశ్చంద్రుని వారసులుగా భావించిన చోళుల గురించి నిజం చెప్పడం సరైనది.

క్యాథలిక్ క్రైస్తవులు కాదని చెప్పడం లాంటిది

శైవ మతం, వైష్ణవ మతం, శక్తి మతాల మధ్య లోపాలను సృష్టించే ప్రయత్నాలను నిందిస్తూ, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కరణ్ సింగ్ చోళ రాజవంశానికి చెందిన రాజు రాజరాజ I హిందువు కాదని చెప్పడం “పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది” అని కొట్టిపారేసారు. “రాజరాజ చోళుడు హిందువు కాదు శైవుడని చెప్పడం, ఎవరైనా క్యాథలిక్ అని, క్రైస్తవుడు కాదని చెప్పడం లాంటిది” అని డాక్టర్ కరణ్ సింగ్ ఎద్దేవా చేశారు.

“శివుడు ఆదిమ హిందూ దేవత, శ్రీనగర్ నుండి రామేశ్వరం వరకు సహస్రాబ్దాలుగా లక్షలాది మందికి తీవ్రమైన భక్తిని కేంద్రీకరించారు,” అని ఆయన స్పష్టం చేశారు. చక్రవర్తి శిల్పకళకు అద్భుతంగా ఉన్న గొప్ప శివాలయాలలో ఒకదానిని, ప్రత్యేకంగా గొప్ప బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడని ఆయన గుర్తు చేశారు.

హిందువు అనే పదం ఆ తర్వాత పట్టు సాధించి ఉండవచ్చని, అయితే శివుడు, విష్ణువు, హనుమంతుడు, గణేశుడు, మహాలక్ష్మి, మహాకాళి అందరూ సహస్రాబ్దాలుగా మనం సనాతన ధర్మంగా పిలుస్తున్న వాటిలో భాగమేనని డాక్టర్ సింగ్ చెప్పారు.

“ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న గొప్ప హిందూ మతం మూడు ప్రధాన ప్రవాహాలైన శైవ మతం, వైష్ణవ మతం, శాక్తమతాల మధ్య విభజనను సృష్టించడానికి మనం మ‌ళ్ళీ ప్రయత్నించవద్దు” అని ఆయన హెచ్చరించారు.

రాజరాజ చోళుడికి హిందూ గుర్తింపు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళ చిత్ర నిర్మాత వెట్రిమారన్ ఒక కార్యక్రమంలో పేర్కొనడంతో ఇటీవల తలెత్తిన వివాదంపై డాక్టర్ సింగ్ స్పందించారు. నిష్ణాతుడైన పండితుడు, మాజీ కేంద్ర మంత్రి అయినా కరణ్ సింగ్ 2018 వరకు మూడు పర్యాయాలు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా పనిచేశారు.

హిందూ మతం ఆలోచన పురాతనమైనది

ఈ సినిమా రచనలో దక్షిణ భారతదేశ సాంస్కృతిక చరిత్రపై పరిశోధకుడు, దర్శకుడు మణిరత్నం సంప్రదింపులు జరిపిన నిపుణుడు ఎస్ జయకుమార్, చోళుల రికార్డులలో “హిందూ” అనే పదం కనిపించనప్పటికీ, రాజరాజ చోళుడు శైవుడు, హిందూ రాజు అని స్పష్టం చేశారు.

“ఈ రోజు మనం ఊహించుకున్న హిందూమతం అనే ఆలోచన చాలా శతాబ్దాల క్రితం ఉంది” అని జయకుమార్ చెప్పారు. శివుడిని ఆరాధించే వారిని శైవులు అని, విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు అని పిలుస్తారు. “చోళరాజ ఒక బలమైన శైవుడు అయినప్పటికీ, అతను కేవలం శివాలయాలు మాత్రమే కాకుండా విష్ణు దేవాలయాలను కూడా నిర్మించాడు” అని ఆయన గుర్తు చేశారు. వారు దుర్గ, శక్తి, కాళితో పాటు మురుగన్, గణేషుడిని పూజించారని ఆయన తెలిపారు.

“వాస్తవానికి, బృహదీశ్వర ఆలయంలో వినాయకుడికి రోజుకు 150 అరటిపండ్లు సమర్పించే అందమైన శాసనం ఉంది. ఇవన్నీ కలిసి హిందూమతాన్ని ఏర్పరుస్తాయి” అని జయకుమార్ చెప్పారు. రాజరాజ చోళుడు ఒక హిందూ రాజు కాదనే ప్రశ్నే లేదని పేర్కొంటూ, హిందూ మతంలో, అతను శైవ శాఖకు చెందినవాడు అని తేల్చి చెప్పారు.

“తమిళనాడును పాలించిన చోళులు, ఇతర రాజవంశాల రాగి పలకలు, రాతి శాసనాలు తమను తాము శివుడు, విష్ణువుల భక్తులుగా చెప్పుకుంటాయి” అని జయకుమార్ చెప్పారు. “వారు జైన, బౌద్ధమతాలను కూడా ఆదరించారు. కానీ వారు ఎక్కువగా శివ, విష్ణు భక్తులుగా గుర్తించబడారు. శక్తి, గణేశ, మురుకన్‌లను కూడా పూజించారు. కాబట్టి, ఈ పదం వాడుకలో ఉండకపోవచ్చు. కానీ ఆలోచనలు చాలా పాతవి. విదేశీ యాత్రికులు తమ చరిత్రలలో, భారతదేశ ప్రజలను హిందువులు అని పిలుస్తారు. సింధు నది ఆవల ఎవరైనా హిందువులే. హిందూయిజం అనే పదం చాలా కాలంగా ఉనికిలో ఉంది” అని వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చోళులు హిందువులా? లేదా మతం లేని తమిళులా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గ‌ణేషుడి ఊరేగింపులో ముస్లిం మృత‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి
హిందూ భ‌క్తుల‌పై ప్ర‌శంస‌ల వెల్లువ‌

రాణేబెన్నూర్‌: క‌ర్ణాట‌క రాణేబెన్నూర్‌లో మ‌త సామ‌ర‌స్యం వెల్లివిరిసింది. నిమ‌జ్జ‌నం కోసం వినాయ‌క విగ్ర‌హాన్ని డీజే పాట‌ల‌తో ఊరేగింపుగా భ‌క్తులు తీసుకుని వెళ్తుండ‌గా, ఓ ముస్లిం వ్య‌క్తి అంతిమ యాత్ర ఎదురుగా వ‌చ్చింది. దీంతో భౌతికకాయం వెళ్ళేంత వ‌ర‌కు వారు త‌మ సంబ‌రాల‌ను నిలిపివేసి, శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. త‌ర్వాత ఎప్ప‌టివ‌లె ఊరేగింపును కొన‌సాగించారు. హిందూ భ‌క్తుల స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ‌ణేషుడి ఊరేగింపులో ముస్లిం మృత‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి
‘An Agenda for Unity’ పేరుతో ప్రచురితమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీ ఇంటర్వ్యూ తెలుగు అనువాదం…..

స్వదేశ్ సింగ్ : వెయ్యి సంవత్సరాలకు పైగా అనేక దండయాత్రలను, విభజనను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ తన మౌలిక ఐక్యతను, నాగరికతను, వారసత్వాన్ని నిలుపుకుంది. ఈ ఫలితానికి ఏ ఏ అంశాలు దోహదపడ్డాయని మీరు అనుకుంటున్నారు?

కృష్ణ గోపాల్ : మనం భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, ఒక సత్యాన్ని గ్రహిస్తాం. మన దేశంలోని రాజ్యాలు అనేకమంది రాజుల పాలనలో ఉన్నప్పటికీ, ప్రతి రాజ్యమూ ఈ విశాల భారతదేశంలో భాగమనే భావన, స్పృహ పాలకులలోనూ, ప్రజలలోనూ లోతుగా ఉండేది. అందుకే భారతదేశం ఐక్యంగా ఉంది. ఇది సైద్ధాంతిక, సాంస్కృతిక, తాత్విక నిర్మాణం. ఇది వేలాది సంవత్సరాలుగా ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యా కుమారి వరకు మరియు పశ్చిమాన గుజరాత్, పాకిస్తాన్ తీర ప్రాంతాల నుండి అరుణాచల్ ‌లోని పరశురామ కుండ్ వరకు విస్తరించి ఉన్న భూభాగాన్ని కలిగి ఉంది. ఇది రాజకీయ ఐక్యతకు మించిన మౌలిక ఐక్యత. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్, విలీనాన్ని ప్రోత్సహించినప్పుడు 560కి పైగా సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి.

స్వదేశ్ సింగ్ : మరలాంటప్పుడు మన దేశంలో “హిందూ-ముస్లిం-సిక్కు-క్రైస్తవ భాయి భాయి” వంటి నినాదాలు ఎందుకొచ్చాయి? ప్రజల మధ్య అలాంటి విభేదాలున్నాయని భావించి, వారి మధ్య సయోధ్య నిర్మించడం కోసం అలాంటి నినాదాలు సృష్టించారా?

కృష్ణ గోపాల్ : మన దేశంలో భాషాపరమైన, భౌగోళిక వైవిధ్యం దేశవ్యాప్తంగా పర్యటించే ఎవరికైనా కనిపిస్తుంది. మనం అలా చూస్తూ పోతే…. ప్రజల ఆహారపుటలవాట్లు, పండుగలు, రంగులు మారిపోతుంటాయి. కానీ ఇవి బాహ్యంగా కనిపించే వ్యత్యాసాలు మాత్రమే. కానీ మౌలికంగా, అంతర్గతంగా, దేశమంతటా ఒకే సహజమైన తాత్వికత ఉంది. భాషలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ప్రతి భాష, ప్రధానంగా ఒకే తాత్వికతను ప్రతిపాదిస్తుంది. జీవన విలువలు, భక్తి, భూమి పట్ల గౌరవం, కర్మ భావన, జన్మ – పునర్జన్మ, నిర్వాణం, మోక్షం, మొదలైన భావనలన్నీ బెంగాలీ, ఒరియా లేదా మరే ఇతర భారతీయ భాషలోనైనా ఒకే విధంగా ప్రతిధ్వనిస్తాయి. భాష ఏదైనా సరే… ప్రతిపాదించబడిన తత్త్వం మాత్రం ఒకటే కావడమే దీనికి కారణం. మీరు ప్రస్తావించిన నినాదాలన్నీ తర్వాత తెచ్చినవే. అవన్నీ రాజకీయ నినాదాలు మాత్రమే.

స్వదేశ్ సింగ్: మీరు చెబుతున్న ఈ మౌలిక ఐక్యత నేటి సమాజం నేపథ్యంలో ప్రజలకు ఎలా అర్థమవుతుంది?

కృష్ణ గోపాల్: మౌలిక ఐక్యత ఇప్పటికే ఉంది. దీన్ని అర్థం చేసుకోవటానికి, మన చుట్టూ ఉన్న వైవిధ్యాన్ని మనం దర్శించవలసి ఉంటుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్ ల నుండి ప్రజలు ఉత్తర భారతదేశానికి వెళితే, వారు కృష్ణుడి పట్ల అదే భక్తిని పాటిస్తారు. కేరళలో భాష మలయాళం. కానీ భక్తి కవిత్వం మాత్రం ఒకటే. అస్సాం, బెంగాల్ కవులు, రచయితలు రాసిన నాటకాలు, వ్యాసాలు అదే భావాన్ని తెలియజేస్తాయి. ఇదే మౌలిక ఐక్యత. దీనిని మరింత లోతుగా తెలుసుకోవడానికి, ప్రజలు మరింతగా ప్రయాణించాల్సిన, అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది. తమిళనాడులోని తిరువల్లువర్, పంజాబ్ ‌లోని గురునానక్ దేవ్ జీల రచనలలో సారూప్యతను మనం గమనించవచ్చు. ఇదే మౌలిక ఐక్యత.

స్వదేశ్ సింగ్: 15వ శతాబ్దంలో అస్సాంకు చెందిన గొప్ప పండిత కవి శంకరదేవుడు, ఎనిమిదో శతాబ్దంలో శారదాపీఠాన్ని స్థాపించిన కేరళకు చెందిన ఆదిశంకారుల వంటి భారతదేశం యొక్క ఈ స్ఫూర్తిని, ఐక్యతను ప్రచారం చేసిన గొప్ప జ్ఞానులు శతాబ్దాలుగా మనకు ఉన్నారు. పదహారవ శతాబ్దంలో మనకు రసఖాన్ అనే ముస్లిం ఉన్నాడు. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. అలాగే తాజ్ ‌బీబీ. ఇది సంస్కృతి యొక్క పరస్పర కలయికను మరియు సమీకరణను చూపింది. భారతదేశం సాంస్కృతిక సమ్మేళనానికి ప్రధాన కేంద్రం. అయనప్పటికీ దేశం విభజన గాయాన్ని ఎందుకు భరించవలసి వచ్చింది? ఆ సమయంలో మౌలిక ఐక్యతకు ఏమైంది?

కృష్ణ గోపాల్: మన దేశంలో ఒక నిర్దిష్ట భావజాలాన్ని వ్యాప్తి చేయడానికే సుమారు 1000 సంవత్సరాల క్రితం మన దేశంపై ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయి. యుద్ధంలో గెలిచిన తర్వాత, తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి, స్థానిక మతంపై దాడి చెయ్యడం, మన దేవాలయాలను, మన సిద్ధాంతాలను, మన ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసే పరిస్థితి మన దేశ వాసులు జీవితంలో అంతకముందు ఎప్పుడూ అనుభవించలేదు. ఏడెనిమిది వందల సంవత్సరాల పాటు ఇస్లాం పాలనలో ఉన్నప్పటికీ, ఇస్లాం పాలనలో కూడా, తమ సిద్ధాంతాలను, సంస్కృతిని, సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి భారతదేశపు మేథావి వర్గం సుదీర్ఘ పోరాటం చేసింది. ఆ విషయంలో వారు విజయం సాధించారు కూడా. ఇస్లామిక్ ఆక్రమణకు గురైన, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, స్థానిక జనాభా దండయాత్రికుల భావజాలానికి తేలికగా లొంగిపోయింది. కానీ భారతదేశం మాత్రమే అందుకు మినహాయింపు. కాబట్టి, మొదట గుర్తించవలసిన విషయం ఏమిటంటే, భారతదేశ ప్రజలు తమ మతాన్ని, సంస్కృతిని, సిద్ధాంతాలను, సమాజాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడారు. కానీ బ్రిటీషర్లు వచ్చాక, వారు పాలించిన రెండు వందల సంవత్సరాల కాలంలో, వారు భారతదేశం యొక్క ఈ మౌలిక ఐక్యతపై తెలివిగా దాడి చేశారు. భారతదేశం యొక్క సాంస్కృతిక ఐక్యత ఇస్లామిక్ దండయాత్రల ద్వారా విచ్ఛిన్నం కాలేదు. ఎందుకంటే ఈ ఐక్యత రాజకీయమైనది కాదు. హిందూ రాజులు లేకపోయినా, ప్రజల తీర్థయాత్రలు మాత్రం కొనసాగాయి. హిందువులకు సైన్యం లేకపోయినా, దేవాలయాలు ద్వంసమైనా, ప్రజల వద్ద భగవద్గీత, రామాయణం, భారతం ఉన్నాయి. అవి హిందువుల విశ్వాసం విచ్ఛిన్నం కాకుండా కాపాడాయి. కానీ, బ్రిటీష్ వారు నెమ్మదిగా భారతీయ సమాజంలో చీలికలను సృష్టించారు. ఇది సమాజంలో లోతైన విభజనకు దారితీసింది. చివరికి దేశ విభజనకు దారితీసింది.

స్వదేశ్ సింగ్: నిజంగా హిందూ-ముస్లిం ఐక్యత గురించి మాట్లాడితే, నేడు, వారి మధ్య మత సామరస్యాన్ని, ఐక్యతను ప్రోత్సహించడం అవసరం. ఒకవేళ రెండు వర్గాలను విడివిడిగా పరిగణించినట్లయితే, ఐక్యత అనేది ఎండమావే కదా? లేకపోతే మనం కేవలం రాజకీయ ఐక్యత కోసం మాత్రమే చూస్తున్నామా?

కృష్ణగోపాల్ : సనాతన భారతీయ సమాజం చాలా బలమైన ఐక్యతా మూలాలను కలిగివుంది. భారతదేశంలో విభిన్న ఆచారాలు, ఆరాధనా పద్ధతులు, సంప్రదాయాలు కలిగిన వందలాది వివిధ రకాలు శాఖలు ఉన్నాయి. వారందరూ ఐక్యంగానే ఉన్నారు. ఈ ఐక్యతకు ఆధారమేమిటన్న దాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి. ‘సర్వే భవన్తు సుఖినః’ అనే భారతదేశం యొక్క శాశ్వతమైన ఆలోచనలోనే ఈ ఐక్యత యొక్క ఆధారం ఇమిడి ఉంది. ఆ మాటల పరమార్థం ఆధారంగానే మనం అనేక విషయాలను ఆమోదించాం. కేవలం మన ఆలోచనలు, సిద్ధాంతాలతో ఏకీభవించే ఒక వర్గం ప్రజల సుఖ సంతోషాల కోసం కాదు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా సర్వ మానవాళి సుఖ సంతోషాల కోసం చేసే ప్రార్ధన అది. ఈ తాత్వికత పాకిస్తాన్, చైనాల వంటి వివిధ ప్రపంచ దేశాల ప్రజల సుఖ సంతోషాలను కూడా కోరుకుంటుంది. విశ్వ మానవ సౌభాగ్యాన్ని కోరుకునే సిద్ధాంతమది. ‘సర్వే భవన్తు సుఖినః’ లో ఈ విధంగా సర్వవ్యాప్త ఐక్యత దాగి ఉంది. మనం దీనిని అర్థం చేసుకోవాలి. రెండవది, వేద కాలం నుండి నేటి వరకు, వేల సంవత్సరాలుగా సనాతన భారతీయ సమాజం, మరొక సూత్రాన్ని కూడా ఆమోదించింది. ఈ ఆలోచనలో ఉన్న అంతర్లీన సూత్రం ఏమిటంటే, మనం నమ్మే దానికి భిన్నమైన అభిప్రాయాలు, విశ్వాసాలు కలిగిన వ్యక్తులుంటారు. ఋగ్వేదం ప్రకారం మనకంటే భిన్నమైన అభిప్రాయాలు, విశ్వాసాలు కలిగిన వ్యక్తులు కూడా మంచివారే. వేద ఋషి “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అని చెప్పాడు. అంటే అతను ప్రత్యామ్నాయ దృక్కోణానికి కూడా ఆమోద పత్రాన్ని ఇచ్చాడు. ప్రతి ఆలోచనా గొప్పదే, ప్రతి ఆలోచనా సత్యమే, దానిని తిరస్కరించకూడదని ఋషులు ఉద్బోధించారు. ఇది అనంతమైన వైవిధ్యాన్ని ఏకం చేసే మంత్రం. మరో మాటలో చెప్పాలంటే, ఇది వైవిధ్యంలో ఏకత్వం. అందువల్ల, మనకు రెండు ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఒకటి, సర్వ మానవాళి సుఖ సంతోషాలను కోరుకోవడం, రెండవది, ఏ ఆలోచననైనా గౌరవంగా అంగీకరించే పెద్ద మనస్సు కలిగి ఉండటం. భాషలు, మాండలికాలు, వాతావరణం, ఆహారం, దుస్తులు మరియు భావజాలాల వైవిధ్యాన్ని అధిగమించి, సాధించవలసిన సామరస్యం మరియు ఐక్యత కోసం ఇది మనం తప్పనిసరిగా పాటించవలసిన సూత్రం.

స్వదేశ్ సింగ్: మీరు దారా షికోపైన, భారతీయ తత్వ శాస్త్రాన్ని, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనేక మంది ఇతర ముస్లిం సాధువులపైన చాలా అధ్యయనం చేశారు. అయితే స్వాతంత్ర్యానికి ముందు గత రెండు వందల సంవత్సరాల నాటి బ్రిటీష్ వారి కొత్త తరహా రాజకీయాల ఆవిర్భావం గురించి మాట్లాడుకుందాం. 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ‌ను మత ప్రాతిపదికన విభజించింది. 1906లో ముస్లిం లీగ్ ‌ని ఏర్పాటయింది. 1909లో, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చారు. ఇది వారికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే కాక, వారు ప్రత్యేక దేశాన్ని కోరుకోవడానికి మార్గం సుగమం చేసింది. ఇప్పుడు, ఈ ప్రజలందరూ కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో భాగమయ్యారు. గ్రామాల్లో, వారు ఇతర వర్గాల ఆచారాలు, సంప్రదాయాలను కూడా అనుసరించారు. ఆ తర్వాత, కొన్ని దశాబ్దాలలోనే దేశ విభజన జరిగింది. నేడు, ఈ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. మెజారిటీ మరియు మైనారిటీ చర్చలు మతాల మధ్య దూరం పెంచాయి. ఇప్పుడు మనం ఈ సమస్యను ఎలా అధిగమించాలి?

కృష్ణ గోపాల్: బ్రిటిష్ వారు ఒక విషయం అర్థం చేసుకున్నారు. భారతదేశం ఐక్యంగా ఉంటే ఈ దేశంలో వారి పాలన త్వరగా ముగుస్తుంది. ఆ కారణంగా హిందువులు, ముస్లింల మధ్య చీలికను సృష్టించడానికి బ్రిటిష్ వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ముస్లిం దండయాత్రల సమయంలో, అనేక రంగాలలో అనేక సాంస్కృతిక కలయికలు జరిగాయి. ముస్లింలు భారతీయ సంగీతంలో మునిగిపోయారు, ముస్లిం ఖవ్వాలిలు ప్రాచుర్యం పొందాయి, ముస్లింలు సమాధులను పూజించడం ప్రారంభించారు, తజియా ఊరేగింపు మొదలైన వాటిని మనం చూస్తాం. చాలా మంది ముస్లింలు హిందూ పవిత్ర గ్రంథాలను పర్షియన్ మరియు అరబిక్ భాషలకు అనువదించడం కూడా మనం చూశాం. ఇది ఐదు నుండి ఆరు వందల సంవత్సరాల పాటు కొనసాగింది. భారతదేశాన్ని నిరంతరాయంగా పాలించడానికి, ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం చాలా అవసరమని బ్రిటన్ గ్రహించింది. ఆ విధంగా ముస్లిం సమాజాన్ని విభజించి, వారిని వివిధ రకాలుగా రెచ్చగొట్టి, వారిని భారతీయ సమాజం నుంచి వేరు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బెంగాల్ ‌ను ముస్లిం బెంగాల్ ‌గా, హిందూ బెంగాల్ ‌గా విభజించేందుకు కుట్ర పన్నినట్లే బ్రిటీష్ వారు ముస్లిం లీగ్ ‌ని ఏర్పాటు చేశారు. క్రమంగా, భారతదేశంలోని ముస్లిం సమాజం తన మూలాలకు దూరం జరిగింది. దేశ విభజన ముసాయిదా సిద్ధమైంది. కానీ దేశ విభజన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోవడంతో సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. “మెజారిటీ హిందూ రాజ్యంలో మైనారిటీ ముస్లింలు ఎలా సురక్షితంగా ఉండగలరు?” అని అంతకుముందు జిన్నా చెప్పేవారు. ఆ వాదం వారిలో ఇప్పటికీ అలాగే ఉంది. కాబట్టి, ఐక్యతను తీసుకురావడానికి, మనస్సు, హృదయం మరియు భావాలలో మార్పు తీసుకురావాలి. ఇది వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

స్వదేశ్ సింగ్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 30 వరకు మైనారిటీల హక్కుల రక్షణకు హామీ ఇస్తున్నాయి. అయితే, భారతదేశంలో గత 75 ఏళ్లుగా రాజకీయాలు, మైనారిటీల హక్కులను పరిరక్షించడం నుండి మైనారిటీల సంతుష్టీకరణ దిశగా పయనించాయి, పరిణమించాయి. ఇది భారత ఐక్యతకు విఘాతం కలిగించిందా?

కృష్ణగోపాల్: స్వాతంత్ర్యంతో ప్రతి పౌరుడికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు చాలా విలువైన వస్తువుగా మారింది. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్లను గంపగుత్తగా సేకరించడం ప్రారంభించాయి. అలాంటి ఓట్లను పొందడానికి కొత్త పదజాలం సృష్టించాయి. అటువంటి కోవలోనిదే ‘మైనారిటీ’ అనే పదం. ఈ పదం ఐరోపా నుండి వచ్చిన విదేశీ పదం. మైనారిటీ అంటే ఆ దేశానికి చెందిన వారు కాని, ఏదో ఒక కారణంతో ఎక్కడి నుంచో వలస వచ్చిన చిన్న సమూహం అని అర్థం. ఇది ఆ దేశానికి లేదా ఆ జాతికి చెందని ప్రజలను సూచిస్తుంది. కానీ భారతదేశంలో, ముస్లిం సమాజం ఒక పెద్ద సమాజం. స్వాతంత్ర్యం తరువాత, ఇది మొత్తం భారతీయ సమాజంలో దాదాపు 12 నుండి 13 శాతం. దాని ఆధారంగానే వారిని మైనారిటీలుగా పేర్కొనకూడదు. ఈ ముస్లింలలో ఎక్కువ మంది ఇక్కడి నుండి మతం మారినవారే. కేవలం మతం మారినందున వారిని మైనారిటీలు అని ఎలా అంటారు? కానీ వారి ఓట్లను పొందడానికి, వారు ఎల్లప్పుడూ మిగతా సనాజం నుంచి విడిగా ఉండేలా చూసుకోవడానికి వారికి ఏదో ఒక పేరు పెట్టబడింది. బ్రిటీష్ వారి నిష్క్రమణతో ఆ అధ్యాయం ముగియవలసినది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. అనవసరంగా మెజారిటీ – మైనారిటీ భావన సృష్టించబడింది. మనం ఇప్పుడు దాని దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాము.

స్వదేశ్ సింగ్: ఐక్యతా సాధనకు ఇప్పుడు ఎంత ప్రయత్నం అవసరం?

కృష్ణ గోపాల్: భారతదేశం పౌరసత్వాన్ని ఇస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రతి వ్యక్తికి అన్ని హక్కులనూ అందిస్తుంది. కానీ జాతీయత పొందాలంటే మాత్రం మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. పౌరసత్వం మీకు రాజ్యాంగపరంగా కొన్ని హక్కులను ఇస్తుంది. జాతీయత మీ విధులను నిర్ణయిస్తుంది. మీరు ఈ జాతీయులైన వెంటనే, మీరు వేల సంవత్సరాల ఈ సంస్కృతీ సంప్రదాయాల ద్వారా ఈ దేశంతో అనుసంధానింపబడతారు. ఈ దేశం యొక్క సుఖదుఃఖాలను, జయాపజయాలను మీవిగా భావిస్తారు. ఈ దేశం యొక్క చరిత్ర, భౌగోళికతను మీదిగా భావిస్తారు. జాతీయత కాబట్టి అందరికీ సమానంగా ఉండాలి. జాతికి సుఖ దుఃఖాలు, శత్రుమిత్ర భావనలు ఒక్కటే. పౌరులందరూ ఈ జాతీయవాద భావాన్ని అలవరచుకోవాలి. ఉదాహరణకు, మన మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశం కోసం వివిధ క్షిపణులను అభివృద్ధి చేశారు. వాటికి ఆకాష్, నాగ్, త్రిశూల్ మొదలైన పేర్లను పెట్టారు. ఈ పేర్లు జాతీయవాద భావానికి ప్రతీకలు. మన ముస్లిం సోదరులు, సోదరీమణులు తమను తాము ఈ దేశ చరిత్రతో ముడిపెట్టాలి తప్ప దేవాలయాలను ధ్వంసం చేసిన, ప్రజలను హింసించిన, జిజియా పన్ను విధించి, ప్రజలను బాధించిన, ఆక్రమణదారుల చరిత్రతో కాదు. వారు ఆక్రమణదారులతో తమను తాము అనుసంధానించుకున్నట్లయితే, వారిని ఈ జాతీయులుగా ఎలా పిలవగలం?

స్వదేశ్ సింగ్: భారతదేశంలో గత 75 ఏళ్లుగా మత సామరస్యంపై చర్చ, సెక్యులరిజంపై కేంద్రీకృతమై ఉంది. హిందూ సమాజం దాని స్వభావ రీత్యా లౌకికమైనది. కానీ లౌకికవాదం యొక్క అభ్యాసం రాజకీయాలలో మరియు కొన్ని వర్గాలలో ఏకరీతిగా లేదు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశం రాబోయే 25 సంవత్సరాల పాటు ముందుకు సాగాల్సిన ‘అమృత కాలం’ గురించి మాట్లాడారు. మనం సుసంపన్నమైన, సమర్థమైన భారత్ ‌ను ఊహించుకుంటాం. అయితే ఇప్పుడు మనం మత సామరస్యం గురించి ఎలా చర్చించాలి? దాని రూపం ఎలా ఉండాలి? మరి దాన్ని సమాజం ఎలా ముందుకు తీసుకెళ్లాలి?

కృష్ణగోపాల్: ఇక్కడ రెండు విషయాలు చర్చించాల్సి ఉంది. మొదటిది మైనారిటీలకు ఆర్థిక మరియు ఇతర సహాయాలను అందించడం. ఇది వారి సంక్షేమం పేరుతో జరుగుతోంది. కానీ అది ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వదు. ఉదాహరణకు, మైనారిటీ వర్గాల పిల్లలకు చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ‌లు ఇస్తారు. పేద పిల్లలకే ఇస్తారు. అయితే, ఉదాహరణకు 40 మంది పిల్లలున్న ఒక తరగతిలో, మైనారిటీ వర్గాల నుండి ఐదుగురు పేదలు ఉన్నారని, వారికి స్కాలర్‌షిప్ ఇస్తున్నారని అనుకుందాం. కానీ ఆ తరగతిలో మరో 10 మంది పిల్లలు కూడా పేదలు ఉన్నారు. కానీ వారు మైనారిటీ వర్గానికి చెందినవారు కానందున వారికి స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. ఇది వారిలో అసమ్మతిని సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ పది మంది పిల్లల మనస్సులలో, ప్రశ్న తలెత్తుతుంది : మా ఇంటి పరిస్థితి వారి కంటే అధ్వాన్నంగా ఉన్నప్పుడు మాకు ఎందుకు సహాయం చేయడంలేదు? ఇటువంటి ఏకపక్ష సహాయం సమాజంలో సామరస్యానికి బదులుగా వ్యత్యాసాలను సృష్టిస్తుంది. కాబట్టి, విభజన ప్రాతిపదికన కాకుండా ఆర్థిక మరియు ఇతర సహాయాలు అందరికీ ఒకే విధంగా అందించబడాలి. ఇటీవల ప్రభుత్వం, మతంతో సంబంధం లేకుండా అన్ని పేద కుటుంబాలకూ మరుగుదొడ్లు, వంటగ్యాస్ ‌ను అందించింది. సహాయం అవసరమైన వారికి అందించాలి. మైనారిటీ కమ్యూనిటీలో ఎక్కువ పేదరికం ఉంటే, సహజంగానే వారిలో ఎక్కువమంది సహాయం పొందుతారు. బ్యాంకు అవసరం ఉన్న చోట బ్యాంకులు తెరవాలి. అవసరమైన కళాకారులకు శిక్షణ ఇవ్వాలి. ఈ దేశం మనది-ఇప్పటివరకు జరిగినట్లుగా మైనారిటీ – మెజారిటీ విభజన ఇకమీదట ఉండకూడదు. మనం పౌరులందరినీ ఒకే దృష్టితో చూడాలి తప్ప మత దృష్టితో కాదు. ఇది రాజ్యాంగ పరిషత్ ‌లో చెప్పబడింది. కానీ అమలు కావడంలేదు. రాజ్యాంగ పరిషత్ ‌లో ఉన్న వ్యక్తులకు, మన రాజ్యాంగ నిర్మాతలకు ఈ దృష్టి ఉంది. మొత్తం సమాజాన్ని ఒక్కటిగా చూడటం ద్వారా సమగ్ర వికాసం సాధ్యమయ్యే ఈ దృక్పథాన్ని మనం గ్రహించాలి. పేదరికాన్ని అంతం చేయడానికి, మనం మొత్తం సమాజంలోని పేదలందరినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక నిర్దిష్ట మత సమూహాన్ని మాత్రమే కాదు.

స్వదేశ్ సింగ్: గత 50 సంవత్సరాలుగా, మీ పని మొత్తం సమాజ కేంద్రంగా సాగింది కదా? మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, సమానత్వ సాధనకు కూడా చాలా కృషి జరిగింది. నేను ఇప్పుడు సోదరభావం (సౌభ్రాతృత్వం) సమస్యను తీసుకుంటాను. ఒక సమాజంగా భారతదేశం ఈ దిశలో ఎలా పయనించాలి?

కృష్ణగోపాల్: రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన స్వేచ్ఛను ఇచ్చింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, చదువుకోవచ్చు, న్యాయం పొందవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, భూములు కొనవచ్చు, ఓటు వేయవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు- ఇది ప్రతి ఒక్కరి హక్కు. రాజ్యాంగం లాగే న్యాయస్థానాలు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇది స్వతహాగా సౌభ్రాతృత్వానికి దారితీయదు. రాజ్యాంగం హక్కులు ఇవ్వగలదు. కానీ రాజ్యాంగం ఆలోచనలో మార్పు తీసుకురాదు. అందుకు ఇంకేదో చేయాలి. గత 700 నుండి 900 సంవత్సరాల చరిత్ర కూడా ప్రజల మనస్సులలో కొన్ని జ్ఞాపకాలను లోతుగా నాటుకుపోయేలా చేసిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆక్రమణదారులను రోల్ మోడల్స్ ‌గా పరిగణించలేము. కాబట్టి ఈ రకమైన ఆలోచనా విధానంలో మార్పు అవసరం. మన దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని, జిజియా పన్ను విధించి, ప్రజలపై దౌర్జన్యం చేసి, క్రూరంగా ప్రవర్తించిన వారిని, కొందరు నాయకులుగా భావిస్తే, మిగిలిన సమాజం వారిని ఆక్రమణదారులతో కలుపుతుంది. సోదరభావం ఏర్పడదు. అలాంటప్పుడు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, భారతదేశంలో నివసిస్తున్న ప్రజలను ఈ దేశ వినాశన చరిత్రను వ్రాసిన వ్యక్తుల నుండి వేరు చేయాలి. రెండవది, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, ప్రపంచంలో ఎన్ని విశ్వాసాలు, మతాలు, వర్గాలైనా ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ గౌరవం అనే భావన భారతదేశం యొక్క ‘సనాతన’ భావజాలం. భారతీయుడిగా ఉండటం అంటే, ప్రపంచంలోని ప్రతి విశ్వాసాన్ని, మతాన్ని గౌరవించడం, ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలను కోరుకోవడం. ఈ రెండు గుణాలు భారతీయుడిగా ఉండటాన్ని నిర్వచించాయి. ఈ రెండు పరిస్థితులు వచ్చే వరకు మనం వేచి చూడాలి. అయితే ఇది ఎలా జరుగుతుందో సమాధానం చెప్పడం కష్టం. భారతీయ సంప్రదాయంలో అందరి అభిప్రాయాలను గౌరవించడం పెద్ద షరతు. అందరి సుఖ సంతోషాలను ఆకాంక్షించటం రెండవ పెద్ద పరిస్థితి. ఒక భారతీయుడు విదేశాలకు వెళ్ళినప్పుడు, అతను ఈ రెండు ఆలోచనలను తనతో తీసుకువెళతాడు. ఆ దేశంలోని ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తాడు. అది యునైటెడ్ స్టేట్స్, కెనడా, UK, జర్మనీ లేదా ప్రపంచంలోని మరే ఇతర భాగమైనా సరే అక్కడి ప్రజల సుఖ సంతోషాలను కోరుకుంటాడు. తన ప్రార్థనలో, అతను ఎల్లప్పుడూ ‘సర్వే భవన్తు సుఖినః’ అని చెబుతాడు. ఈ రెండు విషయాలూ ప్రజలందరికీ వస్తే, అప్పుడు సోదర భావాన్ని తీసుకురావడం సులభం అవుతుంది. మనం వందల సంవత్సరాలుగా కల్లోలం, పోరాటాలు, ఒడిదుడుకులు మరియు బాధలను అనుభవించాం. కానీ ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం అంటే…. తన ప్రాచీన మహిమాన్వితమైన రూపాన్ని స్మరించుకుంటూ, తన తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే ఆ తాత్వికత వెలుగులో ముందుకు సాగడం. చాలా సార్లు, ఈ వైవిధ్యం వందలాది రకాల చెక్కల కట్ట రూపంలో, తాడుతో ముడిపడి ఉంటుంది. ఇది నిజం, కానీ ఇది సగం నిజం మాత్రమే. మనం దానిని చెట్టు పరంగా అర్థం చేసుకుందాం, ఆ చెట్టు తన చుట్టూ విస్తరించే బహుళ శాఖలను కలిగి ఉంటుంది. ఆ శాఖలన్నిటి మూలం ఒక్కటే. భారతదేశం యొక్క వైవిధ్యం ఈ చెట్టు యొక్క ఒక శాఖ నుండి మరొక శాఖకు విస్తృతంగా విస్తరించింది. ఏకత్వం మూలంలో ఉంది, వైవిధ్యం శాఖలలో మాత్రమే కనిపిస్తుంది. ఆ వైవిధ్యంలో వైరుధ్యాలు తలెత్తవచ్చు, అయితే మౌలిక ఏకత్వం దర్శనమైతే ఈ పోరాటాలు, విభేదాలు ఆగిపోతాయి. ఇది భారతదేశపు మౌలిక తత్త్వం. అనేకతలో ఏకత్వాన్ని దర్శింపజేసే, అన్ని రకాల వివక్షలు, అసూయ, సంఘర్షణలను అంతం చేసే శక్తి ఈ ఏకాత్మ దర్శనానికి ఉంది. ఈ ఐక్యతలో గొప్ప శక్తి ఉంది. ఈ ఐక్యతా దృష్టి అన్ని వివాదాలనూ అణచివేయగలదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లండన్‌లో రుషి సునాక్ గో పూజ
లండన్‌: ఎక్స్‌చెకర్ మాజీ ఛాన్సలర్, బ్రిటన్‌ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్‌ ప్రధానిగా గెలవాలని భారత ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవైపు కన్జర్వేటివ్‌ పార్టీలో తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే రేసులో వెనుకబడిపోయినప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం రిషి సునాక్‌ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

తాజాగా లండన్‌లో రిషి సునాక్‌(42) గోపూజ నిర్వహించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలిద్దరూ రంగులతో అలంకరించిన ఆవుకు హారతి ఇచ్చి.. పూజలు చేశారు. అది మన గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి మనం గర్వపడాలి అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ ఆ వీడియోను పోస్ట్‌ చేశారు.

లండన్‌ శివారులో జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తివేదాంత్‌ మనోర్‌లో జరిగిన పూజలకు రిషి సునాక్‌ తన సతీసమేతంగా హాజరయ్యారు. భగవద్గీత తనపై ఎంత ప్రభావం చూపిందన్నది రిషి సునాక్‌ ఈ సందర్భంగా వివరించారని.. మనోర్‌ తన అధికారిక పేజీలో వివరించింది. అంతేకాదు.. స్వయంగా రిషి సునాక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఆ ఫొటోలను ఉంచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లండన్‌లో రుషి సునాక్ గో పూజ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.