HINDU MUNNANI – Vishwa Samvad Kendra Andhra Pradesh

అంబూర్‌లో బిర్యానీ పండుగ వాయిదా!
తమిళనాడు: అంబూర్‌లో బిర్యానీ పండుగను జిల్లా యంత్రాంగం నిరవధికంగా వాయిదా వేసింది. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ పండ‌గ‌ను వాయిదా వేయాలని హిందూ మున్నాని డిమాండ్ చేసింది. పండ‌గ వాయిదా ప‌డ‌డంతో దీనిని వ్యతిరేకించిన స్థానిక‌ హిందూ మున్నాని, విజయభారత్ కట్చి, ఇతరులకు విజ‌యం చేకూరిన‌ట్ల‌యింది.

కొన్ని రోజుల క్రితం, ఆర్గనైజర్ చెన్నై.. తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో లైసెన్స్ లేని, అపరిశుభ్రమైన, హలాల్ సర్టిఫికేట్ పొంది, రోడ్డు పక్కన అర్థ‌రాత్రి పూట విక్రయించే మొగల్ బిర్యానీ వ‌ల్ల స్థానిక వంట‌కాల‌ను ఉన్న ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంద‌ని నివేదించింది. ఇంకా.. వారు నాణ్యత లేని మసాలాలు, ఇత‌ర‌ పదార్థాలు, కుక్కలు, పిల్లులు, పశువుల నుండి కలుషితమైన, కుళ్ళిన మాంసాలను ఉపయోగిస్తున్నారని కొంత‌మంది ఆరోపించారు. ఈ బిర్యానీలలో మగవారి గర్భనిరోధక మాత్రలు కలిపి నపుంసకులను చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఆ పండ‌గ ఏమిటంటే…

అంబూర్ ట్రేడ్ సెంటర్‌లో ఈ నెల 13(నేడు) నుంచి 15 వరకు సాయంత్రం అయిదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మూడు రోజుల పాటు అంబూర్ బిర్యానీ తిరువిజా-2022 (బిర్యానీ పండుగ)ను తొలిసారిగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ అమర్ కుష్వాహ తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దీనిని నిర్వహిస్తున్నామని, బిర్యానీకి పర్యాయపదంగా ఉన్న అంబూర్‌లో ఈ వేడుకను తిరుపత్తూరు జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.

“సందర్శకులకు ప్రవేశ రుసుము లేదు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు 30 నుంచి 50 బిర్యానీ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తాం’’ అని కలెక్టర్‌ అధికారులతో పండుగ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో చెప్పారు.

మేము పండుగను డాక్యుమెంట్ చేసి ప్రభుత్వానికి సమర్పించినట్ట‌యితే జిల్లా అంబూర్ బిర్యానీకి ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’ (జిఐ) ట్యాగ్‌ని పొందగలదని కుష్వాహా చెప్పారు, స్పెయిన్‌లోని టొమాటో పండుగ, రాజస్థాన్ పుష్కరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. అలాగే, బిర్యానీ పండుగ కూడా తిరుపత్తూరుకు పేరు తెచ్చిపెడుతుంది”… అని క‌లెక్ట‌ర్ అన్నారు.

పండ‌గ‌ను బ‌హిష్క‌రించాలి

వేలూరు డివిజన్ హిందూ మున్నాని అధినేత మహేశ్ మాట్లాడుతూ పండుగ నిర్వహించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. బిర్యానీ ఫలానా మతానికి చెందిన ఆహారం కాబట్టి ప్రభుత్వం ఇలాంటి మేళాలను నిర్వహించకూడదని అన్నారు. కలెక్టరు అటువంటి పండుగను నిర్వహించడంలో మునిగిపోకూడదు.

పండుగను బహిష్కరించాలని హిందూ మున్నాని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విజయ భారత మక్కల్ కట్చి అధ్యక్షుడు జైశంకర్ మాట్లాడుతూ అంబూర్ తోలు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, దీనిని ప్రోత్సహించాలని, ఫలితంగా ఉపాధి కల్పనతోపాటు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంద‌న్నారు. బిర్యానీ పండగ నిర్వహించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. మత ఘర్షణలకు ఆస్కారం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. మొత్త‌మ్మీద ప‌లువురి నిరసనల మధ్య, క‌లెక్ట‌ర్ కుష్వాహా బిర్యానీ పండుగను వర్షాల కారణంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంబూర్‌లో బిర్యానీ పండుగ వాయిదా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు
మంగళవారం నాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్, నగరంలోని ముథనంకుళం కట్ట వెంట ఉన్న ఏడు దేవాలయాలను 100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా కూల్చివేసింది. ట్యాంక్ యొక్క ఉత్తర కట్ట వెంట ఆక్రమించిన భూమిలో ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయని కార్పొరేషన్ పేర్కొంది.

ముత్తన్నంకుళంలోని సరస్సు కట్టపై ఏడు హిందూ దేవాలయాలను కోయంబత్తూర్ నగర కార్పొరేషన్ కూల్చివేసిన తరువాత, హిందూ దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి అనేక మంది భక్తులు, హిందూ సంస్థలు కోయంబత్తూర్ వీధుల్లోకి వచ్చాయి. విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) కూడా దేవాలయాలను కూల్చివేయడాన్ని ఖండించింది.

తిరుపూర్ కలెక్టర్ కార్యాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు ఆలయ భూముల్లో ఉన్నాయని, అందువల్ల ఆ భవనాలను కూడా ఆ భూముల నుండి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

దేవాలయాల కూల్చివేతను ఖండిస్తూ కోయంబత్తూరులోని టౌన్ హాల్‌లోని కార్పొరేషన్ కార్యాలయం వెలుపల హిందూ మున్నని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

కూల్చివేతపై హిందూ మున్నని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ “పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉండగా 75 సంవత్సరాల కంటే పాత దేవాలయాలను కూల్చివేయడాన్ని నిషేధిస్తూ పార్లమెంటులో ఒక చట్టం ఆమోదించబడింది. కానీ కోయంబత్తూర్ కార్పొరేషన్ శతాబ్దాల నాటి దేవాలయాలను కూల్చివేసింది. దేవాలయాల కూల్చివేతను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ”.

“హిందూ మత మరియు స్వచ్ఛంద సేవ, ఎండోమెంట్ (హెచ్ఆర్ అండ్ సిఇ) మంత్రి ఆలయం భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, దేవాలయాలను రక్షిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన వెల్లడించాలి ” అని సుబ్రమణ్యం అన్నారు.

ఆక్రమణలను తొలగించడం పేరిట కోయంబత్తూరు కార్పొరేషన్ ఉద్దేశపూర్వకంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుందని హిందూ మున్నని రాష్ట్ర కార్యదర్శి జెఎస్ కిషోర్‌కుమార్ ఆరోపించారు. ఆ పేరుతో 150 సంవత్సరాల నాటి పురాతన ఆలయాలను కూడా కూల్చివేశారని కిషోర్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Source : VSK BHARATH.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చతురత, నిపుణత, సమర్థతల కలబోత హిందూ మున్నాని వ్యవస్థాపకుడు వీరా తురవి రామగోపాలన్ జీ.
శ్రీ రామగోపాలన్ పుట్టిన తేదీ 19/09/1927, తండ్రి శ్రీ రామసామి, తల్లి శ్రీమతి చెల్లమ్మల్, స్వస్థలం సిర్కాజి.

సిర్కాజీలోని లూథరన్ మిషన్ స్కూల్ నుండి రామగోపాలన్ గారి పాఠశాల జీవితం ప్రారంభమైంది. ఆయన బి.ఇ. చదవాలనుకున్నారు కానీ అందులో ప్రవేశం లభించలేదు. బి. ఇ కి  సమానమైన డిప్లొమా అధ్యయనం చేయాలనే ఆలోచనతో ఆయన AMIE లో చేరారు. శ్రీ రామగోపాలన్ 1944 లో చెన్నై పురసైవక్కం-చెంగల్వరాయన్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చేరి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చదివారు.

ఒకసారి ఆయన తన స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు, అతని స్నేహితుడు ముత్తురామన్ సాయంత్రం 5 గంటలకు అకస్మాత్తుగా ఆటను విడిచిపెట్టాడు. గోపాల్జీ ఆశ్చర్యంగా అతనిని అడిగారు. నువ్వు అకస్మాత్తుగా ఆటను విడచి ఎక్కడికి వెళ్తున్నావు? అని. అప్పుడు ముత్తురామన్ ” నేను ఆర్ఎస్ఎస్ శాఖకు వెళుతున్నాను” అని చెప్పారు. అప్పుడు “RSS అంటే ఏమిటి?” అని అడిగారు రాం గోపాల్జీ. అప్పుడు ముత్తురామన్ రాం గోపాల్జీని చెన్నైలోని గోపాలపురం మునిసిపల్ గ్రౌండ్స్‌లో జరిగే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు తీసుకువెళ్ళారు. అప్పటి నుండి సంస్థతో రాం గోపాల్జీ ప్రయాణం ప్రారంభమైంది. చెన్నైలోని అవడి వద్ద ఉన్న సింధ్ ప్రావిన్స్ నుండి బహిష్కరించబడిన హిందూ కుటుంబాలను ఆయన సందర్శించారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ అవసరం ఉందని భావించారు. తద్వారా హిందువులు మరెక్కడా ప్రభావితం కాకుండా ఉండగలరని అభిప్రాయపడ్డారు. తన పూర్తి సమయాన్ని సంఘ కార్యానికే  కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒకవైపు సంఘ పనిలో నిమగ్నమైయుండి కూడా కాలేజీ చదువు పూర్తి చేశారు.

కళాశాల నుండి పట్టా పొందిన తరువాత, సంఘ కార్యంలో పూర్తి సమయ కార్యకర్తగా కొనసాగాలని  నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని సంఘ పెద్దల వద్ద ప్రస్తావించినప్పుడు, సంఘ పెద్దలు మొదట తనను ఉద్యోగం చేసి సంపాదించాలని, తరువాత రాజీనామా చేసి సంఘ్ పనికి తిరిగి రావాలని ఆదేశించారు.

ఆ ప్రకారం శ్రీ రాం గోపాల్జీ  చెన్నై నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడియాథంలోని ఒక ప్రైవేట్ విద్యుత్ కేంద్రంలో పనిచేశారు. ప్రతి రోజూ ఇంట్లో పోరాటం ఉండేది. 1947 లో ప్రచారక్‌గా పనిచేయడానికి సంఘ్ నుండి అనుమతి పొందారు.

మొదట సంఘ్ పని కుంబకోణం వద్ద ప్ర్రారంభించి ఒక వారం తర్వాత తిరునెల్వేలిలో సంఘ పని ప్రారంభించారు.

ఐక్య తమిళనాడులో పాలక్కాడ్ తాలూకా యొక్క ప్రచారక్ గా పని చేశారు. మదురైలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సందోహం మధ్య పరమ పూజ్యనీయ గురూజీ పాల్గొన్న 51 వ గురు పూజా కార్యక్రమం   జరిగింది. ఈ సమావేశానికి శ్రీ పసుంపన్ తేవర్ తిరుమగన్ అధ్యక్షత వహించారు. పరమ పూజినియ గురుజీ తమిళనాడు పర్యటన సందర్భంగా, గురూజీ ప్రసంగాలను రాం గోపాల్జీ అనువదించారు. ఈ సందర్భంగా శ్రీ గురూజీని బాగా అర్థం చేసుకున్నారు.

అవిభక్త తమిళనాడుకు ప్రాంత్ ప్రచారక్‌ గానూ ఇతర అనేక బాధ్యతల్లోనూ పనిచేశారు. జూన్ 1980 లో, సంఘం యొక్క రాష్ట్ర కమిటీ సమావేశం కరూర్‌లో జరిగింది. ఆ కాలంలో మీనాక్షిపురంలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న వార్తలతో తమిళనాడులో గొప్ప గందరగోళం నెలకొంది.  అదే సమయంలో, కన్యాకుమారి జిల్లాను “కన్నిమరి” జిల్లాగా మార్చడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా, రామనాథపురంలో లక్ష మంది మతం మార్చబోతున్నారు అని వారి పేర్లతో సహా విడుదల చేయబడ్డాయి, ఇవన్నీ బహిరంగంగానే జరిగాయి.

కరూర్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ఈ కార్యకలాపాలను నిలువరించే బాధ్యత శ్రీ రాం గోపల్ల్జీకి అప్పగించబడింది. అప్పటి నుండి హిందూ దేవాలయ సంరక్షణ కోసం ఆయన చాలా పోరాడుతున్నారు. హిందూ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థను నడిపాడు.

గోపాల్ జీకి రూ .35 చేతికిచ్చికన్యాకుమారిలో ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను అప్పగించి అక్కడికి పంపారు సంఘ పెద్దలు.

హిందూ ధర్మ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన అనేక కుట్రలను ఆయన చేదించారు. అనేక చర్చిల అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అన్యాక్రాంతమైన  ఆలయ భూములనెన్నింటినో రికవరీ చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణోద్యమాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించారు. తమిళనాడులోని ద్రావిడ సంఘాలు విసిరే సవాళ్ళకు సమర్థవంతంగా సమాధానం చెప్పడం తోపాటుగా, వారు వేసే అపవాదులకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతూ ఉండేవారు.

అప్పటి నుండి ఈ రోజు వరకు, 94 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన అవిశ్రాంతంగా పర్యటించి, హిందువులలో ఐక్యత కోసం, జాగృతి కోసం కృషి చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చతురత, నిపుణత, సమర్థతల కలబోత హిందూ మున్నాని వ్యవస్థాపకుడు వీరా తురవి రామగోపాలన్ జీ. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.