Hindhu – Vishwa Samvad Kendra Andhra Pradesh

తెలంగాణ హిందూ బాలికపై ఇద్దరు ముస్లిం సోదరుల అత్యాచారం.. బాలిక నగ్న చిత్రాలు తీసి బెదిరించిన నిందితులు!
తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 15 ఏళ్ల వయసున్న హిందూ మైనర్‌ బాలికపై ఇద్దరు ముస్లిం యువకులు ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ యువకుల ఆగడాలతో విసిగిపోయిన బాలిక చివరకు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో స్పందించిన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

బాలికకు మాయమాటలు చెప్పి.. ఆపై వంచించి!

పదో తరగతి చదువుతున్న బాలికపై ఇంటి పక్కనే ఉంటున్న ఇద్దరు ముస్లిం సోదరులు కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా గత ఆరు నెలలుగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారు. వీడియోలు రికార్డు చేసి ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని బెదిరించారు. తీరా విషయం కాస్త బాలిక తల్లికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితులు వీరే..

వరంగల్ నగరంలోని ఓ కాలనీలో పదిహేనేళ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో అలీ(26), అబ్బు (22) సోదరులు ఉంటున్నారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఈ బాలికపై కన్నేసిన వీరు.. మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటికి పిలిపించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ టైంలో వీడియోలు రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాలికను బెదిరించేవారు. బాలికకు నిందితులు పలుమార్లు సైగలు చేయడాన్ని గమనించిన తల్లి… విషయం ఏంటని ఆరా తీయగా.. బాలిక అసలు విషయం చెప్పింది.

వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బీజేపీ నాయకులు దాడి చేశారు. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఈ ఘటనపై వరంగల్ నగర సీపీ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుధవారం అర్ధరాత్రి ఫిర్యాదు అందిందని చెప్పారు. మైనల్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

The post తెలంగాణ హిందూ బాలికపై ఇద్దరు ముస్లిం సోదరుల అత్యాచారం.. బాలిక నగ్న చిత్రాలు తీసి బెదిరించిన నిందితులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్!
లక్నో: హిందూ బాలికను మహ్మద్ సుఫియాన్ అనే ముస్లిం యువకుడు భవనం పైనుంచి తోసి చంపాడు. ఇస్లాం మతంలోకి మారి తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించినందుకు నిధి గుప్తా (17)అనే బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి యూపీ రాజధాని దుబగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ కుంజ్ సెక్టార్ హెచ్‌లో చోటుచేసుకుంది. కొన ఊపిరితో ఉన్న నిధిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ, ఆమె మరణించింది.

నిందితుడు మొహమ్మద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అదనపు డీసీపీ(పశ్చిమ) సీఎన్ సిన్హా హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టి)కి తెలిపారు. బాలిక తల్లి దుబగ్గ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు హత్య, బలవంతపు మత మార్పిడికి సంబంధించిన తగిన సెక్షన్ల కింద సూఫియాన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

నిధి హైస్కూల్ వరకు మాత్రమే చదువుకుంది. సమీపంలోని బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా నేర్చుకుంది. సుఫియాన్ అదే పరిసరాల్లో ఉంటూ కొంతకాలంగా ఆమెను వెంబడిస్తూ వేధిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం, అతను నిధికి మొబైల్‌ను ‘బహుమతి’గా ఇచ్చాడు. ఆమెకు కాల్ చేయడం ప్రారంభించాడు. ఆమెను మతం మార్చుకుని పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. అతడి వేధింపుల గురించి చెప్పింది.

ఆమె తల్లి, ఇతర బంధువులు సుఫియాన్ ఇంటికి వెళ్ళి అతని ప్రవర్తనపై అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఇంట్లో వాగ్వాదం జరుగుతుండగా, సూఫియాన్ అకస్మాత్తుగా నిధిని పట్టుకుని నాలుగో అంతస్తుకు తీసుకెళ్ళి కిందకు నెట్టాడు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి!
శివలింగం, ఇత‌ర విగ్రహాల ధ్వంసం

ల‌క్నో: మరో హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, దోచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా నోయిడా, బెహ్లోల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 20-21 మధ్య రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సచిన్ గుప్తా పోస్ట్ చేసిన వీడియోలో, ఆలయ ప్రాంగణంలో చెల్లాచెదురుగా ఉన్న హిందూ దేవుళ్ళ‌ విగ్రహాల ముక్కలు కనిపించాయి. ఆయన ట్వీట్ చేస్తూ, “సంఘ వ్యతిరేకులు ఆలయంలోకి చొరబడి విగ్రహాలను ధ్వంసం చేశారు. శివలింగం దగ్గర రక్తం కూడా కనిపించింది. ఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు.” అని తెలిపారు.

UP के नोएडा में असामाजिक तत्वों ने मंदिर में घुसकर मूर्तियां तोड़ी. शिवलिंग के पास खून बिखरा मिला. पुलिस फोर्स मौके पर है. #Noida pic.twitter.com/8hqdDMacyd

— Sachin Gupta (@sachingupta787) March 21, 2022

ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన గుర్తుతెలియని దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తెలెత్తింది. ఏబీపీ జర్నలిస్ట్ అంకిత్ కౌశిక్ పోస్ట్ చేసిన వీడియోలో, శివలింగం భాగాలు ధ్వంసమైనట్టు చూడవచ్చు. గుడి నేలపై కూడా రక్తం చిమ్మినట్టు కనిపించింది.

పోలీస్ కమిషనరేట్ గౌతమ్ బుద్ధ్ నగర్ విభాగం స్పందించింది. “పోలీసు ఫోర్స్ స్పాట్‌లో ఉంది. పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషయమై విచారణ ప్రారంభించి తగిన చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ విద్యార్థులపై ముస్లింల దాడి!
‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు కొట్టారు

మధ్యప్రదేశ్‌లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

అగర్‌ మాల్వా: ‘భారత్‌ మాతా కీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు తోటి హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని అగర్‌ మాల్వా జిల్లాలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఇక్కడి ఒక ప్రైవేట్‌ పాఠశాలలో, కొంతమంది అబ్బాయిలు జాతీయ గీతం తర్వాత ‘భారత్‌ మాతా కీ జై’ నినాదం చేయలేదు, ఆ తర్వాత ఈ విషయమై విద్యార్థుల మధ్య గందరగోళం నెలకొంది.

‘బడి విడిచిపెట్టిన తర్వాత, కొంతమంది ముస్లిం విద్యార్థులు భరత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, అతని స్నేహితులపై దాడి చేశారు. కసాయి మొహల్లా సమీపంలో కర్రలతో కొట్టారు. అలాగే, భారతదేశం అంటే ఏమిటి, భారత్‌ మాతా కీ జై అని నినాదాలు చేయండి అని మాకు చెప్పడానికి మీరేవరు?, ఎక్కువ చేస్తే చంపేస్తామని కూడా బెదిరించారు’ అని పోలీసులు చెప్పారు.

అల్లర్లు, దాడి చేసిన ఆరోపణలపై తొమ్మిది మంది తెలిసిన, తొమ్మిది మంది తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు బాదోడ్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ వివేక్‌ కనోడియా తెలిపారు. భరత్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాహిర్‌, అజార్‌, షకీల్‌, పింటు, షోఫీ, రాజా, ఇతరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కనోడియా తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ విద్యార్థులపై ముస్లింల దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం ‘గ్రేట్‌ నేషన్‌’
స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌

దేవగిరి: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఏకైక లక్ష్యం ఒక గొప్ప దేశాన్ని తయారుచేసే సమాజాన్ని రూపొందించడమే అని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఈ సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవకులు నిరంతరం సమాజంలో పనిచేస్తున్నారు. మొత్తం సమాజం కేవలం ప్రేక్షకుడిగా ఉండకుండా, జాతీయవాద శక్తుల ద్వారా జరిగే భారీ పనిలో పాల్గొనడం ద్వారా మాత్రమే దేశంలో అవసరమైన మార్పు కనిపిస్తుంది. ఔరంగాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ దేవగిరి ప్రార్థన మహా సంగమంలో పాల్గొన్న 60,000 మంది స్వయంసేవకులను ఉద్దేశించి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఫ్‌ుచాలక్‌ ప్రసంగించారు.

దేవగిరి ప్రార్థనలో ఇదే మొదటి మహాసంగమని, ఇంత పెద్ద సంఖ్యలో మీరు పాల్గొన్నారని, ఇలా ఎటువంటి భేదాలు లేకుండా ఈ కార్యక్రమానికి హాజరుకావడం శుభపరిణామమని స‌ర్ సంఘ్‌చాల‌క్‌ అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఇదో గొప్ప దృశ్యంలా కనిపిస్తోందన్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌, సర్‌ మానవేంద్ర నాథ్‌ రాయ్‌లను ప్రస్తావించారు. ప్రతి వ్యక్తి జాతీయతా స్ఫూర్తిని గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ హెడ్గేవార్‌ ఆలోచనలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకుంటూ, సమాజంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి స్థిరంగా ఉండే హిందూ సంస్కృతి, హిందూ ధర్మం అనే ఒక సాధారణ సంబంధం ద్వారా సమాజాన్ని ఏకం చేయాలని ఆయన సంకల్పించుకున్నారని భగవత్‌ అన్నారు.

‘అందరినీ అంగీకరించండి’ అనేది భారతదేశ పౌరుల్లో ఉండే సహజ మనస్తత్వమని భగవత్‌ అన్నారు. ప్రపంచం ‘సహనం’ గురించి మాట్లాడుతుండగా, హిందువు ‘అంగీకారం’ అనే గుణం గురించి మాట్లాడుతున్నాడు… హిందూ సంస్కృతి ఏకం అవుతుందని, అది వేల సంవత్సరాల నుండి కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

గొప్ప హిందూ దేశం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వీరులు, ధీరులు భారతీయులందరికీ పూర్వీకులేనని అన్నారు. ఆధునిక యుగంలో కూడా అదే సాంస్కృతిని, హిందూ వారసత్వాన్ని మన జీవితాలతో కొనసాగిస్తూ స్ఫూర్తి పొందాలని ఆయన దేశ ప్రజలందరినీ కోరారు.

సమాజంలో కులాల పేరిట అసమానతలు, సాంఘిక దురాచారాలు ఉండకూడదని, వాటిని పారద్రోలాల్సిన అవసరం ఉందన్నారు.

చరిత్రలో భారతదేశం గొప్పగా వెలుగొందుతున్నప్పుడు, ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉందని భగతవత్‌ చెప్పారు. జాతీయవాద స్ఫూర్తి పెరగాలి కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ పని పెరగాలని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పనిలో చేరడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌లోని అసలైన పని ఏమిటనేది తెలుస్తుందని స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ నొక్కి వక్కాణించారు.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం ‘గ్రేట్‌ నేషన్‌’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ‘రామ్‌చరితమానస్‌’
భోపాల్‌: హిందూ ధర్మంలో గొప్ప గ్రంథమైన రామ్‌ చరిత్‌ మానస్‌ను విద్యార్థులకు పాఠ్యంశంగా బోధించనున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి శ్రీరాముడి గురించి బోధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిలాసఫీలో బోధించడానికి ఉన్నత విద్యా విభాగం రామ్‌చరిత్‌మానస్‌ ప్రాక్టికల్‌ దర్శన్ణ అనే సిలబస్‌ను సిద్ధం చేసింది. ఇందులో 100 మార్కుల పరీక్ష ఉంటుంది.

అయితే ఇది కంపల్సరీ కాదు.. ఎవరికీ ఇష్టమైతే వారు ఈ పాఠ్యాంశాన్ని ఎంచుకొనే వీలుకల్పించింది. దీనిని హిందీ లేదా ఫిలాసఫీ ప్రొఫెసర్లు బోధిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు బోధించడానికి సర్వం సిద్ధం చేసింది అక్కడి ప్రభుత్వం.

ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి మోహన్‌ యాదవ్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. నిజ జీవితంలో విలువలున్న వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలను విద్యార్థులకు బోధించడానికి వీటిని పాఠ్యంశాలుగా చేర్చబడ్డాయని చెప్పారు. రామ్‌చరితమానస్‌లో సైన్స్‌, సంస్కృతి, సాహిత్యం కలిగి ఉందన్నారు. ఇది ఏ మతానికి చెందింది కాదని.. ఉర్దూ గజల్‌ని కూడా ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టామని చెప్పారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ‘రామ్‌చరితమానస్‌’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ మహిళతో ముస్లిం వ్యక్తి రెండో వివాహం చెల్లదు’
గువాహటి: ముస్లిం మతానికి చెందిన వ్యక్తి హిందూ మహిళను రెండో వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదని గువాహటి హైకోర్టు ఇచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం-1954 కూడా ఈ పెళ్లిని కాపాడలేదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. అసోం కామ్‌రూప్‌ జిల్లాలో నివసిస్తున్న మహిళ దీపమణి కలితకు 12 ఏళ్ల కుమారుడున్నాడు. ఆమె భర్త సహబుద్దిన్‌ 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న తన భర్త మరణం అనంతరం పెన్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు తనకు అందాలని దీపమణి అధికారులను సంప్రదించారు. అందుకు వారు నిరాకరించడం వల్ల 2019లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ పెళ్లి చెల్లదని తెలిపింది. సహబుద్దీన్‌ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారనేందుకు ఆధారాలు లేవని పేర్కొంది.

మహమ్మదీయ చట్ట సూత్రాల ప్రకారం, ఒక ముస్లిం వ్యక్తి విగ్రహారాధన చేసే మహిళను వివాహం చేసుకోవడం చెల్లదని, అది అక్రమ వివాహమని స్పష్టం చేసింది. పిటిషన్‌ దాఖలు చేసింది మహమ్మదీయురాలు కాదని చెప్పింది. ప్రత్యేక వివాహం చట్టం-1954 మేరకు పెళ్లి చేసుకున్నామని చెబుతున్నప్పటికీ అందులోని సెక్షన్‌4(ఏ) ప్రకారం ఈ వివాహం చెల్లుబాటు కాదని వివరించింది. పిటిషనర్‌ ముస్లిం మతాన్ని స్వీకరించలేదని కూడా గుర్తు చేసింది.

అయితే పిటిషనర్‌ కుమారుడు మైనర్‌ అయినందున తండ్రి పెన్షన్‌ నుంచి అతను భాగం పొందవచ్చని కోర్టు తెలిపింది. అతని పేరున ఓ బ్యాంకు ఖాతా తెరిచి, సంరక్షకురాలిగా తల్లిని పేర్కొనవచ్చని సూచించింది. తండ్రి పెన్షన్‌లో భాగాన్ని మైనర్‌ కుమారుడికి ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని అధికారులకు మాత్రం కోర్టు ఆదేశాలు జారీ చేయలేదు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ మహిళతో ముస్లిం వ్యక్తి రెండో వివాహం చెల్లదు’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆఫ్ఘనిస్తాన్‌… ఓ సనాతన ధర్మక్షేత్రం!
ఆఫ్ఘనిస్తాన్‌ పేరు చెప్పగానే ఓ ముస్లిం దేశంలా మస్తిష్కంలో మెదులుతుంది. మహమ్మద్‌ ఘజనీ వంటి క్రూరుల అరాచక పాలన గుర్తుకొస్తుంది. కానీ, ఒకప్పుడు ఇదే ఆఫ్ఘనిస్తాన్‌ సనాతన ధర్మ క్షేత్రమని మీకు తెలుసా? హిందూ రాజుల ఏలుబడిలో ఎంతో సుసంపన్నంగా వర్ధిల్లిన ప్రాంతమని మీరు ఎరుగుదురా? ప్రస్తుతం తాలిబన్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతన్న ఆ నేలపై ఒకప్పుడు హిందూ ధర్మం వర్ధిల్లింది. శాంతి, సౌభ్రాతృత్వం విలసిల్లాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ పూర్తిగా ఇస్లామిక్‌ తీవ్రవాదుల వశమైంది. తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో మిగిలివున్న సాంస్కృతిక వారసత్వం కూడా నాశనమవుతోంది. హిందువులు, సిక్కులు ప్రాణాలరచేతిలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోవాల్సివచ్చింది.

1970 లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో కనీసం ఏడు లక్షల మంది సిక్కులు, హిందువులు ఉండేవారు. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి మైనార్టీలు మైనార్టీ జనాభా వందల్లోకి పడిపోయింది. భారత సంతతికి చెందిన ఈ మైనార్టీలేమయ్యారు..? నేడు, ఆఫ్ఘనిస్తాన్‌లో మిగిలి ఉన్న ఆ కొద్దిమంది ధార్మిక మైనారిటీలు తమ స్వదేశం నుండి పారిపోవలసి వచ్చింది. ఇదీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితి. కానీ, ఇదే మైనార్టీ హిందువులతో ఆఫ్ఘనిస్తాన్‌ ఒకప్పుడు శాంతి, సౌభ్రాతృత్వంతో విలసిల్లింది. హిందూ షాహీల పాలనలో సంస్కృతి, వారసత్వ సంపదతో తులతూగింది.

అఖండ భారత చిత్రపటంలో ఆఫ్ఘనిస్తాన్‌ కూడా భాగమే. భారత ఉపఖండం సనాతన ధర్మంతో పరిమళించింది. అందుకే ఇస్లామిక్‌ దోపిడీదారులు భారత ఉపఖండాన్ని ఎప్పుడూ ద్వేషిస్తారు. ఇస్లామిక్‌ దోపిడీదారుల దృష్టిలో ఆఫ్ఘనిస్తాన్‌.. జయించాలనుకున్న ఓ భూమి మాత్రమే. కానీ, భారత ఉపఖండంలో అత్యంత అభివృద్ధి చెందిన ఈ భూమి.. ఒకప్పుడు సనాతన ధర్మక్షేత్రం. సంపన్న నాగరికత కలిగిన ప్రాంతం. మధ్యయుగ క్రూరులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు వరకు.. ఇక్కడ ఇస్లామిక్‌ కాలిఫేట్‌ పతాకం ఎగరకముందు వరకు.. హైందవం, బౌద్ధం వెల్లివిరిసిన ప్రాంతమిది.

ఏడో శతాబ్దంలో ప్రస్తుతం ఇరాన్‌లోని నిహవాండ్‌లో.. సస్సేనియన్‌ పర్షియన్లను ఓడిరచిన రషీదున్‌ కాలిఫేట్‌ అరబ్బులు తొలిసారి నేటి ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టారు. ఆ విధంగా, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువుల సాంస్కృతిక మారణహోమానికి బీజాలు పడ్డాయి. ‘ఆఫ్ఘనిస్తాన్‌’ అనే పేరు ‘ఉప-గణ-స్తాన్‌’ అనే పదం నుండి వచ్చింది. సంస్కృతంలో సంస్కృతంలో ‘ఉప-గణ-స్తాన్‌’ అంటే గిరిజన తెగలు నివసించే ప్రాంతమని అర్థం.

ఇది మహాభారతంలోని గాంధారికి చెందిన ప్రదేశం. దీనిని మొదట్లో గండహార్‌ అని పిలిచేవారు. శకుని కుట్రలకు వేదికైన ఈ గండహార్‌ కాలక్రమంలో కాందహార్‌గా మారింది. కాందహార్‌.. ఆప్ఘన్‌ సామ్రాజ్యానికి తొలి రాజధాని. అంతేకాదు, ప్రస్తుత తాలిబన్ల వాస్తవ రాజధాని కూడా కాందహారే. నేడు పష్తూన్లుగా పిలవబడుతున్న ఆఫ్ఘన్లు.. మన వేద సాహిత్యంలో పేర్కొన్న ‘పక్త’ తెగ వారసులే.

సింధు ప్రాంతానికి చెందిన రాజా దాహిర్‌ సేన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించాడు. ఆప్ఘనిస్తాన్‌ను పాలించిన చివరి హిందూ పాలకుడు ఆయనే. ఆ తరువాత మహ్మద్‌ బిన్‌ ఖాసిం అనే దోపిడీదారుడు ఈ ప్రాంతాన్ని జయించాడు. సాధారణ శకం 850 నుంచి 1026 వరకు ఆఫ్ఘనిస్తాన్‌ హిందూ షాషీల పాలనలోనే వుంది. వీరినే కాబూల్‌ షాహీలు అని కూడా పిలిచేవారు. వీరికాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో సనాతన ధర్మం వెల్లివిరిసింది. ఆఫ్ఘనిస్తాన్‌ హిందూ షాహీలు క్షత్రియులైనప్పటికీ.. వారి రాజ్యాన్ని స్థాపించినవాడు ‘కల్లార్‌’ అనే ఓ బ్రాహ్మణ మంత్రి.

ఇస్లాం రాకకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌ గిరిజన భూమి. ఈ ప్రాంతంలో నివసించిన పషాయి, నూరిస్తానీ తెగలు హిందుత్వాన్ని అనుసరించేవారు. 4, 5 శతాబ్దాల్లో కుషాణులు, కిదారా సామ్రాజ్యాల కింద ఆఫ్ఘనిస్తాన్‌, దాని పొరుగు ప్రాంతాల్లో హిందూమతం, బౌద్ధ మతం అభివృద్ధి చెందాయి. వారి పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లోనే కాకుండా.. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాల్లో అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. నేటి ఆధునిక ఉజ్బెకిస్తాన్‌, తజికిస్తాన్‌ దేశాలు.. ఆఫ్ఘన్‌ రాజ్యంలో భాగంగా ఉండేవి.

కిదార సామ్రాజ్యం తరువాత, ఆఫ్ఘనిస్తాన్‌ 4, 6 శతాబ్దాల మధ్యకాలంలో.. మధ్య, దక్షిణాసియా ప్రాంతాన్ని హూణులు హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతం గుప్తుల పాలనలోకి వెళ్లింది. సాధారణ శకం 370లో కిదారులచే పాలించబడిన ఈ ప్రాంతాన్ని హూణులు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని నేటి కాందహార్‌ ప్రాంతాన్ని గాంధార అని పిలిచేవారు. గాంధార ప్రాంతాన్ని ప్రసిద్ధిగాంచిన హుణుడు, ఖింగిలా అనే రాజు.. కిదార రాజులను ఓడిరచి స్వాధీనం చేసుకున్నాడు.

5వ శతాబ్దం చివర్లో.. హూణులు సింధ్‌ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. హుణులు ప్రధానంగా హిందూ, బౌద్ధ మతాలను పాటించేవారు. ఖింగిలా రాజు పాలనాకాలంలో శివుని ముద్రతో కూడిన నాణేలు చెలామణిలో వుండేవి. హూణులు ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారుగా సాధారణ శకం 666 నుండి 843 వరకు పరిపాలించారు.

ఇక, సాధారణ శకం 843 నుండి 850 వరకు, ఒక బ్రాహ్మణ మంత్రి ఈ ప్రాంతాన్ని పాలించారు. కల్కా వర్గానికి చెందిన బ్రాహ్మణుల ఆ కాలంలో ప్రాముఖ్యతను పొందింది. వారినే ఆ తరువాత కల్లర్లుగా పిలిచేవారు. కల్లర్లకు చెందిన ఓ బ్రాహ్మణ మంత్రి, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ షాహి రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత అనేక మంది హిందూ షాహి పాలకులు.. ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ సంస్కృతిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. వక్కదేవ, కమలవర్మన్‌, భీమదేవ, జయపాలదేవ, ఆనందపాల, త్రిలోచనపాల, భీంపాల వంటి రాజులు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రాంతాన్ని 1026 వరకు పాలించారు.

కమలవర్మన్‌ పాలనలో సఫారిడ్‌ పాలన బలహీనపడిరది. దీంతో సిస్తాన్‌ ప్రాంతం సమనైద్‌ సామ్రాజ్యంలో భాగమైపోయింది. సఫారిడ్‌ రాజులు.. సిస్తాన్‌ నుంచి వచ్చిన సున్నీ పెర్షియన్‌ రాజవంశానికి చెందినవారు. ప్రస్తుత ఇరాన్‌ కేంద్రంగా వీరు పాలన సాగించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న జరాంజ్‌ వీళ్ల రాజధాని. 861 నుంచి 1003 వరకు వీరి పాలన సాగింది. ఆ తర్వాత హిందూషాహీలు ఈ ప్రాంతంపై పట్టు పెంచుకున్నారు.

షాహీలు తమ పశ్చిమ సరిహద్దుల్లో కార్యకలాపాలను వేగవంతం చేశారు. హిందూ షాహీల మద్దతుతో గజనీ హిందూ రాజుల పాదాక్రాంతమైంది. కమలవర్మన్‌ పాలనలో గజనీపై దాడి జరిగినప్పటికీ.. అతని వారసుడు భీమదేవుని కాలంలో ఈ ప్రాంతంలో హిందూ షాహీల పాలన మరింత బలోపేతమైంది.

శతాబ్ద కాలం పాటు.. పొరుగున వున్న బలమైన సమనైద్‌ సామ్రాజ్యంతో హిందూ షాహీలు విజయవంతంగా పోరు సాగించారు. అయితే, సమనైద్‌ ముస్లిం సామ్రాజ్యం క్రమంగా క్షీణతకు గురైనా.. టర్కీ అధికారులు మాత్రం సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. హిందూ కుష్‌కు దక్షిణాన ఉన్న హిందూ రాష్ట్రాలను భయపెడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. అయితే, వీరి అరచాకాలను ఎదుర్కోవడానికి భీమదేవుడికి మగసంతానం లేదు. దీంతో హిందూ షాహి రాజ్యం బలంగా, సంపన్నంగా వున్నప్పటికీ.. వారసుడు లేక పరిపాలన కష్టతరమైంది. ఈ నేపథ్యంలో మిత్రరాజ్యమైన పంజాబ్‌ రాజ్యానికి.. హిందూ షాహి రాజ్యాన్ని ధారదత్తం చేశాడు.

భీమదేవుని తర్వాత రాజా జయపాలదేవుడు రాజ్యపాలన చేశాడు. అయితే, తన పూర్వీకుల రాజవంశం నుంచి ‘దేవ’ అనే ఇంటిపేరుతో పాటు.. తన సొంత కుటుంబానికి చెందిన ‘పాల’ అనే పేరు చేర్చాడు. అప్పటి నుంచి హిందూ షాహీ రాజుల పేర్లలో ‘పాల’ అనే ఇంటి పేరు కొనసాగింది. జయపాలదేవుడు టర్క్‌ల పట్ల దూకుడుగా వ్యవహరించేవాడు. దీంతో ఆయన పాలనలో హిందూ షాహీ రాజ్యం మరింత బలోపేతమైంది.

10వ శతాబ్దం వరకు హిందూ షాహీ పాలన అప్రతిహతంగా కొనసాగింది. కాలక్రమంలో అన్ని రాజ్యాల వలె హిందూ షాహీ రాజ్యం కూడా క్షీణించడం ప్రారంభమైంది. ఇది గజనీ మహ్మద్‌కు సరైన అవకాశాన్ని అందించింది. క్షీణిస్తున్న హిందూ షాహీలపై పైచేయి సాధించిన ఈ పర్షియన్‌ రాజవంశం భారతదేశంలోకి ప్రవేశించింది. 1001 నవంబర్‌ 28న, మహమూద్‌ హంతక సైన్యం పెషావర్‌ యుద్ధంలో రాజా జయపాలదేవుడిని ఓడిరచింది.

దీంతో జయపాలుడు తనను తాను ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ తర్వాత అతని కుమారుడు ఆనందపాలుడు వచ్చినా హిందూ షాహీ రాజ్యం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ లో ఇస్లాం ప్రధాన మతంగా మారింది. 200 ఏళ్లపాటు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రాంతాన్ని పాలించిన హిందూ షాహీ రాజులు.. హిందూ సంస్కృతిని చెక్కుచెదరకుండా కాపాడారు.

ఎప్పుడైతే హిందూ షాహీ రాజవంశం క్షీణించిందో.. ఎప్పుడైతే ఇస్లాం రాజుల నియంత్రణలోకి వెళ్లిందో.. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ శాంతికి దూరమైంది. అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పరిస్థితిలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్‌ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆఫ్ఘనిస్తాన్‌ హిందూ చరిత్ర పురాతనమైనది. ఇస్లాం పుట్టకముందే ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ వెల్లివిరిసింది.

కానీ, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ షాహీల పాలనకు చరిత్ర పుటల్లో తగిన స్థానం దక్కలేదు. తాలిబన్ల ఆక్రమణతో అక్కడ మిగిలివున్న హైందవ సంస్కృతి, సంపద పూర్తిగా ధ్వంసమవుతోంది. ఒకప్పటి మన ధార్మిక క్షేత్రం మన కళ్ల ముందే కుంచించుకుపోతోంది. కానీ, ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ కష్టం ఎల్లకాలం వుండదు. అరాచకపాలన ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆఫ్ఘనిస్తాన్‌… ఓ సనాతన ధర్మక్షేత్రం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువులపై ఎందుకీ వివక్ష?
చిన్నారుల ఉసురుపోసుకున్న ప్రభుత్వం, పోలీసులు

నిప్పుచెరుగుతున్న గణపతి భక్తులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హిందువులపై ఎందుకీ వివక్ష? అని రాష్ట్రంలోని వినాయకుడి భక్తులు నిప్పులుచెరుగుతున్నారు. కరోనా పేరిట దేవుళ్ళ పూజలకు విఘాతాలు కలిగించడం ప్రభుత్వానికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవానికి ఆది నుంచి అడ్డంకులు ఏర్పడడం విదితమే. ఈ నేపథ్యంలో ఏదో విధంగా పూజలు చేసుకున్న భక్తులకు చివరికి నిమజ్జన సమయంలో ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు వివిధ ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారు.. ఇతర మతాల వారు, రాజకీయ నాయకులు వేల మందితో కార్యక్రమాలు చేస్తుంటే.. వారికి లేని నిబంధనలు హిందూ పండుగలకు ఎందుకు ఆంక్షలు విధించారంటూ పలు హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

డ్రమ్స్‌కు అనుమతి లేదట!

కర్నూలు జిల్లా ఆత్మకూరులో చేపట్టిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్రమ్స్‌ వాయిద్యాల మధ్య యువకులు, చిన్నారుల నృత్యాలతో శోభయాత్ర ప్రారంభం కాగా…డ్రమ్స్‌కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. శోభాయాత్రను ఆపేసి యువకులు నిరసనకు దిగారు. కొద్దిసేపు తర్వాత పోలీసులు దిగిరావటంతో యువకులు శాంతించారు. శోభాయాత్ర తిరిగి ఉత్సహంగా కొనసాగింది.

సీఎం తండ్రి వర్ధంతికి వర్తించని కొవిడ్‌ నిబంధనలు.. వినాయక నిమజ్జనానికి వర్తిస్తాయా?

గూడూరు నగర పంచాయతీలో ఆదివారం వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత కొనసాగింది. నిమజ్జనానికి డీజే అనుమతి లేదని పోలీసులు తెలపడంతో బస్టాండ్‌ కూడలి వద్ద పెద్ద ఎత్తున స్థానికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. సీఎం తండ్రి వర్ధంతికి వర్తించని కొవిడ్‌ నిబంధనలు.. వినాయక నిమజ్జనానికి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఉదయం నిరసన ప్రారంభించారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టారు.

ఆలూరు వినాయక నిమజ్జనంలో డిజే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిమజ్జనానికి వెళ్లకుండా నిలిపేశారు. మూడు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన యువకులు… డీజేతో నిమజ్జనానికి బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు.

ఊరేగింపులకు అడ్డుపుల్ల

గుంటూరు జిల్లా, గరికపాడులో వినాయక ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. డప్పులతో ఊరేగింపుగా వెళ్తున్న విగ్రహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిన్న వైకాపాకు చెందిన నాయకులు డప్పులతో రాత్రి వరకు ఊరేగింపు చేశారని… తాము చేస్తే తప్పు ఏముందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అనంతపురంలో గణపతికి ముస్లిం పూజలు

అనంతపురం జిల్లా హిందూపురంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా విశ్వ సేన వినాయక సేవా సమితి ప్రతి సంవత్సరం వినాయకుని పూజలకు ముస్లిం సోదరులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. వారి ఆహ్వానం మేరకు ముస్లిం సోదరులు పాల్గొని.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. గణనాథుడి పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పలువురు ముస్లింలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువులపై ఎందుకీ వివక్ష? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ ఆలయాలపై ఆగని దాడులు!
గోడలు కూల్చివేత, నగదు, వస్తువుల చోరీ

బంగ్లాదేశ్‌లో యథేచ్ఛగా హింస

ఢాకా: పొరుగున గల బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఆగస్టు-సెప్టెంబర్‌లో పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఆగస్టు 24 మంగళవారం, బంగ్లాదేశ్‌లోని గైగంధ జిల్లాలోని సుందర్‌గంజ్‌ ఉప జిల్లాలోని ధోపదాంగ యూనియన్‌లో ఉన్న దక్షిణ ధోపదాంగ గ్రామంలోని రెండు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని రాడికల్‌ సమూహం దాడి చేసింది.

ప్రముఖ పటారి కాళీ దేవాలయంతో సహా రెండు ఆలయాలను ధ్వంసం చేశారు. ఈ దేవాలయాలలోని ఏడు హిందూ దేవతల మూర్తిలను తగలబెట్టారు. విలువైన వస్తువులన్నీ దొంగిలించారు. ఈ విధ్వంసం, దోపిడీ ఆగస్టు ఏడో తేదీన ఖుల్నా జిల్లాలోని రుప్సా ఉప జిల్లాలోని 10 దేవాలయాల దోపిడీతో ప్రారంభమైంది.

పురాతన ఆలయంలో విధ్వంసం

బంగ్లాదేశ్‌లోని హిందూ కార్యకర్తల ఆరోపణల ప్రకారం… మతువా సమాజంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులు శ్రీశ్రీ హరిచద్‌ ఠాకూర్‌, శాంతి మాతా దేవి జంట. నారైల్‌ జిల్లాలోని నారైల్‌ సదర్‌ ఉప జిల్లాలోని షోల్‌పూర్‌లో ఉన్న వీరి మూర్తులను ఆగస్టు 18న తీవ్రవాదులు పడగొట్టారు. అలాగే, 27న శుక్రవారం ఫిరోజ్‌పూర్‌లోని నేసరాబాద్‌ ఉప జిల్లాలోని 200 ఏళ్ళ పురాతన హిందూ దేవాలయంపై గుర్తు తెలియని దుర్మార్గులు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు.

ఆ ప్రాంతానికి చెందిన బిజిపోభూషోన్‌ మిస్త్రీ, నేషరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశంలో జరిగిన ఘటనకు సంబంధించిన నేరగాళ్ళను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నామని నేసరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌-ఇన్‌-ఛార్జ్‌ అబీర్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ తెలిపారు.

After Rupsa Shiyali in Khulna,on 18/08/2021,the Islamic Jihadis again broke the idols of Sri Sri Harichad Thakur and Shanti Mata Devi.The incident took place in Sholpur village of Singasholpur union in Narail Sadar upazila of Narail district in BD??.#SaveHinduTemplesInBangladesh pic.twitter.com/QZaGTbxcEr

— Raju Das ?? (@RajuDas7777) August 19, 2021

దొరికిన మతోన్మాది!

నోఖాలి మైజ్‌దీ పట్టణంలో ఉన్న శివాలయంలోని మూర్తులను ధ్వంసం చేస్తున్నప్పుడు 18 ఏళ్ల మోస్లేహుద్దీన్‌ అకా షకిల్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ దొంగ ఆగస్టు 16 రాత్రి 11 గంటల తర్వాత హిందూ దేవాలయంలోకి చొరబడ్డాడు. అరాచకం సృష్టించాడని స్థానికులు ప్రత్యక్ష సాక్ష్యమిస్తూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఆలయం గోడ కూల్చివేత

ఈ నెల ఒటోతేదీన బుధవారం రావుజాన్‌ ఉప జిల్లాలోని శ్రీశ్రీ మాగేశ్వరి ఆలయంలోని మతోన్మాదులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఆలయ గోడను దుర్మార్గులు కూల్చివేశారు. దోపిడీదారులు 50,000 బంగ్లాదేశ్‌ టకా మొత్తాన్ని దోచుకున్నారని, దోపిడీ జరిగినప్పటి నుండి దేవాలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా లేవని బంగ్లాదేశీ హిందూ కార్యకర్త ఆరోపించారు.

Source : HinduPost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ ఆలయాలపై ఆగని దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.