GURRAM JASHUA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కవికోకిల గుఱ్ఱం జాషువా
పరాయి పాలనలో మ్రగ్గుతూ ఉండిన భారతావనిలో అన్ని రంగాల్లోనూ కారుచీకట్లు కమ్ముకున్న కాలమది. సవర్ణ హిందూవులచేత వెలివేయబడిన నిమ్నజాతుల వారికోసం విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని నెలకొల్పి మిషనరీలు ఆ అమాయకులను క్రైస్తవానికి ఆకర్షిస్తూ ఉండిన రోజులవి. గుంటూరులోని లూథరన్ మిషన్, వినుకొండలోని బాప్టిస్టుమిషన్ లు ఆ రోజుల్లో మతప్రచారానికి కేంద్రబిందువులు. అసమానతలకు ఊపిరిపోసిన కులమతాల కుమ్మలాటకు తోడు అంథవిశ్వాసాలు, మూఢాచారాలు తోడై సమాజాన్ని నిర్వీర్యం చేశాయి.

అలాంటి సామాజిక పరిస్థితుల మధ్య జన్మించినవాడు కవికోకిల గుఱ్ఱం జాషువా. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన సాహితీవేత్తల్లో ధ్రువతార గుఱ్ఱం జాషువా. జాషువా తండ్రి గుఱ్ఱం వీరయ్య గొల్లకులస్థుడు. తల్లి లింగమాంబ మాదిగ కులస్థురాలు. శ్రీ జాషువా 28 సెప్టెంబరు 1895న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. ఆయన పాఠశాలలో చేరినప్పటి నుండి తోటి పిల్లలు “నన్నుతాకవద్దు నీవు అస్పృశ్యడవంటూ” అవమానపరచేవారు. తనకవమానాలు ఎదురైనపుడు జాషువా ఊరుకొనేవాడు కాదు. తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టిన సందర్భాలున్నాయ్.

అనంతర కాలంలో ఈ సత్కవీంద్రుడు కవిత్వాన్నే ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. శ్రీ జాషువా ఒక సందర్భంలో తన జీవన వివరాలను చెబుతూ, “జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు. పేదరికం, కుల మత వివక్ష. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కానీ, బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్ర్యాన్ని, కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తి కట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపైనే ద్వేషం,” అని తన జీవన సందేశాన్ని తెలిపారు.

సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి,సామాజిక ప్రయోజనం ఆశించి మాత్రమే ఆయన రచనలు చేశారు.భావ కవిత్వం పేరుతో ప్రబలిన భావదారిద్ర్యం,అస్పష్ట భావచాలనం,అంధానుకరణ,ప్రేయసీ సమారాధన వంటి అంశాలు ఆయనకు నచ్చలేదు. ముఖ్యంగా ప్రేయసీ సమారాధనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారనే చెప్పవచ్చు. “దుష్కవీశ్వరులమ్మాయిలకై రచింతురు తమాషా గేయ విజ్ఞప్తులన్” అనేశారంటేనే ఆ తరహా రచనలపై ఆయనకున్న విముఖత మనకు అవగతమవుతుంది.

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు.

1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. తనకు ఎదురైన అవమానాల కారణంగా…. జాషువా వ్యధిత హృదయం నుండి కవిత్వం పెల్లుబికింది. కానీ భావ ప్రకటనకు అవసరమయిన భాష లేదు. భాషా జ్ఞానం కోసం పురాణేతిహాసాలను చదువ సాగారు. దానితో క్రైస్తవులు ఉగ్రులయ్యారు. మాదిగ కులస్థుడు అయి ఉండి శాస్త్రాలు చదవడమా? అంటూ హిందువులు ప్రశ్నించారు. జాషువా కవిత్వంలో హిందూమతాన్ని ప్రచారం చేసే అంశాలు ఉండడంతో క్రైస్తవ బోధకులు జాషువా చేస్తున్న టీచరు ఉద్యోగం నుండి ఆయనను డిసిమిస్ చేశారు.

ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేశారు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఆయన పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేశారు.

తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశారు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు.

ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివారు. తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చుతునక మాత్రమే. అంటరానివాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండి, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను ద్వేషించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి వెలివేశారు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది.

1934లో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి జమీందారును కలవడానికి రైలులో ప్రయాణిస్తున్నారు జాషువా. రైలులో జాషువాకు పరిచయమైన ఒక అగ్రకులోన్మాది జాషువా కవిత్వం విని ప్రశంసించాడు. ఆ తరువాత నీ కులం ఏమిటని అడిగి, తెలుసుకుని అవమానపరుస్తూ లేచి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో జాషువా హృదయంలో బాకుతో కుమ్మినట్లయింది. ఈ సంఘటనను కవిత్వంలో చెప్పారాయన.

నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపురే

ఖా కమనీయ వైఖరుల గాంచి భళీభళియన్నవారె, ‘నీ

దే కులమన్న’ ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో,

బాకున గ్రుమ్మినట్లగును, పార్థివచంద్ర! వచింప సిగ్గగున్!

ఆయన ఫిరదౌసి, గబ్బిలము, స్వప్నకథ, కాందిశీకుడు, ముంతాజ్ మహల్, నేతాజీ, స్వయంవరము ‘నాకథ’ వంటి రచనలు రచించారు. మీ జీవితంలో మరపురాని ఆనందకరమైన సంఘటన ఏమిటని ప్రశ్నిస్తే, “తిరుపతి వేంకట కవుల వంటి పెద్దలు స్వయంగా నాకు గండపెండేరం తొడిగి, ఏనుగుపైకెక్కించి, కనకాభిషేకం చేయడం” అని ఆయన ఆనందభాష్పాల మధ్య చెప్పేవారు.

గుఱ్ఱం జాషువా ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నారు. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ – నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధులయ్యారు. పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలను అందుకున్నారు.

ఆయన సాహితీరంగంలో అత్యున్నతస్థానాన్ని పొందారు. కానీ అంటరానివాడుగా అడుగడునా అవమానాలకు, వివక్షకు గురయ్యారు. అయినా హిందూసమాజం మీదగానీ, భారతావని పైనగానీ ఆయన అక్కసు పెంచుకోలేదు. సామాజిక వికృతులను చీల్చి చెండాడుతూ తన సాహిత్యం ద్వారా సామాజిక సమతా సందేశాన్ని, దేశభక్తిని ప్రదర్శించారు. ఆరోజుల్లో క్రైస్తవ మతప్రచారము, ఆంగ్లేయ ప్రభుత్వపాలన, వారి నాగరకతల పట్ల మోజు, సామ్యవాదపు ప్రభంజనం తీవ్రంగా ఉండినది. జాతీయవాదానికి ప్రమాదంగా ఉన్న కష్టకాలమది. ఆసమయంలో ఆయన కలంనుండి వెలువడ్డ సాహితీ ఆణిముత్యాలు కొన్ని…..

‘అనాథ’ అన్నకావ్యంలో ప్రమాదంపాలైన ఒక దళిత మహిళను ఒక అగ్రకుల సజ్జనుడు రక్షించి వైద్యశాలకు తీసుకువెడతాడు. తాను చేసిన పనికి ‘గంగాస్నానం చేసినంతగా సంతోషపడతాడు. కానీ అతని భార్యమాత్రం ‘మాల’ను ముట్టుకొన్న భర్తను తిట్టి, అతని పై నీళ్ళుపోసి స్నానం చేయిస్తుంది. భర్త మాత్రం అస్పృశ్యతను నిరాకరిస్తాడు. “నీ కోపం పోయిందా? బయటి స్నానం వల్ల ముక్తి వస్తుందా?” అని ఎదురు ప్రశ్న వేస్తాడు భర్త.

అలక శమించెనా? జలకమాడిన యంతనె? మాలదాని పి

ల్లల కడగండ్లు సూచి బహుళంబుగఁ దప్తమునందు నా మనో

జలజము మైలవడ్డదది స్నానము చేసెనె? వెఱ్ఱిదాన! ఈ

వెలుపలి శుద్ధి జీవులకుఁ బెట్టునె? పోయునె? ముక్తి నిచ్చునే”?

1928లో ‘భారతమాత’ అన్న శీర్షికన కవితలో భారతదేశ ప్రాచీనతను పేర్కొంటూ “ఉర్వి పుట్టక ముందె నీవుంటి వేమొ” అన్నారు. హిమాలయాన్ని భారతమాత తలమీది ‘బొండు మల్లెల దండ’ గాను, సింహళ ద్వీపాన్ని ఆ దేవి “పూత బంగారు సొమ్ముల పెట్టె” గానూ స్తుతించారు.

1926లో ‘శివాజీ ప్రబంధము’ అన్న చారిత్రక కావ్యంలో భారతమాతను ఎంతో రమ్యంగా స్తుతించారు!

సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పినట్టిసాధ్వి

కమలనాభుని వేణుగాన సుధాంబుధి మునిగి తేలిన పరిపూతదేహ

కాళిదాసాది సత్కవికుమారులగాంచి కీర్తినొందిన పెద్దగేస్తురాలు

బుధాది మునిజనంబుల తపంబున మోద బాష్పముల్ విడిచిన భక్తురాలు

సింధు గంగానదీ జల క్షీరమేపుడు కురిసి బిడ్డల పోషించుకొనుచునున్న

పచ్చి బాలెంతరాలు, మా భరత మాత, మాతలకు మాత, సకల సంపత్ సమేత”

అదే కావ్యంలో…. శివాజీని ఈ విధంగా స్తుతించాడు.

“శివరాజా ప్రతిభా విభాకర! శహజీ నందనా! దీనబాం

ధవ! హిందూ ధరణీ శుభంకర! మహాత్మా! సద్యశశ్చంద్రికా

ధవళీ భూత దిశావకాశ రిపు కాంతా సూత్ర విధ్వంసనో

త్సవ కేళీ పరతంత్ర! నీ కిదె నమస్కారంబు వీరాగ్రణీ”!

అంతేకాదు పాశ్చాత్యుల పాలన భారతీయులపాలిటి ఈశ్వరప్రసాదమని మురిసిపోయిన ఆంగ్లమానస భక్తుల – విదేశీ దాస్యప్రవృత్తిని కవికోకిల జాషువా నిర్మొహమాటంగా విమర్శించారు.

“ఆ కాలాన అమెరికా దొరల దాస్యంబు ఐహికాముష్మిక

శ్రీకిం చక్కని రాజమార్గమని హర్షీభూత చేతస్కులై

దూకుల్ బెట్టుచునుండు క్రైస్తవుల”…  ను అపహాస్యం చేశాడు.

వివేకానందుడు అమెరికా వెళ్ళి సాధించిన విజయంపట్ల జాషువా ఇలా హర్షం ప్రకటించారు…..

దొరసానమ్మలు బొమ్మలై కలికి ముద్దుం కన్నులం నిండుట

చ్చెరువున్ మక్కువ నింప, చక్కదనమున్ చిన్నారి లేబ్రాయమున్

మెరయన్, హైందవ వేదసారమును గంభీరోక్తులన్ నీపయిన్

కురియించెం కద! మానరేంద్ర ముని చంద్రుడు, ఓ చికాగోపురీ”

1962 చైనా భారత దేశంపై దాడి చేసిన సందర్భంగా “ ముసాఫరులు” అన్న కావ్యంలో మాతృ దేశ రక్షణ కోసం చైనాతో పోరాడి అమరుడైన జీవుడు ఊర్ధ్వముఖంగా సూర్యమండలం మీదకి వెడుతూ మార్గమధ్యంలో చంద్రమండలంపై ఆగి సేద తీర్చుకుంటున్నాడంటూ దేశభక్తులకు ‘ముక్తి’ లభిస్తుందంటూ దేశభక్తిని ప్రబోధించాడు.

“చైనీయ రుధిర నిర్ఝరుల స్నానము చేసి భరత సైనిక కోటి మరలు దాక,

కుటిల నీతిజ్ఞుల గురుకపాలములతో అభవుండు తాండవమాడు దాక

పగవాని క్రొవ్వుతో బసవశంకరమౌళి నిలయాన దివ్వెలు వెలుగుదాక

భారతీయుల భుజబల శౌర్యసంపత్తి పంచ ఖండములాక్రమించుదాక….

నిద్రపోవదు భారత భద్రకాళి”

అంటూ….త్యాగులైన భారత వీర సైనికులను స్తుతించాడు.

చివరిగా తన ప్రఖ్యాతమైన’గబ్బిలం’ లో గబ్బిలం ప్రయాణిస్తున్న మార్గాన్ని తంజావూరు నుండి ఎవరెస్టు శిఖరం వరకూ భారత భూమిని పరిచయం చేస్తాడు. జాషువా ‘గబ్బిలం’ ద్వారా శివునికి సందేశం పంపాడు. జాతీయ రహదారికి దూరంగా నున్నప్పటికీ గజ్జె కట్టి నాట్యంచేసే భీమేశ్వరుడు దళితులను ఉద్ధరిస్తాడన్న ఆశతో ద్రాక్షారామానికి వెళ్ళమని గబ్బిలాన్ని అర్థించాడు. ‘ముక్తి బిక్ష పొందడంకోసం’ వారణాశిలో అన్నపూర్ణచేతి – ఆహార బిక్షకు వారణాశికి వెళ్ళవలసిందిగా గబ్బిలాన్ని కోరాడు.

“అజ్జాయింతువొ చుట్టుమార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుం

డుజ్జీలేని దయాస్వభావుడు ప్రభావోల్లాసి ముప్పొద్దులన్

గజ్జం కట్టెడి నాట్యగాడతడు సాక్షాత్కారమున్ చెందినన్

మజ్జాత్యుద్ధరణంబు గల్గగలదమ్మా పొమ్ము సేవింపగన్”!

చివరకు గబ్బిలం హిమాలయాలమీద ఎగిరి కైలాసాన్ని చేరి ‘దళితసందేశాన్ని’ శివునికి వినిపిస్తుంది. అది విని శివుడు కన్నీరు కార్చాడట! పరమశివుని కరుణతో అంటరానితనం తొలగిపోయింది. దీనితో కావ్యం ముగుస్తుంది.

గబ్బిల మేమని చెప్పెనో గుబ్బలి యల్లుండు కన్నుగోనల నశ్రుల్

గుబ్బటిలి లేచి, నల్లని మబ్బులలో తక్షణంబ మాయంబయ్యెస్.

గబ్బిలం కవిత వ్రాసి 70 సం॥లయినా ఆనాటి వివక్ష ఇంకా తొలగిపోలేదు. కొనసాగుతున్న వివక్ష గురించి ‘సందేహ డోల’ కావ్యంలో జాషువాసృష్టికర్తనే నిలదీశాడు.

“సృష్టికర్తవు నీవు నీ సృష్టిలోని

మానవుడ నేను, ఇద్దరి మధ్య మనకు

ముసుగులో గ్రుద్దులాటలు పొసగవింక!

హక్కు కలదయ్య! ప్రశ్నసేయంగ నిన్ను”

నిజానికి కొనసాగుతున్న సామాజిక వివక్షకు మనలను మనమే ప్రశ్నించుకోవాలి.

1971 జూలై 24 న గుంటూరులో శ్రీ జాషువా తనువు చాలించారు. జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవీయ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది.

కుటుంబంలో ఎలాంటి సాహిత్య నేపథ్యము లేకపోయినా జీవితంలో ఎదురైన వెతల నుంచే కవితలు పొంగించిన సహజ కవి శ్రీ జాషువా. ఆయన కవిత్వం పాఠకులని మైమరపిస్తుంది. జాషువా గుండెల్లోని వ్యధ మనదిగా తోస్తుంది. వారి ఆవేదనతో మనమూ సహానుభూతి చెందేలా చేస్తుంది. శ్రీ జాషువా ప్రార్థనలాలకించైనా ఆ పరమేశ్వరుడు మన దేశంలో ఏనాటికైనా ఆ ‘కులవివక్ష’ రక్కసిని అంతం చెయ్యాలి. అందుకోసం మనమంతా త్రికరణ శుద్ధిగా కృషి చెయ్యాలి. భారతమాతకు జయమగుగాక.

– ఆ కవి కోకిల గుఱ్ఱం జాషువా జయంతి నేడు.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కవికోకిల గుఱ్ఱం జాషువా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక
ఈ రోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక సమాజంలో సమరసత నిర్మాణం కోసం కృషి చేస్తున్నదని శ్రీ రాము తెలిపారు. బోయి భీమన్న, గుర్రం జాషువా లు అట్టడుగు బలహీన సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ సమాజంలో సమరసత కోసం, దేశభక్తి నిర్మాణం కోసం అనేక రచనలు చేశారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి వెనుక బడిన వర్గాల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి. శివ నారాయణ గారు మాట్లాడుతూ గుర్రం జాషువా గారు తన రచనలతో సమాజానికి ఎనలేని ప్రేరణ కల్పించారన్నారు. మనం నిత్యం వింటుండే సత్య హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు వారు రచించినవేయని గుర్తు చేశారు.

స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధి శ్రీ బోయపాటి నాని మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగాలని, దానికి వీరి రచనలు ఎంతో దోహదం చేస్తాయని, ఈ విషయాన్ని సామాజిక సమరసతా వేదిక ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలోకి తీసుకొని రావడం చాలా ఆనందదాయకం అని కొనియాడారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ్ కార్యవాహ శ్రీ రావూరి రామారావు గారు మాట్లాడుతూ ఏ సమాజమైనా అభివృద్ధి చెందటానికి ఆ సమాజంలో సమరసత అనివార్యమని, కులాల మధ్య హెచ్చుతగ్గులు తొలగిపోయి ప్రజలందరూ ఒకే భరతమాత సంతానం అనే భావన పెంపొందించడానికి  బోయి భీమన్న, శ్రీ గుర్రం జాషువా వంటి కవులు విశేష ప్రయత్నం చేశారని వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు. సామాజిక సమరసతా వేదిక ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో చెప్పులు కుట్టే వృత్తి పని చేసుకునే ఇరువురు సోదరులు శ్రీ లక్ష్మణరావు శ్రీ శ్యామ్ లకు ఘనంగా సన్మానం చేశారు. సామాజిక సమరసతా వేదిక నిర్వహించిన కార్యక్రమం చూసిన సోదరులిద్దరూ మహదానంద భారితులయ్యారు. భవిష్యత్తులో సామాజిక సమరసతా వేదిక నిర్వహించే అన్ని కార్యకరమాలలో తామూ పాలుపంచుకుంటామని, భాగాస్వాములమవుతామని సోదరులిద్దరూ తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాషువా కవి జాతీయ కవితాస్ఫూర్తి
మంచిమాటలు, సత్సంకల్పములూ మరలమరల స్మరించుకోవాలి. ఈరోజు కళాప్రపూర్ణ గుఱ్ఱం జాషువా జన్మదినం.

ముసాఫరులు కావ్యంలో జాషువా చైనాయుద్ధాన్ని ప్రస్తావించారు. మాతృదేశరక్షణకోసం చైనాతో పోరాడి అమరుడైన జీవుడు ఊర్ధ్వముఖ ప్రస్థానక్రమంలో భాగంగా చంద్రమండలసమీపంలో సేదదీర్చుకొన్నట్టు జాషువా పేర్కొన్నారు. యుద్ధంలో మరణించిన వీరుడు సూర్య మండలాన్ని ఛేదించుకొని ఊర్ధ్వ లోకాలకు వెళ్ళి ముక్తుడౌతాడని భారతీయుల విశ్వాసం. చైనీయ రుధిర నిర్ఝరుల జలకమాడి భారతీయకరవాలము విజయం సాధించేవరకు జాతికి శాంతి లభించదని జాషువా భావించారు.

చైనీయ రుధిర నిర్ఝరుల స్నానముచేసి

భరత సైనిక కోటి మరలుదాక,

కుటిల నీతిజ్ఞుల గురుకపాలములతో

అభవుండు తాండవ మాడుదాక,

పగవాని క్రొవ్వుతో బసవశంకరమౌళి

నిలయాన దివ్వెలు వెలుగుదాక,

భారతీయుల భుజబల శౌర్యసంపత్తి

పంచఖండము లాక్లమించుదాక,

హైందవ మహోర్వి సరిహద్దు లాక్రమించి

కాలుమోపిన కుటిలముష్కరుని శిరము

మంచుమలమీద దృష్టికెత్తించుదాక

నిద్రపోవదు భారత భద్రకాళి!

ఒక ఏడాది క్రితంవరకు కవులు ఆతిశయోక్తులు బాగాచెప్తారు, వాటిల్లో ఇదొకటి అనుకున్నవారిలో మనం చాలా మందిమి ఉండి ఉంటాం. కానీ కవివాక్కు ఎంతబలమైనదో చూడండి. భారతీయ సైనికులతో తలపడడానికి భయపడుతూ చైనా సైనికులు హడిలిపోతున్న దృశ్యాలను ఇప్పుడు చూస్తున్నాం గదా?

భారతదేశాన్ని చూసి మనమందరమూ ఎలా గర్వించాలో, జాషువాగారు మనకు తెలియజెప్పిన ఒక పద్యం పరిశీలించుదాం.

బహుదేశములను పేర్వడసి మీసముదీటు

భరతఖండమ్ము నా పాఠశాల

స్తనయుగంబున గాన సాహిత్యములు గల్గు

భాషావధూటి నా పంతులమ్మ

సాందీపని సమక్షమందు విద్యగడించు

వనమాలి నా సహపాఠకుండు

భక్తివైరాగ్యభావనల తావలయైన

భాగవతమ్ము నా బాలశిక్ష

గంటము ధరించి మోహనాక్షరము లెనయ

ప్రతిఫలించెడి నా మహోన్నత విభూతి

వ్రాసికొందును దశదిశా ఫలకపంక్తి

గడన కెక్కిన ఆంధ్ర పుత్రుడను నేను.

జాషువా కవియొక్క దేశభక్తి ‘జాతీయాభిమానం, ఆంధ్రదేశాభిమానం, అస్పృశ్యతా నిరసన, ఆర్థికదోపిడీ ఖండన, పాలక నియంతృత్వంపై పోరాటం, అచ్చమైన దేశనాయక ప్రశంస’ అనే ఆరు సోపానాలను ఆశ్రయించింది…

ఆయన రచించిన ఖండికలలో పెక్కుచోట్ల ‘నాదు జాతి, నాదేశము, నాదు భాష’ అనే దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది.అఖండ గౌతమి, రచ్చగెలుపు, రాజ దర్శనం, తెలుగువెలుగు, తెలుగుగడ్డలు మున్నగు ఖండికలు స్వీయ రాష్ట్రాభిమానాన్ని చాటుతాయి. అన్నీ చివర జాతీయ భావనా స్రవంతిలో సంగ మిస్తాయి. ఈ ఔన్నత్యాలను చాటడానికి ఆయన మనస్సు ఎంతగా తపించిందో ఒకపద్యం చూడండి.

ఏనాడు మా కావ్యకర్తల జిహ్వ

విశ్వ సత్యము నాలపింపగలదొ

ఏనాడు మా జాతి దృష్టిమాంద్యము నాపి

చుట్టుప్రక్కల  తేరిచూడగలదొ

ఏనాడు మా బుఱ్ఱ లీ జుట్టు తల లేని

పుక్కిటి కథలలో చిక్కుపడవొ

ఏనాడు మా విద్య లినుప సంఘమునందు

చిలుము పట్టక ప్రకాశింపగలదొ

తనువు దాచక సోమరితనము వీడి

ఎన్నడీ మఠంబులు బిచ్చమెత్తుకొనవొ

అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలిచి

నలిగిపోవుచు నున్నది నా మనస్సు   (గబ్బిలము)

అనేక కారణాలవల్ల ఈ దేశంలోనికి విదేశీయులు చొరబడి స్థిరపడినారు. ఇక్కడి లక్షణా లేవీ వీరు ఒంటబట్టించు కొనలేదు. కాని వాళ్ల కట్టు, బొట్టు, జుట్టు వగైరాలు ఇక్కడివాళ్లు స్వీకరించారు. మంచి ఎక్కడున్నా స్వీకరించే మహనీయగుణానికి ఈ దేశీయులు ఎప్పుడూ సిద్ధమే. అట్టి సుహృద్వాతా వరణంలో బయటినుండి ఇక్కడికి వచ్చి కొందరు పాలలో నీళ్లలా కలిసిపోయారు. సంతోషమే! కాని మరికొందరేమో పాలను విరిచే ఉప్పులా తయారై నారు. విదేశీయమైన సులోచనాలు ఇక్కడ కొందరికి ఇష్టమౌతున్నాయి. వీరివల్ల సామాజిక విచ్ఛిత్తి ఏర్పడుతూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పాలను విరిచే ఉప్పును దూరంగా ఉంచవలసి వస్తోంది.

ఇప్పటికైనా మించింది లేదు. వీరంతా తమతమ అభిమతాల మేరకు దేనిని ఆహ్వానించినా, వారు ఏ గాలి పీలుస్తున్నారో, ఏమట్టినుండీ వచ్చిన నీరూ ఆహారం తీసుకొంటున్నారో, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి చిరకాల వ్యవస్థను విడనాడకుండా ఉండాలి. అప్పుడే జాషువా వంటి మహాకవులు కలలుగన్న జాతీయవికాసం ఏర్పడుతుంది. స్వాతంత్ర్య ఫలాలు ఈ దేశవాసులందరికీ అందుతాయి.

డా౹౹ ఆశావాది ప్రకాశరావు, శ్రీ హెబ్బార్ నాగేశ్వర రావు రచనల నుంచి….

సేకరణ :  డా౹౹ వడ్డి విజయసారథి

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాషువా కవి జాతీయ కవితాస్ఫూర్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాతో ఉద్రిక్తతల వేళ వైరల్ అవుతున్న జాషువా పద్యం
చైనా భారత్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనీయ “రుధిర నిర్ ఝరుల స్నానముచేసి…….” అంటూ జాతీయ విప్లవకవి,కవికోకిల గుఱ్ఱం జాషువా వ్రాసిన పద్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గుఱ్ఱం జాషువా రాసిన ఈ పద్యాన్ని తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆలపించారు.

చైనీయ రుధిర నిర్ ఝరుల స్నానముచేసి

భరత సైనిక కోటి మరలుదాక

కుటిలనీతిజ్ఞుల గురు కపాలములతో

అభవుండు తాండవమాడుదాక

పగవాని క్రొవ్వుతో బసవశంకరమౌళి

నిలయాన దివ్వెలు వెలుగుదాక,

భారతీయుల భుజబల సంపత్తి

పంచఖండము లాక్రమించుదాక

హైందవమహోర్వి సరిహద్దులాక్రమించి

కాలుమోపిన కుటిల ముష్కరునిశిరము

మంచుమలమీద దృష్టి కెత్తించుదాక

నిద్రపోవదు భారత భద్రకాళి

– జాతీయ విప్లవకవి,కవికోకిల గుఱ్ఱం జాషువా

https://vskandhra.org/wp-content/uploads/2020/06/video.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాతో ఉద్రిక్తతల వేళ వైరల్ అవుతున్న జాషువా పద్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.