Ghosh instrumental show – Vishwa Samvad Kendra Andhra Pradesh

మనసును ప్రశాంతంగా ఉంచే కళ సంగీతం
ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌

గ్వాలియర్‌: సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, మనసును ప్రశాంతంగా ఉంచే కళ అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మనసును సమస్థితిలోకి తీసుకువచ్చి, ప్రతి విషయంలోనూ సమానత్వం వహించి సమాజాన్ని అనుసంధానం చేసే లక్షణాలన్నీ భారతీయ సంగీతంలో ఉన్నాయన్నారు. భారతీయ సంగీతంలో ఒక నిర్దిష్టమైన స్వరం, క్రమశిక్షణ ఉంటుందని… దీనిని క్రమశిక్షణతో అభ్యసించాల్సివుంటుందని తెలిపారు. మనం దీన్ని అద్భుతంగా చేస్తే మనస్సు, బుద్ధి ప్రశాంతంగా ఉంటాయి, క్రమశిక్షణ పాటించకపోతే మనస్సు చెదిరిపోతుందన్నారు.

గ్వాలియర్‌లోని శివపురి లింక్‌ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్‌ కేదార్ధామ్‌ కాంప్లెక్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన(స్వర్‌ సాధక్‌ సంగం) గురువారం ప్రారంభమై ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడారు.

కళతో దేవుని దర్శించుకోవచ్చు

భారతీయ కళలు సత్యం, శివం, సుందరం దర్శనం ఇస్తాయని భగవత్‌ తెలిపారు. గ్రూప్‌ మ్యూజిక్‌లో ఎవరైనా తప్పు చేస్తే, అందరి ఆట పాడైపోతుందన్నారు. అందుకే మధ్యలో ఎవరైనా వాయిద్యాన్ని నోటిపై పెట్టుకోమని, వాయించకూడదని అంటారని… ఎందుకంటే ఒక్కో వాయిద్యానికి ఒక్కో స్థానం ఉంటుందన్నారు. కళాకారుడికి కళ ముఖ్యం. ఇది సమాజం ఉనికి నియమం కూడా. మనం సముద్రం బిందువులం… సముద్రం లేకుండా బిందువు ఉనికి అసంపూర్ణమైనది. అలాగే సమాజంలో అందరి సహజీవనం అవసరమని భగవత్‌ పేర్కొన్నారు. సంగీతం మనిషిని ఉన్నతం చేస్తుంది… మనం ధ్యానం చేస్తాం, ఆచరిస్తాం కూడా. కానీ, ఈ ప్రదర్శన కళాకారులను ఉన్నతి వైపు పయనింపజేస్తుందని తెలిపారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా సమాజం సంఫ్‌ు పనిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించాలని ఈ సందర్భంగా డాక్టర్‌ భగవత్‌ పిలుపునిచ్చారు.

కార్యక్రమాలు చూసి అంచనా వేయలేం..

సర్‌ సంఘ్‌చాల‌క్‌జీ మాట్లాడుతూ సంఘంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయని, వాటిని ఆధారంగా సంఘాన్ని ఊహించలేము… సంఘ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ కింద శారీరక కార్యకలాపాలు ఉన్నాయి… అయితే, సంఘ్‌ వ్యాయామశాల అని దీని అర్థం కాదు. ఇలాంటి వివిధ కార్యకలాపాలు సంఘ్‌ పనిలో ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ గొప్ప వ్యక్తులను తయారుచేసేవిగా ఉంటాయి… ఆ వ్యక్తినే సమాజం విశ్వసిస్తుంది. ఇది సంఘ్‌ ప్రధాన పని.

లోకమంతా సామరస్యంగా ఉండాలి

గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌ నుండి కమ్రూప్‌ వరకు, కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సామరస్య వాతావరణం ఉండాలని మేము నమ్ముతున్నామని డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. సమాజం బాగుపడితే దేశ భవితవ్యమే మారిపోతుంది.. మీరు మారాలనుకుంటే, నాణ్యత ద్వారా, ప్రవర్తన ద్వారా మార్పు జరగాలని మేము నమ్ముతున్నాము. మన దేశాన్ని మహోన్నతమైన కీర్తితో కూడిన దేశంగా మార్చేందుకు, మొత్తం సమాజం భాగస్వాములు కావాలి.. అదే సంఘ్‌ లక్ష్యం.

అందరి పూజలు, సాధన వేరువేరుగా ఉండవచ్చు. కానీ, ధర్మం అనేది ఒక వ్యక్తిని క్రమశిక్షణలోకి తీసుకువచ్చే ప్రయత్నమే… అందరి కర్తవ్యాన్ని నిర్వర్తించి, కోల్పోయిన సమతుల్యతను పునరుద్ధరించి, విశ్వాన్ని సమతుల్యం చేసేది ధర్మం. మన మతం పరాయి స్త్రీని తల్లిగా, చెల్లిగా పరిగణిస్తుంది. ఇతరుల మతాన్ని ఆక్రమించదు. ధర్మాన్ని ధర్మంలో ఉంచుకోవడం ఒక మతంగా పరిగణించబడుతుంది. ఈ మతాన్ని కాపాడుకుంటూ మన దేశాన్ని నిర్మించుకోవాలని భగవత్‌ అన్నారు.

సంఘ్‌ను పెంచడం అంటే సమాజంలో ప్రభావం సృష్టించడం కాదు, సంపూర్ణ సమాజాన్ని నిర్మించడం… సంఘ్‌లో అంచెలంచెలుగా చేరి మనస్ఫూర్తిగా కలుస్తారని, దేశానికి పెద్దపీట వేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే లయ లభిస్తుందన్నారు. అలా సంఘ్‌లో ఘోష్‌ మొదలైందన్నారు. గ్వాలియర్‌ సంగీత భూమి భగవత్‌ అన్నారు.

సంఘ్‌ అందరికీ కలుపుకొంటుంది…

దేశ భవితవ్యాన్ని మార్చడం అంత తేలికైన పని కాదని భగవత్‌ అన్నారు. సంఘ్‌ అందరినీ కలుపుతూ పనిచేస్తోందని, అవసరమైతే దేశం కోసం త్యాగాలకు సిద్ధమని అన్నారు. అలాంటి సమాజాన్ని సృష్టించడమే సంఘ్‌ ఉద్దేశమన్నారు.

వేదికపై క్షేత్ర సంఘచాలక్‌ అశోక్‌ సోహ్ని, ప్రాంత్‌ సంఘచాలక్‌ అశోక్‌ పాండే, విభాగ్‌ సంఘచాలక్‌ విజయ్‌ గుప్తా ఆసీనులుకాగా, ప్రముఖ సరోద్‌ వాద్యకారుడు అమ్జద్‌ అలీఖాన్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ అశోక్‌ సింగ్‌, జస్టిస్‌ ఆర్కే సక్సేనా, సంగీత విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ సాహితీ కుమార్‌ నహర్‌, సితార్‌ వాద్యకారుడు శ్రీరామ్‌ ఉడేకర్‌, నృత్యాచార్య ఈశ్వర్‌ చంద్ర కర్కరే, డాక్టర్‌ భగవందాస్‌ మాణిక్‌, అనితా తై కర్కరే, జయంత్‌ ఖోట్‌, పలువురు సంగీత విద్వాంసులు, ప్రముఖులు హాజరయ్యారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మనసును ప్రశాంతంగా ఉంచే కళ సంగీతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.