#GERMANY – Vishwa Samvad Kendra Andhra Pradesh

జర్మనీలో ఉగ్రవాద దాడికి ఇరాన్‌ తీవ్రవాదుల యత్నం.. తృటిలో తప్పిన ముప్పు!
జర్మనీలో భారీ ఉగ్రవాద దాడి తప్పింది. రసాయనాలతో దాడికి పాల్పడేందుకు సిద్ధపడిన ఇద్దరు వ్యక్తులను జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి అత్యంత ప్రమాదకరమైన 84 మిల్లీగ్రాముల రిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న ఇద్దరూ ఇరాన్ కు చెందిన సోదరులే. వీరు ఇస్లామిక్‌ మత ఛాందసవాదులుగా గుర్తింపుపొందారు. వీరిని జర్మనీలో ఎంజే, జేజే అని పిలుస్తుంటారు. వీరిద్దరూ ఐఎస్‌ మద్దతుదారులుగా అధికారులు గుర్తించారు. వీరి కుట్రను అమెరికా ఎఫ్‌బీఐ పసిగట్టి జర్మనీకి సమాచారం చేరవేయడంతో కుట్ర బట్టబయలైంది.

ప్రమాదకరమైన జీవ ఆయుధాలతో దాడి చేయబోతున్నారని అందిన పక్కా సమాచారం మేరకు జర్మనీ పోలీసులు ఆపరేషన్‌ చేపట్టారు. నార్త్‌ రైన్‌-వెస్ట్‌ఫాలియా ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని ఇద్దరు ఇరాన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో జర్మనీలో బారీ ఉగ్రవాద దాడి తప్పినట్లయిందని అధికారులు భావిస్తున్నారు. నిందితుల నుంచి సైనైడ్‌, రిసిన్‌ వంటి రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి వీరిద్దరూ చాలా మందిని చంపాలనుకున్నారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

వీరిని అరెస్టు చేసిన తర్వాత రసాయనాల ప్రభావం లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజానికి రిసిన్‌ అనేది ఎండు ద్రాక్ష గింజల నుంచి తయారవుతుంది. ఇది ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన నిమిషాల్లోనే చంపేయగలదు. ఇది సైనైడ్‌ కంటే 6000 రెట్లు ప్రమాదకరమని అధికారులు చెప్పారు.

ఉగ్రవాద దాడికి సంబంధించిన సమాచారాన్ని చాటింగ్‌ ద్వారా చేరవేసుకుంటుండగా అమెరికా ఎఫ్‌బీఐ పసిగట్టింది. ఇద్దరు వ్యక్తులు రసాయనాలతో బాంబుల తయారీ గురించి టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుకున్న విషయాన్ని సేకరించింది. అనంతరం సమాచారాన్ని జర్మనీ భద్రతా దళాలకు అందించింది.

విషపూరిత బాంబులను తయారు చేయడానికి ఇంటర్నెట్ నుంచి వీరు అనేక రకాల ప్రాణాంతక రసాయనాలను ఆర్డర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా, భారీ ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన వీరికి 3-15 సంవత్సరాల జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నదని జర్మనీ హోం మంత్రి నాన్సీ ఫాజర్ తెలిపారు.

The post జర్మనీలో ఉగ్రవాద దాడికి ఇరాన్‌ తీవ్రవాదుల యత్నం.. తృటిలో తప్పిన ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జి 7 దేశాధినేతలకు బహుమతులుగా భారతీయ కళా నైపుణ్యాలు
జర్మనీ: ఏడు దేశాల కూటమి సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్ళిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కళా నైపుణ్యాన్ని విదేశీయులకు చాటి చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ, దక్షిణాఫ్రికా దేశాధినేతలకు ఉత్తర ప్రదేశ్‌ కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇచ్చారు.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ప్లాటినమ్ జూబిలీ జరుపుకొన్న నేపథ్యంలో ఆ సందర్భానికి తగినట్టుగా ఓ బహుమతిని తీర్చిదిద్దడం మరో విశేషం. ఉత్తర ప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పథకంలో ఈ బహుమతులను తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కళాకారుల పనితనానికి గుర్తింపు లభించే విధంగా ఈ బహుమతులను తీర్చిదిద్దారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో తయారైన గులాబీ మీనాకరి బ్రోచ్‌ను బహూకరించారు. దీనిని స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీని మీద అత్యంత ఆకర్షణీయమైన నగిషీ చెక్కారు. ఇది జిఐ ట్యాగ్ గల కళాకృతి. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ కోసం రూపొందించిన బ్రోచ్‌కు మ్యాచ్ అయ్యే విధంగా జో బైడెన్ కఫ్‌లింక్స్‌ను తయారు చేయడం విశేషం.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో తయారైన క్యారియర్ బాక్స్‌ను, ఖాదీ పట్టు వస్త్రంపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జరీ జర్దోసీ బాక్స్‌ను, ఫ్రెంచ్ జాతీయ జెండాలో ఉండే మూడు రంగులతో శాటిన్ టిష్యూను బహుమతిగా ఇచ్చారు.

ఈ జెండా ఫ్రెంచ్ విప్లవం నాటిది కావడం గమనార్హం. ఈ పెట్టెలో అత్తర్ మిట్టి, జాస్మిన్ ఆయిల్, అత్తర్ షమమ, అత్తర్ గులాబ్, ఎక్సోటిక్ మస్క్, గరం మసాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం అత్తర్ మిట్టి.

బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు ప్లాటినం పెయింటెడ్ హస్తకళాకృతి టీ-సెట్‌ను బహూకరించారు. దీనిని ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తయారు చేశారు. క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబిలీ ఉత్సవాలను గుర్తు చేస్తూ, ఆమె గౌరవార్థం ఈ టీ-సెట్‌కు ప్లాటినం పెయింట్ వేశారు.

జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్‌కు నికెల్ కోటింగ్‌తో కూడిన కంచు బిందెలను బహూకరించారు. వీటిని ఉత్తర ప్రదేశ్‌లో కంచు నగరంగా ప్రసిద్ధి చెందిన మొరాదాబాద్ జిల్లాలో తయారు చేశారు.

జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదకు ఉత్తర ప్రదేశ్‌లోని నిజామాబాద్‌లో తయారు చేసిన పాత్రలను బహూకరించారు. వీటిని నల్ల మట్టితో తయారు చేశారు. నల్ల రంగును ప్రకాశవంతంగా తీర్చిదిద్దడం కోసం ప్రత్యేకమైన చిట్కాలను ఉపయోగించారు. ఓవెన్‌లోకి ఎట్టి పరిస్థితిలోనూ ఆక్సిజన్ ప్రవేశించడానికి వీల్లేకుండా తీర్చిదిద్దారు. ఈ కుండలు ఈ ఓవెన్‌ లోపల ఉన్నంత సేపూ వేడి స్థాయి అత్యధికంగా ఉంటుంది.

కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడుకు కశ్మీరులో తయారైన పట్టు తివాచీని బహూకరించారు. ఇది చేతితో అల్లిన తివాచీ. ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రఘికి మార్బుల్ ఇన్‌లే టేబుల్ టాప్‌ను బహూకరించారు. ఇది ఇటాలియన్ మార్బుల్ ఇన్‌లే వర్క్‌తో పోటీ పడుతూ ఉంటుంది. సెనెగల్ ప్రెసిడెంట్‌ మాకీ సాల్‌కు మూంజ్ బాస్కెట్స్, కాటన్ డరీస్‌ను బహుమతిగా ఇచ్చారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా‌కు డోక్రా ఆర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిని రామాయణం ఇతివృత్తంతో ఛత్తీస్‌గఢ్‌లో తయారు చేశారు. ఈ నాన్-ఫెర్రస్ మెటల్ కాస్టింగ్ ఆర్ట్‌ను భారత దేశంలో దాదాపు 4,000 ఏళ్ళ క్రితం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు లకీర్‌వేర్ రామ్ దర్బార్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిని వారణాసిలో తయారు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జి 7 దేశాధినేతలకు బహుమతులుగా భారతీయ కళా నైపుణ్యాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ
జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తాము సాగిస్తున్న ప్రయత్నాలకు ధనిక దేశాల కూటమి అయిన జీ7 తోడ్పాటు అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. భారత్‌లో పర్యావరణహిత పరిజ్ఞానాలకున్న భారీ గిరాకీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరుగుతోంది. ఈ భేటీకి భారత్‌, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న మోదీ.. సోమవారం ఎల్‌మావ్‌లో తీరికలేకుండా గడిపారు. ‘వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు.

పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. “పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో ‘నెట్‌ జీరో’ స్థాయిని సాధిస్తుంది. భారత్‌ వంటి పెద్ద దేశం ఇలాంటి లక్ష్యాలను సాధించడం.. ఇతర వర్ధమాన దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పర్యావరణహిత పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, తయారీలో జీ7 దేశాలు పెట్టుబడులు పెట్టాల‌ని కోరారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా సాగిన జి7 శిఖరాగ్ర సదస్సు
జ‌ర్మ‌నీ: అప్పులిచ్చి చిన్న దేశాలను గుప్పిట పడుతున్న చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు జర్మనీలోని బవేరియన్‌ ఆల్ప్స్‌లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు పాలుపంచుకుంటున్నారు.

చైనా ప్రభావాన్ని అడ్డుకొనేందుకు ఉద్దేశించిన గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్‌ పార్ట్‌నర్‌షిప్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 7 దేశాలు కలిసి 2027 నాటికి 600 బిలియన్‌ డాలర్లు (రూ.46.95 లక్షల కోట్లు) సమీకరిస్తాయి. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ నిధులను ఖర్చు చేస్తాయి. చైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట చిన్నదేశాలకు అప్పులిచ్చి, లాభపడుతున్న సంగతి తెలిసిందే. చైనాకు కౌంటర్‌గానే 600 బిలియన్‌ డాలర్ల నిధిని జి–7 దేశాలు తెరపైకి తీసుకొచ్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా సాగిన జి7 శిఖరాగ్ర సదస్సు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జర్మనీలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
మ్యునిక్​: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. మ్యునిక్​లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేడు, రేపు జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ సహా అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా తదితర ప్రజాస్వామ్య దేశాలను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న జర్మనీ ఆహ్వానించిందని శనివారం ఓ ప్రకటనలో మోదీ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జర్మనీలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

26, 27 తేదీల్లో జర్మనీ, అబుదాబిల్లో ప్ర‌ధాని మోది ప‌ర్య‌ట‌న‌
న్యూఢిల్లీ: జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్స్ ఆహ్మానం మేరకు జి7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 26, 27 తేదీలలో దక్షిణ జర్మనీలోని షోల్స్ ఎల్మావ్‌కు చెందిన ఆల్పైన్ కాజిల్‌ని సందర్శించనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో పరిస్థితితో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను జి7 సదస్సు చర్చించనున్నది. ఈ పర్యటన అనంతరం..ఇటీవల కన్నుమూసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు సంతాపం తెలియచేసేందుకు జూన్ 28న ప్రధాని మోడీ అబు దాబిని సందర్శించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 26, 27 తేదీల్లో జర్మనీ, అబుదాబిల్లో ప్ర‌ధాని మోది ప‌ర్య‌ట‌న‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెర్లిన్‌లో మోడీకి ప్రవాస భారతీయుల ఘ‌న స్వాగ‌తం
న్యూఢిల్లీ: మూడు రోజుల విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయల్దేరారు. బెర్లిన్ చేరుకున్న మోడీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ తో కలిసి 6వ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ లో పాల్గొననున్నారు. రేపు ఉన్నతస్థాయి చర్చలు జరిపేందుకు డెన్మార్క్ వెళ్ళ‌నున్నారు.

#WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany

(Source:DD) pic.twitter.com/H0yX5LWut4

— ANI (@ANI) May 2, 2022

మూడు రోజుల్లో 25 కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని, ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరుపుతారు. 50 గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ఇంటరాక్ట్ కానున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతోనూ మోడీ మాట్లాడనున్నారు.

Source: V6 Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెర్లిన్‌లో మోడీకి ప్రవాస భారతీయుల ఘ‌న స్వాగ‌తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ
న్యూఢిల్లీ: భారత్‌ శాంతి, శ్రేయస్సుకు ఐరోపా భాగస్వాముల సహకారం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని.. ఈ రోజు నుంచి జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాలు సందర్శించనున్నారు.

ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఐరోపా ప్రస్తుతం వివిధ సవాళ్లు, ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటోందని.. ఈ కీలక సమయంలో తాను ఈ ప్రాంతంలో పర్యటించనున్నానని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ శాంతి, శ్రేయస్సు పథంలో ఐరోపా భాగస్వామ్యం చాలా కీలకమన్న ప్రధాని.. సహకార స్ఫూర్తితో ఈ ప్రాంతంలోని సహచరులతో తమ బంధాన్ని పటిష్ఠం చేసుకుంటామని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఐరోపా దేశాలు రష్యా వ్యతిరేకంగా సంఘటితమైన సంగతి తెలిసిందే. దీంతో పలు ఐరోపా దేశాలు ఇంధన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మోదీ పర్యటనలో ఈ సమస్యకే అధిక ప్రాధాన్యత ఉంటుందని భారత విదేశాంగ వర్గాలు పేర్కొన్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం: మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా
* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు

చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కరోనా ముప్పు తీవ్రమయ్యే ప్రమాదమున్నదని చైనాలోని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగు తూండటంతో చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూండటంతో చైనాలోని అనేక ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ విధించింది. ప్రస్తుతం చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్. దానిని బీఏ-2గాను, స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్గానూ పిలుస్తున్నారు.

ఈ వైరస్ వల్ల ప్రాణహాని తక్కువే అయినప్పటికీ అతివేగంగా విస్తరిస్తోంది. లక్షణాలు బయటకు కన్పించకపోవడం దీని ప్రధాన లక్షణం. పరీక్షిస్తే తప్ప కరోనా రోగి ఎవరన్నది తేలడంలేదు. అమెరికాలో సైతం ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా ఉధృతమైంది. ఆ తర్వాత నెమ్మదిగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పెరుగుతున్నట్లుగా సమాచారం. ముందు ముందు కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చునని అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్విజర్లాండ్, ఆస్ట్రేలియాలలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇక జర్మనీలోనూ గడచిన వారం రోజుల్లో 42000 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.