featured – Vishwa Samvad Kendra Andhra Pradesh

సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా గుండె గుండెలో వెల్లివిరుస్తున్న ధార్మిక చైతన్యం. .
సమరసత సంకల్పం – ధార్మిక సాధికారత

కృష్ణా జిల్లా నందిగామ డి వి ఆర్ గిరిజన కాలనీలో శ్రీ సీతారామ  దేవాలయంలో గత ఫిబ్రవరి నుండి శివకృష్ణ అర్చకులుగా పనిచేస్తున్నారు. గిరిజన కాలనీలో కొత్తగా కట్టిన శ్రీ సీతారామ దేవాలయంలో నిత్య పూజా కైంకర్యాలను శ్రద్దాభక్తులతో శివకృష్ణ చేయటం చూసి సాటి గిరిజనులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమలో ఒకరు మంత్రాలు చదువుతూ దీపారాధన, సంకల్పం, గణపతి పూజ, ప్రధాన పూజల తోపాటుగా సీతారామ స్వాములకు నివేదన చేసి, రాత్రికి పవళింపు సేవ చేయటం చూసి ఎంతో గర్వపడుతున్నారు. “ భగవంతుని సేవించటం నాకు ఎంతో ఆనందంగా వుంది. ఒక సామాన్య యానాది కుటుంబంలో పుట్టిన నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శిక్షణ ఇచ్చి అర్చకుడిగా నియమించారు” అని శివకృష్ణ చెప్పుకొచ్చారు. “ మా పరిసర ప్రాంతాలలో హిందూ ధర్మ వ్యాప్తికి ఇతోధికంగా కృషి చేస్తాను. మతాంతరీకరణను అడ్డుకుంటాను” అని ఆయన అన్నారు.

శివకృష్ణ ఒక్కరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కట్టిన దేవాలయాల్లో అర్చకులుగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదు వందల మంది పని చేస్తూ ఒక నిశ్శబ్ద ధార్మిక విప్లవాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో హరిజన, గిరిజన బస్తీలలో, కొండ ప్రాంతాలలో వారు పని చేస్తూ ధార్మిక చైతన్యానికి కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, దేవాదాయ శాఖ, హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్, సామాజిక సమరసతా ఫౌండేషన్ వారి సంయుక్త, సమైక్య కృషి ఫలితమే ఈ ధార్మిక సంస్కరణ. శతాబ్దాల పాటు సంఘానికి దూరంగా ఉంచబడ్డ వారే ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే నాయకత్వ బాధ్యతను తలకెత్తుకున్నారు.

సమరసతకు శ్రీకారం :

2015లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారు ధర్మ పరిరక్షణకు, పరివ్యాప్తికి పని చేస్తున్న సంస్థల పని తీరును సమీక్షించారు. అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలు అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా, సమన్వయంతో పని చేయగలిగిన ఒక సంస్థ ఆవశ్యకతను వారు గుర్తించారు. స్వర్గీయ పి.వి.ఆర్.కే. ప్రసాద్ గారు, తదితర పెద్దల ఆశయాలకు అనుగుణంగానే సమరసతా సేవా ఫౌండేషన్ ఆవిర్భవించింది. క్షేత్ర స్థాయిలో ధర్మ ప్రచారం చెయ్యటం, స్థానికులను ధర్మ పరిరక్షణలో భాగస్వాములను చెయ్యటం, దేవాలయాలు కేంద్రంగా నూతన ధార్మిక చైతన్యాన్ని తీసుకొని రావటం కోసం సమరసతా సేవా ఫౌండేషన్ ను ప్రారంభించారు. డిసెంబర్ 2, 2015న తిరుపతిలో శ్రీవారి ఆస్థాన మండపంలో జరిగిన ధార్మిక సమ్మేళనంలో కంచి, పెజావర్ పీఠాధిపతులతోపాటుగా ఇతర మఠాలకు చెందిన 60 మంది మఠాధిపతులు కొత్త సంస్థను దీవించారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల హిందువులను అక్కున చేర్చుకోవటం, వారి ధార్మిక అవసరాలను తీర్చటమే లక్ష్యంగా పని చేయమని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి హిందూ కుటుంబాన్ని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చెయ్యమని దిశా నిర్దేశం చేశారు.

హిందూ ధార్మిక చైతన్య వ్యాప్తి అనే పవిత్ర యజ్ఞంలో సముచిత రీతిలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేయటమే లక్ష్యంగా సంస్థ ఆనాటి నుండి రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నది. హిందూ ధర్మ వ్యాప్తికి, దాని పరిరక్షణకు మాత్రమే అంకితమైన సమరసతా సేవా ఫౌండేషన్ కు రాష్ట్ర స్థాయిలో అంకితభావంతో పనిచేసే కార్య నిర్వాహక వర్గం వుంది. కేరళ ప్రభుత్వ రాష్ట్ర రెవిన్యూ కార్యదర్శిగా పని చేసి, పదవీ విరమణ చేసి, ఇటీవలే స్వర్గస్థులైన శ్రీ ఎం. జీ. కే మూర్తి గారు అధ్యక్షులుగా సమర్ధవంతమైన సేవలు అందించారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకు 13 మంది జిల్లా ధర్మ ప్రచారకులు వున్నారు. డివిజనల్ స్థాయిలో విభాగ్ ధర్మ ప్రచారకులు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని 676 మండలాలకు గాను, 325 మండలాలలో సమరసతా సేవా ఫౌండేషన్ పని చేస్తున్నది. పని చేస్తున్న ఈ 325 మండలాలలో ప్రతి మండలానికి ఒక ధర్మ ప్రచారకుడు ధర్మ ప్రచార నిమిత్తం చిత్తశుద్దితో పనిచేస్తున్నారు. 325 మండలాలలో 45 మండలాలు సుదూర గిరజన ప్రాంతాలలో వున్నాయి. రాష్ట్రంలోని ప్రసిద్ది చెందిన పీఠాదిపతులు, మఠాధిపతులు, ధర్మ ప్రచారకులకు శిక్షణ ఇచ్చారు. ధర్మాచార్యులందరూ ఏకోన్ముఖులై ప్రచారకులకు ఇచ్చిన శిక్షణ అనితర సాధ్యం. మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి వారి సహకారంతో ధర్మ ప్రచార కమిటీలు ఏర్పాటు చేయటం ధర్మ ప్రచారకుల విధి.

ధర్మ ప్రచారం :

రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సర్వేక్షణ చేసి ధార్మిక అవసరాలను గుర్తించారు. గత మూడేళ్ళలో 39,44,403 కుటుంబాలకు ధర్మ సందేశాన్ని చేర్చారు. 42 లక్షల కరపత్రాలను పంచారు. మన ధర్మం విశిష్టత గురించి, జీవన విధానం గురించి ప్రచురించిన ఈ కరపత్రాలు బహుళ ప్రజాదరణ పొందాయి. గీతా జయంతి సందర్భంగా బాలబాలికలకు నిర్వహించిన భగవద్గీతా కంఠస్థ పోటీలలో 2016లో 47,723 మంది పాల్గొనగా, 2017 లో 52,539 మంది పాల్గొన్నారు. కలియుగంలో భగవన్నామ స్మరణకు ఎంతో ప్రాధాన్యత వుంది. భజన బృందాలకు శిక్షణ ఇచ్చి భజన సాంప్రదాయాన్ని పునరుద్ధరించటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 3వేల భజన బృందాలకు శిక్షణ ఇవ్వటం జరిగింది. సేవా ఫౌండేషన్ పని చేస్తున్న గ్రామాలలో నెలకు ఒకసారి గ్రామస్థులందరూ హాజరయ్యే విధంగా సామూహిక హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. 2032 దేవాలయాల్లో షుమారు 40వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద హిందువుల సౌకర్యార్ధం దేవాదాయ శాఖ చేపట్టిన పుణ్యక్షేత్రాల ఉచిత సందర్శన కార్యక్రమం “దివ్యదర్శనం” కు అర్హులైన బడుగు, బలహీన వర్గాల వారిని ఎంపిక చేసేందుకు దేవాదాయ శాఖకు సమరసతా ఫౌండేషన్ సహకరిస్తుంది. యువజన సమ్మేళనాల ద్వారా గ్రామీణ యువతను సమీకరించి, ధార్మిక చైతన్యం రగిలించడానికి జరుగుతున్న కృషిలో భాగంగా 2018లో 2754 గ్రామాల నుండి ఇరవై వేల మందితో కార్యక్రమాలు నిర్వహించారు.

దేవాలయాల నిర్మాణం :

తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ కులాల, తెగల వారి ఆవాస ప్రాంతాలలో, మత్స్యకార గ్రామాలలో దేవాలయాల నిర్మాణం చేస్తున్నది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం 500 దేవాలయాల నిర్మాణానికి అనుమతినిచ్చింది. దేవాలయాలను ఎక్కడ కట్టాలో నిర్ణయించే బాధ్యతను సమరసతా సేవా ఫౌండేషన్ కు ఇచ్చారు. దళారులు, గుత్తేదారులు లేకుండా స్థానికుల భాగస్వామ్యంతో ఈ దేవాలయాలను దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, హిందూ పరిరక్షణ సంస్థల వారి మార్గదర్శకత్వంలో సమరసతా సేవా ఫౌండేషన్ కార్యకర్తలు నిర్మిస్తున్నారు. రెండున్నర ఏళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా 500 దేవాలయాలను హరిజన, గిరిజన ఆవాస ప్రాంతాలలో, మత్స్యకార గ్రామాలలో నిర్మించారు. ప్రజలు సైతం ఈ దేవాలయాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. షుమారు 25 కోట్ల మేర ధనం విరాళంగా సమకూర్చారు. హిందూ సోదరులు నిర్మాణం చేసుకుంటున్న ఈ దేవాలయాలకు కొందరు క్రైస్తవులు కూడా విరాళాలు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. ఈ దేవాలయాలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన హిందువులకు ధార్మిక కేంద్రాలుగా తయారు అవుతున్నాయి.

ఈ దేవాలయాల్లో అర్చకులుగా పని చేయటానికి ధార్మిక ఆసక్తి, అర్హత కలిగిన స్థానికులనే ఎంపిక చేశారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అర్చకత్వంలో శిక్షణ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 500 మంది నేడు ఈ దేవాలయాల్లో సుశిక్షితులై, అర్చకులుగా పని చేస్తూ భగవదారాధన చేస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అర్చకులుగా సేవలు అందిస్తూ, మిగిలిన సమయంలో తమ వృత్తులు చేసుకుంటూ ఆదర్శంగా వారు జీవిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో పని చేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన అర్చకులను తన కార్యాలయానికి పిలిపించారు. వారి శ్రద్దా భక్తులకు అచ్చెరువు చెందారు. ఒక సారి శిక్షణ ఇచ్చి వదిలెయ్యటం కాక, తిరుమల దేవస్థానం కొత్తగా నియమించిన అర్చకులకు ఏడాదికి రెండు మార్లు పునశ్చరణ తరగతులను కూడా నిర్వహిస్తోంది. అట్లాగే దేవాలయ కార్యనిర్వాహక సభ్యులకు ఆలయ నిర్వహణలో మార్గదర్శనం చేస్తున్నది.

అన్య మత ప్రచారకుల వ్యతిరేకత :

హిందువులను మేలుకొలిపి, చేసిన తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకునే మహత్తర సంకల్పాన్నిసమరసతా సేవా కార్యకర్తలు చేశారు. సమరసతా సేవా కార్యకర్తలు మారుమూల కుగ్రామాలకు సైతం వెళ్ళగలిగారు. ఎక్కడెక్కడైతే బలహీన వర్గాల వారుంటున్నారో అక్కడకు వెళుతున్నారు. వారిని అక్కున చేర్చుకుంటున్నారు. సామాన్యులు వారికి స్వాగతం పలుకుతుండగా, క్రైస్తవ మత ప్రచారకులకు వారి రాక ఇష్టం లేదు. స్థానికుల భాగస్వామ్యంతో ఈ మత ప్రచారకుల అభ్యంతరాలను అధిగమించి స్థానిక ప్రజలతో కలిసి సమరసత కార్యకర్తలు పనిచేస్తున్నారు.

అయితే కొన్నిచోట్ల క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ ప్రచారకుల  నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. కర్నూలు జిల్లా, పాండ్యం మండలం, భూపాలపాడు గ్రామంలో 37 మాదిగ కుటుంబాల వారు తమ ఆవాస ప్రాంతంలో ఒక దేవాలయం కట్టమని కోరారు. ఆ గ్రామ సర్పంచ్ దేవాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించారు. కానీ అదే కాలనీలో ఉంటున్న క్రైస్తవులు కొందరు దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకొనడమే కాక హిందూ సోదరులపై భౌతికంగా దాడి చేశారు. ఆ చిన్న గ్రామంలో అనుమతి లేని 3 క్రైస్తవ ప్రార్ధనా మందిరాలున్నాయి. అధికారులు ఈ సమస్య పరిష్కారానికి గ్రామ సభను ఏర్పాటు చేయగా 85 శాతం మంది ఆలయ నిర్మాణానికి అనుకూలంగా చేతులెత్తారు. దానితో నిర్మాణానికి ఉన్న ప్రతిబంధకం తొలగి పోగా, నిర్మాణం జరిగింది. జిల్లా అధికారులు ఆలయ నిర్మాణం కావాలనుకొన్న వారికి మద్దతుగా నిలబడగా, స్థానిక రాజకీయ నేతలు క్రైస్తవులకు మద్దతుగా నిలవటం అందరికి ఆశ్చర్యం కల్గించింది. అట్లాగే రాజమండ్రి, కాకినాడ మద్య ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుధరించటానికి జరిగిన ప్రయత్నాలను కూడా క్రైస్తవ మత ప్రచారకులు అడ్డుకున్నారు. తమ విశ్వాసకులు తమకు దూరం అవుతరేమోనన్న భయంతో  దేవాలయ పునరుద్ధరణను అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల దేవాలయాల నిర్మాణాన్ని ఎదో ఒక సాకుతో అడ్డుకునే ప్రయత్నం క్రైస్తవ ప్రచారకులు చేశారు. కొన్ని చోట్ల అధికారులు, మరికొన్ని చోట్ల నేతలు వారికి బాసటగా నిలవటం శోచనీయం. అయినా ఈ ప్రతిబంధకాలను అధిగమించి నిర్మాణం దిశగా సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

వెల్లివిరుస్తున్న ధార్మిక చైతన్యం :

సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న హిందువులు ధర్మాచార్యుల రాకకోసం ఎన్నో సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నారు. సామాన్య ప్రజల ఆధ్యాత్మిక తృష్ణ తీర్చటం కోసం హైందవ సంస్థలు, ఆచార్యులు ఇన్నాళ్ళుగా తగినంతగా ముందుకు రాలేదు. ఆ ఖాళీని క్రైస్తవమత ప్రచారకులు వారికి అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ధర్మంపట్ల, దైవంపట్ల, తరతరాల వారసత్వం పట్ల సామాన్య ప్రజలకు కూడా ఎనలేని ఆసక్తి వుంది. కాని చెప్పేవారు కరువై, చేస్తున్న క్రైస్తవమత ప్రచారానికి ఆకర్షితులై మతం మార్చుకుంటున్న మన సోదరుల దగ్గరకు ఇప్పుడు సమరసత కార్యకర్తలు వెళ్తున్నారు. వారి మత, ఆధ్యాత్మిక తృష్ణను తీర్చటానికి కృషి చేస్తున్నారు. సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా హైందవ ధార్మిక చైతన్యాన్ని తీసుకునిరాగలిగారు. కోటి మందికి పైగా హిందువుల వద్దకు వెళ్ళగలిగారు. సనాతనధర్మం విశిష్టత గురించి, మతాంతరీకరణ ప్రమాదాల గురించి వివరించి వారిలో ఒక ధార్మిక స్పృహను కలిగించగలిగారు. సమరసత కార్యకర్తల కృషి ఫలితంగా గ్రామీణులలో ఒక నూతన ఆసక్తి మొదలయింది. తమ హిందూ మూలాల గురించి యోచన మొదలైంది. కులాతీతంగా హిందూ విశ్వాసాల పునరుద్ధరణకు ధర్మ ప్రచారకులు చేసిన కృషి అనతికాలంలోనే ఫలితాలు ఇచ్చింది.

ధార్మిక సాధికారత :

సమరసత సేవా ఫౌండేషన్ వారు హైందవ సాధికారతకు ద్వారాలు తెరిచారు. బడుగు, బలహీన వర్గాల వారికి శిక్షణ ఇచ్చి అర్చకులుగా, పూజారులుగా తీర్చిదిద్దుతున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ధార్మిక అవసరాలను గుర్తించి, అ అవసరాలను తీర్చటానికి ధర్మ ప్రచారకులు పనిచేస్తున్నారు. ధర్మంపట్ల, దేవాలయాల పట్ల అనురక్తి  కలగటానికి భక్తి ఉద్యమాన్ని పునరుద్ధరించే పనికి వారు పూనుకున్నారు. వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు మాల దాసరులను, మాదిగ దాసరులను వేలాదిగా తయారుచేశారు. గ్రామగ్రామానా వారు వైష్ణవ భక్తి సాంప్రదాయానికి మూల స్తంభాలుగా నిలిచారు. సమరసతా సేవా ఫౌండేషన్ వారు రామానుజులు చూపిన మార్గంలోనే పయనం చేస్తున్నారు. 320 మంది ధర్మ ప్రచారకులలో సగానికి పైగా బలహీన వర్గాలకు చెందినవారు. రాష్ట్రస్థాయి నాయకత్వంలోనూ వారికే ప్రాధాన్యత. ఇటీవల స్వర్గస్తులైన శ్రీ ఎంజికే మూర్తి గారు మొన్నటి వరకు సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. ఈ ఉద్యమానికి ఎనలేని సేవలు అందించిన వారు, షెడ్యుల్ కులానికి చెందినవారు. కోశాధికారి శ్రీ తాళ్ళూరి విష్ణువు అఖిల భారత మాదిగ దాసరుల సమాఖ్యకు అధ్యక్షుడిగా కుడా వున్నారు. వారు, వీరు అని తేడా లేకుండా ఒక నూతన ధార్మిక సంస్కృతి కోసం సమరసత సేవా కార్యకర్తలు పనిచేస్తున్నారు.

“అన్ని కులాల నుండి, ప్రాంతాల నుండి, వర్గాల నుండి ధార్మిక జాగరణ కోసం పనిచేయటానికి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. 322 మంది ధర్మ ప్రచారకులలో 46 మంది గిరిజనులు. వారికి మద్దతుగా స్థానికంగా అనేక మంది తమ సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. మొత్తం 5 వేల గ్రామాలలో పనిచేయటానికి ప్రోత్సాహం ప్రజల నుండే వస్తున్నది. అనేక మంది మహిళలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో పనిచేయటానికి ముందుకు వస్తున్నారు” అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ శ్యాంప్రసాద్ గారు అన్నారు. “కుల వివక్ష ఇంకా కొన్ని గ్రామాలలో వుంది. రాయలసీమలో కొన్ని కుగ్రామాలలో వివక్ష కొనసాగుతున్నది. అలాంటి గ్రామాలలో సైతం సమరసత సేవా కార్యకర్తల కృషి వలన మార్పు వస్తున్నది. సామూహిక భజన, హారతి కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొంటున్నారు. దళిత, గిరిజన అర్చకులు యిస్తున్న తీర్ధ,ప్రసాదాలను అందరూ భక్తితో తీసుకుంటున్నారు” అని ఆయన అన్నారు. పెరుగుతున్న ధార్మిక చైతన్యాన్ని మరింత బలంగా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తామని, బలహీన వర్గాల వారికి ధార్మిక సాధికారత కలిగించే దిశలో మరింత పురోభివృద్ధి సాధించ గలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.

మతాంతరీకరణ యత్నాలు కొనసాగుతున్నప్పటికీ, మతాంతరీకరణలు కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు కనపడుతున్నది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే అర్చకులుగా, దేవాలయ నిర్వహణలో మునుపు ఎన్నడు లేనంతగా భాగస్వాములు అవటంతో, ఆ వర్గాలవారు హిందూ సమాజం ఇన్నాళ్ళకు తమకు ఇచ్చిన గుర్తింపును నిలుపుకునేందుకు చిత్తశుద్ధితో నిలబడుతున్నారు. బలహీన వర్గాల కాలనీలలో కట్టిన దేవాలయాలు అధ్యాత్మిక కేంద్రాలుగా మారినప్పుడు మరింతగా భక్తి ఉద్యమం బలపడుతుంది. ధార్మిక చైతన్యం వాడవాడలా వెల్లివిరుస్తుంది.

– డా|| బి.సారంగపాణి.

The post సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా గుండె గుండెలో వెల్లివిరుస్తున్న ధార్మిక చైతన్యం. . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘చాప కింద నెత్తురు’.. ఇస్లామిక్ ఉగ్రవాదం .
భారతావని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం చాప కింద నీరులా, కాదు నెత్తురులా సాగుతోంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వామపక్ష ఉగ్రవాదం పాకుతోంది. 2018 డిసెంబర్‌ చివరివారంలో జరిగిన వరస సంఘటనలు ఈ వాస్తవాన్ని మరొకసారి రుజువు చేశాయి. ఇప్పుడు వీటి కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ దేశం మొత్తాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న ఈ రెండు ప్రధాన ఉగ్రవాద ధోరణుల గురి కూడా బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ పదవీ కాలం పూర్తవుతున్న కొద్దీ, ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అటు ముస్లిం మత ఛాందస ఉగ్రవాదులు, ఇటు వామపక్ష ఉగ్రవాదులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని అనుమానించవలసిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భీమా కొరేగావ్‌ అరెస్టులు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హైదరాబాద్‌లలో జరిగిన ఇంకొన్ని అరెస్టులు ఒక ప్రత్యేక వాతావరణం గురించి వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు దొరికిన సమాచారం మళ్లీ అదే అంశాన్ని మరొకమారు దేశ ప్రజల దృష్టికి తెచ్చింది. ఈ దేశ రాజకీయ ప్రముఖులను హతమార్చడం, జాతీయ దర్యాప్తు బృందం, ఢిల్లీ పోలీసు యంత్రాంగాల కేంద్ర కార్యాలయాలను బాంబులతో పేల్చివేయడం ఆ ఉగ్రవాదుల ధ్యేయమని తేలింది. అలాగే ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని ఆత్మాహుతి దాడుల ద్వారా పేల్చివేయడం కూడా వారి అజెండాతోనే ఉంది.

భారతదేశంలో రక్తపాతం సృష్టించి, అల్లకల్లోలం చేయడానికి ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌) ప్రేరేపిత బృందం చేసిన మరో రాక్షసపుటాలోచన బయటపడింది. డిసెంబర్‌ 26, అర్థరాత్రి వేళ దేశ రాజధానిలోని జఫారాబాద్‌ అనే చోట ఉన్న నాలుగు అంతస్తుల భవనం మీద దాడి చేసి ఈ కుట్రలో భాగస్వాములైన కొందరిని భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఈ భవనం జఫారాబాద్‌ పోలీసు స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. తరువాత ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా జాతీయ భద్రతా బృందం (ఎన్‌ఐఏ) ఆధ్వర్యంలో ఇలాంటి దాడులు జరిగాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒక వీడియోలో బాంబులు తయారు చేసే విధానం గురించి ఒక పాఠం ఉంది. చెప్పినవాడు సాక్షాత్తు ముఫ్తీ హఫీజ్‌ సుహేల్‌. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబూ మాలిక్‌ పెషావరి ఇతడికి ‘దిశా నిర్దేశం’ చేస్తున్నాడని కూడా తేలింది. పేలుడు పదార్థాలు సేకరించమనీ, బాంబులు తయారుచేయమనే పెషావరీ సలహా ఇచ్చిన సంగతి కూడా అందులో బయటపడింది. ఇప్పటికి దొరికిన ఆధారాలు ఇవి.

కానీ చిన్న చిన్న బాంబులు దొరికినంతమాత్రానే ఆ పదిమంది మీద ఐఎస్‌ ఉగ్రవాదులని ముద్ర వేయడం ఎంతవరకు సబబు అంటూ వీరి తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి వెంటనే ముందుకు వచ్చారు జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. ఆ సోదాలలో దొరికిందని చెబుతున్న దేశవాళీ రాకెట్‌ లాంచర్‌ కూడా నిజమైనది కాదనీ, ట్రాక్టర్‌ విడిభాగమనీ కొందరు మేధావులు అప్పుడే ఎన్‌ఐఏ చర్య మీద ఎదురుదాడికి దిగుతున్నారు. మెహబూబా మరొకమాట కూడా సెలవిచ్చారు. ఇదంతా ఎన్నికల ముందే జరగడం చూస్తుంటే ఎన్‌డీఏ పాలకుల మీద ఆమెకు అనుమానాలు వస్తున్నాయట. నిజమే మరి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఉగ్రవాద ముఠాలు కూడా దేశ అంతర్గత భద్రతను భగ్నం చేయాలన్న తమ కుట్రను అమలులో పెట్టడానికి ఎన్నికల ముందు సమయాన్నే ఎంచుకున్న మాటా వాస్తవమే!

భారీ కుట్ర భగ్నం

డిసెంబర్‌ 26న అర్థరాత్రి దేశ రాజధాని ఢిల్లీ, పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లలో మొత్తం 17 చోట్ల ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు జరిపి పదిమందిని అరెస్టు చేసింది. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ సిద్ధాంతంతో ప్రేరణ పొందిన ఉగ్రవాద బృందం హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఎ ఇస్లామ్‌ సభ్యులని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడుల ద్వారా వరస పేలుళ్లు సాగించా లని, ప్రముఖ రాజకీయ నేతలను హతమార్చాలని, ఎన్‌ఐఏ, ఢిల్లీ పోలీసు యంత్రాంగం ప్రధాన కార్యాలయం, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలను బాంబు లతో పేల్చివేయడమే వీరి లక్ష్యమని ప్రాథమిక దర్యాప్తు దరిమిలా దొరికిన ఆధారాలను బట్టి ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ కుట్రల సూత్రధారికీ, పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదికి మధ్య సంబంధం ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పాక్‌కు చెందిన ఆ ఉగ్రవాది ఎక్కడ నుంచి, ఏ సమయాలలో వీరితో సంభాషించిందీ గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌, ఆమ్రోహ, లక్నోలలో 17 చోట్ల ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆమ్రోహ నుంచి ఐదుగురిని అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురిని ఢిల్లీలోని సీలంపూర్‌, జఫారాబాద్‌ల దగ్గర అరెస్టు చేశారు. ఇంకొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని ఆ సమయంలో అధికారులు చెప్పారు.

‘హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఎ ఇస్లామ్‌’, సామాన్య పరిభాషలో ఈ పదాలకు ఉన్న అర్థం- ఇస్లాం ప్రయోజనం కోసం యుద్ధం. ఇది అత్యంత ప్రమాదకర యువకుల బృందం. ఐఎస్‌ కార్యకలా పాలు, ఇతర ఇస్లామిక్‌ మత ఛాందస సంస్థల సమాచారం ఇంటర్‌నెట్‌ ద్వారా సేకరించి, దాని నుంచి ఉత్తేజం పొందిన యువకులే వీరంతా. అంతా 25-30 ఏళ్ల యువకులే. అరెస్టయిన వారి దగ్గర నుంచి ఒక దేశవాళీ రాకెట్‌ లాంచర్‌తో పాటు 12 పిస్తోళ్లు, 112 అలారం గడియారాలు, 100 మొబైల్‌ ఫోన్లు ఇంకా, 25 కిలోల పేలుడు పదార్థాలు, ఏడులక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంస్థ సభ్యులు తమ ధ్యేయాన్ని అమలు చేయడానికి దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సేకరించిన పదార్థాలతో బాంబులను కట్టడం ఒక్కటే మిగిలి ఉంది. ఫిదాయీన్‌ దాడుల తరహాలో ఐయీడీ(ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డివైస్‌)ని రిమోట్‌ కంట్రోల్‌తో పేల్చడం ద్వారా విధ్వంసం సృష్టించాలని వీరు పథకం వేశారు.పైప్‌ బాంబులు కూడా ఉపయోగించాలని అనుకున్నారు. ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అలోక్‌ మిట్టల్‌ వెల్లడించిన అంశాలు ఒళు జలదరించే రీతిలో ఉన్నాయి. అరెస్టయిన వారిలో ఒక మత బోధకుడు, ఒక రిక్షా కార్మికుడు, ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి, చిన్న దుకాణం యజమాని కూడా ఉన్నారు. ఈ కుట్రకు మొత్తం సూత్రధారి మహమ్మద్‌ సుహేల్‌. 29 ఏళ్ల ఈ ముఫ్తీ లేదా మహమ్మదీయ న్యాయ శాస్త్ర నిపుణుడు ఆమ్రోహకు (పశ్చిమ ఉత్తరప్రదేశ్‌) చెందినవాడు. ఇతడిని జఫారాబాద్‌లోనే అరెస్టు చేశారు. ఇతడు ఆమ్రోహ మసీదులో మౌల్వీగా కూడా పనిచేస్తాడని తొలి వార్తలలో వెల్లడికావడం గుర్తించాలి. ఈశాన్య ఢిల్లీలో జఫారాబాద్‌లో చాట్‌ భాండార్‌ నడిపే అబ్దుల్‌ మాలిక్‌ కూడా ఇందులో ఉన్నాడు. అనాస్‌ యూనస్‌ ఎంతో సిగ్గరిలా కనిపించేవాడు. కానీ మాలిక్‌ ఎదురుపడితే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. ఇతడే నొయిడాలో ఉన్న అమిటీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వయసు 24 సంవత్సరాలు. పేలుళ్లకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్‌ పరికరాలు, అలారం గడియారాలు, బ్యాటరీలు వంటివి ఇతడే సమకూర్చిపెట్టేవాడు.

ముఫ్తీ మహమ్మద్‌ సుహేల్‌ లేదా హజరత్‌… ఇతడు ఆమ్రోహలోని హకీం మెహతాబ్‌ ఉద్దీన్‌ హష్మీ రోడ్‌లో ఉన్న మదర్సాలో కూడా పని చేశాడని అంటారు. ఇతడికే అబూ బాసిర్‌ అల్‌ ఖుర్సానీ అనే మారు పేరు కూడా ఉంది. ఇతడి ఇంటర్‌నెట్‌ వినియోగానికి సంబంధించిన చరిత్రలో బాంబుల తయారీ విధానం గురించిన పాఠాలు కూడా దొరికాయి. ఆన్‌లైన్‌ ద్వారా యువకులను ఆకర్షించి, ఐఎస్‌ సానుభూతి పరులను ఏకం చేయడమే ఇతడి పని. ఈ పనిలో ఇతడు చాలా వరకు విజయం సాధించాడనే అనిపిస్తుంది. చాలామందికి ఇతడు ‘గైడ్‌ అండ్‌ ఫిలాసఫర్‌’ అయిపోయాడు. ఇతడు ఐఎస్‌ నిర్వాహక బృందంలో ఒకనిగా కూడా తన గురించి చెప్పుకునేవాడు. అయితే హైదరాబాద్‌ కేంద్రంగా ఐఎస్‌ నియామకాలు చేపట్టే అబ్దుల్‌ బాసిత్‌ సంస్థకు, సుహేల్‌ బృందానికి ఇప్పటివరకు లభించిన వివరాలను బట్టి సంబంధం ఉన్నట్టు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. అలాగే పాక్‌ నుంచి వీరితో మాట్లాడేవారు కూడా వేర్వేరు సంస్థలకు చెందిన వేర్వేరు వ్యక్తులేనని కూడా దర్యాప్తులో తేలింది. అబ్దుల్‌ బాసిత్‌ కుట్రలను మొన్న ఆగస్టులోనే ఎన్‌ఐఏ భగ్నం చేయగలిగింది. కానీ ఇప్పటికీ ఈ రెండు శిబిరాలకు మధ్య సంబంధాలు లేవంటే నమ్మడం సాధ్యం కాదు. బాసిత్‌ సంస్థకు, కశ్మీర్‌ కేంద్రంగా పనిచేసే ఐఎస్‌ అనుబంధ ఉగ్రవాదులకు సంబంధం ఉంది. ఇదే ఐఎస్‌జేకే. బాసిత్‌ ద్వారా సాయం పొందాలని ఐఎస్‌జేకేకు చెందిన ఒక ఉగ్రవాది ప్రయత్నించిన సంగతి బయటపడింది.అలాగే ఐఎస్‌జేకేకు చెందిన ఇద్దరు సభ్యులను ఢిల్లీ పోలీసులు ఆమ్రోహలోనే అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆమ్రోహ అంటే సుహేల్‌ స్వస్థలమే.

హైదరాబాద్‌ నుండే..

2018 డిసెంబర్‌ చివరివారంలోనే హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న మరొక కుట్ర గురించి కూడా లోకానికి తెలిసింది. అది కూడా జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం కదలికలను తెలుసుకునేందుకు జరుగుతున్న కుట్ర. పాక్‌ నిఘా విభాగం ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) ఏజెంట్లు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని జమ్మూకశ్మీర్‌ సైనిక నిఘా విభాగం హైదరాబాద్‌ నిఘా వర్గాలకు సమాచారం అందించింది. ఐఎస్‌ఐ ఏజెంట్లు భారత సైనికాధి కారులమని చెప్పుకుంటూ, మన సైన్యం గురించి వాకబు చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ఫోన్‌ల ద్వారా సమాచారం అడుగుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌ కేంద్రంగా ఓ ఇంటర్‌నెట్‌ ఎక్స్చేంజ్‌ సాయంతో జరుగుతున్నదని తేలింది. ఎంతో కీలకమైన, సున్నితమైన సమాచారం గురించి పదే పదే కోరుతూ ఉండడంతో అనుమానం వచ్చింది. భారత సైనికాధికారులు అప్రమత్తమయ్యారు. ఫోన్ల ద్వారా సమాచారం బయటకు పోరాదని కూడా ఆదేశాలు వెళ్లాయి. ఇంకా ఈ తరహా ఫోన్లు ఎక్కడ నుంచి ఎవరు చేస్తున్నారన్న అంశం గురించి కూడా కూపీ లాగారు. దీనితో ఇంటర్‌నెట్‌ ఎక్స్చేంజ్‌ వ్యవహారం బయటపడింది. డిసెంబర్‌ 27 ప్రాంతంలో సైనికాధికారులు ఈ సంగతిని హైదరా బాద్‌ పోలీసు విభాగానికి, ఎన్‌ఐఏ దృష్టికి తీసుకు వెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాద్‌లోని నల్లకుంట టీఆర్‌టీ కాలనీలో ఉంటున్న దినేశ్‌ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్టు కనుగొన్నారు. వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ ద్వారా అతడు మాట్లాడు తున్నాడని తేలింది. ఇతడినే ఐఎస్‌ఐ సంప్రతించి తన కార్యం నిర్వహించుకోవాలని చూసింది.

అనాస్‌ యూనస్‌, సాకిబ్‌ ఇఫ్తెకార్‌, మహమ్మద్‌ ఇర్షాద్‌లతో కలసి సుహేల్‌ ఢిల్లీలోని ఎన్‌ఐఏ కేంద్ర కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేయాలని పథకం వేశారు. ఎన్‌ఐఏ మీద వీరికి ఇంతటి విరోధానికి కారణం ఊహించడం కష్టం కాదు. ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో భారతదేశంలోనే ఇంతవరకు ఈ సంస్థ వందమందిని అరెస్టు చేసింది. పైగా అందులో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఆ తరువాత ఎన్‌ఐఏ ఓ కన్ను వేసిన ప్రాంతం హైదరాబాద్‌.

వరుస అరెస్టుల కలకలం

డిసెంబర్‌ ఆఖరివారంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన అర్బన్‌ నక్సల్స్‌ అరెస్టులు కూడా చాలా ప్రశ్నలకు తావిచ్చాయి.

ఇస్లాం మత ఛాందసుల విధ్వంసక కుట్రలకు తోడు, వామపక్ష ఉగ్రవాదం కూడా అడవుల నుంచి జనావాసాల మధ్యకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పట్టణాలు, నగరాలలో ఉద్యమం నిర్మించడానికి మావోయిస్టులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ఇలాంటి ఆలోచన మావోయిస్టులలో పదేళ్ల నాడే ఆరంభమయింది. నిరుడు జనవరిలో జరిగిన భీమా కొరేగావ్‌ ఉదంతం, తరువాత జరిగిన అరెస్టులు, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ముగ్గురు అక్కాచెలెళ్ల అరెస్టులు, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఉద్యోగి అరెస్టు దీనిని తిరుగులేకుండా నిరూపిస్తున్నాయి. ఈ తరహా ఉద్యమాన్నే అర్బన్‌ మావోయిజం అని ఇప్పుడు పిలుస్తున్నారు. అర్బన్‌ మావోయిజం తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతంలోకి చొచ్చుకు పోతూ ఉంటే, ఇస్లామిక్‌ ఉగ్రవాదం ఉత్తరాది నుంచి హైదరాబాద్‌ లక్ష్యంగా దక్షిణ భారతావనికి షికార్లు కొడుతూనే ఉంది. ఇందుకు ఇక్కడి పాలకుల వైఖరే కారణం. ఒకరు ఉగ్రవాదులను నేరుగా సమర్థించే వారికి అర్థ సింహాసనం ఇస్తారు. మరొకరు మావోయిస్టులు, మతోన్మాదులు జమిలిగా ఎదగడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తూనే ఉన్నారు.

1969 ప్రాంతంలో దేశంలో నక్సలైట్‌ ఉద్యమం ఆరంభమైంది. ఒక పుష్కర కాలానికే దాదాపు వందముక్కలైంది ఉద్యమం. అంటే వంద వరకు సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నక్సల్‌ ఉద్యమానికి 2004 సంవత్సరం ప్రత్యేకమైనది. దాదాపు నలభయ్‌ నక్సల్‌ సంస్థలు ఆ సంవత్సరమే విలీనమై మావోయిస్టు పార్టీకి రూపం ఇచ్చాయి. ఈ సమయంలోనే కొన్ని లక్ష్యాలను కూడా వారు నిర్దేశించుకున్నారు. వాటినే ‘ది స్ట్రాటజీస్‌ అండ్‌ పెర్‌స్పెక్టివ్‌ ఆఫ్‌ ఇండియన్‌ రివల్యూషన్‌ 2004’ అన్న పత్రంలో నమోదు చేశారు. ఇందులో అర్బన్‌ పెర్‌స్పెక్టివ్‌ పత్రమే మావోయిస్టులు అంటే వామపక్ష ఉగ్రవాదం పట్టణాలకీ, నగరాలకీ తరలవలసిన అవసరాన్ని చెప్పింది. అక్కడ ఉండే అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలని అది నిర్దేశించింది. కార్యకర్తలు ఇక్కడి నుంచే రావాలి. నాయకత్వం కూడా ఇక్కడే తయారు కావాలి. కారణం- అడవులను కేంద్రంగా చేసుకుని ఉద్యమం నడపడం సాధ్యం కాదని అధినాయకత్వం భావించడమే. చిత్రమేమిటంటే సెక్యులర్‌ శక్తులను ఏకం చేసే పనిని కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ భుజాన వేసుకుంది. అంతేకాదు, పీడనకు గురి అవుతున్న మైనారిటీలను హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఏకం చేయడం కూడా తన కర్తవ్యంగా నిర్దేశించుకుంది. నిజానికి ఈ సూత్రం రెడ్‌ కారిడార్‌ నాటి ఇస్లాం ఉగ్రవాద, నక్సల్‌ ఉగ్రవాద బంధాన్ని మరొకసారి బలోపేతం చేసుకోవడానికేనన్నది సుస్పష్టం. ఈ దేశం మీద సాయుధ సమరం చేయడానికి సంబంధించిన సూచనలు కూడా ఈ పత్రంలో కనిపిస్తాయి. భద్రతాబలగాల మోహరింపు నకు అవకాశం లేని గ్రామీణ ప్రాంతాలలో మిలటరీ టాస్క్‌ను ఆరంభించమని కూడా ఆ పత్రం ఆదేశించింది. ఆ విధంగా పట్టణాలు, నగరాల మీద పట్టు సాధించాలట. అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. కార్మికులు, మహిళలు, మధ్య తరగతి, దళితులను ఏకం చేయడం కూడా ఈ పత్రం లక్ష్యం. ఇదంతా ఎలా జరుగుతోంది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేశ వ్యతిరేక కార్య కలాపాలలో పాల్గొనడం వేర్వేరని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన వివరణలను ఇలాంటి వారంతా ఈ రీతిలో ఉపయోగించుకుంటున్నారు. భీమా కొరేగావ్‌ నినాదాలన్నీ ఈ నేపథ్యంలో జరిగినవే. అలాగే విశ్వవిద్యాలయాలలో వినిపిస్తున్న భారత వ్యతిరేక నినాదాలు కూడా అలాంటి ‘స్వేచ్ఛ’ ఇచ్చిన ధోరణికి చెందినవే. పైగా పట్టణాలు, నగరాలలో తమను సమర్థించేవారిని విశ్వవిద్యాలయాలలోనే మావో యిస్టు మేధావులు కనుగొంటున్నారు. ఆ విద్యా ప్రాంగణాల నుంచే తయారుచేసుకుంటు న్నారు. విశ్వవిద్యాలయాలలో లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ, తరగతుల సంగతేమో కానీ, కొన్ని చానళ్ల వారి దుష్ప్రచార కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవుతూ విద్యార్థులను పెడతోవ పట్టిస్తున్నారు. ఇందుకు సంబంధించే జనారణ్యంలో మావోయిస్టుల పాగా అంటూ కొన్ని పత్రికలలో వార్తా కథనాలు వెలువడ్డాయి. 2018 డిసెంబర్‌లో వెలువడిన అలాంటి రెండు ప్రముఖ వార్తలను గమనంలోకి తీసుకోవాలి.

ఆత్మకూరి భవాని, అన్నపూర్ణ, అనూష అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లను డిసెంబర్‌ 23, 2018న పోలీసులు విశాఖ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిని హైదరాబాద్‌లో విశాఖ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముగ్గురిని మావోయిస్టులుగా పోలీసులు చెబుతున్నారు. గతంలో డిటోనేటర్లు బయటపడిన కేసులో పట్టుబడిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఆ ముగ్గురు అక్కాచెలెళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోనే కాప్రా సర్కిల్‌లోని వెంక టేశ్వర నగర్‌లో వారు తల్లిదండ్రులతో ఉండేవారు. ఇందులో అనూష, అన్నపూర్ణ చైతన్య మహిళా సంఘంలో పనిచేశారు. తరువాత సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరారు. భవానీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీలో పనిచేశారు. తల్లి తండ్రి సామాజికోద్య మాలలోనే పనిచేస్తున్నారు. ఈమె భర్త ఎస్‌ కృష్ణ. తన భార్య, చనిపోయిన మావోయిస్టులను వారి బంధవులకు, కుటుంబ సభ్యులకు అందచేయడంలో సహకరిస్తుందని, ఉద్యమంతో సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. అయితే అనూష 2017లో తన పేరును యాంగ్జేగా మార్చుకుని మావోయిస్టు శిక్షణ తీసుకుంది. కొద్దికాలం క్రితం తిక్కరపాడు అనేచోట మాటు వేసి పోలీసు వాహనం మీద కాల్పులు జరిపిన సంఘటనలో ఆమె పాత్ర ఉంది. ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దులలో జరిగిన మందుపాతర పేలుళ్లతో కూడా ఆమెకు సంబంధం ఉందని ఆరోపణ.

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అరెస్టులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్‌జీఆర్‌ఐ (జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ)లో సాంకేతిక విభాగంలో సీనియర్‌ ఉద్యోగి నక్కా వెంకటరావును కూడా ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందన్‌గావ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి కూడా డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరావు 1980లలో ఆర్‌ఎస్‌యులో కీలకంగా పనిచేశారు. ఈయన జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ పట్టణ ప్రాంతాలలో మావోయిస్టు నెట్‌వర్క్‌ నిర్మాణానికి పనిచేస్తున్నట్టు గుర్తించారు. నాయకత్వానికి లేఖలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసే పనిలో కూడా వెంకటరావు పాలు పంచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

వాటిపైనే నిఘా..

మావోయిస్టు అనుబంధ సంఘాల పనితీరు మీద ఇప్పుడు నిఘా విభాగాలు ఎక్కువ దృష్టి పెట్టక తప్పడం లేదు. నిరుద్యోగులను మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షించే పని ఆ సంస్థ అనుబంధ సంఘాల ద్వారానే జరుగుతున్నదని నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అసలు 2004 కంటే ముందే హైదరాబాద్‌ నగరంలో మావోయిస్టులు (నక్సల్స్‌) తిష్ట వేసిన సంగతి ఎప్పుడో బయటపడింది. 2000 సంవత్సరంలో అమీర్‌పేట వంటి విపరీతమైన రద్దీ ఉండే చోటనే ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 2005లో నగరంలోనే బీఎన్‌ రెడ్డి నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దంపతులు చనిపోయారు. ఆ సంవత్సరమే హిమాయత్‌ నగర్‌, మీర్‌పేటలలో పోలీసులు పెద్ద ఎత్తున మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అటు ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి, వామపక్ష ఉగ్రవాదానికి అడ్డా హైదరాబాద్‌ నగరమేనని నమ్మక తప్పదు.

సరిగ్గా సంవత్సరం క్రితం యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ముంబైలోని కల్యాణ్‌ రైల్వే స్టేషన్‌లో ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసింది. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందినవారు. ముంబైలోనే కామ్‌రాజ్‌నగర్‌, విక్రోలి, రాంబాయి అంబేడ్కర్‌ నగర్‌లలో నివాసం ఉంటూ తెలంగాణ వలస కార్మికులను మావోయిస్టు ఉద్యమం వైపు అడుగులు వేసేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి అర్బన్‌ మావోయిజం వ్యూహంలో భాగంగా ఏర్పడిన గోల్డెన్‌ కారిడార్‌ కమిటీ తరఫున వీరు పని చేస్తున్నారని తేలింది. ఇంత జరుగుతున్నా ప్రజా సంఘాల పేరుతో, హక్కుల సంఘాల పేరుతో, మేధావుల పేరుతో ఈ విద్రోహక చర్యల ముఠాలకు మద్దతు అందుతూనే ఉంది. అలాగే ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి కూడా ఆ శక్తులే మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఆ మద్దతుకే హక్కుల రక్షణ అన్న పేరు సుప్రసిద్ధం. భారతీయ సాంస్కృతిక వైవిధ్య పరిరక్షణ అన్న పేరు కూడా ఉంది.

మావోయిస్టులకు, ఇస్లామిక్‌ మతోన్మాద శక్తులకు మధ్య బంధం లేదని చెప్పడానికి అవకాశం లేదు. నేపాల్‌ నుంచి నల్లమల్ల వరకు నిర్మించ తలపెట్టిన రెడ్‌ కారిడార్‌ వ్యవహారంలో ఆ రెండు ఉగ్రవాద ముఠాలు బంధం కలుపుకున్న సంగతి దేశానికి తెలియనిది కాదు. మావోయిస్టులు తమ లక్ష్య సాధనలో కొన్నిసార్లు ఇతర వామపక్ష ఉగ్రవాద సంస్థల సభ్యులను హతమార్చడం సర్వసాధారణం. అలాగే కొన్నిచోట్ల, కొన్ని సందర్భాలలో క్రైస్తవ మిషనరీలలో పనిచేసే వారికి కూడా అదే గతి పట్టించాయి. కానీ భారత్‌తో పాటు, ప్రపంచాన్ని ఇస్లాం మతం నీడలోకి తీసుకురావాలని చెబుతున్న ఇస్లామిక్‌ ఉగ్రవాదులను మాత్రం మావోయిస్టులు అక్కున చేర్చుకుంటున్నారని అనిపిస్తుంది.

మళ్లీ ముఫ్తీ మెహబూబా ప్రకటన దగ్గరకి వద్దాం. ఎన్నికలకు ఆరు మాసాల ముందు ఈ రగడ ఎందుకు? అన్నారామె. దీని ద్వారా ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తున్నదని ఆమె అభియోగం. అయితే సరే, బీజేపీయేతర పార్టీలు కూడా ఒక విషయం గమనించడం అవసరం. అందుకు సంబంధించిన స్పృహ బీజేపీయేతర పార్టీలకు భారత సార్వభౌమాధి కారం పట్ల ఉన్న నిబద్ధతకు, లౌకిక వాదం పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనంగా నిలబడుతుంది. ముస్లిం మత ఛాందస ఉగ్రవాదులను పరోక్షంగా, ప్రత్యక్షంగా సమర్థించే పార్టీలను బీజేపీయేతర కూటమిలో చోటు లేకుండా చూడాలి. మావోయిస్టులను అంటకాగేవారి మద్ధతును తీసుకోకుండా ఉండాలి. అప్పుడు బీజేపీతో తలపడాలి. అలా చేయగలవా?

Source: Jagriti Weekly

The post ‘చాప కింద నెత్తురు’.. ఇస్లామిక్ ఉగ్రవాదం . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Revisiting the Glorious History of Netaji and INA .
I received the invitation to write this piece on the birth anniversary of Atal Bihari Vajpayee, who in many ways aided the efforts to keep Subhas Chandra Bose’s memories alive. When Netaji’s portrait was unveiled in Parliament on January 23, 1978, Vajpayee, then foreign minister, commented: “Historians and scholars should find out why the Congress government did injustice to Netaji by ignoring him all these years.”

This poser returns to prick our conscious as Prime Minister Narendra Modi visits Port Blair to commemorate the 75th anniversary of Netaji’s hoisting the national flag there. This is yet another step to rectify historical wrongs done to Subhas Bose and those who fought alongside him for the freedom of India. To many of his ardent admirers, it is akin to applying balm on wounds that refuse to heal.

It is an open secret that Netaji was ignored because a particular narrative of how we became free had to be foisted on the people. According to this construct, the Congress leadership employing the stratagem of ahimsa led India to freedom in 1947. Others were just peripheral figures.

For a rejoinder, I cannot think of anything more apt than recalling what Dr BR Ambedkar stated in the course of an interview in February 1955 with BBC’s Francis Watson. A clear audio recording of the interview is available. There is no scope for any confusion or apprehension that Babasaheb’s words are being taken out of context.

Dr Ambedkar wondered why Clement Attlee, the British PM in 1947, “suddenly agreed to give India independence”. He then added that from what he could make out, the reason was the INA and Subhas Bose. In his words:

“The British had been ruling the country in the firm belief that whatever may happen in the country or whatever the politicians do, they will never be able to change the loyalty of soldiers. That was one prop on which they were carrying on the administration. And that was completely dashed to pieces.”

Ever since Ambedkar said this, a large number of records and testimonials of those who had a ringside view of the events have become available. They prove the veracity of this observation.

Clement Attlee himself was quite frank about it in his later years in the course of his private talks. In 1956, he told Justice Phani Bhushan Chakravartti, the acting Governor of Bengal, that in taking that momentous decision he was weighed down by growing dissent in the Indian armed forces caused by the actions of Bose. Mahatma Gandhi’s peaceful persuasions and failed Quit India movement had minimal impact on those who took the decision to free India. Evidently, that period was not tolerant enough for Justice Chakravartti to make this revelation public. He would take a few years to summon courage and then start talking about it. All the same, the word of the first Indian Chief Justice of Calcutta High Court carry far more weight than to me as written by court historians and eulogies from servile politicians.

Attlee went on to display similar candour in 1960 when Barun De, a renowned historian who was much respected in Congress and Left circles, questioned him and received the same reply as Chakravartti had. Attlee’s statement is in turn substantiated by contemporary records, especially military intelligence reports, capturing the mood in the country in the years leading to Independence. As early as November 1945, when the INA trials at the Red Fort in New Delhi were about to start, Intelligence Bureau director Norman Smith stated that “there has seldom been a matter which has attracted so much Indian public interest” and “the threat to the security of the Indian Army is one which it would be unwise to ignore”.

[National Archives, New Delhi]

By 12 February 1946, Commander-in-Chief of the Indian Army, Sir Claude Auchinleck, was forced to explain to his top military commanders the reasons the INA men, regarded by the colonial rulers as “war criminals” and “traitors”, had to be set free was because sentencing them “would have probably precipitated a violent outbreak throughout the country, and have created active and widespread disaffection in the Army”.

SK Sinha, the would be Lt General and Governor, was one of the only three natives posted in Directorate of Military Operations in those days. He came across a Top Secret record, not meant for Indian eyes. Prepared by the Director of Military Intelligence, it said that in view of INA trials and the mutinies in Mumbai and other places (which were a direct fallout of the Red Fort trials) the “Indian Army could no longer be relied upon to remain a loyal instrument for maintaining British rule over India”.

In the late 1945 and early 1946, the INA trials were used to the hilt by the Congress leaders who were otherwise hostile towards Subhas Bose. There are numerous British Raj era reports in support of this contention. For instance, on October 23, 1945 the Secretary of State for India in London was told that Congress’s backing of the INA men put on trial at the Red Fort was “one of political expediency”. A famous cry that used to raised everywhere was Lal Quile se aye awaz, Sehgal, Dhillon, Shah Nawaz. Inqlab zindabad. “The war cry comes from the Red Fort. Sehgal, Dhillon, Shah Nawaz. Long live revolution.”

And, on the day the power was transferred to Indian hands, slogans were raised in the praise of Lord Mountbatten, Subhas Bose’s military adversary during the war and free India’s first Governor-General. Mountbatten ki jai ho. “Long live Mountbatten.” There are scandalous claims about what transpired between Mountbatten and Jawaharlal Nehru during the first meeting in Singapore in 1946. Nehru’s stirring “Tryst with destiny” speech had not a word about either INA or Bose, but for whom the day would not have come in 1947.

On August 28, 1947, the demand was made to have Netaji’s portrait in the Constituent Assembly (now Parliament). It would take 30 years before it would happen, when Congress had been ousted for power. This brings us back to what Vajpayee did, and what Narendra Modi is doing. To those mindful of forgotten chapters of history, these gestures are truly historical.

-Anuj Dhar

He is the author of the bestseller “India’s biggest cover-up”

Courtesy: Organiser

The post Revisiting the Glorious History of Netaji and INA . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ దేవాలయాలను రక్షించుకోవాలి .
హైదరాబాద్‌లో ప్రముఖ మిఠాయి వ్యాపారస్తుడైన జి.పుల్లారెడ్డి దగ్గరకు ఓసారి కొందరు వ్యక్తులు దేవాలయ నిర్మాణానికి చందా కోసమనివచ్చారట. వచ్చినవారు అరవై మందికి పైగా ఉన్నారట. వెంటనే పుల్లారెడ్డి- ‘నేను చందా ఇస్తాను సరే.. మరి మీ దేవాలయంపై ఎవరైనా దాడికి దిగితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించడంతో వాళ్ళు కంగుతిని వౌనంగా నిల్చున్నారట. దాంతో ఆగ్రహించిన పుల్లారెడ్డి ‘దేవాలయంపై ఎవరైనా దాడికి పూనుకుంటే ఎదురు తిరుగుతాం అని కూడా మీరు చెప్పడం లేదు. నేను చందా ఇవ్వను’ అన్నారట. నిజమే! మనం ఎన్నో కొత్త దేవాలయాలు కడుతున్నాం. వాటిని నిర్వహించే క్రమంలో ఎవరికివారు గీతలు గీసుకొని ‘భక్త కులాల కుంపటి’ పెట్టుకొని వేరుపడుతున్నాం. మన దేశంలో బౌద్ధ, జైనాల ప్రభావంతో వైదిక ధర్మానికి జరిగిన నష్టాన్ని, నానావిధ పరిమళ పుష్పాల ఆరాధన వల్ల విజభజించబడిన మనస్తత్వాన్ని ఏకత్వ మార్గంలో నడిపించేందుకు ఆదిశంకరులు గొప్ప ప్రయత్నమే చేశారు. ఇటీవల వివిధ దేవతల, గురువుల ఆరాధన చేసేవాళ్లు ప్రత్యేకమైన వర్గంగా మారిపోయి మన మూల సంస్కృతిని విస్మరిస్తున్నారు.

విస్తృతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురువుల దగ్గరకు, సంస్థల కార్యక్రమాలకు రాజకీయ నాయకులు పార్టీ భేదం లేకుండా వెళ్లి పాల్గొంటున్నారు. ఆ సంస్థలకు, ఆలయాలకు లేదా తమ అవసరాలకు ఉపయోగించుకొన్న గురువులకు, బాబాలకు ఏదైనా విపత్తు వస్తే మాత్రం ‘సెక్యులరిజం’ వ్రత కంకణం చూపిస్తూ తప్పించుకొంటున్నారు. హిందూ ధర్మానికి మూలస్తంభమైన ఆలయ వ్యవస్థ నాశనం అవుతున్నా పాలకులెవరూ పట్టించుకోవడం లేదు. పుష్కరాలను కూడా ‘ఆధ్యాత్మిక వినోదాత్మక ఈవెంట్’గా మార్చగల రాజకీయ, బ్యూరోక్రసీ వ్యవస్థ ఉన్న దేశం మనది! ‘అది కూడా చేయపోతే ఏం చేస్తాం’ అని సరిపెట్టుకోగల హిందూ జాతి మనది.

విజయవాడలో పుష్కరాల పేరిట దేవాలయాలను కూల్చినా దిక్కులేదు. విఐపీల సేవలో తరిస్తూ వున్న అధికార గణం, తొక్కిసలాటలో పుష్కర భక్తులు ప్రాణాలు పొగొట్టుకున్నా పట్టించుకొన్న పాపాన పోలేదు. ఇక ఏ పుణ్యక్షేత్రంలో చూసినా భక్తులకు తీవ్ర ప్రయాస తప్ప ఇంకేం లేదు. అధికారంలో వున్నవాళ్ల బంధుగణానికి సేవ చేయడంలో మునిగిపోయే అధికార గణం భక్తుల సౌకర్యాల విషయంలో అంత సీరియస్‌గా లేదన్నది నిజం. ఆలయాలకు ఆదాయం బాగానే ఉన్నా అరకొర వసతులతో ఆ అయిదు గంటలు అలాగే భక్తులు కాలం గడిపి అన్నీ మర్చిపోతారన్న సూత్రం అధికారులకు, నాయకులకు బాగా తెలుసు. అలనాడు నియంత హిట్లర్ అందరిముందూ ఓ కోడిని తెచ్చి ఈకలు పీకుతుంటే అది విలవిలలాడిపోయిందట. వెంట నే ఆ కోడికి కొన్ని గింజలు వేస్తే అది ఈకలు పీకిన విషయం మరచిపోయి ప రుగులెత్తుకొని పోయి తి న్నదట. అలాగే హిందూ సమాజం దైవ సన్నిధిలోకి వెళ్లాక అప్పటిదాకా పడిన కష్టాలన్నీ దైవ దర్శనం తర్వాత అన్నీ మరచిపోయి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా పేరుమోసిన పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వాములు కిమ్మనకుండా ఉండిపోవడం ఆశ్చర్యం. నేతలతోపాటు స్వాములు కూడా ఇటీవల వీఐపీలుగా మారిపోయారు. ఇక ఇవన్నీ ప్రశ్నించాల్సిన ప్రధాన స్రవంతి మీడియా అధినేతలు, ఆయా సంస్థల వాళ్లు, ఆఖరుకు స్థానిక విలేఖరులు కూడా రాజకీయ నాయకుల్లా బ్రేక్ దర్శనాలు చేసుకుంటున్నారు.

ఈ అవలక్షణాలకు తోడు వివిధ క్షేత్రాల్లో చిరు వ్యాపారస్తులు కొన్ని కొత్త సంప్రదాయాలను సృష్టిస్తున్నారు. నదీతీరాల్లో ఉన్న దేవాలయాల్లో కొబ్బరికాయ, కొన్ని పూలు, ఏవో ఆకులు కలిపి అందంగా అలంకరించి నదుల్లో వదిలేయాలని ఈ షాపులవాళ్లే భక్తులకు బోధిస్తున్నారు. ఆధ్యాత్మిక తత్వ మూలాలు తెలియనివాళ్లు కొన్ని అవసరం లేని పదార్థాలను నీటిలో వదులుతూ నదులను కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నారు. ఉదాహరణకు గాణుగపురం ఓ గొప్ప దత్తక్షేత్రం. అక్కడ సరైన వసతులు లేనందున వేలాదిమంది భక్తులు ఎక్కడంటే అక్కడ రోడ్లపైన, నదీ తీరంలో, నది పక్కన మల మూత్ర విసర్జన చేస్తున్నారు. ఆలయ కమిటీ ఏమీ పట్టించుకోవట్లేదు. భీమ, అమరజ నదులు కాలుష్యంతో నిండిపోయి వైతరణీ నదిని తలపిస్తున్నాయి. తెలంగాణలోని కొండగట్టులో ఆలయ పరిసరాలను భక్తులే అపరిశుభ్రం చేస్తున్నారు. గుడికి ఆదాయం పెంచే ఆలోచన తప్ప రెండవ ధ్యాస లేని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దేవుని ముందు అందరూ సమానమన్న ప్రాతిపదిక వదిలేసి డబ్బుతో దేవుని కొలిచే మార్గానికి తెరతీస్తున్నారు. ఇదంతా కేవలం ఫలానా దేవాలయం అని మాత్రమే కాదు. అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి. ఒక్క తిరుమలలో మాత్రం పరిశుభ్రతకు గొప్ప ప్రాధాన్యం ఉంది. కానీ అక్కడ అన్య మతస్థులు ఉద్యోగులుగా అధికారం చలాయిస్తున్నారు. అపుడపుడు మత మార్పిడి ముఠాలు అధికారులకు పట్టుబడినా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అందువల్ల ఇవి పునరావృతం అవుతూనే వున్నాయి.

దేవాలయాల పోషణకు హుండీలు, టిక్కెట్లు ఉండొచ్చని వాదించే వాళ్లూ ఉన్నారు. కానీ ఆ ఆదాయం దైవదర్శనం కోసం వచ్చే భక్తులకు, దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలి. ఈవిషయంపై కులా ల వారీగా విభజించబడిన మనం సామూహిక శక్తి కేంద్రాలైన దేవాలయాల సమస్యలపై స్పందించడం మానేశాం. దైవభక్తి ప్రేరణకు, ధర్మ ప్రచారానికి కేంద్రాలుగా వున్న ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న వైనంపై తక్షణ చర్యలు అవసరం. ఎన్నో దేవాలయాలకు ఇచ్చిన మాన్యాలు పరాధీనమై, కబ్జా కోరల్లో కకావికలమవుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. ఆలయం కేవలం శబ్దబ్రహ్మ ఉపాసనా కేంద్రం మాత్రమే కాదు; సామాజిక విజ్ఞాన శోధనా కేంద్రాలుగా మార్చాలన్న ఆలోచన లేదు. ఆలయాలు ఉద్యోగులను బతికించే ఉపాధి కేంద్రాలు మాత్రమే కాదు, ధార్మిక వ్యాప్తికి మూలసూత్రాలు. వీటిపై అవగాహన లేనివారు, భక్తిలేని వారు అధికారులుగా ఉండడంవల్ల ఈ విధమైన పరిశోధన, కొత్త ఆలోచనలకు స్థానం లేకుండా పోయింది. ఆలయ బోర్డుల్లో కులాల వారీగా, వర్గాల వారీగా, పెట్టుబడిదారులను చేర్చి ఆలయ వ్యవస్థను వాళ్ల స్వంత ఎస్టేటులుగా మార్చేస్తున్నారు. భక్తులకు అరకొర సౌకర్యాలపై, తమకు పూర్తి స్థాయి మర్యాదలపై మాత్రమే చర్చలు, నిర్ణయాలు చేసే ఇలాంటి ధార్మిక మండళ్లు హిందూ ధర్మవ్యాప్తికి శాపాలు.

దేవాలయాల నిర్వహణ విషయంలో నాయకులవి, అధికారులవి ఎన్ని తప్పులున్నాయో పేరుమోసిన స్వామీజీల నిర్లిప్తత కూడా అంతే తప్పు. హిందూ దేవాలయ వ్యవస్థను ముస్లిం పాలకులు ప్రత్యక్షంగా ధ్వంసం చేస్తే ఆంగ్లేయ పాలకులు ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ‘రిలిజియన్ ఎండోమెంట్ యాక్ట్-1863’ను తెచ్చారు. దాని కొనసాగింపుగా ‘ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మాదాయ దేవాదాయ సంస్థల చట్టం-1966’ అమలులోకి వచ్చాక మొదట కొంత నిబద్ధతతో ప్రభుత్వ పెద్దలు ఆలోచించారు. కానీ ఆ తర్వాత వచ్చిన నాయకులు స్వాములకు, పీఠాధిపతులకు ఓ పాద నమస్కారం పడేసి తమకు అనుకూలంగా నిబంధనలను మార్చుతూ వ్యవస్థను ధ్వంసం చేస్తూ వచ్చారు. ఎవరైనా ఎదురుతిరిగితే ప్రభుత్వాధినేతలు వారిని అపఖ్యాతిపాలు చేశారు.

తిరుమలలో వేయికాళ్ల మండపం నిర్మాణం విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిదండి చినజీయర్ స్వామికి ఎన్ని విభేదాలు వచ్చాయో మనకు తెలుసు. దేవాలయ పాలక మండళ్లలో పైనుండి కింది దాకా రాజకీయ నిరుద్యోగులను నియమిస్తూ థార్మిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. కొన్ని ప్రయివేట్ సంస్థల అధ్యయనం ప్రకారం అనంతపురం జిల్లా కస్సాపురం ఆంజనేయస్వామి దేవాలయ భూమి 444 ఎకరాలు వుంటే అందులో 157 ఎకరాల భూమిని 1957లో అమ్మేసారు. భద్రాద్రి ఆలయానికి చెందిన పురుషోత్తమపట్నం సర్వే నెం.15లోని 917 ఎకరాల భూమిలో 12 ఎకరాలు సిస్టర్ మొగిలి మరియమ్మకు ఎకరాకు 1,25,000 చొప్పున 1998లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అమ్మగా అక్కడ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు వెలిశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, అనంతపురం మొత్తం ఏడు జిల్లాల్లో ఆలయ భూములు 1,12,806 ఎకరాలు ఉంటే ఇందులో ప్రభుత్వం 8 వేల ఎకరాలకుపైగా కారుచౌకగా అమ్ముకొంది. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 210 ఎకరాలు చౌకగా ప్రభుత్వం అమ్ముకొన్నా ఆనాడు అడిగే నాథుడు లేడు. ఈ కబ్జాకోరులే ఇపుడు విఐపీలుగా చెలామణి అవుతున్నారు. వాళ్లందరి దర్శనాల కోసం సామాన్య భక్తులను శ్రీశైలం, తిరుపతి దేవస్థానాల్లో సైతం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో తిరుపతిలో ఏకంగా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం మొదలైనా, వకుళమాత ఆలయం చుట్టూ విధ్వంసం జరిగినా పట్టించుకోలేదు. యాదాద్రి, వేములవాడ వంటి దేవాలయాలను ఆధునీకరించి ఓ కొత్త చరిత్ర సృష్టించాలనుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అవి పూర్తయితే చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ ఆలయ భూములను కబ్జా కోరల నుండి విడిపించి పరిశుభ్రత విషయంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెడితే ఆయన చేపట్టిన ‘ఆపరేషన్ టెంపుల్’ విజయవంతవౌతుంది. ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ, ఇతర పార్టీలన్న తరతమ భేదం లేకుండా కబ్జా చేసిన దేవాలయ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించాలి.

ఆలయాలను ఆదాయం తెచ్చే మద్యం షాపుల వేలంలా కాకుండా, పిక్నిక్ స్పాట్‌ల్లా కాకుండా ధార్మిక స్థలాలుగానే భావించాలి. నిజాయితీ, నిబద్ధతగల వ్యక్తులను దేవదాయ శాఖలో ఉంచాలి. అపుడే ప్రతి ఆలయం ధార్మిక కేంద్రంగా పరిఢవిల్లుతుంది. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే 30/87 లాంటి చట్టాలను సవరణ చేసుకోకపోతే గుడులు, గోపురాలు కునారిల్లడం ఖాయం. భక్తులు కూడా తాము సందర్శకులం మాత్రమే అని భావిస్తే ఇదంతా ఇతరశక్తుల చేతుల్లోకి పోతుంది. అదికాకుండా ‘ఏ రోజు కారోజు రైల్వే ప్రయాణికుల్లా’ దేవాలయాలను సందర్శిస్తే మనది అనుకున్న అస్తిత్వం మంటగలవడం ఖాయం. అతి పెద్ద ధార్మిక మతం గల దేశంగా ఉన్నాగానీ కులతత్వం, స్వాభిమానం, పార్టీ విధేయత ఊబిలో కూరుకుపోతున్న మనం దేవాలయాలను రక్షించుకోకపోతే మరో చారిత్రక తప్పిదం చేసినవాళ్లం అవుతాం.

డా॥ పి. భాస్కర యోగి

bhaskarayogi.p@gmail.com

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

The post హిందూ దేవాలయాలను రక్షించుకోవాలి . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాఫెల్ వివాదం వెనుక లోతైన కుట్ర? .
దేశ రక్షణ, భద్రత వంటి అంశాలకు సంబంధిం చి ప్రజలలో, రాజకీయ పక్షాలలో ఏకాభి ప్రాయం అత్యవసరం. అలా లేని పక్షంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న రభసను మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల కోసం చెలరేగుతున్న వివాదంగా భావిం చాము. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న వాదనలతో పలు అనుమానాలకు అవకాశం ఏర్పడింది, దాంతో రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు వివాదం రేపుతున్నాయని భావించాము. గతంలో బోఫోర్స్ వివాదం రాజీవ్ గాంధీకి ఏ విధంగా ఉపయోగ పడింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాఫెల్ నుండి ప్రయోజనం పొందాలని చూడటంలో తప్పు పట్టలేము. అయితే, సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత, ఇందులో అంతా సక్రమంగా జరిగిందని స్పష్టం చేసిన తర్వాత, తాము లోతుగా పరిశీలించా మని-అనుమానించదగిన అంశాలను ఏవీ లేవని చెప్పిన తర్వాత కూడా ఇంకా వివాదం సద్దుమణగక పోవడం గమనిస్తే- ఈ వివాదం వెనుక లోతైన కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ కుట్రలో రాజకీయ పార్టీలు పావులుగా మాత్రమే ఉన్నాయని భావించవచ్చు.

మన దేశం సైనికపరంగా బలపడటం ఇష్టం లేని అంతర్జాతీయ శక్తులు ఇటువంటి అనుమానాల వ్యాప్తికి ప్రయత్నం చేస్తున్నట్లు భావించవలసి వస్తున్నది. మరోవంక రక్షణ వ్యవస్థలో ప్రైవేట్ రంగం ప్రవేశిస్తే ఏడు దశాబ్దాలుగా తమ అసమర్ధతతో దేశానికి ఎంత నష్టం కలిగించామో వెల్లడి అవుతుందనే ఆందోళనతో ప్రభు త్వరంగ సంస్థలు భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయని చెప్పవలసి ఉంటుంది. రెండు దేశాల మధ్య జరిగే ప్రధానమైన రక్షణ సంబంధ ఒప్పందాలు ఆయా దేశాల విదేశాంగ విధాన లక్ష్యాలకు లోబడి ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. కేవలం ఒక అంశానికి పరిమితం కాకుండా విస్తృతమైన ప్యాకేజీని ఆమోదిస్తూ ఒప్పందాలు చేసుకొంటూ ఉంటాయి. అటువంటి ఒప్పందాలను సాధారణ వాణిజ్య ఒప్పందాల వలే చూడడం తగదు. అందుచేత ఇటువంటి ఒప్పందాలలో అంగీకరించే అనేక అంశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటాయి. వాటిని ఎప్పటికీ బహిరంగ పరచరు.

భారతదేశం రాఫెల్ విమానాలను కేవలం విమా నాలుగా కాకుండా సమగ్ర పోరాట వ్యవస్థను సమ కూర్చుకొనే వ్యూహంలో భాగంగా కొనుగోలు చేస్తున్నది. వాటి ద్వారా చేరవేసే ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రాడార్లు అత్యంత ముఖ్యమైనవి అవుతాయి. వాటిని సమకూర్చుకోవడాన్ని బట్టి వ్యూహాత్మకంగా వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది. అవి ఏ విధంగా పనిచేస్తాయన్నది చాలా రహస్యంగా ఉంచదగిన అంశం. ఏ దేశం కూడా అటువంటి అంశాలను బహిరంగ పరచదు. ఎందుకంటే వాటిని ఉపయోగించినప్పుడు ఆశ్చర్యకర అంశం ఇమిడి ఉండవలసిందే. ముందుగా తెలిస్తే శత్రు దేశాలు వాటిని ఢీకొట్టగల ఆయుధాలను సమకూర్చుకొనే అవకాశం ఉంటుంది. ఇటువంటి రక్షణ సంబంధ అంశాలలో పరిజ్ఞానం గల కొందరు నిపుణులు ఈ యుద్ధ విమా నాలకు సంబంధించిన ఒకొక్క అంశంపై వివరాలు బహిర్గత పరచమని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా కుట్ర పూరితంగా ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం కలుగుతున్నది.

రాఫెల్ యుద్ధ విమానాలను అమ్ముతున్న ఫ్రాన్స్ అం దుకు సంబంధించి ఈ ఒప్పందంలో వాణజ్యపరమైన అంశాల గురించి బహిరంగ పరచడానికి విముఖత వ్యక్తం చేస్తున్నది. ఇతర దేశాలకు కూడా ఇటువంటి విమానాలను అమ్ముతున్న దృష్ట్యా వాణిజ్య పరమైన వివరాలను బహిరంగ పరచడం ఆ దేశానికి సహజంగానే ఇష్టం ఉండదు. ప్రభుత్వాల మధ్య ఇటువంటి కొనుగోలు ఒప్పందాలు జరిగినప్పుడు వాణిజ్యపరమైన అంశాలను గోప్యంగా ఉంచుతూ ఉండటం అంతర్జాతీయంగా జరిగే సాధారణ ప్రకియ. రక్షణ పరికరాల కొనుగోలు ఇతర వస్తువులకు వలే గరిష్ట అమ్మకపు ధర అంటూ ఏదీ ఉండదని గమనించాలి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ధర కన్నా చాలా ఎక్కువ మొత్తం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వజూపుతున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఒప్పందం కుదరని, ఖరారు కాని ధరను ఒప్పదం కుదుర్చుకున్న ధరతో ఏ విధంగా పోలుస్తారు ? యూపీఏ హయాంలో జరిగిన సంప్ర దింపులలో ప్రాథమిక అంశాలలో ముందుకు వెళ్ళక పోవడంతో ధరల విషయంలో బేరసారాలకు అవకాశమే లేకుండా పోయింది. పైగా, మొదట్లో జరిగిన సంప్ర దింపులన్నీ విమాన స్వరూపానికి సంబంధించినవి. అందులో అదనంగా కావలసిన సదుపాయాలు, సాయుధ సంపత్తిని గురించిన ప్రస్తావనలు చోటు చేసుకోలేదని గమనించాలి. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం భారతదేశ సామర్ధ్యానికి అవసరమైన పలు అదనపు సాంకేతిక సముదాయాలను చేర్చి కుదు ర్చుకున్నదని గమనించాలి. మరే యుద్ధ విమానానికీ లేని అదనపు సదుపాయాలను ఇందులో సమకూర్చుకొనే ప్రయత్నం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్‌ను పక్కకు త్రోసివేసి, ప్రైవేట్ రంగంలోని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు కాంగ్రెస్ వారు ప్రధానంగా మరో ఆరోపణ చేస్తున్నారు. కేవలం వాస్తవాలు తెలి యకుండా అమాయకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా? లేదా ఉద్దేశ పూర్వకంగా బురద చల్లడం కోసం చేస్తున్నారా? అన్నది తెలియవలసి ఉంది. ప్రస్తుతం కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంలో యుద్ధ విమానాలను భారత దేశంలో తయారు చేయడానికి గాని లేదా విడి భాగాలను ఇక్కడ సమకూర్చు కోవడానికి గాని ఉద్దేశించినది కాదని మనం గమనించాలి. మొత్తం 36 యుద్ధ విమానాలను కూడా ఫ్రాన్స్ లోనే తయారు చేసి, అక్కడే విడి భాగాలను జత చేసి మన దేశానికి పంపించవలసి ఉంటుంది. అందుచేత ఈ మొత్తం ప్రక్రియలో భారత్‌లో తయారు చేయడం కోసం భాగస్వామిని ఏర్పాటు చేసుకొనే ప్రసక్తి ఏర్పడదు. ఆఫ్ సెట్ హామీలను నెరవేర్చడం కోసం దస్సాల్ట్ కంపెనీ భారత దేశంలో అనేకమంది ఆఫ్ సెట్ భాగస్వాములను ఏర్పర్చుకొంది. వారిలో ఒకరు రిలయన్స్ కావడం గమనార్హం. భారీ మొత్తం విలువ గల అంశాలలో ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరగడం, ప్రభుత్వ పరమైన హామీలతో ఖర్చు కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదనంగా లాజిస్టిక్, శిక్షణ, నష్టపోవడం వంటి అంశాలలో కంపెనీ మద్దతు అందిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఒప్పందంలో దళారీ గాని, ముడుపులు గాని లేవు. ఇలాంటి ప్రయోజనాలన్నింటికీ రాఫెల్ ఒప్పందం ఎటువంటి మినహాయింపు కాదు. అయితే మన రక్షణ సామర్ధ్యాన్ని అనూహ్యమైన ప్రయత్నాల ద్వారా పెంపొందింపచేసుకొనే ప్రతి ప్రయత్నాన్ని అసహనానికి గురయ్యే కొన్ని శక్తులు- లేనిపోని వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.

ఇలాంటి ఒప్పందాలకు సంబంధించి పోటీలో నష్టపోయే శక్తులు ఉద్దేశ పూర్వకంగా వివాదాలను సృష్టించి, ప్రతికూల కథనాలను వ్యాపింప చేసి, కీలక నిర్ణయాలు తీసుకొనే వారిని నిరుత్సాహ పరచి ఒప్పందాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తుం టాయ. మీడియా కథనాల ప్రకారం అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలను, ముఖ్యంగా నావికాదళంలో ఉపయోగించే వాటిని కూడా సమకూర్చు కోవాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ విషయంలో ముందుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని అడ్డుకొనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భావించవలసి వస్తుంది. అటువంటి ప్రయత్నాల ఫలితంగానే ప్రస్తుత వివాదాలు మి న్నంటున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో భారీగా నిధులను సమకూర్చుకోవడం కోసం కొన్ని పారిశ్రామిక సంస్థలను రాజకీయ నాయకులు లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆరోపణలు వెలువడుతున్నాయి.

రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం పాల్గొనేటట్లు చేసే ప్రతి చర్యను ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంటాయి. హెచ్‌ఏఎల్ గత అనుభవాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఏరోస్పేస్ ఉత్పత్తిలో ప్రత్యా మ్నాయ సదుపాయాలను ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయడం కోసం యూపీఏ ప్రభుత్వం ఒక విదేశీ సంస్థతో కలసి ప్రైవేట్ రంగ సంస్థ రవాణా విమానాలను ఉత్పత్తి చేసే ప్రతిపాదనను చేపట్టింది. చివరకు టాటా ఎయిర్ బస్సును ఎంపిక చేసింది. గుత్త్ధాపత్యం గల రక్షణ రంగంలో ప్రైవేట్ పార్టీలు ప్రవేశిస్తే తన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భయంతో హెచ్‌ఏఎల్ తెలివిగా ఈ ప్రతి పాదనను ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంల మధ్య పోరాటంగా మార్చింది. అప్పటి నుండి ఇది అధికారుల మధ్య చక్కర్లు కొడుతూ కార్యరూపం దాల్చనే లేదు. ప్రభుత్వ పరిధిలో ప్రైవేట్ రంగాన్ని అనుసంధానం చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రభుత్వ రంగం తిరస్కరిస్తూ వస్తున్నది. అదే తరహాలో కొందరు మీడియా ప్రతినిధులు సైతం హెచ్‌ఏఎల్ స్థానంలో రిలయన్స్‌ను ప్రభుత్వం తీసుకు వచ్చిందంటూ కథనాలను వ్యాప్తి చేస్తున్నారు. ఆరోపణలను సమర్ధించే విధంగా వాస్తవాలు లభిం చినట్లయితే ప్రభుత్వాన్ని విపక్షాలు, మీడియా సంస్థలు విమర్శించడాన్ని పూర్తిగా సమర్ధించవచ్చు. వారి వాదన న్యాయబద్ధం అని చెప్పవచ్చు.

అయితే, దారుణమైన ఆరోపణలను వ్యాపింప చేయడం, వాటిలో ఏదో ఒక ఆరోపణ నిలబడక పోతుందా? అని ఎదురు చూడటం దారుణమని చెప్పవలసిందే. తప్పుడు ఆరోపణలు దేశంలో వాతావరణాన్ని కలుషితం కావించి, భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరణ చేసే పక్రియను కుంటు పడే విధంగా చేస్తుంది. ఎంతో ధైర్యం, నిజాయతీ గల నేతలు, అధికారులు కూడా తర్వాత ఇటువంటి వాటిని చేపట్టడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ధోరణులు జాతి వ్యతిరేక చర్యలుగా దిగజారడం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని గమనించాలి.

-చలసాని నరేంద్ర

ఆంధ్ర భూమి

http://www.andhrabhoomi.net/content/main-feature-1653

The post రాఫెల్ వివాదం వెనుక లోతైన కుట్ర? . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

2018లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అలుపెరగని విజయయాత్ర .
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అలుపెరగని విజయయాత్రలో 2018వ సంవత్సరం మైలురాయిలా నిలుస్తుంది. చారిత్రక విజయాలు నమోదు చేసింది. స్వీయ లక్ష్యాలు, ఆ దారిలో ఎదురయ్యే సవాళ్లు, చిక్కుముడులు ఛేదిస్తూ ఇస్రో బృందం ముందుకు సాగింది

ప్రాంతీయ నావిగేషన్ అవసరాల కోసం అతి భారీ ఉపగ్రహాలను ఏడింటిని GSLV MK 3 ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి భారత ప్రభుత్వ అనుమతి సాధించడంతో ఇస్రో అంతరిక్ష యాత్రలో రెండు కొత్త పదాలు చేరాయి. గగన్ యాన్, వ్యోమనాట్ ప్రాజెక్ట్ లకు కూడా ఇదే ఏడాది బీజం పడింది.

అగ్రదేశాల సరసన భారత్ – అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం. జనవరి 3 2019న చంద్రయాన్ 2

ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ఈ ఏడాది ఆగస్ట్ 15న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గురించి ప్రకటన చేశారు. ఇద్దరు లేక ముగ్గురు వ్యోమగాములను భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని తొలి కక్ష్యలోకి పంపించే ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. వీరు వారం రోజులపాటు ఈ కక్ష్యలోనే పరిభ్రమిస్తారు. ఈ ప్రయోగాన్ని 2022 లోగా పూర్తి చేయాలని ఇస్రోకి గడువు విధించారు. దీంతో, బెంగళూరులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని కొత్తగా ప్రారంభించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణురాలైన డాక్టర్ వీఆర్ లలితాంబిక ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నారు.

చారిత్రక ప్రయోగాలను దిగ్విజయంగా చేపట్టిన ఇస్రో, మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో కీలక ప్రయోగాలను ఇప్పటికే పూర్తి చేసింది. మానవ సహిత ప్రయోగంలో లాంఛ్ ఎస్కేప్ సిస్టం అత్యంత కీలకమైనది. ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా భూ వాతావరణంలోనే పేలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వ్యోమగాముల ప్రాణాలను కాపాడేలా ఎస్కేప్ లాంఛ్ ఫాడ్ ను రూపొందించారు. వాహక నౌకను రాకెట్ మోసుకెళుతున్న సమయంలో చిన్నపాటి రాకెట్ ను పైభాగాన అమరుస్తారు. ప్రమాదం జరిగినప్పుడు వ్యోమగాములు వున్న క్యాప్సుల్ ను ఈ చిన్నపాటి రాకెట్ ప్రధాన వాహక నౌక నుంచి విడదీసి ప్యారాచూట్ సహాయంతో కొన్ని కిలోమీటర్ల అవతలకు సురక్షితంగా తీసుకెళుతుంది. భారత్ తొలి అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మకు కూడా ఇలాంటి పరోక్ష అనుభవం ఎదురైంది.

ఈ ఏడాది జనవరిలో PSLV C 40 (పీఎస్ఎల్వీ సీ 40) ద్వారా కార్టోశాట్ 2 సిరిస్ ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన 30 చిన్నపాటి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా అరుదైన ఘట్టాన్ని ఇస్రో ఆవిష్కరించింది. గత ఏడాది IRNSS 1 H లో జరిగిన పొరపాటును శాస్త్రవేత్తలు సరిదిద్దుకుని, ఓటమి పాఠాలు నేర్చుకుని  ఈ ఏడాది ఏప్రిల్ లో IRNSS 1 Lని సమర్థవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో నేవగేషన్ విషయంలో భారత్ స్వయం చోదక శక్తిగా ఎదిగింది. ప్రాంతీయ నేవిగేషన్ కోసం పాశ్చాత్య దేశాలపై ఆధార పడే పరిస్థితిని అధిగమించింది.

2018

ఇస్రో ఈ ఏడాది మొత్తం 17 ప్రయోగాలను నిర్వహించింది.

2019 లో ఇస్రో లక్ష్యాలు

ఏడాది ప్రారంభంలో 800 కోట్ల రూపాయల చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కు జనవరిలో అంకురార్పణ32కి పైగా ఉపగ్రహ ప్రయోగాల లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. 8 PSLVలు 2 GSLV MK 2, గగన్ యాన్ ప్రాజెక్ట్ కోసం 2 GSLV MK 3 ప్రయోగాలు 2019లో జరగనున్నాయి.

ప్రైవేటు స్పేస్

2018 లో ఇస్రో మరో అడుగు వేసింది. ఉపగ్రహాల నిర్మాణానికి మూడు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉపగ్రహాల నిర్మాణం, పరీక్షలు, అసెంబ్లింగ్ కోసం ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కి కీలక కాంట్రాక్ట్ లు అప్పచెప్పింది. ఈ మూడు కంపెనీలు 27 ఉపగ్రహాలను నిర్మించనున్నాయి. ఇందులో ఏడు సమాచార ఉపగ్రహాలు, 12 భూ పరిశీలనా ఉపగ్రహాలు, అయితే, నేవిగేషన్ శాటిలైట్లు, మూడు సైన్స్ శాటిలైట్ లు ఉంటాయి.

Source: Bharath today.

https://www.bhaarattoday.com/news/news/record-of-isro/29828.html

The post 2018లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అలుపెరగని విజయయాత్ర . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రక్షణ వారధి .
అస్సాం, అరుణాచల్ ప్రాంతాలను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణమైన ‘యోగీవేల’ – బోగీబీల్ – వారధిపై రాకపోకలు మంగళవారం లాంఛనంగా ప్రారంభం కావడం ఈశాన్య క్షేత్ర వౌలిక ప్రగతికి మరింత దోహదకరం. చైనా మన దేశానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న వ్యూహాత్మక, ఆర్థిక, భౌతిక, సాంస్కృతిక దురాక్రమణను ప్రతిఘటించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ వంతెన నిర్మాణం మరో చారిత్రక విజయం. అస్సాంలోని దిబ్రూగఢ్‌నుంచి అరుణాచల్‌లోని ధీమాజీని కలుపుతూ నిర్మితమైన ఈ రెండు అంతస్థుల ఉక్కు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించడం మరో చారిత్రక ఘట్టం! కింది అంతస్థులలో ‘ఇనుప దారి’ – రైలుమార్గం – పై అంతస్థులలో ‘రహదారి’ ఏర్పడి ఉన్న ఈ వంతెన దేశంలో అంత్యంత పొడవైన నదీ వారధి. నాలుగు కిలోమీటర్ల తొమ్మిదివందల నలభైమీటర్ల మేర నిర్మించిన ఈ వంతెన వల్ల దిబ్రూగఢ్ పట్టణానికీ, అరుణాచల్ రాజధాని ఇటానగర్‌కు మధ్య రహదారి దూరం నూట యాభయి ఐదు కిలోమీటర్ల మేర తగ్గిపోయిందట! రైలు మార్గం దూరం ఆరువందల తొంభయి ఎనిమిది కిలోమీటర్ల మేర తగ్గిపోవడం వల్ల ఉభయ ప్రాంతాల – అస్సాం, అరుణాచల్ – ప్రజలకు మాత్రమే కాక ఈశాన్య క్షేత్ర ప్రయాణీకులందరికీ కూడా సమయం, ధనం కూడా ఆదా కానున్నాయి. ఈ వంతెన నిర్మాణానికి ఐదువేల తొమ్మిదివందల ఇరవై కోట్ల రూపాయల వ్యయమైంది. దేశం బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమైన తరువాత కూడా ఈశాన్య ప్రాంతంలో దశాబ్దులపాటు బ్రిటన్ దొరల పాలన వారసత్వం కొనసాగడం విచిత్రమైన చరిత్ర.

క్రీస్తుశకం 1885వరకు బర్మా ప్రాంతం – అఖండ భారత్‌లోని తూర్పు ప్రాంతం – ఈశాన్య ప్రాంతం బ్రిటన్ దురాక్రమణకు గురికాలేదు. బర్మాను దురాక్రమించిన తరువాత కూడ బ్రిటన్ తస్కరులు ఈశాన్య ప్రాంతాన్ని గురించి పట్టించుకోలేదు. అందువల్ల ఈశాన్య ప్రాంతంలోని అధికారిక భూభాగం స్వతంత్రంగా ఉండిపోయింది. అరుణాచల్ ప్రాంతం అలా పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు బ్రిటన్‌కు లోబడకుండా స్వతంత్రంగా మనగలిగిం. పంతొమ్మిదవ శతాబ్ది చివరిలో అరుణాచల్‌ప్రదేశ్‌కున్న భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని బ్రిటన్‌వారు గుర్తించారు. అందువల్లనే అరుణాచల్‌లోకి చొరబడ్డారు. స్వతంత్ర టిబెట్ దేశానికి ఆనుకొని మన దేశపు ఈశాన్యం చివరన విస్తరించి ఉన్న అరుణాచల్‌ను స్వాధీనం చేసుకొని టిబెట్‌లోకి చొరబడాలన్నది బ్రిటన్‌వారి వ్యూహం. కానీ అరుణాచల్ ప్రాంతపు వనవాసీ ప్రజలు బ్రిటన్ మూకలను తీవ్రంగా ప్రతిఘటించారు. నిరాయుధులైన వనవాసీలపై బ్రిటన్ సైనికులు జరిపిన బీభత్సకాండ ఐరోపావారి పాశవిక ప్రైశాచిక స్వభావానికి అద్దం పట్టింది. బ్రిటన్ మూకలు గిరిజన గ్రామాలను తగులబెట్టారు. సంతలపై దాడులు చేసి వాణిజ్య విధ్వంసం సృష్టించారు. అరుణాచల్‌ను ఆక్రమించుకొన్న తరువాత బ్రిటన్ దురాక్రమణదారులు 1903లో టిబెట్‌లోకి చొరబడినారు. రాజధాని లాసాకు చొచ్చుకొనిపోయారు. అప్పటి దలైలామా – టిబెట్ అధిపతి’ – చైనావారి సహాయం అర్ధించవలసి వచ్చింది.

ఇలా టిబెట్‌లోకి బ్రిటన్ చొరబడటం చైనావారికి అనుకూలంగా పరిణమించిన విపరిణామం. దాదాపు వెయ్యేళ్లు టిబెట్ పాలకులు చైనాతో నిరంతర యుద్ధం చేశారు. చైనా దురాక్రమణను ప్రతిఘటించారు. ఈ కాల వ్యవధిలో టిబెట్ తన స్వాతంత్య్రాన్ని కోల్పోలేదు. అయితే బ్రిటన్‌వారు మరోవైపున ప్రమాదకరంగా పరిణమించడంతో టిబెట్ చైనాకు, బ్రిటన్ దురాక్రమిత భారత్‌కూ మధ్య సమాన దూరాన్ని పాటించవలసి వచ్చింది. టిబెట్‌లో ఆ తరవాత జరిగిన చైనా దురాక్రమణకు ఇదీ నేపత్యం. టిబెట్‌ను 1959లో పూర్తిగా దురాక్రమించి దిగమింగిన చైనా అప్పటినుంచీ ఇప్పటివరకూ అరుణాచల్ ప్రదేశ్ కూడ తనదేనని అబద్ధపు ప్రచారం చేస్తోంది. 1962లో చైనా మనపై దొంగదెబ్బ తీసింది. ఇలా దొంగదెబ్బ తీయడానికి కారణం ‘భారత్ టిబెట్ సరిహద్దు’ 1959 తరువాత ‘భారత్ చైనా సరిహద్దు’గా మారిపోవడం. చైనా దురాక్రమణ ప్రమాదాన్ని ఊహించని, ఊహించలేని మన ప్రభుత్వం అరుణాచల్‌లోను, టిబెట్‌తో మనకున్న సరిహద్దు పొడవునా కూడ వౌలిక సదుపాయాలను, సైనిక శకటాలు పయనించగల రహదారులను ఏర్పాటుచేయలేకపోయింది. ఫలితంగా 1962లో చైనా అరుణాచల్‌లోకి అస్సాంలోకి చొచ్చుకొని రాగలిగింది. ఈ దురాక్రమణకు కొద్దికాలం ముందు ఏర్పడిన ‘మన సరిహద్దు ప్రాంతపు రహదారుల సంస్థ’ తగిన రవాణా సౌకర్యాలను ఏర్పాటుచేయడంలో విఫలమైంది. ఈ అవినీతి గతుకులలో కూరుకొనిపోవడం ఇప్పుడు చరిత్ర. ‘వేయని’ బాటలను ‘వేసినట్టు’ చిత్రపటాలలో చూపించారట. ఈ చిత్రాలను తీసుకొని చైనా మూకలతో తలపడటానికి వెళ్లిన మన సైనికులు ‘దారులు’ కనిపించలేదు.

చైనా దురాక్రమణ తరువాత కూడ దశాబ్దులపాటు ఈశాన్యంలో రహదారులను, రైలు మార్గాలను నిర్మించడానికి జరిగిన ‘కృషి’ నత్తల నడకతో పోటీపడటం మరో వైఫల్య చరిత్ర. 1962 వరకు బ్రహ్మపుఅత నదిపై వంతెన నిర్మాణం జరగకపోవడం మన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ఘోరమైన నిర్లక్ష్యం బ్రిటన్ దుండగుల వారసత్వం. మన దేశం బ్రిటన్ బీభత్స పాలకులకు మాతృభూమి కాదు. అందువల్ల వారికి ఈ దేశం పట్ల మమకారం లేదు. అందినంత దోచుకొని తమ దేశానికి తరలించుకొని పోవడం మాత్రమే బ్రిటన్ మూకల స్వభావం, కార్యక్రమం, విధానం, లక్ష్యం! అందువల్ల వారు ‘లాభసాటి కాని’ ఈశాన్య క్షేత్రాన్ని మిగిలిన దేశాన్ని రహదారులతోను, ఇనుప మార్గంతోను కలపడానికి అనుమతించలేదు. టిబెట్ దేశం మనకు – చైనాకు మధ్య నెలకొని ఉండేది. ఈ భౌగోళిక వ్యవస్థను శాశ్వతం చేయడానికి వీలుగా 1914లో బ్రిటన్‌వారు టిబెట్ ప్రభత్వుంతో సిమ్లాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా భూటాన్‌నుంచి అరుణాచల్ వరకూ గల మన భూభాగానికీ, స్వతంత్ర టిబెట్ దేశానికి మద్య ‘సరిహద్దు’ వ్యవస్థీకృతమైంది. ఈ సరిహద్దు ‘మెక్‌మోహన్ రేఖ’గా ప్రసిద్ధికెక్కింది. ఎందుకంటే సిమ్లా చర్చలకు ఆధ్వర్యం వహించిన భూటాన్ అధికారి పేరు మెక్ మోహన్! టిబెట్ శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ఉంటుందని భావించిన బ్రిటన్‌వారు ఈ ‘మెక్ మోహన్’ రేఖ భద్రతను పట్టించుకోలేదు. ఎందుకంటే టిబెట్ మన దేశంపై దాడి చేసే ప్రసక్తి లేదు. అరుణాచల్‌లోను మిగిలిన ఈశాన్య ప్రాంతంలోను బ్రిటన్ ‘దొరలు’ రక్షణ సదుపాయాలను కల్పించకపోవడానికి ఇదీ కారణం! తమ సైనిక దళాలు వేగవంతంగా ఒక చోటనుంచి మరోచోటికి తరలి వెళ్లడానికి మాత్రమే బ్రిటన్‌వారు మన దేశంలో రైలు మార్గాలను, వంతెనలను, రహదారులను నిర్మించారు. తమ దేశానికి మన అటవీ వ్యవసాయ ఉత్పత్తులను తరలించుకొని పోవడానికి వీలుగా వారు ఓడరేవులను రైలుమార్గాలలో అనుసంధానం చేశారు.

ఈ నిర్లక్ష్యం వారసత్వంగా గ్రహించిన మన పాలకులు నిద్దురపోవడం వల్లనే ఈశాన్య ప్రాంతం ఆర్థికంగా వెనుకబడింది. చైనా ప్రేరిత, ఐరోపా ప్రేరిట, పాకిస్తాన్ ప్రేరిత వివిధ రకాల బీభత్సకారులకు విద్రోహులకు నిలయమైంది. చైనా టిబెట్ పొడవునా, టిబెట్ చైనా సరిహద్దునుంచి టిమెట్ భారత సరిహద్దు వరకు అధునాతన రైలు మార్గాలను నిర్మించిన తరువాత కూడా దాదాపు దశాబ్ది గడిచింది. ఈ రైలు మార్గం భారత వ్యతిరేక ‘దురాక్రమణ పథం’ గత రెండు దశాబ్దులుగా మాత్రమే ఈ దురాక్రమణ గురించి మన ప్రభుత్వాలకు ధ్యాస పెరిగింది. బ్రహ్మపుత్రపై వంతెనల నిర్మాణం ఈ ధ్యాస పెరగడంలో భాగం. గత నాలుగున్నర ఏళ్లలో బ్రహ్మపుత్ర మూడు ప్రధానమైన వంతెనల నిర్మాణ జరిగింది. మంగళవారం నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతెన నాలుగున్నరేళ్లలో నిర్మితమైన నాలుగవ వంతెన! 2014 నాటికి బ్రహ్మపుత్రపై మూడు వంతెనలు మాత్రమే ఉండేవి. మరో నాలుగు వంతెనలు కూడా నిర్మాణంలో ఉండటం చైనాను భౌతికంగాను, వ్యూహాత్మకంగాను ప్రతిఘటించడంలో భాగం.

[ఆంధ్ర భూమి సౌజన్యంతో]

http://www.andhrabhoomi.net/content/edit-553

The post రక్షణ వారధి . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాళ్ళేస్తూ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాం : భారత సైనికులు, పోలీసులపై రాళ్ళేసినందుకు మాకు నెలకు రూ|| 7000లు చెల్లిస్తారు : కాశ్మీర్ యువత వెల్లడి. .
జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఒక గుర్తు తెలియని ప్రదేశంలో కాశ్మీర్లో పోలీసులు మరియు సైనికులపై రాళ్ళేసే యువకులు ఇండియా టుడే TV అండర్ కవర్ రిపోర్టర్ల ముందు అసలు గుట్టు విప్పారు. అంతే కాకుండా కాశ్మీర్ లోయలో హిజ్బుల్ ముజాహిద్దిన్ కమాండర్ బుర్హాన్ వని మృతి అనంతరం  జరిగిన అల్లర్ల వెనుక అసలు నిజాలను వెల్లడించారు.

జాకీర్ అహ్మద్ భట్, ఫరూక్ అహ్మద్ లోన్, వసిం అహ్మద్ ఖాన్, ముస్తాక్ వీరి, ఇబ్రహీం ఖాన్ తదితర యువకులు సమస్యాత్మక ప్రాంతాల్లో భారత రక్షక దళాలపైన, ప్రభుత్వ వుద్యోగులపైన, ఆస్తులపైన రాళ్ళేసే బృందాలను నడిపిస్తూ వుంటారు.

“రాళ్ళేసే బృందంలోని సభ్యులకు ఒక నెలకు రూ||5000ల నుంచి రూ|| 7000ల వరకు చెల్లిస్తారు. ఒక్కొక్క సారి, బట్టలు, షూస్ కూడా ఇస్తారు” అని భట్ అనే యువకుడు వెల్లడించాడు. 2008 – 2010 మధ్య కాలంలో ఈ రాళ్ళేసే బృందాలు కాశ్మీర్ లోయలో భారీ విధ్వంసాలు సృష్టించాయి. తర్వాతి కాలంలో ప్రభుత్వం పట్ల, అధికారుల పట్ల తమ ఆగ్రహాన్ని ప్రదర్శించటానికి ఇదే వారి ప్రధాన సాధనమైంది.

భట్ గాజు సీసాలు, పెట్రోల్ బాంబులు విసరడంలో సిద్ద హస్తుడు. గత సంవత్సరం బుర్హాన్ వని మృతి చెందిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లలో భట్ కీలక భూమిక పోషించాడు. ఈ విధంగా చెయ్యడానికి తానేమి చింతించటం లేదని కూడా భట్ చెప్పుకొచ్చాడు. “ మేము రక్షణ దళాలపైన, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైన, ఆర్మీ జవాన్లపైన, ఎమ్మేల్యేలపైన, ప్రభుత్వ వాహనాలపైన పలుసార్లు రాళ్ళ దాడులకు తెగబడ్డామని చెప్పుకొచ్చిన ఈ వేర్పాటువాది తమకు నిధులను సమకూరుస్తున్న వారి వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించాడు. “ మేము చావనైనా చస్తాం గాని వాళ్ళ పేర్లను మాత్రం వెల్లడించం. ఎందుకంటే ఇది మా బ్రతుదెరువుకి సంబంధించినది” అని చెప్పుకొచ్చాడు.

బారాముల్లా, సోపూర్, పట్టన్ వంటి చోట్ల రాళ్ళు వేయడానికి ఇతను నియమించబడ్డాడు. “ ఇప్పుడు మనం శుక్రవారాలు మేం ప్రదర్శనలు నిర్వహించే చోటుకు వెళ్తున్నాం” అంటూ ముందుకు కదిలాడు భట్. అతను పెట్రోల్ బాంబులను తయారు చేసి వివిధ ప్రాంతాలకు పంపిస్తాడు, వినియోగిస్తాడు. “ మాకు పెట్రోల్ బాంబుల తయారీకి కావలసిన నిధులు వేరేగా సమకూరుస్తారు” అని చెప్పుకొచ్చాడు భట్. పేలుడు రసాయనాలు, గ్యాస్ నింపిన సీసాలు తయారు చేస్తే ఒక్కొక్క సీసాకు రూ 700 లు చొప్పున చెల్లిస్తారని చెప్పుకొచ్చాడు.  “నేను 50 నుంచి 60 బాంబులు తయారు చెయ్యాల్సివుంటుంది. వాటిల్ని మా ప్రదర్శనల సమయం మధ్యలో వచ్చే వాహనాలపై వేస్తాం.” అని కూడా చెప్పుకొచ్చాడు.

వార్తల ప్రకారం గత సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ మధ్యలో రాళ్లు విసిరే మూకలు, భద్రతా దళాల మధ్య జరిగిన గొడవల్లో దాదాపు  19000 ల మంది ప్రజలు గాయపడ్డారు, 92 మంది చనిపోయారు. 4000 ల మంది రక్షణ సిబ్బంది గాయపడి ఉంటారని అంచనా. ఇద్దరు జవానులు మృతి చెందారు. కాని ఫరూక్ అహ్మద్ లోన్ వంటి యువకులకు రాళ్ళు విసరటమే జీవనాధారం.

“ఇలాంటి అల్లర్లను నడపడం ద్వారా నాకు ఒక రోజుకి  వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఆదాయముంటుంది” అని చెప్తున్నాడు అహ్మద్.

“ మేము 2008 నుంచి ఇలా రాళ్ళు విసిరే పనిలో వున్నాం.” అని చెబుతున్న వసిం అహ్మద్ ఖాన్ రాళ్ళు విసరడం ద్వారా తనకు నెలకు 5000ల నుంచి 6000ల వరకు ఆదాయం లభిస్తుందని చెబుతున్నాడు. వీరీ అనే యువకుడి విషయానికి వస్తే అతను వారాంతాల్లో రోజుకు 7 వందలు, పవిత్ర శుక్రవారాల్లో అయితే వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

“ అయితే మీకు పైకం చెల్లించే వ్యక్తి మీ ఊరి వాడేనా?” అని ప్రశ్నించిన ఇండియా టుడే రిపోర్టర్ కు “అతను నా స్నేహితునికి తెలిసిన వాడు. అప్పుడప్పుడూ వస్తూ ఉంటాడు”. అని మాత్రమే చెప్పాడు తప్ప అతని పేరు వెల్లడించటానికి మాత్రం ఇష్ట పడలేదు. తమకు పైకం చెల్లించే వారి పేర్లను వెల్లడిస్తే భవిష్యత్తులో తాము ఆ పని చెయ్యడానికి వీలుండదన్నది వారి భయం.

తమ రహస్య నేతలు జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాల్లో రాళ్ళు విసిరే కార్యక్రమాన్ని ఇంటర్నెట్ సాయంతో పర్యవేక్షిస్తారని ఇబ్రహీం ఖాన్ అనే యువకుడు చెప్పుకొచ్చాడు. ఏ ప్రాంతంలో దాడులు చెయ్యాలి, దేని లక్ష్యంగా దాడులు చెయ్యాలి, ఎవరు దాడులు చెయ్యాలి అనే వివరాలు తమకు వాట్సప్ గ్రూపుల ద్వారా అందుతాయని ఖాన్ వెల్లడించాడు.  పోలీసులపైన, సైనికులపైన దాడులు చెయ్యమని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని ఈ కార్యకలాపాల ద్వారా నెలకు రూ|| 20,000ల వరకూ సంపాదించే ఖాన్ చెప్పుకొచ్చాడు.

“దాడులలో పాల్గొనడం కోసం నియమించబడిన యువకులకు ఏ మాత్రం చెల్లిస్తారు?” అని ప్రశ్నించిన టీవీ రిపోర్టర్ తో అది వారి వారి శారీరిక దారుఢ్యాన్ని బట్టి ఉంటుందని చెప్పాడు భట్. మంచి దేహ దారుఢ్యం వుండే యువకులకు నెలకు 7000ల నుంచి 7500ల వరకు చెల్లిస్తారని, అదే కొంచెం బలహీనంగా వుండే వారికైతే 5000ల నుంచి 5500ల వరకూ చెల్లిస్తారని పన్నెండేళ్ళ లోపు పిల్లలకైతే రూ||4000లు చెల్లిస్తారని వెల్లడించాడు.

“ మేము 2014లో ఒక బ్రిడ్జిపై ఆగివున్న ఒక వాహనంపై పెట్రోల్ బాంబులు వేశాం. ఇద్దరు వ్యక్తులు మాడి పొయ్యారు”.  అంటూ గర్వంగా చెప్పుకొచ్చాడు భట్. తాను ఇప్పటి వరకు కనీసం 30 నుంచి 35 మంది రక్షణ బలగాలకు చెందిన వ్యక్తులను గాయ పరచి ఉంటానని వీరి చెప్పుకొచ్చాడు. “నేను PSA [పబ్లిక్ సేఫ్టీ యాక్ట్] కింద అరెస్టై ఆర్నెల్లు జైల్లో వుండొచ్చాను.” అని చెప్పుకొచ్చాడు వీరి. 2009 లో ఇదే సెక్షనుపై ఏడాది పాటు జైల్లో గడిపొచ్చిన వసిం అహ్మద్ ఖాన్ తాను పోలేసులపైన, సైనికులపైన, ప్రభుత్వ వాహనాలపైన అనేక సందర్భాలలో దాడులు చేసినట్లు చెప్పుకున్నాడు.

ఏది ఏమైనా భారత్ ను బలహీన పరచే పొరుగు దేశాల కుట్రలలో అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులు సైతం సమిధలుగా మారుతూ ఉండడమే అతి పెద్ద విషాదం. అదే సమయంలో కాశ్మీర్ ప్రజల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, వారిలో మత భావనలు రెచ్చగొట్టి స్వదేశం మీదకే ఉసిగొలిపేందుకు వారిని పావులుగా వాడుకునే పొరుగు దేశం కుట్రలు ఇండియా టుడే పరిశోధనతో మరో సారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఈ నిజాల వెల్లడితోనన్నాకాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలకు స్పష్టత వస్తే అంతే చాలు.

SOURCE: DAILY MAIL.

The post రాళ్ళేస్తూ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాం : భారత సైనికులు, పోలీసులపై రాళ్ళేసినందుకు మాకు నెలకు రూ|| 7000లు చెల్లిస్తారు : కాశ్మీర్ యువత వెల్లడి. . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బర్మాలో హిందువులు, బౌద్ధులపై ఊచకోత ఒక ప్రచారం కాని విషాదం .
బర్మాలోని రఖాయిన్ – అరకాన్ – రాష్ట్రంలో హిందువులను ‘రోహింగియా’ జిహాదీ బీభత్సకారులు ఊచకోత కోసిన సమాచారం బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలుస్తోంది. ‘రఖాయిన్’ ప్రాంతం నుండి ఇతర దేశాలకు వెల్లువెత్తుతున్న ‘రోహింగియా’లను గురించి జరుగుతున్న ప్రచార ఆర్భాటం అంతా ఇంతా కాదు. ‘‘రోహింగియాలను బర్మా ప్రభుత్వం వెళ్లగొడుతోందన్నది’’ అంతర్జా తీయంగా జరుగుతున్న ఆర్భాటం! కానీ ‘రోహింగియా’ టెర్రరిస్టులు ఆగస్టు 25వ తేదీ నుంచి అనేక రోజులపాటు బౌద్ధులపై, హిందువులపై జరిపిన బీభత్సకాండ గురించి ప్రచారం లేదు. బర్మా – మ్యాన్‌మార్ – నుంచి ‘రఖాయిన్’ ప్రాంతాన్ని విడగొట్టడానికి ‘రోహింగియా’ జిహాదీలు ఏడు దశాబ్దాలకుపై కుట్ర చేస్తున్నారు. బర్మాలో బౌద్ధమతస్థులు అత్యధిక సంఖ్యాకులు. బర్మాలోని అల్పసంఖ్యాక ముస్లింలపై బర్మాలోని ఇతర ప్రాంతంలో దాడులు జరగడం లేదు, బౌద్ధులు ఇస్లాం మతస్థులను తరిమివేయడం లేదు. ‘రఖాయిన్’ ప్రాంతంలో మాత్రం ‘రోహింగియా ముస్లింలు’ అత్యధిక సంఖ్యాకులు. రఖాయిన్ ప్రాంతంలోని అల్పసంఖ్యాకులైన హిందువులపై, బౌద్ధులపై ‘రోహింగియా’ జిహాదీ టెర్రరిస్టులు దశాబ్దాలుగా హత్యాకాండ జరుపుతున్నారు.. అత్యాచారాలు జరుపుతున్నారు. ఈ హత్యాకాండ ఫలితంగా ‘రఖాయిన్’ ప్రాంతంలోని బౌద్ధులు, హిందువులు బర్మాలోని ఇతర ప్రాంతాలకు పారిపోవాలన్నది ‘రోహింగియా’ బీభత్సకారుల పథకం! అలా అల్పసంఖ్య మతస్థుల నిర్మూలన జరిగినట్టయితే ‘రఖాయిన్’ ప్రాంతంలో ఇస్లాం మతస్థులు మాత్రమే మిగిలి ఉంటారు. అలా వంద శాతం ఇస్లాం మతస్థు లుంటే ‘రఖాయిన్’ ప్రాంతాన్ని బర్మానుంచి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయా లన్నది ‘రోహింగియా’ టెర్రరిస్టుల దీర్ఘకాల పథకం… ఈ ‘పథకం’లో భాగంగానే ఇటీవలి కాలంలో హిందువులపై, బౌద్ధులపై ‘రఖాయిన్’లో భయంకరమైన, పైశాచికమైన దాడులు మళ్లీ మొదలయ్యాయి! అరకాన్ రోహింగియా సాల్వేషన్ ఆర్మీ – అరకాన్ రోహింగియా విముక్తి సాధక సేన – ఏఆర్‌ఎన్‌ఎ – అన్న కొత్త జిహాదీ ‘ముఠా’ ఆగస్టు 25 నుంచి పెద్ద ఎత్తున ఈ పైశాచిక కాండ ప్రారం భించింది. బౌద్ధులను, హిందువులను పెద్ద సంఖ్యలో హత్యచేసి మృతదేహాలను గోతులు తీసి పూడ్చి పెట్టడం ‘ఏఆర్‌ఎన్‌ఏ’ బీభత్స వ్యూహంలో భాగం! ఇలా ఊచకోతకు గురైన హిందువుల మృతదేహాలను సైనికులు కనుగొంటున్నారు…

సెప్టెంబర్ 24వ తేదీన ‘రఖాయిన్’ ప్రాంతంలోని ‘వామాక్ష’ అన్న గ్రామంలో ఒకేచోట పూడ్చివేతకు గురైన ఇరవై ఎనిమిది హిందూ మృతదేహాలను బర్మా ప్రభుత్వ భద్రతా దళాల వారు కనుగొన్నారు. బౌద్ధులు, హిందువులు అధిక సంఖ్యలో ఉండిన ఈ గ్రామంపై ‘ఏఆర్‌ఎస్‌ఏ’ బీభత్స మూకలు దాడిచేసి అనేకమందిని హతమార్చారు. ఈ హత్యాకాండ తరువాత మిగిలిన బౌద్ధులు, హిందువులు గ్రామాన్ని ఖాళీచేసి పారిపోవడంతో గ్రామం నిర్జనమై పోయిందట! ఈ సమాచారం గురించి అంతర్జాతీ యంగా ప్రచారం లేదు, ‘ఐక్యరాజ్యసమితి’ వారికి ఈ అల్పసంఖ్య ప్రజలు హతమారిపోవడం పట్టలేదు. రెండురోజుల తరువాత ఇదే గ్రామం సమీపంలో మరో పదిహేడు మంది హిందువుల మృతదేహాలను బర్మా సైనికులు గుర్తించారు! ‘ఏఆర్‌ఎన్‌ఎ’ బీభత్స మూకల దాడికి ఇంకా ఎందరు హిందువులు హతమయ్యారో తెలియదని బర్మా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ‘వామాక్షి’ గ్రామం ఉన్న ‘క్షామీ హంగసా’ జిల్లా నుండి దాదాపు ముప్పయి ఐదువేల మంది బౌద్ధులు, హిందువులు ఆగస్టు 25వ తేదీనాటి దాడుల తరువాత పారిపోయినట్టు బర్మా సైనిక అధికారులు వెల్లడించారు! ఈ ప్రాంతంలోని గ్రామాలలో ‘ఏఆర్‌ఎస్‌ఏ’ హంతకులు హిందువులను పెట్టిన చిత్రహింసగురించి విచిత్ర విషాద కథనాలు ఆలస్యంగా ప్రచారవౌతున్నాయి. హిందువులను ఇళ్ల నుంచి బయటికి లాగి చేతులను వెనక్కి విరిచికట్టి కత్తులతో కుమ్మి చంపిన కథనాలు హృదయ విదారక స్థితికి కొన్ని ఉదాహరణలు మాత్రమే!!

ఇదంతా బర్మాలోకి చొరబడిన ‘అఫ్ఘానీ అల్‌ఖాయిదా’ మూకలు స్థానిక ‘జిహాదీ’లతో జట్టు కట్టిన తరువాత ప్రబలిన బీభత్సకాంత. వివిధమైన పేర్లతో చెలామణి అవుతున్న బర్మాలోని జిహాదీ ముఠాల వారు అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబడిన జిహాదీలు ‘రఖాయిన్’ ప్రాంతంలో అనుసంధానమై ఉన్నారు. ఈ అనుసంధానాన్ని సాధించింది పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఐఎస్‌ఐ’! పాకిస్తాన్ ‘నిఘా’ విభాగంగా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’ – ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ – నిజానికి బీభత్స కలాపాల సూత్రధారి. మన దేశంలోని జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్ లోయ ప్రాంతంలో క్రీస్తుశకం 1947 నాటికి జనాభాలో ఇరవై ఏడుశాతం హిందువులు! కానీ దేశ విభజన జరిగిన తరువాత 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌లోకి చొరబడిన పాకిస్తానీ జిహాదీలు లోయ ప్రాంతంలోను జమ్మూ ప్రాంతంలోను ఉండిన వేల హిందువులను ఊచకోత కోశారు! నిరంతరం కొనసాగిన ఈ ‘జిహాదీ’ బీభత్సకాండ ఫలితంగా 1989నాటి ‘లోయ’ ప్రాంతంలోని హిందువుల సంఖ్య నాలుగు శాతానికి దిగజారింది. అత్యల్ప సంఖ్యలోని ఈ అవశేష హిందువులను కూడా పాకిస్తాన్ సమర్థక జిహాదీ ఉగ్రవాదులు 1989, 1990 సంవత్సరాలలో నిర్మూలించారు. వేలాది హిందువులు ‘లోయ’ను వదలి, తరతరాలుగా తాము నివసించిన జమ్మూ స్థలాలను వదలి ప్రాణావశిస్టులై జమ్మూకు దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోయి వచ్చేశారు! శతాబ్దాలకు పూర్వం కశ్మీర్ లోయ ప్రాంతంలో వంద శాతం ఉండిన హిందువులు నేడు అక్కడ ‘సున్నా శాతం’ కావడానికి కారణం పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ హత్యాకాండ! ఇదే పథకాన్ని బర్మాలోని ‘అరవాన్’ లేదా ‘రఖాయిన్’ ప్రాంతంలో ‘రోహింగియా’ జిహాదీలు దశాబ్దాలుగా అమలు జరుపుతున్నారు.

కశ్మీర్ ‘లోయ’లో ఈ జిహాదీల కుట్ర సఫలమైంది. కానీ బర్మాలోని ‘రఖాయిన్’లో ఈ కుట్ర విఫలమైంది! రెండు దేశాలలోను ‘కుట్ర’ స్వభావంలో సమానత్వం ఉంది. ‘కశ్మీర్’లో హిందువులను నిర్మూలించడం ద్వారా కశ్మీర్‌ను మన దేశం నుండి విడగొట్టాలన్నది పాకిస్తాన్ ప్రేరిత షడ్యంత్రం! ‘రఖాయిన్’లో బౌద్ధులను, హిందువులను నిర్మూలించడం ద్వారా ఆ ప్రాంతాన్ని బర్మా నుండి విడగొట్టాలన్నది ‘రోహింగియా’ జిహాదీల కుట్ర! ‘లోయ’ ప్రాంతంలో జిహాదీలను మన ప్రభుత్వాలు అణచివేయలేక పోయాయి. ‘రఖాయిన్’లో జిహాదీలను బర్మా ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది… ఇదీ అంతరం!

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

The post బర్మాలో హిందువులు, బౌద్ధులపై ఊచకోత ఒక ప్రచారం కాని విషాదం . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Thousands years old Sivalingam in Swarnala Tank, Nellore – Ruling party leaders promised to take it out and build a temple – Muslims are hesitating. .
Thousands years old Sivalingam  in Swarnala Tank, Nellore – Ruling party leaders promised to take it out and build a temple – Hesitating as Muslims resent – Hindus unhappy – Religious conflict ignited – Hindu organinsations digging history – facts unearthed – Hindu organisations claim they are real facts – Let’s know what they are …

400 years ago in 1751 12 Muslims set out from Mecca and Sowdy to spread Islam. They continued their expedition converting those who yielded to them, killing those who opposed, molesting and murdering women and destroying temples. When they reached the Gandavaram tank in Kodavaluru Mandal of Nellore district, people called Arundhatheeyulu of Nellore region obstructed them. A fierce fight took place and all the 12 Muslim propagators were beheaded.

At that time Nellore region was under the rule of Nawabs and their cruel and wicked acts were on rise. With a view to check their arrogance,  teach them a lesson and instil confidence in Hindus, their torsos were placed on their horses and drove the horses away.  The horses threw the torsos at the Dargamitta tank in Nellore. The torsos mixed with soil there and their tombs were constructed on that spot.

As Karnataka was under the rule of Hyder Ali at that time and Nellore was under nawab’s rule, they hailed the Muslim propagators as Martyrs,  named them “Bara Shaheed” and built their tombs there.  In the passage of time. that fact was concealed. The Hindus too forgot the  fact.  Now many people irrespective of their castes and religion, are participating in the celebration which is known as “Rottela Pandaga” at Swarnala Tank every year.

This tank was actually got dug by Kakatiya Ganapthi Deva in the 11th century. As per the traditions of those days, a Sivalingam was kept at the middle of the tank. Most of the residents of Nellore know that the Sivalingam appears whenever water levels recede in summer season.

Coming to the present time, 13 years ago when Late Y.S.Rajasekhara Reddy was the Chief Minister of Andhra Pradesh, Congress leader late Anam Vivekanada Reddy proposed that the Swarnala Cheruvu should be developed as a tourist spot. With the help of the funds released by the government Bara Shaheed Darga and swarnala Cheruvu were developed and beautified to some extent, even though not as expected by local leaders. Since then there has been a proposal to lay necklace road from Irukalala Parameswari temple to Bara Shaheed Darga.  But that is not materialised due to unknown reasons.

Recently a TDP leader and NUDA chairman Kotamreddy Srinivasula Reddy went to Swarnala Cheruvu with his men and announced that the government had sanctioned Rs. 20 crores for the construction of a temple for Sivalingam and necklace road. He said the work would start very soon. He promised that they would take out the Sivalingam situated in the Cheruvu and construct a temple for it.

Immediately the local Muslims started agitations saying the Swarnala Chruvu belongs to them and no construction relating to other religion can be taken up where Hindus and Muslims celebrate Rottela Pandaga every year. They claimed that the tank exclusively belongs to them and took up a rally on 20/11/2018. In addition to that thousands of Muslims performed Namaz at the tank on 23/11/2018, Firday and erected their flags under the leadership of a minority leader, Shafi. They declared that they would not vote for the parties which act against their interests. Next moment, the ruling party leaders Kotamreddy Srinivasulu Reddy and the minister Narayana assured through a press release that no construction would be taken up against the wishes of the Muslims.

At the same time, a VHP leader Menta Rammohan and the BJP leader Midathala Ramesh, through a press release asserted  that the ruling party leaders made an announcement about the construction of a temple without any Hindus asking them and now they are going back yielding to the threats of Muslims. They said it is nothing but insulting the Hindus. They announced that they would build Hindu vote bank and would support only those who take care of the interests of Hindus. They also said that when Kakatiya Ganapthi Deva dug the tank, he placed a Sivalangam in the middle of the tank according to the traditions of those days and it has been there all these years. 400 years ago there were a Jain Mandir and a Hindu Temple at the place where Bara Shaheed Darga is situated now. They said these details were mentioned in the British gazette of 1905 and are found even in the books relating to the History of Nellore available in Chennai Central Library. Proofs for this claim are available with Nellore Archaeology department, they explained. They alleged that as Mayor Azeez knows all these details, he got the funds released by the government and taking up permanent constructions to avoid problems from the other side.

In this backdrop, the Hindus of Nellore town say that Nellore is known for its religious harmony and Rottela Pandaga became popular only because the  Hindus mingle with Muslims and take part in it more numbers. As such, they demand that the Muslims should not object the construction of a Hindu Temple.  They said it would disturb the harmony existing among the people for decades. They appeal to the Muslims that they should cooperate with the Hindus with a broader outlook for the construction of the Temple.

ARTICLE PREPARED IN TELUGU BY : SYAM PRASAD KORSIPATI.

ARTICLE TRANSLATED FROM TELUGU TO ENGLISH BY SESHA SAI DEEVI.

The post Thousands years old Sivalingam in Swarnala Tank, Nellore – Ruling party leaders promised to take it out and build a temple – Muslims are hesitating. . appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.