FCRA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆ ట్రస్టులకు ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రెండు ట్రస్టులకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు చేసింది. ఎఫ్.సీ.ఆర్.ఏ. అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్.. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ తప్పనిసరి. సోనియా నేతృత్వంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు ఆర్థికపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు సంస్థలపై ఎఫ్.సీ.ఆర్.ఏ. ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చెలామణీ తదితర అక్రమాలను గుర్తించామని.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు అందించిన వారి జాబితాలో చైనా కూడా ఉందని అధికారులు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ ట్రస్టులకు ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విదేశీ నిధులు సేకరిస్తూ మతమార్పిడుల‌కు పాల్పడుతున్న సంస్థలపై కేసులు!
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయించడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ 10 ప్రభుత్వేతర సంస్థలుపై కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒమిడియార్ సంస్థ కూడా నిందితుల జాబితాలో ఉంది. విదేశీ విరాళాలను ఎన్‌జీవోలు స్వీకరించాలంటే ఎఫ్‌సీఆర్ఏ ప్రకారం అనుమతి తప్పనిసరి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఫారినర్స్ డివిజన్‌లో ఎఫ్‌సీఆర్ఏ ఓ భాగం. ఈ చట్టం ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్, వార్షిక రిటర్నుల పరిశీలన వంటి కార్యకలాపాలు ఈ యూనిట్‌లో జరుగుతాయి.

ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సుల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్టు నమోదైన ప్రథమ సమాచార నివేదికలో ఒమిడియార్‌తోపాటు, గంగ ఆర్థోపెడిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తరపున చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వాగీశ్, ది సోషల్ ప్రాజెక్ట్ అనే ఎన్‌జీవోకు చెందిన రాబిన్ దేవదాస్, శ్రీజన్ ఫౌండేషన్ ప్రతినిధి స్వపన్ మన్నా, ఐరిస్ మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీకి చెందిన చినప్పన్ పిచ్చాయ్ పిళ్ళయ్, సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు చెందిన రామస్వామి రంగనాథన్, క్రిస్టియన్ లైఫ్ సెంటర్ మినిస్ట్రీస్ అడ్మినిస్ట్రేటర్ ఆల్‌ఫ్రెడ్ మొహంతి, హార్వెస్ట్ ఇండియా ఎన్జీవో ప్రతినిధి కత్తెర సురేశ్ కుమార్, రిఫార్మ్‌డ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ నార్త్ ఈస్ట్ ఇండియా జనరల్ సెక్రటరీ లుంగవిరౌల్ ఖవ్బంగ్, నయా రోషిణి ఫౌండేషన్ ప్రెసిడెంట్ బిష్ణు మౌర్, ఒమిడియార్ ఎన్జీవో ప్రమోటర్స్ ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విదేశీ నిధులు సేకరిస్తూ మతమార్పిడుల‌కు పాల్పడుతున్న సంస్థలపై కేసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రిస్టియన్ ఎన్జీవోల లైసెన్సుల గడువు పొడిగింపుకు నో అన్న సుప్రీం
FCRA లైసెన్స్ ‌లను కొనసాగించాలని కోరుతూ 6,000 క్రైస్తవ NGO లు కలసి చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం (25/1/2022) తిరస్కరించింది. కటాఫ్ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న 11,594 NGOల FCRA రిజిస్ట్రేషన్లు పొడిగించబడ్డాయంటూ సొలిసిటర్ జనరల్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన కోర్టు ఆ మేరకు నిర్ణయాన్ని వెలువరించింది. 30.09.2021 నాటికి చెల్లుబాటయ్యే సంస్థలన్నిటిపైనా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిషేధం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద 6000 పైగా ఎన్జీవోల లైసెన్సుల గడువు ముగిసిపోయింది. ఆ గడువును పొడిగించాలని కోరుతూ ఆ 6000 NGOలు సుప్రీంను ఆశ్రయించాయి.

పిటిషనర్-NGO తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, NGOలు వచ్చే రెండు వారాల్లోపు దరఖాస్తు చేసుకుంటే వారి FCRA లైసెన్సులను పొడిగించేలా ప్రత్యామ్నాయ ఆదేశాల కోసం కోర్టును  అభ్యర్ధించారు.

అయితే ఆ విధంగా మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అవకాశముంటే పిటిషనర్ అధికారులను అభ్యర్ధించుకోవచ్చని, అధికారులు కూడా పిటిషనర్ల అభ్యర్ధనను పరిశీలించవచ్చని బెంచ్ పేర్కొంది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల ఆధారంగా, కటాఫ్ తేదీలోపు లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న 11,594 NGOల FCRA లైసెన్స్‌లను పొడిగించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.

“భారత్ లోని NGOల లైసెన్సుల గడువు పొడిగించకపోతే హూస్టన్ లోని సంస్థ ఆందోళన చెందడమేంటి?” అని పిటిషన్ వేసిన సంస్థ యొక్క కేంద్రాన్ని, దాని ఉద్దేశ్యాలను కూడా సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. “ఈ PIL వేయడం వెనుక వారి ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియదు. ఎక్కడో ఏదో తేడా ఉంది” అని సొలిసిటర్ జనరల్ అన్నారు.

6000 సంస్థల లైసెన్సులను భారత ప్రభుత్వం నిలిపివేసినట్లు గుర్తించినందునే పిటిషనర్ కోర్టు ముందుకు వచ్చినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది హెగ్డే కోర్టుకు వివరించారు. ఇటీవల సవరింపబడిన FCRA చట్టం ప్రకారం తాము లైసెన్సు గడువును పెంచడానికి అనుమతులు కోరడానికి సదరు NGOలు అన్నీ విముఖత చూపుతున్న విషయాన్ని కూడా కోర్టు గుర్తించింది.

బెంచ్ ఈ క్రింది ఉత్తర్వులను జారీ చేసింది:

“మేము NGOలు కోరుతున్న మధ్యంతర ఉపశమనంపై ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలూ విన్నాము. పిటిషనర్లు 30.09.2021 నాటికి FCRA లైసెన్స్ చెల్లుబాటు అయ్యే అన్ని సంస్థల లైసెన్సులనూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలు ఇవ్వవలసినదిగా కోర్టును కోరారు. వారి వాదనకు ప్రతిస్పందనగా, కట్-ఆఫ్ సమయం లోపు దరఖాస్తు చేసుకున్న 11, 594 NGOల లైసెన్సు గడువును పొడిగించామని తెలుపుతూ సదరు వివరాలను సొలిసిటర్ జనరల్ కోర్టుకు సమర్పించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాదని మేము మీరు కోరినట్లుగా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులనూ వెలువరించాలని భావించడం లేదు. అవకాశముంటే పిటిషనర్లు అధికారుల ముందు ఒక రిప్రజెంటేషన్‌ను దాఖలు చేయవచ్చు. తమ విచక్షణాధికారం మేరకు అధికారులు ఆ విజ్ఞప్తులను పరిశీలించవచ్చు.

FCRA సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఈ రిట్ పిటిషన్ మళ్ళీ పరిశీలనకు వస్తుంది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రధాన కార్యాలయం వుండి, భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాలున్న గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే సంస్థ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రముఖ సువార్తికుడు డాక్టర్ కె.ఎ. పాల్ దాని వ్యవస్థాపకుడు.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, (FCRA) 2010లోని సెక్షన్ 50 ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను వినియోగించుకునేలా ఆదేశించాలని, కోవిడ్-19 నిబంధనలు కొనసాగినంత వరకు విపత్తు నిర్వహణ చట్టం కింద అవసరమైన అత్యవసర సేవలకుగానూ అన్ని ప్రభుత్వేతర సంస్థలను (NGO) సవరించిన FCRA చట్టం పరిధి నుంచి మినహాయించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.

గతంలో ఈ NGOలు చేసిన పని మిలియన్ల మంది భారతీయులకు సహాయపడిందని, ఇలా వేలాది NGOల FCRA రిజిస్ట్రేషన్ ఆకస్మిక, ఏకపక్ష రద్దు వలన ఆ సంస్థలు, వారి కార్మికులు వారి సేవలను పొందే మిలియన్ల భారతీయుల హక్కులకు ఇది భంగం కలిగిస్తుందని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎన్జీవోల పాత్రను కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మరియు ప్రధానమంత్రి కార్యాలయాలు స్వయంగా గుర్తించాయని పిటిషన్‌లో పేర్కొంది. అయినప్పటికీ పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Source : LiveLaw.in

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రిస్టియన్ ఎన్జీవోల లైసెన్సుల గడువు పొడిగింపుకు నో అన్న సుప్రీం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు FCRA లైసెన్స్ కేటాయించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం… కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు
దేశంలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందించే పేరిట పనిచేస్తున్న “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థకు  కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాలు పొందేందుకు వీలుగా FCRA లైసెన్స్ కల్పించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది.

‘ఎల్లలు లేని వైద్యులు’గా తమను తాము అభివర్ణించుకునే  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థ అధికంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లోని సరిహద్దులు, దట్టమైన గిరిజన ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన విదేశీ డాక్టర్లు సైతం సుదూర గిరిజన ప్రాంతాల్లోకి అలవోకగా వెళ్లి సేవలందిస్తారనే పేరుంది. అయితే ఈ సంస్థ మావోయిస్టులకు వైద్య సహాయ, సదుపాయాలు కల్పిస్తోందని గతంలో దంతెవాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక ఎంకౌంటర్ అనంతరం పోలీసులు మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్న డంపులో ఈ సంస్థకు చెందిన వైద్య పరికరాలు, మందులు లభ్యమయ్యాయి. వీటి ఫలితంగా ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం 2007లో  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్”  కార్యకలాపాలపై నిషేధం విధించింది.

అంతేకాకుండా  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్”కు చెందిన విదేశీ డాక్టర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం భార‌త దేశ వీసా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం క్రిందకు వస్తుందని, ఇటువంటి వివాదాస్పద సంస్థకు FCRA లైసెన్స్ మంజూరు చేస్తే అది దుష్పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో పునరాలోచించి, లైసెన్సును రద్దు చేయాలనీ ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ కేంద్ర హోం మంత్రిని కోరింది.

We raise our serious objections over providing FCRA license to @MSF_Ind.

Requested Shri @AmitShah and @HMOIndia to consider ground reports of public officials in this regard before taking such steps.

Report by: @TheCommuneMaghttps://t.co/PPGN3GmoN4

— SC ST RIGHTS FORUM (@SCSTForum) July 3, 2021

Source : VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు FCRA లైసెన్స్ కేటాయించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం… కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైద్య శాస్త్ర విజయాలను క్రీస్తు అద్భుతాలుగా ప్రచారం చేస్తున్న క్రిస్టియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు
క్రైస్తవ డాక్టర్లు మరియు ఆరోగ్య కార్యకర్తల సంస్థ క్రిస్టియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMAI) విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనలను ఉల్లంఘించిందని, అనైతిక చర్యలకు పాల్పడిందని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ (LRO) వెల్లడించింది. భారత్ లో మత మార్పిడులకు పాల్పడడం కోసం FCRA నిబంధనలకు విరుద్ధంగా CMAI, 83.95 కోట్ల విదేశీ నిధులను సేకరించినట్లుగా CMAI పై అభియోగాలున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అధ్యక్షుడు డాక్టర్ జాన్ రోజ్ ఆస్టిన్ జై లాల్ CMAI ట్రస్ట్ సభ్యులలో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన స్థాయిని, అధికారాన్ని మతమార్పిడుల కోసం వినియోగిస్తున్నాడంటూ ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఇది కూడా ఒక బలమైన సాక్ష్యంగా నిలచింది.

తమ మత మార్పిడి ప్రయత్నాలను, కృషిని బహిరంగంగా ప్రకటించే డాక్టర్ జయ లాల్ మరియు CMAI కి చెందిన ఆరోగ్య కార్యకర్తలు మరియు ఇతర క్రైస్తవ మతపెద్దల ప్రకటనలకు CMAI తన ఫేస్బుక్ పేజీ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఉంది. “మనమందరం కలిసి నడవాలి. గొప్ప విజయాలు సాధించగలిగేలా పురోగతిని పొందుతాము. ఒకే హృదయము, ఓకే బుద్ధితో పనిచేసి ఏసుక్రీస్తును ఆరోగ్య పరిరక్షకునిగా ఆవిష్కరిస్తాము.” అని డాక్టర్ అరుళ్ అంకెటెల్ CMAI జాతీయ సభలలో ప్రకటించారు. ఈ సభలలో భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన క్రైస్తవ డాక్టర్లు పాల్గొన్నారు.

#EXPOSE Christian Medical Association Of India got Rs 83.95 Cr for blatant evangelization misusing medical science behind façade of social service.
Dr Jayalal @jayalal10 head of @IMAIndiaOrg was its trustee was silent when CMAI openly spread #Church superstitions #FCRAViolation++ pic.twitter.com/Cd4aA3XdzE

— Legal Rights Observatory- LRO (@LegalLro) May 29, 2021

ఇందులో ఆందోళనకరమైన విషయం ఏంటంటే CMAI ఆసుపత్రి బెడ్ మీద ఉన్న రోగులపై ఉన్నట్టుండి ప్రేమ చూపించాలని చెబుతూ ఉండడం. వైద్య శాస్త్రాన్ని మత మార్పిడులకు తగినట్లుగా వాడుకోవడానికి అవసరమైన శిక్షణను CMAI కొంతమంది డాక్టర్లకు ఇస్తుంది. CMAI మత స్వేచ్ఛను తన మతమార్పడి కార్యకలాపాలకు ఉపయోగించుకుంటోంది. తన అనుబంధ సంస్థల సభ్యులకు CMAI హోం మంత్రిత్వ శాఖచే అమలు చేయబడుతున్న FCRA చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని వెబినార్ ద్వారా నిర్వహించింది. అందులో FCRAను ఉల్లంఘించే మెళకువల గురించి కూడా చర్చించడం విశేషం.

మొత్తానికి CMAI తానందుకుంటున్న విదేశీ నిధులను తన మతమార్పిడి కార్యకలాపాలకు వాడుతున్నట్లుగా వెల్లడయింది. అలా విదేశాల నుంచి నిధులను రాబట్టుకోవడం కోసం CMAI, FCRA నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించినట్లు కూడా దర్యాప్తులో తేలింది.

ఆధునిక వైద్య శాస్త్రం ద్వారా లభించిన ఫలితాలను క్రీస్తు అద్భుతాలుగా ప్రచారం చేస్తూ మత మార్పిడులకు పాల్పడుతున్న CMAI కి వెంటనే FCRA రిజిస్ట్రేషన్ ను తొలగించవలసిందిగా లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ (LRO) హోం మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది.

Source : Organiser.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైద్య శాస్త్ర విజయాలను క్రీస్తు అద్భుతాలుగా ప్రచారం చేస్తున్న క్రిస్టియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ పాస్టరు – మోసంలో మాస్టరు – పేదలే వారి లక్ష్యం సారూ….
తమిళనాడులోని వెల్లూరులో ఒక పాస్టర్ పిల్లల చదువుల నిమిత్తం స్కాలర్‌షిప్ ‌లు ఇప్పిస్తానని చెప్పి అనేకమంది రోజువారీ కూలీలను మోసం చేశాడు. రోజువారీ కూలీ కుమార్ కు, తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అవసరమైంది. అతను తన పిల్లలకు స్కాలర్‌షిప్ అందించగల ట్రస్ట్ గురించి విన్నాడు. దాంతో అతను ఆ ట్రస్ట్ నడుపుతున్న విక్టర్ జేసుదాస్ ను సంప్రదించాడు. కుమార్ పిల్లలకు స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తానని విక్టర్ వాగ్దానం చేశాడు. అయితే దీనికి ₹ 20,000 ఖర్చవుతుందని చెప్పాడు. అందుకు సమ్మతించిన కుమార్ ఆ డబ్బు సమకూర్చి ఇచ్చాడు. అలాగే మరికొందరు రోజువారీ కూలీలను కూడా విక్టర్ దగ్గరకు తీసుకువచ్చాడు.

అందరూ విక్టర్ ‌కి ₹ 20,000 చెల్లించారు. కానీ ఎన్ని రోజులు గడచినా అతని నుండి స్కాలర్‌షిప్ డబ్బు గురించి ఎలాంటి సమాచారం రాలేదు. కుమార్ దాని గురించి ఆరా తీసినప్పుడు విక్టర్ అతనికి చెక్ ఇచ్చాడు. కానీ ఆ చెక్ బౌన్స్ అయ్యింది. కుమార్ మరలా డబ్బు అడగడానికి విక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అయితే, విక్టర్, కుమార్ ‌ని బెదిరించాడు. అభ్యంతరకర పదజాలంతో దూషించాడు.

దాంతో కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి, విక్టర్ ‌పై చర్యలు తీసుకోవలసిందిగా డిఐజిని అభ్యర్ధించారు. పోలీసులు విక్టర్ పై దర్యాప్తు ప్రారంభించినప్పుడు విక్టర్ ద్వారా మోసపోయిన వారి అనేక సంఘటనల గురించి వారికి తెలిసింది.

అతను తన ట్రస్ట్ ద్వారా పిల్లలకు స్కాలర్‌షిప్పు‌లు, వృద్ధులకు పెన్షన్ లు, ఇళ్లకు ఋణాలు, భూమి, చిన్న వ్యాపారాలు, మహిళలకు టైలరింగ్ యంత్రాలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు మొదలైనవి ఇస్తానని ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి వాగ్దానం చేస్తాడు. అతను కుమార్ దగ్గర్నుంచి తీసుకున్నట్లుగానే చాలా మంది నుండి డబ్బు వసూలు చేశాడు. ఆ విధంగా దాదాపు 2.27 లక్షల వరకూ మోసం చేసినట్లు చెబుతున్నారు.

ఇలాంటి సందేహాస్పద పద్ధతుల ద్వారా విదేశీ నిధుల నుండి సంపాదించాలనే ఆశతో FCRA ఖాతా తెరిచే మత ప్రచారకులు అనేక మంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు కూడా గణనీయంగానే ఉన్నాయి. గత ఏడాది అదే జిల్లాలో మరో పాస్టర్ యోబు శరవణన్ కూడా ఇలాంటి దుశ్చర్యకే పాల్పడగా అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అతను కూడా ఒక ట్రస్ట్ నడుపుతూ, విదేశాల నుండి తనకు లభించే డబ్బు ద్వారా ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికి ఇళ్ళు నిర్మిస్తానని ప్రచారం చేశాడు. ఈ విషయంలో, అతను కొంతమంది ద్వారా 4 లక్షలను అందుకున్నాడు. అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇస్తానన్న డబ్బు అడిగినవారికి చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులన్నీ బౌన్సయ్యాయి.

అలాగే మరో వ్యక్తి, కేరళకు చెందిన షిబు నాయర్, ఒక పాస్టర్ వలె నటించి, 2017 లో ఓఖీ తుఫాను సమయంలో ప్రభావితమైన మత్స్యకారుల కోసం ఇళ్ళు నిర్మిస్తానని చెప్పి ప్రజల నుండి డబ్బు వసూలు చేశాడు. అలాగే అనాథాశ్రమాన్ని కూడా నిర్మిస్తానాని చెప్పి లక్షలాది రూపాయల డబ్బు వసూలు చేశాడు.

2017 లో ఇదే విధమైన సంఘటనలో, మైఖేల్ అనే పాస్టర్ తన స్నేహితులు రవి స్టాన్లీ మరియు పిచముత్తులతో కలిసి ‘వివేహం’ అనే ఎన్జీఓను నడుపుతూ ఇళ్ళు నిర్మిస్తానని వాగ్దానం చేసి 250 మంది నుండి 50,000 చొప్పున 1 కోటి రూపాయలకు మించి వసూలు చేశారు. ప్రారంభంలో, అతను 20 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష ఇచ్చాడు. ఇంకా డబ్బు వస్తుందనే ఆశతో వారు ఇళ్ళ నిర్మాణానికి పునాదులు కూడా వేసుకున్నారు. అయితే పాస్టర్ ఎఫ్‌సిఆర్‌ఎ డబ్బు లేదు, ఇసుక ధర పెరిగింది వంటి కారణాలను పేర్కొంటూ ఎక్కువ డబ్బు ఇవ్వలేదు.

స్థానిక దళిత పార్టీ VCK నేతృత్వంలో బాధిత ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అతని ఆధ్వర్యంలో నడిచే అపోస్టలిక్ గాస్పెల్ మిషన్ చర్చికి తాళం వేశారు. అనంతరం అఖిల భారత మైనారిటీ ఫోరం నిర్వహించిన శాంతి సమావేశం గందరగోళం నెలకొనడంతో సదరు పాస్టరు, అతని సహచరులు పరారీలో ఉన్నారు.

అనేక మిషనరీ సంస్థలు సమాజంలోని బలహీన వర్గాలను మత మార్పిడి కోసం ఆకర్షించడానికి మరియు డబ్బు సంపాదించడానికి మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇటువంటి వాగ్దానాలను ఉపయోగిస్తాయి. ఉత్తర భారతదేశంలో, ప్రధానంగా పంజాబ్ ‌లో చాలా మంది మిషనరీలు ప్రజలను మార్చడానికి వాటర్ ప్యూరిఫైయర్‌లను వాగ్దానం చేసి పంపిణీ చేస్తారు.

అలాంటి కార్యకలాపాలను కొనసాగించే మిషనరీలు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు, చెన్నైకి చెందిన అకార్డ్ ఛారిటబుల్ ట్రస్ట్… గిరిజనులు, ఈలం తమిళులు మరియు జానపద కళాకారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తుంది. ఈ వ్యక్తులు మైక్రో ఫైనాన్సింగ్ ద్వారా గిరిజనులకు సహాయం చేస్తారు. టైలరింగ్ షాపులు ఏర్పాటు చేయడం, కొవ్వొత్తులు, ఫినాల్, బ్లీచింగ్ పౌడర్ తయారీ మొదలైన చిన్న చిన్న వ్యాపారాలకు 5,000 మూలధనాన్ని అందిస్తారు.

వ్యాపారాన్ని విస్తరించడానికి వారు స్వయం సహాయక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నిజాయితీగా అమలు చేస్తే ఇది ఒక గొప్ప ‌సేవగా అనిపించవచ్చు. అయితే, ప్రజలు ఏసును ప్రార్థించినందున మాత్రమే వారి సమస్యలకు సమాధానం లభించిందని చెప్పి అమాయక ప్రజలను మతం మార్చడానికే ఈ పద్ధతులు ఉపయోగిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

Source : Hindu Post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ పాస్టరు – మోసంలో మాస్టరు – పేదలే వారి లక్ష్యం సారూ…. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేరళలోని బిలీవర్స్ చర్చిపై ఆదాయపు పన్ను దాడిలో 5 కోట్ల రూపాయలు స్వాధీనం – ఆ చర్చికి రూ .6000 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లుగా సమాచారం
ఆదాయపు పన్ను శాఖ గురువారం కేరళలోని ప్రముఖ సువార్తికుడు కెపి యోహన్నన్ నివాసం మరియు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలపై కేరళలోని కొట్టాయం మరియు పతనం తిట్టలోని వివిధ ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి. యోహన్నన్ గాస్పెల్ ఏషియా (ఆసియా కోసం సువార్త) స్థాపకుడు మరియు డైరెక్టర్. అలాగే  బిలీవర్స్ చర్చి యొక్క మెట్రోపాలిటన్ బిషప్ కూడా. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలలో మతమార్పిడిలో చురుకుగా నిమగ్నమై ఉంది.

తాజా నివేదికల ప్రకారం, అధికారులు 5 కోట్ల రూపాయలను జప్తు చేశారు. అలాగే కొన్ని ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. చర్చి ద్వారా పన్ను ఎగవేత మరియు నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు అందించిన ఖచ్చితమైన సమాచారం మేరకు విదేశీ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ప్రభుత్వం ఈ దాడులను ప్రారంభించింది.

కేరళలోని చర్చితో పాటు రాష్ట్రానికి వెలుపల ఉన్న అనేక మంది వ్యక్తుల నివాసాలు మరియు కార్యాలయాలలో కూడా ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తిరువల్ల వద్ద సంస్థ నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కూడా ఆదాయపు పన్ను బృందం శోధిస్తోంది.

2017 లో, హోం మంత్రిత్వ శాఖ బిలీవర్స్ చర్చి మరియు మరో మూడు ఎన్జీవోలను విదేశీ నిధులను స్వీకరించకుండా నిరోధించింది. ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలను ఉల్లంఘిస్తూ గత ఐదేళ్లలో చర్చికి రూ .6000 కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయని ఐటి విభాగం కనుగొంది.

బిలీవర్స్ చర్చి కేరళలో అనేక కళాశాలలు, విద్యా సంస్థలను నడుపుతోంది. దీనికి శబరిమల సమీపంలో పతనంతిట్ట జిల్లాలోని చెరువల్లి వద్ద స్వంత ఎస్టేట్ కూడా ఉంది. ఈ ఎస్టేట్‌ శబరిమల విమానాశ్రయానికి చెందిన వివాదాస్పద భూమిలో ఉన్నదని కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది.

Source : Organiser.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలోని బిలీవర్స్ చర్చిపై ఆదాయపు పన్ను దాడిలో 5 కోట్ల రూపాయలు స్వాధీనం – ఆ చర్చికి రూ .6000 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లుగా సమాచారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు
జాగ్రత్తగా గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడైతే మావోయిజం, వేర్పాటువాదం, దేశద్రోహం వంటి కార్యకలాపాలు అధికంగా ఉంటాయో కచ్చితంగా ఆ ప్రదేశంలో విదేశాల నుండి విరాళాలు పొందుతున్న సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఖలిస్థాన్ వేర్పాటువాదం పురుడుపోసుకున్న పంజాబులో ఇప్పుడు మిషనరీల కార్యకలాపాలు అధికమయ్యాయి. ప్రత్యేక ద్రవిడస్తాన్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తమిళనాడు సహా ఇతర దక్షిణ భారత రాష్ట్రాలన్నిటిలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు స్వాతంత్రానికి పూర్వం నుండే సాగుతున్నాయి. మావోయిజం అధికంగా ఉండే ఛత్తీస్ గఢ్, బీహార్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి మనం చూడవచ్చు. ఇక ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణం.

విదేశాల ద్వారా విరాళాలు పొందుతున్న అనేక క్రైస్తవ మిషనరీ సంస్థల లక్ష్యం కుట్ర కేవలం మతమార్పిడి మాత్రమే కాదు, దేశ విచ్చిన్నం, సంస్కృతి వినాశనం, రాజకీయ అధికారం, జనాభా పెంపు తద్వారా భౌగోళిక విస్తరణవాదం ఇలాంటివి అనేకం ఉంటాయి. ఈ సంస్థలకు అమెరికా, యూరప్ దేశాల నుండి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే ధనమే ఈ విచ్చిన్న ప్రయత్నాలకు  మూలాధారం.

తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, నిరసనకారుల మరణాల వెనుక అమెరికా నిధులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఉన్న విషయాన్ని గతంలో కేంద్ర హోంశాఖ నిర్ధారించింది. విదేశీ స్వచ్ఛంద సంస్థల కనుసన్నల్లో పనిచేసే కొన్ని ‘భారతీయ’ క్రైస్తవ సంస్థలు కూడా భారతదేశానికి ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టుని బహిరంగంగా వ్యతిరేకించాయి. అంతేకాదు ఉదయ్ కుమార్ అనే ‘నిరసనకారుడు’ తమ నిరసనలకు ప్రతిఫలంగా విదేశీ ధనాన్ని చర్చికి ట్రాన్స్ఫర్ చేయమని కోరుతూ ఒక స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయాడు కూడా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చెప్పుపుకుంటూపోతే అనేకం మనకు కనిపిస్తాయి.

అయితే ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం రూపకల్పనకు తొలి అడుగు 1969లోనే పడింది.  అమెరికా నిఘా సంస్థ CIA ఇక్కడి దేశీయ సంస్థలు, విద్యార్థి-యువజన-కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తోందన్న అనుమానాలు అప్పటికే బలపడ్డాయి. 1969 సంవత్సరంలో అప్పటి భారత హోమ్ మంత్రి యస్వంత్ రావ్ చవాన్ అత్యంత ముఖ్యమైన ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లోనూ చర్చకు తీసుకువచ్చారు.

దేశీయ సంస్థలకు వస్తున్న విదేశీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని బలంగా ప్రతిపాదించారు. అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు 1976లో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది.  దీని ద్వారా విదేశీ సంస్థల నుండి కానీ, వ్యక్తుల నుండి కానీ ఇక్కడి సంస్థలకు ఎటువంటి సహాయం అందాలన్నా అందుకు కొన్ని నియమనిబంధనలు, విధివిధానాలు ఆ చట్టంలో పొందుపరిచారు.

అయితే, 1976లోనే ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ అదంత ప్రభావవంతంగా పనిచేయలేదు (అమలుకాలేదు). తిరిగి 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఎ ప్రభుత్వ హయాంలో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010’ పేరిట అదే చట్టాన్ని మరికొన్ని సవరణలతో ఆమోదించబడింది. అనంతరం కాలక్రమంలో ఇది మరిన్ని సవరణలకు గురవుతూ వచ్చింది.

ప్రజాస్వామ్య భారతానికి మూలస్తంభాలైన న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేటుగా చెప్పబడుతున్న మీడియా.. ఇవి ఏవీ కూడా విదేశీ శక్తుల ద్వారా ఏవిధంగానూ ప్రభావితం కాకూడదన్న ఉద్దేశంతో ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ చట్టం ద్వారా ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి విదేశీ విరాళాలను నిషేధించడం జరిగింది. దీని ప్రకారం జడ్డిలు, జర్నలిస్టులు (కాలమిస్టులు, కార్టూనిస్టులు, న్యూస్ ప్రింటర్లు & పబ్లిషర్లు), ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు (పార్టీలకు ప్రాతినిధ్యం వహించేవారు, ఎన్నికల్లో గెలిచినవారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు) విదేశీ నిధులు పొందడం నిషేధం.

(ఇంగ్లండుకి చెందిన వేదాంతా గ్రూప్ మన దేశంలో ప్రధాన పార్టీలకు దాదాపు 30 కోట్ల రూపాయల ధన సహాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి)

విద్య, వైద్య, సామాజిక, ఆర్ధిక, పర్యావరణ, సాంస్కృతిక, ధార్మిక, మతపరమైన విభాగాల్లో పనిచేస్తూ విదేశీ నిధులు పొందాలనుకునే సంస్థలు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద కేంద్ర హోంశాఖ నుండి ప్రత్యేక లైసెన్సు పొందాల్సి ఉంటుంది.

2014 ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేంద్ర ఇంటెలిజెన్స్ భారత ప్రభుత్వానికి ఒక కీలక నివేదిక సమర్పించింది. “భారతదేశ అభివృద్ధి, ఆర్ధిక ప్రగతిపై కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల దుష్ప్రభావం” పేరిట రూపొందించిన ఆ నివేదికలో విదేశీ నిధులు పొందుతున్న పలు సంస్థల కార్యకలాపాల కారణంగా దేశ అభివృద్ధి 2-3 శాతం వెనుకబడినట్టు నిర్ధారించింది. దీని వెనుక అంతర్జాతీయ దాతల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించింది.

2014లో నూతనంగా ఎన్డీయే హయాంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, విదేశీ విరాళాలు పొందుతూ, ఉల్లంఘనలకు పాల్పడుతున్న కొన్ని వేల ‘స్వచ్ఛంద సంస్థల’ ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్సులు రద్దు అయ్యాయి. అందులో ముఖ్యమైనవి గ్రీన్ పీస్ ఇండియా, కంపాషన్ ఇండియా ఇంటర్నేషనల్ లతోపాటు  ‘ప్రముఖ సామాజికవేత్త’ తీస్తా సెతల్వాద్ కి చెందిన ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్  పీస్ అనే సంస్థలు ఉన్నాయి. అసలు వాటి లైసెన్సులు రద్దు కావడానికి కారణాలు ఏమిటి అనేవి తెలుసుకుంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నియమాలు మనకు సులభంగా అర్ధమవుతాయి.

విద్య, సామజిక సేవ, ఆర్ధిక సహకారం, మహిళా సాధికారత, బాలబాలిక సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ మొదలైన కార్యకలాపాలు చేపట్టే సంస్థలకు విదేశీ విరాళాలు సేకరించే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అయితే ఈ సంస్థలు తాము ఎంచుకున్న నిర్దిష్టమైన ప్రాజెక్ట్ కోసం మాత్రమే ఈ విదేశీ ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిర్ధేశించుకున్న ప్రాజెక్ట్ కాకుండా మరి ఏ ఇతర కార్యక్రమం కోసం వీటిని ఖర్చు చేసినా  అది ఉల్లంఘన క్రిందకు వస్తుంది. అంతే కాకుండా ఈ చట్టం ప్రకారం విదేశీ ధనం పొందే సంస్థలు రాజకీయ అంశాలు, మతమార్పిడులతో పాటు దేశీయ చట్టాలకు వ్యతిరేకమైన, దేశ ప్రగతికి భంగకరంగా ఉన్న కార్యకలాపాల్లో పాల్గొనరాదు.

బాలల సంరక్షణ పేరిట మతమార్పిళ్లకు పాల్పడుతున్న కారణంగా కంపేషన్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ  లైసెన్స్ రద్దు చేయడంతో దాని తాలూకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి తనకు తానుగా భారత్ నుండి నిష్క్రమించింది. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదు.

ఇక భారత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనకారులను ఎగదోస్తున్న కారణంగా చెన్నైకి చెందిన గ్రీన్ పీస్ ఇండియా లైసెన్సు రద్దు చేసింది.

అంతే కాకుండా ప్రతి ఏడాది తమకు వస్తున్న విదేశీ విరాళాలు ప్రకటించని (రిటర్న్ దాఖలుచేయని) కొన్ని వేల సంస్థల లైసెన్సులు కూడా 2017లో ప్రభుత్వం రద్దు చేసింది. అందులో క్రైస్తవ సంస్థలే అత్యధికం కావడం గమనార్హం.

విదేశీ నిధులు పొందే సంస్థల సభ్యులు అందరూ కూడా, తాము గతంలో ఎలాంటి మతమార్పిళ్లకు పాల్పడలేదని, ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ శిక్ష అనుభవించలేదు అని డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం 2019లో ఈ చట్టానికి స్వల్ప సవరణలు చేసింది.

తాజాగా మరిన్ని కీలక సవరణలతో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇటీవలే పార్లమెంటులో ఆమోదం పొందింది.

Source:

www.lawbharat.wordpress.com

www.opindia.com

VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.