elections – Vishwa Samvad Kendra Andhra Pradesh

కెనడా ఎన్నికల్లో పాక్‌ జోక్యం?: కెనడా ఆరోపణ
రతదేశానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెరుగుతున్న మద్దతు దృష్టా, దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఏప్రిల్ 28న కెనడాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని  ఆ దేశం ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్‌ఐఎస్‌) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ వెనెస్సా లాయిడ్ ఈ ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్‌లో రాజకీయ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు, భారతదేశానికి పెరుగుతున్న మద్దతును ఎదుర్కొనేందుకు పాక్‌ తన వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా  కెనడాతో విదేశీ  దౌత్య కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా కెనడా.. పాక్‌, భారత్‌లపై ఇలాంటి ఆరోపణలను మోపింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

2021, 2019 కెనడా సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ భారతదేశం, పాకిస్తాన్ రహస్యంగా జోక్యం చేసుకున్నాయని కెనడా ఆరోపించింది. ఎన్‌డీటీవీ ఒక కథనంలో.. రాబోయే కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న సమాఖ్య 2024లో గూఢచారి సంస్థ అందించిన సమాచారాన్ని విడుదల చేసిందని పేర్కొంది. ఖలిస్తానీ ఉద్యమం లేదా పాకిస్తాన్ అనుకూల వైఖరికి సానుభూతిపరులైన భారతీయ సంతతికి చెందిన ఓటర్లు కెనాడాలో ఉన్నారని వెనెస్సా లాయిడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్ అనుకూల అభ్యర్థులకు అక్రమ ఆర్థిక సహాయం  అందించిన ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయిని లాయిడ్‌ ఆరోపించారు. కెనడా ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.

The post కెనడా ఎన్నికల్లో పాక్‌ జోక్యం?: కెనడా ఆరోపణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఈవీఎంల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. సుమారు 1300 కోట్లు కేటాయింపు!
భారత్‌లో ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. అయితే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం వాటిని పట్టించుకోవట్లేదు.. ఇదే టెక్నాలజీతోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మరిన్ని ఈవీఎంలు కావాలనీ ఉన్నవాటిలో కొన్ని సరిగా పనిచేయట్లేదని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో స్పందించిన కేంద్రం మరిన్ని ఈవీఎంలను కొనేందుకు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంవత్సరం 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాలతోపాటూ.. లోక్‌సభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఎన్నికల సంఘం ప్రతిపాదనను ఒప్పుకుంటూ… కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు కేంద్రం ప్రతిపాదనలు పంపింది.

ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈవీఎంలనే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుంచి కొత్తవాటిని కొనబోతోంది. ఇందుకోసం రూ.1,300 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇండియాలో 1982లో తొలిసారిగా ఈవీఎంలను పరిచయం చేశారు. అప్పటి నుంచి వీటిని వినియోగిస్తూ వస్తున్నారు. ఈవీఎంల రాకతో.. ఇండియాలో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇదివరకు నాలుగైదు రోజులకు వచ్చే ఎన్నికల ఫలితాలు.. ఇప్పుడు ఒక్కరోజులోనే వస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఈవీఎంల పుణ్యమా అని బ్యాలెట్ పేపర్ వాడకం బాగా తగ్గింది. తద్వారా వృక్షాల నరికివేతకు బ్రేక్ పడింది. ఈవీఎంలను తీసుకెళ్లడం, స్టోర్ చెయ్యడం అన్నీ తేలిగ్గా జరుగుతున్నాయి. ఈవీఎం కారణంగా.. బోగస్ ఓట్లు పడే అవకాశాలు లేవు. ప్రతి ఓటుకూ విలువ వస్తుంది. వీటిని ట్యాంపరింగ్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. తమ ఓటు నిజంగా పడిందో లేదో అనే అనుమానం ఓటర్లకు కలుగుతోందని పలువురిని నుంచి అనుమానాలు వ్యక్తం కాగా.. ఈ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఓటు వేసిన తర్వాత.. వేసినట్లుగా నిర్ధారించే స్లిప్ సిస్టం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్‌. దీంతో ఇకపై జరిగే అన్ని ఎన్నికలు ఈవీఎంలతోనే జరపనుందని క్లారిటీ వచ్చేసింది. కొత్త ఈవీఎంల కొనుగోలు చేయడంతో.. ఈసారి మొరాయించే యంత్రాల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. అందువల్ల త్వరలో జరిగే ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని భావించవచ్చు.

The post ఈవీఎంల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. సుమారు 1300 కోట్లు కేటాయింపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఎప్పుడెప్పుడంటే?
మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూలు ప్రకటించింది. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగియనుంది. త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. నాగాలాండ్‌ను నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ పరిపాలిస్తోంది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. జాతీయ గుర్తింపు పొందిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏకైక పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ కావడం గమనార్హం. నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలలో 60 శాసన సభ స్థానాలు చొప్పున ఉన్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుందని తెలిపింది. నాగాలాండ్‌లో కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని తెలిపింది.

ఫలితాలు ఎప్పుడంటే..

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Chief Election Commissioner Rajiv Kumar) బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయని చెప్పారు.

ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదులకు సీవిజిల్ యాప్ (cVigil app) ద్వారా ఎన్నికల కమిషన్‌ (ECI)కి తెలియజేయవచ్చునని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోనే స్పందిస్తామని చెప్పారు. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

The post నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఎప్పుడెప్పుడంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రెస్‌మీట్‌!
కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ సందర్బంగా కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల అయిదేళ్ల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22వ తేదీల్లో ముగియనుంది. దీంతో మార్చి నెలాఖరులోగా మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి ఎన్నికల సంఘం గత వారం మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీలు, రాష్ట్ర, కేంద్ర భద్రత, పౌర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఏడాది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే ఈసీ ఈ ఈశాన్య రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిపించబోతోంది. ఇవి చిన్న రాష్ట్రాలే అయినప్పటికీ… వీటిలో వచ్చే ఫలితాలు.. దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిని ప్రతిబింబిస్తాయి. మరోవైపు బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఎందుకంటే ఈ ఫలితాలు 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎంతోకొంత ప్రభావం చూపుతాయని బీజేపీ క్యాడర్‌ భావిస్తోంది. దీంతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీతోపాటు,,, ఆయా మూడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం ఎన్నికల బరిలో గెలిచేలా కసరత్తు ప్రారంభించాయి.

The post ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రెస్‌మీట్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయం భారీగా తగ్గింపు….ఈసీ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నగదు చలామణి తగ్గించే విషయంలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త ప్రతిపాదనను తెర మీదికి తెచ్చింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార వ్యయంలో భాగంగా చేసే నగదు చెల్లింపులను ఇకపై రూ.2 వేలకే పరిమితం చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.10 వేలుగా ఉంది. రూ. 2 వేల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే.. బ్యాంకు ఖాతా, చెక్కులు లేదా డిజిటల్‌ పేమెంటు చేయాలని ఎన్నికల సంఘం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో సూచించింది. గుజరాత్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన ఈసీ ఎన్నికల ఖర్చులను పర్యవేక్షిస్తూ, తనిఖీ చేసే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఇతర బృందాలకు ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ విధానం జారీ చేసింది.

ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం.. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయటానికి కనీసం ఒక రోజు ముందైనా ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి. నామినేషన్ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు రోజువారీ ఖర్చులకు సంబంధించిన ఖాతా పుస్తకాన్ని నిర్వహించాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజులలోపు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల వివరాలకు సంబంధించిన ఖాతాను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయం భారీగా తగ్గింపు….ఈసీ కీలక ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం
భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలం 1975-77

సరిగ్గా 47 ఏళ్ళ క్రితం 1975లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత దేశంలో యాథావసర పరిస్థితిని ప్రకటించారు. 21 నెలల పాటు అమలులో ఉన్న ఈ పరిస్థితి కేవలం మన దేశంకే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రకే ఓ చీక‌టి అధ్యాయంగా మిగిలిపోయింది.

ఎందుకంటే, ప్రపంచంలో స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రజల సంఖ్య అకస్మాత్తుగా సగానికి పడిపోయింది. ప్రపంచంలోనే ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ప్రజలకు ప్రాథమిక హక్కులు అమలులో లేకుండా పోవడం, ప్రతిపక్ష నేతలే కాకుండా స్వేచ్ఛగా అభిప్రాయలు వ్యక్తం చేసే వారంతా జైళ్ళ‌లో గడపవలసి వచ్చింది.

ప్రాథమిక హక్కులు అమలులో లేకుండా పోవడంతో ప్రభుత్వం ఎవ్వరినైనా కాల్చివేసినా ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని ప్రఖ్యాత పాత్రికేయుడు కులదీప్ నాయర్ అరెస్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు లో ప్రభుత్వ అదనపు సొలిసిట్ జనరల్ వాదించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

భారతదేశంలో మొదటిసారిగా పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. చట్టసభలకు జరుగవలసిన ఎన్నికలను వాయిదా వేశారు. జైళ్ళ‌న్నీ నిరాయుధులైన, ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించే వారితో నింపివేసారు. చివరకు కేంద్రంలో సీనియర్ మంత్రులు సహితం ఏమీ మాట్లాడలేక తమ ఇళ్ళ‌కే పరిమితం కావలసి వచ్చింది.

దేశ చరిత్రలో మొదటిసారిగా `రాజ్యాంగాతీత శక్తులు’ ప్రభుత్వ వ్యవహారాలలో పెత్తనం చేయడం చూసాము. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ లోక్‌సభకు ఎన్నిక కావడాన్ని కొట్టివేయడంతో, కేవలం ఆమె పదవిని కాపాడుకోవడం కోసం అత్యవసర పరిస్థితి విధించడం అందరికి తెలిసిందే. అయితే, అందుకు ఏవేవి కారణాలు చెప్పి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

అయితే, అత్యవసర పరిస్థితి భారత పౌర సమాజంలో నెలకొన్న చైతన్యాన్ని, వారి సంఘటిత శక్తిని మొత్తం ప్రపంచానికి వెల్లడించింది. 1971లో బాంగ్లాదేశ్ యుద్ధంలో అనూహ్యమైన విజయం సాధించినప్పటి నుండి దేశంలో తిరుగులేని నాయకురాలిగా ఇందిరాగాంధీ వెలుగొందుతూ వచ్చారు. ఆమెను రాజకీయంగా ఎదిరించే సత్తా ప్రతిపక్షాలలో పెద్దగా కనిపించడం లేదు.

ప్రజలకు ఆశాదీపంగా విద్యార్థుల ఉద్యమం

అటువంటి సమయంలో మొదట గుజరాత్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ మెస్‌లో అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా బీహార్‌కు వ్యాపించడం, దశాబ్దాలుగా `రాజకీయ సన్యాసం’ చేపట్టిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడి, అవినీతికి మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థలో `సమగ్రమైన మార్పు’ కోసం `సంపూర్ణ విప్లవం’ కోసం విద్యార్థులు, యువకులు ఉద్యమించాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమాలలో ఏబీవీపీ నిర్ణయాత్మక పాత్ర వహించింది.

ఆయన పిలుపు విద్యుత్ తరంగం వలే దేశ వ్యాప్తంగా యువతను కదిలించడం ప్రారంభమైంది. రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలు ఉద్భవించడం ప్రారంభమైనది. ఇంతలో అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చినా పదవికి రాజీనామా చేయకుండా ఇందిరాగాంధీ తాత్సారం చేస్తుండడంతో ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె వెంటనే రాజీనామా చేయాలనీ జెపి డిమాండ్ చేశారు.

అందుకోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం కోసం మొరార్జీ దేశాయ్ అధ్యక్షునిగా, నానాజీ దేశముఖ్ కార్యదర్శిగా లోక్ సంఘర్ష సమితి ఏర్పాటును ప్రకటించారు. అంతలో ప్రజలలో ఉవ్వెత్తున నిరసనలు చెలరేగే ప్రమాదం పసిగట్టిన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అత్యవసర పరిస్థితి సమయంలో రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తే జైళ్ళ‌కు వెళ్ళ‌డం తప్పా, ప్రజలను సమీకరించి నిరసన ఉద్యమాలకు ప్రయత్నం చేసినవారు చాలా తక్కువ.

కేవలం జార్జ్ ఫెర్నాండెస్, నానాజీ దేశముఖ్ వంటి వారు మాత్రమే తమదైన పద్ధ‌తిలో ఉపక్రమించారు. ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థలను నిషేధించడంతో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమంలో చేరారు. మొత్తం మీద లక్ష మందికి పైగా జైళ్ళ‌కు వెళ్లారు. మొత్తం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఓ శాంతియుత ఉద్యమంలో ఇంత మంది జైళ్ళ‌కు వెళ్ళ లేదు.

విదేశాలలో సహితం సుబ్రమణియన్ స్వామి వంటి వారు అత్యవసర పరిస్థితి పేరుతో భారత్‌లో జరుగుతున్న అరాచక పరిస్థితుల గురించి విశేషంగా ప్రచారం చేస్తుండడంతో అంతర్జాతీయంగా వత్తిడి పెరిగి, ఆమె మార్చి 21, 1977న అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకో వలసి వచ్చింది.

ఎన్నికలంటే భయపడ్డ ప్రతిపక్షాలు

ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ, ఆమె పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. రాజకీయ పార్టీల బలాబలాలతో సంబంధం లేకుండా పౌర ఉద్యమాల ద్వారా సాధారణ ప్రజలు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా నిలబడడంతోనే ఈ అనూహ్య ఫలితాలు సాధ్యమైంది. అందుకనే, ఆ తర్వాత మరో వేయేళ్ళ వరకు భారత్ లో అత్యవసర పరిస్థితి విధించే సాహసం ఎవ్వరు చేయలేరని స్వయంగా ఇందిరాగాంధీ పేర్కొనడం గమనార్హం.

వాస్తవానికి ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు భయపడ్డారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి అంశాలు `నిరక్షరాస్యులైన’ ప్రజలకు ఏమి అర్థం అవుతాయి అనుకోని, ఎన్నికలను బహిష్కరిద్దామని సూచించారు.

కానీ, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మొరార్జీ దేశాయి, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకుల నైతిక స్థైర్యం, సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లిన వేలాదిమంది యువకుల త్యాగాల ఫలితంగా 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓటమి చెందింది. మొదటిసారిగా నిషేధంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మొరార్జీ దేశాయి నాయకత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం భవిష్యత్‌లో తేలికగా దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేకుండా 44వ రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చింది. అయితే ప్రజలు నిత్యం జాగురకతతో వ్యవహరింపని పక్షంలో మరోసారి ఎమర్జెన్సీ విధింపక పోయినా ప్రభుత్వాలు నిరంకుశ విధానాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అనేకసార్లు స్పష్టమైనది.

ప్రజలకు బాసటగా నిలిచిన నైతిక నాయకత్వం

నాడు ప్రధానంగా అధికార రాజకీయాల పట్ల మక్కువలేని నైతిక నాయకత్వం ప్రజలకు బాసటగా నిల్చి, మన ప్రజాస్వామ్య పరిరక్షణకు బాసటగా నిలబడింది. లోక్ సంఘర్షణ సమితి అధ్యక్షుడిగా 78 ఏళ్ళ వయస్సులో జైలులో ఉన్న మొరార్జీ దేశాయి వద్దకు మధ్యవర్తులను పంపి పెరోల్ పై విడుదల చేస్తామని, అత్యవసర పరిస్థితులు క్రమశిక్షణ పెరిగిందని అంటూ కొన్ని మంచి మాటలు చెబితే విడుదల చేస్తామని ఇందిరాగాంధీ రాయబారం పంపారు.

కానీ బయటకు వస్తే తిరిగి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తా గాని ప్రభుత్వానికి `లొంగిపోయే’ ప్రసక్తి లేదని మొరార్జీ స్పష్టం చేశారు. కానీ నేడు ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతామని అంటూ తిరుగుతున్నారు. సైద్ధాంతిక రాజకీయాలకు కాలం చెల్లి, అధికారం చేపట్టడమే పరమావధిగా మారింది. అటువంటి ధోరణులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు కాగలవు.

మరో వంక స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారు అత్యవసర పరిస్థితి విధించి పెద్ద తప్పు చేశావని, వెంటనే ఉపసంహరించుకోమని ప్రధాని ఇందిరా గాంధీకి హితవు చెప్పారు. ఇందిరాగాంధీ కంచికి వెళ్ళి 90 సంవత్సరాల వయస్సులో ఉన్న `నడిచే దేవుడు’ గా పేరొందిన స్వామి చంద్రశేఖర సరస్వతి కాళ్ళ‌పై పడి ఆశీర్వాదం కోరితే ఇందిరాగాంధీ ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టత చూపలేదు. ఆ విధంగా అత్యవసర పరిస్థితి పట్ల తన విముఖతను చాటారు.

ప్రాథమిక హక్కుల అంశంపై రాజీలేని ధోరణిని ప్రదర్శించడం ద్వారా జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని సైతం పొందలేక పోయారు. దానితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు గాని ఉన్నత పదవి కోసం ఆయన పాకులాడలేదు.

భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తప్ప మౌలిక అంశాలపై ఉద్యమించే పరిస్థితులలో లేవని సహితం ఈ సందర్భంగా స్పష్టమైనది. అప్పటి నుండి దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పౌర సమాజ ఉద్యమాలే విశేష ఫలితాలు ఇస్తున్నాయి.

దేశంలో ఉగ్రవాదం వాటిని పెను సవాళ్ళను ఎదుర్కోవడంలో సహితం సాధారణ ప్రజలే ముందున్నారని గమనించాలి. మొత్తం ప్రపంచ చరిత్రలో సైనికుల జోక్యం లేకుండా, సాధారణ ప్రజలు ఉగ్రవాదాన్ని అణచివేయడం పంజాబ్ లో 1990వ దశకంలో మాత్రమే సాధ్యమైంది. అందుకు ప్రధాన కారణం సాధారణ గ్రామీణ ప్రజలు ఉగ్రవాదాన్ని నిరసించారు. ఉగ్రవాదులు సహాయ నిరాకరణ చేశారు.

చివరకు క‌శ్మీర్ లోయలో సహితం దాదాపు అదే సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జొరబడుతూ ఉంటె, వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది స్థానిక తీవ్రవాదులు, యువత కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం అందరిని ఒకే గాటిన కట్టేసి, స్థానికులు చేదోడుగా ఉండకపోవడంతో ఉగ్రవాదం ఆ తర్వాతి కాలంలో దేశంలో విశృంఖలంగా వ్యాపించింది.

నిజం టుడే సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌ నిషేధంపై సిఫార్స్
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని భారత ఎన్నికల కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నికల మొదటి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నిర్వహించడం, ప్రచారం చేయడంపై కొంత పరిమితి ఉండాలని స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, రాజీవ్ కుమార్ ఓటర్ ఐడిలతో ఆధార్‌ను లింక్ చేయడానికి నోటిఫికేషన్‌లు జారీ చేయాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరడంతో పాటు పలు ఎన్నికల సంస్కరణలపై సిఫార్సులను చేశారు.

అర్హులైన వ్యక్తులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి నాలుగు అర్హత తేదీలను అనుమతించడంతో పాటు, అభిప్రాయ సేకరణలను నిషేధించే కమిషన్ ఇదివరకు చేసిన ప్రతిపాదనలను ఆయన పునరుద్ధరించారు. అలాగే ఒక అభ్యర్థి పోటీ చేసే సీట్లను కేవలం ఒక దానికి పరిమితం చేయాలని కూడా కమిషన్ కోరుతున్నది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్ పోల్స్‌ నిషేధంపై సిఫార్స్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు దశల్లో ఎన్నికలు. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య, రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే దశలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే

ఫేజ్ వన్ (11/4/2019) (రాష్ట్రం, నియోజకవర్గాల సంఖ్య):

ఏపీ 25, అరుణా చల్ ప్రదేశ్ 2, అసోం 5, బీహార్ 4, చత్తీస్ గఢ్ 1, జమ్ముకశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, ఒడిశా 4, సిక్కిం 1, తెలంగాణ 17, త్రిపుర 1, యూపీ 8, ఉత్తరాఖండ్ 5, పశ్చిమబెంగాల్ 2, అండమాన్ నికోబార్ 1, లక్షద్వీప్ 1. మొత్తం 91 నియోజకవర్గాలు, 20 రాష్ట్రాలు.

ఫేజ్ టూ (18/4/2019):

అసోం 5, చత్తీస్ గఢ్ 3, బీహార్ 5, జమ్ముకశ్మీర్ 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, మణిపూర్ 1, ఒడిశా 5, తమిళనాడు 39, త్రిపుర 1, యూపీ 8, పశ్చిమబెంగాల్ 3, పుదుచ్చేరి 1. మొత్తం 97 నియోజకవర్గాలు, 13 రాష్ట్రాలు.

మూడో ఫేజ్ (23/4/2019):

అసోం 4, బిహార్ 5, చత్తీస్ గఢ్ 7, గుజరాత్ 26, గోవా 2, జమ్ముకశ్మీర్ 1, కర్ణాటక 14, కేరళ 20, మహారాష్ట్ర 14, ఒడిశా 6, యూపీ 10, పశ్చిమబెంగాల్ 5, దాద్రా మరియు నగర్ హవేలీ 1, డమన్ మరియు డయూ 1. మొత్తం నియోజకవర్గాలు 115,  రాష్ట్రాలు 14.

నాలుగో ఫేజ్ (29/4/2019):

బీహార్ 5, జమ్ముకశ్మీర్ 1, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 17, ఒడిశా 6, రాజస్థాన్ 13, యూపీ 13, పశ్చిమబెంగాల్ 8. మొత్తం నియోజకవర్గాలు 71, రాష్ట్రాలు 9.

ఐదో ఫేజ్ ( 6/5/2019):

బీహార్ 5, జమ్ముకశ్మీర్ 2, జార్ఖండ్4, మధ్యప్రదేశ్ 7, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమబెంగాల్ 7. మొత్తం నియోజకవర్గాలు 51, రాష్ట్రాలు 7

ఆరో ఫేజ్(12/5/2019):

బీహార్ 8, హర్యానా 10, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 8, ఉత్తర ప్రదేశ్ 14, వెస్ట్ బెంగాల్ 8, ఢిల్లీ – NCR  7. మొత్తం నియోజకవర్గాలు 59, రాష్ట్రాలు 7.

ఏడో ఫేజ్ (19/5/2019):

బిహార్ 8, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, చండీగఢ్ 1, ఉత్తరప్రదేశ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4. మొత్తం నియోజకవర్గాలు 59, రాష్ట్రాలు 8.

The post సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు  దశల్లో ఎన్నికలు. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడంటే..? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.