#Dragon Country – Vishwa Samvad Kendra Andhra Pradesh

తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం!
న్యూఢిల్లీ: అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం.. తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది.

తైవాన్ పర్యటన ముగించుకుని పెలోసీ వెళ్ళిపోయిన మరుసటి రోజే చైనా నావికాదళ, వాయుసేన విన్యాసాలు చేపట్టింది. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించింది. తూర్పు తైవాన్ జలసంధిలోని నిర్దేశిత ప్రాంతాలను లక్ష్యాలుగా ఎంచుకుని చైనా లాంగ్ రేంజి ప్రెసిషన్ మిసైళ్లను ప్రయోగించింది.

ప్రతీకార చర్యగా చైనా మిలటరీ విన్యాసాలు

ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్‌ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్‌ జలాల్లోనూ, గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దీని వల్ల ప్రపంచంలో బిజీగా ఉండే షిప్పింగ్‌ జోన్‌లో సరకు రవాణాకు గండిపడే అవకాశాలున్నాయి.

దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ, ఈ విన్యాసాలతో తాము ఆశించిన ప్రయోజనం దక్కిందని వ్యాఖ్యానించింది. టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు. ఆదివారం వరకు డ్రిల్ కొనసాగుతుందని చైనా ప్రకటించింది.

గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతుండగా, గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్‌ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ విన్యాసంగా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

తైవాన్ అలెర్ట్

చైనా కవ్వింపు చర్యలతో తైవాన్ అలెర్ట్ అయ్యింది. తమ దేశ సైన్యాన్ని అలర్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది. చైనా సముద్ర, గగనతల విన్యాసాలు చేపట్టిన కాసేపటికే అనేక అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. చైనా ప్రతీకార చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితి విషమించకుండా తమ సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది.

తైవాన్‌కు అండగా నిలుస్తాం: అమెరికా

తైవాన్‌కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తైవాన్ మాత్రం స్వతంత్ర దేశంగా ఉండేందుకు ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా..పలు పశ్చిమదేశాలు తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైనా పడింది. 400కు పైగా విమానాలు రద్దు అయ్యాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తైవాన్ జలసంధిపై చైనా మిస్సైళ్ళ ప్ర‌యోగం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డ్రాగన్ కంట్రీ కంత్రీ బుద్ధి! సరిహద్దుల్లో మరో రహస్య గ్రామం
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పొరుగు దేశాలపై డ్రాగన్ కంట్రీ త‌న‌ దుందుడుకు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. చుట్టుప‌క్క‌ల ఉండే దేశాల భూభాగాల‌ను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి త‌మ భూభాగాలుగా చెప్పుకుంటోంది. ఇరుగుపొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలతో బరితెగిస్తోంది.

తాజాగా భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను పంగ్డా అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ తో ఈ దురాక్రమణ విషయం బట్టబయలైంది. స్పేస్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ కంపెనీ మక్సార్ ఈ శాటిలైట్ ఇమేజెస్‌ను విడుదల చేసింది. భూటాన్ సరిహద్దుల్లోని భూమిని ఆక్రమించి చైనా నిర్మించిన గ్రామంలోని ప్రతి ఇంటి ఎదుట కార్లు పార్క్ చేసి ఉన్నాయని ఆ ఫోటోలను బట్టి స్పష్టమవుతోంది.

భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో చైనా అక్రమంగా గ్రామాన్ని నిర్మించడం ఇది రెండోసారి. ఐదేళ్ళ కిందటే 2017లో అక్కడ ఓ గ్రామాన్ని చైనా నిర్మించింది. అయితే, అప్పట్లో భూటాన్ లోని డోక్లామ్ ఏరియాలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణానికి తెగబడటంపై భారత్ స్పందించింది. భూటాన్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఆ ఏడాది దాదాపు 73 రోజుల పాటు భారత్, చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది.

దురాక్రమణవాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకుండా..భూటాన్ లోని డోక్లామ్ పీఠభూమికి దక్షిణ ప్రాంతంలో మూడో గ్రామాన్ని నిర్మించేందుకూ డ్రాగన్ కసరత్తు చేస్తోందని అప్పుడు మీడియా కథనాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. చైనా తన ‘సలామీ స్లైసింగ్‌’ విధానాన్ని భూటాన్‌పై ప్రయోగిస్తోందనేది నిపుణులు అంచనా వేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రాగన్ కంట్రీ కంత్రీ బుద్ధి! సరిహద్దుల్లో మరో రహస్య గ్రామం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.