DR. VISHNU SRIDHAR VAKANKAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్
భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ (హరిభావు) వాకంకర్ పేరు చెప్పుకోదగినది.  భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన భీంబట్కా గుహలు ఉన్నాయి.  దీని చుట్టూ నాలుగు వైపుల నుండి వింధ్య పర్వత శ్రేణులు ఉన్నాయి.  భీంబట్కా గుహలు మహాభారతంలో భీముడికి సంబంధించినవని విశ్వాసం. ఈ కారణంగా, దీనికి భీంబట్కా అనే పేరు వచ్చింది.  వాటిని 1957-1958 సంవత్సరంలో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ కనుగొన్నారు.

హరిభావు వాకంకర్ మే 4, 1919న నీముచ్ (మాండ్సౌర్ జిల్లా) మధ్యప్రదేశ్ లో జన్మించారు. వాకంకర్ కుటుంబం మంచి పేరున్న, ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన కుటుంబం.  వారు 8 తరాలకు పైగా చరిత్రను కలిగి ఉన్నారు. వాకంకర్ కు చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు చిత్రలేఖనంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నందున, అతను తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత ఉజ్జయినికి వచ్చి విక్రమశిలా విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేశారు. తరువాత అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఫైన్ ఆర్ట్స్ పి.జి చదివారు. ఉజ్జయిని సమీపంలోని దంతేవాడ గ్రామంలో పురావస్తు తవ్వకాలలో ఆయన ఎంతో శ్రమించారు. ఆయన 1958 లో ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో కొన్ని గుహలు మరియు రాళ్ళను చూశారు.తో టి ప్రయాణికులను వాటి గురించి అడిగినప్పుడు, ఇది భీంబట్కా (భీమా సిట్కా) అని పిలువబడే ప్రాంతం అని మరియు గుహ గోడలపై కొన్ని చిత్రాలు ఉన్నాయని తెలిసింది. కానీ అడవి జంతువులకు భయపడి ప్రజలెవరూ అక్కడికి వెళ్లరు.

ఇది విన్న హరిభావులో దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలయ్యింది. రైలు నెమ్మదించినప్పుడు, కదిలే రైలు నుండి దూకి, ఆ గుహలను చేరుకోవడానికి గంటల తరబడి కొండలు ఎక్కారు. అక్కడ ఉన్న చిత్రాలను మొదటిసారిగా ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

భీంబట్కా గుహలు పాలియోలిథిక్ మానవుల జీవితాన్ని వర్ణిస్తాయి, హరిభావు కనుగొన్న ఈ గుహలలోని చిత్రాలు రాతియుగం నాటి మానవుల జీవితాన్ని వర్ణిస్తాయి.  ఇక్కడ సుమారు 500 గుహలు ఉన్నాయి.  భీంబట్కా గుహలలోని చాలా ఛాయాచిత్రాలు ఎరుపు మరియు తెలుపు రంగులతో చిత్రీకరించబడ్డాయి.  కొన్ని ప్రదేశాలలో పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కూడా ఉపయోగించబడ్డాయి.  వన్యప్రాణుల వేట దృశ్యాలే కాకుండా, గుర్రాలు, ఏనుగులు, పులులు మొదలైన చిత్రాలను గుహలలో చెక్కారు. ముఖ్యమైన సమాచారం రాళ్ళపై వ్రాయబడింది.

మొత్తం 750 గుహలు ఉన్నాయి, వీటిలో 500 గుహలు చిత్రాలతో అలంకరించబడ్డాయి. ఈ ప్రదేశం రాతి యుగం నుండి మధ్య చారిత్రక కాలం వరకు మానవ కార్యకలాపాల కేంద్రంగా ఉంది. ఈ విలువైన వారసత్వం ఇప్పుడు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. భీంబట్కా ప్రాంతంలోకి ప్రవేశిస్తే, రాళ్ళపై వ్రాయబడిన అత్యంత విలువైన సమాచారం మనకు దర్శనమిస్తుంది. ఆ సమాచారం పురాతత్వ శాఖకు లభించింది. ఇక్కడ రాక్ పెయింటింగ్స్ యొక్క అంశాలు ప్రధానంగా సమూహ నృత్యాలు, అండర్లైన్డ్ హ్యూమనిజం, వేట, జంతువులు, పక్షులు, యుద్ధం మరియు ప్రాచీన మానవ జీవితపు రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినవి.  చిత్రాలలో ఖనిజ రంగులు ప్రధానంగా ఎరుపు మరియు తెలుపు మరియు కొన్నిసార్లు పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కూడా ఉపయోగించబడ్డాయి.  ఇక్కడ గోడలు మతపరమైన చిహ్నాలతో కూడా అలంకరించబడి ఉన్నాయి. ఈ విధంగా భీమా సిట్కా యొక్క ప్రాచీన మానవుల విజ్ఞాన వికాసం యొక్క కాలం ప్రపంచంలోని ఇతర పురాతన ప్రదేశాలకు వేల సంవత్సరాలకు ముందు జరిగింది. అందువలన ఈ పూరాతత్వ బీంబట్కా ప్రదేశం మానవ అభివృద్ధికి ప్రారంభ బిందువుగా కూడా పరిగణించబడుతుంది. దీనిని మన హరిబావు వాకంకర్ ప్రపంచానికి పరిచయం చేశారు.

ఇంతే కాకుండా వారు కాళ్ళకు చక్రాలు ధరించి దేశం అంతా తిరిగి భారతదేశ నిజమైన చరిత్రను వెలికితీశారు. మృదు స్వభావి. మాటల్లో తియ్యదనం ఉట్టిపడేది. తన హృదయంలో దేశం కోసం ఎదో చేయాలనే తపన ఒక అగ్నిలా ప్రజ్వరిల్లేది. సామాజిక రంగంలో కూడా చురుకుగా ఉండేవారు. శ్రీధర్ వాకాంకర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్వయంసేవక్ కావడంతో సామాజిక రంగంలో కూడా చురుకుగా పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్ కౌన్సిల్, మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన తరువాత 1966 లో ప్రయాగలో మొదటి ప్రపంచ హిందూ సమావేశం జరిగినప్పుడు, శ్రీ ఏక్ నాథ్ రణడే ఆయనను అక్కడికి పంపారు. తరువాత హరిభావు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళారు. భారతీయ సంస్కృతి, కళ, చరిత్ర, సైన్స్ మొదలైన వాటిపై ఉపన్యాసాలు ఇచ్చారు.  1981 లో సంస్కార భారతి స్థాపించబడినప్పుడు, ఆయనను దానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. భారత దేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత మన చరిత్రను వ్రాసే పనిలో కమ్యునిష్ట్ లు ఉన్నందువలన మన చరిత్ర వక్రీకరిణ జరిగింది అనే విషయం అందరీకీ తెలుసు. వాస్తవ చరిత్రను వెలికితీయడానికి ఇతిహాస సంకలన సమితి పని చేస్తుంది. దీనికి వాకంకర్ గారి ప్రేరణ ఎంతో ఉంది.

వాకంకర్ 1983 లో కురుక్షేత్రలో ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ మొరోపంత్ పింగళేతో కలిసి 18 మంది బృందంతో సరస్వతి షోద్ అభియాన్‌ను ప్రారంభించారు.  వారు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు ప్రయాణించి, సరస్వతి నది అంతర్వాహినిగా వున్నదని తేల్చారు, ఇది ఇతర నదుల కంటే చాలా చరిత్ర కలిగిన నది అని, సింధు లోయ నాగరికతకు ‘సరస్వతి నాగరికత’ అని పేరు మార్చాలని ఆయన సూచించారు.

1988 ఏప్రిల్ 3వ తేదీన ఒక సమ్మిట్ లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్ళారు. అక్కడ ఉపన్యాసం పూర్తయిన తరువాత కూర్చిలో ఒక్కసారిగా కూలబడిపోయారు. ఆఖరిశ్వాస వరకు దేశం గురించే ఆలోచన చేస్తూ అక్కడే మరణించారు. ఆ తరువాత పద్మశ్రీ డాక్టర్ వి.ఎస్.వాకంకర్ పేరిట జాతీయ అవార్డు ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 2003 లో వాజ్ పాయ్ గారు సరస్వతి నదికి సంబంధిత పరిశోధనలు జారిపించడానికి కూడా వాకంకర్ గారే ప్రేరణ. చివరగా వారి గురించి ఒక గొప్ప మాట ఏ ఇందిరాగాంధీ అయితే ఆర్ ఎస్ ఎస్ ని నిషేదించిందో ఆమె చేతులమీదుగా ఆర్ ఎస్ ఎస్ గణవేషలో బాగమైన నల్ల టోపీ ధరించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు శ్రీ వాకంకర్.

నేడు శ్రీ వాకంకర్ జీ 33వ వర్ధంతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చిరస్మరణీయుడు శ్రీ వాకంకర్
మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వాకంకర్ ను ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ పేర్కొన్నారు. సంస్కార భారతి వ్యవస్థాపకులైన శ్రీ వాకంకర్ శత జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని ఒక ఇంట్లో సంస్కార భారతి సహాయ కార్యదర్శి శ్రీ గూటాల కుమార్ కలిసి శ్రీ వాకంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మన దేశంలో దువా చిత్రకళకు శ్రీ వాకంకర్ పితామహుడు అని ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస్ తెలిపారు.

40 వేల సంవత్సరాల క్రితం నాటి భీమ్ బట్కా గుహలలోని చిత్రాలను వెలికి తీయడం ద్వారా భారతీయ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదని ఆయన ప్రపంచానికి చాటరన్నారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి మీద విదేశీయులు జరుపుతున్న దుష్ప్రచారాన్ని కూడా శ్రీ వాకంకర్ తిప్పి కొట్టారని శ్రీ శ్రీనివాస్ పేర్కొన్నారు.

అంతేకాకుండా అంతరించిపోయిన సరస్వతి నది జాడను తెలుసుకుని ప్రపంచానికి తెలియజేశారని శ్రీ శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చిరస్మరణీయుడు శ్రీ వాకంకర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.