CONGRESS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి పొరపాటున వెళ్తే నా తల తీసేయొచ్చు – కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ
బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ తిరుగుబాటు ధోరణితో ఉండే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరతారని, భారత్ జోడో యాత్రలో త్వరలో పాల్గొనవచ్చనే ఊహాగానాలకు ఆయన స్వస్తి పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీని అంగీకరించదని స్పష్టం చేశారు. వరుణ్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు భిన్నమైనవని రాహుల్ గాంధీ అన్నారు. తాను వరుణ్ గాంధీని కలవగలను, కౌగిలించుకోగలను కానీ.. అతన్ని ఎన్నటికీ అంగీకరించలేనని చెప్పాడు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. తమ సిద్ధాంతాలు, వరుణ్ గాంధీ సిద్ధాంతాలు సరిపోలడం లేదని అన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధాంతాన్ని వరుణ్ గాంధీ ఎప్పుడో అంగీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి ఎప్పటికీ వెళ్లలేనని.. అంతకు ముందు కావాలంటే తన తల తీసేయొచ్చని అన్నారు. తన కుటుంబానికి ఒక భావజాలం, ఆలోచనా విధానం ఉందన్నారు. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక పోరు సాగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలా ఉండగా అధికార బీజేపీకి సైద్ధాంతిక మూలమైన ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న పనిని వరుణ్ గాంధీ ప్రశంసించిన సంఘటనను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు.

దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ చాలా మంచి పని చేస్తోందని కొన్నాళ్ల క్రితం వరుణ్ గాంధీ తనతో చెప్పారని అన్నారు. మా కుటుంబ చరిత్రను చదివి అర్థం చేసుకోమని చెప్పానని.. తమ కుటుంబం యొక్క భావజాలాన్ని అర్థం చేసుకుంటే ఎవరూ అలా అనరని వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని సంస్థలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి) నియంత్రణ ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

దేశంలోని మీడియా, బ్యూరోక్రసీ, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ ఒత్తిడిలో ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పంజాబ్ పాలనను ఢిల్లీ నుండి కాకుండా పంజాబ్ నుండి నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో పోరాటం కాదని… ఇప్పుడు తమ పోరాటం దేశంలోని వాళ్లు స్వాధీనం చేసుకున్న సంస్థలతో పోరాటం జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు.

The post ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి పొరపాటున వెళ్తే నా తల తీసేయొచ్చు – కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు…
గాంధీనగర్‌: “దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఆప్‌లపై మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్ళు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే ఉగ్రవాదాన్ని లక్ష్యం చేసుకోకుండా తనను టార్గెట్ చేశారని మోదీ ఆరోపించారు.

ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని మండిపడ్డారు. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారని ప్రధాని గుర్తు చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారని చెప్పారు. అనేక ఇతర పార్టీలు కూడా సంతుష్టీకరణ చర్యలకు పాల్పడ్డాయని చెప్పారు.

ఖేడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించి, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌ని మాత్రం ప్రశ్నిస్తోందని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

`హిందూ’ పదంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
బెంగళూరు: `హిందూ’ పదంపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, పర్షియా భాషలో హిందూ పదానికి అత్యంత మురికి అనే అర్థం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

పర్షియన్ పదమైన హిందూతో భారత్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. బెళగావి జిల్లాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి మాట్లాడుతూ నిజానికి హిందూ అనే పదానికి భారతదేశానికి సంబంధమే లేదని చెప్పారు. హిందూ అని ఎలా ప్రకటించుకుంటారని ఆయన ప్రశ్నించడం దుమారం రేపింది.

ఆ పదానికి మూలాలు భారతదేశంలో లేవని చెప్పారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్ నుంచి వచ్చిందని తెలిపారు. ‘హిందూ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? అది మనదేనా?’ అని ప్రశ్నించారు. ‘ఇది పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతానికి చెందినది. హిందూ అనే పదానికి భారత్‌తో సంబంధం ఏమిటి? మీరు దానిని ఎలా అంగీకరిస్తారు? దీనిపై చర్చ జరగాలి’ అని స్పష్టం చేశారు.

అంతేగాక ‘హిందూ అనే పదానికి అర్థం తెలిస్తే మీరు సిగ్గుపడతారు. దీని అర్థం అసభ్యకరం’ అని జార్కిహోళి వ్యాఖ్యానించారు. హిందూ పదం ఎక్కడ నుంచి వచ్చిందో అన్నది వికీపీడియా ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు హిందూ పదంపై జార్కిహోళి మాట్లాడిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై మండిపడింది. ఇది హిందువులను అవమానించడం, రెచ్చగొట్టడం అని ఆ పార్టీ ఆరోపించింది.

ఓ పక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తుండగానే సతీశ్ జార్కిహోలి హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ సబబని భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ ప్రశ్నించారు. తొలుత శివరాజ్‌పాటిల్, నేడు సతీశ్ జార్కిహోలి హిందువులను అవమానిస్తున్నారంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు. హిందూ ధర్మాన్ని అవమానించడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post `హిందూ’ పదంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు నిషేధించాలి?
భాగ్య‌న‌గ‌రం: ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్ఏ)కు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరడం. గల్ఫ్​ దేశాల నుంచి హవాలా డబ్బులు రావడం కల్లోలంగా ఉంది. ఈ సంస్థ అబుదాబీలోని దర్బార్​ రెస్టారెంట్​ను తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని భారత్​లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిందని ఆరోపణలు వస్తున్నాయి.

దక్షిణాదిలో కేరళ ఈ గుంపునకు ప్రధాన కేంద్రంగా తెలుస్తున్నది. ఈ సంస్థ కార్యకలాపాలు నియోజకవర్గ పట్టణ స్థాయికి పాకడం ఆందోళన కలిగించే అంశం. ఈ అతివాద సంస్థ ‘జీహాదీ హెహదత్’ పేరుతో ప్రత్యేక స్క్వాడ్​ను ఏర్పాటు చేసినట్టు వార్తలొస్తున్నాయి. మాస్​ కిల్లింగ్స్, టార్గెట్​ కిల్లింగ్స్​పేరుతో భయోత్పాతం సృష్టించాలని ఈ సంస్థను, దాని అనుబంధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వెంటనే లాలూ, మాయావతి, వామపక్షాలు, కాంగ్రెస్​లోని కొందరు, చిన్నా చితకా సంస్థల వాళ్ళు ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలని యథాలాపంగా డిమాండ్​చేశారు. ఇదీగాక ఇటీవల కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ తరచూ ‘ఆరెస్సెస్​ దేశానికి ప్రమాదకరం’ అంటున్నారు. ఆరెస్సెస్​ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తుందని వామపక్ష నాయకులు ‘మంత్ర జపం’లా చెబుతుంటారు.

గతంలో అహ్మద్​పటేల్, సల్మాన్​ ఖుర్షీద్, దిగ్విజయ్​ సింగ్​ వంటి కాలం చెల్లిన నేతలు సోనియా గాంధీ చుట్టూ చేరి ఆర్ఎస్ఎస్‌ను రోజూ తిట్టిస్తుండేవారు. యూపీఏ కాలంలో స్వయంగా సర్​ సంఘ్​ చాలక్​ సుదర్శన్​జీతో సహా ‘సంఘ్’ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఇపుడు రాహుల్​గాంధీ చుట్టూ చేరి ‘ఆరెస్సెస్’ను దోషిని చేయాలని ఆయనతో మాట్లాడిస్తున్నారు.. మార్క్స్​సిద్ధాంతాన్ని గాంధేయవాదం ముసుగులో కాంగ్రెస్​చుట్టూ చేరిన ఆస్థాన విద్వాంసులు వామపక్షాలే. విశ్వవిద్యాలయాల్లో మీడియా, మేథో రంగాల్లో బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్‌​ మీద గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించే వర్గాలు కాంగ్రెస్​కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఈ గుంపే ఇప్పుడు ‘సంఘ్’ను నిషేధించాలని కాంగ్రెస్​ బయటా, లోపలా అరచి గీపెడుతున్నది.

సంఘ్​పై నిషేధం-ఎత్తివేత

‘‘బాగా సంఘటితమైన జనాభా లేకుండా బలమైన వ్యక్తిత్వం, త్యాగస్ఫూర్తి గల వ్యక్తులతో కూడిన స్వచ్ఛంద దళం లేకుండా చెప్పుకోదగిన విజయాలేమీ సాధించలేం”అని సంఘ్​ పెద్దలు దేశ విభజన సమయంలో ఎల్కే అద్వానీకి చెప్పిన మాటలు ఇక్కడ స్మరణీయం. గాంధీజీ హత్య తర్వాత 1948 ఫిబ్రవరి 4వ తేదీన ‘సంఘ్’ను నెహ్రూ ప్రభుత్వం నిషేధించింది. నిజానికి నాథూరాం గాడ్సే1933 నుంచే గాంధీని వ్యతిరేకించడమే గాక మరాఠీ పత్రిక అగ్రానీలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవాడు. గాంధీజీ మరణం తర్వాత చెన్నైలో ఉన్న సర్​ సంఘ్​చాలక్​ ఈ దారుణాన్ని ఖండించారు. ఆ తర్వాత 13 రోజులు సంతాప దినాలు ప్రకటించడమే గాక, నాగపూర్​ నుంచి ప్రధానికి విపులంగా లేఖ రాశారు. ఇవన్నీ చరిత్రలో రికార్డయినా మేథోవర్గం పేరుతో సంఘ్​ను నిందిస్తున్నారు.

వామపక్షాల తీవ్రమైన కాకి అరుపులకు నెహ్రూ ప్రభుత్వం సంఘ్​పై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది స్వయం సేవకులు అరెస్టయ్యారు. 1948 ఫిబ్రవరి 5న సర్దార్​పటేల్​ నెహ్రూకు రాసిన ఓ లేఖ కూడా నిషేధానికి కారణమైంది. కానీ, సంఘ్​ మిలిటెన్సీతో ఎన్నడూ తిరగబడలేదు. తర్వాత‌ కాలంలో సర్దార్​పటేల్ – నెహ్రూల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘సంఘ్’ నిర్దోషి అని పటేల్​ స్వయంగా ఒప్పుకున్నాడు.

‘‘బాపూ హత్య కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణ ప్రగతిని నేనే రోజువారీగా సమీక్షిస్తున్నాను. ప్రధాన నిందితుల కార్యకలాపాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చేశారు. ఈ హత్యలో ఆరెస్సెస్​ ప్రమేయం లేదని తేలింది” అని పటేల్​ చెప్పాడు. దాంతో 1949 జులై 12న సంఘ్​పై నిషేధం ఎత్తేశారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై శ్రీమతి ఇందిర జెజె కపూర్​ చైర్మన్​గా కమిటీ వేస్తే వాళ్లూ సంఘ్​కు గాంధీ హత్యతో సంబంధం లేదని తేల్చారు. 1949 అక్టోబర్​ 7న సీడబ్ల్యూసీ ఆరెస్సెస్​ సభ్యులను కాంగ్రెస్​లో చేరనివ్వమని తీర్మానం చేసింది.

జాతి ప్రయోజనాల కోసం

1962లో చైనాతో భారత యుద్ధం జరిగింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ ​తన దేశభక్తి ప్రదర్శించి జాతిని సంసిద్ధం చేసింది. ఈ మేరకు1963 జనవరి 26న రిపబ్లిక్​ పరేడ్​లో పాల్గొనాలని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను కోరారు. 30 వేల మంది స్వయం సేవకులకు గణవేషతో ఆహ్వానం లభించింది. అలాగే 1965లో పాకిస్తాన్ భారత్​పై దాడి చేసినప్పుడు అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని ప్రధాని లాల్ బహదూర్​శాస్త్రి సంఘ్​కు ఆహ్వానం పంపాడు. ఎమర్జెన్సీ విధించిన ఇందిర.. ఆనంద్​మఠ్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను నిషేధించింది.

60 కోట్ల మంది స్వేచ్ఛను హరించిన ఈ చీకటి రోజులను సంఘ్ ​మౌనంగా భరించింది. స్వాతంత్య్రం ఉద్య‌మంలో సంఘ్​ పాల్గొనలేదనే అజ్ఞానులు ఈ దేశంలో లెక్కకు మిక్కిలి ఉన్నారు. వాళ్ళంతా పఠన పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథం లేని శూన్య మనస్కులు. సావర్కర్ యథాలాంపంగా, వ్యూహంలో భాగంగా ‘కాలాపానీ’ శిక్షకు వ్యతిరేకంగా పెట్టుకున్న అర్జీలను సంఘ్​కు అంటగట్టి, బ్రిటీష్​ వాళ్లకు లొంగిపోయిందని విషం చల్లారు. ఇన్ని విషవలయాల నుంచి సంఘ్ తనను తాను ఎప్పుడూ సంస్కరించుకుంటూ సమాజంలో మార్పులకు అనుగుణంగా కార్యకలాపాలు విస్తరిస్తూ పనిచేస్తున్నది. దేశం కోసం మాత్రమే పనిచేయాలనే సంఘ్ తన కార్యకలాపాల్లో ఏ పార్టీని విమర్శించదు. జాతి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తే వాళ్ల వైపు నిలబడుతున్నది. దేశం కోసం నిబద్ధులైన కార్యకర్తలను సృష్టించే పని ‘కర్మాగారంలా’ సంఘ్​ నిరంతం చేస్తున్నది. దేశ విభజన అయినా, దివిసీమ ఉప్పెన అయినా, కరోనా కష్టకాలమైనా.. నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందించింది సంఘ్. ఇవన్నీ తెలియని వాళ్ళు ఆర్ఎస్ఎస్‌ను పీఎఫ్ఐతో పోలుస్తూ నిషేధం విధించాలని కోరుతున్నారు. సంఘ్​ బంతిలాంటిది. ఎంత అణిచేస్తే అంత పైకి లేస్తూనే ఉంటుంది. అది ఈ దేశ మూలతత్వ భావనకు ప్రతీకగా నిలబడింది. 1925లో విజయదశమి రోజు ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ విజయ రహస్యం ఇదే.

గాంధీ హత్య తర్వాత..

వార్డు మెంబర్​ ఎన్నికల్లో పోటీ చేసి కూడా గెలవలేదని ఇటీవల కొందరు ‘సర్ ​సంఘ్​ చాలక్’ను ఎద్దేవా చేస్తున్నారు. ‘సంఘ్’ ఈ దేశ సాంస్కృతిక చరిత్రకు సజీవ సాక్ష్యం అని వాళ్ళ‌కు తెలియదు. 1925 నుంచి ఈ వందేళ్లలో అనేక రాజకీయ, సామాజిక పరిణామాలను ‘సంఘ్’ చూడటమే గాక, అందులో భాగస్వామి అయింది. దాని పరిణామమే ఈరోజు కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు. సంఘ్​ సిద్ధాంతం భారతదేశ మహోన్నత వైభవం. ఇంతకు మించి వాళ్లకు ఏ ప్రయోజనం లేదు. ఈ క్రమంలో జరిగే అనేక ఘటనలు సంఘ్​ను దోషిగా చూపెడుతాయి. తర్వాత మబ్బుల్లా తేలిపోతాయి. ఇది కొత్తేమీ కాదు. మహాత్మా గాంధీ హత్యతో దేశమంతా అలజడి రేగింది.

విజయవాడ ఎస్​ఆర్​ఆర్–సీవీఆర్​ కాలేజీలో 10 వేల మందితో ఓ క్యాంపు జరుగుతున్నది. మహాత్ముడి హత్య వార్త తెలియగానే కమ్యూనిస్టులు జీప్​లకు మైకులు పెట్టుకొని క్యాంపుపై దాడి చేయండని రెచ్చగొట్టారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట అయిన విజయవాడలోని కొందరు స్టేషన్​లో రైళ్ళ నుంచి దిగుతున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది గాయపడ్డారు. కానీ అక్కడున్న ఎందరో నాయకులు ఎదురు దాడి చేయమని చెప్పలేదు. కార్యకర్తలను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు.

ఉత్తర తెలంగాణలో ఎందరో అఖిల భారత విద్యార్థి పరిషత్​ కార్యకర్తలను నక్సలైట్లు పట్టపగలు ప్రాణాలు తీశారు. కేరళలోనూ ‘కిషన్​మాస్టర్’​ అనే టీచర్​ను కమ్యూనిస్టులు క్లాస్​రూంలోనే నరికి తలను బల్లపై విద్యార్థుల ముందు పెట్టారు. వందలాది స్వయం సేవకులు ఈ రోజుకూ మరణిస్తూనే ఉన్నారు. అయినా వాళ్లు సేవ చేయడం మానటం లేదు. క్రమశిక్షణలో లోపం లేకుండా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అదే వారికి శ్రీరామ రక్ష అవుతున్నది.

– డా. పి. భాస్కర యోగి, సోషల్​ ఎనలిస్ట్.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు నిషేధించాలి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్
* మాజీ ముఖ్యమంత్రి సహా భాజపాలో చేరనున్న 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారంతా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌, అసెంబ్లీ స్పీకర్ ‌ను కలిశారు. ఈ మేరకు పార్టీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరారు. అంటే మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక భాజపాలో చేరిన నాయకుల జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్‌ లోబో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు.

ఇక 2019లో కూడా 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాహుల్ జోడో యాత్ర వేళ…. గోవాలో కాంగ్రెస్ ‌కు గట్టి షాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోడీ గొప్ప మానవతావాది – గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ ‌తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ ఇటీవల హస్తం పార్టీని వీడిన దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్‌ ఎట్టకేలకు తన రాజీనామాపై మౌనం వీడారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బలవంతంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఆజాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడుతోందన్నారు.

అప్పుడు 6 రోజులు నిద్రపోలేదు..

జీ23 నేతలతో కలిసి నేను పార్టీ అధిష్ఠానికి లేఖ రాసినప్పటి నుంచే నాకు, పార్టీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వారు (కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఉద్దేశిస్తూ).. తమనెవరూ ప్రశ్నించకూడదని అనుకుంటారు. ఎన్నోసార్లు కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. అందులో మేం చెప్పే ఒక్క సలహాను కూడా వారు తీసుకోలేదు. కానీ, పార్టీ కోసం మేం రక్తం చిందించాం. అందుకే తట్టుకోలేక ఆ లేఖ రాశాం. ఆ లేఖ రాయడానికి ముందూ, తర్వాత ఆరు రోజుల పాటు నేను నిద్రలేని రాత్రులు గడిపా” అని ఆజాద్‌ చెప్పుకొచ్చారు. రాజీనామా చేయాలని తాను ఎన్నడూ అనుకోలేదని, కానీ, తన ఇంట్లో నుంచి తానే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆయన దుయ్యబట్టారు.

ఏ క్షణమైనా కాంగ్రెస్‌ కూలిపోవచ్చు..

”కాంగ్రెస్‌ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారంతా ఎందుకూ పనికిరారు. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ సభ్యులను ఏకం చేయాల్సింది పోయి.. వారు పార్టీని వీడేలా చేస్తున్నారు. ‘మూలుగుతున్న’ కాంగ్రెస్‌ డాక్టర్‌ నుంచి కాకుండా కంపౌండర్‌ నుంచి మందులు తీసుకుంటోంది. ఆ పార్టీ పునాదులు బలహీనపడుతున్నాయి. ఏ క్షణమైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది” అని ఆజాద్‌ అభిప్రాయపడ్డారు.

30ఏళ్ల క్రితం సోనియా గాంధీపై ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడూ ఆమెను అలాగే గౌరవిస్తున్నానని ఆజాద్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా.. రాజీవ్‌-సోనియా కుమారుడిగా రాహుల్ ‌నూ అంతే గౌరవిస్తున్నానని అన్నారు. రాహుల్‌ గాంధీని విజయవంతమైన నేతగా చేయాలని అనుకున్నామని, కానీ ఆయన అంత ఆసక్తి చూపించలేదని చెప్పుకొచ్చారు.

అది కేవలం కాంగ్రెస్‌ ప్రచారం మాత్రమే..

ఈ సందర్భంగా ప్రధాని మోడీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. మోడీ చాలా కఠినమైన మనిషి అని మొదట తాను అభిప్రాయపడ్డానని అన్నారు. కానీ, ప్రధాని చాలా గొప్ప మానవతావాది అని కొనియాడారు. “అయితే భాజపాలో చేరుతున్నారా?” అని ప్రశ్నించగా.. ”నేను భాజపాలో చేరడం లేదు. ఆ నిర్ణయం జమ్మూకశ్మీర్‌లో నా రాజకీయాలకు ఏ మాత్రం ఉపయోగపడదు. ఇది కేవలం కాంగ్రెస్‌ ప్రచారం మాత్రమే” అని కొట్టిపారేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోడీ గొప్ప మానవతావాది – గులాం నబీ ఆజాద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ‌ద్ద భారీగా నల్లదనం!
ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్​లోని హావ్‌డాలో పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిలుగా గుర్తించారు. వీరు ఒక ఎస్‌యూవీ వాహనంలో బంగాల్‌లోని రాణిహటి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఒక నల్ల కారులో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా అవుతున్నట్టు మాకు సమాచారం అందింది. దీంతో వాహనాల తనిఖీ మొదలుపెట్టాం. ఇందులో భాగంగా ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేల ఎస్‌యూవీని పరిశీలించినప్పుడు నగదు బయటపడింది. ఈ సొమ్మును లెక్కించడానికి యంత్రాలను తెప్పించాం. నగదు గురించి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం” అని హావ్‌డా ఎస్పీ (గ్రామీణ) స్వాతి భంగాలియా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ‌ద్ద భారీగా నల్లదనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్మృతి ఇరానీపై ట్వీట్లు తీసేయండి… కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు పంపింది. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్ట్‌లు, వీడియోలు, ఫోటోలు తొలగించాలని వారిని ఆదేశించింది.

వ‌చ్చేనెల‌ 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్‌ నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను 24 గంటల్లోగా ప్రతివాదులు అమలు చేయడంలో విఫలమైతే ఈ కేసులో సోషల్‌మీడియా లేదా ట్విటర్‌ సంస్థ ద్వారా వాటిని తొలగించాల్సి వుంటుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

కాంగ్రెస్ నేతల ట్వీట్లు ద్వారా పిటిషన్⁬దారు పరువుకు భంగం వాటిల్లిందని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ మణి పుష్కర్ణ అభిప్రాయపడ్డారు. నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినట్టు అర్థమవుతోందని చెప్పారు. తనపైన, తన కుమార్తె పైన నిరాధార ఆరోపణలు చేశారంటూ రూ.2 కోట్లకు స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై సివిల్ డిఫమేషన్ కేసు వేశారు.

కాగా, వాస్తవాలను కోర్టు ముందుంచేందుకు ఎదురు చూస్తున్నామని, స్మృతి ఇరానీ ఆరోపణలను సవాలు చేస్తామని, నిరూపిస్తామని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. మరొవంక, కాంగ్రెస్ నేతల వైఖరిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులైనా, ఒక హోదాలో ఉన్న వారిపై కించపరిచే ఆరోపణలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని చురకలంటించారు.

స్మృతి ఇరానీ కూతురు(18) గోవాలో ఎలాంటి అనుమతులు లేకుండా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తన కూతురు ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని చెప్పారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలపై పరువు నష్టం దావా వేశారు.

గోవాలో బార్ల విషయంలో త‌న కూతురుపై ఆరోప‌ణ‌లను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ కోరారు. ఈ విషయాన్ని లీగల్‌ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని మంత్రి స్మృతి ఇరానీ త‌న ప‌రువు న‌ష్టం దావాలో డిమాండ్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్మృతి ఇరానీపై ట్వీట్లు తీసేయండి… కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారి లూటీపై మాట్లాడినందుకే ఆరోపణలు: రాహుల్‌పై మండిప‌డ్డ స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే 2024 ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాహుల్​కు మరోసారి ఓటమి తప్పదని మండిపడ్డారు. తన కుమార్తె అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇరానీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

’18ఏళ్ళ‌ ఓ యువతిని, ఓ కాలేజీ విద్యార్థినిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఆమె క్యారెక్టర్​ను నాశనం చేసింది. ఆ యువతి తల్లి రాహుల్ గాంధీపై పోటీ చేయడమే చేసిన తప్పు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేసిన రూ.5వేల కోట్ల లూటీ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమే నేను చేసిన తప్పు. అందుకే నా కుమార్తెపై ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపించినట్టు నా కూతురు బార్ నడపడం లేదు. కాలేజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ తప్పుడు ఆరోపణలపై నేను కోర్టులోనే తేల్చుకుంటాను’ అని స్మృతి స్పష్టం చేశారు.

అంతకుముందు, గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె అక్రమంగా బార్‌ నడుపుతున్నందున, ఆమెను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. స్మృతి ఇరానీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి పవన్‌ ఖేరా.. గోవాలో ఆమె కుమార్తె నకిలీ లైసెన్స్‌తో బార్‌ నడుపుతున్నట్టు ఆరోపించారు. ఇది గోవా చట్టాలకు వ్యతిరేకం అని అన్నారు.

ఖండించిన స్మృతి కుమార్తె..

ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ సైతం ఖండించారు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని అందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చెబుతున్న రెస్టారెంటుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ జోయిష్‌ తన లాయర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించారు. 18ఏళ్ల జోయిష్‌ వర్ధమాన చెఫ్‌ అని, అనేక రెస్టారెంట్లలో వంటలు చేస్తుంటారని ఆమె లాయర్‌ పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారి లూటీపై మాట్లాడినందుకే ఆరోపణలు: రాహుల్‌పై మండిప‌డ్డ స్మృతి ఇరానీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గాంధీ, నెహ్రూల పేరుతో కాంగ్రెస్ వాళ్ళు కావాల్సినంత సంపాదించారు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగ‌ళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.

గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనం 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈమాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ కే. ‘కాంగ్రెస్‌ పార్టీ గత 60 ఏళ్ళ‌లో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గాంధీ, నెహ్రూల పేరుతో కాంగ్రెస్ వాళ్ళు కావాల్సినంత సంపాదించారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.