Communists double standards – Vishwa Samvad Kendra Andhra Pradesh

నేటి జాగృత హిందూ సమాజం ముందు మీ జిత్తులేవీ పారవిక
భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం కనుగొన్న తర్వాత నుండి హిందూ దేశాన్ని కబళించాలనే కుట్రకు పాశ్చాత్య క్రైస్తవ దేశాలు తెరతీశాయి. పోర్చుగీసు వారు గోవాను తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అక్కడ అంతులేని నరమేధం సృష్టించారు. వేలాది మందిని మత విచారణల పేరుతో సజీవ దహనం చేశారు. ఆంగ్లేయుల వలస పాలనా కాలంలో దేశాన్ని క్రైస్తవీకరణ చేయటానికి రెండు వందల సంవత్సరాల పాటు ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యం కాలేదు. ఆంగ్ల చరిత్రకారులు, పాలకులు హిందూ ధర్మాన్ని, హిందువులను, హిందూ దేశాన్ని కించపరుస్తూ అనేక అభూత కల్పనలతో కూడిన రచనలు చేశారు. వలస పాలకులు, ఆంగ్ల మిషనరీల మతమార్పిడి కార్యకలాపాలకు తమ మద్దతును తెలిపారు. ఒక క్రైస్తవ సన్యాసిని ప్రచారాన్ని అడ్డుకున్నందుకు జరిగిన ప్రతీకార చర్యే జలియన్ వాలా బాగ్ దురంతమన్న సంగతి చాలామందికి తెలియక పోవచ్చును కూడా.

ఆంగ్లేయులు తమ అణచివేతను, దోపిడీని సమర్థించుకోవడానికి జాతి పరంగానూ, సంస్కృతి పరంగానూ అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు. అమెరికన్, ఇంగ్లండ్ పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు. ఆ వ్యాసాల నిండా అనేక అతిశయోక్తులు, అబద్ధాలు, అసత్యాలు ఉండేవి. వాటి ఆధారంగా భారతదేశ చరిత్రను నిర్మాణం చేయించారు వలస పాలకులు.

పేద దేశమైతే వాణిజ్య సంబంధాలకై పాశ్చాత్య దేశాల ఆరాటమెందుకు?

హిందువులు మొరటు వారని, నాగరికత తెలియని వారని, విగ్రహాలను, పాములను పూజించేవారని, ఏ పనీ చేయకుండా తినే సోమరిపోతులని, దేశద్రిమ్మరులని, మూఢనమ్మకాలతో బ్రతికే వారనే అవాకులూ చవాకులు వ్రాశారు. హిందువులు నిజంగా చేతకానివారైతే, అకర్మణవాదులైతే అంత సంపద ఎలా సృష్టించగలిగారు? ఎందుకు పాశ్చ్యాత్య క్రైస్తవ దేశాల వారు శతాబ్దాలపాటు భారతదేశాన్ని కబళించాలని అనేక కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడ్డారు? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు కొలంబస్ ఎందుకు బయల్దేరాడు? ఒక పేద దేశంతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి పాశ్చ్యాత్య క్రైస్తవ దేశాలు పోటీకి దిగి దశాబ్దాలపాటు ఎందుకు ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకున్నాయి?

భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన తర్వాత కూడా దేశం పట్ల వారి వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదు. భారత్ లో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్దదిగా చేసి అంతర్జాతీయంగా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. క్రైస్తవ మిషనరీల ద్వారా మత ప్రచారం జోరుగా సాగిస్తూనే ఉన్నారు. అనేక అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు.

వలసపాలకులకు వంత పాడుతున్న వామపక్ష మేథావుల సరికొత్త కుట్ర

వలస పాలకులను వామపక్ష మేథావులు అనుసరిస్తున్నారు. శతాబ్దాల తరబడి హిందువులపై జరిగిన అత్యాచారాలను వారు కప్పిపుచ్చారు. హిందువులపై జరిగిన కనీవినీ ఎరుగని నరమేథం గురించి వారెన్నడూ మాట్లాడలేదు. ఈనాటికీ హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను వారెన్నడూ ఖండించలేదు. హైందవ సమాజంలోని లోపాలను పదే పదే ఎత్తి చూపి కువిమర్శలకు పాల్పడే వీరు ఇతర మత సమూహాల, సమాజాల లోటుపాట్ల గురించి చర్చించటానికి సైతం భయపడుతూ వుంటారు. భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి వలస పాలకుల కంటే ఈ కుహనా మేథావులే ఎక్కువ ద్రోహం  చేస్తున్నారు. అందులో భాగంగానే Dismantling Global Hindutva అనే సదస్సును వారు సెప్టెంబరు 10 – 12 తేదీల మధ్య నిర్వహించదలచారు. వామపక్ష మేధావులు ఆ సదస్సులో పాల్గొని హిందూ ధర్మం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లకు సంబంధించి అనేక విషయాలపై విశ్లేషించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ సదస్సు నిర్వాహకుల పేర్లు మాత్రం బయటకు రాలేదు. అమెరికాలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలను భాగస్వాములుగా చేసి పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు.

అయితే మనదేశంలోనూ, అమెరికాలోనూ హిందూ సంస్థలు అందుకు దీటుగా నిర్వాహకుల దురుద్దేశాలను ప్రపంచానికి తెలియజేయగలిగాయి. హిందూ ధర్మం మీద విషాన్ని చిమ్మడానికి, తద్వారా జాతికి ద్రోహం చేయడానికి సిద్ధమైన వామపక్ష మేధావుల దురాశ నెరవేరలేదు. ఆ సదస్సును వారు జరుపలేక పోయారు.

ఇంతకూ హిందువులకు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెయ్యాలన్న ఎజెండా ఉందా? ప్రపంచంలో రెండే హిందూ దేశాలున్నాయి. ఒకటి నేపాల్ రెండవది మనది. మిగతా దేశాలలో హిందువులు ఉండవచ్చు. హిందూ సంస్కృతి, ధర్మం వ్యాప్తి చెంది ఉండవచ్చు. ప్రపంచాన్ని మొత్తం హైందవమయం చేయాలన్న ఎజెండా హిందువులకు ఎన్నడూ లేదు. అందుకు కావలసిన ఆర్థిక వనరులు లేవు. దేశంలో హిందూ ధర్మం అబ్రహామిక్ మతాల నుంచి తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న క్రైస్తవ మత వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మన దేశంలో మొదలయ్యాయి. స్వదేశంలోనే స్వధర్మాన్ని కాపాడుకోలేని పరిస్థితులలో ఉన్న హిందువులు ప్రపంచాన్ని హైందవీకరణ ఎలా చేయగలరు? చాలా హాస్యాస్పదమైన ఆలోచన. లేని అజెండాను హిందువుల పై రుద్ది, హిందూ దేశం మీద, హిందూ ధర్మం మీద విషం కక్కటమే ఈ సదస్సు నిర్వాహకుల లక్ష్యం.

అసలిదంతా ఎందుకు చేస్తున్నట్టు?

అంతేకాదు అమెరికా మీద జిహాదీల దాడి జరిగి ఈ సెప్టెంబర్ కు రెండు దశాబ్దాలు అవుతుంది. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్ జిహాదీలు ఆక్రమించారు. ఈ అంశంపై నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఈ సదస్సును నిర్వహించదలచుకున్నారా?

పాశ్చ్యాత్య క్రైస్తవ దేశాలకు ఇస్లామిక్ దేశాలకు మధ్య కొన్ని శతాబ్దాల పాటు పవిత్ర మత యుద్ధాలు, అంటే క్రూసేడులు జరిగాయి. క్రైస్తవం, ఇస్లాంలు రెండూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఎజెండా కలిగినవే. మొదటిది ప్రలోభాలతో, రెండవది బలప్రయోగంతో విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు అబ్రహామిక్ మతాల మధ్య పోటీ, వైరం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. హిందువులకు అసలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న ఆకాంక్షే లేదు.

కానీ అబ్రహామిక్ మతాలకు మాత్రం హిందువుల పట్ల ఒక ఉమ్మడి అజెండా ఉంది. ఎలాగైనా ఈ దేశం నుంచి హైందవాన్ని పారద్రోలాలని అవి నిర్విరామంగా పనిచేస్తున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందాన హైందవానికి బద్ధ శత్రువులైన అబ్రహామిక్ మత పెద్దలు చేతులు కలిపారు. హిందూ వ్యతిరేక సదస్సులకు, పత్రికా ప్రసార సాధనాలకు, రాజకీయ నాయకులకు వారు ఉమ్మడిగా అన్ని రకాల సహాయ సహకారాలూ అందిస్తున్నారు. వారు వామపక్ష మేథావులను చేరదీశారు. ప్రత్యక్షంగా విమర్శించడం, కించపరచడం కంటే నాస్తికులైన వామపక్ష మేధావుల ద్వారా హిందూ వ్యతిరేక ప్రచారం చేయించటం మెరుగైన వ్యూహంగా వారికి తోచింది.  ఆ వ్యూహంలో భాగంగానే ఈ కుహనా మేథావులను ముందు పెట్టి ఆ హిందూ వ్యతిరేక సదస్సును నిర్వహించదలచారు.

ఏకైక దైవ మతాలు తమ మార్గమే సరియైనదని విశ్వసించి, ఇతరులపై తమ నమ్మకాలను రుద్దుతాయి. అందుకు భిన్నంగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక స్వేచ్ఛను, సత్యాన్వేషణను ప్రోత్సహిస్తుంది. అందువల్ల హిందువులకు ఒక కేంద్రీకృత మత వ్యవస్థ లేదు. క్రైస్తవంలో పోపు, ఇస్లాంలో ఖలీఫాల వలె మత విషయాలలో సర్వాధికారాలు గల మత పెద్ద ఎవరూ లేరు.   కానీ ఆ లోటును రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ భర్తీ చేస్తుందని హిందూ వ్యతిరేకుల గట్టి నమ్మకం. దేశవ్యాప్తంగా పని చేస్తున్న ఏకైక హిందూ సంస్థ ఆర్ ఎస్ ఎస్. త్వరలోనే శతజయంతిని జరుపుకోబోతున్న ఆర్ఎస్ఎస్ ను బలహీనపరచడం ద్వారా హిందూ ధర్మాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలన్నది వారి ఉద్దేశ్యం.

ఆ ఉద్దేశ్యాన్ని వారేమీ దాచుకోలేదు కూడా. ఆ సదస్సు వివరణ పత్రంలో కాషాయ ధ్వజం కింద ధ్వజప్రణామ్ చేస్తున్న స్వయంసేవకులను పెకిలించి వేస్తున్నట్లుగా కూడా చూపించారు. కానీ వామపక్ష మేథావుల కల ఎన్నటికీ నెరవేరదు. ఇప్పుడు హిందువులు మేల్కొని ఉన్నారు. ఇప్పటి హిందువులు వలస పాలన కాలం నాటి అమాయక హిందువులు కాదు. అన్ని రంగాలలోనూ ఎంతో ముందంజలో ఉన్నారు. తమ తప్పుడు వ్రాతలతో హిందువులను వారు ఇకపై మోసగించలేరు. ఖండాంతరాలలో విస్తరించిన హిందువులు ధర్మాన్ని కాపాడుకోవడానికి ధర్మంపై దాడి జరిగినప్పుడు పెద్దపెట్టున ఏకోన్ముఖులై ఖండిస్తున్నారు. ఏకపక్ష, పక్షపాత విమర్శలను తిప్పికొడుతున్నారు. వలసవాదులు, అబ్రహామిక్ మతాలు, వామపక్షాల అపవిత్ర కలయికను ఎండగడుతున్నారు.

హిందూ సమాజం జాగృతమై ఉంది. జర జాగ్రత్త !

హిందూ సమాజం జడంగా లేదు. నిరంతరంగా ప్రగతి శీలంగా ఉంది. మహిళలపై ఆంక్షలు లేవు. ‘నిమ్న కులాలు’ అని ఒకప్పుడు పిలవబడిన వారి చేతుల్లోనే ఇప్పుడు రాజ్యాధికారం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులలో దళిత, గిరిజనులకు చెందిన వారే అధికం. ఇప్పుడు కులాంతర వివాహాలు సైతం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాటిని సమాజం ఆమోదిస్తున్నది కూడా. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు కులాంతర వివాహం చేసుకున్నవారు కనబడుతున్నారు. అన్ని కులాల కంటే అణగారిన వర్గాలలోనే స్వాతంత్రం వచ్చాక విద్య, ఉద్యోగ, ఆర్థిక సాధికారత విస్తరించింది. దేశం, సమాజం గర్వపడే అంశాలివి.

వలస కాలపు చరిత్రకారులు వ్రాసిన అబద్ధాలు, అసత్యాలు పట్టుకొని ఆ దృక్కోణంలోంచే చూస్తూ హిందూ సమాజం అచేతనావస్థలో ఉందని, అసమానతలను ప్రోత్సహిస్తోందని, అవి కొనసాగుతున్నాయని, మహిళలపై, అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని చేసే ప్రచారమంతా బూటకమే. గోరంతలు కొండంతలు చేసి, పదే పదే చెప్పి, వ్రాసి హిందూ సంస్థలను తాలిబన్లతోనూ, క్రూసేడర్లతోనూ పోల్చే ప్రయత్నం అసమంజసం. దురుద్దేశాలతో కూడినది. ఈ సవాలును స్వీకరించడానికి, తాత్వికంగానూ, ధార్మికంగాను ఎదుర్కోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. తన బలహీనతలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు ఏమాత్రం వెనుకాడని హిందూ సమాజం ఈ దేశ ద్రోహులకు దీటైన సమాధానం చెప్పగలదు. ఇప్పటికైనా కుయుక్తులు మాని తమ హిందూ వ్యతిరేకతను మానుకోకపోతే విదేశీ ముస్లిములకు, ఆంగ్లేయులకు పట్టిన గతే ఈ వామపక్ష మేథావులకూ పడుతుంది. 1893 సెప్టెంబర్ 9న చికాగోలో స్వామి వివేకానంద పూరించిన హిందూ శంఖారావం ఇంకా హిందువుల చెవుల్లో మార్మ్రోగుతూనే ఉంది. ఖబడ్దార్.

– డాక్టర్ బి. సారంగపాణి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి జాగృత హిందూ సమాజం ముందు మీ జిత్తులేవీ పారవిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శిలువలను, యేసు చిత్రాలను ధ్వంసం చేయండి, ఆ స్థానంలో మావో, జిన్‌పింగ్ చిత్రాలను ఉంచండి: క్రైస్తవులకు చైనా ప్రభుత్వం ఆదేశాలు
క్రైస్తవ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్రాలను, పోస్టర్‌లను తొలగించి వాటిని మావో జెడాంగ్ మరియు ఇతర కమ్యూనిస్ట్ నాయకుల చిత్రాలతో భర్తీ చేయాలని కోరడం ద్వారా తమ పట్టణంలో క్రైస్తవుల మత స్వేచ్ఛను తొలగించడానికి చైనా అధికారులు ప్రయత్నిస్తున్నారని, షాంకి ప్రావిన్స్‌లోని ఒక పట్టణమైన లిన్‌ఫెన్‌కు చెందిన స్థానిక పాస్టర్ బిట్టర్ వింటర్ పేర్కొంటున్నారు.

మతపరమైన అణచివేతకు కొనసాగింపుగా, చైనా అధికారులు క్రైస్తవులను తమ విశ్వాసాన్ని త్యజించి, శిలువలను, చర్చిలలో యేసు చిత్రాలను తొలగించి ఆ స్థానంలో ఛైర్మన్ మావో ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ చిత్రాలను ఉంచకపోతే వారు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆదేశించారు.

డైలీ మెయిల్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, దేశంలో మతం యొక్క అభివ్యక్తిని అణిచివేసేందుకు చైనా అధికారులు సమష్టి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మైనారిటీలపై ప్రభుత్వ అనుమతి పొందిన హింసలో భాగంగా చైనా అధికారులు ఇటీవల అన్హుయి, జియాంగ్సు, హెబీ మరియు జెజియాంగ్‌తో సహా పలు ప్రావిన్సులలోని చర్చిలలో మతపరమైన చిహ్నాలను బలవంతంగా పడగొట్టారు.

చర్చి పైనున్న శిలువను భారీ యంత్రాలతో తొలగిస్తున్న దృశ్యం

స్వతంత్ర అవుట్లెట్ బిట్టర్ వింటర్ ను ఉటంకిస్తూ, డైలీ మెయిల్‌లో ప్రచురించిన కథనం క్రైస్తవులను మతపరమైన చిత్రాలను తీసివేసి, వాటి స్థానంలో కమ్యూనిస్ట్ నాయకుల చిత్రాలను ఉంచాలని షాంకి ప్రావిన్స్ అధికారులు ఆదేశించారని వెల్లడించింది.

చైనా ప్రావిన్స్ లోని హువైనాన్‌లో మతపరమైన వ్యవహారాల అధికారులు గడచిన శని, ఆదివారాలలో స్థానిక శివాన్ క్రైస్ట్ చర్చిలోకి బలవంతంగా ప్రవేశించి దానిలోని శిలువను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఒక వారం ముందే చర్చిలోని శిలువను తొలగించమని అధికారులు ఆదేశించినట్లు స్థానిక వనరులను ఉటంకిస్తూ రేడియో ఫ్రీ ఆసియా సమాచారాన్ని వెల్లడించింది.

శిలువను పడగొట్టడానికి చైనా అధికారులు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, వారు అక్కడే వున్న డజన్ల కొద్దీ విశ్వాసుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారని, వారు శిలువను పడగొట్టకుండా అధికారులను ఆపడానికి గుమిగూడారని కూడా రేడియో ఫ్రీ ఆసియా పేర్కొంది.

జూలై 7 న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యోంగ్జియాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. స్థానిక ప్రభుత్వం అయోడి క్రైస్ట్ చర్చి మరియు యిన్‌చాంగ్ క్రైస్ట్ చర్చిపై వున్న శిలువలను పడగొట్టడానికి 100 మంది కార్మికులను పంపినట్లు అమెరికాకు చెందిన చైనా ఎయిడ్ పేర్కొంది. స్థానిక సమాచారం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు చర్చిలలోకి బలవంతంగా ప్రవేశించారు. చర్చిల ఆస్తులను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన 80 ఏళ్ళ మహిళతో సహా అక్కడ వున్న క్రైస్తవులను కొట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద క్రైస్తవులు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం కొనసాగించాలనుకుంటే వారు తమ మతపరమైన చిహ్నాలను ధ్వంసం చేయాలని, ఆ స్థానంలో కమ్యూనిస్ట్ నాయకుల పోస్టర్లను ప్రదర్శించాలని ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.

చర్చిలోని మత చిహ్నాలను తొలగించడానికి యంత్రాలతో వస్తున్న అధికారులు

ఈ చర్య చైనా అంతటా మత సంస్థలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) యొక్క భారీ అణచివేత వ్యూహానికి అనుగుణంగా ఉంది. దేశ ప్రధానమంత్రిగా జి జిన్‌పింగ్ రావడంతో, దేశంలో మతపరమైన కార్యకలాపాలను ప్రక్షాళన చేయడానికి CCP చర్యలు దృఢముగా కొనసాగుతున్నాయి. చర్చిలు మరియు మసీదులను కూలగొట్టాలని, టిబెటన్ పిల్లలు బౌద్ధ మత అధ్యయనాలను కొనసాగించకూడదని, అలాగే ఉఘర్ ముస్లిం మైనారిటీలలో ఒక మిలియన్ మందికి పైగా సభ్యులను నిర్బంధ శిబిరాల్లో విద్యాభ్యాసం చేయించటానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ అణిచివేత చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ జారీ చేసిన స్పష్టమైన సూచనల ప్రకారమే జరుగుతున్నాయి. అన్ని మతాలు కమ్యూనిస్ట్ పార్టీకి విధేయులుగా ఉండడం తప్పనిసరి. నవంబర్ 2019 లో అన్ని మత గ్రంథాల యొక్క బోధనలను సమీక్షించి, సవరించడానికి కూడా CCP ఒక ఉత్తర్వు జారీ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉండే కొత్త కంటెంట్ ఏదీ వాటిలో ఉండకూడదని దేశ ఉన్నతాధికారులు ఆదేశించారు. చైనాలోని జాతి మరియు మతపరమైన సమస్యలకు బాధ్యత వహిస్తున్న చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ జాతీయ కమిటీ యొక్క జాతి మరియు మతపరమైన వ్యవహారాల కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. సమావేశాన్ని పర్యవేక్షించిన చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్ యాంగ్ మాట్లాడుతూ, అధ్యక్షులు జి యొక్క ఆదేశాలకు మతపరమైన అధికారులు కట్టుబడి ఉండాలని మరియు ‘సోషలిజం యొక్క ప్రధాన విలువలు’ మరియు అవసరాలకు అనుగుణంగా వివిధ మతాల సిద్ధాంతాలను వివరించాలని అన్నారు.

SOURCE : OPINDIA

https://www.opindia.com/2020/07/china-jesus-christian-cross-demolish-communist-party-xi-jinping-mao-symbols/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శిలువలను, యేసు చిత్రాలను ధ్వంసం చేయండి, ఆ స్థానంలో మావో, జిన్‌పింగ్ చిత్రాలను ఉంచండి: క్రైస్తవులకు చైనా ప్రభుత్వం ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.