CHRISTIAN CONVERSION MAFIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు
క్రైస్తవులుగా మతం మారిన వారిని సోషల్ మీడియా తదితర మాధ్యమాలలో కొందరు తరచుగా గొఱ్ఱెలని సంబోధిస్తూ ఉండడం కనిపిస్తోంది. వారేం పాపం చేశారని వారినలా పిలుస్తున్నాం? అసలు మనకేం అర్హతుందని వారినలా నిందిస్తున్నాం? అలా అవమానించి ఎందుకు హిందూ సమాజానికి వారిని మరింత దూరం చేస్తున్నాం? ఇంతకీ వారిని మన ధర్మంలోనే నిలిపి ఉంచుకోవడానికి, వెళ్ళినవారిని తిరిగి తెచ్చుకోవడానికి మనమేం ప్రయత్నం చేశాం?

ఒక పెద్దాయన్ని అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారి అబ్బాయి చేర్పించాడు. వారి బెడ్ దగ్గరకు ఒక పాష్టర్ వచ్చి “ప్రార్ధన చేస్తాను… తలకింద బైబిల్ పెట్టుకో… నీకు వచ్చిన రోగం త్వరగా తగ్గిపోతుంది” అని చెప్పాడు. వారి అబ్బాయి, ఆ పెద్దాయన ఇద్దరూ వద్దు పొమ్మన్నారు. అయినా ఆ పాష్టర్ విడిచిపెట్టలేదు. రోజూ వస్తూనే ఉన్నాడు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

కొన్ని రోజులకు ఆ పెద్దాయన ఆలోచన మారింది. ఏ పుట్టలో ఏ పాముందో…. ప్రయత్నించి చూద్దామనుకున్నాడు. పాస్టర్ చెప్పినట్లుగా ప్రార్థన చేయించుకుని బైబిల్ తలకింద పెట్టుకున్నాడు. తెల్లవారేసరికి ఆ పెద్దాయనకి హుషారు వచ్చినట్లు అనిపించి వాళ్ళ అబ్బాయి రాగానే “నాకు చాలా వరకు తగ్గిపోయింది. పాస్టర్ చెప్పినట్లుగా తలకింద బైబిల్ పెట్టుకున్నాను” అని సంతోషంగా అబ్బాయికి చెప్పాడు. అబ్బాయికి అనుమానం వచ్చింది. ఆ రాత్రి వాళ్ళ నాన్న గారికి ఏ మందులిచ్చారో చెప్పమని నర్సును గట్టిగా బెదిరించాడు. అప్పుడు అసలు విషయం బైటకొచ్చింది. పాస్టర్ ప్రార్థన చేసిన తరువాత వారి మాయలో భాగంగా… సదరు నర్సు ఆ రాత్రి ఆయనకు స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చింది. నిజానికి చివర దశలో ఉన్నవారికి ఇవ్వవలసిన ఇంజక్షనది. అవసరం లేనివారికి ఆ ఇంజక్షన్ ఇస్తే బాడీలోని కొన్ని భాగాలు త్వరగా దెబ్బతింటాయి. కానీ తాత్కాలికంగా కొద్దిసేపు మనిషి హుషారు వచ్చి ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఫీలవుతారు. అమాయకులను మతం మార్చటానికి పాష్టర్లకి ఆ గ్యాప్ చాలు. చదువుకున్నవారే క్రైస్తవ మతమార్పిడి మాఫియా కుట్రలకు ఆ విధంగా భోల్తా పడిపోతూ ఉంటే ఇక అమాయకుల పరిస్థితేమిటి ? ఇక్కడ మీకు ఆ పాష్టరు గాడి మోసం కనుబడుతున్నదేమో గానీ నాకు మాత్రం వాడి పట్టుదల కనిపిస్తోంది. మన వారిని మన ధర్మంలోనే నిలిపి ఉంచుకోవడానికి, ఏదో కారణం వల్ల వీడి వెళ్ళినవాళ్ళని తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవడానికి మనం కూడా అంతే తీవ్రంగా, ఆర్తిగా, పట్టుదలగా ఏనాడన్నా ప్రయత్నించామా?

నిజానికి మతం మారారంటే…. వారి అమాయకత్వం అది. వారికి మంచీచెడూ వివరించి చెప్పేవాళ్ళు లేరిక్కడ. ఆదరించేవాళ్ళు లేరు. ఖర్చుతో కూడుకున్న పూజా విధానమే తప్ప, సరళమైన పూజా విధానం నేర్పేవారు లేరు. కష్టకాలంలో పలుకరించి, ఓదార్పును, స్వాంతనను చేకూర్చేవాళ్ళు లేరు. అవతలివాడు ఊదరగొడుతున్నాడు. చెవినిల్లుగట్టుకుని పోరుతున్నాడు. మతం మారితే నీకంతా మంచే జరుగుతుందంటూ ఊరిస్తున్నాడు. తృణమో, ఫణమో ముట్టజెబుతున్నాడు. మతం మారాకెలాగూ దశమభాగం పేరుతో వాడిదగ్గరెలాగూ అంతకంత గుంజుతాడనుకోండి…. అది వేరే విషయం. వాడికి ఆరోగ్యం బాగోకపోతే ప్రార్థనలు చేస్తున్నాడు. ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. ఇలా అనేకానేక ప్రయత్నాల తర్వాతనే అమాయకులు వారి వలలో చిక్కుతున్నారు. ఈ మధ్యలో మనం వాడిని ఒక్కసారి కూడా పలుకరించి ఉండం. వాడి కష్టం తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేసుండం…. ఒక్కరైనా ఒక్కసారైనా పలుకరించుంటే, వాడి కష్టం తెలుసుకుని ఓదార్చి ఉంటే, వాడి కష్టం తీర్చే ప్రయత్నమేదన్నా చేసుంటే వాడు ఖచ్చితంగా మతం మారుండేవాడు కానే కాదు.

ఇప్పుడు కూడా చూడండి…. SSF రూపంలోనో, ధర్మజాగరణ సమితి రూపంలోనో ఎవరైనా వెళ్లి అలా పలుకరించగానే…. వారు పులకరించిపోతున్నారు. కన్నీరు కారుస్తూ చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతూ తిరిగి అమ్మ ఒడి చేరడానికి ఉబలాటపడుతున్నారు. తిరిగి రావాలనున్నా రాలేక, ఎలా రావాలో తెలీక సతమతమవుతున్నవారూ ఎందరో ఉన్నారు. మనం మాత్రం వారిని గొఱ్ఱెలు, బఱ్ఱెలంటూ అవమానించి మరింత దూరం చేసుకుంటున్నాం. వారందరూ మన సోదరులే…. రేపో మాపో మన ఇళ్లు (వారి సొంత ఇంటికి) చేరవలసినవారే. మనం సదా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అందుకై వారికి అన్ని విషయాలనూ ఓపిగ్గా వివరించాలి. వారు వినరు, వాదిస్తారు, గొడవ కూడా పెట్టుకుంటారు, దుర్భాషలాడతారు, అవకాశముంటే ఇబ్బందులకు కూడా గురిచేస్తారు. ఇన్నాళ్ళూ చర్చిలలో వాళ్ళకి ఆ మౌఢ్యాన్ని, అజ్ఞానాన్ని, వారి మాతృధర్మం పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఆ మత్తులో, మాయలో ఉన్నారు వారు. ఆ మాయ తెరలను మనం ఓపిగ్గా తొలగించాలి. చైతన్యవంతులను చెయ్యాలి. అందుకు కావలసింది వారిపట్ల మనకు అపారమైన ప్రేమ, కరుణ, ఆత్మీయత, బంధుభావన… అంతేతప్ప తక్కువ భావన కాదు. అవమానించడం కాదు, అవహేళన చెయ్యడం కాదు. వారు గొఱ్ఱెలు కాదు. తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు. మనవారే… మన సోదరులే వాళ్ళు. వారిని తిరిగి మన సింహం గూటిలోకి తెచ్చుకుందాం. మన చిట్టచివరి సోదరుడు సైతం తిరిగి మన చెంత చేరేవరకూ మనం అవిశ్రాంతంగా, అలసిపోకుండా ప్రయత్నిస్తూనే ఉందాం… భారత్ మాతాకీ జయ్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తప్పిపోయి గొఱ్ఱెల మందలో కలిసిన సింహాలు వాళ్ళు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సామూహిక మత మార్పిడులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఆగష్టు 29 ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రార్థన జరుగుతుండగా పాస్టర్ కావల్సింగ్ పరాస్తే ఇంట్లోకి దుండగులు చొరబడి.. దాడి చేశారు. పరాస్తే ఇంటిని కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు.

కబీర్‌ధామ్ పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా స్థానికులు అతని ఇంట్లోకి చొరబడ్డారని.. ఆరాధనకు సంబంధించిన వస్తువులను ధ్వంసం చేసి, పత్రికలను కూడా చింపివేశారు’ అని చెప్పారు. మత మార్పిడులను ఆపాలని నినాదాలు చేశారని ఆయన అన్నారు. దాడి గురించి అప్రమత్తమైన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుందని గార్గ్ సమాచారం అందించారు. ఈ విషయంలో కేసు నమోదైంది తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని గార్గ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

AP : మతమార్పిళ్లు, ఎస్సీ హోదా దుర్వినియోగంపై రాష్ట్రపతికి గ్రామస్థుల ఫిర్యాదు
అక్రమ చర్చి నిర్మాణం, ఎస్సీ కులస్థులను క్రైస్తవ మతంలోకి మార్చడం, క్రైస్తవులుగా మారిన వ్యక్తులు తమపై ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టడం వంటి అంశాలపై ఆగ్రహించిన ఆ గ్రామ ప్రజలు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే న్యాయపరమైన పోరాటం సాగిస్తామని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు తేల్చిచెప్పారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం గుఱజాల గ్రామంలో చోటుచేసుకుంది.

బాధితులు పేర్కొన్న వివరాల ప్రకారం.. క‌ర్నూల్ జిల్లా నంద‌వ‌రం మండ‌లంలోని గుఱ‌జాల గ్రామంలో ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి అనుమ‌తులు తీసుకోకుండా 2018లో  ఐఎంబీ చర్చి పేరిట ఒక క్రైస్తవ ప్రార్ధనా మందిరాన్ని నిర్మించారు. అంతటితో ఊరుకోకుండా ఆ గ్రామంలో ఉండే ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజలను క్రైస్తవంలోకి మార్చడం మొదలైంది. ఈ క్రమంలో ఇటీవల ఐఎంబీ చర్చి చుట్టూ ప్ర‌హ‌రీ గోడ నిర్మాణం చేపట్టేందుకు చర్చి పాస్టర్ ప్రయత్నించగా, దీని కారణంగా సమీపంలోని ప్రాచీన శివాలయం వద్ద జరిగే ఊరేగింపు ఉత్సవాలకు ఆటంకం ఏర్పడుతుందని, ఈ ప్రయత్నం విరమించుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేసినప్పటికీ చర్చి పాస్టర్ పట్టించుకోలేదు. దీంతో గ్రామస్థులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేయడంతో ఎంపీడీఓ ఫజల్ భాషా స్వయంగా విచారణ చేసి, నిర్మాణం చేసిన చర్చి గ్రామకంఠంలో ఉందని, ఇప్పుడు నిర్మించ తలపెట్టిన ప్రహారీ గోడ స్థలం కూడా గ్రామకంఠానిదే అని, దీని కారణంగా ప్రాచీన శివాలయంలో జరిగే ఉత్సవాలకు ఆటంకం కలుగుతుంది కనుక దీని నిర్మించకూడదు అని చర్చి యాజమాన్యానికి, గ్రామ అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కు కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రహరీ గోడ నిర్మాణం ఆగిపోయింది.

తాజాగా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను పనిలోకి రానివ్వడంలేదని, తమను వివక్షకు గురిచేస్తున్నారని ఆరోపించిన బాధితులు, చర్చికి ప్రహారీ గోడ నిర్మాణం విషయంలో కూడా తమకు అడ్డుపడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గ్రామంలోని 12 మందితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

తమపై అన్యాయంగా కేసు నమోదు చేశారని, తాము ఎస్సీల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని, కేవలం చర్చి ప్రహారీ గోడ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకే తమపై తప్పుడు కేసు పెట్టినట్టు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి క్రైస్తవ సంప్రదాయాలను ఆచరిస్తాడని కూడా తెలిపారు.

దీంతో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్న గ్రామస్థులు జిల్లా కలెక్టరుతో పాటు ఏకంగా రాష్ట్రపతి దాకా తమ ఫిర్యాదు కాపీలను పంపించారు.

గ్రామస్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

– 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం మొత్తం నందవరం మండలంలో క్రైస్త‌వుల జ‌నాభా 59 మాత్ర‌మే.. ఈ లెక్కన నందవరం మండలంలోని గుఱజాల గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేనప్పటికీ ఎవరి కోసం చర్చిని నిర్మాణం చేశారు?

– జీవో నెంబర్ 376 ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ పంచాయ‌తీ ల్యాండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌(లేఅవుట్ & బిల్డిండ్‌) రూల్స్ – 2002 లోని రూల్ నెంబర్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి స్థలంలోనూ మతపరమైన కట్టడాలు నిర్మాణం చేయరాద‌ని నిబంధ‌న‌లు ఉన్న‌ప‌టికీ గ్రామంలో చ‌ర్చి నిర్మాణం చేప‌ట్టి నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించారు. ఇప్పటి వరకూ ఆ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

– గ్రామంలోని ఎస్సీ కులానికి చెందినవారు క్రైస్తవులుగా మారి ఈ చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. The Constitutional (Scheduled Castes) Order 1950 ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇస్లాం లేదా  క్రెస్తవ మతానికి చెందిన ఆచారవ్యవహారాలు పాటిస్తూ, ఇస్లాం/క్రైస్తవ సంప్రదాయాలు పాటిస్తున్నట్లైతే అట్టి వారు షెడ్యూల్డ్ కుల హోదాకు అనర్హులవుతారు. కానీ గ్రామంలో అనేకమంది షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తులు క్రైస్తవ ఆచార సంప్రదాయాలు పాటిస్తూ కూడా ఎస్సీ సర్టిఫికెట్లు కలిగివున్నారు. ఇది పూర్తిగా చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది.

–  క్రైస్తవులుగా మారి కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్న వ్యక్తులు ఐఎంబీ చర్చివారి ప్రోద్బలంతో, దురుద్దేశపూర్వకంగా అక్రమ కాంపౌండ్ గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామంలోని ఇతర కులాలకు చెందిన వ్యక్తులపై ఎస్సీ – ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద తప్పుడు కేసులు పెడుతూ, వారిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ గ్రామంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం కలిగిస్తున్నారు.

– క్రైస్తవులుగా మారి, క్రైస్తవ సంప్రదాయం పాటిస్తున్న వ్యక్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడం నేరమని, అట్టి అధికారులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, మరియు ఇతర సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని 1989లో కేంద్ర హోమ్ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.

గ్రామస్థులు తమ ఫిర్యాదులో కోరిన చర్యలు:

కలెక్టర్ నుండి రాష్ట్రపతి భవన్ దాకా వివిధ శాఖలకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు, తమ ఫిర్యాదులో పేర్కొన్న విష‌యాల‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ క్రింది విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు:

త‌మ‌ గ్రామంలో గ్రామకంఠం స్థలంలో అక్రమంగా నిర్మించిన ఐఎంబీ చర్చిని తొలగించాలి.

చర్చికి వెళ్తూ, క్రైస్తవ సంప్రదాయాలు పాటిస్తున్న వారందరినీ రెవెన్యూ అధికారిక రికార్డుల్లో క్రైస్తవులుగా నమోదు చేయాలి.

క్రైస్తవులుగా మారిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలను రద్దు చేసి వారికి బీసీ-సీ సర్టిఫికెట్లు కేటాయించాలి.

సరైన విచారణ జరపకుండా, ప్రలోభాలకు గురై, మతం మారిన క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధం అని గ్రామ‌స్తులు తమ ఫిర్యాదులో తెలియజేశారు.

Source : NIJAM TODAY

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post AP : మతమార్పిళ్లు, ఎస్సీ హోదా దుర్వినియోగంపై రాష్ట్రపతికి గ్రామస్థుల ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్ ఇళ్ళు, ఆఫీసులలో ఐటీ సోదాలు
క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కారుణ్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌, జీస్‌ కాల్స్‌ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేత, విదేశాల్లో పెట్టుబడులపై ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం నుంచి 200 మంది ఆదాయపన్నుశాఖ అధికారులు తమిళనాడులోని 28 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్ ఇళ్ళు, ఆఫీసులలో ఐటీ సోదాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ధర్మ జాగరణ సమితి తోడ్పాటుతో తమ వారిని మతం మారకుండా కాపాడుకున్న శెట్టి బలిజలు
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ధర్మ జాగరణ సమితి సహకారంతో శెట్టి బలిజ కులస్థులు తమ కులస్థులు 40 మందిని మతం మారకుండా కాపాడుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం మట్టపర్రు పాలెం మరియు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు శెట్టి బలిజ కులస్థుల కమిటీలను ఏర్పాటు చేయడం కోసం పర్యటన చేస్తున్నారు.

మట్టపర్రు పాలెం గ్రామంలో కొంతమంది శెట్టి బలిజ కులస్థులు మతం మారి ఉండడం, వారు మరో 40 మంది శెట్టిబలిజలను మతం మార్చే ప్రయత్నం చేస్తూ ఉండడం ధర్మ జాగరణ సమితి కార్యకర్తల దృష్టికి వచ్చింది.

జిల్లా ధర్మ జాగరణ పరియోజన ప్రముఖ్ శ్రీ చింతపల్లి రమేష్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత శెట్టి బలిజ పరియోజన ప్రముఖ్ శ్రీ కడలి నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సహ పరియోజన ప్రముఖ్ శ్రీ రాయుడు ముత్యాలరావు తదితర కార్యకర్తలు మట్టపర్రు గ్రామంతో సహా చుట్టుపక్కల ఉన్న మరో ఐదు గ్రామాల శెట్టి బలిజ కుల పెద్దలను కలిసి వారికి హిందూ ధర్మం యొక్క విశిష్టతను, శెట్టి బలిజ కులం యొక్క చరిత్రను, గొప్పతనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను వారికి వివరించారు.

దాంతో వారు తమ కులం యొక్క చరిత్రను, గొప్పతనాన్ని, హిందూ సంస్కృతి విశిష్టతను గుర్తించి తమ పూర్వీకుల లాగే తాము కూడా హిందూ ధర్మంలోనే కొనసాగుతూ ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగించాలని తీర్మానించుకున్నారు.

సమీప భవిష్యత్తులోనే ఈ 5 గ్రామాలకు సంబంధించి ఒకచోట శెట్టి బలిజ సమ్మేళనం జరపాలని కూడా నిర్ణయించినట్లు ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ధర్మ జాగరణ సమితి తోడ్పాటుతో తమ వారిని మతం మారకుండా కాపాడుకున్న శెట్టి బలిజలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు
సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు, దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేందుకు దేశంలోని ఓ క్రైస్తవ సంస్థ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ విశ్లేషణాత్మక పరిశోధనలో బయటపెట్టింది.

Lodged complaint with Ministry of Home Affairs against ‘Persecution Relief’ for sending false reports to international agencies resulting in India being declared as a country dangerous for Religious Minorities by @USCIRF.

Routine crimes like ..1/3 pic.twitter.com/GNYxRrbjv1

— Legal Rights Protection Forum (@lawinforce) December 1, 2020

దీనికి ముందు మనం అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో అన్ని దేశాలలో మతపరంగా మైనారిటీలుగా ఉన్న ప్రజల, మరీ ముఖ్యంగా క్రైస్తవుల సామజిక, ఆర్ధిక, సాంఘిక స్థితిగతులపై, వారి భద్రతపై అధ్యయనం చేసి, ఆయా దేశాలు ఆ మైనారిటీలకు ఎంత వరకూ సురక్షితమనే విషయమై నివేదికలు ప్రచురించడం, దేశాలకు ర్యాంకింగులు ఇవ్వడం పనిగా పెట్టుకున్న సంస్థ ఇది. ఈ అమెరికన్ ప్రభుత్వ సంస్థ ఇటీవల తమ నివేదికలో భారతదేశాన్ని “మతపరమైన మైనారిటీలకు ప్రమాదకరంగా ఉన్న దేశాల్లో 15వ స్థానం” అని ప్రకటించింది. దీన్నేCountries of Particular Concern (CPC) గా అది వ్యవహరిస్తుంది. ఈ దేశాల జాబితాలో భారత్ ముందు స్థానాల్లో బర్మా, చైనా, ఇరాక్, ఉత్తర కొరియా, పాకిస్థాన్ తదితర దేశాలున్నాయి. భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా క్రైస్తవులపై మెజారిటీ హిందువులు అకారణంగా దాడులకు పాల్పడటం, క్రెస్తవ ప్రచారానికి అడ్డుపడటం, క్రైస్తవుల ఆచారవ్యవహారాలు పాటిస్తున్నందుకు చంపేయడం, మారణహోమం సృష్టించడం, మానవహక్కులను కాలరాయడం వంటివి చేస్తున్నారనేది ఈ అమెరికన్ సంస్థ ఆరోపణ. తమ ఆరోపణలకు మద్దతుగా ఈ సంస్థ ప్రతియేటా వెలువరించే వార్షిక నివేదికలో, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగే కొట్లాటలు, హత్యలు, ఊరి తగాదాలు, కుటుంబ తగాదాల వంటి ఘటనలు ఉటంకిస్తూ, ఎక్కడైతే గాయపడ్డవారు మైనారిటీలు, నిందితులు మెజారిటీ మతస్థులుగా ఉంటారో కేవలం ఆ ఘటనలు ఉదాహరణలుగా చూపిస్తుంటుంది.

ఇప్పుడు భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న మరొక క్రైస్తవ సంస్థ గురించి తెలుసుకుందాం.. ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ (Persecution Relief) – ఈ పేరుకు అర్ధం ‘హింస నుండి స్వాంత్వన’ చేకూర్చటం. మెజారిటీ మతస్థుల మతపరమైన హింసలో బాధితులుగా మారుతున్న దేశంలోని క్రైస్తవులకు స్వాంత్వన చేకూర్చడం ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్టు చెప్పుకుంటుంది.

దేశంలోని మతపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత క్రైస్తవుల కోసం పోరాటం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ, దేశంలోని ఏ మూలన అయినా మెజారిటీ హిందువులు క్రైస్తవులపై అకారణంగా దాడులు జరిపితే వాటిని బహిర్గతం చేస్తాం, బాధితుల తరఫున పోర్టాటం చేస్తాం అని ప్రచారం చేసుకుంటుంది. దీని ప్రధానమైన పని ఏమిటంటే.. దేశంలో ఎక్కడైనా, ఏదైనా కారణం వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య, ఏదైనా సమస్య కారణంగా ఊరిలోని ప్రజల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య జరిగే కొట్లాటలు, హత్యలు వంటి సంఘటనల్లో క్రైస్తవులు ఎవరైనా బాధితులుగా ఉన్నారా? అనేది ముందుగా సరిచూసుకుంటుంది. ఒకవేళ దాడిలో గాయపడినవారిలో క్రైస్తవులు, నిందితుల్లో హిందువులు ఉన్నట్లైతే అటువంటి ఘటనలను ఒక క్రమపద్ధతిలో పొందుపరిచి రిపోర్ట్ రూపంలోకి తీసుకొస్తుంది. చివరిగా ఆ రిపోర్ట్ అమెరికాలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన USCIRFకు చేరవేస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా అమెరికన్ సంస్థ భారతదేశం మీద ఆంక్షలు విధించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.

తాజాగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ పెర్సిక్యూషన్ రిలీఫ్ అమెరికన్ క్రైస్తవ సంస్థలకు సమర్పిస్తున్న నివేదికలపై దృష్టి సారించింది. నివేదికలో పొందుపరుస్తున్న ‘క్రైస్తవులపై మతపరమైన దాడులలో నిజానిజాలు ఎంతమేరకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది.

పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న ఘటనల్లో నుండి బాధితులు మరణించిన 8 కేసుల మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యయనం చేసింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే తేలిన విషయం ఏమిటంటే.. ఆ ఎనిమిది కేసులలలో ఎలాంటి మతపరమైన అంశాలూ లేవు. కేవలం బాధితులు మాత్రం క్రైస్తవ మతానికి చెందిన వారు. దీన్ని అదనుగా చూపించి, దేశంలో క్రైస్తవుల మీద హిందువులు హింసాయుత సంఘటనలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ అమెరికాలోని పలు క్రైస్తవ మిషనరీ సంస్థలతో పాటు, లాబీయింగ్ గ్రూపులకు, USCIRFకు నివేదిక పంపడం, ఇటువంటి తప్పుడు నివేదికల ఆధారంగా భారతదేశాన్ని “మైనారిటీలకు ప్రమాదకరమైన దేశాల” జాబితాలో చేర్చడం వంటి విషయాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. తక్షణమే పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ పేర్కొంటున్న కేసుల్లోని నిజానిజాలపై దర్యాప్తు చేసి, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.

పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న అవాస్తవాలలోని కొన్ని ఘటనలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు వివరించింది.

1. ఒడిశాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో యువకుడి హత్య :

ఓడిశాలోని మల్కన్-గిరి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో ఓ 18 ఏళ్ల యువకుడిని స్థానికులు హత్యచేశారు. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక కధనం ప్రకారం..  ఘటన అనంతరం పోలీసులు యువకుడి శరీర అవయవాలు ఘటనా స్థలం నుండి వెలికితీశారు. ఘటనలో నిందితులంతా ఒకే గిరిజన గ్రామానికి చెందిన వారు. అంతే కాదు, వారిలో కొందరు మృతుడికి బంధువులు కూడా ఉన్నారు.

ఇదే ఘటనను “ఎవాంజెలికల్ ఫోకస్’ అనే క్రైస్తవ వెబ్సైట్ దీనికి మతం రంగు పులిమి  “16 ఏళ్ల క్రైస్తవ బాలుడిని కొట్టి చంపిన హిందువులు” అనే శీర్షికతో ప్రచురించింది.

దీన్ని పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో “14ఏళ్ల బాలుడు మత ఛాందసవాదుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు” అని వ్రాసింది. చేతబడి కారణంగా గ్రామంలో కొందరు చేసిన హత్యకు మతం రంగు పులిమింది.

2. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సహదేవ్ సామ్రాట్ అనే వ్యక్తి హత్య:

బీజాపూర్ జిల్లా తోతాపరా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహదేవ్ సామ్రాట్(30) ఓ పెళ్ళికి వెళ్లి వస్తుండగా భైరంగర్హ్ పట్టణంలోని కోస్టాపరా గ్రామంలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అని ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

నిజానికి నక్సలైట్లు ఎవరినైనా హత్యచేసినప్పుడు ఎందుకు హత్యచేస్తున్నామో వివరిస్తూ ఘటనా స్థలంలో ఒక లేఖ వదిలిపెట్టి వెళతారు. కానీ ఇక్కడ హత్య జరిగిన ప్రదేశంలో అలాంటి  లేఖ ఏదీ లేదు. కాబట్టి ఇది నక్సలైట్ల చర్య కాదు, మరే ఇతర కుటుంబ కారణాలు అయివుండొచ్చు అని పోలీసులు భావించారు.

అనంతరం న్యూస్ 18 వార్తా కథనం ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి భార్య బ్రతికుండగానే మరో వివాహం చేసుకున్నాడని, దీనిపై కుటుంబంలో చెలరేగిన తగాదాల వల్ల జరిగిన గొడవలో అతడు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని బయటపెట్టింది.

కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ మాత్రం తమ నివేదికలో.. “48 ఏళ్ల సహదేవ్ సామ్రాట్ అనే గిరిజనుడు క్రైస్తవం స్వీకరించినందుకు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో నక్సలైట్లు చంపేశారు” అని వ్రాసింది.

నిజానికి క్రైస్తవం తీసుకున్నందుకు నక్సలైట్లు చంపడం అనే ఘటన భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు.

3. ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ హత్య

ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ అనే వ్య‌క్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు హ‌త‌మార్చారు. అయితే స‌బ్రాంగ్ అనే వామ‌ప‌క్షమీడియా పోర్ట‌ల్ “రామ్ గోండ్ అనే వ్యక్తి క్రైస్త‌వ మతం స్వీకరించినందున అతనిని త‌ల న‌రికి చంపేశారు” అని ప్రచురించింది. పైగా హిందూ మతోన్మాదులే స్వయంగా నక్సలైట్లకు ఆయుధాలు అందించి ఈ హత్య చేయించారు” అని వ్రాసింది. అంతేకాకుండా నిందితులైన హిందువులను రక్షించడం కోసం పోలీసులు ఈ హత్యలో నక్సలైట్ల పాత్రను జోడించారనిచార‌ని కూడా ఆ కధనంలో పేర్కొంది.

పైన పేర్కొన్న కధనమనే నిజమైతే, నక్సలైట్ చరిత్రలో వారు తమ మాజీ సహచరులలో ఒకరిని చంపడానికి హిందువుల నుంచి  ఆయుధాలు తీసుకున్న మొదటి ఘటన ఇదే అవుతుంది.  దీనిపై ఆసియా న్యూస్‌ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన పెర్సిక్యూషన్ రిలీఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షిబు థామస్.. అనంత్ రామ్ గోండ్ 9నెలల క్రితం క్రైస్తవ మతంలోకి మారాడ‌ని, రెండు నెలల క్రితం బాప్టిజం పొందాడ‌ని, దీంతో ఆ గ్రామంలో హిందువులు అత‌నిపై కోపంతో చంపేశార‌ని, పైగా న‌క్స‌లైట్ల చంపేశార‌ని చెబుతున్నార‌ని” చెప్పాడు.

సబ్రాంగ్, పెర్సిక్యూషన్ రిలీఫ్ చెబుతున్న విష‌యాల్లో చాలా అవాస్త‌వాలున్నాయి. త‌మ రహస్యాలను పోలీసులకు చెబుతార‌నే భయంతో బాధితుడు అనంత్ రామ్ గోండ్‌ను నక్సలైట్‌లు చంపారని మరోపక్క ఇదే పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తన స్వంత ఫేస్‌బుక్ పోస్టులో స్పష్టంగా రాసింది.

4: చత్తీస్ గఢ్ లో ముంగ్లు రామ్ నురేటి హత్య

చత్తీస్ గఢ్ లోని కోహ్కమెట గ్రామానికి చెందిన ముంగ్లు రామ్ నురేటి అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు చంపేశారు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ హిందువులపై నింద‌లు వేయ‌డానికి సిద్ధమైంది.

“ముంగ్లు రామ్ నురేటి  క్రైస్తవ మ‌తాన్నిపాటించడాన్ని వ్యతిరేకించిన గ్రామస్తులు అతన్ని పోలీసు ఇన్ఫార్మర్ అంటూ మావోయిస్టులకు తప్పుడు సమాచారమిచ్చారు. మూడేండ్ల క్రితం జంతు భావ‌జాలం క‌లిగిన గిరిజ‌న తెగ నుంచి ఆయ‌న క్రైస్త‌వంలోకి వ‌చ్చాడు” అంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2019 వార్షిక నివేదికలో పేర్కొంది. గిరిజన మత విశ్వాసాలను “జంతు భావాజాలం క‌లిగిన ” అంటూ అవమానించడాన్ని మనం ఈ నివేదిక‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఈ కేసులో బాధితుడి కుమార్తె ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకమైనది. మృతుడి కుమార్తె దివ్య మాట్లాడుతూ  “నా తండ్రి ఇన్ఫార్మర్ కాదు. అతను ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న సాధారణ వ్యక్తి. పోలీసులు, నక్సలైట్టు  ఇద్దరూ మా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడతారు. అంత మాత్రాన గ్రామస్తులు వారిలో ఎవరికైనా సమాచారం ఇచ్చేవారని దీని అర్థం కాదు” అని తెలిపింది.

5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుబ్బరావమ్మ అనే వృద్ధురాలి హత్య:

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక వృద్ధురాలిని యువకుడు హతమార్చాడు. తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  కానీ ఈ వార్తలను పెర్సిక్యూషన్ రిలీఫ్ వక్రీకరించింది.  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2018 వార్ష‌క నివేదిక‌లో ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. “హిందూ దేవాలయ పూజారి, గ్రామ సర్పంచ్ యొక్క ప్రేరణతో వృద్ధురాలు చంప‌బ‌డింది” అని పేర్కొంది. ఇది పోలీసు నివేదిక‌ల‌కు పూర్తి విరుద్ధం.

ఇదే కేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల శిల్పిని అరెస్టు చేసినట్లు, నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు ఆ జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ఈ విషయమై ఎస్పీ మాట్లాడుతూ..  “అతను రోజూ ప్రాంతంలోని ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, నేరం జరిగిన రోజు అతను.. యువ‌తి అనుకుని వృద్ధురాలు ఉండే గ‌దిలోకి వెళ్లాడు.  అతను ఆమెను బ‌ల‌వంతం చేయబోగా ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆ వృద్దురాలి త‌ల‌పై క‌ర్ర‌తో  కొట్టాడు. తీవ్ర గాయాల‌తో ఆమె మ‌ర‌ణించింది. అనంత‌రం విశాఖపట్నంలోని ఒక ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకుంటున్న అత‌న్నిమార్చి 23 న మేము అదుపులోకి తీసుకున్నాము. ” అని ఎస్సీ వెల్ల‌డించారు. “ఎఫ్ఐఆర్లో నిందితుల పేరు ప్రస్తావించలేము. ఎందుకంటే, నేరం జరిగిన సమయంలో, అతను ఆమెను చంపాడని మేము నిర్ధారించలేదు. ఈ కేసులో మతపరమైన కోణం లేదు. నిందితుడు మానసిక  రోగి,  పైగా లైంగిక‌దాడికి పాల్ప‌డి ఆమె ప్ర‌తి ఘ‌టించ‌డంతో ఆమెను కొట్టాడు” అని ఎస్సీ స్పష్టం చేసారు.

6: తమిళనాడులో పాస్టర్ గిడియాన్ పెరియసామి హత్య

త‌మిళ‌నాడులోని గిడియాన్ అనే ఒక క్రైస్తవ పాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌నను పెర్సిక్యూషన్ రిలీఫ్,  ఇతర క్రైస్తవ సంస్థలు ‘క్రూరమైన హత్య’ అని వక్రీకరించాయి. తమిళ దినపత్రిక దినమలార్ దీనిని ఆత్మహత్య కేసుగా నివేదించింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇది ఆత్మహత్యే అని నివేదించింది. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ‘మెజారిటీ మతస్థులు దారుణంగా కొట్టి, హింసించి హ‌త్య చేశార‌ని’ త‌న నివేదిక‌లో పేర్కొంది.

అంతే కాకుండా సంఘటన జరిగిన 2 రోజుల్లోనే www.change.org సైట్‌లో హిందూ సంస్థలు,  వ్యక్తులపై బలమైన ఆరోపణలతో ఆన్‌లైన్ పిటిషన్ తయారు చేయబడింది. ఇందులో ‘క్రిస్టియన్ మైనారిటీ, దళిత పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామిని 2018 జ‌న‌వ‌రి 20న హత్య చేశార‌ని, అందులో నలుగురు నిందితులు హిందూ మున్నాని, ఉన్న‌త కులాల‌కు చెందిన హిందూ మతోన్మాదులని” పిటిష‌న్‌లో  పేర్కొంది. మరణించిన పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామి గురించి తమిళంలో 25 నిమిషాల నిడివి గల వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.  ఇందులో గ్రాహం స్టెయిన్స్ చిత్రం, అతని హత్య కథనం యొక్క దృశ్యాలతో వీడియో రూపొందించారు. అతని అంత్యక్రియల‌తో పాటు గ‌తంలో జ‌రిగిన ఘర్షణల దృశ్యాలను ఇందులో ఇమిడ్చి భావోద్వేగాలను రేకెత్తించడానికి, పాస్టర్ గిడియాన్‌ను నిజంగా హిందూవులే  హత్య చేశారని చెప్ప‌డానికి ఈ వీడియో ద్వారా పెద్ద కుట్ర చేశారు. అంతర్జాతీయ క్రైస్తవ వెబ్‌సైట్‌లు ఈ వార్తలను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాయి.

పోలీసులు నేరంపై దర్యాప్తు చేయక ముందే,  పెర్సిక్యూషన్ రిలీఫ్ హ‌త్య‌ను వక్రీక‌రించేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నించింది. చివ‌రికి ఇది ఆత్మహత్య కేసు అని స్ప‌ష్టంగా తేలింది. మృతుడు మెడ‌కు వేసుకున్న తాడు బిగుసుకుపోయి గొంతు, మెడ చుట్టూ రక్తం గడ్డకట్టడంతో ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్టు తెలింది. కానీ అతని శరీరంపై రక్తం యొక్క ఇతర ఆనవాళ్ళు లేవు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌న త‌ప్పుడు నివేదిక‌లతో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించింది.

7: ఒడిశాలో పాస్టర్ సాన్వి హత్య

ఒడిషాలో పాస్ట‌ర్ సాన్వి హ‌త్య ఘటనను పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ కేసుకు సంబంధించి త‌న నివేదికలో నేరం జరిగిన తేదీ, ప్రదేశం గురించి ప్రస్తావించలేదు. మరణించినవారి పేరు, ఇంటి పేరు లేకుండా నివేదిక రూపోందించారు. ఏ స్వతంత్ర వెబ్‌సైట్ లేదా న్యూస్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఘటన గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. సంఘటనను ధృవీకరించే ప్రాథమిక వివరాలైన ఘటనా స్థలం, నేరం చేసిన తేదీ, మరణించిన వారి పూర్తి  వివరాలు లేనప్పుడు ఇటువంటి నివేదిక‌ల ప్రామాణికతను అస్సలు ధృవీకరించలేము.

8: రాజస్థాన్‌లోని షరోన్ చర్చికి చెందిన పాస్టర్ మహేష్ హత్య

రాజ‌స్థాన్‌లోని ష‌రోన్ చ‌ర్చి పాస్ట‌ర్ మ‌హేష్ త‌న గ్రామంలో విద్యుత్ స‌మ‌స్య త‌లెత్త‌డంతో విద్యుత్ స్థంభం ఎక్కి ఫ్యూజ్ ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుదాఘాతంతో మ‌ర‌ణించాడు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ఈ ఘటనపై త‌న నివేదిక‌లో ప్రస్తావిస్తూ “పాస్టర్ మహేష్ ను క‌రెంట్ స‌మ‌స్య పరిష్కరించడానికి విద్యుత్ స్థంబం ఎక్క‌మ‌ని చెప్పి, అతను పైకి వెళ్ళినప్పుడు, కొంత మంది హిందువులు ఉద్దేశపూర్వకంగా విద్యుత్తును ఆన్ చేసి, అతడు కరెంట్ షాకుతో కింద ప‌డి చనిపోయేలా చేశారు. ఈ ఘ‌ట‌న‌పై గ్రామస్తులు సమావేశం నిర్వహించి  నిందితులకు రూ.2.50 లక్షల జ‌రిమానా విధించారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కూడ‌దని, సర్పంచ్, ఇతరులు నిర్ణయించుకున్నారు.” అని వ్రాసుకొచ్చింది.

ఇది విద్యుదాఘాతంతో మరణించిన సాధారణ కేసు తప్ప మరొకటి కాదని స్థానిక వార్తాపత్రికలు స్పష్టం చేశాయి.

హిందువుల‌పై నిరాధార అభియోగాలు మోపి, అంతర్జాతీయ సమాజం ఎదుట హిందువులను, భారతదేశాన్ని అగౌరవపరిచేందుకు పెర్సిక్యూషన్ రిలీఫ్ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆధారాలతో సహా హోంశాఖకు సమర్పించింది. సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

కొసమెరుపు:

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ సంస్థ, తమ అధికారిక వెబ్సైట్ ని మూసివేయడం గమనార్హం.

“When guilt is in its blush of infancy, it trembles in a tenderness of shame; and the first eye that pierces through the veil that hides the secret brings it to the face”

~ Thomas Southerne

Persecution Relief’s site is down!! https://t.co/FRkzQvXBFZ pic.twitter.com/sqBlG4IVAX

— Legal Rights Protection Forum (@lawinforce) December 2, 2020

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారతీయ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను క్రైస్తవం ఒప్పుకుంటుందా?
“మొదట మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం”

– క్రైస్తవ మతం స్వీకరించిన గిరిజనులు తరచూ చెప్పే మాట ఇది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడుతుందా? ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పే క్రైస్తవం గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను అంగీకరిస్తుందా? ఈ అంశాన్ని పరిశీలిద్దాం.

ముందుగా భారతదేశంలోని ఉత్తరాన గల లడ్డఖ్ నుండి దక్షిణాది రాష్ట్రాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు వ్యాపించిన  అనేక గిరిజన తెగల వివిధ సంస్కృతీ సంప్రదాయాలలోని ప్రాథమిక సారూప్యతను గమనిద్దాం.

1. ప్రకృతి ఆరాధన

2. స్త్రీ దేవతా ఆరాధన

3. విగ్రహారాధన

4. పూర్వీకులను ఆరాధించడం

పైన పేర్కొన్న ఏ గిరిజన విశ్వాసాన్నీ క్రైస్తవం ఆమోదించదు. తరతరాలుగా నదీ పరివాహక ప్రాంతాల్లో  ప్రకృతికి అత్యంత సమీపంగా జీవనం సాగిస్తున్న వీరు ప్రకృతిమాత  నిజమైన బిడ్డలు. దీని కారణంగానే అన్ని గిరిజన తెగల సంప్రదాయాల్లోనూ ప్రకృతి ఆరాధన ప్రధానంగా కనిపిస్తుంది.

ప్రకృతి ఆరాధన:

ప్రకృతి ఆరాధన పట్ల క్రైస్తవం వైఖరి ఏమిటి అనేది గమనిద్దాం. క్రైస్తవుల ఏకైక మతగ్రంథంగా భావించే బైబిల్ ‘ప్రకృతి ఆరాధన’ను అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ప్రకృతి ఆరాధనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. “ప్రకృతిని కాదు, ప్రకృతిని సృష్టించిన దేవుడిని ఆరాధించాలి, ప్రకృతి ఉన్నది ఆరాధించడానికి కాదు’ అని చెప్పే బైబిల్, ప్రకృతిని ఆరాధించేవారిని రాళ్లతో కొట్టి చంపేవిధంగా శిక్షను కూడా విధిస్తోంది.

“నీ దేవుడైన యెహోవా  నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధ ముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా  నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియం దైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హే యక్రియ ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషు నిగాని స్త్రీనిగాని నీ గ్రామ ముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను.”

— ద్వితీయోపదేశకాండం 17:2-4

స్త్రీ దేవతను మాతృమూర్తిగా ఆరాధించడం:

దేవతను మాతృమూర్తిగా భావించి పూజించడం ఇది గిరిజన జాతుల్లో చాలా ముఖ్యమైన ఆరాధనా విధానం. తరతరాలుగా ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. 1980లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన గిరిజన దేవతా మందిరం కనుగొన్నారు. భారత్-అమెరికా పురాతత్వ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన సిద్ధి జిల్లాలో జరిపిన పరిశోధనల్లో శక్తి ఆరాధన తాలూకు ఆనవాళ్లు తెలియజేస్తూ 11,000 సంవత్సరాల క్రితం నాటి మానవ నిర్మిత దేవతా మందిరం బయటపడింది. కోల్, బాగా గిరిజన తెగల ప్రజలు ఇప్పటికీ అటువంటి స్త్రీమూర్తుల ప్రతిమలను శక్తికి ప్రతిరూపంగా భావిస్తూ ఆరాధిస్తారు.

విగ్రహారాధన:

భారతీయ గిరిజన తెగల ఆరాధనా విధానంలో విగ్రహారాధన ప్రముఖమైనది. ఒక చిన్న రాతిఫలకం కావచ్చు, రాతితో చేసిన విగ్రహం కావచ్చు, లేదా చెక్కతో తయారుచేసిన ప్రతిమ కావచ్చు, లేదా రాయి లేదా చెక్కపై గీసిన దేవతా రూపం కావచ్చు.. ఇలా అనేక విధాలైన విగ్రహారాధనా పద్ధతులు గిరిజన తెగల్లో మనకు కనిపిస్తుంటాయి. సంతాల్ తెగలకు చెందిన గిరిజన గ్రామాల్లోని పొలిమేరల్లో పవిత్రమైనవిగా భావించే కొన్ని వృక్షాల సముదాయం ఒకటి ఉంటుంది. ఆ ప్రదేశంలో వారి పూర్వీకుల పవిత్రమైన ఆత్మలు సంచరిస్తుంటాయని వారి ప్రగాఢ విశ్వాసం. గ్రామంలోని గిరిజనులు అందరూ ఆ ప్రదేశంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్థులు వారికి ఇష్టమైన వస్తువులు, తినుబండారాలు ప్రసాదంగా సమర్పిస్తారు.

కానీ క్రైస్తవం విగ్రహారాధనను కూడా ఒప్పుకోదు. దానిపట్ల తీవ్రంగా మండిపడుతుంది. విగ్రహారాధకులను దారుణంగా శిక్షిస్తుంది.

ఉదాహరణకు ఈ క్రింది బైబిల్ వాక్యాలు పరిశీలిద్దాం:

“మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.”

— లేవీయకాండం 26:1

” నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.”

–లేవీయకాండం 26: 30

“మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.

ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి,మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.”

–యెహెఙ్కేలు 6: 4, 5

“కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూర ముగా పారిపొండి.”

— 1-కొరింథీయులకు 10: 14

క్రైస్తవం నిర్ధేశించే పరిమితులు – విధించే కఠినమైన ఆంక్షలు :

తమ స్వేచ్ఛాయుతమైన వివిధ ఆరాధనా మార్గాలను అనుసరించే గిరిజనులు.. తాను నిర్ధేశించిన దేవుడిని మాత్రమే ఆరాధించాలి, యేసుక్రీస్తును మానవాళిని పాపాల నుండి, నరకాగ్ని నుండి విముక్తులను చేసే రక్షకుడిగా అంగీకరించాలి అని ఆదేశించే క్రైస్తవంలో ఎటువంటి శాంతిని పొందలేరు. ఎందుకంటే  ప్రకృతి ఆరాధనను పాటించే గిరిజనులు ఒకవేళ క్రైస్తవం తీసుకుని కూడా ‘యేసు మాత్రమే నరకం నుండి విముక్తి కలిగిస్తాడు’ అని విశ్వసించకపోతే అదే క్రైస్తవం ప్రకారం వారు శిక్షార్హులవుతారు. అంతర్లీనంగా ఎన్నో రకాల తాత్విక సిద్ధాంతాలు, విశ్వాసాలు, ఆరాధనా విధానాలు కలిగిన గిరిజన సంప్రదాయం పరిస్థితులకు అనువుగా  అవసరమైతే తమ విధానాల్లో మార్పులను ఆహ్వానించి సంస్కరణలు చేసుకోగలదు.  క్రైస్తవంలో ఇది సాధ్యం కాదు. క్రైస్తవేతరులకు ఆచార వ్యవహారాల్లో పాలుపంచుకోరాదని, వారి ప్రసాదాలు స్వీకరించరాదని స్పష్టంగా ఆదేశించే క్రైస్తవ గ్రంథం బైబిల్,  క్రైస్తవేతరులతో సామజిక సహజీవనాన్ని కూడా ఒప్పుకోదు.

“క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.

ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.”

–2 యోహాను1: 9-11

“దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.”

–2 కొరింథీయులకు 4: 4

“మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?”

–2 కొరింథీయులకు 6: 14, 15:

ఈ అంశాలను బట్టి గిరిజనులు ఒకవైపు తమ సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడే అవకాశం లేదు. ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పే క్రైస్తవం గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను అంగీకరించదు. కాబట్టి “మొదటి మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం” అనే మాటకు అర్ధం ఉండదు.

Source: AriseBharat SajeevaVahini & VSK TELANGANA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతీయ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను క్రైస్తవం ఒప్పుకుంటుందా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా
క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్ మతం పుచ్చుకున్నాడు. బిరసా స్వతహాగా తెలివితేటలున్నవాడు. పలు భాషలలో ప్రవేశం వుంది. గణిత శాస్త్రంలో దిట్ట. ఒక క్రైస్తవ మత గురువు బిరసాను కూడా మతం మార్చాడు. అయినా బిరసాలో స్వధర్మాభిమానం చావలేదు. ఒకసారి పాఠశాల హాష్టలులో ఆవు మాంసం వడ్డించారు. దానిని తినడానికి బిరసా తిరస్కరించాడు. ఆ ప్రదేశంలో ఉండటానికి మనస్కరించక చదువు మానేసి వచ్చేశాడు. “ఊహ తెలిసిన కొద్దీ వనవాసీ ప్రాంతంలోని వనవాసీలను మతం మార్చడంలో మిషనరీలకున్న శ్రద్ధ సహజ సిద్దంగా వారికి సంక్రమించిన హక్కులను కాపాడటంలో లేదని తెలుసుకున్నాడు. వనవాసీల హక్కులను కాలరాసే ప్రభుత్వ చట్టాలను కూడా వాళ్ళు సమర్దిస్తున్నారని గ్రహించాడు. వెంటనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. బిర్సాకు ఒక వైష్ణవాచార్యుడు అండగా నిలిచాడు.

అడవి బిడ్డల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించాడు బిర్సా ముండా. సాంఘిక సంస్కరణల ఆవశ్యకత గురించి వివరించాడు. బాధితులైన తోటివారిని ఆడుకోవడం ఉత్తమ ధర్మం అన్నాడు. వాటిని తన జీవితంలో ఆచరణలోనికి తెచ్చాడు. తెల్లవారిపై తిరుగుబాటు చేశాడు. మిషనరీల కార్యకలాపాలను అడ్డుకున్నాడు. బిర్సా మూలికా వైద్యం కూడా చేసేవాడు. క్రైస్తవ మతాధికారుల ప్రోద్బలంతో ఆంగ్లేయులు బిర్సాను కారాగారంలో బంధించారు. ఆయన విడుదలకై పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. జైలు నుంచి విడుదలై వచ్చాక మిషనరీల దేశద్రోహ చర్యలకు వ్యతిరేకంగా విప్లవ శంఖం పూరించాడు. తన ఆశయాల ప్రచారానికి ఒక జెండాను కూడా రూపొందించాడు.

నుదుట బొట్టు, మెడలో జంధ్యం దహరించిన బిర్సా వనవాసీలు సంప్రదాయాలను విడిచిపెట్టరాదని, నైతిక వర్తన కలిగివుండాలని బోధించేవాడు. బిరసా ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో క్రైస్తవ మత మార్పిడులకు ఆటంకం ఏర్పడింది. మిషనరీలు కుట్రపన్ని మరళా జైల్లో వేయించారు. ఆంగ్ల ప్రభుత్వం అతని మీద విషప్రయోగం చేసి కలరావల్ల చనిపోయాడని నిర్లజ్జగా ప్రకటించింది. ఆంగ్ల ప్రభుత్వం, క్రైస్తవ మిషనరీల కుట్ర కారణంగా క్రీ.శ.1900 సంవత్సరం జూన్ 9న బిరసా ముండా అశువులు బాశాడు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, స్వధర్మం కోసం, కన్న భూమి కోసం బలిదానం చేసిన భగవాన్ బిరసా ముండా చిరస్మరణీయుడు. నేడు భగవాన్ బిర్సా ముండా 145 వ జయంతి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.