#CHINA – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనాలో కరోనా కల్లోలం… వారం రోజుల్లో 13 వేల మంది మృతి
చైనా దేశంలో కరోనా మరణాలు ఇప్పుడల్లా అదుపులోకి వచ్చేలా లేవు. తాజాగా ఈ నెల 13 నుంచి 19వ తేదీ మధ్యలో (వారం రోజుల్లో) కొవిడ్‌ కారణంగా 13 వేల మంది చనిపోయారని చైనా ప్రకటించింది. వీరిలో 681 మంది కేవలం కొవిడ్‌తో మృతి చెందగా.. 11,977 మందికి కొవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చైనా జీరో కొవిడ్‌ విధానాన్ని గత నెలలో ఎత్తివేయడంతో దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైంది.

The post చైనాలో కరోనా కల్లోలం… వారం రోజుల్లో 13 వేల మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్మశానాల్లో చోటు లేక వీధుల్లోనే మృతదేహాల దహనం.. చైనాలో భయానక పరిస్థితి!
చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఎటు చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. శ్మశానాల్లో చోటు దొరక్క వీధుల్లో, రోడ్లపైనే తమ వారిని దహనం చేస్తున్నారు. ఆస్పత్రులన్నీ పేషంట్లతో నిండిపోయాయి. శ్మశానాల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆస్పత్రులు, క్లినిక్‌ల ముందు పేషంట్లు చికిత్స కోసం కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. షాంఘైలోని జనాభాలో ఇప్పటికే 70 శాతానికి పైగా మంది కోవిడ్ బారిన పడ్డారని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు రాబోయే నెలల్లో 21 లక్షల కోవిడ్ మరణాలు సంభవించవచ్చునని చెబుతున్నారు. కేసులు భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. చాలా మందికి వైద్యం అందట్లేదు. మార్చురీలు మృతదేహాలతో నిండిపోయాయి. శ్మశానాల్లో ఖాళీలు లేక రోడ్ల వెంట కూడా శవాలు పోగవుతున్నాయి. శ్మశానవాటికల వద్ద రాత్రి నుంచే క్యూ కడుతున్నారు. ఉదయం శ్మశానవాటికలు తెరవగానే.. తమ వారి పేర్లు నమోదు చేయించేందుకు జనం పరుగులు పెడుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి.

వీధుల్లోనే దహనం..

ఇదే అదనుగా కొన్ని శ్మశానవాటికలు దహన సంస్కారాల ఖర్చును విపరీతంగా పెంచేశాయి. అలాంటి క్రెమటోరియాలపై ప్రజలు ఆగ్రహంతో దాడి చేస్తున్నట్లు డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. చేసేదేంలేక ప్రజలు తమ వారి దహన సంస్కారాలను వీధుల్లో నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘వీబో’లో అక్కడి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతున్నాయి. ‘నా తండ్రి కోవిడ్‌తో మరణించాడు. పెంచిన దహన సంస్కారాల ఖర్చు భరించలేకుండా ఉంది. అందువల్ల రోడ్డు పక్కనే దహన క్రియలు జరపాల్సి వస్తోంది’ అంటూ ఓ వ్యక్తి వీడియో పోస్టు చేసినట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా కథనంలో పేర్కొన్నారు. చైనాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చాలా విస్తృతంగా ఉందని.. ప్రధాన నగరాల్లో 70 శాతం మంది ఈ వైరస్ బారిన పడ్డారని అక్కడి వైద్యులు చెబుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే.. ఇది 20 నుంచి 30 రెట్లు అధికమని పేర్కొన్నారు.

జీరో కోవిడ్‌ ఆంక్షలు సడలింపు..

చైనా ప్రభుత్వం గత నెలలో కఠినమైన జీరో-కోవిడ్ ఆంక్షలను సడలించింది. నాటి నుంచి అక్కడ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. లండన్‌కు చెందిన ఎనలిటిక్స్ సంస్థ ఎయిర్‌ఫినిటీ నివేదిక ప్రకారం.. డిసెంబర్ మొదటి 20 రోజుల్లో చైనాలో 250 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. అక్కడ పరిస్థితి భయానకంగా మారిన నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.

The post శ్మశానాల్లో చోటు లేక వీధుల్లోనే మృతదేహాల దహనం.. చైనాలో భయానక పరిస్థితి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు
బీజీంగ్‌: కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చెదరగొట్టడం కోసం పలుచోట్ల పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.

దాంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ‘జిన్ పింగ్ స్టెప్‌ డౌన్.. కమ్యూనిస్ట్ పార్టీ స్టెప్ డౌన్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత గురువారం వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోగల ఉరుమ్‌కీలో ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయడంవల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేక, శ్వాస తీసుకోలేక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఈ ఘటన ఆజ్యం పోసింది.

కరోనా ఆంక్షల కారణంగానే ఇటీవల అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, మంటలను అదుపు చేయడంలో సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని, అందువల్ల మంటలు తగ్గుముఖం పట్టడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడం వల్ల లోపలున్న వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వారు వ్యక్తం చేశారు.

అయితే, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి ఆంక్షలు అమలులో లేవని చెప్పారు. కానీ, అగ్నిప్రమాదం జరిగిన షింజియాంగ్‌ ప్రాంతంలో గత 110 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఉరుమ్‌కీలోని 40 లక్షల మంది దాదాపు నాలుగు నెలలుగా ఇండ్లకే పరిమితమయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం
బీజీంగ్‌: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై దాడి చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఒప్పంద ఉల్లంఘనపై వేలాది మంది ఉద్యోగులు మాస్కులు ధరించి శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. నెల క్రితం వచ్చిన తమను అసలు బయటకు అనుమతించడం లేదని, పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆందోళనబాట పట్టారు. గత నెలలో జెంగ్​ఝౌలో యాపిల్ తయారీ ప్రధాన భాగస్వామి అయిన ఫాక్స్​కాన్​కు చెందిన ఫ్యాక్టరీని వదిలి ఇంటికి వెళ్ళిపోయిన వారిస్థానంలో కొత్త కాంట్రాక్ట్​తో ఉద్యోగాల్లో చేరినవారు తాజాగా నిరసనలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా
బీజింగ్‌: కరోనా పుట్టిళ్ళు చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. దీంతో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులో ఇంత మందికి పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారని పేర్కొన్నది. బుధవారం 29,390 కేసులు నమోదయ్యాయని చెప్పింది.

లాక్‌డౌన్లతో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు. అయినా కూడా కరోనా కేసులు మళ్లీ ఎక్కువవుతుండడంతో అక్కడి ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. షాంఘై నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా 29,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు అమలు చేస్తుండగా, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. చైనాలో గత కొన్ని రోజులుగా 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ‘జీరో కరోనా’ విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. సుమారు ఆరు నెలల తర్వాత ఈ నెల 20న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది.

రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 87 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించాడు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ టీచింగ్ విధానానికి స్కూళ్లు మళ్లాయి. కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో మళ్ళీ కరోనా విజృంభణ.. 6 నెలల తర్వాత తొలి మరణం
బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్‌లో ఓ వృద్ధుడు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆరు నెలల అనంతరం ఇదే తొలి కొవిడ్ మరణమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నవేళ.. రోజురోజుకూ చైనాలో పరిస్థితి భిన్నంగా మారుతోంది. చాలా నగరాల్లో కఠిన లాక్‌డౌన్లు, క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకు చైనాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 5,227కు చేరుకున్నట్టు చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలా నగరాల్లో కొవిడ్‌ విజృంభిస్తున్నప్పటికీ.. మరణాలు నమోదు కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మే 26న షాంఘైకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తర్వాత ఇప్పుడు బీజింగ్‌కు చెందిన 87 ఏళ్ళ వృద్ధుడు చనిపోయినట్టు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మళ్ళీ కరోనా విజృంభణ.. 6 నెలల తర్వాత తొలి మరణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా క్వారంటైన్​లో ఇద్దరు చిన్నారుల మృతి
బీజింగ్‌: కరోనా వైరస్‌ కట్టడికి చైనా అవలంబిస్తున్న జీరో కొవిడ్‌ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొవిడ్‌ ఆంక్షల కారణంగా లక్షల మంది ఇళ్ళకే పరిమితం కావడం, కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లోనూ వారిని బయటకు వెళ్ళనీయకపోవడంపై అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా క్వారంటైన్‌లో ఉన్న ఓ చిన్నారికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడం పౌరుల మరింత ఆగ్రహానికి కారణమయ్యింది. ఇలాగే ఇటీవలే ఓ మూడేళ్ళ చిన్నారి మృతిచెందిన ఘటన మరవకముందే తాజాగా నాలుగు నెలల పాప చనిపోవడంపై అక్కడి ప్రభుత్వంపై చైనీయులు మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా క్వారంటైన్​లో ఇద్దరు చిన్నారుల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టిబెట్‌ పీఠభూమిలో చైనా తిష్ఠ!
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతోంది. చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహశకలాలపైకి వ్యోమనౌకలను పంపడం వరకూ అనేక ఆలోచనలను చేస్తోంది. ఇప్పుడు సూర్యుడి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తిమంతమైన టెలిస్కోపులను సిద్ధం చేసింది. టిబెట్‌ పీఠభూమిపై డావోచెంగ్‌ సోలార్‌ రేడియో టెలిస్కోపు (డీఎస్‌ఆర్‌టీ) నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. వచ్చే ఏడాది జూన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే వీలుంది. 1.4 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని చైనా నిర్మించింది. దీని సాయంతో అంతరిక్షం, భూ వాతావరణంపై భానుడి ప్రభావం గురించి శోధించవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టిబెట్‌ పీఠభూమిలో చైనా తిష్ఠ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆగ్నేయాసియా దేశాలతో మందుపాత్రలపై రాజ్‌నాథ్ చర్చ
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలతో జరిపే సమాలోచనలలో చైనా దురాక్రమణ విధానాలను ఎండగట్టడంతోపాటు మందుపాతరల తొలగింపు సమస్యపై కూడా చర్చింపనున్నారు. 1980వ దశకంలో యుద్ధాలు ముగిసినప్పటికీ, వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన మందు పాతరల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు చాలా మంది గాయపడుతున్నారు.

మైన్‌‌ఫీల్డ్స్ వల్ల కొన్ని దేశాల్లోని ఎక్కువ భాగం ప్రవేశానికి అవకాశం లేకుండా మిగిలిపోతోంది. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సమావేశాలు ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు జరుగుతాయి. మైన్‌ఫీల్డ్స్, చెదురుమదురుగా ఉండే మందుపాతరల వల్ల చాలా దేశాల్లో అనేక మంది మరణిస్తుండటం, గాయపడుతుండటం జరుగుతోంది.

ముఖ్యంగా కాంబోడియా, లావోస్, వియత్నాం వంటి దేశాలు వీటివల్ల ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ మందుపాతరలను తొలగించేందుకు భారతీయ సిబ్బందిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి ఇప్పటికే కొన్ని ఆసియాన్ దేశాలు భారత దేశంతో చర్చలు జరిపాయి.

డీమైనింగ్ కార్యకలాపాల నిర్వహణకు తగిన సత్తా భారత దేశానికి ఉండటంతోపాటు, ఇతర దేశాలకు సహకరించే విషయంలో కూడా ఆసక్తి చూపుతోంది. కాంబోడియాలో అంతర్యుద్ధం 1980వ దశకం చివర్లో ముగిసింది. కానీ, యుద్ధం సమయంలో పెట్టిన యాంటీ పర్సనల్ మైన్స్ ఇప్పటికీ ఉన్నాయి. వాటి మీద కాలు మోపిన వారు ప్రాణాలను కోల్పోవడం కానీ, శరీర అవయవాలను కోల్పోవడం కానీ జరుగుతోంది. వియత్నాంలో యుద్ధాలు 1950వ దశకంలో ప్రారంభమయ్యాయి.

1979-80లో చైనా దాడిని తిప్పికొట్టే వరకు కొనసాగాయి. అంతకుముందు ఫ్రెంచ్, అమెరికాలతో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం లావోస్‌కు కూడా విస్తరించింది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల సంస్థలు డీమైనింగ్ ఆపరేషన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నాయి. చౌక ధరకు ఈ కార్యకలాపాలను నిర్వహించగలమనే నమ్మకం భారత దేశానికి ఉంది. రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో ఈ అంశం చర్చకు వస్తుందని తెలుస్తోంది.

మరోవంక, చైనా దురాక్రమణ వైఖరి వల్ల ఇబ్బందులు పడుతున్నామనే భావన ఆసియాన్ దేశాలకు ఉంది. ఇప్పటికే ఫిలిప్పైన్స్, మరికొన్ని దేశాలకు మన దేశం బ్రహ్మోస్ మిసైల్‌ను విక్రయించింది. ఈ నేపథ్యంలో రక్షణ సంబంధాలు మరింత బలోపేతమవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆగ్నేయాసియా దేశాలతో మందుపాత్రలపై రాజ్‌నాథ్ చర్చ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో మరోసారి విజృంభిస్తున్న కరోనా
బీజింగ్‌: చైనాలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. ఆ దేశంలో తాజాగా పది వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు వైరస్‌ కట్టడికి అధికారులు కఠిన ఆంక్షలు విధించి జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘ్వాంగ్‌జౌవ్‌, ఛాంగ్‌క్వింగ్‌ నగరాల్లో.. దాదాపు 50 లక్షల మంది కఠినా లాక్‌డౌన్‌ ఆంక్షల మధ్య ఉన్నారు. వైరస్‌ కట్టడికి జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నా ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం అక్కడి అధికారులను కలవరానికి గురిచేస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మరోసారి విజృంభిస్తున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.