CHINA Vs INDIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

బలగాల ఉపసంహరణ దిశగా భారత్, చైనాలు.
తూర్పు లాడ్డాఖ్ లో‌ భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. రెండు దేశాలు శుక్రవారం దౌత్య స్థాయి చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఏడు నెలలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనపై చర్చించాయి. భారత్, చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ కమిటీ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. ఇందులో భారత బృందానికి విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (తూర్పు ఆసియా) నవీన్‌ శ్రీవాస్తవ, చైనా బృందానికి ఆ దేశ సరిహద్దు, సముద్ర విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హాంగ్‌ లియాంగ్ ‌లు నేతృత్వం వహించారు.

వివాద పరిష్కారానికి సాధ్యమైనంత త్వరగా సైనిక చర్చలు జరపాలని రెండు పక్షాలు నిర్ణయించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా బలగాల ఉపసంహరణ సాగించేందుకు ఇది వీలు కల్పిస్తుందని వివరించింది. ”ఇరు దేశాల అధినేతలు, విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధులు ఇచ్చిన మార్గదర్శకాలు, ఖరారు చేసుకున్న ఒప్పందాల ఆధారంగా కలిసి పనిచేయాలని నిర్ణయించాం. వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణ కోసం కృషి చేయాలని తీర్మానించాం” అని పేర్కొంది. సెప్టెంబర్‌ 30న చివరిసారిగా డబ్ల్యూఎంసీసీ సమావేశం జరిగినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను ఈ భేటీలో సమీక్షించినట్లు తెలిపింది. దౌత్య, సైనిక స్థాయిలో సంప్రదింపులను కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించింది. మరోవైపు.. 8వ విడత సైనిక చర్చల ఫలితంపై తాజా భేటీలో సమీక్ష జరిపినట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా తగ్గించేందుకు, బలగాల ఉపసంహరణకు గట్టి చర్యలు తీసుకునే అంశంపై లోతైన చర్చలు జరిపినట్లు వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బలగాల ఉపసంహరణ దిశగా భారత్, చైనాలు. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్
భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ గురువారం నుంచి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చైనా దుశ్చర్యను తిప్పికొట్టేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. డ్రాగన్‌తో చర్చలు చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ‘లద్దాఖ్‌ చేరుకున్నాక సరిహద్దుల్లోని పరిస్థితులపై ఆరా తీశాను. భారత ఆర్మీ ప్రపంచంలోనే ఉత్తమమైనది. దేశం గర్వించేలా వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నట్లు, వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

‘గత రెండు, మూడు నెలల నుంచి పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. సైనిక, దౌత్య మార్గాల్లో చైనాతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలతో సరిహద్దుల్లోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై గత వారం రోజులుగా భారత్‌-చైనా సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చలు నేడు ఐదో రౌండ్‌కు చేరుకున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాలు దువ్వుతున్న చైనా
భారత్‌తో ఘర్షణకు మరింత ఆజ్యం పోసేలా చైనా వ్యవహరిస్తోంది. ఒకపక్క శాంతి వచనాలు పలుకుతూనే మరోపక్క సైనిక మోహరింపులకు దిగుతోంది. భారత్‌కు చేరువలోని వైమానిక స్థావరంలో అధునాతన స్టెల్త్‌ యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. తద్వారా తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకుంది.

రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్‌ వైమానిక స్థావరంలో రెండు జె-20 స్టెల్త్‌ యుద్ధవిమానాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఇక్కడ ఇప్పటికే జె-10, జె-11 యుద్ధవిమానాలను మోహరించింది. తాజాగా జె-20కి తోడు జె-8, జె-16లనూ రంగంలోకి దించినట్లు స్పష్టమవుతోంది.

భారత్‌తో ఘర్షణకు దిగాల్సి వస్తే సైన్యం కన్నా వాయుసేన, క్షిపణులు, డ్రోన్లపైనే చైనా ఎక్కువగా ఆధారపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో తాజా మోహరింపులకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌ కూడా తన అగ్రశ్రేణి యుద్ధవిమానాలైన సుఖోయ్‌-30, మిగ్‌-29కె, సి-17 రవాణా విమానాలు, పి-8ఐ నిఘా విమానం సహా చినూక్, అపాచీ హెలికాప్టర్లు, మానవ రహిత విమానాలను లేహ్‌ వైమానిక స్థావరంలో మోహరించింది. మొత్తం మీద రెండు దేశాలూ కలిసి సరిహద్దుల్లో లక్ష మందికిపైగా సైనికులు, భారీ ఆయుధాలను దించాయి. దీంతో ఈ సరిహద్దు వివాదం పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం పొంచి ఉంది.

ప్రపంచంలో మూడోది..

హోటన్‌లో మోహరించిన జె-20 యుద్ధవిమానాలను చెంగ్డూ సంస్థ రూపొందించింది. ఇవి ఐదో తరం యుద్ధవిమానాలు. 2017 సెప్టెంబర్‌లో ఇవి పూర్తిస్థాయిలో చైనా వాయు సేనలో చేరాయి. వీటి ఉత్పత్తిని చైనా ఇటీవలే ప్రారంభించి ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఇవి డ్రాగన్‌ వాయుసేనకు వెన్నెముకగా ఉంటాయి. ఐదో తరం యుద్ధవిమానాల్లో.. శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్‌ లక్షణం ఉంటుంది. దీనికితోడు అవి చాలా వేగంగా దూసుకెళతాయి. చాలా సులువుగా క్లిష్టమైన విన్యాసాలను చేయగలుగుతాయి. జె-20 యుద్ధవిమానంలో రష్యాకు చెందిన ఏఎల్‌-31 ఇంజిన్లను అమర్చారు. ఒకటి రెండేళ్లలో వీటి స్థానంలో చైనీస్‌ డబ్ల్యూఎస్‌-10 తైహాంగ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం చైనా వాయుసేనలో దాదాపు 30 జె-20 యుద్ధవిమానాలు ఉండొచ్చని అంచనా. అమెరికాకు చెందిన ఎఫ్‌-22ఎ రాఫ్టర్, ఎఫ్‌-35 యుద్ధవిమానాల తర్వాత పూర్తిస్థాయిలో సిద్ధమైన ఐదోతరం లోహ విహంగం ఇదే.

చైనాపై అమెరికా గురి

మరోవైపు చైనాకు దూకుడుకు కళ్లెం వేసే ఉద్దేశంతో అమెరికా కూడా చర్యలు చేపడుతోంది. ఫలితంగా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో స్టెల్త్‌ యుద్ధవిమానాల గర్జనలు పెరిగాయి. చైనాకు హెచ్చరిక సందేశం ఇచ్చేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న డీగో గార్షియా దీవిలో మూడు బి-2 స్టెల్త్‌ బాంబర్లను అమెరికా మోహరించింది. జపాన్, దక్షిణ కొరియాల్లోనూ ఎఫ్‌-35, ఎఫ్‌-22 విమానాలను మోహరించింది. మరోవైపు ఈ ప్రాంతంలో భారత్‌ సహా ఇతర మిత్ర దేశాలకు తన మద్దతు ఉందని చాటి చెప్పేందుకు కాలు వాస్తవాధీన రేఖకు చేరువలో బి-2 బాంబర్లతో గగనవిహారం, విన్యాసాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. చైనాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ‘చతుర్భుజి కూటమి’ని బలోపేతం చేసే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి.

డ్రాగన్‌ వైఖరిపై సెనేట్‌ ఖండన

సైనిక బలప్రయోగంతో వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అమెరికా సెనేట్‌ ఖండించింది. చైనా చర్య అంతర్జాతీయ భద్రత, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది. భూటాన్‌ భూభాగాన్ని తనదిగా చైనా చెబుతోందని, అరుణాచల్‌ ప్రదేశ్‌పై హక్కులు కోరేందుకే ఇలా చేస్తోందని విమర్శించింది. సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చైనా ముప్పు నుంచి తన టెలికం మౌలిక వసతులను రక్షించుకునేందుకు భారత్‌ చేపట్టిన చర్యలను ప్రశంసించింది. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిని పెంపొందించడానికి ‘చతుర్భుజ’ కూటమి వంటి బహుళపక్ష భాగస్వామ్య వేదికలకు మద్దతు పలికింది. సెనేటర్లు జాన్‌ కార్నిన్, మార్క్‌ వార్నర్‌లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌-అమెరికాల మధ్య రక్షణ, ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు.

పాక్‌ సరిహద్దుల్లో తేజస్‌..

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పాకిస్థాన్‌ వెంబడి ఉన్న సరిహద్దుల్లో తేజస్‌ యుద్ధవిమానాలను భారత్‌ మోహరించింది. ప్రస్తుతం తమిళనాడులోని సూలురులో ఉన్న ఈ లోహవిహంగాలను అక్కడికి తరలించింది. దేశీయంగా రూపొందిన ఈ యుద్ధవిమానాలను సరిహద్దుల్లో మోహరించడం.. స్వదేశీ సాంకేతిక సత్తాకు దక్కిన పెద్ద విజయమని నిపుణులు చెబుతున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని అన్ని వైమానిక స్థావరాలను వాయుసేన అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది.

ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాలు దువ్వుతున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి – సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నరవణే
భారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నవరణే తెలిపారు. చైనాతో స్థానిక స్థాయి కమాండర్లు జరుపుతున్న చర్చల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. దీని ఫలితంగా గత కొన్ని రోజుల్లో రెండు వైపుల భారీ స్థాయిలో బలగాల ఉపసంహరణ జరిగిందని వెల్లడించారు. చర్చల ద్వారానే ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో శనివారం జరిగిన సైనికాధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

నేపాల్‌తో పటిష్ఠ బంధం..

ఈ సందర్భంగా నేపాల్‌తో ఉన్న సంబంధాల్ని నరవణే గుర్తుచేశారు. ఆ దేశంతో ఎన్నో ఏళ్లుగా భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరు దేశ ప్రజల మధ్య కూడా బలమైన బంధం ఉందని గుర్తుచేశారు. ఉభయ దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న పటిష్ఠమైన బంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ ఇటీవల కొత్త మ్యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు నేడు అక్కడి పార్లమెంటు ముందుకు రానుంది. విపక్షాల మద్దతు కూడగట్టడంలో ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ విఫలం కావడంతో ఇప్పటికే ఈ ప్రక్రియ ఓసారి వాయిదా పడింది. ఈ తరుణంలో నరవణే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కశ్మీర్‌లో స్థానికులే సహకరిస్తున్నారు..

అలాగే జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపైనా నరవణే మీడియాతో మాట్లాడారు. గత 10 రోజుల్లో మన బలగాలు అనేక విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దాదాపు 15 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేశారని తెలిపారు. బలగాల మధ్య సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అలాగే నిఘా వర్గాలకు అందుతున్న ఉగ్రమూకల సమాచారం ఎక్కువగా స్థానిక ప్రజల నుంచే అందుతోందని తెలిపారు. దీన్నిబట్టి అక్కడి పౌరులు ఉగ్రవాదంతో ఏ స్థాయిలో విసిగిపోయారో అర్థమవుతోందన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని వారంతా బలంగా కోరుకుంటున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి – సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నరవణే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒక ప్రక్క చర్చలు – మరో ప్రక్క సైనిక విన్యాసాలు – చైనా ద్వంద్వ నీతి
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న వివాదానికి పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలు జరిపిన మరుసటి రోజే చైనా వేలాది మంది సైనికులతో సరిహద్దు వద్ద డ్రిల్‌ నిర్వహించినట్లు సమాచారం. సెంట్రల్‌ చైనీస్‌ ప్రావిన్సు నుంచి సరిహద్దుకు తమ బలగాల్ని, యుద్ధ వాహనాల్ని తరలించడంపై తమ సన్నద్ధతను పరీక్షించుకోవడానికే ఈ చర్యలకు దిగినట్లు సమాచారం. భారత్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలో ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ'(పీఎల్‌ఏ) ఈ విన్యాసాలు నిర్వహించినట్లు చైనాకు చెందిన పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది. గతవారం కూడా పత్రిక ఈ తరహా కథనాన్ని ప్రచురించింది. టిబెట్‌ మిలిటరీ కమాండ్‌కు చెందిన సైనికులు సముద్ర మట్టానికి 4,700 మీటర్ల అతిఎత్తైన ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించినట్లు పేర్కొంది. ఓవైపు సమస్య పరిష్కారం దిశగా శాంతియుత చర్చలు జరిపేందుకు అంగీకరిస్తూనే.. మరోవైపు ఈ తరహా సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తుండటం చైనా ద్వంద్వ నీతిని బహిర్గతం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనను త్వరగా పరిష్కరించుకునే దిశగా సైనిక, దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు తీర్మానించిన విషయం తెలిసిందే. శనివారం భారత్‌, చైనా సైనికాధికారుల భేటీలో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనను త్వరగా పరిష్కరించుకుంటే ఇరుదేశాల సంబంధాల్లో మరింత పురోగతి సాధ్యమవుతుందని భారత్‌, చైనాలు అభిప్రాయపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక ప్రక్క చర్చలు – మరో ప్రక్క సైనిక విన్యాసాలు – చైనా ద్వంద్వ నీతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ చైనాల సరిహద్దు ఉద్రిక్తతలపై జరగనున్న కీలక చర్చలు
భారత్, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా, లడ్డాక్ లో సైనిక బంకర్లు ఏర్పాటు చేయడం తో పాటు, సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున సైనికులను, ఆయుధాలను మోహరించిన సంగతి పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో మే 5వ తారీఖున ఇరు దేశాల సైనికుల మధ్య పాంగాంగ్ వద్ద జరిగిన గొడవలో ఇరుపక్షాలకు చెందిన సుమారు 200 మంది సైనికులు గాయపడ్డారు. అనంతరం మే 9వ తారీఖున మరలా జరిగిన గొడవలో మరో 10 మంది సైనికులకు గాయాలయ్యాయి.

ఈ విషయమై ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య ఈ సమావేశం జరుగనున్నది. తూర్పు లడ్డాఖ్ లోని చుసుల్ – మోల్డో సరిహద్దు వద్ద ఇరుదేశాల సైనికాధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే భారత సైనికాధికారుల బృందానికి 14 కాప్స్ కమాండర్ కెప్టెన్ హరిందర్ సింగ్ నేతృత్వం వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ చైనాల సరిహద్దు ఉద్రిక్తతలపై జరగనున్న కీలక చర్చలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సరిహద్దుల వద్ద సైన్యం మోహరింపు చైనా చెత్త దౌత్య విధానానికి నిదర్శనం
మోడీ (డోనాల్డ్) ట్రంప్ కార్డు పనిచేస్తోంది.  యుఎస్-ఇండియా మధ్య సంబంధాలు పెద్ద ఎత్తున ఫలవంతమయ్యాయి. ఆ బంధం చైనాను అడ్డుకుంది.  చైనా సరిహద్దు ప్రతిష్టంభన భారత్ సూపర్ పవర్ గా మారడానికి ఒక అవకాశం కానుంది.

చైనా ప్రారంభించిన సరిహద్దు-ప్రతిష్టంభన చైనా యొక్క చెత్త దౌత్య విధానానికి నిదర్శనం అవుతుంది.  COVID19 అప్రతిష్ట నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి, చైనా హాంగ్-కాంగ్ – తైవాన్ అణచివేత, దక్షిణ సముద్రం వద్ద రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించింది. ఇప్పుడు తాజాగా భారత సరిహద్దుల్లో సైన్యం మోహరింపుతో భారత్ తో గిల్లికజ్జాలకు తెరలేపింది.

లండన్లోని గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగి గౌరవనీయ శ్రీ ప్రసూన్ శర్మ మాట్లాడుతూ “ఇది ప్రపంచంలో భారత్ యొక్క ప్రతిష్ఠను, స్థాయిని ఇనుమడింపజేసి ప్రపంచంలోని చైనా వ్యతిరేక శక్తులన్నీ భారతదేశం వెనుక నడిచేలా చేస్తుంది.”  అని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ దౌత్య విజయాలతో చైనా బలహీనపడి, నిరాశకు గురవుతోంది. మొదట, ప్రజాస్వామ్యం యొక్క శక్తిని పునఃస్థాపితం చేయడం ద్వారా, కరోనా సవాలును ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలతకు పిఎం మోడీ ఒక ఉదాహరణగా నిలిచారు.  ప్రధానమంత్రి మోడీ, తన సమాఖ్య సహచరులతో కలిసి, ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. పూర్తి ప్రజాదరణతో లాక్డౌన్, సామాజిక దూరం వంటి చర్యలను విజయవంతంగా అమలు చేశారు.  రెండవది, ప్రపంచానికి సహాయం చేయడం ద్వారా, 70 కి పైగా దేశాలకు మందులు (జెనెరిక్ మరియు హెచ్‌సిక్యూ) సరఫరా చేయడం ద్వారా పిఎం మోడీ భారతదేశం యొక్క మృదువైన, స్నేహపూర్వకమైన శక్తిని ప్రపంచానికి చాటారు. మూడవది, ట్రెండ్ సెట్ చేయడం ద్వారా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సార్క్ నాయకులతో జరిపిన  వీడియో కాన్ఫరెన్సింగ్ స్ఫూర్తితో  సౌదీ అరేబియా అసాధారణ రీతిలో  జి 20 లీడర్స్ సమ్మిట్‌ కు ఏర్పాట్లు చేసింది. నాల్గవది, భారత్ సూపర్ పవర్ గా అవతరిస్తూ ఉండడం. WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఛైర్మన్‌గా భారత్ నుంచి డాక్టర్ హర్షవర్ధన్ ఎంపిక ఇందుకు ఒక ఉదాహరణ. దీని కారణంగా COVID19 విషయంలో చైనా  వ్యవహరించిన తీరుపై  చైనాకు వ్యతిరేకంగా వివిధ దేశాలు ప్రతిపాదించిన దర్యాప్తును భారత్ సన్నిహితంగా పరిశీలించే అవకాశం లభించింది.”

అంతేకాకుండా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో మాట్లాడుతూ, “వాషింగ్టన్ భారతదేశంతో ప్రపంచ సరఫరా వ్యవస్థ పునర్నిర్మాణం (చైనా నుండి బయటపడటం) గురించి చర్చిస్తోంది.” అని పేర్కొన్నారు.  ఇండియా – ఆస్ట్రేలియా మ్యూచువల్ లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందంపై సంతకం చేయడం గురించి పెద్ద రక్షణ ప్రకటన త్వరలోనే జరగవచ్చు.  ఐదవది, స్వదేశీ మిషన్‌ను పెంచడం ద్వారా… అంటే చైనా సరిహద్దు ఘర్షణ స్వదేశీ మరియు “మేక్ ఇన్ ఇండియా” మిషన్‌ను పెంచుతుంది.  అమెరికాతో వాణిజ్యం పతనమైన తరువాత, భారతదేశంలో కూడా వ్యాపారం క్షీణించడం షియోమి, వివో వంటి చైనా కంపెనీలను నిరాశపరుస్తుంది.

దీనికి విరుద్ధంగా, ఈ సరిహద్దు ఘర్షణ విషయంలో జిన్ పింగ్ కనుక మోడీని చర్చలకు ఆహ్వానించినా, లేదు  డోక్లాం వివాదంలో వ్యవహరించిన శైలిలో వ్యవహరించినా భారత్ దౌత్య పరంగా చైనాకు తీవ్ర ఇబ్బందిని, నష్టాన్ని సృష్టించవచ్చు. కాదని చైనా సుదీర్ఘ కాలం తన సేనలను భారత సరిహద్దులలో మోహరించి ఉండినా దాని ద్వారా ప్రపంచంలోని చైనా వ్యతిరేక దేశాలను మరియు సంస్థలను ఏకీకృతం చేయడానికి భారతదేశానికి ఎక్కువ అవకాశం లభించినట్లవుతుంది. ఒకవేళ, చైనా తన సేనలను ఉపసంహరించుకుంటే అప్పుడు జిన్ పింగ్ ఒక బలహీన నేతగా నిలుస్తారు.

అలాగని చైనాని తక్కువ అంచనా వెయ్యలేం. సంఖ్యాపరంగా చైనా అతిపెద్ద మిలిటరీ ఫోర్స్ ని కలిగి ఉంది. సాంకేతికంగా కూడా చైనా అత్యున్నత స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు చైనా యొక్క వాస్తవిక శక్తి ప్రపంచానికి తెలియదు. కారణం 1962 భారత యుద్ధం తర్వాత చైనా నేరుగా ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. “ప్రమాణాల పరంగా చైనా సైన్యం కొంత బలహీనంగా ఉన్నది” అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చైనా సైన్యం లో ప్రాణభయం, అవినీతి, దురాశ, క్రమశిక్షణా రాహిత్యం ఉన్నాయని కొన్ని విశ్లేషణలు చెబుతున్నా చైనా శక్తిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అదే సమయంలో భారత ప్రభుత్వం చైనా కుటిల నీతికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందే.

REFERENCE :

https://www.organiser.org/Encyc/2020/5/28/China-s-Worst-diplomatic-faux-pas.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సరిహద్దుల వద్ద సైన్యం మోహరింపు  చైనా చెత్త దౌత్య విధానానికి నిదర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌పై నేపాల్‌ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు
భారత్‌పై నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తికి భారత్‌ కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు.

భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురాలు ప్రాంతాలు నేపాల్‌కు చెందినవేనని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం అన్నారు. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ రూపొందించిన కొత్త పటాన్ని నేపాల్‌ మంత్రిమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే.

‘భారత్‌ నుంచి అక్రమ మార్గాల్లో వస్తున్న వారి ద్వారానే నేపాల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. సరైన పరీక్షలు చేయకుండానే అధికారులు, పార్టీ నాయకులు వారిని అనుమతిస్తున్నారు. బయట నుంచి జనాలు వస్తుండటంతో కొవిడ్‌-19ను కట్టడి చేయడం కష్టమవుతోంది. ఇటలీ, చైనాతో పోలిస్తే భారత వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఎక్కువ మందికి సోకుతోంది’ అని ఓలీ ఆరోపించారు.

దురుద్దేశపూర్వకంగానే నేపాల్‌ ప్రధాని భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఓలితో చైనా ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. వైరస్‌ కారణంగా డ్రాగన్‌ దేశం నుంచి కంపెనీలు భారత్‌కు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇలా దొంగదారిలో ఆరోపణలు చేయిస్తున్నట్టు సమాచారం. కరోనా వైరస్‌ వాస్తవంగా చైనాలోని వుహాన్‌లోనే పుట్టిన సంగతి తెలిసిందే. వైరస్‌ ఆవిర్భావంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని అన్ని దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. అందులో కొన్ని దేశాలను దారికి తెచ్చుకొనేందుకు వివాదాస్పద ప్రాంతాలపై కవ్వించడం, ఎగుమతులు, దిగుమతులను అడ్డుకోవడం వంటివి చేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌పై నేపాల్‌ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.