CHINA VIRUS – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనాలో హైవేలు, క్రీడా మైదానాలు మూసివేతకు కారణం కాలుష్యమా? కరోనానా?
పెద్ద ఎత్తున నమోదవుతున్న కరోనా కేసులతో సతమతమవుతున్న చైనాకు మరో సమస్య వచ్చిపడింది. చైనా, ముఖ్యంగా రాజధాని బీజింగ్ నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది.

తీవ్ర బొగ్గు కొరత కారణంగా చైనా వ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. దానికి పరిష్కారంగా అధికారులు దేశంలో బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని భారీగా పెంచేశారు. దీంతో దేశ రాజధాని బీజింగ్ ‌తో సహా ఆయా నగరాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున వాయు కాలుష్యం పెరిగింది. దాంతో ఉత్తర చైనాలోనూ దట్టమైన కాలుష్య పొగలు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ దూరం కనిపించని దుస్థితి. దీంతో శుక్రవారం షాంఘై, టియాంజిన్, హార్బిన్ ‌తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే రహదారులను మూసివేశారు. తీవ్ర వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా రాజధానిలోని పాఠశాలలు.. ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదంతా పైకి తెలుస్తున్న సమాచారం. కానీ దేశవ్యాప్తంగా తీవ్రంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చైనాలో కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ కూడా విధింపబడింది. ఇప్పుడు చైనాలో ఆ లాక్ డౌన్ ను కొనసాగించే ప్రయత్నంలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా మరింత పరువు పోగొట్టుకోకుండా ఉండడం కోసమే ఇప్పుడు కాలుష్యం పేరుతో కొత్త నిబంధనలకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెరతీసిందేమోననే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా జిత్తులమారి కమ్యూనిస్టు దురాక్రమణవాద చైనాని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నదే ప్రపంచంలో చాలా దేశాల నిశ్చితాభిప్రాయం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో హైవేలు, క్రీడా మైదానాలు మూసివేతకు కారణం కాలుష్యమా? కరోనానా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్..
కోవిడ్‌ అనేక దేశాల్లో తిరగబెడుతోంది. డెల్టా వేరియంట్ చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపిస్తూ.. చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

చైనాలో మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95కి పెరిగినట్లు అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తెలిపింది. వీటిలో డెహోంగ్‌, నన్‌జింగ్‌, ఝెంగ్‌జౌ సహా 4 ప్రాంతాలు ‘తీవ్ర ముప్పు’లో ఉన్నట్లు తెలిపింది. రాజధాని బీజింగ్‌లో ఆదివారం బయటపడిన కొత్త కేసులు మూడింటికీ ‘డెల్టా’ వేరియంట్‌ కారణమని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) నిర్ధారించింది. కొవిడ్‌ వ్యాప్తి ఉన్న ప్రావిన్సుల నుంచి రాజధానికి వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు బీజింగ్‌ మున్సిపల్‌ గవర్నమెంట్‌ ప్రకటించింది. చైనాలో కొవిడ్‌ ఉద్ధృతి నాన్‌జింగ్‌ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనంతరం వైరస్‌ అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ఈ నగరంలో 204 కేసులు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పసలేని చైనా టీకా – అది వాడిన దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా టీకాలపై ఆధారపడిన సీషెల్స్‌, మంగోలియా, బహ్రెయిన్‌ వంటి దేశాలు వ్యాక్సిన్ల పంపిణీని భారీ స్థాయిలో చేపట్టాయి. దీంతో త్వరలోనే కొవిడ్‌ నుంచి బయటపడతామని భావించాయి. కానీ ఆ దేశాలు ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోగా.. మరోసారి విజృంభణ మొదలుకావడంతో తలలు పట్టుకుంటున్నాయి.

68శాతం ప్రజలకు టీకాలు వేసినా ఎందుకలా?

వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీలో చైనా చాలా ముందుంది. కరోనా వైరస్‌ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన సీషెల్స్‌, చిలీ, బహ్రెయిన్‌, మంగోలియా దేశాలకు భారీ స్థాయిలో టీకాలు సరఫరా చేసింది. చైనాకు చెందిన సినోఫార్మ్‌, సినోవాక్‌ బయోటెక్‌ టీకాలపైనే ఆ దేశాలు ఆధారపడ్డాయి. వేగంగా టీకాల పంపిణీ చేపట్టిన అక్కడి ప్రభుత్వాలు.. దాదాపు 50 నుంచి 68శాతం ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాయి. అనంతరం ఆ దేశాల్లో వైరస్‌ తీవ్రత తగ్గకపోగా.. కేసుల సంఖ్య గణనీయంగా పెరగసాగింది.

ఇండోనేషియాలోనూ సినోవాక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 350 మంది వైద్యులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వారిలో ఫిబ్రవరి-జూన్‌ మధ్యకాలంలోనే 61 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండోనేషియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇలాంటి ఘటనలు సినోవాక్‌ వ్యాక్సిన్‌ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయని సింగపూర్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ కెన్నెత్‌ మార్క్‌ అభిప్రాయపడ్డారు. చైనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తే పలు దేశాల్లో ఈ రకమైన తీవ్రత కనిపించేది కాదని హాంకాంగ్‌ యూనివర్సిటీకి చెందిన వైరాలజీ నిపుణులు జిన్‌ డోంగ్యాన్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితికి చైనా బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా ఏవిధంగా చూసినా చైనా వ్యాక్సిన్లకు సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు రుజువవుతోందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నికొలాయ్‌ పెట్రోవ్‌స్కి స్పష్టం చేశారు.

కొత్తరకాలపై సందేహమే..!

వ్యాక్సిన్‌ తీసుకున్నామనే ధీమాతో కొవిడ్‌ నిబంధనలు పక్కకు పెట్టడం వైరస్‌ విజృంభణకు ఒక కారణమైతే.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాల ప్రభావం కూడా మరో కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రెండోసారి కరోనా వైరస్‌ బారినపడే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగోలియాలో వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వ్యక్తి నెల తర్వాత వైరస్‌ బారినపడడమే కాకుండా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇలాంటి ఘటనలను ఉదహరిస్తోన్న నిపుణులు.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలను ఎదుర్కొనే సామర్థ్యం చైనా టీకాలకు లేకపోవచ్చంటున్నారు. అంతేకాకుండా చైనా టీకా తయారీ సంస్థలు కొత్తరకాలపై తమ వ్యాక్సిన్లు పని చేస్తున్నాయో లేదోననే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

పేద దేశాల చూపులు చైనాటీకా వైపే!

అమెరికాలో ఇప్పటి వరకు 45శాతం జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది. అక్కడ ఎక్కువగా ఫైజర్‌, మోడెర్నా టీకాలనే తీసుకున్నారు. దీంతో గత ఆరునెలల కాలంలో కేసుల సంఖ్య 94శాతం తగ్గింది. ఇక ఇజ్రాయెల్‌లో దాదాపు ఫైజర్‌ టీకానే దేశమంతా పంపిణీ చేయగా.. అక్కడ కూడా కేసుల సంఖ్య ప్రతి పదిలక్షల జనాభాకు 4.95కు తగ్గింది. కానీ భారీ స్థాయిలో సినోఫార్మ్‌ టీకాను అందించిన సీషెల్స్‌లో మాత్రం కేసుల సంఖ్య ప్రతి పదిలక్షల జనాభాకు 716గా నమోదయింది. దాంతో చైనా వ్యాక్సిన్‌ సమర్థతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మంగోలియాలోనూ 52శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినప్పటికీ వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాలు ఫైజర్‌, మోడెర్నా వంటి సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా.. పేద దేశాలు మాత్రం చైనా టీకాలవైపే చూస్తున్నాయి. దాదాపు 90దేశాలు చైనా టీకాలను సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైనా వ్యాక్సిన్లు తగినంత ప్రభావం చూపకపోతే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయోగాల సమాచారంపై గోప్యత!

కరోనాను ఎదుర్కోవడంలో ఫైజర్‌, మోడెర్నా వంటి టీకాల సామర్థ్యం 90 శాతానికిపైగా ఉండగా.. ఆస్ట్రాజెనికా, జే&జే టీకాల ప్రభావశీలత 70 శాతానికి పైగా ఉంది. అయితే చైనా సినోఫార్మ్‌ టీకా సామర్థ్యం 78శాతం అని చెబుతున్నప్పటికీ దానికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారాన్ని బహిరంగపరచలేదు. అంతేకాక సినోవాక్‌ వ్యాక్సిన్‌ పనితీరు కేవలం 51 శాతం అని పేర్కొన్న చైనా.. వాటి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో 70శాతం మందికి వ్యాక్సిన్‌ అందిస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించవచ్చని చైనా ప్రకటించింది. కానీ తాజాగా 80శాతం నుంచి 85శాతం మందికి వ్యాక్సిన్‌ అందిస్తేనే అది సాధ్యమవుతుందని చైనా సీడీసీ ప్రకటించడం గమనార్హం.

తాజా విజృంభణలకు సంబంధం లేదు

చైనా టీకాలు పంపిణీ చేస్తోన్న దేశాల్లో మళ్లీ వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో చైనా స్పందించింది. తాజా విజృంభణకు, వ్యాక్సిన్ల పనితీరుకు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. చైనా వ్యాక్సిన్లను అందుకున్న చాలా దేశాలు తమ టీకాలు సురక్షితమైనవని, నమ్మకమైనవని పేర్కొంటున్నాయని తెలిపింది. భవిష్యత్తులో సంభవించే కరోనా విజృంభణలను ఎదుర్కొనే స్థాయికి పలు దేశాలు ఇంకా చేరుకోలేదని, అందుచేత కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని చైనా గుర్తుచేస్తోంది.

– ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పసలేని చైనా టీకా – అది వాడిన దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో పర్యటించనున్న డబ్ల్యూహెచ్‌వో బృందం
వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మూలాలతో పాటు అది మానవులకు ఎలా సోకిందనే దానిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందంటూ వివిధ దేశాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వైరస్‌ పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ పర్యటన జరగనుండడం గమనార్హం. తొలిసారి జనవరిలో వుహాన్‌ నగర మున్సిపల్‌ అధికారులు చేసిన కొత్త ‘వైరల్‌ న్యూమోనియా’ ప్రకటనను డబ్ల్యూహెచ్‌వో పరిగణనలోకి తీసుకుంది. ఆ వెంటనే జరిగిన ఓ మీడియా సమావేశంలో సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ కరోనా వైరస్‌కు సంబంధించి తొలి అధికారిక ప్రకటన చేశారు.

డిసెంబరుకు ముందు చైనాలో ఏం జరిగింది.. ఎప్పుడు తొలి కేసు నమోదైంది.. జంతువుల నుంచి మానవులకు ఎలా సంక్రమించింది వంటి అంశాలపై ఈ పర్యటనలో లోతైన పరిశోధన చేయనున్నామని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. డిసెంబరు 31న తొలిసారి చైనా దీనిపై అధికారిక ప్రకటన చేసిందని.. ఆ మరుసటి రోజే డబ్ల్యూహెచ్‌వో దీన్ని గుర్తించి.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్‌ జన్యుక్రమాన్ని బట్టి చూస్తే ఇది గబ్బిలాల నుంచే సంక్రమించినట్లు తెలుస్తోందన్నారు. అయితే, మనుషులకు సోకడానికి ముందు మరే జంతువుకైనా ఈ వైరస్‌ సంక్రమించిందా లేక నేరుగా గబ్బిలాల నుంచే మానవులకు వచ్చిందా అనే దానిపై పరిశోధన జరగాల్సి ఉందన్నారు. వీటన్నింటినీ కనుగొంటే వైరస్‌ కట్టడిలో పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో పర్యటించనున్న డబ్ల్యూహెచ్‌వో బృందం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా పాపం చైనాదే – WHO
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం చైనాయేనని మొదటినుంచి ఆరోపిస్తున్న అమెరికా మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. వైరస్ ను వ్యాప్తి చేసింది ముమ్మాటికి డ్రాగన్ దేశమేననే అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యలతో ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO కూడా ఏకీభవిస్తోంది. తాజాగా WHO చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

కరోనా పాపం చైనాదేనని, వైరస్ సమాచారం ఇవ్వడంలో చైనా కావాలనే జాప్యం చేసిందని అమెరికా అధ్యక్షుడు మొదటినుంచి విమర్శిస్తూ వస్తున్నారు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తీవ్రంగా విఫలమైందని, WHO చైనా మాయలో నుంచి బయటపడాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే డ్రాగన్ మాయ నుంచి WHO బయట పడుతున్నట్లుగా కనబడుతోంది.

COVID – 19 జన్యు పరివర్తన క్రమాన్ని చైనా దురుద్దేశ్యపూర్వకంగానే ఆలస్యంగా బహిర్గతం చేసినట్లు WHO కూడా ఒప్పుకుంటూ ఉంది. ఈ సంచలన విషయాలను అసోసియేట్ ప్రెస్ బయటపెట్టింది. చైనాలోని ప్రయోగశాలలు ఎప్పుడో కరోనా జన్యు పరివర్తన క్రమాన్ని డీకోడ్ చేశాయి. కానీ వైరస్ నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ తయారీకి అవసరమైన వివరాలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొన్ని వారాల తర్వాత గానీ వెల్లడించలేదు. పైగా సమాచారం వెల్లడి కాకుండా కఠిన నిబంధనలను అమలు చేసిందనే ఆరోపణలున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా పాపం చైనాదే – WHO appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా
కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వీటిలో 31కేసులు లక్షణాలు లేకుండానే గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి రెండవ దఫా విజృంభించే అవకాశం ఉందని నిపుణుల సూచనలతో దాదాపు కోటి మంది జనాభాగల వుహాన్‌లో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగానే తాజాగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వీటిలో ఎక్కువగా లక్షణాలు కనిపించడం లేదు. వుహాన్‌ కాకుండా గాంగ్‌డాంగ్‌, షాంఘై ప్రావిన్సుల్లో కూడా తాజాగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. అయితే వీటిలో కొన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే సోకినట్లు తేలగా.. మరికొన్ని మాత్రం స్థానికంగానే వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంమీద బయటకు లక్షణాలు కనిపించని కేసులే ఎక్కువగా బయటపడుతున్నాయని వెల్లడించారు. అత్యధికంగా వుహాన్‌లో లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు?
దేశవిదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వాల వరకూ అందరి నోటా వినిపిస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ మూలాలు చైనాలోనే ఉన్నాయని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్దలను అతలాకుతలం చేయడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని డ్రాగన్ దేశం చైనా ప్రయత్నించిందని అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయంగా అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ఇదే డిమాండ్ తో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సు సందర్భంగా మొత్తం 62 దేశాల నుంచి ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

భారత్ మద్దతు :

కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయంగా ఓ స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు చేయించి బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్ కు భారత్ కూడా మద్దతిచ్చింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సులో ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాలు చేసిన డిమాండ్ కు భారత్ మద్దతు పలికింది. ప్రపంచంలో ఇతర దేశాలతో పాటు కరోనా వైరస్ బాధిత దేశంగా ఉన్న భారత్.. కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు చేయించాల్సిందేనని తాజాగా డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందే – NDTV తో నితిన్ గడ్కరీ.
కరోనా వైరస్ సమస్య మరియు లాక్ డౌన్ ల వలన దెబ్బతిన్న చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపనలని ప్రస్తావిస్తూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరియు రహదారుల శాఖ  మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రస్తుత పరిస్థితులలో  వాళ్ళల్లో (వ్యాపారస్తులలో) విశ్వాసాన్ని నింపడం అతి పెద్ద సవాలు అని పేర్కొన్నారు.

NDTV కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యు లో ఆయన మాట్లాడుతూ ‘’కరోనా తో కలిసి జీవించే కళని మనం నేర్చుకోవాలి. ఇది సహజసిద్ధ వైరస్ కాదు. కృత్రిమంగా తయారైన ఈ వైరస్ ని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వాక్సిన్ అందుబాటులో లేదు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాము. అప్పుడు ఇక సమస్య ఉండదు.” అన్నారు.

“ఆ వైరస్ ని (సోకినప్పుడు) కనుగొనే పద్ధతి మరొక సమస్య. మన దగ్గర ఒక మంచి పద్ధతి ఉంటే, అది సోకగానే కనుగొనవచ్చు. ఇది లాబోరేటరీలో సృష్టించబడినది కాబట్టి, దీనిని ఎదుర్కొనడానికి ప్రపంచము, భారత దేశమూ, శాస్త్రవేత్తలూ ఇప్పుడు సంసిద్ధులయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటే మనం (ప్రజలలో) విశ్వాసం నింపగలము. వాక్సిన్ కనుగొంటే ఇక సమస్య ఉండదు. అది భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది.” అన్నారు.

దేశవ్యాప్త లాక్ డౌన్ లో చిక్కుకుపోయి, భయంతో వాళ్ళున్న ప్రాంతాలను వదిలి వెళ్ళిన వలస కార్మీకులు, పరిస్థితులు చక్కబడినాక మళ్ళీ తిరిగివస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  “మనం కేవలం వైరస్ తో పోరాడటమే కాకుండా, ఒక ఆర్ధిక సవాలును కూడా ఎదుర్కొంటున్నాము. మనది పేద దేశము, లాక్ డౌన్ ని నెల నెలా పొడిగించలేము.”అని ఆయన అభిప్రాయపడ్డారు.

వివిధ రంగాలు ఈ వైరస్ సమస్య నుండి బయట పడేందుకు ప్రధాని మంగళవారము నాడు 20 లక్షల కోట్ల  ఉద్దీపన పాకేజ్ ని ప్రకటించారు.

దీనిలో భాగంగా ప్రభుత్వం చిన్న తరహా వ్యాపారాలకి మూడు లక్షల కోట్ల పూచీ లేని ఋణాలను ప్రకటించింది. అలాగే కరోన వైరస్ సంక్షోభం లో దెబ్బ తిన్న బ్యాంకింగేతర మరియు గృహ ఋణాలను మంజూరు చేసే కంపెనీలను ఆదుకునేందుకు 30వేల కోట్ల నిధులు మంజూరు చేయబడ్డాయి.

జీతాలు కాని చెల్లింపుల మీద 25 శాతం పన్ను తగ్గింపు, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు చట్టబద్ధ చెల్లింపుల కోసం ఉన్న నిధికి మద్దతు, నగదు కొరతను ఎదుర్కొంటున్న విద్యుత్ పంపిణీ కంపెనీలకు 90వేల కోట్ల ఆర్ధిక మద్దతు, ప్రభుత్వ ప్రాజెక్టులను చేపట్టిన నిర్మాణ కంపెనీలు పనులు పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు పొడుగింపు లాంటివి కూడా ఈ ఉద్దీపన పాకేజ్ లో భాగంగా ప్రకటించబడ్డాయి.

రాబోయే రోజుల్లో ప్రభుత్వం వెల్లడించబోయే అనేక పథకాలలో ఆర్ధిక మంత్రి చేసిన ఈ ప్రకటన మొదటిది.

పూర్తిగా పెట్టుబడి ఆధారంగా నిర్వచించబడ్డ MSME ల నిర్వచనాన్ని ఎక్కువ పెట్టుబడి, ఉత్పత్తి గల కంపెనీలకు వర్తించే విధంగా మార్చబడింది. ఇందువలన వాటికి ఆర్ధిక మరియు ఇతర రాయితీలు అందుతాయి.

స్థూల జాతీయోత్పత్తిలో మూడవ వంతు ప్రాతినిధ్యం వహిస్తూ, 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు కరోనా వైరస్ వలన ఎదురౌతున్న  అవాంతరాలను ఎదుర్కొనేందుకు సహాయపడేలా బుధవారం నాటి పాకేజ్ ప్రకటించబడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందే – NDTV తో నితిన్ గడ్కరీ. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.