#Chief Minister of Uttar Pradesh – Vishwa Samvad Kendra Andhra Pradesh

28 ఏళ్ళ తర్వాత సొంతూరికి.. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఒడికి…
ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సుమారు 28 ఏళ్ళ‌ తర్వాత తమ సొంతూరులో అడుగుపెట్టారు. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు.

యోగి సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ళ తర్వాత ఆయన ఆ ఊరిలో అడుగుపెట్టారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక యోగి తన తల్లిని కలవడం ఇదే తొలిసారి. అందుకే ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆప్యాయంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యోగినే స్వయంగా ట్వీట్టర్‌లో షేర్‌ చేశారు. ‘అమ్మ’ అనే క్యాప్షన్ పెట్టారు.

బుధవారం యోగి మేనల్లుడి తలనీలాలు తీసే కార్యక్రమం ఉంది. అందుకోసమే ఆయన సొంతూరికి వెళ్ళారు. ముఖ్యమంత్రిగా ఒక అధికారిక కార్యక్రమం బదులు సొంత పని మీద వెళ్ళ‌డం ఆయనకు ఇదే తొలిసారి అంటున్నారు. కరోనా టైంలో హరిద్వార్‌లో తన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు యోగి హాజరు కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా టైంలో 23 కోట్ల మందికి తండ్రిగా బాధ్యతలు తనపై ఉన్నాయని, అలాంటిది తానే కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ఎలా అంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు.

కుటుంబ సభ్యులను కలవడానికి ముందు పౌరీ జిల్లా కేంద్రంలోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్‌ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువైన మహంత్‌ వైద్యనాథ్‌ విగ్రహాన్ని యూపీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగి ఉద్వేగానికి లోనయ్యారు. 1940 తర్వాత తాను జన్మించిన స్థలంలో తన ఆధ్యాత్మిక గురువు విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 28 ఏళ్ళ తర్వాత సొంతూరికి.. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఒడికి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.