Central forces on the Assam-Mizoram border – Vishwa Samvad Kendra Andhra Pradesh

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు
అస్సాం-మిజోరం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో తటస్థ కేంద్ర బలగాలు మోహరింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిచాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహతా, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మవియా చౌంగో, డీజీపీ ఎస్‌బీకే సింగ్‌లతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా బుధవారం దిల్లీలో సమావేశమయ్యారు. రెండు గంటలకుపైగా సాగిన ఈ భేటీలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో 306వ నంబరు జాతీయ రహదారి వెంట తటస్థ కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్‌) మోహరించేందుకు అంగీకారం కుదిరింది. ఈ సాయుధ సిబ్బందికి సీఏపీఎఫ్‌లోని సీనియర్‌ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇందుకోసం కేంద్ర హోం మంత్రిత్వశాఖ సమన్వయంతో రెండు రాష్ట్రాలు సముచితమైన సమయంలోగా అవసరమైన ఏర్పాట్లు చేస్తాయి. భేటీ అనంతరం మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతం ప్రశాంతంగా ఉందని, రాష్ట్ర బలగాలను ఆ ప్రాంతం నుంచి ఉపసంహరిస్తామని చెప్పారు. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సరిహద్దు బాధ్యతలను సీఏపీఎఫ్‌ చేపట్టనుందని తెలిపారు. సరిహద్దు సమస్య సామరస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు పరస్పర గౌరవంతో చర్చలు జరపాలని భేటీ సందర్భంగా అజయ్‌ భల్లా సూచించినట్లు అధికారులు చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

బరాక్‌ లోయ బంద్‌ ప్రశాంతం

మిజోరంతో చోటుచేసుకున్న ఘర్షణల్లో రాష్ట్ర పోలీసులు మరణించడాన్ని నిరసిస్తూ బుధవారం అస్సాంలోని బరాక్‌ లోయలో చేపట్టిన 12 గంటల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో సరకు రవాణా వాహనాలను అంతర్రాష్ట్ర సరిహద్దు సమీపంలో నిలిపివేశారు. ఈ విషయంలో కేంద్రం కల్పించుకోవాలని మిజోరం బుధవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మిజోరం హోం శాఖ కార్యదర్శి ఓ లేఖ రాశారు. మిజోరం రాష్ట్రానికి జీవనాడి అయిన 306వ నంబరు జాతీయ రహదారిని ఈ నెల 26 నుంచి అస్సాంలో దిగ్బంధించారని అందులో ఆరోపించారు. సోమవారం నాటి ఘర్షణల్లో గాయపడిన అస్సాం రాష్ట్రానికి చెందిన మరో పోలీసు బుధవారం మరణించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస్సాం-మిజోరం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.