Carona Vaccination in India – Vishwa Samvad Kendra Andhra Pradesh

టీకా కొరతంటూ రచ్చ చేశారు – ఇచ్చాక చేతులు ముడుచుకు కూర్చున్నారు
* రాష్ట్రాల వద్ద 15 కోట్ల డోసులు

కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌ 5 నాటికి దాదాపు 108 కోట్ల డోసులను పంపిణీ చేశారు. మరో 15 కోట్ల 54లక్షల డోసులు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్దే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇప్పటివరకు మొత్తం 116 కోట్ల డోసులను ఉచితంగా అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన సమయంలో టీకా కొరత ఉన్నట్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రాలు.. ప్రస్తుతం పంపిణీలో మాత్రం డీలా పడినట్లు తెలుస్తోంది.

10 కోట్ల మంది రెండో డోసుకు దూరం..

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలై పది నెలలు కావొస్తున్నా.. ఇప్పటివరకు 32 శాతం మందికి మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ అందించారు. కనీసం 77 శాతం అర్హులకు ఒక డోసు పంపిణీ చేశారు. వీరిలో దాదాపు 10 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మధ్యే ఆందోళన వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ మందకొడిగా సాగుతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లి టీకా అందించాలని సూచించింది.

48 జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువే..

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా తొలి డోసు అందించడంలో రాష్ట్రాలన్నీ ముందంజలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా పలు జిల్లాలు మాత్రం వెనుకబడిపోయాయి. దేశంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైన (18 ఏళ్ల వయసు పైబడిన) వారిలో సరాసరి 77 శాతం మంది కనీసం ఒకడోసు అందుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా 48 జిల్లాల్లో మాత్రం కేవలం 50శాతం మంది మాత్రమే ఒకడోసు తీసుకున్నారు. మొత్తంగా 13 రాష్ట్రాల్లో ఈ సమస్య ఉండగా ఈశాన్య రాష్ట్రాలు వ్యాక్సిన్‌ పంపిణీలో మరింత వెనుకబడిపోయాయి. నాగాలాండ్‌లో ఓ జిల్లాలో కేవలం 16 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందింది. ఝార్ఖండ్‌లో మొత్తం 24 జిల్లాల్లో 10జిల్లాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయా రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

దేశవ్యాప్తంగా సెప్టెంబరులో రోజువారీగా 78 లక్షల డోసులను పంపిణీ చేయగా అక్టోబర్‌ నాటికి 56 లక్షలకు తగ్గింది. తొలిడోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు గడువు దాటిపోయినప్పటికీ చాలా మంది ముందుకు రావడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు డోసు విషయంలో ప్రజలు కాస్త ఉదాసీనత వహిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. కొవిడ్‌ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని.. దీనికితోడు పండగల సీజన్‌ కూడా మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న జిల్లా అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీకా కొరతంటూ రచ్చ చేశారు – ఇచ్చాక చేతులు ముడుచుకు కూర్చున్నారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. కరోనా టీకాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, రెండో డోసులూ తీసుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. వ్యాధులను, శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని.. తుదముట్టించేంత వరకూ పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా తగ్గిపోయిందని టీకాను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఎన్నో దేశాలు ఆందోళన చెందుతున్నాయని, ఆ పరిస్థితి భారత్‌కు రానీయొద్దని కోరారు. దీన్ని మన దేశం భరించే పరిస్థితుల్లో కూడా లేదని పేర్కొన్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ప్రధాని బుధవారం మధ్యాహ్నం వ్యాక్సినేషన్‌ పురోగతిపై 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. కేవలం కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొనడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ”అందరి కృషి వల్లే దేశంలో వ్యాక్సినేషన్‌లో పురోగతి సాధ్యమైంది. బిలియన్‌ (100కోట్ల టీకాలు) మైలురాయి చేరుకున్న తర్వాత నిర్లక్ష్యం వహిస్తే కొత్త కష్టాల్లో పడిపోతాం. ఇకముందు కూడా జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ పెంచడానికి నూతన పంథాలో వెళ్లాల్సి ఉంటుంది. 100% వ్యాక్సినేషన్‌ చేసిన రాష్ట్రాల్లోనూ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అవి వాటిని అధిగమించి ముందుకెళ్లాయి. కనిపించని శత్రువుతో ఎలా పోరాడాలన్నది ఆశా కార్యకర్తలు నేర్చుకున్నారు. ఇక ముందు జిల్లా, రాష్ట్రం అన్న పదాలను వదిలిపెట్టి గ్రామాలు, వీధుల్లో ఉన్న ఇళ్లను గుర్తించి వ్యాక్సిన్‌ అందించాలి. క్షేత్రస్థాయిలో టీకాలు అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలనూ వినియోగించుకోండి. పోలీసు, ప్రభుత్వ విభాగాల్లో ఉన్న మహిళల సేవలను వ్యాక్సినేషన్‌ కోసం ఒక వారం పాటు ఉపయోగించుకోవాలి. దాంతో ఫలితాలు వేగంగా మారిపోతాయి. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా వ్యాక్సినేషన్‌పై ఉన్న అపోహలను పూర్తిగా తొలగించాలి. ఈ విషయంలో మతపెద్దల సాయం తీసుకోవాలి. వారి సందేశాలను వీడియోల రూపంలో ప్రజలకు చేరవేయాలి. ఇప్పటివరకు ప్రజలను వ్యాక్సినేషన్‌ సెంటర్లకు తీసుకొచ్చి టీకా అందించారు. ఇప్పుడు అర్హులైన ప్రతిఒక్కరికీ అందించాలన్న ఉత్సాహంతో ప్రతి ఇంటినీ చేరుకోవాలి. మీ సహచరులు కొన్ని జిల్లాల్లో వేగంగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేశారు. అదేరీతిలో మీ జిల్లాల్లోనూ చర్యలు చేపట్టండి. ఆదివాసీలు, వనవాసీలకు వ్యాక్సిన్‌ అందించడానికి మరింత శ్రమించాలి. బిర్సా ముండా వంటి ప్రముఖుల జయంతి నాడు ఆదివాసీ ప్రాంతాల్లో ఉత్సవ వాతావరణంలో వ్యాక్సినేషన్‌ నిర్వహించండి. సరళంగా, స్థానిక భాషల్లో అర్థమయ్యేలా ప్రజలకు చెప్పండి. మొదటి డోసులాగే రెండో డోసుకూ ప్రాధాన్యం ఇవ్వాలి. టీకా పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గకుండా చూడాలి. ఈసారి 100కోట్ల డోసులు పూర్తి చేసుకోవడంతో దీపావళి ఉత్సాహం అలుముకొంది. అలాగే కొత్త లక్ష్యాన్ని పూర్తి చేసుకొని క్రిస్మస్‌ను కూడా ఉత్సాహంగా జరుపుకోవాలి. ఇంటింటి తలుపుతట్టి టీకా అందించాలి” అని ప్రధాని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, భూపేశ్‌ బఘేల్‌ సహా పలువురు సీఎంలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యాక్సినేషన్‌లో భార‌త్ ఘ‌న‌త‌!
ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు 100 కోట్ల వ్యాక్సిన్‌ల పంపిణీ

న్యూఢిల్లీ: క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించిన దేశంగా నిలిచింది. చైనా మాత్ర‌మే వంద కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించింది. భారతదేశంలో ఈ ఏడాది జనవరి 16 న హెర్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేష‌న్ కార్యక్రమం ప్రారంభించారు. క‌రోనా ఫ్రంట్ లైన్ యోధుల అంద‌రికీ ఇస్తూ.. దేశంలో ఫిబ్రవరి 19న‌ కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న‌ 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా భార‌త్ నిలిచింది. జూన్ 12న‌ 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న‌ 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింద‌ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ జనాభాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని మొత్తం 94.4 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్నది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాక్సినేషన్‌లో భార‌త్ ఘ‌న‌త‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.