Blast at Darbhanga railway station in Bihar – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్‌ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు కుట్ర
న్యూఢిల్లీ: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో ఈ ఏడాది జూన్‌ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్‌ కేంద్రంగానే కుట్ర సాగినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో ఉత్తర ప్రదేశ్ వాసి ఇక్బాల్‌ ఖానా(ప్రస్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ కుట్రను అమలు చేసినట్టు నిర్ధారించింది.

ఈ మేరకు గురువారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు హైదరాబాదీలతో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన మహ్మద్‌ నాసిర్‌ ఖాన్‌ హైదరాబాద్‌ మల్లేపల్లిలోని భారత్‌ గ్రౌండ్స్‌ సమీపంలో ఉండేవాడు. అతని సోదరుడు ఇమ్రాన్‌ మాలిక్‌ స్వస్థలంలో ఉండేవాడు.

ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌ ఖానా 1993 నుంచి నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నాడు. అతనిపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాక్‌కు పారిపోయి లాహోర్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే ఐఎస్‌ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. లష్కరే తోయిబాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్‌లైన్‌ ద్వారా ఇమ్రాన్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. స్థానిక పదార్థాలతో పేలుళ్లు జరపడం ఎలా? అని ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తూ యూ ట్యూబ్‌లోని కొన్ని వీడియోలు పంపాడు. గతంలో పాక్‌కు వెళ్లిన నాసిర్‌ అక్కడ ఉగ్రవాద శిక్షణ పూర్తి చేసి వచ్చాడు. బాంబుల తయారీ నుంచి గూఢచర్యం వరకు వివిధ అంశాల్లో అతను శిక్షణ పొందాడు.

వేగంగా వెళ్లే రైళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించి భారీ ప్రాణనష్టం సృష్టించాలని ఇక్బాల్‌ చెప్పడంతో ఈ ఏడాది మేలో సిటీకి వచ్చిన ఇమ్రాన్‌ తన సోదరుడు నాసిర్‌ వద్ద ఆశ్రయం పొందాడు. దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టాలని నిర్ణయించుకొని చిక్కడపల్లి, హబీబ్‌నగర్‌లలోని దుకాణాల్లో కొన్న సల్ఫ్యూరిక్‌ యాసిడ్, నైట్రిక్‌ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు తయారు చేశారు.

గాజు సీసాలోకి ఈ పదార్థాలను ఇంజెక్షన్‌ సిరంజిల ద్వారా నింపి 16 గంటల్లో పేలి జరిగి మంటలు చెలరేగేలా కుట్రపన్నారు. ఈ ఏడాది జూన్‌ 15న రెడీమేడ్‌ వస్త్రాల పార్శిల్‌లో ఈ సీసాను ఉంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి దర్భంగ వెళ్లే దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో దీన్ని బుక్‌ చేశారు.

అయితే, అదృష్టవశాత్తూ ఈ పేలుడు ఆలస్యమైంది. 17న దర్భంగ స్టేషన్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి పార్సిల్‌ను అన్‌లోడ్‌ చేశాక స్వల్ప పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ… ఇక్బాల్‌ ఖానా, నాసిర్, ఇమ్రాన్‌లతోపాటు వారికి పరోక్షంగా సహకరించిన యూపీవాసులు హాజీ సలీం, ఖఫీల్‌ అహ్మద్‌లను అరెస్టు చేసింది. సికింద్రాబాద్‌ పార్శిల్‌ ఆఫీస్‌లో ఈ అన్నదమ్ములు మహ్మద్‌ సూఫియాన్‌ పేరుతో ఇచ్చిన పాన్‌ కార్డు కాపీనీ ఇక్బాలే వాట్సాప్‌ ద్వారా పంపాడని ఎన్‌ఐఏ గుర్తించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు కుట్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.