#BHOGI – Vishwa Samvad Kendra Andhra Pradesh

సంస్కృతీ, సంప్రదాయం ఉట్టిపడేలా భోగి పిడకలతో భారీ దండ తయారీ!
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గుమ్మిలేరు గ్రామానికి చెందిన మహిళలు అత్యంత పొడవైన భోగి పిడకల దండను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పశుపోషణకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఏటా ఈ భోగి దండను తయారు చేస్తుంటారు. గతంలో వీరు తయారు చేసిన పిడకల దండలకు లిమ్కాబుక్​ ఆఫ్​ రికార్డ్సులో కూడా నమోదు చేశారు. ఈక్రమంలో ఈ ఏడాది కూడా కిలోమీటరు పోడవైన భోగి దండను తయారు చేసి తమ భక్తిని చాటుకున్నారు.

ఆరు టన్నుల ఆవు  పేడ సేకరించిన మహిళలు..

ఈ దండను తయారు చేయడానికి వారు.. చింతలూరులో ఉన్న గోశాల, గ్రామంలోని పాడి రైతుల నుంచి ఆరు టన్నుల వరకు, ఆవు పేడను సేకరించి వినియోగించారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోని మహిళ భోగి దండ తయారీలో భాగమయ్యారు. ఈ భోగి దండను తయారు చేయడానికి గ్రామంలోని మహిళలు ముందుగా ఆవు పేడ సేకరించుకున్న తర్వాత.. పిడకలను తయారు చేస్తామని తెలిపారు. పిడకలు ఆరిన తర్వాత దారం సాయంతో ఒక దండలాగా తయారు చేస్తామన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఈ భోగి పిడకల దండ తయారీలో నిమగ్నమైనట్లు వారు పేర్కోన్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతీ, సంప్రదాయలను మరిచిపోకుండా ఉండేందుకే ఇలా తయారు చేశామని గుమ్మిలేరు మహిళలు అంటున్నారు.

The post సంస్కృతీ, సంప్రదాయం ఉట్టిపడేలా భోగి పిడకలతో భారీ దండ తయారీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భోగి రోజు ఇలా చేస్తే ఎలాంటి వారికైనా వివాహం అవుతుంది.. పెళ్లైన వారికి సుఖసంతోషాలు కలుగుతాయి!
వైష్ణవ ఆలయాల్లో భోగి రోజున గోదాదేవి రంగనాథుల కల్యాణం ఏటా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి జీవితంలో సంతోషం కలుగుతాయని వేద పండితులు చెబుతుంటారు. అసలు గోదాదేవి ఎవరు… ఆమెకు పెళ్లి ఎందుకు చేశారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా….

గోదాదేవి ఎవరంటే?

శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ (వటపత్రశాయి) లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు… నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అంటారు. విష్ణుచిత్తుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వారు) అన్న గౌరవాన్ని అందించారు. పెరియాళ్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. ఆమెను సాక్షాత్తూ ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఆమెకు ‘కోదై’ (పూలమాల) అనే పేరును పెట్టాడు..ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది.

కన్నయ్యను ఆరాధించిన గోదా.. తిరుప్పావై అంటే అర్థం అదే..

గోదాదేవి చిన్నప్పటి నుంచీ కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది. తన చుట్టూ ఉన్నవారంతా గోపికలు అని … తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వ్రజపురమని భావించింది. అంతేకాదు! తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుడు వేసినట్టు భావించి మురిసిపోయేది. ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు.. తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తూ ఆ భూదేవి అవతారమేననీ, ఆమె స్పృశించిన మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదని ఆనందం కలుగుతుందనీ తెలియచేశారు. దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమను మరింత పెరిగింది. తనకు పెళ్లైనట్టు భావించి.. ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తెలని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది. తన చెలులను మేల్కొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలిపేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు రోజుకో పాశురసం చొప్పున 30 పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!

గోదా ప్రేమకు కరిగిపోయిన కృష్ణుడు…

ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి, తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మనీ అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహమాడతాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకూ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేవు. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. పెళ్లికూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగిరోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంతా కళ్యాణం జరుపుతారు.

పెళ్లికాలేదని బాధపడుతున్నవారు, కల్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు… భగవంతుడిపై మనసు లగ్నంచేసి గోదా రంగనాథుల కల్యాణం చూస్తే.. అంతా మంచే జరుగుతుందని చెబుతారు. వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయంటున్నారు వేద పండితులు.

The post భోగి రోజు ఇలా చేస్తే ఎలాంటి వారికైనా వివాహం అవుతుంది.. పెళ్లైన వారికి సుఖసంతోషాలు కలుగుతాయి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి!
సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పండుగ మూడు రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ నాడు సంబరాలు చేసుకుంటారు. భోగి వేడుక నుంచే ప్రారంభమయ్యే ఈ పండుగకు ఎన్నో ప్రత్యేకతలు, దాని వెనుక ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14వ తేదీ భోగి పండుగను జరుపుకునేందుకు అందరూ సన్నద్ధమవుతున్నారు. అయితే భోగి మంటలు వేసే వారు కొన్ని నియమాలు పాటించాలని వేదపండితులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా….

ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి..

భోగిమంటలు అంటే చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం అని అందరూ భావించాలి. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను కూడా అంతే పవిత్రంగా వెలిగించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తే భోగి మంట వెలిగించాల్సి ఉంటుంది. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు.

ఒకప్పుడు భోగిమంటల్లో చెట్ల బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వాడేవారు. ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు. పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

పిడకలు, చెట్ల బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసుకోవచ్చు. కానీ ఇటీవల భోగిమంట కూడా ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేయడమే సరికాదంటే.. అవి సరిగా మండనప్పుడు పెట్రోల్, కిరోసిన్ పోస్తునారు… దీంతో భోగిమంటల వెచ్చదనం, సంక్రాంతి సందడి మాటేమో కానీ అనారోగ్యం పాలవడం ఖాయమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరోసిన్‌ నుంచి వెలువడే పొగతో పర్యావరణం కలుషితమవుతోందని వాపోతున్నారు.

భోగి పండుగ ఉద్దేశం ఇదే..

సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి… తెల్లవారు జామునే భోగిమంటలు వేసుకుని వెచ్చగా పండుగకు స్వాగతం పలుకుతారు. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారాస్తాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోవాలంటారు పండితులు.. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో భోగిమంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి వచ్చే పురుగులను తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనక మరో విశేషం ఏంటంటే సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పులు తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేయడం భోగి మంటల ఉద్దేశం అన్నమాట. మరి భోగి పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం.. కదా.. పర్యవరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు కదూ..!

The post భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.