BHARATH Vs PAKISTAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది – సైన్యాధిపతి నరవాణే
భారత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్‌ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని నెలకొల్ప డానికి ఉపయోగపడతాయని తెలిపారు. కాల్పుల విరమణ ఎంత కాలం సాగుతుందన్నది పాకిస్థాన్‌ చర్యలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆయన నియంత్రణ రేఖ వెంబడి భద్రతను సమీక్షించారు.

ఉగ్రవాదం, కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొంటూనే అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను కొనసాగిస్తున్నందుకు బలగాలను అభినందించారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ గౌరవించినంత కాలం మేం కూడా మా తుపాకులకు పనిచెప్పబోం’’ అని స్పష్టంచేశారు. ఆయుధ గర్జన ఆగినప్పటికీ తమ పోరాట సన్నద్ధతలో ఎలాంటి ఉదాసీనత ఉండబోదన్నారు. సరిహద్దు అవతల ఉగ్రవాద శిబిరాలు ఇంకా కొనసాగుతుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా అపనమ్మకం ఉంది. అందువల్ల రాత్రికి రాత్రే పరిస్థితి మారబోదు. భారత్‌లో విద్రోహ చర్యలకు పాక్‌ స్వస్తి పలకడాన్ని కొనసాగిస్తే చిన్నచిన్న అడుగులూ విశ్వాసాన్ని పాదుగొల్పుతాయి’’ అని చెప్పారు. ముప్పు పరిస్థితిని బట్టి మోహరింపులు చేపడుతున్నట్లు వివరించారు. ‘‘పరిస్థితులు అనుకూలిస్తే కొంత మేర బలగాలను క్రియాశీల విధుల నుంచి ఉపసంహరించి, సరిహద్దులకు కొంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో మోహరిస్తాం. తద్వారా సైనికులకు విశ్రాంతి, శిక్షణకు సమయం లభిస్తుంది. అయితే వారిని పూర్తిస్థాయిలో ఉపసంహరించబోం’’ అని చెప్పారు. అమర్‌నాథ్‌ యాత్రను సాఫీగా నిర్వహించడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు.

మూడో దశ వచ్చినా..

కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న చర్యలూ ఒకరకమైన యుద్ధమేనని నరవణె తెలిపారు. ఈ పోరులో సైన్యం అన్ని వనరులనూ సమకూర్చిందని, ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు సర్వశక్తులూ ఒడ్డిందన్నారు. కొవిడ్‌ మూడో ఉద్ధృతి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. సైన్యాధిపతి తన పర్యటనలో స్థానిక సైనిక కమాండర్లతో భేటీ అయ్యారు. ఎల్‌వోసీ వెంబడి భద్రతా పరిస్థితులను వారు వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది – సైన్యాధిపతి నరవాణే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్ అంశంలో మేం జోక్యం చేసుకోం – పాక్ కు స్పష్టం చేసిన సౌదీ అరేబియా
కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి లబ్ధి పొందాలనుకునే పాకిస్తాన్ కు మరోసారి చుక్కెదురైంది. జమ్మూ కాశ్మీర్ అంశంతో పాటు.. భారత్ , పాక్ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా… పాకిస్తాన్ కు సూచించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్తో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జరిపిన చర్చల్లో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ఇరుదేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. 2003లో భారత్ -పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సజావుగా కొనసాగించాలని సౌదీ పాక్ కు హితవు పలికింది. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలూ చర్చలు జరపాల్సిన అవసరముందని సౌదీ అరేబియా అభిప్రాయపడింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్ అంశంలో మేం జోక్యం చేసుకోం – పాక్ కు స్పష్టం చేసిన సౌదీ అరేబియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్ : ఇస్లాం మ‌త మార్పిళ్ల‌ను బ‌హిర్గ‌తం చేశాడని హిందూ జ‌ర్న‌లిస్టును చంపేశారు
పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో ‌ఒక టీవీ చానెల్‌‌లో ప‌నిచేస్తున్నజ‌ర్న‌లిస్టును కొంత మంది ఇస్లాం మ‌తోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలేంటో ఒకసారి తెలుసుకుందాం…….

అజ‌య్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్‌, ఒక ఉర్దూ వార్త ప‌త్రిక‌లో‌ జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేస్తున్నాడు. ఇస్లాం మ‌తోన్మాదులు చేస్తున్న అన్యాయాల‌ను, అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అజ‌య్ లాల్వానీ గ‌త కొంత కాలంగా ప‌ని చేస్తున్నాడు. అయితే ఇటీవ‌ల పాకిస్థాన్ లో 117 మంది హిందూ బాలిక‌ల‌ను అప‌హ‌రించి వారికి ముస్లింల‌తో వివాహం చేసి మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న ష‌రీఫ్‌, అబ్దుల్ హ‌క్ అలియాస్ మియాన్ మిథు ల ముఠాను అజ‌య్ బ‌హిర్గతం చేశారు.

ఒక వారం క్రితం, బహల్కాని తెగకు చెందిన కవితా బాయి అనే హిందూ అమ్మాయిని అప‌హ‌రించి ముస్లిం వ్య‌క్తితో వివాహం చేసి ఇస్లాం మతంలోకి మార్చారు. అజ‌య్‌ లాల్వానీ ఈ కథనాన్నివెలుగులోకి తీసుకొచ్చి ప‌త్రిక‌లో ప్రచురించారు. దాదాపు అన్ని మీడియా సంస్థలూ ఈ కథనాన్ని ప్రచురించాయి. దీంతో ఆ బాలిక అప‌హ‌ర‌ణకు సంబంధించి పోలీసు స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్‌ న‌మోదు అయింది. త‌మ‌పై కేసు న‌మోద‌వ‌డానికి కార‌కుడైన జ‌ర్న‌లిస్టు అజయ్ లాల్వాని అంతం చేయాల‌ని మియాన్ మిథు నిర్ణయించుకున్నాడు. ఈ నేప‌థ్యంలో సెలూన్‌లో క్ష‌వ‌రం చేయించుకుంటున్న సమయంలో అజ‌య్ లాల్వానీని కొంతమంది గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి ) కి చెందిన మియాన్ మిథు 2008లో ఎంపీగా ఎన్నిక‌య్యాడు. ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వాకు ఇత‌నికి మంచి సంబంధాలున్న‌ట్టు కూడా స‌మాచారం. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కూడా 2015లో తన పార్టీలో చేరమని మియాన్ మిథును ఆహ్వానించాడు.

మియాన్ మిథు 2019 లో హోలీ రోజున పాకిస్తాన్ సింధ్ లోని ఘోట్కి ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు మైనర్ బాలిక‌ల‌ను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. మియాన్ మిథు ఎంతో మంది హిందూ బాలికలను అపహరించి వారిని మ‌తం మార్చాడు. ఈ విష‌యంపై బాధిత కుటుంబ స‌భ్యులు పోలీసు స్టేష‌న్ కు లేదా కోర్టుల‌కు వెళ్లినా కూడా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో మంచి సంబంధాలు ఉన్న కార‌ణంగా న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ మియాన్ మిథు అనేక కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నాడు.

2016 లో అనిలా బాగ్రి అనే హిందూ అమ్మాయిని సాక్ష‌త్తూ పోలీసు అధికారియే రూ .50 వేలకు ఒక ముస్లిం వ్య‌క్తికి అమ్మిన విస్తుపోయే ఘ‌ట‌న జ‌రిగింది. ఘోట్కి జిల్లాకు చెందిన అనిలా బాగ్రిని కొంత మంది దుండ‌గులు అపహరించ‌గా కుటుంబ స‌భ్యుల‌ ఫిర్యాదు మేర‌కు ఆ బాలిక‌ను పోలీసులు గుర్తించారు. కానీ బాలిక‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించ‌డానికి  పోలీసు స్టేషన్ అధికారి అయిన సజ్జాద్ ఖాజీ రూ.50వేల‌ను డిమాండ్ చేశాడు. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ బాలిక‌ను జాఫర్ మసూరికి అనే వ్య‌క్తికి అప్పగించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతం మార్చి మసూరిని వివాహం చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో మియాన్ మిథుది కీల‌క పాత్ర.

పాకిస్తాన్‌లో హిందువులు, ఇతర మైనారిటీలు పాఠశాల, ఉపాధి, క్రీడల్లో ఇలా అన్ని రంగాలలో వివక్షను ఎదుర్కొంటున్నా‌రు. హిందూ దేవాలయాల‌పై అనేక సంవ‌త్స‌రాలుగా దాడుల‌కు పాల్ప‌డున్నారు. 1947 నుండి పాకిస్తాన్ లో హిందూ జనాభా బాగా తగ్గింది. 1947లో పాకిస్తాన్ లో హిందూ జనాభా 20% గా ఉంది, కానీ ఇప్పుడు అది కేవలం 1.85% మాత్రమే. పాకిస్తాన్‌లో హిందూ శరణార్థులు తమ మనుగడ కోసం  పోరాడుతుండగా రోహింగ్యా ముస్లింలు, ఇత‌ర అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు భారతదేశంలో చోటు కల్పించాలంటూ భారత్ లోని కొన్ని రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

Source : TFI POST & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్ : ఇస్లాం మ‌త మార్పిళ్ల‌ను బ‌హిర్గ‌తం చేశాడని హిందూ జ‌ర్న‌లిస్టును చంపేశారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాపాల పాక్ కూ టీకాలు పంపనున్న భారత్
అంతర్జాతీయ సమాజంలో భారత్‌ మరోసారి తన సౌభ్రాతృత్వాన్ని చాటుకుంది. కశ్మీర్‌ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. కరోనా మహమ్మారిపై పోరులో పాక్‌కు 4.5కోట్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గవీ(GAVI) ఒప్పందంలో భాగంగా భారత్‌ 45 మిలియన్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పాక్ ‌కు సరఫరా చేయనుంది. ఇందులో 1.6కోట్ల డోసులను ఈ ఏడాది జూన్‌ నాటికి డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ”మానవతా దృక్పథంలో పాక్‌కు సాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. దీనిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది”అని పేరు చెప్పడానికి నిరాకరించిన అధికారులు జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించారు. సీరమ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీకాలను పాక్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరిలో ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి పాక్‌ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో సీరమ్‌ తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా టీకాలను పాక్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్‌కు 5లక్షల సినోఫార్మ్‌ టీకాలను పంపిస్తామని ఇటీవల చైనా ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. టీకా దౌత్యంలో భారత్‌ ముందుంది. ఇందులో భాగంగానే పలు ఒప్పందాల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. గ్రాంట్ సహకారం, కొవాగ్జ్‌, వాణిజ్య విక్రయాల్లో భాగంగా పలు దేశాలకు టీకాలను అందిస్తోంది. కేంద్ర విదేశాంగశాఖ రికార్డుల ప్రకారం.. ఇప్పటివరకు భారత్‌ 5.79కోట్లకు పైగా వ్యాక్సిన్లను సరఫరా చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాపాల పాక్ కూ టీకాలు పంపనున్న భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ శాంతిమంత్రానికి కారణమేంటి?
భారత్‌ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా? అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ దళాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. పాకిస్థాన్‌ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనక తప్పనిసరి కారణాలు చాలానే ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం అన్నది పాకిస్థాన్‌ విదేశీ విధానాల్లో ఒకటిగా మారిందన్నది భారత్‌ ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే భారత్‌ను అస్థిరపరిచేందుకు ముష్కర మూకను దేశం మీదికి ఎగదోస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉగ్ర ముఠాలకు ఆవాసంతోపాటు ఆర్థిక సాయం అందిస్తూ అనేక సార్లు అంతర్జాతీయ సమాజం ఎదుట అడ్డంగా దొరికిపోయింది.

ఆర్థికంగా చితికి…..

ఉగ్రవాదంతోపాటు అంతర్గతంగా ఉన్న సమస్యలు, రాజకీయ పరమైన సమస్యలు పాకిస్థాన్‌ను ఆర్థికంగా చితికిపోయేలా చేశాయి. ప్రతి కార్యక్రమానికి ఇతరుల వద్ద దేబరించాల్సిన దుస్థితికి దిగజారింది. ఈ తరుణంలో ఆర్థిక చర్యల కార్యచరణా దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) కూడా గ్రే కొరడా ఝుళిపించడంతో వచ్చే నిధులు కూడా నిలిచిపోయాయి. ఉగ్ర ముద్ర పోగొట్టుకుంటే తప్ప దాయాది దేశానికి పైసా రాలని పరిస్థితి. అందుకే ఆ మరక చెరిపేసుకునేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాక్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఆ వార్తలతో ఉక్కిరిబిక్కిరి

అబొట్టాబాద్‌లో అల్‌ఖైదా అగ్ర నేతను అమెరికా దళాలు అంతమొందించడం సహా పాకిస్థాన్‌ రాజకీయ నాయకులతో బిన్‌ లాడెన్‌ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వెలువడిన వార్తలు పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ విధించిన గడువు కూడా ముంచుకొస్తుండటంతో తమ శత్రు దేశంగా భావించే భారత్‌తో శాంతి మంత్రం జపించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయాలన్న భారత్‌ నిర్ణయానికి జై కొట్టడమే కాకుండా వాస్తవ రూపంలోకి తేవడంతో సరిహద్దుల్లో తుపాకుల మోతలు నిలిచిపోయాయి.

ఆగిన ఉగ్రమూకల ఎగుమతి

పాక్‌ సైన్యం సాయంతోనే ముష్కరులు ఇన్నాళ్లూ భారత్‌లోకి ప్రవేశించగలుగుతూ వచ్చారు. ఇష్టారీతిన భారత దళాలపై కాల్పులకు తెగబడుతూ ఉగ్రమూకలు భారత్‌లోకి వెళ్లేందుకు పాక్‌ సైన్యం అవకాశాలు కల్పించేది. ఇప్పుడు ఈ కాల్పులు ఆగాయంటే సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలికేందుకు ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాక్‌ సమాయాత్తమవుతున్నట్లే. దీని ద్వారా ఎఫ్‌ఏటీఎఫ్‌ నిషేధం నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ నిర్ణయం దాయది నేలపై ఉన్న ఉగ్ర ముఠాలకు ఏమాత్రం రుచించకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ అంగీకరించాల్సి వచ్చింది.

నిర్మాణాలకు ఆటంకం కలగొద్దని…..

ఎఫ్‌ఏటీఎఫ్‌తో పాటు మరో విషయం కూడా పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ప్రేరేపించింది. పాక్‌ నేలపై చైనా తలపెట్టిన సీపీఈసీ కారిడార్‌ పనులు ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలంటే సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం అత్యావశ్యం. ఇప్పటికే గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ను పాక్‌లోని ఓ ప్రావిన్స్‌గా మారుస్తూ దాయాది అవసరమైన రాజ్యాంగ పరమైన ప్రక్రియను పూర్తి చేసింది. తద్వారా సీపెక్‌ వేగవంతమవుతుంది. చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్‌ఐ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతం మీదుగానే వెళుతుంది. ఈ మొత్తం విషయాల్లో భారత్‌ ఎక్కువగా స్పందించకుండా ఉండాలంటే భారత్‌తో సరిహద్దుల్లో కయ్యం లేకుండా ఉండితీరాలి. ఇవన్నీ జరగాలంటే సరిహద్దుల్లో భారత్‌ వైపు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. భారత భూభాగంలోకి ఉగ్రమూకల రాకపోకలు నిలిచిపోవాలి. అటు భారత్‌ కూడా జమ్మూకశ్మీర్‌లో చేపట్టే ప్రాజెక్టులు వేగంగా సాగాలని కోరుకుంటోంది. అందుకు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనడం అవసరం. అందుకే ఉభయతారకంగా భారత్‌ చేసిన ప్రతిపాదనను పాక్‌ వెంటనే అమలుచేసి చూపించింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం పటిష్ఠంగా అమలవుతుంది అన్నదానిపై సందేహాలు అలానే ఉన్నాయి!

ఈనాడు సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ శాంతిమంత్రానికి కారణమేంటి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ పై భారత్ పంజా విసిరి నేటికి రెండేళ్ళు
ఫిబ్రవరి 26, 2021 న, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, పాకిస్తాన్ పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి “బాలకోట్ వైమానిక దాడి”. అది జరిగి నేటితో 2 సంవత్సరాలు పూర్తి అయింది. 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఘోరమైన పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ బాలకోట్ వైమానిక దాడి జరిపింది. అనేక దశాబ్దాలుగా భారత దళాలపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛా హస్తం ఇచ్చిన తర్వాత, ఈ వైమానిక దాడికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యహరచనలో విజయవంతంగా పూర్తి చేశారు.

ఫిబ్రవరి 26, 2019 తెల్లవారుజామున 3:30 గంటలకు, 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను (ఎల్‌ఓసి) దాటి పాకిస్తాన్ బాలకోట్‌లోని జైష్-ఇ-మొహమ్మద్ (జెఎమ్) టెర్రర్ క్యాంపు‌ను ధ్వంసం చేశాయి. “ఆపరేషన్ బందర్” అని సంకేతనామం చేయబడిన ఈ వైమానిక చర్యకు భారత వైమానిక దళం యొక్క ఏడవ మరియు తొమ్మిదవ స్క్వాడ్రన్లు నిర్వహించారు. పాకిస్తాన్ భూభాగం లోపల దాడి చేయడానికి IAF అప్‌గ్రేడ్ చేసిన మిరాజ్ 2000 లను ఉపయోగించింది.

భారతదేశం బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ ఎలా ప్లాన్ చేసింది?

బాలకోట్ వైమానిక దాడి ప్రధానంగా 12 మిరాజ్ 2000 లచే నిర్వహించబడింది. ఇవి గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుండి బయలుదేరి పాకిస్థానీయుల కళ్లుగప్పి పాకిస్థాన్ భూభాగాన్ని చేరాయి. మిరాజ్ 2000 లు, మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి ఎగురుతూ, పాకిస్తాన్లోకి ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు ఉత్తర, మధ్య భారతదేశం మీదుగా ప్రయాణించాయి.

పాకిస్తాన్‌లోకి ప్రవేశించడానికి ముందు, మిరాజ్ 2000 లు….

SU -30లుఎంకెఐలతో కలిసి 3 వేర్వేరు వ్యూహాత్మక పొజిషన్ లుగా ఏర్పడ్డాయి. పాకిస్తాన్ రాడార్ల దృష్టిని ఆకర్షించడంలో SU -30 లు ప్రధాన పాత్ర పోషించాయి. భారతీయ SU -30 లు దాడికి దిగుతున్నాయి అని భ్రమ కలిగించాయి. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఎఫ్ -16 యుద్ధ విమానాలను మోహరించింది. భారత్ SU-30 మీదనే పాకిస్తాన్ మొత్తం దృష్టి నిలిపేట్లు చూడగా, అదే సమయంలో ఊహకు అందని విధంగా మిరాజ్2000 యుద్ధ విమానాలు బాలకోట్ వైపు మెరుపు వేగంతో వెళ్ళి, ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైస్ 2000 బాంబులను తీవ్రవాద స్థావరాలపై పడేశాయి, దీనితో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

ఒక వేళ అక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితుల ఏర్పడినా క్షణాల్లో ఏ విధమైన ఆపరేషన్ ఐనా చేసేందుకు వీలుగా ఐఎఎఫ్ తన గరుడ కమాండోల బృందాన్ని స్టాండ్‌బైలో ఉంచింది.

బాలకోట్ వైమానిక దాడిపై పాకిస్తాన్ ఎలా స్పందించింది?

భారత్ వైమానిక దాడి జరిగిన తర్వాతి రోజు జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. పాకిస్తాన్ ఎఫ్ -16 ల యొక్క పూర్తి స్క్వాడ్రన్ తో ఈ దాడికి ప్రయత్నించగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానిని విజయవంతంగా అడ్డుకుని, ఒక పాకిస్తాన్ ఎఫ్ -16 ని కూల్చివేసింది, ఈ పాకిస్తాన్ ఎఫ్ -16 ను తన మిగ్ -21 బైసన్ నుండి కాల్చిన ఐఎఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దురదుష్టవశాత్తూ పాకిస్తాన్ కి పట్టుబడ్డాడు. అయితే భారత్ ప్రభుత్వం అద్భుత దౌత్య విజయంతో వింగ్ కమాండర్ అభినందన్ 2 రోజుల తరువాత పాకిస్తాన్ విడుదల చేసింది.

బాలకోట్ వైమానిక దాడి గురించి అప్పటి IAF చీఫ్ మాటల్లో…

బాలకోట్ వైమానిక దాడి భారతదేశానికి కాశ్మీర్ లోయ లోపల ఉగ్రవాదులను ఏరివేయడానికి సహాయపడింది. ప్రపంచానికి భారత సైనిక సామర్థ్యాలను చూపించడంలో సహాయపడింది. భారతదేశం “గుస్ కర్ మారెగా” (భారత్ ఇంట్లొకి దూరి కొడుతుంది) అని బాలకోట్ వైమానిక దాడి పాకిస్తాన్ కు ఒక సందేశం ఇచ్చిందని మాజీ వైమానిక దళం చీఫ్ బిఎస్ ధనోవా చెప్పారు. ఈ వైమానిక దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించారు.

పుల్వామా టెర్రర్ అటాక్: భారతదేశానికి ఒక చీకటి రోజు…

అంతకుముందు 2019 ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన దారుణమైన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఘోరమైన దాడి తరువాత, పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) ఆ దాడికి బాధ్యత వహించింది. 22 ఏళ్ల ఆత్మాహుతి దారుడు ఆదిల్ అహ్మద్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో బస్సుపైకి దూసుకెల్లి ఈ దాడికి పాల్పడ్డాడు. కాన్వాయ్ ‌లో 78 బస్సులు ఉన్నాయి. ఇందులో జమ్మూ నుండి శ్రీనగర్ ‌కు 2,500 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు అవంతిపోరా సమీపంలో జరిగిన ఈ దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించగా, చాలా మంది గాయపడ్డారు.

ఈ దాడి తరువాత, భారతదేశం పాకిస్తాన్ కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదాను కూడా ఉపసంహరించుకుంది మరియు ఉగ్రవాద దాడి నేపథ్యంలో మొత్తం అంతర్జాతీయ సమాజం భారతదేశానికి తన బలమైన మద్దతును తెలిపింది. ఈ దాడిలో మరణించిన మొత్తం 40 మంది జవాన్ల పేర్లు ఉన్న స్మారకాన్ని 2020 ఫిబ్రవరి 14 న పుల్వామాలోని లెత్‌పోరా క్యాంప్ లోని సిఆర్‌పిఎఫ్ శిక్షణా కేంద్రంలో ప్రారంభించారు. ఈ స్మారక చిహ్నం మొత్తం 40 మంది సైనికుల పేర్లతో పాటు వారి ఛాయాచిత్రాలతో సిఆర్పిఎఫ్ యొక్క నినాదం – “సేవా మరియు నిష్ట” (సేవ మరియు విధేయత) వ్రాసి ఏర్పాటు చేశారు.

అంతకుముందు రిపబ్లిక్ డే 2021 న, 2019 లో పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) ఎఎస్ఐ మోహన్ లాల్ కు మరణానంతరం రాష్ట్ర పోలీసు మెడల్ ఆఫ్ శౌర్య చక్ర (పిపిఎంజి) లభించింది.

2019 ఫిబ్రవరి 14 న ఆత్మాహుతి దాడి జరగతున్నపుడు కాన్వాయ్ ‌లోని బస్సులోకి దూసుకెళ్లే ముందు ఐఇడితో నిండిన కారును గుర్తించి ఆ కారును ఆపడానికి కాల్పులు జరిపినందుకు మోహన్ లాల్ ‌కు ఆ పతకం లభించింది.

– కరుణాకర్ బూదూరు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ పై భారత్ పంజా విసిరి నేటికి రెండేళ్ళు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు
నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అరెస్టుపై పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కేసు విచారణలో భాగంగా మసూద్‌ అజర్‌ను జనవరి 18లోపు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అధికారులు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

గుజ్రన్‌వాలా ఉగ్రవ్యతిరేక కోర్టు(ఏటీసీ) న్యాయమూర్తి నటషా నసీమ్‌ నేతృత్వంలో మసూద్‌ అజర్‌ అరెస్టు విషయమై శుక్రవారం విచారణ జరిగింది. జనవరి 18లోపు మసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని సీటీడీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. కాగా టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలతో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు వ్యతిరేకంగా ఏటీసీ కోర్టు గురువారం అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీని అరెస్టు చేసిన పాక్
ముంబయి పేలుళ్ల సూత్రధారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జాకీ-ఉర్‌-రెహమాన్‌ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న కేసులో పాకిస్థాన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లాహోర్‌లోని సీడీటీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్‌ చేపట్టి 61 ఏళ్ల లఖ్వీని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు. ముంబయి పేలుళ్ల కేసులో అరెస్టయిన లఖ్వీ.. 2015 నుంచి బెయిల్‌ పైనే ఉన్నాడు. అయితే, ముష్కర మూకలకు నిధులు సమకూరుస్తున్నడన్న ఆరోపణలు రావడంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక శాఖ (సీడీటీ) అతడిని అరెస్టు చేసినప్పటికీ.. ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. లాహోర్‌ ఉగ్ర నిరోధక న్యాయస్థానంలో అతడిపై విచారణ జరుగుతుందని తెలిపారు. 2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది క్షతగాత్రులైన ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీని అరెస్టు చేసిన పాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ 340, పాక్ 319
భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కారాగారాల్లో ఉన్న 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారుల జాబితాను ఆ దేశం శుక్రవారం భారత్ ‌కు అందించింది. ఇస్లామాబాద్ ‌లో ఉన్న భారత హైకమిషన్ ‌కు పాక్‌ 319 మంది భారతీయ ఖైదీల జాబితాను పంపింది. 2008 మే 21 జరిగిన కాన్సులర్‌ యాక్సిస్‌ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జులై 1వ తేదీల్లో ఖైదీల వివరాలను అందిస్తారు. మరోవైపు భారత్‌ కూడా ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్ ‌కు 340 మందితో కూడిన జాబితాను అందించింది. ఇందులో 263 మంది పౌరులు, 77 మంది మత్స్యకారులు ఉన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఈ సమాచార మార్పిడిని కొనసాగిస్తున్నారు.

అణ్వాయుధాల వివరాలు కూడా….

గత 30 ఏళ్లుగా భారత్‌ పాక్‌ మధ్యనున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరుదేశాల్లోని అణ్వాయుధాల వివరాలను శుక్రవారం పరస్పరం సమర్పించాయి. ఇరు దేశాల మధ్యనున్న వైరం కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని అమలులోకి తెచ్చారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1988, డిసెంబరు 31న ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయగా 1991, జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది. మొదటిసారిగా ఈ వివరాలను 1992 జనవరి 1 నుంచి పరస్పరం మార్చుకోవడం ప్రారంభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ 340, పాక్ 319 appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్
గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగు దేశపు సైన్యం దుశ్చర్యల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం 14వేలకుపైగా బంకర్లను నిర్మిస్తోంది.

మరోవైపు పాక్‌ కవ్వింపు చర్యలను భారత దళాలు ఎప్పటికప్పుడూ సమర్థంగా తిప్పికొట్టాయి. 2020లో 203మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిలో 166మంది స్థానిక ముష్కరులు ఉన్నారు. 37 మంది పాకిస్థాన్ ‌కు చెందిన వారు. మరోవైపు 43మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 92మంది గాయపడ్డినట్టు అధికార వర్గాల సమాచారం. వీటితో పాటు 49మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

పాక్‌ దుశ్చర్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం సరిహద్దు గ్రామాల ప్రజల్ని రక్షించేందుకు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద రూ.415 కోట్లతో 14,400 బంకర్ల నిర్మాణం చేపట్టింది. రజౌరీ, పూంఛ్‌, కథువా, సాంబ, జమ్మూ జిల్లాల్లో ఇలాంటి 7,777 బంకర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేయనుంది. భారత్‌-పాక్‌ మధ్య 3,323 కి.మీ మేర సరిహద్దు విస్తరించి ఉంది. ఇందులో 221 కి.మీ మేర అంతర్జాతీయ సరిహద్దు, 740 కి.మీ మేర నియంత్రణ రేఖ జమ్మూకశ్మీర్‌ పరిధిలోకి వస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.