BHARATH Vs CHINA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కవ్విస్తున్న చైనా
వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు దౌత్య మార్గాల్లో భారత్ చర్చలకు యత్నిస్తున్నా చైనా కవ్వింపులు ఆగడం లేదు. తరచూ వివాదాస్పద ప్రాంతంలోకి చైనా బలగాలు చొచ్చుకొస్తూనే ఉన్నాయి. తాజాగా దెమ్ చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం గుడారాలను వేసినట్టు సమాచారం. భారత సైన్యం అక్కడి వారిని ప్రశ్నించగా చైనా పౌరులమని చెప్పినట్లు తేలింది. సైన్యం వాళ్లను అక్కడి నుంచి ఖాళీచేసి వెళ్లిపొమ్మని హెచ్చరించినా.. వారు అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ రోజు కోర్‌ కమాండర్ల స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. కార్గిల్‌ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాల వల్ల భారత్‌ ఈ సమావేశాలను వాయిదా వేసింది. అదే సమయంలో ఈ గుడారాలు ప్రత్యక్షం కావడం గమనార్హం.

1990ల్లో ఏర్పాటు చేసిన ఇండో చైనా జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ దెమ్‌చోక్‌, ట్రిగ్‌ హైడ్స్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తత పెరగడంతో ఇటీవల భారత్‌ నార్తన్‌ కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. సరిహద్దులకు దళాల చేరవేత జరగుతున్నా ఇరుపక్షాలు ముఖాముఖిన తలపడే ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుసుల్ వద్ద ఏర్పాటు చేసిన హాట్‌లైన్ల ద్వారా చైనా దళాలతో వివిధ అంశాలపై సంప్రదింపులు, సమన్వయం జరగుతోందని భారత అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కవ్విస్తున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల వద్ద అదనపు బలగాలను మోహరించిన భారత్
భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నప్పటికీ సరిహద్దుల్లో డ్రాగన్‌ భారీగా బలగాలను మోహరిస్తోంది. కొత్త వైమానిక స్థావరాలను నిర్మించడం, విస్తరించడం వంటి చర్యలకు దిగుతోంది. అయితే చైనాకు దీటుగా భారత్ ఆ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను రంగంలోకి దించింది. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మూడు రోజుల పాటు టిబెట్‌లో పర్యటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాలను సందర్శించి సైనికాధికారులతో భేటీ అయ్యారు. యుద్ధసన్నాహాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇరు దేశాల బలగాల మోహరింపు, జిన్‌పింగ్‌ టిబెట్‌ పర్యటనతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల వద్ద అదనపు బలగాలను మోహరించిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారీగా పెరిగిన చైనా సైనికుల కదలికలు… అప్రమత్తమైన భారత సేనలు..
సరిహద్దుల్లో తన దుందుడుకు చర్యలను చైనా కొనసాగిస్తోంది. చైనా సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు కనిపించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన సుమారు 40 దళాలు ఇటీవల బారాహోటి ప్రాంతంలో ఎల్‌ఏసీకి ఆవల గస్తీ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవలి కాలంలో ఎల్‌ఏసీ వెంబడి పరిణామాల నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో అక్కడి సెంట్రల్‌ సెక్టార్‌లో చైనా తన సైనిక కార్యకలాపాలను మరింత పెంచవచ్చని అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. బారాహోటి సమీపంలోని తమ వైమానిక స్థావరం వద్ద కూడా సైనిక కార్యకలాపాలను చైనా పెంచినట్లు తెలిపాయి. అక్కడి నుంచే డ్రోన్లు, హెలికాప్టర్లను డ్రాగన్‌ సైన్యం ప్రయోగిస్తున్నట్లు వివరించాయి. బారాహోటిని తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా పలుమార్లు అతిక్రమణలకు పాల్పడింది. లద్దాఖ్‌ మాదిరి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు గతేడాది ఇదే సెక్టార్‌లో భారత్ దళాలను మోహరించింది. సెంట్రల్‌ సెక్టార్‌లోనూ అదరపు బలగాలను మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారీగా పెరిగిన చైనా సైనికుల కదలికలు… అప్రమత్తమైన భారత సేనలు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్
భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది దుర్ఘటనలకు దారి తీసే అవకాశం ఉందని రావత్‌ అభిప్రాయపడ్డారు. లద్దాఖ్‌లో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని ఇరు పక్షాలకు తెలుసన్నారు.

భారత సైన్యం అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్న రావత్‌.. ఏ విషయాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా స్పందించాలని వ్యాఖ్యానించారు. భారత్‌-చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని తెలిపారు. సరిహద్దుల్లో భారత్‌ భారీగా దళాలను మోహరించిందని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైనిక శక్తి చైనాకు తెలుసు. గీత దాటితే డ్రాగన్ కు ప్రమాదమే – బిపిన్ రావత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ లో చైనా గూఢచర్యం – సరిహద్దుల్లో పట్టుకున్న సైన్యం
భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్వే.. చైనా గూఢచారిగా బీఎస్‌ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్వే.. మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నకిలీ పత్రాలతో సిమ్‌ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా ఆర్థికనేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. గురుగ్రామ్‌లో జున్వే.. ఓ హోటల్‌ సైతం నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

హాన్ జున్వే.. తన సహచరుడితో కలిసి ఇప్పటివరకూ 13 వందలకు పైగా సిమ్‌కార్డులు లోదుస్తుల్లో దాచి అక్రమంగా భారత్‌ నుంచి చైనాకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సిమ్ కార్డుల సాయంతో.. బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం సహా ఇతరత్రా ఆర్థికనేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

నిందితుడు గురుగ్రామ్‌లో స్టార్‌ స్ప్రింగ్ పేరిట హోటల్ నడుపుతున్నట్లు.. దీన్లో కొంతమంది చైనా దేశస్థులను సిబ్బందిగా చేర్చుకున్నట్లు వివరించారు.

అక్రమంగా సిమ్‌ కార్డుల తరలింపునకు సంబంధించి లఖ్‌నవూ ఏటీఎస్‌లో నమోదైన కేసులో హాన్‌ జున్వే వాంటెడ్ నేరస్థుడిగా ఉన్నాడు. ఆ కేసు కారణంగా భారతీయ వీసా లభించకపోవటంతో బంగ్లాదేశ్ బిజినెస్ వీసాతో దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. హాన్‌ జున్వే.. గతంలో నాలుగుసార్లు భారత్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 2010లో హైదరాబాద్ వచ్చిన హాన్ జున్వే.. 2019 తర్వాత దిల్లీ గురుగ్రామ్ ప్రాంతాలకు మూడుసార్లు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో చైనా గూఢచర్యం – సరిహద్దుల్లో పట్టుకున్న సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సరిహద్దుల్లో… చైనా వైమానిక విన్యాసం.. అప్రమత్తమైన సైన్యం..
తూర్పు లడ్డాఖ్ లో భారత్‌, చైనాల మధ్య ఏడాదిగా సైనిక ప్రతిష్టంభన నెలకొంది. ఘర్షణల కారణంగా రెండువైపులా ప్రాణనష్టం సంభవించింది. తీవ్ర చర్చల తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. మిగతా ప్రాంతాల్లో ఉపసంహరణపై చర్చలు జరిగినా.. ముందడుగు పడలేదు. ఈ క్రమంలో సంయమనం పాటించడానికి బదులు రెచ్చగొట్టే చర్యలకు చైనా దిగింది. భారత సరిహద్దులకు చేరువలో 20కిపైగా ఫైటర్‌ జెట్‌లతో ఇటీవల భారీ వైమానిక విన్యాసాలు చేపట్టింది. ఇందులో జె-11, జె-16 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. గతేడాది భారత్‌తో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సమయంలో తమ సైన్యానికి మద్దతుగా వైమానిక కార్యకలాపాలు సాగించిన స్థావరాల కేంద్రంగానే తాజా విన్యాసాలు జరిగాయి. అందువల్ల ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కష్గర్‌, హోటాన్‌, ఎంగారి గున్సా, షిగాట్సే, లాసా గోంగ్కర్‌, నియంగిచి, చాండో పాంట్గా నుంచి ఈ విన్యాసాలు సాగాయి. ఆ సమయంలో చైనా జెట్‌లు హద్దులు దాటలేదని భారత వర్గాలు పేర్కొన్నాయి.

చైనా వైమానిక దళం ఇటీవల ఈ స్థావరాలను ఆధునీకరించింది. యుద్ధవిమానాలను భద్రపరిచేందుకు వీలుగా బాంబులను తట్టుకునేలా కాంక్రీట్‌ షెల్టర్లు నిర్మించింది. రన్‌వేల నిడివిని పొడిగించడం, అదనంగా మానవ వనరులను మోహరించడం వంటివి కూడా చేపట్టింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పాంగాంగ్‌ సరస్సు వంటి ప్రాంతాల నుంచి తమ సైనికులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ, హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచింది.

అప్రమత్తంగా భారత్…

చైనా సైనిక కార్యకలాపాలను ఉపగ్రహాలు, ఇతర ఆధునిక నిఘా వ్యవస్థలతో భారత్‌ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. చైనాలోని షింజియాంగ్‌, టిబెట్‌ స్వయంప్రతిపత్తి సైనిక ప్రాంతంలోని ఏడు డ్రాగన్‌ సైనిక స్థావరాలపై కన్నేసి ఉంచింది. అధునాతన రఫేల్‌ సహా ఈ ప్రాంతంలో మోహరించిన యుద్ధవిమాన స్క్వాడ్రన్లను అప్రమత్తం చేసింది. అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను కలిగి ఉండాలని వాటిని ఆదేశించింది. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేలా అవసరమైన సాధన సంపత్తితో సరిహద్దుల్లోని మన సైనిక దళాలు సన్నద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలు తెలిపారు. నిజానికి గత ఏడాది నుంచి తూర్పు లద్దాఖ్‌లో మన వైమానిక దళ కార్యకలాపాలు బాగా పెరిగాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సరిహద్దుల్లో… చైనా వైమానిక విన్యాసం.. అప్రమత్తమైన సైన్యం.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు… శాంతి ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ దేశం…
వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ పేర్కొంది. చైనా బలగాలను ఉపసంహరించకపోగా.. పెంచుతోందని భారత్ ఆరోపించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ త్వరగా పూర్తయితే తూర్పు లద్ధాఖ్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఉపసంహరణ సాధ్యమవుతుందని చెప్పింది. దీంతో సరిహద్దులో శాంతి పునురుద్ధరణ సాధ్యమవుతుందని తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి.. ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద చైనా బలగాలను పెంచటం, మౌలిక వసతుల నిర్మాణానికి సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విధంగా స్పందించారు.

సెప్టెంబర్ 10 న మాస్కోలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ అయ్యారు. తూర్పు లడ్డాఖ్లో ప్రతిష్టంభనకు తెరదించేలా.. ఐదు అంశాల ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇరు దేశాల నేతలు అంగీకరించినా..చైనా ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు… శాంతి ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ దేశం… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్
చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా కూడా వుహాన్‌లో కరోనా పుట్టుకపై విచారణ జరపాలని కోరింది. కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలోని జంతు విక్రయశాలల నుంచి వ్యాప్తి చెందిందని చైనా వాదిస్తోంది. అయితే అదే నగరంలోని ఒక ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

డబ్ల్యుహెచ్‌వో విచారణ మొదటి అడుగు మాత్రమే

కొవిడ్‌-19కు సంబంధించి చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌వో) దర్యాప్తు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణ సాగనీయకుండా చైనా అధికార యంత్రాంగం పలు అడ్డంకులు సృష్టించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు విచారణను ప్రపంచ ఆరోగ్యసంస్థ పూర్తిచేసింది. కానీ నివేదికలో గబ్బిలాల నుంచి వైరస్‌ ప్రబలివుంటుందని వెల్లడించింది. అయితే ల్యాబ్‌లో నుంచి లీక్‌ అనేది వాస్తవదూరంగా ఉండవచ్చని పేర్కొంది. ఈ విచారణ మొదటి అడుగు మాత్రమేనని పూర్తిగా దర్యాప్తు జరిపితే అన్నీ అంశాలు వెలుగులోకి వస్తాయని భారత్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

గుర్తు తెలియని జంతువు నుంచి..

మధ్య చైనాలో ఉన్న వుహాన్‌లో 2019 డిసెంబరులో ఈ వైరస్‌ బయటపడింది.దీన్ని SARS-CoV-2 అని వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సభ్యుల బృందంలోని ఒకరు దీనిపై మాట్లాడుతూ వుహాన్‌లో తమ పరిశోధనల్లో గబ్బిలాల నుంచి ఒక జంతువుకు అనంతరం మానవులకు సోకి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఏ జంతువు నుంచి సోకిందో అంతుచిక్కడం లేదని చెప్పడం గమనార్హం. అయితే వుహాన్‌లో దర్యాప్తు మొదటి దశ మాత్రమేనని అనంతరం పలు దఫాలుగా విచారణ చేపట్టాలని ఆయన చెప్పడంతో చైనా మూలాలపై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.

దర్యాప్తుకు రాజకీయాలు అడ్డంకిగా మారాయి – WHO

కొవిడ్-19 మహమ్మారి మూలాలను వెలికితీసే ప్రయత్నాలకు రాజకీయాలు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తల్ని తమపని తాము చేసుకోనివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

‘సైన్స్‌ను రాజకీయాల నుంచి వేరుచేయమని మేం అడగాలనుకుంటున్నాం. సరైన దారిలో, సానుకూల వాతావరణంలో మనకు అవసరమైన సమాధానాలను కనుగొందాం. ఈ ప్రక్రియను రాజకీయాలు విషతుల్యం చేస్తున్నాయి’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరక్టర్ మైకేల్‌ ర్యాన్‌ హెచ్చరించారు.

కరోనా మూలాలను అన్వేషించేందుకు సరికొత్త, లోతైన దర్యాప్తు జరపాలంటూ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది. సరైన సమాధానం కోసం పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్లు మరోసారి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి మూలాలపై నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా విభాగాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జంతువుల నుంచి మానవులకు సోకిందా?

లేక ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా? అనే విషయంపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కరోనా వైరస్ నుంచి సంభవించిన మరణాల రేటు నుంచి దృష్టి మరల్చేందుకే అమెరికా ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని చైనా ఆరోపించింది. ఇక ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోన్న విలయం కారణంగా.. 17కోట్లమందికి పైగా వైరస్ బారిన పడగా, 35లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరుకున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నయవంచక చైనాను నమ్మరాదు
ఒక వైపు సరిహద్దుల్లో రాజీ అంటూనే.. సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ మరో కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఇండియాపై మొదట్నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న చైనా బోర్డర్ లో కవ్వింపులకు పాల్పడుతోంది. సరిహద్దులను ఆక్రమిస్తుండగా భారత్ ధీటుగా జవాబిస్తుండడంతో. ప్రతీ దాంట్లోనూ భారత్ పోటీకి వస్తుండటంతో కంటిలో నలుసుగా మారిన ఇండియాపై భారీ అటాక్ చెయ్యాలని చైనా స్కెచ్ వేసింది. ఆయుధాలతో కాకుండా కనిపించని విధంగా దెబ్బకొట్టాలని చూస్తూ కన్నింగ్ ప్లాన్ అమలు చేస్తోంది.

సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా సంస్థ:

లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్న సమయంలో.. భారత్‌ విద్యుత్‌ గ్రిడ్‌లపై సైబర్‌ దాడులు చేసి.. దేశాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టాలని చైనా ప్రయత్నించిందా? మన దేశాన్ని దిగ్బంధనం చేయాలనుకుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గతేడాది(2020) భారత్‌-చైనాల మధ్య నెలలపాటు నెలకొన్న ప్రతిష్టంభన కాలంలోనే భారత్‌ విద్యుత్‌ రంగంపై డ్రాగన్‌ సైబర్‌ దాడులకు పాల్పడిందంటూ అమెరికా సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ సంచలన విషయాలను బయటపెట్టింది.

చైనా హ్యాకర్ల భారీ సైబర్ దాడి:

గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా హ్యాకర్లు భారీ సైబర్ దాడికి దిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 భారత ప్రభుత్వ రంగ సంస్థల కంప్యూటర్ నెట్ వర్క్ లను చైనా అధికార సైబర్ గ్రూపులు టార్గెట్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ 12 సంస్థల్లో విద్యుత్ రంగానికి చెందినవే అధికంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే అధ్యయన సంస్థ వెల్లడించింది. దేశంలో అతిపెద్ద విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో పాటు విద్యుత్ డిమాండ్ సరఫరాను క్రమబద్దీకరించి పవర్ గ్రిడ్ ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే 5 ప్రధాన ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లపై సైబర్ దాడి జరిగింది.

ముంబైలో చీకట్ల వెనుక చైనా:

2020 మే లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఈ దాడి మొదలైంది. భారత్ లోని విద్యుత్ వ్యవస్థను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రత్యేకమైన మాల్ వేర్ ను ఆ సంస్థల సర్వర్ లలోకి చొప్పించారు. 2020 అక్టోబర్ 13న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ గ్రిడ్ విఫలమైంది. 2గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోడ్ డిస్పాచ్ సెంటర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ముంబై నగరంలో బ్లాక్ ఔట్ సంభవించింది. రైళ్లు రద్దయ్యాయి.

ముంబై, థానే, నవీ ముంబైలలో ఆఫీసులన్నీ మూతపడ్డాయి. ఆసుపత్రులకు ప్రత్యేక ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ముంబై శివారు ప్రాంతాల్లో ఏకంగా 12గంటల పాటు కరెంట్ పోయింది. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ముంబైలో జనజీవనం స్థంభించిపోయింది. అప్పట్లో అది ఎందుకు జరిగింది అనేది తెలియనప్పటికి, దాని వెనుక చైనా హ్యాకర్లు ఉన్నారని ఆలస్యంగా బయటపడింది.

మే లో గల్వాన్‌ లోయలో ఘర్షణ చెలరేగితే.. ఆ తర్వాత నాలుగు నెలలకే ముంబైలో జరిగిన ఈ విద్యుత్‌ అంతరాయానికి సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికా సంస్థ అంటోంది. ఆ ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై సైబర్‌ నేరగాళ్లు గురిపెట్టారని, భారత్‌ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని ఓ సంకేతమివ్వడమే చైనా ఉద్దేశమని సదరు సంస్థ తెలిపింది.

మేడిన్ ఇన్ చైనా వల్లే సమస్య:

సరిహద్దుల నుంచి భారత్ వెనుకడుగు వేయకపోతే దేశమంతా అంధకారం నింపేసేలా చైనా ప్లాన్ చేసింది. అయితే చిన్న ఇబ్బందులతో అప్పట్లో సమస్య పరిష్కారం అయ్యింది. దీని వెనుక చైనా ఉందని తేలడంతో డ్రాగన్ ఇంకా ఏయే వ్యవస్థలను టార్గెట్ చేసిందోనన్న టెన్షన్ నెలకొంది. భారత్ విద్యుత్ వ్యవస్థలో వాడే ఎక్కువ పరికరాలు చైనా నుంచే వస్తున్నవి కావడం సమస్యకు మూలం అంటున్నారు నిపుణులు.

10TV సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నయవంచక చైనాను నమ్మరాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత వ్యాక్సిన్ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి
భారత వ్యాక్సిన్ దిగ్గజ సంస్థలను చైనా టార్గెట్ చేసింది. భారత్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ వివరాలను సేకరించేందుకు..చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ భారత్ బయోటెక్,సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ ప్రవేశపెట్టిందని సింగపూర్,టోక్యో ప్రధాన కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యురిటీ సంస్థ సైఫార్మా తాజాగా ప్రకటించింది.

చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ APT10(స్టోన్ పాండా అని కూడా పిలుస్తారు)….సీరం, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి మాల్‌వేర్ చొప్పించిందని సైఫార్మా పేర్కొంది. వ్యాక్సిన్ లకు సంబంధించిన మోధోసంపత్తి హక్కుల వివరాలను తస్కరించి భారత ఫార్మా కంపెనీలపై పైచేయి సాధించాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య లక్ష్యం అని సైఫార్మా చీఫ్,మాజీ బ్రిటన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ M16లో టాప్ సైబర్ అధికారిగా పనిచేసిన కుమార్ రితేష్ తెలిపారు. ముఖ్యంగా APT10… సీరం ఐటీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. సీరం ఇన్ స్టిట్యూట్‌కు చెందిన అనేక పబ్లిక్ సర్వర్ల సెక్యురిటీ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని హ్యాకర్లు గుర్తించినట్టు ఆయన తెలిపారు.

హ్యాకర్లు..బలహీన వెబ్ అప్లికేషన్లు గురించి కూడా మాట్లాడారని,అంతేకాకుండా బలహీన కంటెంట్-మేనేజ్ మెంట్ వ్యవస్థ గురించి కూడా వాళ్లు మాట్లాడుతున్నారని..ఇది కొంచెం ప్రమాదకరమని రితేష్ తెలిపారు. ఈ వివరాలను తాము భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిపినట్టు కూడా సైఫర్మా తెలిపింది. ఇక, హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా.. చైనా అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోందని అమెరికా డిపార్టమెంట్ ఆఫ్ జస్టిస్ 2018లోనే కుండబద్దలు కొట్టింది.

మరోవైపు,భారత్ చైనాలు ప్రస్తుతం పోటాపోటీగా కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలకు భారత్-చైనాలు కోవిడ్-19 వ్యాక్సిన్ లను అమ్మటం మరియు గిఫ్ట్ గా ఇవ్వడం చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన అన్ని వ్యాక్సిన్లలో 60శాతానికి పైగా భారత్‌లోనే తయారైనవి కావడంతో టీకా దౌత్యంలో భారత్ చైనాపై పైచేయి సాధించిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ టీకా వివరాలను చైనా తసర్కించేందుకు ప్రయత్నించిందంటూ వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, దీనిపై అటు చైనా విదేశాంగశాఖ గానీ..ఇటు భారత్ కానీ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఇక సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కామెంట్ చేసేందుకు నిరాకరించాయి.

అయితే, ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా నవంబర్‌లోనే ఇటువంటి దాడుల గురించి హెచ్చరించింది. రష్యా, ఉత్తరకొరియా కేంద్రంగా కొన్ని హ్యాకింగ్ గ్రూపులు.. భారత్, కెనడా, ఫ్రాన్స్, దక్షిణకొరియా, అమెరికాలకు చెందిన ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసుకున్నాయని తెలిపింది. ఉత్తరకొరియా హ్యాకర్లు బ్రిటన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాను కూడా టార్గెట్ చేసుకున్నారని తెలిపింది. ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థపై గతేడాది డిసెంబర్‌లో జరిగిన దాడిలో తమ టీకాకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లీకైయ్యాయని ఫైజర్ కంపెనీ కూడా గతంలో ప్రకటించింది.

10 TV సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత వ్యాక్సిన్ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.