BBC – Vishwa Samvad Kendra Andhra Pradesh

బీబీసీ దుష్ప్రప్రచారంపై లండన్‌లో హిందువుల నిరసన
కొన్ని దశాబ్దాలుగా మీడియాలో హిందుత్వం అంటే మతం, మతతత్వమని, హిందువులు మతతత్వవాదులని, ముస్లింల మీద దాడులు చేస్తుంటారని ప్రచారం జరుగుతూ వస్తున్నది. మధ్యలో కొంతకాలం హిందూ ఉగ్రవాదమని కూడా ప్రచారం చేశారు.

ఇట్లా ప్రచారం చేయడం కొందరికి ఫ్యాషన్, కొందరికి ద్వేషం, కొందరికి అవసరం, కొందరికి సామ్యవాదం, ఉదారవాదం, సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంతాల బోధనలు, కొందరు బ్రిటిష్ వాళ్ళ సాంస్కృతిక బానిసత్వంలో చిక్కుకుపోయి మాట్లాడేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని మాట్లాడతారు. ఇస్లాం, క్రైస్తవంలాగా హిందుత్వము అంటే మతతత్వమని వారి ప్రచారం చేశారు.

గడిచిన రెండు వందల సంవత్సరాలుగా ఈ ప్రచారం సాగిపోతున్నది. వాళ్ళ లెక్క ప్రకారం హిందువులు తీవ్రవాదులు, ముస్లింలు సెక్యులర్ వాదులు. ఈమధ్య ఈనాడు పత్రికలో పి.ఎఫ్ ఐ. గురించి వచ్చిన వ్యాసంలో ”పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు హింసోన్మాదాన్ని ఆయా ఘటనలు బట్టబయలు చేస్తున్నాయి. రహస్య ఎజెండాతో సామాజిక అశాంతికి దారులు తీస్తున్న ప్రతిపశక్తుల కట్టడికి కేంద్రం నడుం బిగించడం హర్షణీయం. జాతీయ భద్రతకు విఘాతకరమైన వాళ్ళలందరిపైన ఉక్కు పాదం మోపి తీరాల్సిందే” అని పేర్కొన్నారు. అంతటితో ఆగిపోకుండా.. పిఎఫ్ఐ సంస్థ ప్రారంభానికి బాబ్రీ మసీదు విధ్వంసమే కారణం అన్నట్లుగా రాశారు, ఇట్లా రాసేటువంటి వాళ్ళకి పిఎఫ్ఐకి ముందు ఇస్లాం ఉగ్రవాదం , తీవ్రవాదం లేదు అని అనుకొంటున్నారా? అంటే ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ రాతలు? ఇస్లాం అనేది ఒక జాతి అని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

హిందుత్వం మతతత్వం, తీవ్రవాదులు అని ప్రచారం చేసే వారిని నిలవరించవలసిన సమయం ఆసన్నమైంది. సైద్ధాంతికంగా ఎండ కట్టాలి. సిద్ధాంతపరంగా ఎదురు దాడి చేయవలసిన అవసరం కూడా ఉంది. నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సత్యా సత్యాలను ప్రజలకు తెలియజేసే లా మాట్లాడటం, రాయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చాలా చాలా అవసరం ఉన్నది.

ఇంగ్లాండ్ దేశంలో హిందూ సంస్థల ప్రయత్నం భేష్‌

అటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇంగ్లాండ్ దేశంలో ఉన్న హిందూ సంస్థలు చేశాయి. దశాబ్దాలుగా బీబీసీ చేస్తున్న విష ప్రచారంపై అక్టోబర్ 29న బీబీసీ కేంద్ర కార్యాలయం దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. హిందుత్వంపై అవాస్తవాలు పుంఖాను పుంఖాలుగా రాయటం బీబీసీకి ఒక ఫ్యాషన్ అయిపోయింది.

ఆగస్టు 28న ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ ల్యాండ్‌లో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. భారతి విజయం ప్రకటించిన వెంటనే ముస్లిం గ్రూపులు లెయిస్టర్ టౌన్‌లో హిందువులపై దాడులు మొదలు పెట్టాయి. హిందువుల ఇళ్ళను, కారులను తగలబెట్టారు. దేవాలయాలు ధ్వంసం చేశారు.

తాము చేసిన దాడులకు కారణాలను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కూడా చేశారు. ఎందుకంటే అక్కడి పోలీసులు ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అసత్యమని నిరూపించారు. ఆ సోషల్ మీడియాలో చేసిన ప్రచారంలో హిందువులు ఒక మసీదును ధ్వంసం చేశారని, ఒక హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించాడని, అట్లాగే ట్రాఫిక్ వార్డెన్ అయిన ఒక ముస్లింను హిందువులు కొట్టారని సౌత్ ఆసియా పత్రిక ఒక వీడియో పోస్ట్ చేసింది.

అట్లాగే ఒక వ్యాసంలో భారతదేశంలో ముస్లింగా ఉన్నందుకే హిందువులు గుంపులు గుంపులుగా దాడి చేసి కొడుతున్నారని, పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో భారత్‌లో ఘర్షణలు చెలరేగడానికి ప్రయత్నించింది. భారత్‌లో ఎవరు ఎవరిపై దాడులు చేస్తున్నారు? అందరికీ తెలుసు కానీ, ఈ రకమైన దుష్ప్రచారం బిబిసిలో గడచిన 18 ఏళ్ళుగా మరింతగా పెరిగిపోయింది.

ఇట్లా హిందువులపై చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బిబిసి డైరెక్టర్ జనరల్‌కు హిందూసంస్థల వాళ్ళు ఒక మెమోరండం కూడా ఇచ్చారు. ఇదే విధంగా లండన్లో గార్డియన్ పత్రిక కార్యలయం దగ్గర కూడా నిరసన ప్రదర్శన చేశారు.

– రాంపల్లి మల్లికార్జునరావు, ప్రముఖ విశ్లేషకులు, సామజిక కార్యకర్త

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీబీసీ దుష్ప్రప్రచారంపై లండన్‌లో హిందువుల నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“బాయ్ కాట్ BBC” అంటున్న నెటిజన్లు
బీబీసీ షోలో ఓ కాలర్ ప్రధాని మోడీ,ఆయన తల్లిని తిట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా మార్చి 1న లైవ్ లో ప్రసారమైన బీబీసీ రేడియో షోకి భారత సంతతికి చెందిన యాంకర్ ప్రియా రాయ్ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు.

చర్చలో ఎక్కువ భాగం UK లో సిక్కులు మరియు భారతీయులు ఎదుర్కొంటున్న జాతి వివక్ష చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అయితే మూడు గంటలపాటు సాగిన లైవ్ చర్చలో భాగంగా పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ రాగా ‘సిమోన్’ పేరుగల ఓ కాలర్ ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన తల్లి హీరాబెన్ లను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడు.

సిమోన్ ఉన్మాద వ్యాఖ్యల ఆడియో క్లిప్పు ప్రస్తుతం వైరల్ గా మారింది. కాలర్ కామెంట్లు, యాంకర్ ప్రియా రాయ్ నిస్సహాయతను ప్రశ్నిస్తూ ఈ ఘటనపై బ్రిటన్ టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ‘ఆఫ్ కామ్’ జోక్యం చేసుకోవాలని, సదరు రేడియో ఛానల్ లైసెన్సులను రద్దు చేయాలని భారత సంతతి సంఘాలు, వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ షోని ప్రసారం చేసినందుకు బీబీసీపై సోషల్ మీడియాల వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. భారత్ లో బీబీసీని బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాయ్ కాట్ బీబీసీ,బ్యాన్ బీబీసీ హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.

తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడంతో బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం క్షమాపణలు చెప్పింది. 3 గంటల కార్యక్రమాన్ని 1.32గంటలకు ఎడిట్ చేసి, అందులో యాంకర్ ప్రియా రాయ్ క్షమాపణలను కూడా జతచేశారు. ‘ఓక హాట్ టాపిక్ పై చర్చ జరుగుతున్న క్రమంలో కాలర్లు ఉద్వేగంగా మాట్లాడటం అప్పుడప్పుడూ జరుగుతుంది. అది లైవ్ షో కాబట్టి అప్పటికప్పుడే ఆపలేకపోయాం. కాలర్ చేసిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాం అని యాంకర్ ప్రియా రాయ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదంపై భారత్ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు

Source : Samardha News

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “బాయ్ కాట్ BBC” అంటున్న నెటిజన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిటన్ మనకు మిత్ర దేశమేనా?
“విభజించు పాలించు” అన్న సూత్రాన్ని అనుసరించి రెండు వందల ఏళ్లు భారతీయులను బానిసలుగా చేసుకొని పాలించిన ఇంగ్లాండు ఇప్పుడు కూడా భారతదేశంపై కుట్రపూరిత విధానాలనే అనుసరిస్తున్నట్లుగా తోస్తోంది.

పైకి భారత్ తన మిత్ర దేశం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండే బ్రిటన్ ప్రభుత్వం రహస్యంగా భారత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆంగ్లేయ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ (BBC) లో వస్తున్న భారత వ్యతిరేక కథనాలే అందుకు సాక్ష్యం.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఆరోగ్య సేతు’ యాప్ కారణంగా పౌరుల వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యత ప్రశ్నార్థకం అవుతుంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ బి బి సి ఒక కథనాన్ని వెలువరించింది. నిజానికి బ్రిటన్ కూడా తమ పౌరులలో కరోనా రోగులను గుర్తించటానికి పూర్తిగా ఆరోగ్య సేతును పోలిన యాప్ ను బ్రిటన్ కు చెందిన ఆరోగ్య సంస్థ NHS (NATIONAL HEALTH SERVICE) విడుదల చేసింది. బ్రిటన్ ఆ యాప్ పైనే ఆధారపడుతోంది. మరి ఆ దేశ ప్రజలకు  ఆ యాప్ విషయంలో ఇబ్బందులు లేవా? ఉంటే బి బి సి కి ఎందుకు కనబడవు? భారత్ లోని కొందరు నిత్య ఆందోళనాపరులతో ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ గొంతు కలపడంలోని ఔచిత్యం ఏమిటి?

ఆ మధ్య జరిగిన CAA అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించిన సఫ్కరా జార్గర్ అనే ఒక విద్యార్థిని అరెస్టుపై కూడా బి బి సి ఒక అనవసర కథనాన్ని వెలువరించింది. గర్భిణి అయిన ఆ విద్యార్థిని జైలు గోడల మధ్య నరక యాతన అనుభవిస్తోంది అంటూ ఆందోళన వెలిబుచ్చింది.

బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న ప్రతిపాదన  వచ్చినప్పుడు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన తమ ప్రజల విషయంలో ఆంగ్లేయ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో, ఆ విషయాలు ప్రపంచానికి తెలియకుండా ప్రసార మాధ్యమాలను ఎలా మేనేజ్ చేసిందో ప్రపంచానికి వెల్లడించే ప్రయత్నం BBC ఎందుకు చెయ్యదు?

2010లో అక్కడి విద్యార్థులకు ఫీజులు పెంచిన కారణంగా జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని బ్రిటన్ పోలీసులు అత్యంత కఠినంగా, క్రూరంగా అణచివేసిన వైనాన్ని BBC ప్రపంచానికి ఎందుకు విశ్లేషించి చెప్పదు?

చైనాలోని విదేశీ పెట్టుబడులు భారత్ కు తరలి రానున్నాయన్న విషయంలోనూ బి బి సి తన అక్కసును వెళ్ళబోసింది. భారత్ లో చైనా వంటి పరిస్థితులు లేవంటూ ఏవేవో కాకమ్మ కథలతో కథనాలు ప్రచురించింది. నిజానికి ఏ విధంగా చూసుకున్నా కమ్యూనిస్టు చైనా కంటే లౌకిక భారతం విదేశీ పెట్టుబడులకు అన్ని రకాల అనుకూలతలు కలిగివున్న దేశం అనటం నిర్వివాదాంశం.

భారత ప్రధాని బ్రిటన్లో పర్యటించినప్పుడు బ్రిటన్ జాతీయులైన ముస్లిములు, ఖలిస్తాన్ ఉద్యమ మద్దతుదారులు కొందరు భారత ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. భారత ప్రధాని బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత్, బ్రిటన్ ప్రధానుల మధ్య జరిగిన చర్చలు, ఒప్పందాల వివరాల కంటే మిన్నగా భారత ప్రధానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలకే BBC అధిక ప్రాధాన్యమిచ్చింది. BBC యొక్క భారత వ్యతిరేక వైఖరిని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తుంది.

ఈ విషయాలే కాదు బి బి సి ఇలా అనేక విషయాలలో తన భారత వ్యతిరేక వైఖరిని చెప్పకనే చెబుతూ వుంటుంది. పైగా భారత ప్రభుత్వానికి, దేశానికి, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే భారత్ లోని కొన్ని వర్గాల, రాజకీయ పక్షాల ధోరణికి తగ్గ వాదనను బి బి సి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో బి బి సి నిరాధార, తప్పుడు కథనాలను కూడా ప్రసారం చేసిన సందర్భాలు అనేకం.

అయితే బి బి సి బ్రిటన్ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే వార్తా సంస్థ కావడం వల్ల బి బి సి అనుసరిస్తున్న భారత వ్యతిరేక వైఖరికి బ్రిటన్ ప్రభుత్వ మద్దతు కూడా ఉన్నదని భావించాల్సి వస్తుంది.

పైకి దౌత్య పరంగా భారత్ తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నట్లుగా కనిపించే బ్రిటన్ ప్రభుత్వం తన చెప్పుచేతలలోని వార్తా సంస్థల ద్వారా భారత దేశ ప్రయోజనాలకి భిన్నమైన కథనాలను ప్రచారం చేయడం ద్వారా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనే రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నదేమో అన్న సందేహం ఏమాత్రం ఊహాజనితమైనది కాదు.

ఇంకో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే భారత్ లో వివిధ నేరాలతో సంబంధాలు కలిగిన వ్యక్తులు అనేకులు ప్రస్తుతం బ్రిటన్లోనే తల దాచుకుంటూ ఉండడం. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఆర్థిక నేరస్తులే కాకుండా వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో, బాంబు దాడులలో నిందితులుగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే తల దాచుకుంటూ ఉన్నారు. బ్రిటన్ ప్రభుత్వం వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ వారిని భారత్ కు అప్పజెప్పకుండా కాలయాపన చేస్తూ ఉండడం ఒక ఎత్తయితే వారందరికీ అక్కడ తగినంత రాజకీయ అండదండలు కూడా లభిస్తూ ఉండడం మరో విశేషం. 1993లో సూరత్ లో జరిగిన రెండు వరుస బాంబు దాడులలో ప్రధాన నిందితుడైన, భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు టైగర్ హనీఫ్ ను భారత్ కు అప్పగించకుండా ఒక బ్రిటిష్ హోం సెక్రటరీ (హోం మినిస్టర్) అడ్డుకున్నారు. ఈ సంఘటన 2019 లో జరిగింది.

రాజేష్ కపూర్, సీమా కపూర్, పళని అప్పన్ రాజరత్నం, పాల్ శామ్యూల్ ఇలా భారత్ లో వివిధ నేరాలలో నిందితులై ఉండి ఇంగ్లాండులో తలదాచుకుంటూ ఇంగ్లాండు చట్టాల, ప్రభుత్వాల పుణ్యమా అని తప్పించుకు తిరుగుతున్న నేరస్తుల చిట్టా కాసింత పెద్దదే. బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కు అప్పగించడానికి నిరాకరించిన భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తొమ్మిది మంది ఉండగా, ఇంగ్లాండ్ కోర్టులు అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించిన నిందితులు ముగ్గురు. అలాగే ఇప్పటివరకూ భారత ప్రభుత్వం తమకు అప్పగించాలంటూ చేసుకున్న 15  విన్నపాలు యూకే ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. భారత్ లోని జైళ్లలో ఉండే కఠినమైన పరిస్థితుల కారణంగా సదరు నిందితులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కనుక వారిని భారత్ కు అప్ప చెప్పలేమన్నది బ్రిటన్ ప్రభుత్వము, కోర్టులు చెప్పే ఒక కారణం. ఇది బహు విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనది.

అదే నిజమైతే  ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతీయ జైళ్లలో మగ్గిన మన దేశభక్తుల మాటేమిటి? వారికి అప్పట్లో ఆంగ్లేయ ప్రభుత్వం ఏమైనా ఫైవ్ స్టార్ వసతులు కల్పించిందా? అండమాన్లోని కాలాపానీ జైలులో భారతీయ స్వాతంత్ర ఉద్యమకారులకు జరిగిన అవమానాలు, అక్కడ వారు అనుభవించిన నరక యాతన భారత జాతి ఇంకా మరువనేలేదు.

అంతేకాదు జలియన్ వాలాబాగ్ దురంతం మాటేమిటి? జలియన్ వాలాబాగ్ లో ఆంగ్లేయ ప్రభుత్వం జరిపించిన కాల్పులలో వందలాది మంది అమాయక భారతీయులు మరణించి వందేళ్లు గడిచిన తర్వాత కూడా ఆ దుర్మార్గానికి క్షమాపణలు చెప్పే సంస్కారం బ్రిటిష్ ప్రభుత్వానికి లేదు.

రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ తరపున పోరాడి తమ ప్రాణాలను అర్పించిన వేలాది భారతీయ సైనికుల పట్ల కించిత్ కృతజ్ఞత గానీ, వారి మరణాల పట్ల సానుభూతి గానీ, పశ్చాత్తాపంగానీ బ్రిటిష్ పాలకులలో ఎప్పుడూ లేదు. వీరా మనకు మానవతావాద పాఠాలు నేర్పేది? ఇది బ్రిటిష్ పాలకుల ద్వంద్వ నీతికి, కుహనా మానవతా వాదానికి తార్కాణం.

భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న 1918 – 1920 మధ్యకాలంలో స్పానిష్ ఫ్లూ అనే అంటు వ్యాధి కారణంగా మనదేశంలో సుమారు ఒకటిన్నర కోట్లమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. అప్పుడు ఆ స్పానిష్ ఫ్లూ బారి నుంచి భారత ప్రజలను రక్షించడానికి అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఆంగ్లేయ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే దేశంలో మృత్యువు కరాళ నృత్యం చేసింది.

అలాగే 1943లో బెంగాల్ లో ఆకలి చావుల కారణంగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడడానికి కారణం కూడా అప్పటి ఆంగ్లేయ పాలకుల నిర్లక్ష్యం, భారతీయుల పట్ల జాలి, కరుణ, దయ లేకపోవడం, భారతీయులంటే చిన్న చూపు ఉండడం, భారత దేశం పట్ల, ప్రజల పట్ల బాధ్యత లేకపోవడం.

అదే స్వాతంత్ర్యానంతరం  భారత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రజల ప్రాణాల పట్ల అంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన దాఖలాలు లేవు.

ప్రస్తుత కరోనా సంక్షోభాన్నే తీసుకుందాం. ప్రపంచంలోని ఎన్నో అగ్రగామి దేశాలకంటే మిన్నగా భారత ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రజారోగ్యం ముందు అవేవీ తనకు లెక్కలోనివి కావని తన చర్యల ద్వారా భారత ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇంత విషమ పరిస్థితుల్లోనూ, లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘకాలంపాటు ప్రజా జీవనం స్తంభించి పోయినప్పటికీ భారత్ లో ఒక్క ఆకలి చావు కూడా కనిపించలేదు.  తమ ప్రజల సంక్షేమంపై స్వదేశీ పాలకులకు ఉన్న శ్రద్ధ, నిబద్ధతలు పరదేశీ పాలకులకు ఎందుకుంటాయి?

బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి చూస్తే బ్రిటన్ ఏమాత్రం నమ్మదగిన దేశం కాదు అని మనకు స్పష్టం అవుతోంది. పైకి మనతో మిత్రత్వం నటిస్తూనే భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, భారత ప్రజల సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయడానికి ఇంగ్లాండ్ ఒక పథకం ప్రకారం అడుగులు వేస్తోంది.  “విభజించు పాలించు” అన్న ఆంగ్లేయుల కపట నీతిలో అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి తేడా లేదు. తన వార్తా సంస్థలలో భారత వ్యతిరేక కథనాలను వెలువరించడం ద్వారా భారతీయులను విభజించడానికి, మన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మనల్ని ప్రేరేపించడానికి, అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మసకబార్చడానికి బ్రిటిష్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నది. కనుక బ్రిటన్ తో వ్యవహరించే విషయంలో ప్రభుత్వాలు మెళకువగా వ్యవహరించాల్సి ఉంది. అంతేకాదు మనం కూడా అదేదో ఇరు ప్రభుత్వాల వ్యవహారంగా భావించి మిన్నకుండి పోకుండా సహేతుక దృష్టితో ఆలోచించి మేకవన్నె పులుల వంటి పాశ్చాత్య దేశాల కుట్రలను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను చిత్తు చేయడం ద్వారా భారతీయులు విజ్ఞులని ప్రపంచానికి చాటుదాం. భారత్ మాతాకీ జయ్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

REFERENCES :

https://www.ndtv.com/india-news/india-s-extradition-request-for-dawood-aide-tiger-hanif-refused-by-uk-2230493?pfrom=home-topscroll

https://www.bbc.com/news/world-asia-india-52672510

https://www.bbc.com/news/world-asia-india-52659520

https://www.bbc.com/news/world-asia-india-52608589

https://en.m.wikipedia.org/wiki/2010_United_Kingdom_student_protests

https://www.bbc.com/news/uk-34798363

https://www.theguardian.com/politics/2015/nov/12/indian-pm-confronted-by-angry-protesters-in-downing-street

https://www.bbc.com/news/world-asia-india-34513311

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్ మనకు మిత్ర దేశమేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాశ్చాత్య మీడియా దృష్టిలో ‘రామాయణ్‌’ కేవలం ఓ కాస్ట్యూమ్‌ డ్రామా మాత్రమే.
ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణ్‌’ ధారావాహికను ప్రముఖ ఛానెల్‌ బీబీసీ ప్రసారం చేయాలి అనుకుందట. కానీ దానికి తన తండ్రి రామానంద్‌ ఒప్పుకోలేదని ఆయన కుమారుడు ప్రేమ్‌ సాగర్‌ వెల్లడించారు. దాదాపు 33 ఏళ్ల క్రితం దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్‌’ కోట్లాది ప్రజల ఆదరణ పొందింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ ధారావాహికను పునఃప్రసారం చేశారు. అత్యధిక మంది వీక్షించిన సీరియల్‌గా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. కాగా ఈ సీరియల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రేమ్‌ సాగర్‌ తాజాగా మీడియాతో పంచుకున్నారు. అనేక ఏళ్ల క్రితం తన తండ్రి, ‘రామాయణ్‌’ బృందం కలిసి సీరియల్‌ ప్రసార హక్కుల్ని బీబీసీకి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘ఇప్పటికీ పాశ్చాత్య మీడియాకు ‘రామాయణ్‌’ అనేది కేవలం ఓ కాస్ట్యూమ్‌ డ్రామా మాత్రమే. అప్పుడు కూడా అలానే అనుకునేవారు. ఎక్కువ మంది ఆసియా వ్యూయర్స్‌ తమ ఛానెల్‌ చూసేలా చేయడానికి ‘రామాయణ్‌’ హక్కులు కావాలని అడిగారు’ అని చెప్పారు.

అనంతరం 3 దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘ఆసియాలో పాపులారిటీ కోసం బీబీసీ ‘రామాయణ్‌’ సీరియల్‌ ప్రసార హక్కులు కొనుగోలు చేయాలి అనుకుంది. ఒప్పంద పత్రంలో సంతకం చేయడానికి ముందు నాన్న, నేను, రాముడి పాత్ర పోషించిన అరుణ్‌ గోవిల్‌, రావణుడిగా నటించిన అరవింద్‌ త్రివేది కలిసి వాళ్ల స్టూడియోకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లాం. అప్పుడు అరుణ్‌ రాముడి వేషం వేసుకుని, తమ స్టూడియో మొత్తం నడవాలని, దాన్ని షూట్‌ చేసుకుంటామని అన్నారు. ఆ తర్వాత నాకు, నాన్నకు వాళ్ల ఉద్దేశం అర్థమైంది. భారత్‌లో ప్రజలు దైవంగా ఆరాధించే శ్రీ రాముడ్ని వారు ఏ దృష్టితో చూస్తున్నారో తెలుసుకున్నాం. అందుకే బీబీసీకి హక్కులు ఇవ్వడానికి నాన్న ఒప్పుకోలేదు’ అని ప్రేమ్‌ సాగర్‌ చెప్పారు. తన తండ్రి రామానంద్‌ జీవిత కథను ప్రేమ్‌ సాగర్‌ రాశారు. దీన్ని ఇటీవల ‘కపిల్‌ శర్మ’ షోలో విడుదల చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాశ్చాత్య మీడియా దృష్టిలో ‘రామాయణ్‌’ కేవలం ఓ కాస్ట్యూమ్‌ డ్రామా మాత్రమే. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.