#Bangladesh #Sheikh Hasina #Muhammad Yunus – Vishwa Samvad Kendra Andhra Pradesh

నిప్పుతో చెలగాటమాడొద్దు.. యూనస్‌కు హసీనా హెచ్చరిక
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌ చర్యలను మాజీ ప్రధాని షేక్ హసీనా దుయ్యబట్టారు. నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించి వేస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో విదేశీయులతో కలిసి దేశ పతనానికి యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

బంగ్లాలోని తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా వర్చువల్‌గా మాట్లాడారు. ఈసందర్భంగా యూనస్‌ను స్వార్థపూరిత రుణదాత అని దుయ్యబట్టారు. ‘‘బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించి అన్ని గుర్తులను చెరిపేస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తున్నారు. వారికి గుర్తుగా అన్ని జిల్లాల్లో నిర్మించిన భవనాలను తగలబెడుతున్నారు. ఈ చర్యలను యూనస్ సమర్థించుకుంటున్నారా..? మీరు నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్ని దహించివేస్తుంది. ఆ వడ్డీ వ్యాపారి, అధికార, ధన దాహం కలిగిన స్వార్థపరుడు విదేశీయులతో కలిసి కుట్ర పన్నాడు. దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ సంపదను ఉపయోగించాడు. అక్కడి రాజకీయ పార్టీలు అవామీ లీగ్ నాయకులపై దారుణాలకు ఒడిగడుతున్నాయి’’ అని మండిపడ్డారు.

గతంలో కూడా ఆమె ఈతరహా వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు. త్వరలో బంగ్లాకు తిరిగి వస్తానని అన్నారు. ‘‘ఒక్క రోజులోనే నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదు. మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకోగలను. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడేమో. అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు. నేను తిరిగి వచ్చాక అన్యాయం చేసిన వారందరికీ కఠిన శిక్ష అమలు చేస్తా’’ అని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే.. హసీనాపై అక్కడి న్యాయస్థానం మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారంటూ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం అరెస్టు వారెంట్ జారీ అయింది.

The post నిప్పుతో చెలగాటమాడొద్దు.. యూనస్‌కు హసీనా హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాకు తిరిగొస్తా : షేక్ హసీనా
బంగ్లాదేశ్  మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా   మళ్లీ దేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలతో జరిగిన సంభాషణ సందర్భంగా హసీనా హామీ ఇచ్చారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ పై  తీవ్ర విమర్శలు చేశారు.

‘‘ఏదో ఒక కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంచండి. నేను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను’’ అని షేక్‌ హసీనా భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా మహమ్మద్ యూనస్‌పై మండిపడ్డారు. ‘‘యూనస్‌కు ప్రజలంటే ప్రేమ లేదు. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపి వచ్చారు. ఆ సమయంలో ఆయన తీరును అర్థం చేసుకోలేకపోయాం. అతడికి దేశం ఎంతో సహాయం చేసింది’’ అని అన్నారు.

బంగ్లాలో ఎన్నో నేరాలు..

‘‘యూనస్‌ వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అతడికి అధికారంపై వ్యామోహం మాత్రమే ఉంది. వారి సారథ్యంలో బంగ్లా ప్రస్తుతం ఉగ్రవాద దేశంగా మారింది. మన నాయకులు, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. పోలీసులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కళాకారులు ఇలా ఎంతోమందిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ, మీడియాకు చెందిన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో ఈ నేరాలు బయటకు రావడం లేదు’’ అని తాత్కాలిక ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

వారికి శిక్ష తప్పదు..

తన తండ్రి, బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు షేక్‌ ముజిబర్ రెహమాన్ సహా తన కుటుంబం మొత్తం హత్యలకు గురైన సంఘటనలను షేక్ హసీనా గుర్తుచేసుకున్నారు. ‘‘ఒక్క రోజులోనే నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదు. మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకోగలను. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడేమో. అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు. నేను తిరిగి వచ్చాక అన్యాయం చేసిన వారందరికీ కఠిన శిక్ష అమలు చేస్తా’’ అని హసీనా ప్రతినబూనారు.

The post బంగ్లాకు తిరిగొస్తా : షేక్ హసీనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.