BAKRID – Vishwa Samvad Kendra Andhra Pradesh

బక్రీద్ ఆంక్షల సడలింపు.. కేరళ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్..!
ఇతర రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నా.. కేరళలో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కరోనా నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేరళలో పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో బక్రీద్ కోసం ఆంక్షలను సడలించింది కేరళ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లింల పండగ బక్రీద్ సందర్భంగా కోవిడ్ -19 ఆంక్షల్లో మూడు రోజుల సడలింపునకు అనుమతించినందుకు కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బక్రీద్ కారణంగా కేరళ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను తీసుకుని వస్తోంది. ఆంక్షలను సడలించిన కారణంగా కరోనా సంక్రమణ జరిగితే, ఏ వ్యక్తి అయినా దానిని కోర్టు దృష్టికి తీసుకురావచ్చు, అప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం జూలై 18 నుండి మూడు రోజుల పాటు కరోనా వైరస్ ను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ పరిమితులను సడలించింది. బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపు ఇచ్చిన కేరళ ప్రభుత్వం తీరు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. వ్యాపారుల డిమాండ్ కు తలొగ్గి ఆంక్షలను సడలిస్తున్నారంటే.. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని వ్యాఖ్యలు చేసింది. కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని మండిపడింది.

క‌న్వ‌ర్ ‌యాత్ర నిర్వ‌హ‌ణ‌లో యూపీ ప్ర‌భుత్వానికి ఇచ్చిన తీర్పును ప‌రిశీలించాల‌ని కేర‌ళ‌ను సుప్రీంకోర్టు కోరింది. వ్యాపారం చేసుకునేవారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రజల ఆరోగ్య హక్కును కాలరాయరాదని హెచ్చరించింది. ఇప్పటికే ఆంక్షల ఎత్తివేత అమల్లోకి వచ్చినందున కేరళ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని.. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని సూచించింది. కన్వర్ యాత్ర కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలను ఇక్కడా పాటించాలని ఆదేశించింది.

జూలై 17 న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేరళ ప్రభుత్వం బక్రీద్ పండుగకు సడలింపును ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ప్రసంగించిన సిఎం పినరయి విజయన్ వస్త్రాలు, పాదరక్షల దుకాణాలు, ఆభరణాలు, ఫాన్సీ దుకాణాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే దుకాణాలు జూలై 18 నుంచి 20 వరకు ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు తెరవడానికి అనుమతించారు. ఎ, బి మరియు సి కేటగిరీలలో వస్తువులను విక్రయించే దుకాణాలను విభజించారు. అందుకు తగ్గట్టుగా ఆదేశాలను జారీ చేశారు. డి కేటగిరీలో ఉన్న దుకాణాలను తెరిచి ఉండటానికి అనుమతి జూలై 19 కి మాత్రమే పరిమితం చేశారు. ఆయా ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు ఆధారంగా నిబంధనలను ఈ పండుగ కోసమే కేరళ ప్రభుత్వం సడలించింది .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బక్రీద్ ఆంక్షల సడలింపు.. కేరళ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.