#Assam criminals – Vishwa Samvad Kendra Andhra Pradesh

వాంటెడ్ రైనో వేటగాడు అస్మత్ అలీ అరెస్ట్
ప‌రారీలో మరో ఇద్దరు వేటగాళ్ళు అతౌర్, అబ్దుల్

గౌహతి: మోస్ట్ వాంటెడ్ రైనో వేటగాడు అస్మత్ అలీ అలియాస్ నాల్కోను కేరళ పోలీసుల సహాయంతో అసొం పోలీసుల బృందం గురువారం (ఫిబ్రవరి 17) మలప్పురంలో అరెస్టు చేసింది. కజిరంగా నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగాలను వేటాడిన కేసులో అతనితో పాటు మరో ఇద్దరు వేటగాళ్ళ‌లపై కాజిరంగా సమీపంలోని బోకాఖట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ఈ ఏడాది జనవరిలో క‌రుడుక‌ట్టిన నేర‌స్తుడు అస్మత్ అలీ కేరళకు పారిపోయాడు. అస్మత్ అలీ, అతని ఇద్దరు సహచరులు అతౌర్ రెహమాన్, అబ్దుల్ మతీన్ జనవరిలో కాజిరంగాలో ఒక ఖడ్గమృగాన్ని చంపి, కొమ్మును తీశారు. ఫారెస్ట్ గార్డులు జనవరి 22న ఖడ్గమృగం మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ముగ్గురు వేటగాళ్లు కాజిరంగా నుండి బ్రహ్మపుత్ర నదికి అవతలి వైపున ఉన్న బిస్వనాథ్ ప్రాంతానికి చెందినవారు. వారు చిన్న పడవలో నదిని దాటి కాజిరంగాలోకి ప్రవేశించారు.

వేటగాళ్ళు నేషనల్ పార్క్ లోపల చాలా రోజులు మ‌కాం వేసి, ఒక ఆడ ఖడ్గమృగాన్ని చంపారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఖడ్గమృగాలు వేటాడటం ఇదే తొలిసారి. సమగ్ర విచారణ అనంతరం బోకాఖట్ పోలీసులు అస్మత్ అలీ, అతౌర్ రెహమాన్, అబ్దుల్ మతీన్‌లపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురి గురించి సమాచారం ఇస్తే ఐదు లక్షల రివార్డును అసొం పోలీసులు ప్రకటించారు. అస్మత్ కేరళకు పారిపోయి మలప్పురంలో తలదాచుకున్నట్టు అసొం పోలీసుల నిఘా ప‌సిగ‌ట్టింది. అసొం పోలీసులు అదే విషయాన్ని కేరళ పోలీసులకు తెలిపారు.

గ‌ణ‌నీయంగా త‌గ్గిన ఖ‌డ్గ‌మృగాల వేట‌

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసొంలో ఖడ్గమృగాల వేట గణనీయంగా తగ్గిందని చెప్పాలి. కజిరంగాలో గతేడాది ఒక్క ఖడ్గమృగం మాత్రమే వేటగాళ్ల చేతిలో హతమైంది. ప్రత్యేక డీజీపీ జీపీ సింగ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యాంటీ వేటగాళ్ల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జనవరిలో తాజా ఘ‌ట‌న తర్వాత, టాస్క్‌ఫోర్స్ కజిరంగా నేషనల్ పార్క్‌లో కమాండో పోలీసులను మోహరింప‌జేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాంటెడ్ రైనో వేటగాడు అస్మత్ అలీ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.