#Armed Forces – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏకీకరణకు సన్నాహాలు!
న్యూఢిల్లీ: సైనిక సంస్కరణలతో భాగంగా త్రివిధ సైనిక దళాలను ఒకే కూటమిగా తీసుకొచ్చి సర్వీసుల ఏకీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న చర్చలలో కచ్చితమైన పురోగతి సాధించగలమని ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి తెలిపారు.

త్రివిధ సర్వీసుల ఏకీకరణకు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ట్రై సర్వీస్ ఆధ్వర్యంలో దేశం మరింత పటిష్ఠంగా, శక్తివంతంగా భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

“భారత సాయుధ దళాల థియేటరైజేషన్ ప్రక్రియ చర్చల దశలో ఉంది. కొన్ని అంశాలు చర్చిస్తున్నాం. ఈ అంశంలో కచ్చితమైన పురోగతి సాధిస్తామన్న నమ్మకం ఉంది” అని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రతి థియేటర్ కమాండ్‌లు ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన యూనిట్‌లను కలిగి ఉంటాయి. అవన్నీ ఒక నిర్దిష్ట భౌగోళిక భూభాగంలో ఒక కార్యాచరణ కమాండర్ కింద భద్రతా సవాళ్ళ‌ను ఎదుర్కొనేందుకు ఒకే సంస్థగా పనిచేస్తాయని ఐఎఎఫ్ చీఫ్ చౌదరి చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏకీకరణకు సన్నాహాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు
కేంద్ర మంత్రి, మాజీ భారత సైన్యాధిపతి వి.పి సింగ్ విమర్శ

న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ పేర్కొన్నారు.

ఈ అంశంపై ప్రతిపక్షాలకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే.. పథకం అమలు కాకముందే వివాదాన్ని రేపుతున్నాయని ఆరోపించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్‌ ఈ విధంగా స్పందించారు.

‘అభ్యర్థులు కొన్ని షరతులకు లోబడే ఆర్మీతోపాటు ఇతర భద్రతా దళాల్లో ఉద్యోగం పొందుతారు. ఈ క్రమంలో చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే.. వారిలో 25శాతం మంది సర్వీసుల్లోకి వెళ్తారు. మిగతా వారికి మంచి ఆర్థిక ప్యాకేజీ లభిస్తుంది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చాయి’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘ఈ పథకంలో ఎటువంటి వివాదాస్పద విషయాలు లేవు. గత్యంతరం లేకనే ప్రతిపక్షాలు అనవసరంగా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వారిని ఈడీ చుట్టుముట్టింది. వీటిపై ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. ఇంకా ఆ పథకం అమలు కాకముందే వివాదమెక్కడిది..? అని ఆర్మీ మాజీ చీఫ్‌ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాయుధ బలగాల్లో కొత్త సర్వీస్ ‘అగ్నిపథ్ ’
న్యూఢిల్లీ: యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ప్రారంభించింది.

నాలుగేళ్ళ‌ కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అగ్నిపథ్ పథకంతో సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుందని, అంతేకాక, దీని ద్వారా పలు రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు.

అగ్నిపథ్ నియామకాల కోసం టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ర్యాలీలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ కింద 45 వేల మంది యువతను నియమించుకోనున్నారు.

అగ్నిపథ్ సర్వీసులో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 10 వారాల నుండి 6 నెలల వరకు శిక్ష‌ణ ఉంటుంది. నాలుగేళ్ళ త‌ర్వాత కేవ‌లం 25 శాతం మంది సైనికుల్ని మాత్ర‌మే ఆర్మీలోకి రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వాళ్ళు మాత్ర‌మే 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్ళ‌కు రూ 12 ల‌క్ష‌లు ఇచ్చి ఇంటికి పంపిస్తారు.

అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు , వేతనాలు, గౌరవాన్నీ ఇస్తారు. నాలుగేళ్ళ‌ సర్వీసు అనంతరం అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ మంజూరుతోపాటు పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.

వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటిక్ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ప్రతిబ్యాచ్‌లో 25 శాతం మందికే ఈ అవకాశం దక్కుతుంది.

అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఏదైనా రెజిమెంట్, యూనిట్, సంస్థలో పోస్టింగ్‌తోపాటు, సైనిక బలగాల తరహాలో ర్యాంకు ఇస్తారు. సర్వీసు కాలంలో రూ.30 వేల నుంచి రూ. 40 వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపిన వారికి సేవాపతకాలు లభిస్తాయి. పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవ నిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు.

దీనికి సమానంగా కేంద్రం తన వంతు జమ చేస్తుంది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల నిధి (పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ. 16.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తోంది. దీంతోపాటు సర్వీసులో రూ. 48 లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.

త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్షంగా ఈ అగ్నిపథ్ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా వీటికే ఖర్చవుతుంది.

అయితే అగ్నిపథ్‌లో చేరి, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తరువాత వారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు కాబట్టి రక్షణ శాఖకు కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. మిగులు నిధులతో త్రివిధ దళాల ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాయుధ బలగాల్లో కొత్త సర్వీస్ ‘అగ్నిపథ్ ’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాయుధ దళాల బడ్జెట్ త‌గ్గించొద్దు!
న్యూఢిల్లీ: సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులను తగ్గించవద్దని రక్షణ రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. బీజేపీ ఎంపీ జువల్ ఓరం నేతృత్వంలోని ఈ కమిటీ లోక్‌సభకు తన నివేదికను ఇటీవల సమర్పించింది.

మన పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో సర్వసన్నద్ధతతో వ్యవహరించాలంటే బడ్జెట్ కేటాయింపులను తగ్గించరాదని తెలిపింది. బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తే, రక్షణ దళాల సర్వసన్నద్ధతకు సానుకూలత ఉండదని తెలిపింది.

2022-23 సంవత్సరానికి కేపిటల్ హెడ్ క్రింద రూ.2,15,995 కోట్లు డిమాండ్ చేయగా, కేటాయించినది మాత్రం రూ.1,52,369.61 కోట్లు అని పేర్కొంది. ఈ విధంగా నిధులను తగ్గించడం వల్ల రక్షణ దళాల కార్యకలాపాల సన్నద్ధతకు విఘాతం కలుగుతుందని తెలిపింది.

బడ్జెట్ అంచనాల దశలో 2022-23లో ప్రతిపాదిత బడ్జెట్, కేటాయింపు బడ్జెట్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది. ఈ వ్యత్యాసం సైన్యానికి రూ.14,729.11 కోట్లు; నావికా దళానికి రూ.20,031.97 కోట్లు; వైమానిక దళానికి రూ.28,471.05 కోట్లు ఉందని వివరించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాయుధ దళాల బడ్జెట్ త‌గ్గించొద్దు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.