Archaeological Survey of India – Vishwa Samvad Kendra Andhra Pradesh

పొలంలో 4 వేల ఏళ్ళ‌నాటి ఆయుధాలు
ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్‌లో 4వేల ఏళ్ళ‌నాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్‌పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్​ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదునుచేస్తుండగా పురాతన ఆయుధాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. దాదాపు 77 రాగి వస్తువులను స్వాధీనం చేసుకుని.. వారంపాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేసింది. అక్కడ రాగి నిధులతోపాటు, కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు.

గణేష్‌పురలో 77 రాగి వస్తువులు లభించాయని ఏఎస్​ఐ ఆగ్రాసర్కిల్‌ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. ఇందులో16 మానవ బొమ్మలు ఉన్నట్టు వెల్లడించారు. వీటిలో మూడు రకాల కత్తులతోపాటు ఈటెలు లభ్యమైనట్టు వివరించారు. అక్కడ దొరికిన వస్తువులు పూర్తిగా మట్టితో కప్పబడి ఉన్నాయని మరోఅధికారి తెలిపారు. వాటిని ప్రయోగశాలకు తీసుకెళ్ళి రసాయనాలతో శుభ్రపరిచి పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వాటి పరిమాణం, ఆకృతి ఆధారంగా పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ రాగి వస్తువుల స్వచ్ఛత 98 శాతం వరకు ఉంటుందని తెలిపారు.

రాగి వస్తువులు చాల్కోలిథిక్ కాలం నాటివి అని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ కాలంలో ఇక్కడ సైనికుల శిబిరం ఉండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరు గారిక్ కుండల సంప్రదాయానికి సంబంధించిన ప్రజలు క్రీస్తుపూర్వం1800 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య ఇక్కడ నివసించి ఉంటారని అంచనా వేశారు. ఆ కాలంలో ప్రజలు రాగితో చేసిన ఆయుధాలను ఉపయోగించేవారని.. మొదటిసారిగా 1822లో కాన్పూర్‌లోని బితూర్‌లో రాగి వస్తువులను కనుగొన్నారు.

పురాతన కాలంలో రుషులు మెయిన్‌పురి ప్రాంతంలో తపస్సు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. మెయిన్‌పురిలో తొమ్మిది, పదో శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులను ఇప్పటికే గుర్తించారు. అప్పటినుంచి చాల్కోలిథిక్ యుగంలో మెయిన్‌పురిలో ప్రజలు జీవించి ఉన్నారన్న వాదనలకు బలం చేకూరింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పొలంలో 4 వేల ఏళ్ళ‌నాటి ఆయుధాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కొట్టిపారవేసారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్‌ మినార్‌ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్‌ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. అయితే, పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు.

మరోవైపు శనివారం కుతుబ్‌మినార్‌ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్టు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే, అది రెగ్యులర్‌ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్‌మినార్‌ కట్టడపు కాంప్లెక్స్‌లో ఉన్న రెండు గణేష్‌ విగ్రహాలను తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ఎఎస్ఐని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్‌మినార్‌ను యునెస్కో 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పోల‌వ‌రం త‌వ్వ‌కాల్లో పురాత‌న శివ‌లింగం
పోల‌వ‌రం: పోలవ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు చేస్తుండ‌గా గోదావ‌రి న‌దిలో ఓ శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. ఏలూరు జిల్లా పోల‌వ‌రం వ‌ద్ద ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. ప్రాజెక్టులోని స్పిల్‌వే ఎగువ‌న అప్రోచ్ చాన‌ల్‌లో భాగంగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టింది.

ఈ క్ర‌మంలో ప్రాజెక్టు నిర్వాసిత పాత పైడిపాక గ్రామంలోని గోదావ‌రి ఒడ్డున భూగ‌ర్భంలో ఇటుక‌ల‌తో నిర్మించిన పురాత‌న నిర్మాణం ఒక‌టి జేసీబీకి త‌గ‌లింది. దీంతో ఆప‌రేట‌ర్లు గ‌ట్టిగా లాగ‌డంతో భూగ‌ర్భంలో ద‌శాబ్దాల కాలంనాటి శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా లారీ డ్రైవ‌ర్లు, వ‌ర్క‌ర్లు ఉలిక్కిప‌డ్డారు.

ఆ వెంటనే పనులను ఆపేసి విగ్రహాన్ని బయటకు తీసి గట్టుపై పెట్టి గోదావరి జలాలతో అభిషేకించారు. శతాబ్దాల కాలం నాటిదిగా భావిస్తున్న ఈ శివలింగాన్ని అక్కడే ఉంచి తవ్వకాలు కొనసాగిస్తున్నారు.

ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో పురాతన శివాలయం ఉంటుంద‌న్న భావ‌న‌లో అక్క‌డి ప్రాంత వాసులున్నారు. అయితే మరిన్ని దేవతా విగ్రహాలు కూడా ఉండి ఉంటాయ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పురావస్తు పరిశోధన శాఖ అధికారులు శ్రద్ధ వహించి తవ్వకాలు జరిపితే ప్రాచీన కాలపు దేవతా విగ్రహాలు, ఆలయ అవశేషాలు ల‌భించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే స్థానికులు కొందరు బయటపడ్డ శివలింగానికి పూజ‌లు నిర్వహిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోల‌వ‌రం త‌వ్వ‌కాల్లో పురాత‌న శివ‌లింగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజ‌స్తాన్‌‎లోనూ జ్ఞానవాపి..!
అజ్మీర్: మతోన్మాదులు మరుగున పడేసిన మన చరిత్ర ఆనవాళ్ళు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ్ఞానవాపి తీర్పు తర్వాత దేశంలోని వివాదాస్పద ఇస్లామిక్ కట్టడాల గురించి చర్చ మొదలైంది. అలాంటి కట్టడాల్లో ‘అధాయ్ దిన్ కా జోన్‎ప్రా’ కూడా ఒకటి. రాజ‌స్తాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న ఈ మసీదు కూడా.. హిందూ, జైన మందిరాల అవశేషాలపై నిర్మించిందే.

అజ్మీర్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ‘అధాయ్ దిన్ కా జోన్‎ప్రా’ను ప్రతిరోజూ వందలాది మంది సందర్శిస్తుంటారు. అయినా, దీనిని ఇప్పటికీ ముస్లింలు నమాజ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కట్టడం ప్రస్తుతం భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో వుంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజ‌స్తాన్‌‎లోనూ జ్ఞానవాపి..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌
ఆగ్రా: తాజ్‌మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల చేసింది. ఈ ఫోటోలను మే అయిదోతేదీన‌ వారి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. వీటిని ఎవరైనా చూడొచ్చని సంబంధిత అధికారులు చెప్పారు.

ఈ సందర్భంగా ఎ.ఎస్.ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య అధికారులు చేసిన పునరుద్ధరణ పనుల ఫోటోలు ఇప్పుడు ఎ.ఎస్.ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా చూడవచ్చనని చెప్పారు. గదుల విషయంలో ఎలాంటి రహస్యం దాచాల్సిన అవసరం లేదని, అవి తాజ్ మహల్ నిర్మాణంలో భాగమని ఆయన అన్నారు.

తాజ్ మహల్ నది ఒడ్డున ఉన్న భూగర్భ కణాల నిర్వహణ పనులను కొన్ని నెలల క్రితం చేపట్టామని, పాడైపోయిన, శిథిలమైన సున్నపు ప్లాస్టర్‌ను తొలగించి, మళ్ళీ కొత్తగా వేశామని ఆయన చెప్పారు. కాగా, తాజ్‌మహల్ గదుల్లోని విషయాలపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికేందుకు ఈ ఫోటోలను పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేశారని పర్యాటక పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఆర్కియాలజీ విడుదల చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్లోని 20 గదులను తెరిచి వాటి రహస్యం బయటపెట్టాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్‌ని బీజేపీకి చెందిన స్థానిక ఇంఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేశారు. ఆ గదుల్లో ఏముందో బయటపట్టేలా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, ఇతర సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, దీనిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు మీరు మా ఛాంబర్లను చూడ్డానికి అనుమతి అడుగుతారని, దయచేసి ప్రజా ప్రయోజన వాజ్యాల వ్యవస్థను అపహాస్యం చేయవద్దని కోర్టు చెప్పింది. ఈ అంశాన్ని చరిత్రకారులకు వదిలేయాలని సూచించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి
రాష్ట్ర పురావస్తు శాఖకు చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న “పల్లవప్రశస్తి” శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మోటు వల్లి రామాలయం, వీరభద్ర స్వామి సన్నిధి పరిసరాల్లోని శాసనాలను ఆయన పరిశీలించారు. రామాలయం పక్క నున్న శాసనంలోని అంశాలను చదివి. దానిని క్రీ.శ. 1231 నాటి ముక్కంటి పల్లవప్రశస్తి శాసనంగా నిర్ధారించారు.

ఇప్పటిదాకా ఆ శాసనాన్ని కాకతీయ గణపతి దేవుని శాసనంగా భావించారు. బ్రిటిష్ అధికారులు గణపతి దేవుని శాసనంగానే పరిగణించారు. గణపతి దేవుని 1244 సం॥ నాటి శాసనం వీరభద్రాలయంలో వుందని ఆయన తెలిపారు.

రామాలయంగా ప్రసిద్ధి పొందిన మందిరం ఒకనాడు గణపతి ప్రసన్న చెన్నకేశవ గుడి. చెన్నకేశవగుడికి భూదానం చేసిన సందర్భంగా రాసినదే.. ఆ శాసనం శాసన బండకు గల సందర్భంగా నాలుగు ముఖాల్లోనూ శాసనాలున్నాయి. మొదటి ముఖంలో ‘పల్లవ కుల తిలక’ మలిదేవ మహారాజు కుమారుడు సిద్ధమ దేవమహారాజు చేసిన భూదానం గురించి పేర్కొన్నారని మైనాస్వామి వివరించారు.

శాసనంలో తెలుగు భాష అద్భుతంగా వుందని, అటువంటి శాసనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూండడం బాధాకరమని చారిత్రక పరిశోధకుడు ఆవేదన వ్యక్తం చేశారు. మోటు పల్లి పల్లవ ప్రశస్తి శాసన పరిరక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఔత్సాహిక పరిశోధకుడు కావలి సనత్ కుమార్ రెడ్డి మైనాస్వామి వెంటవున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

118 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ ఆలయ గర్భగుడి
బ్రిటిషర్లు నింపిన మట్టి తొలగిస్తున్న భారత పురావస్తు శాఖ

భువ‌నేశ్వ‌ర్‌: ఒరిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం (కోణార్క్) మరోసారి వార్తల్లో నిలిచింది. కోణార్క్ దేవాలయంలోని జగ్‌మోహన్ లేదా ముఖశాల ప్రాంగణంలో పూడ్చిన మట్టిని సురక్షితంగా తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. భారతదేశం పురావస్తు సర్వే చెబుతున్న దానిప్రకారం 118 సంవత్సరాల క్రితం బ్రిటీష్ పాలనలో ఈ గర్భాలయంలో ఇసుకను నింపారు. మట్టిని తొలగించే పనిని పురావస్తు శాఖ మొదలు పెట్టింది. ఈ మట్టిని బయటకు తీస్తే, 100 సంవత్సరాలకు పైగా ఇందులో కూరుకుని ఉండిపోయిన ఈ ఆలయ గర్భగుడి తెరుచుకుంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 118 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ ఆలయ గర్భగుడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూపీలో గుప్తుల కాలం నాటి ఆలయ కట్టడాలు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 1500 ఏళ్ళ పురాతన గుప్తుల కాలం నాటి దేవాలయ కట్టడాలు బయటపడ్డాయి. ఇటహ్‌లోని బిల్‌సర్హ్‌ గ్రామంలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)వారి శోధనల్లో ఇవి కనిపించాయి. పురాతన కట్టడాలు ఉన్నట్టు గుర్తించి, సంరక్షిస్తున్న ప్రదేశాల్లో అధికారులు సున్నితంగా అక్కడిగల మట్టిని వివిధ పరికరాలతో తొలగించారు. ఈ దేవాలయాన్ని 1928 నుండి కాపాడుతున్నారు. ఈ దేవాలయానికి ముందు మెట్లు ఉన్నట్టు గుర్తించారు.

ఇటాలోని రక్షిత ప్రదేశంలో శాస్త్రీయంగా శుభ్రపరచడం ద్వారా వీటిని కనుగొన్నామని ఏఎస్‌ఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ కట్టడం అయిదో శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. ఒక శాసనం శంఖ్‌ లిపిలో ఉండడం, గుప్త వంశానికి చెందిన కుమార్‌ గుప్త కాలంలోదిగా గుర్తించారు. శంఖ్‌ లిపి ఒక పురాతన లిపి, 4వ నుండి 8వ శతాబ్దం వరకు వాడేవారని అధికారులు పేర్కొన్నారు.

కాగా, దీనికి ముందు డియోఘర్‌లోని దశావతార దేవాలయం, కాన్పూర్‌ దేహాట్‌లోని భితర్‌గావ్‌ ఆలయాలను ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు కొనుగొన్నారు. ‘ఈ ఆలయాల్లోని స్తంభాలు అలంకరించిబడి ఉన్నాయి. అంతేకాకుండా, మెట్లు కూడా కొంచెం అధునాతమైనవి’ అని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్‌ మన్వేంద్ర పుంధీర్‌ స్పష్టం చేసినట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఉదహరించింది.

అతను ఇంకా ఇలా చెప్పాడు… బ్రాహ్మణ, బౌద్ధ, జైన జనుల కోసం గుడులను నిర్మించిన మొదటి వ్యక్తులు గుప్తులు… అంతకు ముందు, రాక్‌-కట్‌ దేవాలయాలు మాత్రమే నిర్మించేవారని పేర్కొన్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూపీలో గుప్తుల కాలం నాటి ఆలయ కట్టడాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి.
జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి వారణాసి జిల్లా కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని అనుమతించింది. నిజానికి కాశీ విశ్వనాథ్ ఆలయం మీద ఈ మశీదును నిర్మించారు.

1664 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 2000 సంవత్సరాల నాటి కాశి విశ్వనాథ్ ఆలయంలో కొంత భాగాన్ని తొలగించి జ్ఞానవాపి మశీదు నిర్మించటానప్పటి నుండి జ్ఞాన్వాపి మసీదు ఉన్న భూమి కోసం హిందువులు కోరుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ భూమిని తిరిగి హిందువులకు అప్పజెప్పాలని కోరుతూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి జిల్లా కోర్టులో దావా వేశారు.

ఈ దావాను జ్ఞాన్వాపి మసీదు కమిటీ సవాలు చేయగా, వారణాసి జిల్లా కోర్టు ఇప్పుడు మశీదు కాంప్లెక్స్ లో పురావస్తు సర్వేను అనుమతించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, సర్వే యొక్క అన్ని ఖర్చులను ఉత్తర పెరదేశ్ ప్రభుత్వం చెల్లించాలి.

ముస్లిం సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులతో కూడిన 5 మంది సభ్యుల కమిటీ ఈ సర్వే చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

Source : OPINDIA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశీ జ్ఞానవాపి మశీదు కాంప్లెక్స్ లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇద్దరు ముస్లిములతో కూడిన 5 మంది సభ్యుల బృందంతో సర్వే చెయ్యడానికి అనుమతి. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్
భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ (హరిభావు) వాకంకర్ పేరు చెప్పుకోదగినది.  భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన భీంబట్కా గుహలు ఉన్నాయి.  దీని చుట్టూ నాలుగు వైపుల నుండి వింధ్య పర్వత శ్రేణులు ఉన్నాయి.  భీంబట్కా గుహలు మహాభారతంలో భీముడికి సంబంధించినవని విశ్వాసం. ఈ కారణంగా, దీనికి భీంబట్కా అనే పేరు వచ్చింది.  వాటిని 1957-1958 సంవత్సరంలో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ కనుగొన్నారు.

హరిభావు వాకంకర్ మే 4, 1919న నీముచ్ (మాండ్సౌర్ జిల్లా) మధ్యప్రదేశ్ లో జన్మించారు. వాకంకర్ కుటుంబం మంచి పేరున్న, ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన కుటుంబం.  వారు 8 తరాలకు పైగా చరిత్రను కలిగి ఉన్నారు. వాకంకర్ కు చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు చిత్రలేఖనంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నందున, అతను తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత ఉజ్జయినికి వచ్చి విక్రమశిలా విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేశారు. తరువాత అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఫైన్ ఆర్ట్స్ పి.జి చదివారు. ఉజ్జయిని సమీపంలోని దంతేవాడ గ్రామంలో పురావస్తు తవ్వకాలలో ఆయన ఎంతో శ్రమించారు. ఆయన 1958 లో ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో కొన్ని గుహలు మరియు రాళ్ళను చూశారు.తో టి ప్రయాణికులను వాటి గురించి అడిగినప్పుడు, ఇది భీంబట్కా (భీమా సిట్కా) అని పిలువబడే ప్రాంతం అని మరియు గుహ గోడలపై కొన్ని చిత్రాలు ఉన్నాయని తెలిసింది. కానీ అడవి జంతువులకు భయపడి ప్రజలెవరూ అక్కడికి వెళ్లరు.

ఇది విన్న హరిభావులో దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలయ్యింది. రైలు నెమ్మదించినప్పుడు, కదిలే రైలు నుండి దూకి, ఆ గుహలను చేరుకోవడానికి గంటల తరబడి కొండలు ఎక్కారు. అక్కడ ఉన్న చిత్రాలను మొదటిసారిగా ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

భీంబట్కా గుహలు పాలియోలిథిక్ మానవుల జీవితాన్ని వర్ణిస్తాయి, హరిభావు కనుగొన్న ఈ గుహలలోని చిత్రాలు రాతియుగం నాటి మానవుల జీవితాన్ని వర్ణిస్తాయి.  ఇక్కడ సుమారు 500 గుహలు ఉన్నాయి.  భీంబట్కా గుహలలోని చాలా ఛాయాచిత్రాలు ఎరుపు మరియు తెలుపు రంగులతో చిత్రీకరించబడ్డాయి.  కొన్ని ప్రదేశాలలో పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కూడా ఉపయోగించబడ్డాయి.  వన్యప్రాణుల వేట దృశ్యాలే కాకుండా, గుర్రాలు, ఏనుగులు, పులులు మొదలైన చిత్రాలను గుహలలో చెక్కారు. ముఖ్యమైన సమాచారం రాళ్ళపై వ్రాయబడింది.

మొత్తం 750 గుహలు ఉన్నాయి, వీటిలో 500 గుహలు చిత్రాలతో అలంకరించబడ్డాయి. ఈ ప్రదేశం రాతి యుగం నుండి మధ్య చారిత్రక కాలం వరకు మానవ కార్యకలాపాల కేంద్రంగా ఉంది. ఈ విలువైన వారసత్వం ఇప్పుడు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. భీంబట్కా ప్రాంతంలోకి ప్రవేశిస్తే, రాళ్ళపై వ్రాయబడిన అత్యంత విలువైన సమాచారం మనకు దర్శనమిస్తుంది. ఆ సమాచారం పురాతత్వ శాఖకు లభించింది. ఇక్కడ రాక్ పెయింటింగ్స్ యొక్క అంశాలు ప్రధానంగా సమూహ నృత్యాలు, అండర్లైన్డ్ హ్యూమనిజం, వేట, జంతువులు, పక్షులు, యుద్ధం మరియు ప్రాచీన మానవ జీవితపు రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినవి.  చిత్రాలలో ఖనిజ రంగులు ప్రధానంగా ఎరుపు మరియు తెలుపు మరియు కొన్నిసార్లు పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కూడా ఉపయోగించబడ్డాయి.  ఇక్కడ గోడలు మతపరమైన చిహ్నాలతో కూడా అలంకరించబడి ఉన్నాయి. ఈ విధంగా భీమా సిట్కా యొక్క ప్రాచీన మానవుల విజ్ఞాన వికాసం యొక్క కాలం ప్రపంచంలోని ఇతర పురాతన ప్రదేశాలకు వేల సంవత్సరాలకు ముందు జరిగింది. అందువలన ఈ పూరాతత్వ బీంబట్కా ప్రదేశం మానవ అభివృద్ధికి ప్రారంభ బిందువుగా కూడా పరిగణించబడుతుంది. దీనిని మన హరిబావు వాకంకర్ ప్రపంచానికి పరిచయం చేశారు.

ఇంతే కాకుండా వారు కాళ్ళకు చక్రాలు ధరించి దేశం అంతా తిరిగి భారతదేశ నిజమైన చరిత్రను వెలికితీశారు. మృదు స్వభావి. మాటల్లో తియ్యదనం ఉట్టిపడేది. తన హృదయంలో దేశం కోసం ఎదో చేయాలనే తపన ఒక అగ్నిలా ప్రజ్వరిల్లేది. సామాజిక రంగంలో కూడా చురుకుగా ఉండేవారు. శ్రీధర్ వాకాంకర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్వయంసేవక్ కావడంతో సామాజిక రంగంలో కూడా చురుకుగా పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్ కౌన్సిల్, మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన తరువాత 1966 లో ప్రయాగలో మొదటి ప్రపంచ హిందూ సమావేశం జరిగినప్పుడు, శ్రీ ఏక్ నాథ్ రణడే ఆయనను అక్కడికి పంపారు. తరువాత హరిభావు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళారు. భారతీయ సంస్కృతి, కళ, చరిత్ర, సైన్స్ మొదలైన వాటిపై ఉపన్యాసాలు ఇచ్చారు.  1981 లో సంస్కార భారతి స్థాపించబడినప్పుడు, ఆయనను దానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. భారత దేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత మన చరిత్రను వ్రాసే పనిలో కమ్యునిష్ట్ లు ఉన్నందువలన మన చరిత్ర వక్రీకరిణ జరిగింది అనే విషయం అందరీకీ తెలుసు. వాస్తవ చరిత్రను వెలికితీయడానికి ఇతిహాస సంకలన సమితి పని చేస్తుంది. దీనికి వాకంకర్ గారి ప్రేరణ ఎంతో ఉంది.

వాకంకర్ 1983 లో కురుక్షేత్రలో ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ మొరోపంత్ పింగళేతో కలిసి 18 మంది బృందంతో సరస్వతి షోద్ అభియాన్‌ను ప్రారంభించారు.  వారు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు ప్రయాణించి, సరస్వతి నది అంతర్వాహినిగా వున్నదని తేల్చారు, ఇది ఇతర నదుల కంటే చాలా చరిత్ర కలిగిన నది అని, సింధు లోయ నాగరికతకు ‘సరస్వతి నాగరికత’ అని పేరు మార్చాలని ఆయన సూచించారు.

1988 ఏప్రిల్ 3వ తేదీన ఒక సమ్మిట్ లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్ళారు. అక్కడ ఉపన్యాసం పూర్తయిన తరువాత కూర్చిలో ఒక్కసారిగా కూలబడిపోయారు. ఆఖరిశ్వాస వరకు దేశం గురించే ఆలోచన చేస్తూ అక్కడే మరణించారు. ఆ తరువాత పద్మశ్రీ డాక్టర్ వి.ఎస్.వాకంకర్ పేరిట జాతీయ అవార్డు ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 2003 లో వాజ్ పాయ్ గారు సరస్వతి నదికి సంబంధిత పరిశోధనలు జారిపించడానికి కూడా వాకంకర్ గారే ప్రేరణ. చివరగా వారి గురించి ఒక గొప్ప మాట ఏ ఇందిరాగాంధీ అయితే ఆర్ ఎస్ ఎస్ ని నిషేదించిందో ఆమె చేతులమీదుగా ఆర్ ఎస్ ఎస్ గణవేషలో బాగమైన నల్ల టోపీ ధరించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు శ్రీ వాకంకర్.

నేడు శ్రీ వాకంకర్ జీ 33వ వర్ధంతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.