#AP POLITICS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఈసీ ఒకలా… సీఎం మరోలా…
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. విజయవాడలో ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్‌ బ్యాలెట్‌వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తాం’ అని ఆయన ప్రకటించారు.

తీవ్రంగా పరిగణిస్తున్నాం..

స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమని అన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వేరే అధికారులను నియమించాలని ఆదేశించామన్నారు. మాచర్ల సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు వెల్లడించారు.

కోడ్‌ కొనసాగుతుంది..

ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని తెలిపారు.

పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం

‘స్థానిక ఎన్నికల ప్రక్రియలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో జరిగిన పరిణామాలు బాధాకరం. బెదిరింపులు, అడ్డుకున్న దృశ్యాలు మాధ్యమాల్లో వచ్చాయి. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం అనివార్యంగా భావిస్తున్నాం. అధికార యంత్రాంగం పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. మాచర్ల దాడిలో పాల్గొన్న నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉంది’ అని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఎన్నికల వాయిదాపై సీఎం ఆగ్రహం

స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పై విమర్శలు చేశారు. ఆయన తన విచక్షణ కోల్పోయి మాట్లాడారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రమేశ్‌కుమార్‌ నియమితులయ్యారని చెప్పారు. ”రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మేం నియమించలేదు. ఎస్‌ఈసీకి కుల, మతం, ప్రాంతం అనే స్వార్థాలు ఉండకూడదు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్‌ఈసీ పదవిలోకి తీసుకున్నారు. ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే ఎస్‌ఈసీ చదివి వినిపిస్తున్నారు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కలెక్టర్లు, ఎస్పీలను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారు? రాష్ట్రంలో పది రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి. ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించవచ్చు కదా?” అని తీవ్రస్థాయిలో జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల వాయిదాపై కనీసం సీఎస్‌, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శులతోనూ చర్చించలేదని జగన్‌ ఆరోపించారు. ఎన్నికల వాయిదాపై జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం వారిని సంప్రదించినట్లు పేర్కొన్నారని ఆక్షేపించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా జోరు చూసి తెదేపాకు భయం పట్టుకుందన్నారు. 10,243 చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే కేవలం 43 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయన్నారు. 2794 వార్డుల్లో 15185 నామినేషన్లు దాఖలైతే వీటిలో 14 చోట్లే చెదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పారు. ఏ స్థానిక ఎన్నికల్లో అయినా ఇంతకంటే తక్కువ ఘటనలు జరిగాయా? అని జగన్‌ ప్రశ్నించారు. ఎక్కడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించలేదని నిబద్ధతతో వ్యవహరించారని సీఎం కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈసీ ఒకలా… సీఎం మరోలా… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అధికారం తలకెక్కితే….
స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వివిధ పార్టీల కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడిన సంఘటనలు రాష్ట్రంలో ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ పైన, ఆమె అల్లుడి పైన తీవ్రంగా దాడి చేసి గాయపరచడం, అలాగే ఆత్మకూరు మండలం పడకండ్లలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేయడం, గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమ, న్యాయవాది కిషోర్ లపై దాడి చేయడం, చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని పాడి పేటలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేయడం ఇలా ఒక్క చోటనేమి కడప, గుంటూరు, ప్రకాశం ఇలా అనేక జిల్లాలలో వైకాపా కార్యకర్తలు, వారికి వెన్నుదన్నుగా నిలుచున్న పోలీసులు… రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ మనదేశంలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు తీవ్రమైన హింస, వేలాది ప్రాణ త్యాగాలే అధికార మార్పిడికి పునాదిగా ఉంటూ వచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం కూడా మనదేశంలో సుమారు 1995 వరకు అధికార మార్పిడి జరగాలంటే, లేదూ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తీవ్రమైన హింస తప్పనిసరి అవుతూ ఉండేది, ఆ తర్వాతి కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పడుతూ శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి.

అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ ఆగడాలు చూస్తుంటే “మళ్లీ మనం వెనకటి రోజుల్లోకి వెళ్తున్నామా?” అనిపిస్తోంది. అదే గనుక మొదలైతే ఆ రక్తపాతానికి, హింసకు అంతే ఉండదు. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను పక్కన పెడితే మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం తక్కువనే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నం అవుతున్నట్టు?

ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏరి కోరి ఎంచుకున్న అనుచరగణం, మంత్రులు, ఎమ్మెల్యేల దుందుడుకు, దౌర్జన్య పూరిత మనస్తత్వం గురించి మొదటినుంచి భయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వివిధ సందర్భాలలో వారి వైఖరి రాష్ట్ర ప్రజల భయాలు, ప్రతిపక్షాల ఆరోపణలు నిజం అని ఋజువు చేస్తున్నాయి.

పార్టీ ఏదైనా, ఇలాంటి ప్రమాదకర పోకడలు ఎవరికీ లాభం చేకూర్చవు. ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే, ప్రత్యర్థులపై అన్ని విధాలా దాడులకు పూనుకుంటే రేపు ఒకరోజు అధికారం మారదా? ప్రత్యర్థులు అధికారంలోకి రారా? వారూ మీలాగే ప్రవర్తిస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజాస్వామ్యమే కదా?

ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రశ్నించే గొంతుక ఉండాల్సిందే. ఉంటుంది కూడా. అధికారం చేతులు మారొచ్చు. అంత మాత్రాన ప్రజాస్వామ్య విలువలు మారకూడదు. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించే గొంతుక ఏదైనా అది వినిపిస్తూ ఉండాల్సిందే. ఆ గొంతుకను ఇప్పటి అధికార పక్షం గౌరవిస్తేనే రేపు అధికారం అవతలి పక్షం హస్తగతమైనా ఆ ప్రశ్నించే గొంతుక, హక్కు ద్వారా మాత్రమే ప్రజల సంక్షేమాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించగలరు ఎవరైనా.

అలా కాదని ఆ గొంతుకను నొక్కేదామని, అసలు పోటీయే లేకుండా చేసుకుందామని అధికార వర్గాలు ప్రయత్నిస్తే అది వికటించి ఎదురు తిరగక మానదు. ప్రశ్నించే గొంతుక ఉంటేనే అధికారపక్షం తన పనితీరుని మెరుగుపరచుకోగలుగుతుంది. దానిద్వారా మరింత గొప్పగా ప్రజామోదాన్ని సంపాదించుకోగలుగుతుంది.

అంతే కాదు అధికారంలో ఉన్నవారు ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. మనం వేప విత్తితే వేపే మొలకెత్తుతుంది. మామిడి విత్తితే మామిడే మొలకెత్తుతుంది. పాలకులు ధర్మ బద్ధంగా పాలిస్తే ప్రజల హృదయాలలో  ఉన్నతులుగా, ప్రజా నాయకులుగా, శ్రీ రామచంద్రులుగా నిలచిపోతారు. అందుకే రామరాజ్యం, రాముడు ఆదర్శ పాలనకు, వ్యక్తిత్వానికి నేటికీ ప్రతీకలుగా నిలచిపోయారు. అదే ప్రజలను తమ విధానాలతో భయభ్రాంతులను చేస్తే ప్రజలు వారిని రావణాసురుడి వారసులుగా గుర్తించి ఆ విధంగానే గుర్తు పెట్టుకుంటారు.

తన అధికార బలంతో ప్రత్యర్థులను అణచివేయాలని అధికార పక్షం ప్రయత్నిస్తే ప్రత్యర్థుల బలం నిస్సందేహంగా మరింత పెరుగుతుంది. వారికి ప్రజామోదం పెరుగుతుంది. అణచివేత కారణంగా వారు చేసే ఆక్రందనలు, ఆర్తనాదాలు పెరిగిన బలంతో గర్జనలుగా మారుతాయి.  ఆ గర్జనలలో, వారి పద ఘట్టనలో ఎంతటి అధికార దుర్మదాంధులైనా బెంబేలెత్తి పోవాల్సిందే. చరిత్రలో కలసి పోవాల్సిందే. తస్మాత్ జాగ్రత్త.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అధికారం తలకెక్కితే…. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.