News

ArticlesNews

పురోహితులు లేరు.. మంత్రాలు లేవు.. నల్లపూసల తాడుతోనే పెళ్లి! గిరిజనుల ప్రత్యేక వివాహ సంప్రదాయం

అడవి తల్లి ఒడిలో ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల జీవన విధానంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. వారి ఆచారాలు, సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా, నిరాడంబరంగా ఉంటాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లా మన్యం ప్రాంతాల్లో కొండరెడ్డి గిరిజనుల వివాహ సంప్రదాయం ప్రత్యేకంగా...
News

భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీల్లో రాణిస్తున్న ముస్లిం విద్యార్థిని నుస్త్రత్‌

బనగానపల్లె: భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే భగవద్గీత శ్లోకాలను శ్రావ్యంగా పారాయణం చేస్తూ నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన ముస్లిం విద్యార్థిని నుస్త్రత్‌ విశేష ప్రతిభ కనబరిచారు. భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీలో ప్రథమ బహుమతి సాధించి రూ.లక్ష నగదు పురస్కారాన్ని అందుకున్నారు. బనగానపల్లె జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నుస్త్రత్‌.. పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన గడ్డం మహబూబ్‌బాషా, దిల్‌షాద్‌బేగం దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పారాయణంలో శిక్షణ పొందారు. పాఠశాలకు చెందిన 22 మంది విద్యార్థినులు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు ప్రతిరోజూ సాయంత్రం సుమారు గంటపాటు భగవద్గీత శ్లోకాల పారాయణంలో శిక్షణ పొందారు. అనంతరం జూలై 19న ప్రొద్దుటూరులో ఇస్కాన్‌...
News

ఆదివాసీ ఆహార వైభవం

ఆదివాసీలు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. సిరికొండ మండలం నారాయణ్‌పూర్‌లో ‘ఆర్పీజీ’అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీ ఆహార వైభవం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామస్థులు కలెక్టర్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆర్పీజీ...
News

భీమన్న రచనలు సామాజిక వికాసానికి దోహదం

రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక,...
News

‘సక్షమ్’ ఆధ్వర్యంలో మడకశిరలో దివ్యాంగ సేవా కేంద్రం ప్రారంభం

శ్రీ సత్యసాయి జిల్లా: దివ్యాంగులకు అవసరమైన సేవలు, సహాయ సహకారాలు అందించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ‘సక్షమ్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గడుపూటి నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో పాల్గొని, దివ్యాంగుల సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న సేవలు, వారికి అవసరమైన సహాయ కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో బాలల కమిషన్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, సక్షమ్ అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి పవన్, హనుమంత్ రెడ్డి, కన్వీనర్ నాగరాజు, టౌన్ కన్వీనర్...
News

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో కుటుంబ ఆరోగ్య సమ్మేళనం

కర్నూలు: ఆరోగ్య భారతి కర్నూలు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సి.క్యాంప్‌లోని శ్రీ టీజీవీ కళాక్షేత్రంలో కుటుంబ ఆరోగ్య సమ్మేళనం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ నిరుషా రెడ్డి గారు, క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ ఏ. కుమారస్వామి...
News

గతేడాది ఒక్క రాయి దాడి కూడా లేదు.. జమ్మూకశ్మీర్‌పై రక్షణ శాఖ ఆసక్తికర నివేదిక..

జమ్మూకశ్మీర్‌లో 2025 సంవత్సర భద్రతా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలక గణాంకాలను వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక ప్రకారం, గతేడాది జమ్మూకశ్మీర్‌లో రాళ్లు రువ్విన ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అదే సమయంలో...
News

అమెరికా మిషనరీ సంస్థపై సీబీఐ కేసు..

అమెరికాకు చెందిన క్రిస్టియన్ మిషనరీ సంస్థ ది తిమోతీ ఇనిషియేటివ్‌‌తో పాటు దాని అధిపతి జొనాథన్ రాజన్, ఇండియా ఫైనాన్స్ హెడ్ అజిత్ వర్గీస్ మాథైతో పాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల స్వీకరణ, వినియోగంలో FCRA...
ArticlesNews

గణపయ్యపై అమితమైన భక్తి- ఇంట్లోనే గణేశ్ మ్యూజియం ఏర్పాటు

వినాయకుడిపై ఉన్న అమితమైన భక్తితో తన ఇంటినే 'గణేశ్ మ్యూజియం'గా మార్చేశారు ఓ వ్యక్తి. అందులో గత 40 ఏళ్లుగా ఆయన సేకరించిన గణేశుడి విగ్రహాలు, అలాగే గణపయ్య పూజకు సంబంధించిన వివిధ వస్తువులు ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా ఇంట్లో...
News

చిరుధాన్యాల విక్రయాలతో అధిక ఆదాయం

రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా చిరుధాన్యాల విక్రయాలు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వై.వి. రమణారావు తెలిపారు.  అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి   రాజుపాకలలో నిర్వహిస్తున్న లంబసింగి రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యకలాపాలను ఆయన...
1 2 3 4 5 2,510
Page 3 of 2510