మణిపూర్ అగ్నికి ఆజ్యం ఆ రచనలే
ప్రపంచ చరిత్రలో అక్షరం పాత్ర అత్యంత కీలకమైంది, విప్లవాత్మకమైంది. అక్షరం కేవలం భాషను రాసే సాధనం మాత్రమే కాదు. మానవ నాగరికత- సంస్కృతి, విజ్ఞానం, పరిపాలనలను తరతరాలకు అందించే పునాది. అక్షరాల ద్వారా విజ్ఞానం, సాహిత్యం, శాస్త్రీయ అంశాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, ఒక తరం నుండి మరో తరానికి వ్యాపిస్తాయి. మణిపూర్‌లో నిప్పురాజేసింది అక్షరమే. మణిపూర్ కవిత్రయం దంగ్జం ఇబోపిషక్ సింగ్, ఇబోంచసింగ్, డబ్ల్యూ.రంజిత్ వారి రచనలు మణిపూర్ ప్రజలను రెచ్చగొట్టాయి. ఉదాహరణకు దంగ్జం గేయం- ఇప్పుడీ నేపై / ఒక్కరూ బిగ్గరగా మాట్లాడుకో లేరు / ఒక్కరూ స్వేచ్ఛగా ఆలోచించుకోలేరు / చావాలనుకునే వారిని చావనీ / నీ వనరులను పిండేస్తున్న వారిని / మోసగిస్తూ, దొంగిలిస్తూ, బెదిరిస్తూ / ఏడు తరాలకోసం సంపద పోగేస్తున్న వారిని / వాళ్లని నీ...








