Gallery – Vishwa Samvad Kendra Andhra Pradesh

ధర్మాస్త్రం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం

Telugu NewsEditorial Newsధర్మాస్త్రం

ధర్మాస్త్రం

2 min readEenadu icon

By Editorial Team

Published : 13 May 2026 02:49 IST

Eenadu icon

ధర్మాస్త్రం

సామాజిక మాధ్యమాలు, పోటీ పరీక్షలు, ఉద్యోగ అభద్రత, ఆర్థిక సమస్యలు, విఫల ప్రేమలు, రకరకాల ఒత్తిళ్లు… అన్నీ కలిసి పాముల్లా మనసును బిగించి, మనిషిని నిస్సహాయుణ్ని చేస్తున్నాయి, కలలను స్తంభింపచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసే ధర్మాన్ని అనుసరించాలి. ప్రతి మనిషిలోనూ ఒక గరుడుడు నిద్రిస్తున్నాడు. అతణ్ని మేల్కొలపగలిగితే ఏ అధర్మ బంధనమూ నిలవదు. ధర్మం ఛేదించలేని శక్తిలేదని రామాయణ భారతాలు చెబుతున్నాయి.

రామ-రావణ యుద్ధం కేవలం బాణాలు, ఖడ్గాల సంగ్రామం కాదు. అది ధర్మం- అధర్మం మధ్య సంఘర్షణ. రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు అత్యంత శక్తిమంతమైన నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు, అది వేలాది విషసర్పాలుగా విరుచుకుపడి, రామలక్ష్మణులను నిశ్చేష్టులను చేసింది. అటువంటి క్లిష్ట సమయంలో వాయుదేవుడి సూచనతో సర్పజాతికి సహజ శత్రువైన గరుడుడు ఆకాశమార్గంలో దూసుకుని వచ్చాడు. అతడి దర్శనంతోనే సర్పబంధనాలు వీడిపోయి, రామలక్ష్మణులు మేల్కొన్నారు. ధర్మబలం ముందు అధర్మ శక్తులు నిలవలేవని చాటిన సందర్భమది. కాసేపు మూగబోయినా, ఓడిపోకపోవడం ధర్మబలానికి చిహ్నం.

మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి మరణానంతరం, అశ్వత్థామ కోపంతో నారాయణాస్త్రాన్ని మంత్రోచ్చారణలతో ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి వేలాది అగ్నిజ్వాలలు బాణాల్లా పాండవ పక్షంపై పడసాగాయి. నారాయణాస్త్రం స్వభావం తెలిసిన కృష్ణుడు ‘అస్త్రం ముందు ఆయుధాలు ఎత్తొద్దు! నమస్కరించండి! వినమ్రతే రక్షణ’ అన్నాడు. పాండవులు తమ ఆయుధాలను భూమిపై ఉంచి తలలు వంచి నమస్కారం చేశారు. విధేయతకు తలొగ్గిన ఆ భీకరాస్త్రం వారిని తాకలేదు. విధేయత చూపని భీముడిపైకి నారాయణాస్త్రం గర్జిస్తూ వస్తుండగా ‘భీమా! నమస్కరించు, లేదంటే నాశనమవుతావ్‌!’ అని శ్రీకృష్ణుడు హెచ్చరించగానే, భీముడు వినయంతో తలను వంచాడు. అస్త్రం శాంతించింది. నిజానికి ఎదిరించేవారికి దివ్యాస్త్రం లోబడదు. దైవాన్ని అంగీకరించే వినమ్రతకే వశమవుతుంది అంటాడు శ్రీకృష్ణుడు. నారాయణాస్త్రం కేవలం ఆయుధం కాదు, ధర్మ పరీక్ష. మన శక్తి ఎంత గొప్పదైనా, అహంకారంతో ఎదురొడ్డితే వినాశం తప్పదనీ; వినమ్రత, భక్తితో దాసోహమంటే రక్షణ దొరుకుతుందనీ చెబుతుంది. నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా వినయం ధైర్యం, నమ్మకం రక్షణ కల్పిస్తాయి.

ఎంత బలమైన సంకెళ్లనయినా తెంచే గరుడుడి శక్తిలా- ఉన్నత విలువలు, సత్యనిష్ఠ, ధైర్యం, నమ్మకం మనలో ఉండాలి. అన్యాయం, అవినీతి, దుర్మార్గం మొదట్లో విజయం సాధించినట్టు కనిపించినా, చివరికి న్యాయమే గెలుస్తుంది. ధర్మనిష్ఠను బోధిస్తున్న పురాణ కథలన్నీ ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. జీవితంలో నాగాస్త్రాల్లాంటి పరీక్షలు వస్తాయి. వాటికి భయపడకుండా లోపలి గరుడుణ్ని మేల్కొల్పాలి. మనలోని ధర్మం, మనస్సాక్షి, కృతనిశ్చయం… అవే ఏ అధర్మ బంధనాన్ని అయినా కరిగించే దివ్యశక్తులు. వాటిని వశం చేసుకోవడానికి భక్తి చక్కని మార్గం. అది మనలో దైవాన్ని నిలుపుతుంది.

The post ధర్మాస్త్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైజాగ్ నుంచి మెటా దిగ్గజం దాకా…
ప్రస్తుత కాలంలో AI టెక్నాలజీ ప్రతి వారి జీవితంలో భాగం అయిపొయింది. అందులోను సోషల్ మీడియా వాడే ప్రతి వారికి AIతో అవినాభావ సంబంధం ఏర్పడి పోయింది. అటువంటి టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు సంధ్యా దేవనాథన్. పేస్‌బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ యాప్స్‌లో ప్రత్యక్ష మౌతున్న టెక్ దిగ్గజం ‘మెటా’ కు ఇప్పటి వరకు ఇండియా విభాగ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆమె.. ఇటీవల ఆగ్నేయాసియా బాధ్యతలను కూడా స్వీకరించి మహిళా సాధికారతను చాటారు. ముఖ్యంగా మెటా నాయకత్వంలో కీలకమైన మార్పులు, వినూత్నమైన కార్యక్రమాలతో దూసుకు పోతున్నారు. భారతీయ వినియోగదారులకూ AI చేరువ చేయడమే ధ్యేయంగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు జాతి కీర్తిని ప్రపంచ పటాన నిలిపారు సంధ్యా దేవనాథన్. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని భారతీయ మార్కెట్‌లోకి తీసుకురావడంలోనే కాక తన నాయకత్వ పరిధిని విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

దేవనాథన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించి, ఢిల్లీలోని ఎఫఎంఎస్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు.తర్వాత సిటీబ్యాంకులో పనిచేశారు. 2009 డిసెంబరులో స్టాండర్డ్ చార్టర్డ్‌లో ఉద్యోగానికి సింగపూర్ వెళ్లారు. అక్కడి నుంచి ఆమె అంచెలంచె లుగా ఎదుగుతూ వచ్చారు. జనవరి 2016లో ఈకామర్స్, ట్రావెల్, ఫిన్సర్వ్ ఆగ్నేయాసియా గ్రూప్ డైరెక్టర్‌గా “మెటా”కు మారారు. ఆదే సంవత్సరం ఆగస్టులో ఫేస్బుక్ సింగపూర్ కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి చేరుకున్నారు. దీనితో పాటు 2018 లో సంధ్య వియత్నాం బిజినెస్ హెడ్ పాత్రను కూడా చేపట్టారు. 2020లో ఫేస్‌బుక్ సింగపూర్‌కు నాయకత్వం వహించడంతో పాటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గేమింగ్ ఉపాధ్యక్షురాలయ్యారు.

సంధ్య టెక్ పరిశ్రమలో వైవిధ్యం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారు. మెటా ‘గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ కౌన్సిల’లో సభ్యురాలిగా ఉంటూ, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో ఫార్చ్యూన్ ఇండియా ‘అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో స్థానంకూడా సంపాదించారు. అంతేకాక 2024లో ఫార్చ్యూన్ ఆసియా జాబితాలో దేవనాథన్ ఆసియాలో 95వ అత్యంత శక్తిమంతమైన మహిళగా కూడా స్థానం సంపాదించుకున్నారు . 2024లో విశాఖపట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీసీసీఐ దేవనాథన్‌ను ఘనంగా సత్కరించింది. జనవరి 2018 నుండి ఫేస్‌బుక్ మెటాలో మహిళల కోసం లీప్ లీడర్షిప్ కార్యక్ర మానికి కోచ్‌గా చేశారు. మెటాలోని గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ కౌన్సిల్‌లో కూడా ఆమె ప్రత్యేక స్థానంలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజక వర్గ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.

గతంలో సంధ్యా దేవనాథన్ మెటా ఇండియా హెడ్‌గా మాత్రమే ఉండేవారు. తాజాగా 2026లో ఆమె… ఇండియా మరియు ఆగ్నేయాసియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆమె మెటా కంపెనీకి చెందిన అతిపెద్ద వ్యూహాత్మక విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. మన దేశంAI వాడకంలోనూ, దానిని ప్రోత్సహించడంలోను ముందంజ లో ఉందని చెప్తారామె. ముఖ్యంగా భారతీయ స్టార్టప్ కంపెనీల్లో అవసరాలకు అనుగుణంగా AI పరిష్కారాలను రూపొందించేం దుకు ఆమె తన వంతు మద్దతు అందిస్తున్నారు.

ఈ యేడాది ఏప్రిల్ 28న మెటా మన దేశంలో వినూత్న అధ్యాయానికి తెర తీసింది. విరాట్ కోహ్లీ ప్రచారకర్తగా ‘ఓక్లే మెటా పెర్ఫార్మెన్స్ AI’ గ్లాసెస్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఇది కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, వ్యాయామం లేదా శిక్షణ సమయంలో అథ్లెట్లకు అవసరమైన సూచనలను “అథ్లెటిక్ ఇంటెలిజెన్స” ద్వారా అందిస్తాయి. అలాగే చిన్న వ్యాపారస్తులు తమ కస్టమర్లతో నేరుగా సంభాషించి, ఆర్డర్లు తీసుకునేలా AI బిజినెస్ ఏజెంట్స్‌ను వాట్సాప్‌లో ప్రవేశపెట్టారు. ఇది వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అంతే కాదు భారత్‌లోని డెవలపర్లు మెటా ల్యామా AIమోడల్స్‌ను ఉపయోగించి స్థానిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా దేవనాథన్ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం మే 29-30 తేదీల్లో జరగనున్న ముంబై టెక్ వీక్‌లో సంధ్య కీలక ప్రసంగం చేయనున్నారు. కేవలం ప్రయోగాల దశ నుండి వ్యాపార ఉత్పత్తి స్థాయికిAIని తీసుకువెళ్లడం ధ్యేయంగా ఈ సదస్సు దృష్టి సారించనుంది.

మెటా ఇండియా హెడ్‌గా ఉన్న సంధ్యా దేవనాథన్ బాధ్యతలు ఇప్పుడు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఆమె భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా మార్కెట్‌లకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల్లో మెటా వ్యాపార వ్యూహాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఆమె అత్యంత శక్తిమంతమైన టెక్ లీడర్‌గా ఎదిగారు.

విశాఖపట్నంలో చదువుకున్న ఆమె, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

– జయశ్రీ అచంట

The post వైజాగ్ నుంచి మెటా దిగ్గజం దాకా… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దర్గా పరిధిలో వున్న శివ లింగానికి పూజలకు అనుమతినిచ్చిన హైకోర్టు
కర్నాటక   కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఈ వివాదం నడుస్తోంది.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూజలు చేసుకుంటామంటూ పిటిషనర్ సిద్దరామయ్య హిరేమఠ్ తో పాటు హిందూ సంఘాలు, ఆండోలా మఠ్ ప్రతినిధులు కోర్టు మెట్లెక్కారు. 1 దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. అయితే కేవలం పిటిషనర్ సిద్దరామయ్య హిరేమఠ్ మాత్రమే పూజలు చేయాలని,ఇతర భక్తులకు అనుమతులు లేవని కోర్టు షరతు పెట్టింది. నిజానికి 15 మందికి అనుమతి కావాలని పిటిషన్ కోరారు. కానీ పిటిషనర్ ఒక్కరికే అనుమతి లభించింది.

అలాగే పూజల సమయంలో పిటిషనర్ కి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. పూజల సమయంలో శాంతిభద్రతలకు విఘాగం కలిగించే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది.

మరోవైపు ఆండోలా మఠాధిపతి సిద్ధలింగ స్వామీజీ కోర్టు తీర్పుపై స్పందించారు. తాము 15 మంది పూజలు చేసుకోవడానికి అనుమతి కోరామని, అయితే కోర్టు ఒకే వ్యక్తికి అనుమతిని ఇచ్చారన్నారు. ఇది చాలా సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య అని, హిందూ సంఘాలు దర్గా లోపల శివలింగం వుందని, మహా శివరాత్రి పూజ చేసుకుంటామని కోరుతున్నార్నారు. 2020 లో ఇక్కడి శివ లింగాన్ని దుండగులు అపవిత్రం చేశారని, అది మజార్ నిర్మాణంలో భాగమని పేర్కొంటూ దానిపై చాదర్ ఉంచారని ఆరోపించారు.

“2022లో పూజలు పూర్తి చేసిన తర్వాత, ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది సభ్యులు భారీగా రాళ్లు రువ్వారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా, ఎమ్మెల్యే సుభాష్, జిల్లా అధికారులు ఇందులో గాయపడ్డారన్నారు.శివలింగానికి హిందూ భక్తులు పూజలు చేయకుండా నిరోధించడానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

The post దర్గా పరిధిలో వున్న శివ లింగానికి పూజలకు అనుమతినిచ్చిన హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒకే దిశలో ఇద్దరు మహాపురుషులు డాIIహెడ్గేవార్ = ఆంధ్రరత్న దుగ్గిరాల
మన భారత దేశం ఒంటి స్తంభం మేడ కాదు, అన్ని కాలాలలో అనేక మంది మహాపురుషులు జన్మించారు. కొందరి జీవితాల్లో, జీవన సందేశాలలో అనేక పోలికలు కనిపిస్తాయి. అలాంటి ఇద్దరు ముహా పురుషుల గురించి తెలుసుకుందాం!

ఆర్.ఎస్.ఎస్ సంస్థాపకులు డా.కేశవరావు బలిరాం హెడ్గేవార్ (డాక్టర్జీ ) 1889 ఉగాది  ఏప్రిల్  1 నాడు నాగపూర్ లో జన్మించారు. శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1889, జూలై 2న కృష్ణా జిల్లా పెనుగ్రంచిపోలులో జన్మించారు ఇద్దరివీ మధ్యతరగతి కుటుంబాలే! చిన్ననాటనే తల్లిదండ్రులను కోల్పోయారు గోపాలకృష్ణయ్య. జన్మించిన మూడవ రోజునే తల్లి, మూడవ ఏట తండ్రి ఇద్దరూ తనువు చాలించారు. కేశవరావు 14వ ఏట ప్లేగు వ్యాధి వల్ల 1903 ఫిబ్రవరిలో తల్లిదండ్రులిద్దరూ ఒకే రోజున తనువు చాలించారు.

విద్యా భ్యాసం

కేశవరావు, గోపాలకృష్ణయ్య చిన్ననాట ఇద్దరూ ఆవేశ స్వభావం కలవారే! స్వాతంత్ర్య ఉద్యమాల్లో ఇద్దరూ అగ్రేసరులే! 1905లో ఆంగ్లేయ ప్రభుత్వం బెంగాల్ విభజనను చేసింది. దీనికి నిరననగా వందేమాతర నినాదం బెంగాల్ నుండి దేశమంతటా విస్తరించింది. కేశవ్ నాగపూర్ నీల్స్ హైన్కూల్లో విద్యార్థి. వందేమాతర గీతం పొడరాదంటూ రిస్తే సర్కూలర్ ను ఆంగ్లేయ ప్రభుత్వం విడుదల చేసింది. 1908లో స్కూల్ ఇన్ స్పెక్టర్ రాక సందర్భంగా అన్ని తరగతుల్లో అందరి విద్యార్థులు వందేమాతరంతో ఆంగ్లేయ అధికారికి స్వాగతం చెప్పారు. ఈ ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో తెలియ రాలేదు. ఆరు నెలల స్నూలు మూసివేసిన అనంతరం కేశవు నీల్స్ హైస్కూల్ నుండి బహిష్కరించారు. చిన్ననాటనే కేశవ్ అసాధారణ నాయకత్వ ప్రతిభను చూపారు.

విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని దుగ్గిరాల రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ మెట్ కాష్ హాస్టల్ లో అధ్యాపకునిగా చేరారు. తరగతి గదుల్లో దేశభక్తిని రగుల్కొల్చే వారి ప్రసంగాలు ఆంగ్లేయ అధికారులకు నచ్చలేదు. హాస్టల్ వార్షిక సభలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఫలితం ఆంగ్లేయ ప్రభుత్వం దుగ్గిరాల వారిని ఉద్యోగం నుండి తొలగించింది.

కేశవరావు హైస్కూల్ విద్యార్థిగానే స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాయకత్వం వహించారు. ఉన్నత చదువు పేరున కలకత్తా వెల్లి వైద్యపట్టాను పొందారు. అక్కడ అనుశీలన సమితి అనే విప్లవ  సంస్థలో చురుగ్గా పాల్గొన్నారు. ఇద్దరూ చిన్ననాటనే తల్లిదండ్రులను కోల్పోయారు. దుగ్గిరాల వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండులోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదివారు. అక్కడే స్వాతంత్య్ర ఉద్యకు బీజాలు బలంగా వడ్డాయి.

స్వాతంత్య్ర ఉద్యమంలో…

కలకత్తాలో చదువు అనంతరం 1916లో డాక్టర్జీ నాగపూర్ తిరిగి వచ్చి అన్ని రకాలైన స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మధ్య పరగణాలు  (Central Provinces) కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. 1920, డిసెంబరు నాగవూర్ కాంగ్రెస్ జాతీయ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు. 1921లో, 1930 లో రెండు సార్లు జైలు శిక్ష అనుభవించారు.

జీవితాంతం బ్రహ్మచారిగా పూర్తి జీవితం దేశం కోసం సమర్పించారు. ఎవరు స్వాతంత్ర్యం కోసం ఏ పద్ధతిలో పని చేసినా వారికి అండగా నిలిచారు.

దుగ్గిరాల వారికి 14 వ ఏటనే, చిన్న నాటనే వివాహం అయింది. రాజమండ్రి,మచిలీపట్టణం కళాశాలలో కొంత కాలం అధ్యా పకులుగా పనిచేశారు. వారు మంచి వక్త. విద్యార్థులలో ఆవేశం, దేశభక్తిని రగిలించే వారి పాఠాలు చెప్పే పద్ధతి అక్కడి వారికి నచ్చలేదు. దాంతో వారు అధ్యాపకత్వం మానుకొన్నారు. 1921 చీరాల-పేరాల ఉద్యమాన్ని నడి పించారు. 1921 విజయవాడ కాంగ్రెస్ జాతీయ మహాసభలో పాల్గొన్నారు. వారి ప్రసంగాలను విని ఆంగ్లేయ ప్రభుత్వం ఒక సంత్సరం జైలు శిక్ష విధించింది. 1922లో తమిళనాడు, తిరుచునాపల్లిలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. 1920లో భారతీయ విద్య ప్రారంభం కోసం విద్యాలక్ష్యం ఏర్పరిచారు. దాతలు 22 ఎకరాలు స్థలం ఇచ్చారు.

1923 నాగవూర్ కాంగ్రెస్ మహా సభల్లో దుగ్గిరాల వారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు.

ఆర్. ఎస్. ఎస్ రామదండు

1920 లో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండు అనే సంస్థను ప్రారంభించారు. అస్పృశ్యత నిర్మూలన, గ్రామస్వయంపాలన. ఇలా 10 అంశాలు లక్ష్యము. ఆంజనేయుడు గల కాషాయ జెండా ఈ సంస్థ జెండా.1921 విజయవాడ కాంగ్రెస్ జాతీయ మహా సభల నిర్వహణలో రామదండు చక్కగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆంధ్రరత్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

డాక్టర్జీ 1925లో విజయదశమి నాడు ఆర్.ఎస్.ఎస్ ను ప్రారంభించారు. భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యము, భారత దేశ  సమగ్ర అభివృద్ధి లక్ష్యములు, హిందూ సమైక్యతను సాధనంగా స్వీకరించారు. కాషాయ జెండా ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవ కులకు గురువు. జీవితాంతం ఆర్.ఎస్.ఎస్ బలోపేతం  కోసమే డాక్టర్జీ పని చేస్తూ కూడా స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఇద్దరు ప్రఖర హిందూ వాదులే!

సామాజిక దృష్టి

ఇద్దరూ హిందూ సమైక్యతను కోరుకున్నారు. కుల అసమానతలను, అస్పృస్య శ్యతను నిర్మూలించాలని కోరుకున్నారు. దుగ్గిరాల వారు జైలు నుండి విడుదల కాగానే 4-10-1922 న  మద్రాసు  సౌందర్యా హాల్లో జరిగిన సన్మాన సభలో కులవివక్ష అస్పృశ్యత నిర్మూలించబడాలనీ, నేటి కాలానికి అనుగుణంగా నూతన స్మృతి  కావాలని కోరుతూ వివరంగా ప్రసంగం చేశారు. 1927లో చీరాలలో రామమందిరం నిర్మించాలని కోరిక వ్యక్తం చేశారు, అనేక మంది ఆర్థిక సహకారం చేస్తాం అన్నారు. ఈ రామమందిరంలో ఎస్సీ లకు కూడా ప్రవేశం ఉంటుంది అని ప్రకటన చేయగానే దాతలు వెనక్కి వెళ్లిపోయారు.. తన భార్య నగలు అమ్మి రామనగరులో ఒక పూరిపాకలో మందిరం ప్రారంభించారు. కొద్ది కాలానికి 1928, జాన్ 10న టి.బి.వల్ల తనువు చాలించారు. వారి కోరిక ఇప్పటికీ నెరవేరలేదు, హిందు వులందరూ సోదరులు, అస్పృశ్యత నిర్మూలన కావాలన్న లక్ష్యము గా సంఘం పని చేస్తోంది. 17, సెప్టెంబరు 1933లో 9 నెలలు  అస్పృశ్యత నిర్మూలనకు గాంధీజీ   వార్ధా రామ మందిరం నుండి చేరిన హరిజన యాత్రకు సంఘం మద్దతు తెలిపినది.

1934 డిసెంబరులో గాంధీజీ వార్ధా సంఘ శిబిరాన్ని సందర్శించారు. మే 1939 లో డా.అంబేద్కర్ పూనా ఆర్.ఎస్.ఎస్ శిబిరాన్ని సందర్శించారు. కులాలకు అతీతంగా, అస్పృశ్యతకు తావు లేకుండా పని చేయడాన్ని ఇద్దరూ శ్లాఘించారు. 1940, జూన్ 21న డాక్టర్జీ తనువు చాలించారు.

ఎవరు? వీరి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళేది.  డాక్టర్జీ గొప్పతనం తన తదనంతరం తన జీవనకార్యాన్ని ముందుకు తీసుకు వెళ్లే కార్యకర్తల గణాన్ని తయారు చేశారు.

ఆర్.ఎస్.ఎస్. వందేళ్ళు  పూర్తి చేసుకుంది. దేశ వ్యాప్తంగా గల కార్యకర్తల పరిశ్రములో తన అంతిమ  లక్ష్యము వైపు వెళ్తున్నది. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఆశయాలు- చీరాలలో అందరికీ ప్రవేశం ఉండే రామాలయ నిర్మాణం, అందరికీ సమానత్వం ఇచ్చే నూతన  స్మృతి  తయారుచేసి అమలు చేసేది ఎవరు?

-డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు

The post ఒకే దిశలో ఇద్దరు మహాపురుషులు డాIIహెడ్గేవార్ = ఆంధ్రరత్న దుగ్గిరాల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆధ్యాత్మిక నిలయం… జ్యోతిక్షేత్రం
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర స్థలం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కాశినాయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనకు అలవాటుపడ్డారు. ఆయన గురువైన యతిరాజు గురవయ్య వద్ద ఆత్మ జ్ఞానాన్ని పొందారు. అక్కడి నుంచి వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ప్రవేశించి వరికుంట్ల, నాయునిపల్లె, గంగనపల్లె గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు చిన్న పిల్లలకు విద్యాబోధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనను కొనసాగించారు. ఆ సమయంలో వరికుంట్ల సమీపంలోని నల్లమల్ల కొండల్లోని జ్యోతి క్షేత్రంలోని జ్యోతి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జ్యోతి నరసింహస్వామికి పూజలు చేస్తుండేవారు. అక్కడికి సమీపంలోని గరుడాద్రి కొండ మీద కఠోర దీక్షతో తపస్సు చేశారు. అనంతరం అన్నదాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వచ్చేవారు.

ఆలయాల పునరుద్ధరణకు కృషి..

అవధూతగా మారిన కాశినాయన శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. చుక్కనీరు దొరకని గరుడాద్రి కొండమీద నీటిబావులు తవ్వించారు. గరుడాద్రి, అనంతరాయుడు, జ్యోతి, సిద్దేశ్వరం, లింగమయ్యకొండ, యోగానందలోని ఆలయాలను పునరుద్ధరించారు. కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో ఉన్న అహోబిలం వద్ద యోగానంద ఆశ్రమం స్థాపించి పశుసంపద, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు కుటుంబంలో పుట్టడంతో పశుపాలన, ధాన్యోత్పత్తి, ఆకలితో ఉన్న వారికి పిడికెడు అన్నం పెట్టడం అనే గుణాలు ఆయనకు అలవడ్డాయి.

జ్యోతినరసింహస్వామి పాదాల చెంత సమాధి..

వందేళ్లు జీవించిన కాశినాయన తన ఇష్టదైవమైన జ్యోతి నరసింహస్వామి పాదాల చెంత 1995 డిసెంబర్‌ 5వ తేదీన సమాఽధి అయ్యారు. ఆయన సమాధి చెందిన ప్రాంతంలో ఒక పురాతన మర్రిచెట్టు తనంతట తానే నేలవాలింది. ఆయన సేవిస్తూ వస్తున్న గోమాత కాశినాయన మరణాన్ని జీర్ణించుకోలేక మూడవ రోజున తనువు చాలించింది.

దేవాలయం ఏర్పాటు..

కాశినాయన సమాధిపై అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 60 తెలుగు సంవత్సరాలకు ప్రతీకగా 60 రాతిస్తంభాలతో ‘నభూతో నభవిష్యత్‌’ అన్నట్లుగా దేవాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆవు సమాధిని కూడా అందంగా నిర్మించారు. వంట శాలలు, భోజన శాలలు, వసతి గృహాల నిర్మాణాలతో జ్యోతిక్షేత్రం కళకళలాడుతోంది.

నిత్యాన్నదానం..

కాశినాయన ఆశ్రమాన్ని దర్శించే భక్తులకు అక్కడ స్వామి దర్శనం ఎంత ఇష్టమో ఆశ్రమంలో భోజనం చేసి రావడం అంత పవిత్రం. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని భోజనం చేస్తుంటారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్తజనం లక్షల్లో వస్తుంటారు. ఏడాది పొడవునా అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. రైతులు తాము పండించిన పంటలో కాశినాయన పేరున తీసి ఉంచిన ధాన్యం, కూరగాయలు, పప్పుధాన్యాలు ఆశ్రమానికి తమకు తాముగా చేరవేస్తుంటారు. దీంతో అన్నదానం సజావుగా సాగుతుంది.

ఈనెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే కాశినాయన మహోత్సవాలకు ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు చలువ పందిళ్లు, అన్నదాన కార్యక్రమం సజావుగా సాగేందుకు విస్తృతమైన భోజన కౌంటర్లు, వసతి ఏర్పాటు చేస్తున్నారు. మైదుకూరు ఆర్టీసీ డిపో వారు ఈనెల 4వ తేదీ నుండి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాశినాయన మాలను ధరించి కొంత మంది భక్తులు దీక్షలో కొనసాగుతున్నారు. వీరంతా ఈనెల 4వ తేదీ రాత్రికి జ్యోతిక్షేత్రానికి చేరుకుని జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోరుమామిళ్ల సీఐ హేమసుందర్‌రావు ఆధ్వర్యంలో కాశినాయన ఎస్‌ఐ యోగేంద్ర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

The post ఆధ్యాత్మిక నిలయం… జ్యోతిక్షేత్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘సర్వశాస్త్ర మయీ గీత’
గీత- కురుక్షేత్రం నడుమ, ఒక మహా సంగ్రామం ఆరంభ వేళ జరిగిన తాత్విక చర్చ, కురుక్షేత్రం, యుద్ధం ఇవి మన అంతర్గత సమరానికి ప్రతీకలంటారు. పండితోత్తములు. మనలోని యుద్ధ వాతావరణాన్ని గమనించాలి. మానసిక బలహీనతను ఓడించాలి. ఇందులో పాండవ మధ్యముడు ఆత్మ అయితే, కృష్ణ పరమాత్మ బ్రహ్మ. వారు అధిరోహించిన రథం మానవ దేహానికి ప్రతీక అంటారు. ఇది నరనారాయణుల మధ్య భావ వినిమయం. ఎంత గొప్ప భావన! శ్రోత నరుడు, అంటే అర్జునుడు. వ్యాఖ్యాత నారాయణుడు, ఆ దేవదేవుడు. భారతీయత మీద, విశ్వం మీద గీత జాడ ఎంత సుదీర్ఘమైనదో! గాఢమైనదో!

ఎంతమందిని నడిపించింది! అలనాటి శంకర భగవత్పాదులు మొదలు, రామానుజాచార్యులు, నింబార్కుడు, వల్లభాచార్యుడు, చైతన్య మహాప్రభు, అభినవగుప్తుడు, జ్ఞానేశ్వరుని దాకా గీతాసారం గ్రోలినవారే. సమీపగతంలో బాలగంగాధర తిలక్, వివేకానంద, అరవిందులు, అనీబిసెంట్, వినోబా, గాంధీ, ఆల్డస్ హాక్సిలీ, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, కార్ల్ యాంగ్, హెర్మన్ హెస్సె వంటివారు ఎందరో జీవితాలపై గీతోపదేశం సుస్పష్టం. గీత ప్రతి యుగానికి కొత్త సందేశాన్ని ఇస్తుంది. మంచీ చెడుల మధ్య మనసులో జరిగే ఒక మహాయుద్ధానికి ప్రతీక కురుక్షేత్రమంటారు స్వామి వివేకానంద. మానవ జీవిత జ్ఞానసారం గురించి సహజ సౌందర్యంతో చేసిన గొప్ప వ్యక్తీకరణ గీత అన్నారు హెర్మెన్ హెస్సె.

‘సర్వశాస్త్ర మయీ గీత’ అంటుంది మహాభారతమే. మనిషి మానసికంగా స్థిరంగా ఉండేటట్టు చేసే శాస్త్రదృష్టి గీత బోధలలో ఒకటి అనిపిస్తుంది.స్మృతి భ్రష్టమైనందు వల్ల బుద్ధి, అంటే జ్ఞానశక్తి నశిస్తుంది. బుద్ధి నాశనం కావడం వల్ల మనిషి తన స్థితి నుంచి పతనమవుతాడు అంటుంది. బుద్ధి అంటే జ్ఞానశక్తి అనడంలోనే గీత లోతు తెలుస్తుంది.

The post ‘సర్వశాస్త్ర మయీ గీత’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చవితి చంద్రుడిని ఎందుకు చూడరాదు?
భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని పూజించుట మన సాంప్రదాయము, ‘సర్వాత్వా కర్మాణి కుర్వీత’’ అను వాక్యముననుసరించి మనము చేయు ప్రతి కర్మను తెలిసి చేయవలయును. మన భారతీయ పర్వ దినములలో ‘‘వినాయక చతుర్ది’’ ఒకటి. దీనిని గూర్చి శాస్త్రములందు అనేక విధము లుగా యున్నది. ఇందు వినాయకుని స్వరూపం, వాహనము, వివాహము విషయములు సమగ్రముగా చర్చించబడుచున్నవి.

పురాణ కథలు

వినాయకునిగూర్చి పురాణగాథలెన్నో గలవు. చవితి వినాయకునకు ప్రీతికరమైన తిథియని ధర్మశాస్త్రములు తెల్పుచున్నది. ఇందులో పార్వతి నలుగు పిండితో చేసిన బొమ్మ ఉదంతం చాలా ప్రసిద్ధి.

దక్షిణాయణమున దేవతలు నిద్రింతురు. అందు తదియ గౌరి, విదియ విశ్వకర్మ, చవితి గణపతి ఇట్లే ఆయా తిథిలందు ఆయా దేవతలు నిద్రింతురు. నిద్రించు తిథిగాన చవితినాడు పూజనీయుడు గణపతియని వామన పురాణము వలన తెలియును. పార్వతితో చెలికత్తెలగు జయా విజయాలు ‘‘శివునికి నందీశ్వరాది పరివారము చాలా యున్నది. నీకు లేకుండుట చాలా చిన్నతనము గాన నీవును పరివారమును సంపాదింపుము’’ అనిరి. ఆ మాటపై ఆమె స్నానం చేయుచూ నలుగు తీసి యొక బాలునిగా యొనర్చి వస్త్రాభరణములు అలంకరించి ద్వారముకడ నిలబెట్టెను. శంకరుడంతలో అచటకు వచ్చి లోపలకు పోబోవ ప్రయత్నింప ఆ బాలుడడ్డు పెట్టెను. అంతట కోపించి, శివుడు వాని తలను శూలముచే ఖండించెను. శాంకరి కోపించి జగత్సాంహరము చేతునని చెప్ప, దేవతలు ఆమెను శాంతింపచేయుటకు, ఆమె కుమారుడు దేవ జ్యేష్ఠుడనియు, అతనినెల్లరు ముందుగ పూజింప వలయుననియు తెలిపి, పునర్జీవితుని చేసిరి. అప్సరసలు గొనిపోయిన ఆ బాలుని తలను గొనితెచ్చుటకు వారిని బంపెను. అప్సరసలు కానరారైరి. తుదకుత్తరాభి ముఖముగా పరున్న ఏనుగు తల తెచ్చిరి. ఆ తల అతికించి, త్రిమూర్తులు తమ తమ తేజస్సులను ఆ మూర్తి యందు వేదమంత్రముచే ప్రతిష్టించిరి. ఇవి కాక కొన్ని కథలు కూడా ఉన్నాయి. అవి మరుగున పడుతున్నాయి. అందులో ఒకటి.

ఆనాడు చవితిగాన చవితి గణపతి పూజా రోజుగా నిర్ణయింపబడెనని శివ పురాణము చెప్పుచున్నది. ఒకనాడు శివుడు మంధరాద్రిపై విహరించుచూ, పార్వతిని ‘‘కాళీ’’ (నల్లని దానా) అని పిలిచెను. దానికి ఆమె కోపించి బ్రహ్మను గూర్చి తపము చేసెను. అంత బ్రహ్మ వరమీ యరాగా తనను కనిపెట్టుకొనియున్న ‘పులికి’ ముందు వరమియమని పలికెను. దానిపై బ్రహ్మ ఆ పులిని ‘‘వినాయకుని’’గా చేసెను. పార్వతికి స్వర్ణచ్ఛాయ నిచ్చెను. ఆనాడు చవితి గాన గణపతి పూజరోజని మరియొక పురాణము చెప్పుతున్నది. ఇట్లు పురాణములు పలు విధములుగా గణపతి పూజా తిథిని, పుట్టుకను గూర్చి చెప్పుట కానవచ్చు చుండెను.

ఏక దంతుడు

ఒకప్పుడు పరశురాముడు శంకర దర్శనమునకు రాగా శివభగవానులు ఒంటరిగాయున్నారు, వెళ్ల వీలు లేదని గణపతికడ్డెను. అంత పరశురాముడు కోపించి, ఒక దంతమును విరిచెనని బ్రహ్మాండ పురాణమును, విష్ణువు తన అంశను పార్వతి యందు ప్రవేశపెట్ట కుమారుడు పుట్టెననియు, శని ఆ బాలుని చూడరాగా ఆ బాలుని శిరము తెగిపోయెననియు, అంతట విష్ణువు గరుడ వాహనమునెక్కి పుష్ప భద్రవనమునకేగి, ఆట ఉత్తరాభిముఖముగా నిద్రించు వొక యేనుగు తల తెచ్చి అతి కెననియు, కుమార స్వామి దంతమును విరిచిననియు బ్రహ్మ వైవర్తనము నందును, దక్షయజ్ఞమున వీరభద్రుడు దంతము విరిచిననియు మరియొక పురాణమును చెప్పుచున్నది. ఈ కారణముల వలన గణపతికి ఏకదంతుడు పేరు కలిగెనని తెలియుచున్నది.

వినాయకుని వివాహము మూషిక వాహనము

సాబరియను బ్రాహ్మణుని భార్య, మనోమయిని క్రౌంచుడను గంధర్వుడు మానభంగము చేయ చూచిన, ఆమె యేడ్చెను. ఆ ఏడ్పు సాబరి విని, ఆ గంధర్వుని ఎలుకవు గమ్మని శపించెను. వాడు కాళ్లమీద పడి యేడ్చినంత, గణపతికి వాహనమై పూజింపబడుదువని అనుగ్రహించెను. మరియు ‘‘అగ్నిర్దేవేభ్యో నిలాయతః ఆఖూరూపం కృత్వా పృథివీ రిప్రా విశతః’’ (తైత్తిరీయ 1.8-6-1) అను మంత్రము ప్రకారము, ఆఖువనగా మూషికము. ఇందు అగ్ని మూషిక రూపం ధరించి భూమిని తవ్వెనని యున్నది. గణపతి అయిన బ్రహ్మ అప్పుడు అగ్ని వాహనమై సృష్టియందు వ్యాపక స్థితిని పొందినదని చెప్పవలయును. భూమిని త్రవ్వెన నుటలో పృధివీతత్వమయిన మూలాధారము నకు గణపతి అధిష్టానదేవత.అతని వాహనము మూషిక మని ప్రసిద్ధం. కాబట్టి వేదసారమును తెలుపు ఈ పురాణములు వేదకథనే యిట్లు చెప్పినవి. ‘‘శూర్పకర్ణుడు’’ అను పేరుకు బ్రహ్మాండ పురాణమున ‘‘అగ్నిని ప్రకాశింపచేసినవాడు’’ అని నిర్వచనము చెప్పినది. అట్లు చెప్పుటచే పై మంత్రార్థము సరిపోవుచున్నది.

చంద్రదర్శనము

‘సింహమందు సూర్యుడుండగా శుక్ల పక్ష చతుర్థియందు చంద్రుని చూడరాదు, అట్లు చూచిన అపవాదు కలుగునని మార్కండేయ పురాణము, కన్య యందు సూర్యుడుండు రెండు పక్షముల చతుర్థి యందు చంద్రుని చూడరాదనియు, అట్లు చూచిన అపవాదు కలుగునని పరాశర భవిష్య పురాణము లందున్నది. ఆ దోషం శాంతించుటకై ‘‘సింహ ప్రసేనమవధీత్సింహో జాంబవతాహతః! సుకుమారః మారో ధీస్తవ హేష శ్యమంతకః।।’’ అని పఠించ వలయునని చెప్పబడెను, గణపతి మరుగుజ్జు రూపం చూచి చంద్రుడు నవ్వగా పార్వతి ఆనాడు చంద్రుని చూడరాదని శపించెనని మరియొక కథ.

అసలు గణపతి ఆత్మకు, మనస్సుకు చంద్రుడు దేవతలు. చంద్రుని దర్శింపరాదనగా మనస్సుకు సంకల్పములు (కోరికలు) కలుగచేయరాదని, సంకల్ప స్థితిలో, నిర్వికల్ప సమాధిలో బ్రహ్మను సంధానము చేయవలయును. అట్లు చేయనివాడు లోకనింద పాలగును. దానికే అపవాదని భావము. అది పోవుటకు పై శ్లోకమును చదువ వలయును. ఈ శ్లోకమునకు ఆ భావమునకు సంబంధమేమి? అప్పుడు ‘సింహః’ అను పదము సింహమును చెప్పదు, సింహరాశిని చెప్పును. ఆ రాశి సూర్యునిది, అట్టి ఆ రాశి జాంబవంతునిచే చంపబడినదనగా ‘జాంబవంతుడు ఋక్షపతి – ఋక్షమనగా నక్షత్రము. నక్షత్రాధిపతి చంద్రుడు. దానిచే సింహరాశిని చంద్రుడు అతిక్రమించెనని అర్థము. జాంబవంతుడు కన్యను, కృష్ణునకిచ్చెననుటలో గూడ యిట్లే అర్థము చెప్పవలయును. అనగా చంద్రుడు సింహరాశి కన్యలో ప్రవేశించెనని అర్థం. కాబట్టి ఓ సుకుమారా! ఓ జీవ! (ఓ అజ్ఞానీ) మారోదీః = ఏడవకుము. ఈ మణి నీది. ఈ మణి సూర్యవర ప్రసాద లబ్ధం. అనగా సూర్య లభ్యమైనది ప్రాణశక్తి, అదే జ్ఞానం, ఈ జ్ఞానము నీదే అనగా నీకు స్వయం నీవే. ‘‘తత్వమసి’’ అను జ్ఞానమిదే. ఇది కలిగిననాడు నీకు రోదనంతో పనిలేదు. ఇట్లు ఆత్మ నిగ్రహం నిలుపుకున్నవాడు అపవాదు నొందడని తెలుపుట. ఇది ఆ శ్లోక భావము. ఇటయింకను శాస్త్రార్థము చేయుటకు సావకాశమున్నది.

దూర్వలు

గణపతి సగుణ బ్రహ్మయగు ప్రజాపతి. ‘అతడేకంవిశతి. సంఖ్యారూపుడు’ అని సూచించుటకు ఇరువది యొక్క దూర్వలు (గరికపోచలు) సమర్పింప వలయును (సర్త్వాదిగుణముచే యజ్ఞ సమిధలు నిరవది యొకటని ఎరుగునది). పిత్తో ప్రదేశకము వల్లనే స్వప్నములు సంభవించును. దూర్వామూల కషాయమున పిత్త శాంతికరమని, పిత్తగుణ కార్యములయిన స్వప్నములనది నశింపచేయునని వైద్యశాస్త్రము చెప్పుచున్నది. ‘దూర్వాదుస్నప్న నాశిని’ అను శ్రుతి చెప్పుచున్నది. ప్రస్తుతము, సృష్టియంతయు, ఈశ్వర స్నప్నముగాన, దానిని నివారించినగాని తత్వావబోధ కలుగదు గాన ఈ దూర్వాపూజ చెప్పబడెను.

వక్రతుండుడు

వక్రమనగా-వామం, వ్యతిరేకం. ఆత్మకు సవ్యం, సృష్టికి అపసవ్యం. ఈ రహస్యమునే వామాచార, దక్షిణాచారములని మంత్రశాస్త్రము తెలుపును. అట్టి సృష్టికర్త గణపతి కాబట్టి ‘‘వక్రతుండాయ నమః’’ అని చెప్పి యెర్ర వస్త్రములు సమర్పించవలయును. యెరుపు రజో గుణమునకు గుర్తు. సృష్టికి రజో గుణము కారణము. రజో గుణప్రధానుడు బ్రహ్మ. గాన నెర్రవస్త్రము లీయవలయునని చెప్పబడెను. ఈ అర్థం లోన పెట్టుకొని ‘వక్రతుండాయ’ అను పేరుకు రాబోవు కల్పమునకు బ్రహ్మయని బ్రహ్మాండ పురాణమును, సృష్టికర్తయే, అని పద్మ పురాణమును చెప్పినవి.

సూర్యచంద్రుల గతిని బట్టియే తిథులు కలుగుచున్నవి. వారి నడక విశేషమును బట్టి ఆయా కాలములలో క్రొత్త శక్తులు పుట్టును. ఆ విషయం తెలుసుకున్న ఋషులు, శివ, నాగ, గౌరి, యిత్యాది పేర్లతో వ్రతములు కల్పించి, ఆ శక్తి యొక్క ఫలమును పొందుటకై మనకు సులభమార్గం చూపినారు. అట్టి కాలశక్తిలో ఒక భాగమే ఈ గణపతి కూడా. సగుణ (ఇహసుఖఫలమునకు) నిర్గుణ (ఆముష్మికఫలమునకు) రెండును చేసి ఫలములు పొందవచ్చును. వేద, పురాణములందు ఈ ఫలముల కొరకే అనేక పేర్లతో అనేక దేవతలను సృష్టించి వాటికనేక కథలను కల్పించి చిత్ర విచిత్ర గతులలో చమత్కరించినవి.

ఆనాడు ఒకసారి ఆకాశం వంక చూడండి, ఈ చతుర్దినాడు సూర్యుడు సింహయందుండగా; చంద్రుడు సూర్యస్వామ్యం గల హస్తా నక్షత్రమునదుండ, శుక్లపక్షమై, తిథి, ప్రాణభాగమైన మధ్యానవ్యాపిని కాగా, ఈ దేవతమునకు పూజనీయు డగుచున్నాడు. ఆకాశమున కూడా ఈ చిత్రమీనాడు చూడవచ్చును. శివపురాణమున తల ఖండింపబడి ఏనుగు తలగలిగినవాడు అని యున్నది. భాద్రపదంలో శుద్ధ చతుర్థినాడు సూర్యచంద్ర గతిలో, హస్తకలవాడు. హస్తయనగా హస్తకధిపతి సూర్యుడు. అతడు ముఖంగా యుండి, అతని యాధిపత్యముగల హస్తలో చంద్రుడించుక వెనుక యుండుటచే హస్తిముఖుడు చంద్రుడె. తల ఖండింపబడుట మొదలు వివరములు. ఆకాశమున నానాటికి సూర్యచంద్ర గతిలో కలుగు ప్రకాశంబట్టి యున్నది. ఇట్టిచో మనం నేడుపాసించు, గణపతి కాలచక్రములో; సౌరప్రధానమయి ప్రాణ భాగమగుటచే జ్ఞానదాతయయ్యెను. జ్ఞానమునకును, అర్చనాది మార్గములకును, దేవతల దివరాత్రములకు, గరిష్ఠ సంబంధమున్నది. కాబట్టి, జ్ఞానదాతయు గణపతి నారాధించి, జ్ఞానము బొంది, సర్వవిఘ్నములు పోగొట్టుకొని సిద్ధిని పొందుడు అని చెప్పుటకు సంశయము లేదు.

The post చవితి చంద్రుడిని ఎందుకు చూడరాదు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుటుంబ వ్యవస్థ సనాతనధర్మం ఇచ్చిన గొప్ప వరం.
కుటుంబ ప్రభోదన్

కుటుంబ వ్యవస్థ మన సనాతనధర్మం మనకిచ్చిన ఒక గొప్ప వరం. కుటుంబంలో అందరి మధ్య సుహృద్భావం, సహకారం ఉండడం అవసరం. అపుడే పరిస్థితులను ఎదుర్కొనగలిగిన మనస్థితి ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం క్షేమంగా, సౌమ్యంగా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. మన ఇంట్లోనే సామరస్యం లేకపోతే పరిసరాలను నియంత్రించలేం. అందుకే మన పెద్దలు ‘ఇంటగెలిచి రచ్చగెలవ’మన్నారు. మనస్సు విప్పి ఇంట్లో అందరం మాట్లాకుంటున్నామా? ఉదాహరణకు అబ్బాయి స్కూల్‌ తరపున విహార యాత్రకు వెళ్ళాడనుకుందాం. నాల్గు రోజులు తరువాత వచ్చినపుడు అబ్బాయిని కూర్చోబెట్టుకుని ఉత్సాహంగా అన్ని విషయాలు చెప్పేవిధంగా చేయడం అవసరం. ఆ రకంగా తన మనసులో మాట పంచుకోవడం వల్ల అత్మీయత పెరుగుతుంది. పరీక్ష రాసివచ్చిన అమ్మాయిని పలకరించి ‘ఎలారాశావు’ అని అడిగి సాధక బాధకాలు తెలుసుకుంటే పరీక్ష బాగా వ్రాయకపోయినా అమ్మాయి ఆనందిస్తుంది. మనల్ని పట్టించుకునే వాళ్లు ఉన్నారు అనేదే ఎవరికైనా ఊరట కలిగించే విషయం.

ప్రతిదీ సమస్యగా చూసే అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచాలి. ఏ కష్టమొచ్చినా తట్టుకుని నిలబడేందుకు కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత అవసరం. కుటుంబం మన పరిధిలో ఉన్న అంశం. కాని అది మనకు ఒత్తిడి పెంచే విధంగా కాదు. కుటుంబంలో మన వ్యవహార శీలత, మాటతీరు బయట పరిస్థితులకు స్పందించినపుడు ఉపయోగపడుతుంది. అందుకే కుటుంబం ఒక శిక్షణాలయం. ఒత్తిడికి గురయినపుడు మనం దుందుడుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే మనసుకు నియంత్రణ అవసరం. మనసు ఒత్తిడికి గురయినపుడు కోపం వస్తుంది. దుర్భాషలాడే అవకాశం ఉంది. భౌతిక దాడులకు దిగవచ్చు. శత్రుత్వాలు పెరుగుతాయి. బంధాలు దెబ్బ తింటాయి. సమాజం మనల్ని ఆవేశపరుడు అంటుంది. కాని అదే సమాజం మనం ఒత్తిడిని అధిగమించి సంయమనం పాటిస్తే సౌమ్యుడు అంటుంది.

మనసును నియంత్రించి మసలుకునే వ్యక్తిత్వం కుటుంబ వ్యవస్థలో అలవడుతుంది. భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కాని భేదాలుండవు. అలాగే సమాజంలో అనేక సందర్భాలలో లౌక్యం అవసరం. ఈ లౌక్యం వెనుక సమాజాన్ని ప్రేమించగలిగే శుద్ధ సాత్విక ప్రేమ కూడా అవసరం. నియంత్రించలేని స్థితిలో ఊరకుండడం ఉత్తమం. దానివల్ల మనం మన కుటుంబం కోసం నిలబడతాం, జీవిస్తాం. వివిధ సందర్భాలను నియంత్రించే ప్రయత్నంలో మనసుపై నియంత్రణ కోల్పోకూడదు. ఏ విషయాన్నీ మనం శాసించలేం. త్రికరణశుద్ధిగా ప్రయత్నించడం వరకు మన పని. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ మరమాత్మ ‘కర్మ’ అన్నాడు.

కుటుంబంలో మనం అందరినీ ప్రేమిస్తాం. భార్యాభర్తల మధ్య ప్రేమ అందుకే బలంగా ఉంటుంది. అలా ప్రేమించలేనపుడే విడాకులు అవీ చర్చకు వస్తాయి. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వివేకం మనకుండాలని మన ధర్మం చెబుతున్నది. అందుకు మన కుటుంబ వ్యవస్థలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎన్నో! మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో! మంచైనా, చెడైనా, వినోదమైనా, విషాదమైనా, సుఖమైనా, దుఃఖమైనా అంతా శ్యామప్రేరకం (భగవంతుడి లీల) అనుకోవడమే మన ధర్మం. మనకు నేర్పిన గొప్ప పాఠం.

The post కుటుంబ వ్యవస్థ సనాతనధర్మం ఇచ్చిన గొప్ప వరం. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వృక్షా బంధన్‌తో పర్యావరణ పరిరక్షణ
మహా వృక్షాల పరిరక్షణకు రాఖీ కట్టాలి.. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ పిలుపునిచ్చారు.

విశాఖలోని రైల్వే గెస్ట్‌హౌస్‌ దగ్గరున్న సుమారు 138 ఏళ్ల చరిత్ర కలిగిన మహా మర్రి వృక్షానికి గ్రీన్‌ క్లైమేట్‌ బృందం, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల, లిటిల్‌ ఏంజెల్స్‌ పాఠశాల విద్యార్థులు రాఖీ కట్టి పూజలు నిర్వహించారు.

కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ మోహనలక్ష్మి మాట్లాడుతూ సమస్త జీవరాశుల్ని కాపాడుకోవాలన్నారు. భూమి మీద ఏ ప్రాణి అంతరించినా దాని ప్రభావం మానవాళి మీద ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా వృక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహించడం అవసరమన్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. విశాఖ పోర్టు ఉద్యానవన అధికారిణి రాధిక మాట్లాడుతూ తమ సంస్థ 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు. వనమాలి సీటీజీ సంస్థ విద్యార్థులకు మొక్కలు పంచిపెట్టారు. కార్యక్రమంలో గ్రీన్‌ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, కోఆర్డినేటర్‌ జె.రాజేశ్వరి, వనమాలి సీటీజీ అడ్మిన్‌ మళ్ల సరిత తదితరులు పాల్గొన్నారు.

The post వృక్షా బంధన్‌తో పర్యావరణ పరిరక్షణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలుగు తేజం… కీర్తి ‘పతాకం’ పింగళి వెంకయ్య
The post తెలుగు తేజం… కీర్తి ‘పతాకం’ పింగళి వెంకయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.