Articles – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖంగా తీసుకెళ్లే ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. అలాంటి పవిత్ర ఆచారాల్లో ఆలయ ప్రదక్షిణకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

ప్రదక్షిణ అంటే కేవలం ఆలయం చుట్టూ నడవడం కాదు. దైవాన్ని జీవితానికి కేంద్రబిందువుగా అంగీకరించి, మన అహంకారాన్ని పక్కన పెట్టి, భక్తితో దైవాన్ని చుట్టి సాగడం అనే గొప్ప ఆధ్యాత్మిక భావన ఇందులో దాగి ఉంది.

ప్రదక్షిణలో దాగి ఉన్న పవిత్రమైన భావం

“ప్రదక్షిణ” అనే పదానికే పవిత్రమైన అర్థం ఉంది. దైవాన్ని కుడివైపున ఉంచుకుని, సవ్యదిశలో ఆలయం చుట్టూ పరిభ్రమించడం మన సంప్రదాయం. దీనికి ఒక తాత్విక సందేశం ఉంది.

“నా జీవితం నాకోసం మాత్రమే కాదు. నా కంటే గొప్పదైన దైవచైతన్యంలో నేను ఒక భాగం.” అనే భావాన్ని మనలో నాటుతుంది. మన చుట్టూ ప్రపంచం తిరగాలని కోరుకునే అహంకారానికి బదులుగా, మనమే దైవాన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుతున్నామనే అనుభూతి కలుగుతుంది. అందుకే ప్రదక్షిణను వినయానికి ప్రతీకగా కూడా భావిస్తారు.

ఆలయ వాతావరణం — మనసుకు ప్రశాంతత

ఆలయ నిర్మాణం, గర్భగుడి, ధ్వజస్తంభం, ప్రాకారాలు, గంటానాదం, మంత్రోచ్ఛారణ, దీపాల వెలుగు, ధూప సుగంధం వంటి అంశాలు భక్తుడికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తాయి. ప్రదక్షిణ సమయంలో మన దృష్టి కొంతకాలం బాహ్య ప్రపంచంలోని ఆందోళనల నుంచి దూరమవుతుంది. అడుగులో అడుగు వేస్తూ, దైవనామాన్ని స్మరిస్తూ నడవడం వల్ల ఏకాగ్రత, ప్రశాంతత, అంతర్ముఖత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే ప్రదక్షిణను ఒక రకమైన “చలన ధ్యానం”గా ఆధ్యాత్మికంగా అనుభవించవచ్చు.

శరీరానికి కూడా ఒక సులభమైన సాధన

ప్రదక్షిణలో నిరంతరం నడవడం వల్ల శరీరానికి సహజమైన శారీరక కదలిక లభిస్తుంది. నడక సాధారణంగా శారీరక చురుకుదనానికి ఉపయోగపడే వ్యాయామం. అయితే ప్రదక్షిణలోని ప్రత్యేకత ఏమిటంటే — శరీర కదలికతో పాటు మనసు కూడా ఒకే దిశలో కేంద్రీకృతమవుతుంది. భక్తితో, తొందరపడకుండా నడుస్తూ దైవనామాన్ని స్మరించడం శరీరం–మనసుల మధ్య ఒక సమన్వయ అనుభూతిని కలిగించవచ్చు.

అయితే ఆలయ ప్రదక్షిణకు సంబంధించిన కొన్ని “అయస్కాంత క్షేత్రాలు”, “విద్యుదయస్కాంత శక్తులు” వంటి వివరణలు సంప్రదాయంగా లేదా ఆధ్యాత్మికంగా చెప్పబడుతున్నప్పటికీ, వాటిని ఆధునిక శాస్త్రం నిర్ధారించిన వైద్య లేదా శారీరక ప్రభావాలుగా పేర్కొనడానికి తగిన ఆధారాలు లేవు. అందువల్ల ప్రదక్షిణ యొక్క ఆధ్యాత్మిక, ధ్యానాత్మక, నడకకు సంబంధించిన ప్రయోజనాలను వేరు చేసి చూడటం సముచితం.

దైవాన్ని కేంద్రంగా చేసుకోవడం

ప్రదక్షిణలో అత్యంత గొప్ప తాత్విక సందేశం ఇదే:“దైవమే కేంద్రం; నేను దాని చుట్టూ పరిభ్రమించే జీవిని.” సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లుగా, మనిషి కూడా తన జీవితం ఒక ఉన్నతమైన ధర్మం, దైవచైతన్యం, విశ్వ నియమం చుట్టూ సాగాలని గుర్తుచేసే ప్రతీకగా ప్రదక్షిణను చూడవచ్చు. ఇది మనలోని “నేనే అన్నీ” అనే భావాన్ని తగ్గించి, వినయం, కృతజ్ఞత, శరణాగతి వంటి భావాలను పెంపొందిస్తుంది.

ప్రతికూల ఆలోచనల నుంచి అంతర్ముఖత వైపు

నిత్యజీవితంలో మనసు ఎన్నో ఆలోచనలతో నిండిపోతుంది. పని, కుటుంబం, బాధ్యతలు, భయాలు, ఆందోళనలు — ఇవన్నీ మనసును నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి.అలాంటి సమయంలో ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా నడవడం, దైవనామాన్ని స్మరించడం, గర్భగుడిలోని దైవమూర్తిని మనసులో నిలుపుకోవడం మనసుకు ఒక విరామాన్ని అందించవచ్చు. ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికి సమస్యలు మాయమవుతాయని చెప్పడం కంటే, ఆ సమస్యలను ప్రశాంతంగా ఎదుర్కొనే మనస్థితి ఏర్పడటమే ప్రదక్షిణలోని గొప్ప అంతరార్థం అని చెప్పవచ్చు.

ఆలయ ప్రదక్షిణను కేవలం ఒక సంప్రదాయ ఆచారంగా చూడాల్సిన అవసరం లేదు. అది భక్తికి ప్రతీక, వినయానికి సాధన, ఏకాగ్రతకు మార్గం, అంతర్ముఖతకు అవకాశం. దైవాన్ని కేంద్రంగా ఉంచుకుని వేసే ప్రతి అడుగు మనలోని అహంకారాన్ని తగ్గిస్తూ, మనసులో శాంతిని పెంచే ఆధ్యాత్మిక సాధనగా మారవచ్చు.  అందుకే ఆలయ ప్రదక్షిణలోని అసలైన మహత్తు మనం ఎన్ని సార్లు ఆలయం చుట్టూ తిరిగామనే దానిలో కాదు…ఎన్ని అడుగులు వేసినా, చివరకు మన హృదయం దైవం వైపు ఎంత దగ్గరైంది అన్నదే అసలు ప్రదక్షిణ ఫలం.

The post ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష”. నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని మోదీ కూడా. స్పందించేంతటి ప్రాముఖ్యం దానికి ఎందుకొచ్చింది?… వంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి.

దేవభాష సంస్కృతంలో ఘనాపాటీలను తీర్చిదిద్దేందుకు మూడు దశాబ్దాల క్రితం తెనాలిలో నెలకొల్పిన ‘సుధర్మ రక్షణ పరిషత్’ గురించి తెలుసుకుంటే ఈ సందేహాలన్నీ తీరినట్లే సనాతన ధర్మానికి మూ మైన వేదాన్ని, వేద ప్రమాణాన్ని నిలబెట్టేది శాస్త్రం, సత్యం, జ్ఞానం, దర్మాల గురించి తెలుపుతూ యజ్ఞ యాగాది క్రతువులను వివరించే ఆ శాస్త్రంతోనే సనా తన ధర్మాన్ని కాపాడేందుకు ‘సుధర్మ రక్షణ పరిషత్’ను బ్రహ్మశ్రీ వేదాంత భాగవతుల ఆంజనేయశర్మ 1989లో గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీవారి సన్నిది ప్రాంగణంలో స్థాపించారు. దీని ద్వారా శాస్త్రసభలు నిర్వహించేవారు. ఆ సమయంలో అద్వైతసిద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ఈ గ్రంథాన్ని బోధించేవారు ఎక్కువ మంది జీవించి లేరని, గ్రంథ ఆధ్యయనం, అధ్యాపకులను తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టకపోతే అది అంతరించిన గ్రంథాల జాబితాలోకి చేరిపోతుందంటూ తమిళనాడుకు చెందిన వేద పండితుడు బోడా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం తెనాలిలో పాఠశాల ఏర్పాటుచేసి ఈ గ్రంథాన్ని బతికించాలని పండితుల సభ సూచించింది.

అద్వైతసిద్ధి గ్రంథాన్ని నాలుగు సెమిస్టర్లతో రెండేళ్ల కోర్సుగా నిర్వహించేలా తొలుత సిలబస్ సిద్ధమైంది. కాలక్రమంలో దీన్ని మొత్తం 4 కోర్సులుగా విభజించారు. వాటిలో తర్వం 6 సంవత్సరాలు, వ్యాకరణ, మీమాంసలు ఒక్కొక్కటి ఏడేళ్లు చొప్పున, వేదాంత శాస్త్రం ఆరున్నర సంవత్సరాలు అధ్యయనం చేయాలని నిర్ణయించారు. వీటిని చదివే సమయంలోనే సెమిస్టర్ల వారీగా పరీక్షలు ఉంటాయి. ఏ విద్యార్థి అయినా వరుసగా రెండుసాళ్లు ఉత్తీర్ణత సాధించకుంటే అతను ఇక పై ఆ శాస్త్రం చదవడానికి అనర్హుడుగా నిర్ణయిస్తారు. ప్రతిసారీ మౌఖిక పరీక్షలో కనీసం 50%, రాత పరీక్షలో 50% మార్కులు తప్పనిసరి, ఏటా జూన్, డిసెంబర్లో పరీక్షలుంటాయి.

ప్రావీణ్యం ఉన్నవారికి మా వ్యాకరణ, వేదాంతాదుల్లో కఠిన శిక్షణ

సెప్టెంబరు నాలుగు విభాగాలుగా కోర్సు విభజన ఏటా మూడుసార్లు తెనాలిలో పరీక్షలు రెండుసార్లు తప్పితే కోర్సుకు అనర్హత దేశం నలుమూలల నుంచి అభ్యర్థులు మాత్రం ముందుగానే కోర్సు పూర్తి చేసేలా మార్చిలోనూ పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఏ విద్యార్థి పరీక్ష రాయాలన్న తెనాలి రావాల్సిందే. దక్షిణాది రాష్ట్రాలతో పాటు హరియాణా, కోల్ కతా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, డిల్లీ, గుజరాత్ నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడి పాఠశాలలో విద్యను అభ్యసిస్తారు. ఒక్కో కోర్సు పూర్తయ్యాక వాటిలో స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది. వ్యాకరణంలో నవాన్నీకం చదివిన వారికి ఆ తర్వాత ‘అష్టాధ్యాయం’ ప్రత్యేక కోర్సు ఉంటుంది. ఇది పూర్తిచేయడం చాలా కష్టమని చెబుతారు.

ఏడేళ్ల వ్యాకరణ శాస్త్రం కోర్సును నాలుగేళ్లలోనే పూర్తిచే సిన మహారాష్ట్రబాలుడు ప్రియ వృత దేవదత్త పాటిల్ మరో మూడేళ్లు ఈ కోర్సు చేసేందుకు సిద్ధపడుతున్నాడు. కర్ణాటకలోని శృంగేరి పీఠం సమీప గ్రామానికి చెందిన మహేశ్ గణ పతి భట్ త్వరలో ఇదే పరీక్ష రాయనున్నాడు. అందు లో ఉత్తీర్ణుడయితే దేశంలోనే ఈ కోర్సు చేసిన మనా పాటి ఇతనే అవుతాడు. వేదాంత శాస్త్రంలో శంకర భాష్యంతో కలిపి భామతి, కల్పతరు, పరిమళ వ్యాఖ్యానాలతో మూడేళ్ల స్పెషలైజేషన్, షడంగ సహిత విద్యా రణ్య భాష్యంలోనూ ఆరున్నరేళ్ల స్పెషలైజేషన్ ఉంటుంది. వీటిని పూర్తిచేయడం అరుదైన విషయమే. ఇన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 88మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారంటే పరీక్ష ఎంత కఠినమో అర్థమవుతుంది, గడువులోపు ఒక కోర్సు ముగించడమే కష్టమైతే, ఇక విభాగాలూ పూర్తి చేసిన వారు ఒక్కరూ లేకపోవటం కఠినత్వానికి నిదర్శనం.

తండ్రి రెండున్నరేళ్లలోనే…

మహారాష్ట్ర బాలుడు ప్రియవృత 16సంవత్సరాల వయసులోనే వ్యాకరణ శాస్త్రం పూర్తి చేయగా, ఆయన తండ్రి దేవదత్త గోవిందపాటిల్ ఇదే కోర్చును కేవలం రెండున్నరేళ్లలోనే ఉత్తీర్ణత సాదించడం విశేషం. ఈయన కూడా తెనాలిలోనే చదువుకున్నారు. తెనాలి పరీక్ష, ఇక్కడి పాఠశాల గురించి మరో గురువుకృషిని కొనియాడుతూ కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని పత్రికలు వ్యాసాలను ప్రచురించాయి. అయితే ప్రియ వృతకు ప్రధాని మోదీ ప్రశంసలు అందించిన కొద్దిసేప టికే అతని గురువు ఆంజనేయశాస్త్రి వివరాలు, ఫొటోలను పంపాలంటూ పాఠశాలకు పీఎంవో నుంచి ఫోన్ లో సమాచారం అందింది. ఇదిలాఉంటే, అద్వైతసిద్ధి గ్రంథాన్ని అభ్యసించి, ఉత్తీర్ణులయిన 8 మంది పండితులు రాష్ట్రపతి పురస్కారాలను సైతం అందుకున్నారు. అనేకమంది ఉన్నత పదవుల్లో, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కంచి పీఠం సహకారంతో

మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సుధర్మ రక్షణ పరిషత్ను 2006లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సూచనలతో కంచి వేద వేదాంత శాస్త్ర సభగా మార్చారు. ఈ పీఠంతో పాటు హైదరాబాద్ కు  చెందిన ఇండిక్ ఆకాడమీ అందిస్తున్న ఆర్థిక సహకారంతో తెనాలి పరీక్షలు, శిక్షణ నిర్వహిస్తున్నారు. శిక్షణకు నెలకు రూ.1.20ల క్షలు, పరీక్ష ఒకసారి నిర్వహించడానికి రూ.3లక్షల వరకు ఖర్చవడంతో దీనికి భారీగానే ఆర్థికసాయం అవసరం. పరీక్ష రాయడానికి దేశం నలుమూలల నుంచి తెనాలి వచ్చే విద్యార్థులకయ్యే ప్రయాణ, వసతి ఖర్చులు మొత్తం శాస్త్ర సభే భరిస్తుంది. యజ్ఞ యాగాదుల నిర్వహణ వంటివాటిపైనా ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయి.

The post ‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన రియల్ హీరోలు-
మూగజీవాల బాధను అర్థం చేసుకోవడం, వాటికి చేయూత అందించడం కంటే గొప్ప మానవత్వం మరొకటి ఉండదు. ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇదే సూత్రాన్ని తమ జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. ఒకరు ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించినా తన సేవకు వీడ్కోలు పలకని ప్రభుత్వ మాజీ వెటర్నరీ డాక్టర్ (పశువైద్యుడు) నిరంజన్ సాహు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక చాలా మంది ప్రశాంతమైన జీవితం కోరుకుంటారు. కానీ సాహు మాత్రం తన బాధ్యతల్ని అక్కడితో ముగించలేదు. ఇక మరొకరు మూగజీవుల సేవే తన జీవితంగా భావించిన వాలంటర్ దుర్గా ప్రసాద్ పాధి. ఈయన పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తాన్ని జంతువుల సేవకే అంకితం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో ఏళ్లుగా అనాథ మూగజీవాల్ని రక్షించి వాటికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.

డాక్టర్ నిరంజన్ సాహు దాదాపు 45 ఏళ్లుగా జంతువులకు చికిత్స అందిస్తున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత 1982 ఆగస్ట్ 23న జూనియర్ వెటర్నరీ డాక్టర్‌గా ప్రభుత్వ సేవల్లో చేరారు. ఒడిశాలో పలు జిల్లాల్లో సుదీర్ఘ కాలం సేవలందించి, 2018లో సబ్ డివిజనల్ వెటర్నరీ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. వెటర్నరీ విభాగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయనకు జంతువుల కదలికలు, చూపుల్ని బట్టే వాటి ఆరోగ్య సమస్యలను పసిగట్టడం వెన్నతో పెట్టిన విద్య.

‘జంతువులు మాట్లాడలేవు. వాటి శరీర కదలికలు, ముఖ కవళికలు, ప్రవర్తన ద్వారా మాత్రమే మనం వాటి సమస్యల్ని గ్రహించాలి. పశువైద్యం అంటే ఇది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు. ఇది ప్రేమానుబంధాలతో ముడిపడి ఉంటుంది. ఉదయం జంతువులను పట్టించుకోకుండా రోజు ప్రారంభిస్తే నాకు ఆ రోజు సరిగా సాగదు’ అని డాక్టర్ సాహు చెబుతున్నారు. జంతువుల సమస్యల్ని గుర్తించడానికి ఎన్ని పరికరాలు వచ్చినా, జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకునే వైద్యుడి సామర్థ్యాన్ని అవి భర్తీ చేయలేవని అంటున్నారు. కుటుంబ సభ్యులు, భార్య, తమ ఇద్దరు పిల్లలు అందించిన పూర్తి సహకారంతోనే తాను ఇప్పటికీ ఈ సేవల్లో కొనసాగగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. వారి మద్దతు లేకుంటే ఈ ప్రయాణంలో తాను ఇంత దూరం వచ్చే వాడిని కాదని చెబుతున్నారు.

1999 విపత్తు తెచ్చిన మార్పుతో దుర్గా ప్రసాద్!

ఇక గంజాం జిల్లా బుగుడాకు చెందిన దుర్గా ప్రసాద్ పాధిది మరో కథ. ఈయనకు చిన్నప్పటి నుంచి పక్షులు, పశువులు అంటే ఇష్టం. 1999లో సంభవించిన సూపర్ సైక్లోన్ ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ విపత్తు సమయంలో గాయపడిన, ఆకలితో ఉన్న పశువులు, ఇతర మూగజీవులను కాపాడేందుకు వాలంటీర్‌గా రంగంలోకి దిగారు. అప్పటి నుంచి ఆ సేవను వదల్లేదు. గాయపడిన జంతువులను రక్షించి, వాటికి ఆహారం అందించే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి సుమారు 27 సంవత్సరాలుగా ఈ సేవల్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇక దుర్గా ప్రసాద్ ఒకవైపు మూగజీవుల రక్షణ కోసం తన జీవితాన్ని కేటాయిస్తూనే, జీవనోపాధి కోసం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. దీని ద్వారా వచ్చే సంపాదనలో పెద్ద మొత్తం అనాథ జంతువుల ఆహారం, వైద్య సేవలకే వెచ్చిస్తున్నారు. జంతువులకు సేవ, వాటిని రక్షించడానికి పూర్తి సమయం కేటాయించడానికే పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన చెబుతున్నారు. ‘జంతువులు భయం, నొప్పితో ఉన్నప్పుడే దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ వాస్తవానికి అవి మనుషుల నుంచి ప్రేమను మాత్రమే కోరుకుంటాయి’ అని దుర్గా ప్రసాద్ చెప్పుకొచ్చారు.

‘పీపుల్ ఫర్ యానిమల్స్’ కేంద్రంగా పునరావాసం

భువనేశ్వర్‌లో 1999 నుంచి పనిచేస్తున్న పీపుల్ ఫర్ యానిమల్స్‌ (PFA) అనే సంస్థలో డాక్టర్ సాహు, దుర్గా ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ, యజమానులు వదిలేసిన ఆవులు, కుక్కలు, పిల్లులకు ఈ కేంద్రం ఆశ్రయం కల్పిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 400 కంటే ఎక్కువ పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, ఉచితంగా నిత్యం వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ సాహు జంతువుల సమస్యల్ని పరిశీలించి వైద్య చికిత్స అందిస్తుండగా, దుర్గా ప్రసాద్ షెల్టర్ నిర్వహణ సహా ఆహారం, మందులు, ఇతర బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇలా మనుషుల నిర్లక్ష్యం, స్వార్థం వల్ల వీధిన పడుతున్న మూగజీవులకు ఈ ఇద్దరూ తమ సమయం, ఆర్థిక వనరుల్ని ధారపోస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

The post మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన రియల్ హీరోలు- appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మణిపూర్‌ అగ్నికి ఆజ్యం ఆ రచనలే
‌ప్రపంచ చరిత్రలో అక్షరం పాత్ర అత్యంత కీలకమైంది, విప్లవాత్మకమైంది. అక్షరం కేవలం భాషను రాసే సాధనం మాత్రమే కాదు. మానవ నాగరికత- సంస్కృతి, విజ్ఞానం, పరిపాలనలను తరతరాలకు అందించే పునాది. అక్షరాల ద్వారా విజ్ఞానం, సాహిత్యం, శాస్త్రీయ అంశాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, ఒక తరం నుండి మరో తరానికి వ్యాపిస్తాయి. మణిపూర్‌లో నిప్పురాజేసింది అక్షరమే. మణిపూర్‌ ‌కవిత్రయం దంగ్జం ఇబోపిషక్‌ ‌సింగ్‌, ఇబోంచసింగ్‌, ‌డబ్ల్యూ.రంజిత్‌ ‌వారి రచనలు మణిపూర్‌ ‌ప్రజలను రెచ్చగొట్టాయి.

ఉదాహరణకు దంగ్జం గేయం-

ఇప్పుడీ నేపై / ఒక్కరూ బిగ్గరగా మాట్లాడుకో లేరు / ఒక్కరూ స్వేచ్ఛగా ఆలోచించుకోలేరు / చావాలనుకునే వారిని చావనీ / నీ వనరులను పిండేస్తున్న వారిని / మోసగిస్తూ, దొంగిలిస్తూ, బెదిరిస్తూ / ఏడు తరాలకోసం సంపద పోగేస్తున్న వారిని / వాళ్లని నీ కోసం చావనీ / నేనెందుకు చావాలి.నీలకాంత సింగ్‌ ‌వ్రాసిన కవిత ‘పుట్టుకతో నేను జింకను / కానీ ఇప్పుడు పెద్దపులిగా మారాలని వుంది’ అయితే ఇక్కడ శాంతి కోసం పరితపించే కవులు కూడా లేకపోలేదు. ఇరోం చానూ షర్మి కవిత –మరణించిన నా శరీరాన్ని / భూమిలో కుళ్లి కృషించిపోనీ / భావి తరాలకు అది కొంత ఉపయోగపడనీ / అక్కడ నుంచే ప్రపంచమంతా రాబోయే తరాలకు / నేను శాంతి పరిమళాల్ని వ్యాపింపచేస్తాను. నేల అదే – నేల కడుపులో దాగిన విత్తనాలు వేరు, పెరిగే పైరు వేరు, పండే పంట వేరు. కానీ పంచుకొని తీర్చుకోవాల్సిన క్షుధార్తి మాత్రం వొకటే. ఆకలి తీరాక ఆస్వాదించే కవిత్వ మాధుర్యం, దాని అనుభూతి ఒక్కటే. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ.

భారతదేశపు ఈశాన్య ప్రాంతాలైన అస్సోం, అరుణాచలప్రదేశ్‌, ‌మిజోరాం, మణిపూర్‌, ‌నాగాలాండ్‌, ‌మేఘాలయ, త్రిపురలను సప్త సోదరీమణులు ( 7 సిస్టర్స్ ) ‌ప్రాంతంగా పిలుస్తారు. ఈశాన్య భారతం మానవ పరిణామశాస్త్ర సంగ్రహా లయం. సుమారు 400 భాషలు, మాండలికాలు, 7వరకూ వర్గాలతో విభిన్న జాతుల ప్రజల మతాల సమ్మేళనం. భారతదేశ చరిత్రలో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన అంతగా కన్పించదు, దురదృష్టం.

సాహిత్య విషయానికొస్తే ఈశాన్య ప్రాంతానిది కేవలం సంఘర్షణ ప్రధానమైన సాహిత్యమే కాదు, ప్రాంతీయ అస్తిత్వం, సాంస్కృతిక మూలాలు, గత వైభవం మొదలైనవి బలంగా వేళ్లునికొని ఉన్నాయి. భక్తి ఉద్యమం మొదలుకొని, సంస్కరణ ఉద్యమాలు, వలసపాలన ప్రభావం క్రైస్తవం, ఆంగ్లభాష విస్తరణ, పశ్చిమ దేశాల ఆధునికత కూడా ఇక్కడ కన్పిస్తున్నాయి.

గిరిజన తెగలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సహజంగానే మౌఖిక సాహిత్యం ఉంటుంది. తెగలు మాట్లాడుకునే భాషలకు సాహిత్యం, వ్యాకరణం, లిపి లేక పోయినా మౌఖిక సంపద ఉండకపోదు. మాటను పాటను నమోదు చేసుకునేందుకు శతాబ్దాల క్రితం ఏ విధమైన ధ్వని యంత్రాలు లేకపోయినా లిపి ద్వారా నిక్షిప్తం చేయగలిగారు. లిపి, రాత రానప్పుడు కూడా మనస్సుకు హత్తుకునే భావాల మూలంగా ఒకరి నుండి ఒకరికి జ్ఞాపకాల ద్వారా వచ్చిన సాహిత్యం దొరికింది. ప్రపంచ సాహిత్యంలో గ్రీకు హోమర్‌, ‌ఫిన్నిష్‌, ‌కలవెల, సుమేరియ బాబిలోనియన్ల గిల్‌గిమిష్‌ ‌లాంటి మహాకావ్యాలు లేకపోలేదు.

మణిపూర్‌ ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక అందమైన రాష్ట్రం. దీని రాజధాని ఇంఫాల్‌ ‌రత్నాల భూమిగా పిలిచే పచ్చని కొండలు లోయలతో కూడి మయన్మార్‌ ‌సరిహద్దులో ఉంది. ‘మెయితీ’ వీరి ప్రధాన భాష.

మణిపూర్‌కు ఉత్తరాన నాగాలాండ్‌, ‌దక్షిణాన మిజోరాం, పశ్చిమాన అస్సాం, రాష్ట్రాలు ఉన్నాయి. తూర్పున మాయన్మార్‌ ‌దేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. 1949 సెప్టెంబర్‌ 21, ‌మణిపూర్‌ ‌విలీన ఒప్పందంపై సంతకం చేసిన తరువాత అక్టోబరు 15, 1949లో భారత్‌ ‌యూనియన్‌లో భాగమైంది. తూర్పు స్విట్జర్లాండ్‌గా కూడా ఈ ప్రాంతాన్ని భావిస్తారు.

ప్రాచీన చరిత్ర ప్రకారం ఈ ప్రాంతాన్ని గంధర్వ దేశంగా చెబుతారు. మహా భారతంలో మణిపూర్‌ ‌ప్రస్తావన ఉంది. అర్జునుడు మణిపూర్‌ ‌రాకుమారి చిత్రాంగదను వివాహమాడినట్టు, వారి కుమారుడే బభ్రువాహనుడు. గొప్ప సాహసి, యోధుడు. ఆగ్నేయాసియా దేశాలకు మణిపూర్‌ ‌ముఖద్వారం కావడంతో ఈ ప్రాంతంగుండా చైనా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక వ్యాపారాలు కొనసాగాయి.

మణిపూర్‌లోని మోరే పట్టణం భారత్‌-‌మయన్మార్‌ ‌సరిహద్దుల్లో ఉంది. ఇది ఆగ్నేయాసియాతో వాణిజ్యానికి ప్రధాన కేంద్రం. ఆసియా హైవే మణిపూర్‌ ‌ద్వారా మయన్మార్‌కు అక్కడి నుండి థాయ్‌లాండ్‌, ఇతర ఆగ్నేసియా దేశాలతో అనుసంధానత ఉంది.

మణిపూర్‌లో కూకీ, మైతీ, నాగా, పంగల్‌, ‌మిజో లాంటి ప్రధాన తెగల విభిన్న సంస్క ృతులు, భాషలు గల ప్రాంతం. పోలో ఆటకు జన్మస్థలం. కీ।।శ।। 33వ సంవత్సరంలో ‘‘శంఖగ్బ’’ రాజు నుండి మొదలై 1949 వరకు చివరిరాజు బుధచంద్రవరకు 109మంది రాజులు పాలించారు. సమయానుకూ లంగా ఈ ప్రాంతం అనేక పేర్లతో గుర్తింపు పొందింది. అవి- సన్నలైపక్‌, ‌టిల్లీ కోక్తోంగ్‌ ‌పోయి రైలం, మితైలిపక్‌, ‌మైత్రబక్‌ ‌మొదలైనవి. 16వ శతాబ్దంలో సనహిహోన్‌ ‌హన్‌, 17‌వ శబాబ్దంలో గరీబ్‌ ‌నివాజ్‌, ‌బర్మా (మాయన్మార్‌) ‌లోనికి చొచ్చుకుని పోయి రాజ్యాన్ని విస్తరించారు. 18వ శతాబ్దంలో పాలించిన మహారాజా భాగ్యచంద్ర (1762-1798) బర్మా సేనలతో పోరాడి మాతృభూమిని జయప్రదంగా కాపాడుకున్న వీరుడు. అలాగే వైష్ణవ ప్రజాదరణకు కూడా కారకుడు. మణిపురి నృత్యంగా ప్రసిద్ది చెందినవారి శాస్త్రీయ నృత్యం ‘‘రాసలీల’’ సృష్టికర్తగా చరిత్రలో అతడు నిలిచిపోయాడు. అయితే 1891లో ఆంగ్లేయులతో ఖొంగోంలో పోరాడి ఓడిపోయాక 1947 వరకు పరాధీనమైంది.

మణిపూర్‌ ‌భాష టిబెట్‌ ‌జర్మన్‌ ‌భాష అయిన మైతైలోన్‌, ‌లేదా మీతై• భాష (ఏడు మండలి కాల మిశ్రమం) ఈ భాష మాట్లాడేవారు అస్సోం, మిజోరాం, త్రిపుర, బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌లో కూడా ఉన్నారు. మణిపురిలో వున్న 29 వివిధ తెగల మధ్య అది సంపర్కభాషగా గుర్తింపును పొందింది. దీని లిపి భాష విష్ణుప్రియ. మణిపురి, మయన్మార్‌, ‌బాంగ్లాదేశ్‌, ‌మేఘాలయ, అస్సాం, అరుణాచల ప్రదేశ్‌ల్లో కూడ ఈ భాష వాడుతున్నారు. బెంగాలీ లిపిలో ఉన్న విష్ణుప్రియ మణిపురిలో కూడా కొంత సాహిత్యం ఉంది. సుమారుగా 8వ శతాబ్దంలో మణిపూరి సాహిత్యం ప్రారంభమైంది. దీన్ని 3 కాలాలుగా విభజి స్తారు. ప్రాచీన కాలం 8వ శతాబ్ది నుండి 1074 వరకూ మౌఖిక జానపద గేయాలే నాటి సాహిత్యం. మధ్యయుగకాలం 1074 నుండి 1709 వరకు, ఆధునిక యుగం 1709 నుండి నేటి వరకు మణిపురేర్‌ ఇతిహాస 1890లో ముద్రితిమైంది.

మణిపూర్‌ ‌చరిత్రను మలుపు తిప్పింది గరీబ్‌ ‌నిహాజ్‌ను మహారాజ్‌ (1709-1748). ఇతని కాలంలోనే మైతీలను హిందూమతంలోనికి మార్చింది. అంతే కాక, 1709లో తూర్పు బెంగాల్‌ ‌నుండి వచ్చిన హిందూ ప్రచారకుడు శాంతిదాస్‌ ‌గోసైన్‌ ‌ప్రోద్బలంతో మైతీ రాత ప్రతుల్ని తగలబెట్టిం చాడు. మైతీ లిపిని సైతం బెంగాలీ లిపిలోనికి మార్చాడు. అప్పటి నుండి సంస్కృతం, బెంగాలీ, బ్రజ్‌ ‌బోలీల్లో నుంచి హిందూ కట్టుబాట్లు రావడం మొదలైంది. సంస్కృతం, బెంగాలీ నుండి ధార్మిక పౌరాణిక అనువాదాలు ఎక్కువయ్యాయి. కవి అంగోం గోపి (1710-1780) బెంగాలీ నుండి సంస్కృతం నుండి అనేక గ్రంధాలు కావ్యాలు అనువాదం చేశాడు.

అంగోం గోపి గంగాదాస్‌ ‌సేన్‌ ‌వ్రాసిన మహా భారతంలోని పరీక్షిత్‌ను బెంగాలీ నుండి అనువదిం చారు. ఉత్తర కాండను కూడా అనువదించారు, తరువాత యుబరాజ నబానంద రామకృష్ణ దాస్‌ ‌రాసిన విరా• పర్వాన్ని బెంగాలీ నుండి అనువదిం చాడు. 18వశతాబ్దం చివరిభాగంలో లాంగ్జామ్‌ ‌పరశురామ్‌ ‌బెంగాలీలో రాసిన మహాభారతంలోని గంగాదాస్‌ ‌రాసిన అశ్వమేధ పర్వాన్ని మైతేయి భాషలోకి అనువదించాడు. ఈ కాలంలో రాసిన మరో గొప్ప అనువాదం గోవింద మిశ్రపండిట్‌ ‌భగవత్‌గీతను పరశురాం అనువదం. అతడు పాంహీ బారాజు (1709-1748) ఆస్థానంలో పనిచేసేవాడు. 1940 నాటికి బెంగాల్‌ ‌నుండి చైతన్య మహాప్రభు నవ్య వైష్ణవవాదం మణిపూర్‌ ‌సాహిత్యంలోకి చేరింది. ఆంగ్లేయుల ఆక్రమణ తరువాత ఆంగ్లం కూడా వారి రాతల్ని ప్రభావితం చేసింది. ప్రకృతి ఆరాధన, మణిపూర్‌ ‌ప్రాభవాన్ని కీర్తించడం నాటి కవిత్వమైంది.

భారత స్వాతంత్రానంతరం చెప్పుకోదగ్గ కవి పద్మశ్రీ క్వైరక్పం చవొబసింగ్‌ (1895-1950) ‌దేశాభిమానం, మానవీయ దృక్పధం, సార్వత్రిక వాదం పునరావృతమవుతూ లంబం కమల్‌సింగ్‌ 1899-1934 ‌హిజం అంగం ఘల్‌ ‌సింగ్‌ (1892-1944)‌ల కవిత్వం వచ్చింది. మణిపూర్‌ ‌జానపద ప్రభావంతో అంగంఘల్‌ ‌సింగో వ్రాసిన 39 వేల చరణాల ‘‘ఖంబ దోయిభి షైరెంగ్‌ ‌మణిపూర్‌ ‌జాతీయ కావ్యంగా సర్వోత్తమమైనదిగా ప్రసిద్ది చెందింది.

అమలవుతున్న నరకానికి ఆశిస్తున్న స్వర్గానికి మధ్య గల వ్యత్యాసం, కవులు తమను తామే ప్రశ్నించుకుని తెలుసుకున్న జవాబులే కవిత్వం కావడం మొదలైంది. వాస్తవాలు, అసమ్మతి, అవిశ్వాసం, సంశయం, అర్ధం కాని అనిశ్చిత ప్రపంచంలో వ్యక్తుల ఔన్నత్యం సమాజంలో కవుల వస్తువులయ్యాయి. ఈ కోవలోని పండితుడే ఎలంగ్బం నీలకాంతసింగ్‌ (1927-2000). ‌హాస్యరసంతో మానవతావాదం మేళవించిన అశంగ్భం మీనాకేతన్‌ ‌సింగ్‌ (1906-1995) ‌దంగ్జం ఇబోపిషక్‌ ‌సింగ్‌ (1948). ‌తమకోసం తాము రాసుకుంటున్నట్లు కవిత్వం రాసారు. లైష్రం సమరేందర్‌సింగ్‌ (1925) ‌కవిత్వం ఈ కోవలోకే వస్తుంది.

మణిపురి కవిత్వంలో ఆధునికతకు బాటలు వేసిన ఇద్దరు ముఖ్యమైన కవులలో ఒకరు ఎలాగ్జాంమ్‌ ‌నీలకాంతసింగ్‌, ‌మరొకరు ఎల్‌.‌సమరేంద్ర సింగ్‌. ‌నీలకాంతసింగ్‌ ‌వ్రాసిన ‘ది లాఫ్‌ ఆప్‌ ఎ ‌గర్ల్’ ‌మణిపురి భాషలో బాగా పేరు తెచ్చింది. చట్లాసిన్‌, ‌కడైదానో ఇబాని తీర్థయాత్ర, పుక్నింగ్‌ ‌చెప్పుకోదగ్గ కవితా సంపుటాలు. ఇతర కవులకు వస్తే, హెచ్చ్. ‌నబదీప్చంద్ర (1897-1946) అషంగ్బం మీనకేతన్‌ ‌శింఘ్‌ (1906-1995) ఆర్‌.‌కె.శితల్జిత్‌ (1913-2008) ఆర్‌.‌కె.సురేంద్రజిత్‌ ‌సింగ్‌ (1925-1982) ‌ఖైరుద్దీన్‌ ‌చౌధురి (1934) యుంలెంబం ఇబొంచసింగ్‌ (1949) ‌మొదలైన వారు నాటి ప్రముఖ కవులు. అక్కడ కవియిత్రులు తక్కువేం కాదు. యుంలెంబం గంభిని దేవి (1945) ఆర్‌.‌కె.భుబోన్సన (1951) ఇలబంత యుమ్నం (1952) ఆరంభం ఓంగ్బి మెంచేబి (1955), రొబిన్‌ ఎస్‌.‌నగం గొం (1959) రఘు వైసంగ్దెం (1959) సరత్చంద్‌దియం (1961) బిరేంద్రజిత్‌ ‌నవొరెం (1962) క్షేత్రిమయుం రాజేన్‌సింగ్‌ (1968) ‌గంభిని సొరొక్కైబం(1971) నవొరెం బిద్యాసాగర్‌ (1972) ‌సగొల్సెం లంచెంబమై పై మొదలైనవారు ఈ సాహిత్యానికి వన్నె తెచ్చారు.

ఇప్పటి వరకూ మణిపురి సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు11 లభించాయి. వారు ఇతర రాష్ట్రాలవారితో పోటీ కంటే వారితో వారే పోటీపడి సమాజానికి మంచి సాహిత్యం అందిస్తున్నారు. ఒక మిత్రుడు అడిగాడు మన మాతృభాష తెలుగు సాహిత్యమే ఎవరూ పట్టించుకుని చదవడం లేదు. ఈశాన్య రాష్ట్రాల గురించి, వారి సాహిత్యం గురించి రాస్తే ఎవరు చదువుతారు అని. నిజమే ఝార్ఖండ్‌ ఆదివాసీ కవయిత్రి జసింత కర్కెట్ట ‘ఉరావ్‌’ ‌భాషలో వ్యక్తం చేసిన అభిప్రాయం.

నా మాతృభాష / అమ్మ నోటిలోనే / ఖైదీ అయిపోయింది / కలల భారం కింద / మాతృభాష నలిగి పోయింది.

ఈశాన్య భారతాన్ని ప్రాంతం, జాతి, భాష మైదాన దేశంలోని సాంస్కృతిక వైవిద్యాన్ని అర్ధం చేసుకొని దాన్ని కాపాడుకోవడానికి కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారివరకూ, గుజరాత్‌ ‌నుండి మణిపూర్‌ ‌వరకూ భిన్న కాలాల్లో వెళ్లి విరిసిన కవిత్వం దోహదపడుతుందని, ఈ దేశపు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని నేను నమ్ముతాను. అందుకే ఈ నా మొదటి ప్రయత్నం బ్రిటిష్‌ ‌వారికి ఒక భాష, ఆ భాషలోని కొత్తదనం, గొప్పతనాన్ని తెలుసు కోవడం, ఆ విధంగా వారికి ఆ తర్వాత ఎంతగానో ఉపయోగపడింది. దాని మూలంగానే వారు భారతదేశంలోనికి సంపూర్ణంగా చొచ్చుకొని వచ్చి అన్నాళ్లు రాజ్యమేల గలిగారు. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి ఆదే నేల, అదే గాలి, అదే ఆకాశం, కాని భాషల విషయంలో బెధమెందుకు ‘మేరా భారత్‌ ‌మహాన్‌’.

-డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

The post మణిపూర్‌ అగ్నికి ఆజ్యం ఆ రచనలే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గగన తలంలో మహిళా ‘శక్తి’
సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కొనే యుద్ధ విమానాల కాక్‌పిట్‌ ‌నుంచి దేశ రక్షణ వ్యూహాలను రచించే ఎయిర్‌ ‌హెడ్‌క్వార్టర్స్ ‌వరకు… నేడు భారత మహిళా శక్తి సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్క రిస్తోంది. నిన్నటివరకు కేవలం కొన్ని విభాగాలకే పరిమితమైన మహిళలు, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుతో ‘పర్మనెంట్‌ ‌కమిషన్‌’ ‌హక్కును సాధిం చుకుంటూ పురుషులతో సమానంగా దేశ సేవలో భాగస్వాములవుతున్నారు. మహిళా అధికారులు కీలకమైన పీఠాలను అధిరోహిస్తున్నారు. తాజాగా ఎయిర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌ ‌శక్తి శర్మ సాధించిన చారిత్రాత్మక విజయంతో రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది.

ఒకప్పుడు అసాధ్యం అనుకున్న రక్షణ రంగ శిఖరాలను భారత మహిళలు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ‘కంప్యూటరైజ్డ్ ‌పైలట్‌ ‌సెలెక్షన్‌ ‌సిస్టమ్‌’ ‌పరీక్షలను దాటుకుంటూ వాయుసేనలో ఫైటర్‌ ‌పైలట్లుగా దూసుకుపోతున్నారు. ఎయిర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌ ‌శక్తి శర్మ సెప్టెంబర్‌ 1, 2026‌న ఎయిర్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్‌ ‌చీఫ్‌ ఆఫ్‌ ‌ది ఎయిర్‌ ‌స్టాఫ్‌ ‌బాధ్యతలను స్వీకరించడంతో ఐఏఎఫ్‌ ‌చరిత్రలో అపూర్వ ఘట్టం నమోదైంది. భారత సాయుధ దళాలలో వైద్యేతర విభాగం నుండి టూ-స్టార్‌ ‌ర్యాంక్‌ అయిన ‘ఎయిర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌’ ‌పదవిని సాధించిన తొలి మహిళా అధికారిగా శక్తి శర్మ  సరికొత్త చరిత్ర సృష్టించారు.

భారత రక్షణ రంగంలో వైద్య విభాగం కాకుండా, ఇతర విభాగాల నుండి ‘ఎయిర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌’ ‌హోదాను అందుకున్న మొట్టమొదటి మహిళ… శక్తి శర్మ. జూన్‌ 18, 1994‌న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ ‌విద్యా విభాగంలో ఆమె నియమితులయ్యారు. దీనికి ముందు ఆమె ఎయిర్‌ ‌కమోడోర్‌ ‌హోదాలో కపుర్తలాలోని సైనిక్‌ ‌స్కూల్‌ ‌ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మున్ముందు వ•డు రక్షణ దళాల నుండి ఒక సైనిక్‌ ‌స్కూల్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి కూడా ఆమెయే కావడం విశేషం. భారతీయ మహిళాశక్తికి, రక్షణ రంగంలో వారి ఎదుగుదలకు ఈ నియామకం ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.

ఆకాశంలో సగం అనే నానుడికి అద్దంపడుతూ భారత మిలిటరీలో మెడికల్‌ ‌విభాగానికి చెందని ఒక మహిళా అధికారి టూ-స్టార్‌ ‌ర్యాంక్‌ ‌సాధించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పొలిటికల్‌ ‌సైన్స్‌లో పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేసిన శక్తి శర్మ, డిఫెన్స్ అం‌డ్‌ ‌స్ట్రాటజిక్‌ ‌స్టడీస్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ డిగ్రీని కూడా పొందారు. ఆర్మీ, నావీ, ఎయిర్‌ ‌ఫోర్స్ ‌త్రివిధ దళాల మొత్తంలో ఒక సైనిక్‌ ‌స్కూల్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన మొట్టమొదటి మహిళా అధికారిగా కూడా ఆమె గుర్తింపు పొందారు.

మహిళలు ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనులు నేడు సుసాధ్యం చేస్తున్నారు. భారత రక్షణ రంగంలోని వ•డు దళాలలో (ఆర్మీ, నావీ, ఎయిర్‌ ‌ఫోర్స్) ‌పురుషులతో సమానంగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.  భారత సాయుధ దళాల్లో అధికారిగా లేదా విధి నిర్వహణలో చేరడం అత్యంత కఠినమైన పక్రియ. యు.పీ.ఎస్‌.‌సి. నిర్వహించే ఎన్‌.‌డి.ఏ, సి.డి.ఎస్‌ ‌లేదా ఎఎఫ్‌ ‌సీఏటి వంటి కఠినమైన రాత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం మొదటి అడుగు. సర్వీస్‌ ‌సెలక్షన్‌ ‌బోర్డు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా 5 రోజుల పాటు జరిగే పక్రియలో అభ్యర్థి శారీరక, మానసిక కార్యకుశలత, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆర్మీ వైద్య పరీక్షలు అత్యంత ప్రమాణాలతో కూడుకుని ఉంటాయి. స్వల్ప ఆరోగ్య లోపాలు ఉన్నా తిరస్కరించే అవకాశం ఉంటుంది. అలాంటి ఎన్నోకఠిన సవాళ్లను అధిగమించి సైన్యంలో కీలకపదవిని లేదా స్థాయిని సాధించడం ద్వారా శక్తి శర్మ ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఆర్మీలో కీలక బాధ్యతలు వహించడమంటే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, దళాలను నడిపించే సామర్థ్యం వంటి ప్రత్యేకమైన నాయకత్వ ప్రతిభ కలిగి ఉండాలి. శిక్షణలో ప్రతిభ కనబరచడంతో పాటు బాధ్యతల్లో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, నిరంతర సాధన శక్తి శర్మను  ఉన్నత స్థానానికి చేర్చాయి.

ప్రస్తుతం శక్తిశర్మ సాధించిన పదవిని నిర్వర్తించడం కూడా ఆషామాషీ విషయం కాదు. భారత వైమానిక దళంలో ఎయిర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌ అనేది అత్యంత కీలకమైన టూ-స్టార్‌ ‌ర్యాంక్‌. ఆర్మీలోని ‘మేజర్‌ ‌జనరల్‌’, ‌నేవీలోని ‘రియర్‌ అడ్మిరల్‌’ ‌పదవులకు ఇది సమానం. ఈ స్థాయిలోని అధికారులు వైమానిక దళ వ్యూహాత్మక, నిర్వహణ, పరిపాలనా విభాగాను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి బాధ్యతలు ప్రధానంగా 3 విభాగాలుగా ఉంటాయి.

వ్యూహాత్మక, సైనిక బాధ్యతలు: ఎయిర్‌ ఆఫీసర్‌ ‌కమాండింగ్‌ (ఏఓసి) కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లోని ఎయిర్‌ ‌కమాండ్లకు, అడ్వాన్స్‌డ్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌కు నాయకత్వం వహిస్తారు.

యుద్ధ వ్యూహాల అమలు: ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థలు, ఫైటర్‌ ‌జెట్ల మోహరింపు, అత్యవసర సమయాల్లో వైమానిక దాడుల వ్యూహాలను పర్యవేక్షిస్తారు.

త్రివిధ దళాల సమన్వయం: ఆర్మీ, నేవీ అధికారు లతో కలిసి ఉమ్మడి సైనిక చర్యలు విజయవంతంగా జరిగేలా సమన్వయం చేసుకుంటారు.

ఎయిర్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌లో కీలక పదవులు:  అసిస్టెంట్‌ ‌చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌స్టాఫ్‌ : ‌ఢిల్లీలోని ఎయిర్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌లో ఎడ్యుకేషన్‌, ‌ట్రైనింగ్‌, ఇం‌టిలిజెన్స్, ఆపరేషన్స్ ‌లేదా ప్లానింగ్‌ ‌వంటి ప్రత్యేక విభాగాలకు హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

విధాన రూపకల్పన: ఎయిర్‌ ‌ఫోర్స్‌కు కావలసిన కొత్త సాంకేతికతలు, విద్యా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, వ్యూహాత్మక విధానాలను రూపొందిస్తారు.

శిక్షణ, విద్యా నిర్వహణ, శిక్షణా సంస్థల పర్యవేక్షణ: ఎయిర్‌ ‌ఫోర్స్ అకాడమీలు, సైనిక పాఠశాలలు, డిఫెన్స్ ‌విద్యా సంస్థల ప్రమాణాలను మెరుగుపరచడం.

సిబ్బంది నిర్వహణ: వేలాదిమంది సైనికులు, అధికారుల సంక్షేమం, క్రమశిక్షణ, వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని పర్యవేక్షించడం.

భారత సైన్యంలో చేరడమే ఒక పెద్ద సవాలు. అలాంటిది కీలక బాధ్యతలను చేపట్టడం అంటే సాధారణ విషయం కాదు. దీంతో సైన్యంలో చేరాలని కలలు కనే వేలాదిమంది యువతకు, ముఖ్యంగా మహిళలకు శక్తిశర్మ సాధించిన విజయం స్ఫూర్తినిస్తోంది.

-జయశ్రీ ఆచంట, సీనియర్‌ ‌జర్నలిస్ట్

The post గగన తలంలో మహిళా ‘శక్తి’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పురోహితులు లేరు.. మంత్రాలు లేవు.. నల్లపూసల తాడుతోనే పెళ్లి! గిరిజనుల ప్రత్యేక వివాహ సంప్రదాయం
అడవి తల్లి ఒడిలో ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల జీవన విధానంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. వారి ఆచారాలు, సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా, నిరాడంబరంగా ఉంటాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లా  మన్యం ప్రాంతాల్లో కొండరెడ్డి గిరిజనుల వివాహ సంప్రదాయం ప్రత్యేకంగా నిలుస్తుంది.

పురోహితులు ఉండరు.. వేద మంత్రాలు వినిపించవు.. భారీగా బాజా భజంత్రీలు, డీజేలు, అలంకరణలు కనిపించవు. పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా వరుడు వధువు మెడలో నల్లపూసల తాడు కడితే వివాహం పూర్తయినట్లే. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొండరెడ్డి గిరిజనులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

మేనరికపు వివాహాలకే తొలి ప్రాధాన్యం

కొండరెడ్డి గిరిజనుల వివాహాల్లో మేనరికపు సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అబ్బాయి, అమ్మాయి పరస్పరం ఇష్టపడిన తర్వాత ఇరువర్గాల పెద్దలు, బంధువులు, గ్రామ పెద్దలు ఒకచోట చేరుతారు.

వధువు ఇంటి వద్ద వివాహ ప్రకటన చేస్తారు. అనంతరం వరుడికి నల్లపూసల తాడును అందిస్తారు. వరుడు దానిని వధువు మెడలో కట్టడంతో వివాహ తంతు పూర్తవుతుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు, బంధువులు చప్పట్లతో నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.

కట్నకానుకలు.. ఆర్భాటాలకు దూరం

ప్రస్తుత కాలంలో వివాహాలు భారీ ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలుగా మారుతున్నప్పటికీ, కొండరెడ్డి గిరిజనుల సంప్రదాయ వివాహాల్లో ఆర్భాటానికి పెద్దగా చోటు లేదు.కట్నకానుకలు ఉండవు. పురోహితుల అవసరం ఉండదు. బంగారు తాళిబొట్టుకు బదులుగా నల్లపూసల తాడునే ఉపయోగిస్తారు. డీజేలు, భారీ అలంకరణలు, ప్రత్యేక మండపాలు, పూజారి ఖర్చులు వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఉండదు.

ఇప్పసారా విందు.. డోలు కొయ్యల నృత్యాలు

కొండరెడ్డి గిరిజనుల వివాహ వేడుకలు సాధారణంగా రాత్రి సమయంలో జరుగుతాయి. వివాహ విందులో వారి స్థానిక ఆహార సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.అడవిలో లభించే ఇప్పపువ్వులతో తయారు చేసే ఇప్పసారా, ఇప్ప చిగురుతో రూపొందించే వంటకాలను విందులో అందిస్తారు. వివాహ వేడుకలు, విందు సందర్భంగా సంప్రదాయ ‘డోలు కొయ్యల’ వాయిద్యాల నడుమ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందిస్తారు.

వధూవరులకు కానుకల్లోనూ ప్రత్యేకత

వధూవరులు మండపం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కూడా కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. గ్రామ పెద్దలు, పేరంటాళ్లు, వరుడి వైపు పెద్దలు తమ స్థాయికి అనుగుణంగా రూ.20 నుంచి రూ.100 వరకు కానుకలు అందిస్తారు.

కొన్ని సందర్భాల్లో వధూవరులు వెళ్లే దారిలో కొందరు వ్యక్తులు నేలపై పడుకుంటారు. వారికి కానుక ఇచ్చిన తర్వాతే వారు పైకి లేస్తారు. మండపం నుంచి ఇంటికి చేరే వరకు ఈ ఆచారం ఐదుసార్లు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. సంప్రదాయ పాటలు పాడే పేరంటాళ్లకు కూడా రూ.20 నుంచి రూ.50 వరకు కానుకలు ఇస్తారు.

పెళ్లి అనంతరం వధూవరులు ఇంటికి వెళ్లే మార్గంలో వాగులు ఎదురైతే మరో ఆసక్తికరమైన సంప్రదాయం కనిపిస్తుంది. గ్రామస్తులు వధూవరులను తమ భుజాలపై ఎత్తుకుని వాగును దాటిస్తారు. ప్రకృతితో ముడిపడిన తమ జీవన విధానానికి ఈ ఆచారం ప్రతిబింబంగా నిలుస్తుందని స్థానికులు చెబుతున్నారు.

‘మేనరికపు పెళ్లిళ్లే ఎక్కువ’

>“మా కొండరెడ్డ్ల సంస్కృతిలో ఎక్కువగా మేనరికపు పెళ్లిళ్లే జరుగుతాయి. కట్నకానుకలు, పురోహితులు, మేళతాళాల ఆర్భాటం ఉండదు. వరుడు వధువు మెడలో నల్లపూసల తాడు వేస్తే పెళ్లయిపోయినట్లే. మేనరికం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ఎక్కడో ఒక శాతం మాత్రమే సమస్యలు కనిపిస్తాయి.”— వేట్ల రాజారెడ్డి, కొయిదా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, బుట్టాయగూడెం**

‘తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయం’

> **“అబ్బాయి, అమ్మాయి ఇష్టపడిన తర్వాత ఇరువైపుల పెద్దలు, గ్రామస్థులు ఒకచోట చేరి వివాహ ప్రకటన చేస్తారు. నల్లపూసల తాడు మెడలో పడటమే ఏడేడు జన్మల బంధంగా భావిస్తాం. మా ఆచారంలో నిరాడంబరత, పవిత్రత ఉన్నాయి. ఇది తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయం.”— కెచ్చెల చిన్నంరెడ్డి, రేగులపాడు, బుట్టాయగూడెం మండలం

ఆచారమే గుర్తింపు.. నిరాడంబరతే ప్రత్యేకత

కొండరెడ్డి గిరిజనుల వివాహ సంప్రదాయం వారి జీవన విధానం, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. భారీ ఖర్చులు, ఆర్భాటాలకు దూరంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం, సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు నిర్వహించడం వారి సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

The post పురోహితులు లేరు.. మంత్రాలు లేవు.. నల్లపూసల తాడుతోనే పెళ్లి!  గిరిజనుల ప్రత్యేక వివాహ సంప్రదాయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణపయ్యపై అమితమైన భక్తి- ఇంట్లోనే గణేశ్ మ్యూజియం ఏర్పాటు
వినాయకుడిపై ఉన్న అమితమైన భక్తితో తన ఇంటినే ‘గణేశ్ మ్యూజియం’గా మార్చేశారు ఓ వ్యక్తి. అందులో గత 40 ఏళ్లుగా ఆయన సేకరించిన గణేశుడి విగ్రహాలు, అలాగే గణపయ్య పూజకు సంబంధించిన వివిధ వస్తువులు ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా ఇంట్లో ఉన్న గణేశ్ మ్యూజియంను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఈ స్టోరీలో గణేశ్ మ్యూజియం ఎక్కడ ఉంది? అందులో ఉన్న గణపయ్య విగ్రహాలు ఎన్ని? దాని యజమాని ఎవరు? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి.

40 ఏళ్లుగా సేకరణ

గుజరాత్‌ రాష్ట్రం జామ్‌నగర్‌‌లోని పంచేశ్వర్ టవర్ ప్రాంతానికి చెందిన దిలీప్ ధ్రువ్‌కు విఘ్నేశ్వరుడంటే అమితమైన భక్తి. అందుకే గత 40 ఏళ్లుగా దిలీప్ గణేశుడి విగ్రహాలు, ఆయన పూజకు సంబంధించిన ఇతర వస్తువులను సేకరిస్తున్నారు. వీటన్నింటినీ తన ఇంట్లోనే భద్రంగా ఉంచారు. అందుకోసం తన ఇంటినే ఏకంగా గణేశ్ మ్యూజియంగా మార్చేశారు. దీంతో దిలీప్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

తన విశిష్టమైన సేకరణ చాలా వైవిధ్యమైనదని గణేశ్ మ్యూజియం యజమాని దిలీప్ ధ్రువ్ వివరించారు. తన దగ్గర వెండి, చెక్క, గాజు, థర్మోకోల్ వంటి వివిధ పదార్థాలతో చేసిన గణేశుడి విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ విగ్రహాలు వివిధ పరిమాణాలలో ఉన్నాయని చెప్పారు. వాటిలో అతి చిన్న బొజ్జ గణపతి విగ్రహం కేవలం రెండు అంగుళాల ఎత్తైనది కాగా, అతి పెద్దది 2.5 అడుగుల ఎత్తైన విగ్రహమని స్పష్టం చేశారు. ఎంతో ఓపికతో గత 40 ఏళ్లుగా దాదాపు 3,000 పైగా వినాయకుడి విగ్రహాలు, కళాఖండాలను సేకరించానని అన్నారు.

చూపరులను ఆకట్టుకుంటున్న గణపయ్య విగ్రహాలు

దిలీప్ ధ్రువ్ విస్తృతమైన సేకరణలో గణేశుడి విగ్రహాలతో పాటు ఇతర సామగ్రి కూడా ఉంది. గత 40 ఏళ్లలో దిలీప్ 800 గణపయ్య విగ్రహాలను సేకరించారు. అలాగే 200 విఘ్నేశ్వరుడి కీచైన్‌లు, 500 గణపతి బప్పా ఫొటోలు, అలాగే గణేశుడికి సంబంధించిన పుస్తకాలు, ఇంకా అనేక ఇతర వస్తువులను సేకరించి తన ఇంట్లో భద్రంగా ఉంచారు. ఎంతో కాలంగా పోగుచేసిన ఈ అద్భుతమైన సేకరణను తనకే పరిమితం చేసుకోలేదు. ప్రజలను వీటిని చూసేందుకు ప్రజలను సైతం అనుమతిస్తున్నారు. అందుకే ఈ సేకరణను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు దిలీప్ ఇంటికి వస్తున్నారు. అక్కడ గణపయ్య విగ్రహాలు, పూజకు సంబంధించిన సామగ్రిని చూసి తరిస్తున్నారు.

సాధారణంగా ప్రజలు వినాయక చవితి నాడు విగ్రహాలను తమ ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. అనంతరం గణపయ్యకు పూజ చేస్తారు. ఆపై నిమజ్జనం చేస్తారు. అయితే దిలీప్ విగ్రహ నిమజ్జనం అనే ఆచారాన్ని నమ్మరు. తన ఇష్ట దైవం (గణనాథుడు) విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా జాగ్రత్తగా భద్రపరుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయనే ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అలాగే కొందరు ఇచ్చిన విగ్రహాలను దాస్తున్నారు. అవే ఓ పెద్ద సేకరణ మారి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

విదేశాల నుంచి విగ్రహాల సేకరణ

గత 40 ఏళ్లుగా దిలీప్ అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్‌ సహా పలు దేశాల నుంచి గణేశ్ కళాఖండాలను వ్యక్తిగతంగా సేకరిస్తున్నారు. ఆయన సేకరణలో గణేశుడు క్రికెట్ ఆడటం, స్కూటర్ నడపడం, వివిధ భంగిమలలో సంగీతం వాయించడం వంటి దైనందిన జీవితంలోని పలు కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు చూపించే ప్రత్యేకమైన విగ్రహాలు ఉన్నాయి. అలాగే గణేశుడి ఫొటో ఉన్న చెక్క ఫ్రేములూ, కీచైన్‌లు, పెన్ స్టాండ్‌లు, పేపర్‌వెయిట్‌లు, గోడ గడియారాలు, గుడి గంటలు, పురాతన తాళాలు ఉన్నాయి.

5000 విగ్రహాలు సేకరణ

అలాగే మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌‌కు చెందిన రాజ్‌ కుమార్‌ షా కూడా విఘ్నేశ్వరుడిపై అమితమైన భక్తితో ఇంటినే మ్యూజియంలా మార్చేశారు. మొదట దేవతామూర్తుల గ్రీటింగ్‌ కార్డులతో మొదలై, ఆ తర్వాత గణేశ్‌ విగ్రహాలను సేకరించడం ప్రారంభించినట్లు రాజ్ కుమార్ చెప్పారు. గత 20 ఏళ్ల నుంచి సుమారు 5000 విగ్రహాలను సేకరించినట్లు వెల్లడించారు. బైక్‌ నడుపుతున్నట్లుగా, చెస్‌ ఆడుతున్నట్లుగా, హార్మోనియం వాయిస్తున్నట్లుగా వివిధ రూపాల్లో ఉన్న గణేశ్‌ ప్రతిమలు రాజ్‌కుమార్‌ ఇంట్లో ఉన్నాయి.

The post గణపయ్యపై అమితమైన భక్తి- ఇంట్లోనే గణేశ్ మ్యూజియం ఏర్పాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఓంకారం.. ఆది నాదం నుంచి ఆత్మానుభూతి వరకు
ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఓంకారానికి ప్రత్యేక స్థానం.. అ, ఉ, మ అక్షరాల్లో దాగిన తత్వం ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఓంకారం (ఓం) అత్యంత పవిత్రమైన నాదంగా భావిస్తారు. శరీరం, మనసు, ఆత్మలను ఏకతాటిపైకి తీసుకువచ్చే దివ్యశక్తిగా దీనిని సాధకులు విశ్వసిస్తారు. కనిపించే ఈ జగత్తు వెనుక ఉన్న అదృశ్య శబ్ద స్వరూపమే ఓంకారం అని ఉపనిషత్తులు తాత్త్వికంగా వివరిస్తాయి.

మనిషి ఏ వస్తువునైనా ఒక శబ్ద సంకేతం ద్వారా గుర్తిస్తాడు. ఆ శబ్దమే ‘పదం’, అది సూచించే వస్తువు ‘పదార్థం’. ఒక ప్రతీక లేకుండా ఏ విషయాన్నీ సూచించడం సాధ్యం కాదు. ఈ భావనను ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే.. సమస్త సృష్టికి అదృశ్య శబ్ద స్వరూపంగా ఓంకారాన్ని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి.

అ, ఉ, మ.. ఓంకారంలోని మూడు మాత్రలు

‘ఓం’ అనే ప్రణవ నాదం అ, ఉ, మ అనే మూడు ధ్వనుల సమ్మేళనంగా చెప్పబడుతుంది. ఇవి మానవ చైతన్యంలో ఉన్న మూడు ప్రధాన అవస్థలకు ప్రతీకలుగా ఉపనిషత్తులు వివరిస్తాయి.

‘అ’ – జాగ్రదవస్థకు సంకేతం.

‘ఉ’ – స్వప్నావస్థకు సంకేతం.

‘మ’ – సుషుప్తావస్థకు సంకేతం.

ఈ మూడు అవస్థలకు అతీతమైన తురీయావస్థ సంపూర్ణ ఓంకార తత్వానికి ప్రతీకగా భావిస్తారు.

జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల పరిధిని దాటి ఉండే తురీయ స్థితి ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన అత్యున్నత చైతన్య స్థితిగా ఉపనిషత్తుల తత్వంలో వివరించబడింది.

ప్రణవోపాసన అంటే ఏమిటి?

నిశ్చలంగా, ఏకాగ్రతతో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేయడాన్ని ప్రణవోపాసనగా పిలుస్తారు. ఓంకార నాదంపై మనసును కేంద్రీకరించడం ద్వారా చంచలమైన ఆలోచనలు క్రమంగా తగ్గి ఏకాగ్రత, ప్రశాంతత కలుగుతాయని యోగసంప్రదాయం చెబుతుంది.

ప్రాణాయామంతో శ్వాసను నియంత్రిస్తూ ఓంకారాన్ని ఉచ్చరించడం కూడా యోగసాధనలో ఒక ముఖ్యమైన విధానంగా కనిపిస్తుంది. సాధకుడి దృష్టిని అంతర్ముఖం చేసి ఆత్మతత్వాన్ని అన్వేషించే సాధనగా దీనికి ప్రాధాన్యం ఉంది.

ఉపనిషత్తుల్లో ఓంకార తత్వం

ఓంకారానికి సంబంధించిన లోతైన తాత్త్విక వివరణలు ఉపనిషత్తుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా మాండూక్య ఉపనిషత్ ఓంకారంలోని అక్షరాలను చైతన్యంలోని వివిధ స్థితులతో అనుసంధానిస్తూ దాని తత్వాన్ని వివరిస్తుంది.

అలాగే ప్రశ్నోపనిషత్లో ప్రణవోపాసనకు సంబంధించిన వివరణలు ఉన్నాయి. ఓంకారాన్ని వివిధ స్థాయుల్లో ఉపాసించే సాధకుడికి లభించే ఆధ్యాత్మిక ఫలితాలను అక్కడ వివరించారు.

వేదాల్లో ఓంకారానికి ప్రత్యేక స్థానం

వేద సంప్రదాయంలో ఓంకారాన్ని ప్రణవం, ఆది నాదం వంటి భావాలతో అనుసంధానిస్తారు. మంత్రోచ్చారణ, వేదాధ్యయనం, ఆధ్యాత్మిక కర్మకాండల్లో ఓంకారానికి విశిష్ట స్థానం ఉంది.

సామవేద సంప్రదాయంలోనూ ఓంకార ధ్వనికి ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తుంది. అధర్వణవేద సంప్రదాయంలో కూడా ఓంకారానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించే భావనలు ఉన్నాయి.

పురాణాల్లో ఓంకారం.. త్రిమూర్తుల తత్వం

పురాణ సాహిత్యంలో ఓంకారాన్ని దైవతత్వానికి ప్రతీకగా వివరిస్తారు. ముఖ్యంగా అ, ఉ, మ అనే మూడు ధ్వనులను సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలుగా, త్రిమూర్తుల తత్వంతో అనుసంధానించే వివరణలు కనిపిస్తాయి.

శైవ సంప్రదాయంలో ఓంకారానికి మరింత ప్రత్యేకత ఉంది. శివపురాణం సహా శైవ సాహిత్యంలో ప్రణవ నాదాన్ని పరమశివ తత్వంతో అనుసంధానించే భావనలు ఉన్నాయి. ఓంకార ధ్యానం, నాదోపాసన ద్వారా శివతత్వాన్ని అనుభవించవచ్చనే ఆధ్యాత్మిక విశ్వాసం శైవ సంప్రదాయంలో ఉంది.

భగవద్గీతలోనూ ఓంకార ప్రస్తావన

భగవద్గీతలో కూడా ఓంకారానికి విశిష్ట స్థానం ఉంది. ఆధ్యాత్మిక కర్మలను, యజ్ఞాలను, దానాలను శాస్త్రోక్తంగా నిర్వహించే సందర్భంలో ‘ఓం’ అనే ప్రణవాక్షరాన్ని ప్రస్తావిస్తుంది. అలాగే పరమాత్మ తత్వానికి సంబంధించిన వివరణల్లోనూ ఓంకారానికి ప్రాధాన్యం కనిపిస్తుంది.

యోగసాధనలో ఓంకార నాదం

ధ్యానం, ప్రాణాయామం, నాదోపాసన వంటి ఆధ్యాత్మిక సాధనల్లో ఓంకారాన్ని ఉపయోగించడం భారతీయ యోగసంప్రదాయంలో ప్రాచీన పద్ధతి. దీర్ఘంగా ‘ఓం’ను ఉచ్చరిస్తూ శ్వాసపై, ధ్వనిపై, దాని ప్రకంపనపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనస్సును అంతర్ముఖం చేసే సాధనగా దీనిని భావిస్తారు.

అయితే ఓంకార ధ్యానం ద్వారా కలిగే ఆధ్యాత్మిక అనుభూతి ప్రతి సాధకుడి అనుభవం, విశ్వాసం, సాధనా విధానంపై ఆధారపడి ఉంటుంది.

స్తోత్రాలు, భక్తి సాహిత్యంలో ఓంకారం

ఓంకార మహిమ భక్తి సాహిత్యంలోనూ విస్తృతంగా కనిపిస్తుంది. ‘ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః…’ అంటూ శివషడక్షరీ స్తోత్రం ప్రణవ నాదాన్ని యోగుల ధ్యాన విషయంగా స్తుతిస్తుంది.

అలాగే అన్నమయ్య కీర్తనల్లోనూ ఓంకార తత్వం కనిపిస్తుంది. ‘ఓంకార రూప రామ పురుష సత్యకామ…’ అంటూ ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రణవ తత్వంతో అనుసంధానిస్తూ కీర్తించారు.

ఓం.. ఒక శబ్దం మాత్రమే కాదు

వేదాలు ఓంకారాన్ని ఆది నాదంగా ప్రతిపాదిస్తే, ఉపనిషత్తులు దాని వెనుక ఉన్న తాత్త్విక భావాన్ని లోతుగా వివరిస్తాయి. పురాణాలు దాన్ని దైవతత్వంతో అనుసంధానిస్తాయి. యోగసంప్రదాయం ధ్యానం, నాదోపాసనకు మార్గంగా చూస్తుంది. భక్తి సాహిత్యం దాన్ని భగవంతుని స్వరూపంగా కీర్తిస్తుంది.

అందుకే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘ఓం’ కేవలం ఒక శబ్దం కాదు.. సృష్టి, చైతన్యం, పరమాత్మ తత్వాలను అనుసంధానించే పవిత్ర ప్రతీకగా భావిస్తారు.

అజ్ఞానం నుంచి జ్ఞానానికి.. చంచలత్వం నుంచి ప్రశాంతతకు.. బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖ ప్రయాణానికి దారి చూపే ఆధ్యాత్మిక సాధనగా ఓంకారానికి తరతరాలుగా ప్రత్యేక స్థానం కొనసాగుతోంది.

The post ఓంకారం.. ఆది నాదం నుంచి ఆత్మానుభూతి వరకు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైదిక మార్గం, జాతీయతా భావం, దళిత స్పృహల త్రివేణీ సంగమం
( సెప్టెంబర్ 19 –  బోయి భీమన్న జయంతి )

కుల మత వర్గ విభేద రహితమైన భారత జాతి ఆవిర్భావమే ధ్యేయంగా సాహిత్య సృజన చేసిన జాతీయవాది బోయి భీమన్న. తాను పుట్టిపెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవంతో జీవించాలన్న ఆకాంక్ష జాతీయవాదంలో ఉంటుందని వివరించి, జీవితాంతం జాతీయవాదిగానే ఉన్న సాహిత్యకారుడు బోయి భీమన్న. కుల వ్యవస్థను నిరసిస్తూనే వైదిక జీవన విధానాన్ని పాటించాలని పిలుపునిచ్చిన స్వతంత్ర సృజనశీలి ఆయన.

బోయి భీమన్న 1911 సెప్టెంబర్ 19న ప్రస్తుత కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో ఒక నిరుపేద హరిజన కుటుంబంలో పుల్లయ్య, నాగమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వేదాంత తత్వగీతాలు, తల్లి పాడే ఏలపాటలు, తుమ్మెదపాటలతో భీమన్నమౌలిక వేదాంత ఆలోచనాపరుడిగా, సౌందర్యోపాసకుడిగా పెరిగారు. జాతీయోద్యమ నేపథ్యంతో సామాజిక చైతన్యాన్ని సంతరించుకున్నారు. ఆయన పాత్రికేయుడిగా, ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ అనువాదశాఖ సంచాలకుడిగా, శాసనమండలి సభ్యుడిగా విభిన్న హోదాల్లో పనిచేసారు. భావకవిత్వాన్ని సృజిస్తూనే సమాజంలోని అంతరాలను తొలగించే చైతన్యశీలమైన సాహిత్యాన్నీ సృష్టించారు.

బోయి భీమన్న తెలుగు సాహిత్యంలో గొప్ప ప్రయోగవాది, సిద్ధాంతకర్తగా విమర్శకుల మెప్పు పొందారు. అద్వైత విశిష్టాద్వైతాలకు బదులుగా ‘రసాద్వైతాన్ని’, సోషలిజానికి ప్రతిగా ‘శివ సామ్యవాదాన్ని’, వర్ణ వర్గ వ్యవస్థలకు బదులుగా ‘వన్య వ్యవస్థ’నూ ప్రతిపాదించి తన రచనల్లో వాటికి విస్తృత ప్రచారం కల్పించారు. బ్రిటిష్ పాలనాకాలంలో నాటి సాహితీవేత్తలు జాతీయోద్యమ స్పృహతో రచనలు చేస్తున్నవేళ బోయి భీమన్న భారతదేశపు ఆధ్యాత్మిక పౌరాణిక సాంస్కృతిక వారసత్వానికి పునాదులు వేసింది దళితులేనంటూ రచనలు సాగించారు. అసలైన భారతీయ వారసత్వ గరిమను, మూలవాసుల విశిష్టతనూ వెల్లడించారు. పౌరాణిక పద్య నాటకాలే కాక… సాంఘిక నాటకాలు కూడా రచించి వాటిద్వారా దళితుల్లో విద్యా చైతన్యాన్ని, రాజ్యాధికార భావననూ పెంపొందింపజేసారు. భీమన్న తన సాహిత్య సృజనలో మొదటినుంచీ దళిత స్పృహ చూపించారు. అంబేద్కర్ రచనను ‘కుల నిర్మూలన’ పేరుతో అనువదించారు. ఆయన రచించిన ‘ధర్మం కోసం పోరాటం’ గ్రంథం అంబేద్కర్ సిద్ధాంతాలకు దర్పణంగా నిలిచింది. కుల సమస్య తీవ్రత, దళితుల స్వీయ ఉద్ధరణ, వర్గ కుల పోరాటాల వైఖరి, సంస్కరణ ఉద్యమాల వైఫల్యం, ప్రజాస్వామిక సోషలిజం వంటి అంశాలను చర్చించింది. బోయి భీమన్న వందకు పైగా పాటల ద్వారా అంబేద్కర్ ప్రబోధాలను తెలుగువారికి అందించారు.

అదే సమయంలో బోయి భీమన్న వైదిక భావజాలాన్ని సమర్థించారు. ‘‘గో బ్యాక్ టు వేదాస్’’ అని పిలుపునిచ్చారు. వేదకాలంలో కులం లేదని, వృత్తిగతంగానే మనిషికి గుర్తింపు ఉండేదనీ ఆయన భావన. వైదిక సమాజ వైభవాన్ని అంగీకరిస్తూనే అంబేద్కర్ తాత్విక చేతనను ప్రచారం చేసారు. కేవలం దళిత చైతన్యం దగ్గరే ఆగిపోకుండా మానవతావాదం, ప్రేమతత్వం, జాతీయవాద దృక్పథం, ప్రగతిశీల దృష్టితో సాహితీ వ్యవసాయం చేసారు. మాల మాదిగల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ‘మామాలు’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు వంటివారు దళితులే కాబట్టి వారు రచించిన రామాయణ భారత భాగవతాదులను తమవేనని చాటారు. కర్మసిద్ధాంతం ప్రకారం వర్ణవివక్ష పాటించకూడనిది అంటూ ‘జన్మాంతర వైరం’ అనే కావ్యం రచించారు. కులనిర్మూలన వేదవిహిత కార్యంగా ఉండాలని ప్రతిపాదించిన విశిష్ఠ సాహితీమూర్తి ఆయన.

బోయి భీమన్న రచనలు సామాజిక సమరసతకు నిలువెత్తు నిదర్శనాలు. సమాజ సంస్కరణకు మార్గదర్శకాలు. అందుకే ఆయనను కళాప్రపూర్ణ, సాహిత్య అకాడెమీ పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో గౌరవించింది. సుమారు డెబ్భై రచనలు చేసిన బోయి భీమన్న వ్యక్తిత్వం, సాహితీ మూర్తిమత్వం తెలుగువారందరికీ ఆదర్శప్రాయం.

The post వైదిక మార్గం, జాతీయతా భావం, దళిత స్పృహల త్రివేణీ సంగమం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పురాణాల్లో జంతువుల పవిత్ర ప్రస్తావనలు
హిందూ పురాణాల్లో పలు రకాలైన జంతువుల ప్రస్తావన ఉండడమే కాకుండా వాటి ప్రాముఖ్యత కూడా విస్తారంగా వర్ణించారు. ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడనే భావన కలిగిన హిందూ మతం ఓ మహోన్నత జీవ వైవిధ్య పరిరక్షణ మహా మంత్రాన్ని అందించింది. అనేక రకాల జంతువులను దేవతా రూపాలుగా కొలవడం కూడా జరుగుతోంది. సాధారణ చిన్న మూషికం నుంచి భయానక పులి, సింహం లాంటి వన్యప్రాణుల వరకు అన్ని రకాల జంతువుల ప్రస్తావన ఉంది. మనకు అత్యంత విశ్వాసపాత్రమైన కుక్క లేదా పిల్లి నుంచి పక్షులు, గోమాత, ఏనుగు వరకు అన్ని జంతువుల పాత్రలు మన పురాణ ఇతిహాసాల్లో ప్రస్తావించారు.

హిందూ సమాజంలో జంతువులు జీవితాల్లో భాగం అయిపోయాయి. ‘సర్వప్రాణి సేవయే మాధవ సేవ’ అనే నినాదం మన జీవనవిధానంలో ఇమిడిపోయింది. పలు రకాల జంతువులు దేవుళ్లు, దేవతలకు వాహనాలుగానే కాకుండా కొన్ని వారి సేవలో పునీతమయ్యాయి. మన సంస్కృతిలో జంతువులను జ్ఞానం, విశ్వాసం, భక్తికి ప్రతిరూపాలుగా భావిస్తు న్నాం. హిందూపురాణాలు, వేదాలు, ఇతిహాసాల్లో పేర్కొన్న కొన్ని జంతువుల గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపాలకుడిగా కృష్ణయ్య గోవుల కాపరిగా మారిపోయాడు.

వినాయకుడి వాహనంగా ఎలుక :  ఆది దేవుడైన గణేశుని వాహనంగా ఎలుక లేదా మూషికాన్ని చూస్తున్నాం. వినాయకున్ని మూషిక వాహనుడిగా పిలుస్తాం. చిన్న ఆకారం కలిగిన ఎలుకపై భారీ వినాయకుడు స్వారీ చేయడం వెనుక పరమార్థానికి వివరణ ఉంది. కోరికలకు చిహ్నంగా భావించే చిట్టి ఎలుక మన మనసులో దొంగచాటుగా దూరి మనల్ని పక్కదారి పట్టిస్తుందని పేర్కొన్నారు. గణేశుడు తన కోరికలను నియంత్రించుకోవడానికి కోరిక అనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆయన వాహనంగా భక్తుల పూజలందుకుంటున్నది ఈ మూషికం.

శ్రీ విష్ణువు వాహనం – గరుత్మంతుడు :  విష్ణువుకు సేవ చేస్తూ అత్యంతవేగంగా ప్రయాణించే దివ్యపక్షి రాజు గరుడుడు. అత్యంత శక్తివంతమైన పక్షిగా గురుత్మంతుడికి పేరుంది. వేగంగా, అతిబలశాలిగా పేరొందిన గరుడ పక్షిని చెడుపై పోరాడగల యోధుడిగా వర్ణించారు. గురుడు తన తల్లిని పాముల బారిన పడకుండా రక్షించడానికి చేసి ప్రయత్నంలో తన యజమానిని రక్షించడానికి, సత్యానికి ప్రతీకగా చెబుతారు.

శివుడి వాహనం – నంది, మెడలో నాగుపాము :  శివుడి ధర్మం, బలానికి ప్రతిరూపం వృషభం. మహాశివుడి అత్యంత విశ్వాసపాత్రమైన సేవకుడిగా నందిని భావిస్తారు. శివుడి ముందు గంభీరంగా కూర్చొని ఉన్న నంది తన ప్రభువును కంటికి రెప్పలా కాపాడుకుంటూ శివ రక్షణకు సిద్ధంగా ఉండడం చూస్తున్నాం. అత్యంత శివభక్తుడైన నంది భక్తిని మెచ్చి తన వాహనంగా చేసుకున్నాడని మన పురాణాలు వెల్లడిస్తున్నాయి. శక్తి, సంయమనం, సత్యం, ధర్మం, న్యాయం, క్రమశిక్షణలకు మారు పేరుగా నందిని పూజిస్తున్నాం. నందీశ్వరుడి చెవుల్లో చెప్పిన కోరికలను శివుడు వింటాడని కూడా నమ్మకం ఉండడం విశేషం. శివుడి మెడలో ఉండే నాగుపాముకు వాసుకి అని పేరు. క్షీరసాగర మథనంలో వాసుకిని మంధర పర్వతానికి తాడుగా వాడిన కథ మనకుతెలుసు. వాసుకి చూపిన భక్తికి మెచ్చి శివయ్య తన మెడలో నాగుపాముకి స్థానం కల్పించాడు. శివయ్య మెడ చుట్టు మూడుచుట్టులుగా అమర్చిన నాగుపాము భూత భవిష్యత్‌ ‌వర్తమానమనే మూడు కాలాలను సూచిస్తున్నది. పాము కుబుసం విడిచినట్లు మనిషి కూడా పుట్టుక, మరణం, పునర్జన్మ అనే చక్రంలో సాగిపోతున్నాడని అర్థం చేసుకోవాలి.

విష్ణువు పాన్పు – ఆదిశేషుడు :  ఆదిశేషుడు తన పడగపై భూమిని మోస్తాడు. భగవాన్‌ ‌విష్ణువు విశ్రాంతి తీసుకునే పానుపుగా శేషుడు సేవలు అందిస్తున్నాడు. స్థిరత్వం, అనంతతత్వాలకు ప్రతీక అయిన ఆదిశేషుడు చూడడానికి కొంత భయంకరంగా కనిపిస్తాడు.

రామ భక్తుడి వానర రూపం – హనుమంతుడు :  శ్రీరామాయణంలో అద్వితీయ భక్తికి చిహ్నంగా హనుమంతుడిని భావిస్తున్నాం. శక్తి, యుక్తి, భక్తి, స్వామిపై చూపిన అవ్యాజమైన ప్రేమ లాంటి విలక్షణ గుణాలు హనుమంతుడిని దేవుడిగా నిలిపాయి. తన ఇష్ట దైవమైన రాముని సేవలో హనుమ చూపిన భక్తి అనిర్వచనీయం. నిజమైన విధేయత, నిస్వార్థ సేవ, భక్తికి సజీవ సాక్ష్యంగా వానరరూపంలో ఉన్న ఆంజనేయుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు.

జాంబవంతుడిగా ఎలుగుబంటి :  రామాయణంలో మరో విలక్షణ పాత్ర ఎలుగు బంటి రూపంలో ఉన్న జాంబవంతుడు. మహాభారతంలో కూడా ప్రస్తావించిన జాంబవంతుడు అత్యంత శక్తివంతుడు. రాముడికి కూడా సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. భారతంలో శ్రీ కృష్ణుడిని కూడా కలిసిన సందర్భం ఉంది.

యుధిష్టిరుడి విశ్వాసం పొందిన కుక్క :  మహాభారత కథలో యుధిష్టిరుని వెంట కడదాక ఉన్నది కుక్క మాత్రమే. యుధిష్టిరుడు స్వర్గద్వారం వద్దకు చేరి తన వెంట వచ్చిన కుక్కను వెనక్కి వెళ్లమంటాడు. ఆ శునకం ధర్మ దేవతగా మారి నిజరూపం ధరించి, వాస్తవం వెల్లడిస్తుంది.

సరస్వతీ దేవి వాహనం – హంస :  సృజనాత్మకత తెలివితేటలు, స్వీయ-నియంత్రణ, అందం, ఆకర్షణకు చిహ్నం అయిన హంస జ్ఞానదేవత సరస్వతికి వాహనంగా ముడిపెట్టారు. హంస రంగు రంగుల ఈకలు సమృద్ధిని సూచిస్తాయి. యుద్ధ దేవత, శివ-పార్వతుల కుమారుడైన కార్తికేయునికి వాహనంగా నెమలి ఉంటుంది. ఈ దైవస్వరూప పక్షి అపారశక్తికి, అద్వితీయ భక్తికి ప్రతిరూపంగా నమ్ముతున్నాం.

దుర్గా దేవి వాహనం – సింహం :  అడవికి రాజు సింహం. అత్యంత బలమైన సింహాన్ని నరసింహ అవతారంగా కొలుస్తున్నాం. నిర్భయత్వం, గంభీరరూపం చెడును అంతం చేసే సామర్థ్యం కలిగిన సింహం వాహనంపై దుర్గాదేవి దర్శనం ఇస్తుంది. దుష్ట శక్తులు దీని ముందు నిలబడలేవు.

లక్ష్మీ దేవి వాహనం- గుడ్లగూబ :  ధనం, శ్రేయస్సుకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి వాహనంగా తెల్ల గుడ్లగూబ. జ్ఞాన అవగాహనలకు చిహ్నమైన గుడ్లగూబ కూడా మన మనసుల్లో భక్తి భావనలను రెట్టింపు చేస్తున్నది.

ఐరావతం : ఇంద్రుడి ఏనుగు తెల్లని రంగులో మేఘాల రూపంలో ఐరావతం అనే పేరుతో కీర్తి అందుకుంది.

కామధేనువు :  సురభి అనే కామధేనువు మానవ సమస్త కోరికలను తీర్చగల గోమాతగా నేటికీ ఆరాధిస్తున్నాం. తన యజమానికి పోషణ, దయ, సమృద్ధిని ప్రసా దించే తల్లిగా, దైవిక జీవిగా గోమాతను కొలుస్తున్నాం.

మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు

విష్ణుమూర్తి తొలి అవతారంగా మత్స్యప్రభువును చూస్తున్నాం. తొలి జీవులు జలచరాలు అంటూ మన పురాణాలు ఘోషిస్తున్నాయి. రెండవ అవతారమైన కూర్మం లేదా తాబేలు ఉభయచరంగా నీటిలో, నేల మీద మనుగడ సాగించగలదు. మూడవ అవతారమైన వరాహస్వామి పంది రూపంలో భూదేవిని హిరణ్యాక్షుడనే రాక్షసుడి బారి నుంచి రక్షించినట్లు తెలుసుకుంటున్నాం.

రామాయణంలో ఉడుతల ప్రస్తావన ఉంది. లంకకు వారధి కట్టడానికి తనవంతు సహకారం అందించి రాముడి ప్రశంసలను పొందడం, రాముడి చేతితో నిమరడంతో చారలు రావడంలాంటి కథలను విన్నాం. ఉడుతలతో పాటు చిలుకలు, రాబందులు, జింకలు, ఆవులలాంటి జంతువుల ప్రస్తావన ఉండడం గమనిస్తున్నాం. రామాయణంలో గద్దను ‘జటాయువు’ అని పిలుస్తున్నాం. రావణుడు సీతను అపహరించిన సమయంలో ఆమెను రక్షించడానికి ప్రాణాన్ని ఫలంగా పెట్టింది. చిలుక ముఖం కలిగిన ‘‘శుక’’ అనే మహర్షి వ్యాసుడి కుమారుడు. బ్రహ్మ/వరుణల ఏడు హంసల వాహనం, శక్తికి రూపంగా ఎద్దు, శని వాహనంగా కాకి, వాయు వాహనంగా వెయ్యి గుర్రాలు, విశ్వకర్మకు ఏనుగు, భైరవుని చిహ్నంగా కుక్క, యముడి వాహనంగా దున్నపోతు లాంటి అనేక జంతువుల విశిష్టతను మన పురాణాలు వివరించాయి. నీటిని పాలను వేరు చేయగల గుణం హంసకు ఉంటుంది. సరస్వతికి సంబంధించిన ఈ జంతువులో విచక్షణ గుణాన్ని ప్రతిబింబిస్తున్నది. కల్కి, రేవంతు, చంద్రుడు, సూర్యుడు, ఖండోబ వంటి దేవతలతో గుర్రానికి సంబంధం ఉన్నది.

హిందూ సంస్కృతిలో జంతువులతో పాటు పలు రకాల వృక్షాలను కూడా పేర్కొన్నారు. వాటిలో ముఖ్యంగా రావి చెట్టు (అశ్వత్థ వృక్షం), పరమ పవిత్రమైన తులసి, కోర్కెలను తీర్చే కల్పవృక్షం లాంటి వృక్ష సంపద కూడా మన సంస్కృతితో బంధాలను పెనవేసుకున్నాయి. హిందూ పురాణాల్లో జంతురాజ్యంలోని విభిన్న ప్రాణులు ఆధ్యాత్మికతతో సంబంధాలను కలిగి ఉండడం విశేషం. ప్రకృతిలోని ప్రాణికోటి పరిరక్షణతోనే జీవ వైవిధ్యం పరిరక్షితమవుతూ, మానవ మనుగడకు బారులు వేయడం జరుగుతున్నది. ఇలా ప్రతిజీవికి ఒక ప్రత్యేకత ఉందని తెలుపుతున్న హిందూ పురాణాలు మానవ జాతికి లభించిన అపూర్వ వరాల్ని గుర్తించి జీవులను కాపాడుకోవడానికి నిరంతర కృషి జరగాలని ఆశిద్దాం.

The post పురాణాల్లో జంతువుల పవిత్ర ప్రస్తావనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.