NewsSeva

రాష్ట్రవ్యాప్తంగా ‘‘సేవా సప్తాహం’’

9views

ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేసే దిశగా సేవా భారతి ‘‘సేవా సప్తాహం’’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య అవగాహన, రక్తదానం, రక్తపరీక్షలు వంటి వైద్య సేవాలను అందించడం జరిగింది. నంద్యాల నగరం సుంకులమ్మ ఉపనగరం సేవా బస్తి ఆజాద్ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యుల నేతృత్వంలో రక్త పరీక్షలు నిర్వహించారు. మందులు అందించారు.

విశాఖపట్నంలో డా. పీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విశాఖ సేవా విభాగ్ ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి 43 మందికి తగు పరీక్షలు నిర్వహించారు. అలాగే సేవా సప్తాహంలో భాగంగా స్థానికంగా ఉన్న దేవాలయాన్ని శుభ్రపరిచారు. విద్యార్థినీవిద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థానిక వసతి గృహాన్ని సందర్శించి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో పాటు వృద్ధులకు పండ్లు, రొట్టెలను అందించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ్ శ్రీ అతుల్ లిమయే, ప్రాంత ప్రచారక్‌లు, విభాగ్ కార్యవాహ్‌లు, సర్‌కార్యవాహ్‌లు, జిల్లా సేవా ప్రముఖ్‌లు, నగర సేవా ప్రముఖ్‌లు, స్వయంసేవకులు పాల్గొన్నారు.