News

గిరిజన తండాను సందర్శించిన ధర్మజాగరణ కార్యకర్తలు

204views

ర్నూలు జిల్లా సంగమేశ్వరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలో గల జనాల తండాలో జిల్లా ధర్మజాగరణ కార్యకర్తల జట్టు పర్యటించింది. ఈ తండాలో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. వారిలో 30 కుటుంబాలు చెంచులు, మరో 10 కుటుంబాలు బి.సిలు. వారిలో ఒక 5 కుటుంబాల వారు క్రైస్తవులుగా మతం మారి ఉన్న సంగతిని కార్యకర్తలు గుర్తించారు. ఆ తండాకు చెందిన స్థానిక పెద్దలతో మాట్లాడి తండాలో ఎవరూ మతం మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, అందరూ హిందూ ధర్మంలోనే కొనసాగాలని విన్నవించారు. హిందూ ధర్మమే మనకు శ్రీరామ రక్ష అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ధర్మజాగరణ కార్యకర్తలందరూ ఇలాగే మారు మూల గ్రామాలను సందర్శించి అక్కడ అమాయకులెవరూ విదేశీ మతాల మాయలో పడకుండా చూడాలని ఆంధ్ర ప్రాంత ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.